Elon Musk On Parag Agrawal Twitter CEO Announcement: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్.. ఇలా ఏ కంపెనీని చూసుకున్నా ‘భారత్’ అనే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే.. ప్రతీ కంపెనీ ఉన్నత హోదాలో మనవాళ్లే ఉన్నారు కదా! ఇప్పుడు ఆ జాబితాలో ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కూడా చేరిపోయారు. ఈ క్రమంలో భారత మేధోసంపత్తి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే..
తాజా పరిణామాలపై ఐర్లాండ్ బిలియనీర్, స్ట్రయిప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొల్లైసన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. అమెరికాలో అగ్రకంపెనీలు ఆరింటిలో భారతీయుల(భారత సంతతికి చెందిన వాళ్లు) డామినేషన్ ఉందని ప్రస్తావిస్తూ.. సాంకేతిక ప్రపంచంలో భారతీయుల అమోఘమైన విజయం అద్భుతంగా ఉందని, వలసదారులకు ఇది మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందనడానికి సంకేతమంటూ ప్యాట్రిక్ ట్వీట్ చేశాడు. అంతేకాదు పరాగ్‌కు శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. అయితే ఈ ట్వీట్‌కు ప్రపంచంలో అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్ స్పందించాడు.
USA benefits greatly from Indian talent!
— Elon Musk (@elonmusk) November 29, 2021
భారతీయుల టాలెంట్‌ను గొప్పగా వాడుకుంటూ అమెరికా విపరీతంగా లాభపడుతోందంటూ తనదైన శైలిలో ఎలన్ మస్క్ రీట్వీటేశాడు. గతంలో టెక్ రంగంలో ఉన్న గూగుల్ పెద్ద కంపెనీలు ‘యంగ్ టాలెంట్’ను తొక్కిపడేస్తున్నాయని కామెంట్లు చేసిన మస్క్.. ఇప్పుడు ఇలా భారత మేధోసంపత్తి వంకతో ఏకంగా అమెరికా పైనే సెటైర్లు వేయడం విశేషం.
Companies that have/had an Indian CEO
— Save Invest Repeat 📈 (@InvestRepeat) November 29, 2021
IBM
Pepsi
Nokia
Adobe
Microsoft
Cognizant
Mastercard
Deutsche Bank
Alphabet (Google)
And now
Comments
Please login to add a commentAdd a comment