tech giants
-
టెక్ దిగ్గజాలపై ఆ్రస్టేలియా కొరడా
కాన్బెర్రా: టెక్ దిగ్గజాలపై కొరడా ఝళిపించేందుకు ఆ్రస్టేలియా సిద్ధమైంది. వార్తలు ప్రచురించినందుకు స్థానిక మీడియాకు చెల్లింపులు చేసేందుకు ఉద్దేశించిన కఠిన చట్టం త్వరలో అమలవనుందని ప్రభుత్వం గురువారం తెలిపింది. 2025 జనవరి నుంచి ఇది అమలవుతుందని, ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆమోదం తెలుపుతుందని పేర్కొంది. మెటా, గూగుల్ వంటి బడా కంపెనీలు తమ వేదికలపై ప్రచురించే వార్తలకుగాను ఫీజు చెల్లించాలంటూ 2021లో ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక చట్టం తీసుకువచ్చింది. తాజా నిర్ణయం ఈ చట్టానికి కొనసాగింపేనని చెబుతున్నారు. అయితే, ఆస్ట్రేలియా వార్తా సంస్థలతో ఉన్న చెల్లింపు ఒప్పందాలను పునరుద్ధరించబోమని ఇటీవల ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల యాజమాన్య సంస్థ మెటా చేసిన ప్రకటన ఆ్రస్టేలియా పార్లమెంట్‌తో ప్రతిష్టంభనకు కారణమైంది. గురువారం ఆ్రస్టేలియా ప్రభుత్వం ‘న్యూస్ బార్గెనింగ్ ఇన్సెంటివ్’పేరుతో ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం వార్షికాదాయం రూ.1,350 కోట్ల కలిగిన టెక్ కంపెనీలు మీడియా సంస్థలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పరిశ్రమకు సబ్సిడీ ఇచ్చేందుకు మరో పరిశ్రమపై భారం మోపుతోందని మెటా దీనిపై వ్యాఖ్యానించింది. ‘డిజిటల్ వేదికలు ఆ్రస్టేలియా నుంచి భారీగా ఆర్థిక లబ్ధి పొందుతున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో నాణ్యమైన జర్నలిజం సేవలను పొందుతున్నందుకు తోడ్పాటు నివ్వాల్సిన సామాజిక, ఆర్థిక బాధ్యత వాటిపై ఉంది’అని ప్రభుత్వం అంటోంది. డిజిటల్ వేదికలు పెరిగిపోవడంతో సంప్రదాయ మీడియా సంస్థలు నష్టపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే పబ్లిషర్లు, టెక్ కంపెనీల మధ్య సమతూకం పాటించేందుకు నిబంధనలు తెచి్చనట్లు అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మెటా తదితర కంపెనీలు ఆస్ట్రేలియా మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాల గడువు పూర్తి కావొచ్చింది. ఫేస్బుక్ కంటెంట్‌లో వార్తలు, రాజకీయ సంబంధ అంశాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉంటుందని మెటా అంటోంది. అందుకే, తిరిగి ఒప్పందాలను కుదుర్చుకోబోమని, బదులుగా వార్తల ట్యాబ్‌లను తొలగిస్తామని చెబుతోంది. ఈ చర్యతో ఆ్రస్టేలియా మీడియా సంస్థలు సుమారు రూ.1,700 కోట్ల మేర నష్టపోయే అవకాశముంది. దీనిపై ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. ఆ్రస్టేలియా వినియోగదారుల పట్ల మెటా ప్రాథమిక బాధ్యతలను సైతం విస్మరిస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిబంధనలన్నీ కేవలం ఆ్రస్టేలియా జర్నలిజానికి సాయం పడేందుకే తప్ప తాము ఆదా యం పెంచుకునేందుకు కాదని పేర్కొన్నారు. -
2022లోనూ వర్క్‌ఫ్రమ్ హోమ్!!
Work From Home Continue In 2022: ఏడాది ముగింపుతో వర్క్‌ఫ్రమ్ హోంకీ ఎండ్ కార్డు పడనుందని అంతా భావించారు. ఈలోపే కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’ విజృంభణతో భయాందోళనలు తెర మీదకు వచ్చాయి. అయినప్పటికీ వ్యాక్సినేషన్ పూర్తైన ఉద్యోగులను కంపెనీలు ఎలాగైనా ఆఫీసులకు రప్పించి తీరతాయని, 2022 జనవరి నుంచి ఆఫీసులు కరోనాకి ముందు తరహాలో నడుస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పలు సర్వేలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తున్నాయి. గ్రాంట్ థోరంటన్ భారత్ సర్వే ప్రకారం.. దాదాపు 10 కంపెనీల్లో ఆరు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం వైపే మొగ్గు చూపిస్తున్నాయి. సుమారు 65 శాతం కంపెనీ మేనేజ్మెంట్లు.. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా.. కరోనా భయంతో వాళ్లలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఉండేందుకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్నే కంటిన్యూ చేయాలని నిర్ణయించాయి. అయితే మ్యానుఫ్యాక్చరింగ్, రవాణా, ఆతిథ్య, వైద్య, ఇతరత్ర అత్యవసర సర్వీసులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోం నుంచి దూరంగానే ఉన్నాయి. మొత్తం 4, 650 రియాక్షన్ల ఆధారంగా ఈ సర్వేను పూర్తి చేసింది గ్రాంట్ థోరంటన్. మరోవైపు కంపెనీలు నిర్వహించిన అంతర్గత సర్వేల్లోనూ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోం వైపే ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు కూడా ప్రొడక్టివిటీ పెరగడం, ఆఫీస్ స్పేస్ భారం తగ్గుతుండడంతో వాళ్లకు తగ్గట్లు నడుచుకోవాలని భావిస్తున్నాయి. పరిస్థితులను బట్టి జూన్, 2022 వరకు వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగించాలని తొలుత అనుకున్న కంపెనీలు, తాజా నిర్ణయం ప్రకారం.. 2022 మొత్తం వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కొన్ని బెనిఫిట్స్‌ను దూరం చేస్తూనే.. వాళ్లకు వర్క్‌ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించాలని కొన్ని కంపెనీలు నిర్ణయించాయి. ఈ లెక్కన పూర్తిస్థాయిలో ఉద్యోగుల్ని రప్పించాలని భావిస్తున్న కంపెనీలు కొన్ని మాత్రమే. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం.. గూగుల్‌కు ఉద్యోగుల ఝలక్! ఇప్పటికే కొందరు ఉద్యోగులకు శాశ్వత వర్క్‌ఫ్రమ్ హోంను ఇస్తూ.. హైక్‌లు, ఇతర వెసులుబాటులను దూరం చేశాయి. చిన్న, మధ్యస్థ కంపెనీలతో పాటు ఇదే తరహాలో టెక్ దిగ్గజ కంపెనీలు కూడా ప్రణాళికలు వేస్తున్నాయి. టీసీఎస్ 95 శాతం ఉద్యోగుల్ని వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగించాలని, అత్యవసర సిబ్బంది మాత్రమే ఆఫీసులకు రావాల్సి ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా కేంద్రంగా నడుస్తున్న కంపెనీలు భారత్‌లోని ఉద్యోగులకు ఇప్పటికే సంకేతాలు అందించాయి కూడా. పర్యవేక్షణ కోసం! స్మార్ట్‌హోం డివైజ్‌లను రంగంలోకి దించుతుండడంతో దాదాపు ఇది ఖరారైనట్లేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘హోం ఆఫీసుల’లో ఉద్యోగుల పర్యవేక్షణ కోసమే వీటిని తీసుకురాబోతున్నట్లు, ఈ మేరకు అమెజాన్, మెటా, గూగుల్ సైతం దరఖాస్తులకు ఉద్యోగుల నుంచి ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఒకవేళ దరఖాస్తులు రాకున్నా.. ప్రొత్సాహాకాలను మినహాయించుకుని ఈ ఎక్విప్మెంట్ అందించాలని(తప్పనిసరి) భావిస్తున్నాయి. ఏది ఏమైనా వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగింపుపై డిసెంబర్ మొదటి వారంలోగానీ, మధ్యలో వరుసబెట్టి ఒక్కో కంపెనీ కీలక ప్రకటన చేసే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి. చదవండి: వారంలో 3 రోజులే పని.. ఎలా ఉంటుంది? -
పరాగ్ ఎంపికపై ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
Elon Musk On Parag Agrawal Twitter CEO Announcement: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్.. ఇలా ఏ కంపెనీని చూసుకున్నా ‘భారత్’ అనే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే.. ప్రతీ కంపెనీ ఉన్నత హోదాలో మనవాళ్లే ఉన్నారు కదా! ఇప్పుడు ఆ జాబితాలో ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కూడా చేరిపోయారు. ఈ క్రమంలో భారత మేధోసంపత్తి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే.. తాజా పరిణామాలపై ఐర్లాండ్ బిలియనీర్, స్ట్రయిప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొల్లైసన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. అమెరికాలో అగ్రకంపెనీలు ఆరింటిలో భారతీయుల(భారత సంతతికి చెందిన వాళ్లు) డామినేషన్ ఉందని ప్రస్తావిస్తూ.. సాంకేతిక ప్రపంచంలో భారతీయుల అమోఘమైన విజయం అద్భుతంగా ఉందని, వలసదారులకు ఇది మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందనడానికి సంకేతమంటూ ప్యాట్రిక్ ట్వీట్ చేశాడు. అంతేకాదు పరాగ్‌కు శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. అయితే ఈ ట్వీట్‌కు ప్రపంచంలో అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్ స్పందించాడు. USA benefits greatly from Indian talent! — Elon Musk (@elonmusk) November 29, 2021 భారతీయుల టాలెంట్‌ను గొప్పగా వాడుకుంటూ అమెరికా విపరీతంగా లాభపడుతోందంటూ తనదైన శైలిలో ఎలన్ మస్క్ రీట్వీటేశాడు. గతంలో టెక్ రంగంలో ఉన్న గూగుల్ పెద్ద కంపెనీలు ‘యంగ్ టాలెంట్’ను తొక్కిపడేస్తున్నాయని కామెంట్లు చేసిన మస్క్.. ఇప్పుడు ఇలా భారత మేధోసంపత్తి వంకతో ఏకంగా అమెరికా పైనే సెటైర్లు వేయడం విశేషం. Companies that have/had an Indian CEO IBM Pepsi Nokia Adobe Microsoft Cognizant Mastercard Deutsche Bank Alphabet (Google) And now Twitter — Save Invest Repeat 📈 (@InvestRepeat) November 29, 2021 చదవండి: పరాగ్ అగర్వాల్ ప్రొఫైల్ .. ఆసక్తికరమైన విషయాలివే -
గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్.. గ్లోబల్ ‘టాక్స్’ షాక్!!
టెక్, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కలిసికట్టుగా షాక్ ఇచ్చేందుకు ప్రపంచం సిద్ధమైంది. గ్లోబల్ ట్యాక్స్ పేరుతో కనీసం 15 శాతం టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు 136 దేశాల(భారత్ సహా) అంగీకారం తెలిపగా, పాక్ సహా నాలుగు దేశాలు మాత్రం ఈ ఒప్పందానికి దూరం జరిగాయి. ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ఆర్గనైజేషన్ సమావేశం శుక్రవారం పారిస్‌లో జరిగింది. తమ తమ దేశాల్లో ఆపరేషన్‌ను నిర్వహించుకునేందుకు గూగుల్, ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.. ఇతరత్రాలకు ఓఈసీడీలోని దేశాలు కనీసం 15 శాతం ట్యాక్స్ విధించాలని తీర్మానించాయి. మొత్తం 140 దేశాల్లో శ్రీ లంక, కెన్యా, నైజీరియా, పాకిస్తాన్.. మాత్రం ఈ అగ్రిమెంట్లో చేరేందుకు విముఖత వ్యక్తం చేశాయి. అయితే టెక్ దిగ్గజాల నుంచి టాక్స్ వసూలు నిర్ణయం అమలు అయ్యేది మాత్రం 2023 నుంచే.. వీటితో పాటు ఏకపక్ష టాక్స్ విధింపు నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు OECD సభ్య దేశాలు ప్రకటించాయి. అక్టోబర్ 13న వాషింగ్టన్లో జరగబోయే జీ-20 ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశంలో, ఈ నెలాఖరులో రోమ్(ఇటలీ)లో జరగబోయే జీ-20 నేతల సదస్సులో 15 శాతం పన్ను వసూలు నిర్ణయం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు. 15 మినిమమ్ టాక్స్ కాగా, గరిష్టంగా ఎంత ఉంటుందనేది మాత్రం ఫిక్స్ చేయలేదు. ఇక భారత్ విషయానికొస్తే.. డిజిటల్ అడ్వైర్టైజింగ్ సర్వీసుల మీద నేరుగా 6 శాతం ట్యాక్స్‌లను విధిస్తూ 2016లో నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో 1,600 కోట్ల రూపాయలు రాగా.. కిందటి ఏడాదితో పోలిస్తే అది రెట్టింపు వసూలు కావడం విశేషం. ఇక 2020లో నాన్ రెసిడెంట్ ఈకామర్స్ దారులపై 2 శాతం టాక్స్ విధించింది భారత్. ఇప్పటిదాకా తక్కువ శాతం చెల్లింపుతో సేవల్ని అందిస్తున్న టెక్ దిగ్గజాలకు.. కనీస విధింపు నిర్ణయం మింగుడు పడడం లేదు. సెర్చింజిన్ గూగుల్ అయితే ఇప్పటికే అడ్డగోలుగా ట్యాక్సులు చెల్లించాల్సి వస్తోందని అసంతృప్తిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జీ-20 సమావేశాల్లోపు ఓఈసీడీ దేశాలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాయి. అయితే సమయం లేకపోవడంతో ఈ ప్రయత్నం ఫలించకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. చదవండి: ఫేస్బుక్ ద్వారా సంపాదన.. ఎలాగో తెలుసా? -
ఇదొక భారీ బిజినెస్.. వరద ప్రవాహంలా డబ్బు!
‘‘దిస్ ఈజ్ బిజినెస్’’.. ప్రతీ దాంట్లోనూ లాభం వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఇందులో ముఖ్యంగా టెక్ దిగ్గజాల తీరు విపరీతమైన చర్చకు దారితీస్తోంది. విషాదం దగ్గరి నుంచి వినోదం దాకా దేన్నికూడా వదలకుండా క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో దిగ్భ్రాంతికి గురి చేసే భారీ వ్యాపారం గురించి తాజాగా ఓ నివేదిక బయటపెట్టింది. ఉగ్రవాదంపై పోరు వంకతో కోటానుకోట్లు వెనకేసుకుంటున్నాయి టెక్ కంపెనీలు. కంపెనీల సాంకేతికతను, ఇతరత్ర సేవల్ని(ఇంటర్నెట్ ప్రమోషన్లు సైతం) ఉపయోగించుకునేందుకు.. భద్రతా ఏజెన్సీలు భారీగా నిధులు వెచ్చించి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యాపారంలో డబ్బు వరదలా ప్రవహిస్తోంది. 9/11 దాడులకు 20 సంవత్సరాలు పూర్తైన తరుణంలో.. ‘వార్ ఆన్ టెర్రర్’ పేరిట గురువారం ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యింది. ఇందులో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్.. ఇలా దాదాపు అగ్ర టెక్ కంపెనీలు, ఫేస్బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉగ్రవాదాన్ని క్యాష్ చేసుకుని ఎలా బిలియన్లు వెనకేసుకుంటున్నాయో పూసగుచ్చినట్లు వివరించారు. క్లిక్: కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్! 2001 నుంచే.. ప్రస్తుతం టెక్ దిగ్గజాలు.. యూఎస్ మిలిటరీతో పాటు ఇతర దేశాల ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. బిగ్ టెక్ సెల్స్ వార్ వ్యాపారం 2004 నుంచి తారాస్థాయిలో నడుస్తోందని, ఇందుకోసం టెక్ దిగ్గజాలు భారీ స్థాయిలో భద్రతా ఏజెన్సీల నుంచి డబ్బులు అందుకుంటున్నాయని వెల్లడించింది. ‘‘ నిజానికి 2001 నుంచి రక్షణ రంగాలు డిజిటలైజేషన్ అవుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, జీపీఎస్ సాఫ్ట్వేర్ వాడకం విపరీతంగా పెరిగింది. చాలా దేశాలు వీటి అవసరం లేకున్నా.. ఒప్పందాల్ని చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కేవలం అమెరికా రక్షణ రంగం ఒక్కటే పలు టెక్ కంపెనీలతో సుమారు 43.8 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంద’’ని బయటపెట్టింది ఈ డాక్యుమెంటరీ. 57 దేశాల ఏజెన్సీలు 2004 నుంచి ఇప్పటిదాకా.. పెంటగాన్, హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి టెక్ కంపెనీలకు విపరీతమైన ఫండ్లు వస్తున్నాయట. ఒక్క అమెరికాకే కాదు.. దాదాపు 57 దేశాల భద్రతా ఏజెన్సీలు(ఇందులో భారత్ ఉందో లేదో స్పష్టత లేదు) టెక్ దిగ్గజాల ఒప్పందాలు చేసుకున్నాయి. మరో విశేషం ఏంటంటే.. అమెరికాకు సంబంధించిన ఈ సమాచారం అంతా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నా ఇన్నాళ్లూ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం. ఇక ఫారిన్ పాలసీలు లేదంటే నేరు విధానాల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. అన్నిరకాల సేవలు.. ఆన్లైన్ టూల్ కాంట్రాక్ట్స్ ద్వారా ఇదంతా నడుస్తోందని తెలిపింది. కీలక పదవులు జార్డ్ కోహెన్.. ఒకప్పుడు స్టేట్డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి. ఇప్పుడాయన గూగుల్‌లో పని చేస్తున్నారు. ఇక నిఘా ఏజెన్సీ ఎఫ్‌బీఐలో పనిచేసిన స్టీవ్ పండెలిడెస్.. ప్రస్తుతం అమెజాన్‌లో పని చేస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ జోసెఫ్ రోజెక్.. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ఇదంతా పరస్సర ఒప్పందాల్లో భాగంగానే నడిచిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: జొమాటో సంచలనం.. ఆ సర్వీసులకు గుడ్‌బై -
టీసీఎస్ అరుదైన ఘనత
సాక్షి, న్యూఢిల్లీ : దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) శుక్రవారం అసెంచర్‌ను అధిగమించి కొద్దిసేపు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. ఆ సమయంలో (అక్టోబర్ 8, క్లోజింగ్ గణాంకాల ప్రకారం) టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 144.7 బిలియన్ డాలర్లు కాగా, యాక్సెంచర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 143.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. చదవండి : టీసీఎస్ ఉద్యోగులకు వేతన పెంపు ఇక టీసీఎస్ సోమవారం మరో కీలక మైలురాయిని చేరుకుంది. రిలయన్స్ ఇండస్ర్టీస్ తర్వాత రూ 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన రెండో భారతీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. కంపెనీ షేర్ ధర పెరగడంతో టీసీఎస్ మార్కెట్ విలువ ఏకంగా రూ 69,082.25 కోట్లు ఎగిసి ట్రేడ్ ముగిసే సమయానికి బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 10,15,714 కోట్లకు ఎగబాకింది. కాగా దేశంలో రూ 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ర్టీస్ నిలిచిన సంగతి తెలిసిందే. టీసీఎస్ బుధవారం రూ 16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించింది. మరోవైపు పలు కంపెనీలు లేఆఫ్‌లు, వేతన కోతలు విధించడంతో పాటు ఏడాది పాటు ప్రమోషన్లు, వేతన పెంపులను నిలిపివేసిన నేపథ్యంలో టీసీఎస్ తమ ఉద్యోగులందరికీ వేతనాలను పెంచనుంది. టీసీఎస్ వేతన పెంపు నిర్ణయం ఐటీ రంగానికి తీపికబురుగా మారింది. ఇక దేశీ ఐటీ దిగ్గజంలో నియామకాల ప్రక్రియా ఊపందుకుంది. భారత్‌లో 7,000 మంది ట్రైనీలను, అమెరికాలో 1000 మందిని ట్రైనీలను నియమించుకోనుంది. -
టెక్ దిగ్గజాలకు ఊహించని షాక్?
వాషింగ్టన్ : అమెరికాలో టెక్ దిగ్గజ కంపెనీలకు భారీ షాక్ తగలనుంది. ఆపిల్, అమెజాన్ లాంటి దిగ్గజాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నియంత్రణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా హౌజ్ కమిటీ తన నివేదకను రూపొందించింది. టెక్నాలజీ రంగంలో పోటీని పరిశీలిస్తున్న డెమొక్రాట్ల నేతృత్వంలోని హౌస్ ప్యానెల్, ఆపిల్, అమెజాన్ ఆపిల్ ఇంక్ వంటి దిగ్గజాలు మార్కెట్ స్థలాలను సొంతం చేసుకోవడం, వారి వారి స్వంత ఉత్పత్తుల విక్రయాలకే పరిమితం కావడంలాంటి పద్ధతులకు చెక్ పెట్టేందుకు భారీ సంస్కరణలను ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పోటీ వాతావరణంలో మార్కెట్లో ఆధిపత్యం కోసం ఇవి అమలు చేస్తున్న వ్యూహాల దృష్టి పెట్టింది. డెమొక్రాటిక్ ప్రతినిధి డేవిడ్ సిసిలిన్ నేతృత్వంలోని హౌస్ యాంటీట్రస్ట్ ప్యానెల్ దర్యాప్తు అనంతరం ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. అంతేకాదు టెక్ కంపెనీలు తమ డేటాను ఒక వెబ్సైట్ నుండి మరొక వెబ్సైట్లోకి సులభంగా తరలించడానికి అనుమతించే చట్టాన్ని కూడా ఇది సిఫారసు చేసినట్టు సమాచారం. పోటీదారులను అణిచివేసేందుకుఈ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సిపిలిన్ చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలాన్నిస్తున్నాయి. ఈ నివేదిక ఈ వారంలోనే బహిర్గతం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ నివేదికను అమోదిస్తే అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు ఊహించని పరిమాణాలు తప్పవని నిపుణుల అంచనా. అయితే ఈ నివేదికను ఎంతమంది కమిటీ సభ్యులు ఆమోదిస్తారనేది అస్పష్టం. కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన అమెరికా హౌజ్ కమిటీ ప్రత్యేక ఉప కమిటీ విచారణకు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల హాజరైన సంగతి తెలిసిందే. -
టెక్ దిగ్గజాలకు ఊహించని ప్రశ్నలు..
వాషింగ్టన్ : గూగుల్, ఫేస్‌బుక్‌లు తమ మార్కెట్ ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి టెక్ దిగ్గజాలకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. అమెరికన్ కాంగ్రెస్‌లో జ్యుడిషియరీ కమిటీ ఎదుట బుధవారం విచారణకు హాజరైన గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ సీఈఓలను సెనేటర్లు నిలదీసినంత పనిచేశారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఉమ్మడి మార్కెట్ విలువను కలిగిన ఈ దిగ్గజాలు మార్కెట్ వాటా కోసం చిన్న సంస్ధలను దారుణంగా నలిపేస్తున్నాయని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు టెక్ సీఈఓలు మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్‌లను కడిగేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణలో దిగ్గజ సిఈఓలను ప్రతినిధులు తమ పదునైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.గూగుల్, అల్ఫాబెట్ సీఈఓకు ప్రతినిధుల నుంచి తీవ్ర ఆరోపణలు, ప్రశ్నలు ఎదురవగా వీటన్నింటినీ సమీక్షించి తిరిగి సభకు వివరిస్తానని పిచాయ్ వివరణ ఇచ్చారు. గూగుల్ కంటెంట్ చోరీకి పాల్పడుతోందని డెమొక్రాట్, యాంటీ ట్రస్ట్ సబ్‌కమిటీ చీఫ్ డేవిడ్ సిసిలిన్ సుందర్ పిచాయ్‌ను నిలదీశారు. యెల్ప్ ఇంక్ నుంచి గూగుల్ రివ్యూలను దొంగిలిస్తోందని, దీన్ని ఆక్షేపిస్తే సెర్చి రిజల్ట్స్ నుంచి యెల్ప్‌ను డీలిస్ట్ చేస్తామని గూగుల్ బెదిరిస్తోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల గురించి నిర్ధిష్టంగా తాను తెలుసుకోవాలనుకుంటున్నానని పిచాయ్ బదులిచ్చారు. చదవండి : సుందర్ పిచాయ్: ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాల్టీ యూజర్ల కోసం గూగుల్ కంటెంట్ చోరీకి పాల్పడుతుందనే ఆరోపణలతో తాను ఏకీభవించనన్నారు. ఇక 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేయడంపై ఎఫ్బీ చీఫ్ జుకర్‌బర్గ్ పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ పెనుముప్పుగా మారుతుందనే ఆందోళనతోనే దాన్ని కొనుగోలు చేశారా అని ప్రతినిధులు జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. తాము ఇన్‌స్టాగ్రామ్‌ను కొనుగోలుచేసిన సమయంలో అది ఓ చిన్న ఫోటో షేరింగ్ యాప్ మాత్రమేనని జుకర్‌బర్గ్ బదులిచ్చారు. ఈ ఒప్పందాన్ని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సమీక్షించిందని గుర్తుచేశారు. ఫేస్బుక్ తన ప్రత్యర్ధులను ఏయే సందర్భాల్లో అనుకరించిందని మరో ప్రతినిధి ప్రమీలా జయపాల్ జుకర్‌బర్గ్‌ను అడగ్గా ఇతరుల ముందుకెళ్లిన ఫీచర్లు కొన్నింటిని తాము అనుసరించిన సందర్భాలున్నాయని అంగీకరించారు. నలుగురు దిగ్గజ టెక్ అధినేతలు ఒకేసారి చట్టసభ సభ్యుల ముందు విచారణకు హాజరవడం ఇదే తొలిసారి. -
హెచ్1బీ ఉద్యోగుల వేతనాలపై షాకింగ్ రిపోర్టు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వీసా సంస్కరణలు, తాజాగా కరోనా వైరస్ సంక్షోభంతో ఐటీ నిపుణులు ఇబ్బందుల్లో పడిన సమయంలో హెచ్ 1 బీ వీసాదారుల వేతనాలకు సంబంధించి షాకింగ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ప్రధాన దిగ్గజ కంపెలన్నీ తక్కువ (స్థానిక మధ్యస్థ) వేతనాలను చెల్లించాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రధాన అమెరికన్ టెక్నాలజీ సంస్థలైన ఫేస్బుక్, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర దిగ్గజ కంపెనీలు హెచ్ 1 బీ నిపుణులకు మార్కెట్ వేతనాల కంటే తక్కువ చెల్లించాయని తాజా నివేదిక పేర్కొంది. హెచ్ 1 బీ వీసాదారులను కలిగిన టాప్ 30 అమెరికా కంపెనీల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్ బుక్ సహా ప్రధాన సంస్థలు ఇందులో ఉన్నాయి. వీరందరూ హెచ్ 1బీ ఉద్యోగుల్లో చాలామందికి స్థానిక సగటు కంటే తక్కువ జీతాలను చెల్లించాయట. స్థానిక వేతనాల కంటే తక్కువ జీతాల చెల్లింపుపై చట్టబద్ధంగా ఉన్న ప్రోగ్రామ్ నిబంధనలను ఉపయోగించుకుని ఇలా చేశాయని ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. (హెచ్1బీ వీసాదారులకు ఊరట) "హెచ్ 1 బీ వీసాలు , ప్రస్తుత వేతన స్థాయిలు" అనే పేరుతో డేనియల్ కోస్టా , రాన్ హీరా వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం, యుఎస్ కార్మిక శాఖ (డీఓఎల్) ధృవీకరించిన 60 శాతం హెచ్1బీ వీసాదారులకు స్థానిక మధ్యస్థ వేతనాని కంటే చాలా తక్కువ వేతన స్థాయిలను అందించాయి. అంతేకాదు ఈ నిబంధనలను మార్చే అధికారం డీఓఎల్ కు ఉన్నప్పటికీ అలా చేయలేదని పేర్కొన్నారు. 2019 లో 53వేలకు పైగా కంపెనీలు హెచ్ 1బీ ప్రోగ్రామ్‌ను ఉపయోగించగా, 2019 లో యుఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించిన 389,000 హెచ్ 1బీ ఉద్యోగుల టాప్ 30 కంపెనీలు నాలుగింటిలో ఒకటి ఉంది. టాప్ 30 కంపెనీల్లో సగానికి పైగా అత్యధిక ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ద్వారానే నియమించుకుంటున్నాయన్నారు. అయితే టెక్ కంపెనీలు నేరుగా నియమించుకుంటున్నా వేతనాలు మాత్రం లెవల్ 1, లేదా లెవల్ 2 స్థాయిలోనే ఉన్నాయని నివేదించారు. -
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ : అదరిపోయే స్మార్ట్ఫోన్లు
స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 25నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఇందులో భాగంగా పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ తమ నూతన స్మార్ట్ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ సందర్భంగా శాంసంగ్, ఎల్జీ, మైక్రోసాఫ్ట్, షావోమి, హెచ్ఎండీ గ్లోబల్, హువావే లాంటి కంపెనీలు తమ అద్భుతమైన స్మార్ట్ఫోన్ల ప్రదర్శనకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఎండబ్ల్యూసీ 2019 షోలో శాంసంగ్‌కు పోటీగా హువావే ఫోల్డబుల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇంకా ఎల్జీ జీ8 థింక్యూ, వన్ ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లను ప్రదర్శించింది. అలాగే హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 9 ప్యూర్ వ్యూను, 8.1 ప్లస్‌ను, సోనీ ఎక్స్‌పీరియా 1, 10, 10 ప్లస్ , ఎల్3 ఫోన్లను, బ్లాక్‌బెర్రీ కీ 2 రెడ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది -
నివ్వెరపోయిన టెక్ దిగ్గజాలు
భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ మరణ వార్తతో ప్రపంచం యావత్తూ విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా టెక్నాలజీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ టెక్ దిగ్గజాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగ ప్రముఖులతోపాటు, పలువురు రాజకీయ నేతలు హాకింగ్ కన్నుమూతపై సంతాపాన్ని ప్రకటించారు. వైజ్ఞానిక రంగానికి హాకింగ్ అందించిన సేవలు అమూల్యమైనవని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. క్లిష్టమైన సిద్ధాంతాలను, భావనలను ప్రజలకు మరింత అందుబాటులో తీసుకొచ్చిన ఆయన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. ఎన్ని అడ్డంకులున్నప్పటికీ, విశ్వంపై పూర్తి అవగాహన పొందేందుకు ఆయన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ సత్య నాదెళ్ల సంతాపాన్ని ప్రకటించారు. అద్భుతమైన శాస్త్రవేత్తను, మేధావిని ప్రపంచం కోల్పోయిందంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి ట్వీట్ చేశారు. నరాల వ్యాధి (అమ్యోట్రోఫిక్ లేటరల్ క్లిరోసిస్)తో బాధపడుతూ కన్నుమూసిన హాకింగ్ మోడరన్ కాస్మోలసీ రూపకర్తగా లక్షలాదిమంది ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు. కాగా బ్లాక్ హోల్‌పై కీలక పరిశోధనలు చేసిన విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకింగ్ ఆరోగ్య సమస్యలతో ఐన్‌స్టీన్ పుట్టిన రోజునాడే బుధవారం కన్నుమూశారు. హ్యాకింగ్‌కు రాబర్ట్, లూసీ, తిమోతి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. We lost a great one today. Stephen Hawking will be remembered for his incredible contributions to science – making complex theories and concepts more accessible to the masses. He’ll also be remembered for his spirit and unbounded pursuit to gain a complet…https://t.co/z1du859Gy2 — Satya Nadella (@satyanadella) March 14, 2018 The world has lost a beautiful mind and a brilliant scientist. RIP Stephen Hawking — Sundar Pichai (@sundarpichai) March 14, 2018 -
టెక్ దిగ్గజాలు ఉదయం లేవగానే ఏం చేస్తారు?
