ఫేస్‌బుక్ యజమాన్య సంస్థ మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగు పెట్టింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ (Google) లకు పోటీగా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను పరిచయం చేసింది. ఉచిత వెర్షన్‌ను విడుదల చేసింది.
ఓపెన్ ఏఐ, గూగుల్ సంస్థలు అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ, బార్డ్ చాట్‌బాట్‌లు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మానవ సృజనాత్మకత, నైపుణ్యాన్ని అనుకరిస్తూ వారిని ఆకర్షించేలా వీటిని రూపొందించారు. అయితే ఇందుకు భిన్నంగా జెనరేటివ్ ఏఐ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాకుండా పరిశోధకుల కోసం ప్రత్యేకంగా ‘లామా’ (Llama) అనే భాషా నమూనాను అభివృద్ధి చేసింది మెటా.
ఈ లామా అనేది ఓపెన్ సోర్స్. అంటే ఓపెన్ ఏఐ, గూగుల్‌లు అభివృద్ధి చేసిన ఏఐలకు భిన్నంగా మెటా లామా ఏఐలో అంతర్గతంగా జరిగే పనులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వాటిని సవరించే వీలుంటుంది.
ఇదీ చదవండి ➤ Meta: ‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉద్యోగిని.. ఏం జరిగిందంటే..
"ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది చాలా మంది డెవలపర్‌లను కొత్త టెక్నాలజీతో నిర్మించడానికి వీలు కల్పిస్తుంది" అని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. అలాగే ఇది సేఫ్టీ, సెక్యూరిటీని కూడా మెరుగుపరుస్తుందన్నారు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అందరికీ అందుబాటులో ఉంచినప్పుడు ఎక్కువ మంది పరిశీలించి సంభావ్య సమస్యలను గుర్తించడానికి, వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకునేలా మెటా ఏఐ మోడల్ సరికొత్త, శక్తివంతమైన వర్షన్ లామా 2 త్వరలో అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీస్ ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment