Parag Agrawal
-
ఎలాన్ మస్క్‌కు భారీ షాకిచ్చిన ‘ఎక్స్’ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, విజయా గద్దె
టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. భారత సంతతికి చెందిన మాజీ ఎక్స్ సీఈవో పరాగ్ అగర్వాల్, పాలసీ హెడ్ విజయా గద్దె సహా ఇతర ఎగ్జిక్యూటివ్‌లు 1.1 మిలియన్ డాలర్ల లీగల్ ఫీజులను గెలుచుకున్నారు. పలు నివేదికల ప్రకారం..ఎక్స్‌లో పనిచేసే సమయంలో సంస్థ (ఎక్స్) కోసం నిబంధనల్ని ఉల్లంఘించి మరి పనిచేశాం. దీంతో చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు తమకు ఎక్స్ 1.1 మిలియన్ డాలర్ల మేర నష్టపరిహారం కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై సుదీర్ఘ కాలం పాటు జరిగిన విచారణ అనంతరం తాజాగా, డెలావేర్ ఛాన్సరీ కోర్టు న్యాయమూర్తి కాథలీన్ సెయింట్ జె. మెక్కార్మిక్ పరాగ్ అగర్వాల్ అతని బృందానికి అనుకూలంగా తీర్పునిచ్చారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పరాగ్‌కు 40 మిలియన్ డాలర్లు నివేదికల ప్రకారం, ఈ ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ట్విట్టర్‌ను విడిచిపెట్టినప్పుడు దాదాపు 90 నుంచి 100 మిలియన్ల ఎగ్జిట్ ప్యాకేజీని పొందారు. విధుల నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా పరాగ్ అగర్వాల్ దాదాపు 40 మిలియన్ల డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. -
Twitter: మస్క్ ఎంట్రీ.. సీఈఓ ఔట్!
సాక్షి, న్యూఢిల్లీ: ట్విటర్ ఎట్టకేలకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సొంతమైంది. కొన్ని నెలలుగా సాగదీతకు గురైన డీల్ గురువారంతో పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు మస్క్.. ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఇక ముందునుంచి అనుకుంటున్నట్టుగానే వచ్చీరావడంతో ఆయన కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. ఇతర కార్యనిర్వాహక సభ్యులను కూడా తొలగించారు. మొత్తంమీద ట్విటర్ కొనుగోలు ప్రక్రియ సందిగ్దంలో పడటంతో కంపెనీ వ్యాపార వ్యవహరాలపై ఆ మేరకు ప్రభావం పడింది. దాంతోపాటు ఉద్యోగులు, వాటాదారుల్లో అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ ప్రక్రియ ముగియడంతో పరిస్థితులు చక్కబడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. (చదవండి: సీసీఐ జరిమానాలపై తదుపరి చర్యలు పరిశీలిస్తున్నాం: గూగుల్) నాటకీయ పరిణామాలు ఏప్రిల్ నెలలో మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫాం ట్విటర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, స్పామ్, నకిలీ బాట్ అకౌంట్ల సంఖ్యను ట్విటర్ తప్పుగా చూపించిందని ఆరోపిస్తూ ఆయన వెనక్కి తగ్గారు. దీంతో ట్విటర్ దావాకు వెళ్లడం.. ఆ క్రమంలో విమర్శలు, ప్రతి విమర్శలు, సెటైర్లతో ఈ డీల్ గట్టెక్కదని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మస్క్ మనసు మార్చుకుని లైన్లోకి వచ్చారు. మరోవైపు ట్విటర్ కొనుగోలు ప్రక్రియ పూర్తవడానికి ముందు ఆయన విభిన్న రీతిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సింక్‌ను మోసుకెళ్తూ లోనికి ఎంట్రీ ఇచ్చారు. ‘లెట్ ద సింక్ ఇన్’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. డీల్ ఓకే అయిందని సూచిస్తూ ఆయన సింక్‌ను మోసుకెళ్లారని కొందరు అంటుంటే.. తేడా కొడితే మునిగిపోవడం ఖాయం అంటూ ట్వీట్ చేశారని మరికొందరు కామెంట్ చేశారు. (చదవండి: మస్క్‌కు షాక్: ట్విటర్ ఉద్యోగులను దిగ్గజాలు లాగేసుకుంటున్నాయ్?) -
ట్విటర్‌కి బ్రేకప్ చెప్పిన ఈలాన్ మస్క్?