న్యూయార్క్: ఉదయం లేవగానే ఎవరికైనా దినచర్యలు ప్రారంభమవుతాయి. అయితే అందరి దినచర్యలు ఒకేలా ఉండవు. కొందరు నిద్రలేవగానే జాగింగ్, వాకింగ్ లేదా జిమ్‌లకు వెళతారు. మరికొందరు వేడి వేడి కాఫీ తాగుతారు. కాసేపు బడలికతో గడుపుతారు. కొందరు పత్రికలు తిరగేస్తారు. మరికొందరు స్నానాదులు ముగించుకొని నేరుగా బ్రేక్‌ఫాస్ట్‌కు కూర్చుంటారు. ఆ తర్వాత ఆఫీసులకు వెళతారు. మరికొందరు పొద్దెక్కాక బద్దకంగా లేస్తారు. ఆఫీసుకు టైమ్ అవుతుందంటూ ఆదరాబాదరగా ప్రాథ:కాల కార్యక్రమాలు ముగించుకొని టిఫిన్ చేసి ఆఫీసుకు పరుగులు తీస్తారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రపంచ సంపన్నులుగా ఎదిగిన టెక్ దిగ్గజాలు, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాధినేతల దినచర్యలు ఎలా ఉంటాయన్న ఆసక్తికర అంశంపై ‘స్లీపీ పీపుల్ డాట్ కామ్’ వివరాలు సేకరించింది. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు 31 ఏళ్ల మార్క్ జుకర్‌బర్గ్ లేచి లేవగానే బాత్రూమ్లో దూరి స్నానపానాదులు ముగించుకొని నేరుగా బట్టల కబోర్డు వద్దకు వెళ్లి తనకిష్టమైన బూడిద రంగు టీ షర్టు ధరిస్తారు. ఆ షర్టును ధరిస్తేనే తాను సానుకూల నిర్ణయాలు తీసుకుంటానని ఆయన నమ్మకం. ఆ తర్వాత నేరుగా ఆయన ఆఫీసుకు వెళ్లిపోతారు. ఆయన నిద్రపోయేది తక్కువ. ఒక్కోసారి ఆయన తన ఫేస్బుక్ ఉద్యోగులతో మాట్లాడుతూ తెల్లవారు జామున ఆరు గంటల వరకు మేలుకొనే ఉంటారు. అలాగే తయారై ఆఫీసుకు వెళతారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, టెక్ బిలియనీర్ బిల్ గేట్స్ లేచి లేవగానే ట్రెడ్ మిల్ వద్దకెళ్లి గుండెకు సంబంధించిన ఎక్సైర్‌సైజులు గంటసేపు చేస్తారు. అనంతరం ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన వీడియోలు చూస్తారు. వాటిలో సూచించినట్లుగా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకుంటారు. ఆఫీసుకు బయల్దేరి వెళతారు. ఆపిల్ కంపెనీని ప్రపంచ దిగ్గజ కంపెనీగా తీర్చిదిద్దిన దివంగత స్టీవ్ జాబ్స్ నిద్ర లేవగానే నేరుగా అద్దం ముద్దుకెళ్లి తనను తాను తదేకంగా కాసేపు చూసుకునే వారట. ‘ఈ రోజు నా జీవితంలో ఆఖరి రోజయితే ఈ రోజు నేను తీసుకునే నిర్ణయాలు, చేసే కార్యక్రమాలు నాకు సంతృప్తినిస్తాయా?’ అని తనలో తాను ప్రశ్నించుకునేవారట. ఆ తర్వాతే ఆయన రోజువారి కార్యక్రమాలు ప్రారంభమయ్యేవట. స్టార్‌బక్స్ సీఈవో హొవర్డ్ షుల్జ్ తెల్లవారు జామున 4.30 గంటలకే నిద్ర లేస్తారు. తన మూడు పెంపుడు కుక్కలను తీసుకొని వాకింగ్‌కు వెళతారు. గంట తర్వాత ఇంటికి తిరిగొచ్చి తాను కాఫీ కలుపుకుంటారు. దాన్ని సేవిస్తారు. 5.45 గంటల ప్రాంతంలో తన భార్యకు కాఫీ కలిపిస్తారు. ఆ తర్వాత ఆఫీసు పనులు చూసుకుంటారు. అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ మిగతా టెక్ దిగ్గజాల్లాగ తెల్లవారు జామునే లేవరు. ఆయన ఎనిమిది గంటలు నిద్ర పోతారట. ఉదయం పూట బద్ధకంగా గడుపుతారట. భార్య మెకంజీ, నలుగురు పిల్లలతో తీరిగ్గా అల్పాహారం చేస్తారట. తాపీగా ఆఫీసుకు బయల్దేరుతారట. అందుకనే ఆయన ఉదయం ఆఫీసు మీటింగ్‌లు ఉండకుండా చూసుకుంటారట. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిరోజు ఉదయం 6.45 గంటలకు నిద్రలేస్తారు. ముఖం కడుక్కొని నేరుగా జిమ్‌కు వెళ్లి గంటకుపైగా వ్యాయామం చేస్తారు. ట్రెడ్ మిల్‌పై పరుగెత్తడంతోపాటు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తారు. ఆ తర్వాత, భార్య, ఇద్దరు పిల్లలతో కలసి అల్పాహారం తీసుకుంటారు. పిల్లలను స్కూల్‌కు పంపించాక తన అధికార బాధ్యతల్లో మునిగిపోతారు. మొన్నటి వరకు బ్రిటన్ ప్రధాన మంత్రిగా కొనసాగిన డేవిడ్ కామెరాన్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకే లేస్తారు. ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఆఫీసు పనులు చూసుకునేవారు. ఎనిమిది గంటల ప్రాంతంలో భార్య సమంత, ఇద్దరు అమ్మాయిలతో కలసి టిఫిన్ చేస్తారు. వీరి దినచర్యలో ఇప్పుడు కొద్దిగా మార్పులు చేసుకొని ఉంటే వుండవచ్చు. ఎందుకంటే వారు తమ దినచర్యల గురించి వివిధ సందర్భాల్లో వివిధ పత్రికలకు వెల్లడించిన అంశాలను ‘స్లీపీ పీపుల్ డాట్ కామ్ క్రోడీకరించి’ తెలియజేసింది. -
ఈ-మెయిల్ యూజర్ల కోరిక నెరవేరబోతుందట!
న్యూఢిల్లీ : మాతృభాషలో ఈ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవడం మీ కోరికనా..? అయితే నచ్చిన భాషలోనే ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకునే అవకాశం యూజర్ల ముందుకు రాబోతుందట. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాప్ట్లు, రీడిఫ్ లాంటి దేశీయ ఈ-మెయిల్ సంస్థలు నచ్చిన భాషలో ఈమెయిల్ క్రియేట్ చేసుకునే వెసులుబాటును కల్పించనున్నాయట. ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ-మెయిల్ సర్వీసు ప్రొవేడర్లు ఈ మేరకు సేవలు అందించేందుకు సమ్మతించారు. గూగుల్, మైక్రోసాప్ట్, రీడిఫ్ మెయిల్ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రభుత్వం గత నెలలో సమావేశం జరిపింది. ఈ సమావేశంలో దేశీ ఈ-మెయిల్ అడ్రస్‌లను యూజర్లకు అందుబాటులోకి తేవాలని, హిందీ లాంగ్వేజ్‌తో ఈ సర్వీసులను అందించాలని ప్రభుత్వం కోరింది. దీంతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇంటర్నెట్ యాక్సెస్‌ను మరింత దగ్గర చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే కొన్నేళ్లలో భారత్ నెట్ ప్రాజెక్టు కింద 250,000 గ్రామ పంచాయితీలను హైస్పీడ్ ఇంటెర్నెట్‌కు కనెక్ట్ చేయనున్నామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్ తెలిపారు. వారికి అనువైన రీతిలో ఇంటర్నెట్ సేవలు కల్పిస్తే ప్రజలు సులభతరంగా దీన్ని యాక్సెస్ పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్‌ను కూడా పెంచవచ్చని తెలిపారు. భారత్‌లో ఎంతమంది ఇంగ్లీష్ భాషను చదవగలుగుతున్నారు? ఎంతమంది ఇంగ్లీష్‌లో టైప్ చేయగలుగుతున్నారని బన్సాల్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న గూగుల్, మైక్రోసాప్ట్, రీడిఫ్ మెయిల్ ఎగ్జిక్యూటివ్‌లు స్థానిక భాషలో ఈ-మెయిల్ అడ్రస్‌లను కల్పించడానికి సమ్మతించారు. స్థానిక భాషలో ఈ-మెయిల్ అడ్రస్‌లను కల్పించడం సులభతరమేనని రీడిఫ్ సీఈవో అజిత్ బాలకృష్ణన్ తెలిపారు. కానీ ఇంటర్నెట్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవాలంటే ప్రభుత్వం నెట్ యాక్సెస్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. -
నగదు నిల్వల్లో టెక్ దిగ్గజాలదే అగ్రస్థానమట..!
అమెరికన్ కార్పొరేట్ కంపెనీల నగదు నిల్వలు యేటికేటికి పెరుగుతున్నాయట. 2007లో 74,200కోట్ల డాలర్లగా ఉన్న నగదు నిల్వలు, 2015కు రెండింతలు పెరిగి, 168లక్షల కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. వీటిలో 72శాతం విదేశాల్లో ఉన్న నిల్వలేనని మూడీస్ తెలిపింది. ఈ నగదు నిల్వల్లో టెక్ దిగ్గజాలు యాపిల్, మైక్రోసాప్ట్, గూగుల్, సిస్కో, ఒరాకిల్ అగ్రస్థానంలో నిలిచాయని మూడీస్ ఇన్వెస్టర్ల సర్వీస్ నివేదించింది. మొత్తం నగదు నిల్వల్లో 30శాతం టాప్-5 టెక్ కంపెనీలే కలిగిఉన్నాయని పేర్కొంది. అమెరికాల్లో ఉన్న పన్నుల భారాన్ని తగ్గించుకోవడానికి, విదేశాల్లోనే తమ రాబడులను పెంచుకోవాలని ఈ కార్పొరేషన్లు నిర్ణయించుకున్నాయని మూడీస్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో ఆ కంపెనీల నగదు నిల్వల్ని పెరిగాయని మూడీస్ పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో పన్నుల భారం 40శాతం అధికంగా ఉంటోంది. పన్నుచట్టాల్లో మార్పులు తీసుకు రానంత వరకూ.. విదేశాల్లోనే ఈ కార్పొరేట్ కంపెనీల నిల్వలు ఇలానే భారీగా పెరుగుతుంటాయని మూడీస్ నివేదించింది. సొంతదేశానికి ఆ నగదును తరలించాలంటే పన్ను చట్టాల్లో మార్పురావల్సిందేనని పేర్కొంది. టెక్ దిగ్గజం యాపిల్ కు 2010 వరకూ ఉన్న 3100కోట్ల డాలర్ల విదేశీ నిల్వలు, ఒక్కసారిగా 20,000కోట్ల డాలర్లకు పెరిగాయని చెప్పింది.