అనుకున్నట్టే అయ్యింది. ఊహించిందే జరిగింది. అటు ఇటు పల్టీలు కొట్టిన ఈలాన్‌మస్క్ చివరకు ట్విటర్ టేకోవర్‌కు రాంరాం అంటున్నాడు. నేరుగా ఈ విషయం ప్రకటించకపోయినా.. డీల్‌ను బ్రేక్ చేసేందుకు అవసరమైన పాయింట్‌ను పట్టుకున్నాడు. ఫేక్ ఖాతాలకు సంబంధించి ట్విటర్ సరైన సమాచారం ఇవ్వడం లేదని, దీనిపై స్పష్టత వచ్చే వరకు ట్విటర్‌ను టేకోవర్ చేయడం కుదరదు అంటూ కొత్త రాగం అందుకున్నాడు. ట్విటర్ మొత్తం అకౌంట్లలో ఫేక్ ఖాతాలు 5 శాతం ఉంటాయని సీఈవో పరాగ్ చెబుతున్నాడు. కానీ ఫేక్ ఖాతాలు 20 శాతం వరకు ఉంటాయంటూ ఆరోపించాడు. సీఈవో చెప్పిన నంబర్ కంటే నాలుగురెట్టు అధికంగా ఫేక్ ఖాతాలు ఉన్నాయంటూ ఫైర్ అయ్యాడు ఈలాన్‌మస్క్. తగ్గేదేలే నిజమైన ఖాతాదారుల సంఖ్యను బట్టే తాను ట్విటర్ కొనుగోలుకు 44 బిలియన్ డాలర్లు ఇస్తానంటూ తాను ఆఫర్ ఇచ్చినట్టు తెలిపాడు. ఇప్పుడు ఈ కంపెనీ సీఈవో చెప్పిన సంఖ్యకు నాలుగింతలు ఫేక్ ఖాతాలు ఉన్నాయని, దీనిపై క్లారిటీ రావాల్సిందే అంటున్నాడు. అప్పటి వరకు ట్విటర్ టేకోవర్ డీల్‌లో అడుగు ముందుకు పడదంటూ ఖరాఖండీగాక చెప్పాడు. 20 శాతం ఫేక్ ఖాతాలు ఉన్న సంస్థకు అంత డబ్బు పెట్టి కొనడం అంటే అధికంగా ధర చెల్లించినట్టే అనే అర్థంలో ఈలాన్‌మస్క్ ట్వీట్ చేశాడు. పరాగ్ ఎమన్నారంటే మరోవైపు ఫేక్ ఖాతాలు రోజుకో రూపంలో వస్తూనే ఉంటాయని, ఇవి మనుషులు ఆటోమేషన్ పద్దతిలో ఎంతో పకడ్బంధీగా పుట్టుకొస్తూనే ఉంటాయని ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఫేక్ ఖాతాల ఏరివేత కార్యక్రమం ఎప్పటిప్పుడు పక్కా చేపడుతున్నామన్నారు. ఫేక్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో నిర్దారించేందుకు బయటి వ్యక్తులకు అనుమతి ఇవ్వబోమన్నారు. దీంతో ట్విటర్ డీల్‌లో పీటముడి పడింది. ఇరు వర్గాలు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.దీంతో డీల్ ఇక అటకెక్కినట్టే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 20% fake/spam accounts, while 4 times what Twitter claims, could be *much* higher. My offer was based on Twitter’s SEC filings being accurate. Yesterday, Twitter’s CEO publicly refused to show proof of -
ఈలాన్‌మస్క్ వర్సెస్ పరాగ్.. ట్విటర్లో ముదురుతున్న వివాదం
Elon Musk Vs Parag Agrawal: ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రావాల్ ప్రపంచ కుబేరుడు ఈలాన్మస్క్ల మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఆది నుంచి ట్విటర్ మేనేజ్మెంట్పై విమర్శలు, విసుర్లతో విరుచుకుపడుతున్నాడు ఈలాన్ మస్క్. అలా వ్యవహరిస్తూనే ఏకమొత్తంగా ట్విటర్ కొనుగోలుకు ముందుకు వచ్చాడు. రేపో మాపో ట్విటర్ ఈలాన్ మస్క్ సొంతమవుతుందని తెలిసినా ప్రస్తుత ఈసీవో పరాగ్ అగ్రవాల్ వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్లో ఫేక్ అకౌంట్లు 5 శాతం మించి ఉండవంటూ ఆ సంస్థ మేనేజ్మెంట్ చెప్పిన వివరాలపై ఈలాన్ మస్క్ సంతృప్తి చెందలేదు. ఫేక్ అకౌంట్ల వివరాల్లో స్పస్టత రాని పక్షంలో ట్విటర్‌ను టేకోవర్ చేసే విషయం పునరాలోచించుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చిరకాలు జారీ చేశాడు. ట్విటర్ కొనుగోలు డీల్‌ను హోల్డ్‌లో పెడుతున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించినా పరాగ్ అగ్రవాల్ వెనక్కి తగ్గడం లేదు. తమ టీమ్ ఫేక్/స్పాన్ అకౌంట్లను పట్టుకోవడంలో నిరంతం శ్రమిస్తుందని చెబుతున్నారు. ఫేక్ అకౌంట్లను సృష్టించేది మనిషో/ లేక యంత్రమో కాదు. ఈ రెండు కలిసి అధునాతన పద్దతుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులుజిత్తులు వేస్తూ ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు. మా శాయశక్తుల వాటిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే ఈ విషయంలో ఎవరికో సందేహాలు ఉన్నాయని ఫేక్ అకౌంట్ల నిగ్గు తేల్చేందుకు బయటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాని పని అంటూ పరాగ్ అగర్వాల్ తేల్చి చెప్పాడు. Let’s talk about spam. And let’s do so with the benefit of data, facts, and context… — Parag Agrawal (@paraga) May 16, 2022 ట్విటర్లో స్పామ్ అకౌంట్ల ఎన్ని ఉన్నాయనేది నిర్థారించేందుకు బయటి వాళ్లకు అవకాశం ఎందుకు ఇవ్వడం వీలు పడదో వివరిస్తూ అనేక ట్వీట్లు చేశాడు పరాగ్ అగ్రవాల్. అయితే వాటన్నింటికి వ్యంగంగా కామెడీ చేసే ఓ ఈమోజీని రిప్లైగా ఇస్తూ మరింత వెటకారం చేశారు ఈలాన్ మస్క్. పరాగ్ అగ్రవాల్, ఈలాన్ మస్క్ వివాదంపై నెటిజన్లు కూడా భారీగానే స్పందిస్తున్నారు. ట్విటర్ కనుక పారదర్శకంగా ఉండాలనుకుంటే స్పామ్ అకౌంట్ల విషయంలో బయటి వాళ్ల చేత వెరిఫై చేయించాలంటున్నారు చాలా మంది. మరికొందరు ట్విటర్ సీఈవోను ఈలాన్ మస్క్ దారుణంగా అవమానిస్తున్నాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ట్విటర్ డీల్‌కు మస్క్ బ్రేకులు -
ట్విటర్లో భారీ కుదుపు.. టాప్ ఎగ్జిక్యూటివ్‌లకి ఉద్వాసన
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ పేరు నెల రోజులుగా అందరి నోళ్లలో నానుతోంది. ఈ కంపెనీ గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. త్వరలోనే ఈలాన్ మస్క్ చేతిలోకి ఈ సంస్థ వెళ్లనుండగా టాప్ మేనేజ్మెంట్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటీవ్‌లను బయటకు సాగనంపారు. దయచేసి వెళ్లిపోండి ఈలాన్ మస్క్ భారీ డీల్‌తో ట్విటర్‌ను సొంతం చేసుకుంది మొదలు వరుసగా ఏదో ఘటన ఆ సంస్థలో జరుగుతూనే ఉంది. ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రావాల్‌ను బయటకు పంపుతారని, పాలసీ హెడ్ గద్దె విజయకు ఎగ్జిట్ తప్పదంటూ వార్తలు వినవస్తూనే ఉన్నాయి. అయితే అనూహ్యంగా ట్విటర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా పని చేస్తున్న టాప్ ఎగ్జిక్యూటీవ్ బెక్పూర్ని సంస్థను వీడ వెళ్లాల్సిందిగా సీఈవో పరాగ్ అగర్వాల్ కోరాడు. అదే విధంగా రెవెన్యూ హెడ్ బ్రూస్ ఫలాక్‌ను పక్కన పెట్టారు. ఊహించలేదు ట్విటర్ సీఈవో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడంటూ బెక్‌పూర్ వాపోయాడు. ఇంత కాలంలో ట్విటర్లో పని చేసినందుకు, సాధించిన లక్ష్యాల పట్ల తాను గర్వంగా ఉన్నానంటూ బెక్‌పూర్ ట్వీట్ చేశాడు. ట్విటర్‌ను వెళ్లి వీడాల్సిన రోజు వస్తుందని తాను ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు బెక్‌పూర్. While I’m disappointed, I take solace in a few things: I am INSANELY proud of what our collective team achieved over the last few years, and my own contribution to this journey. — Kayvon Beykpour (@kayvz) May 12, 2022 బ్రూస్ ఫలాక్ కూడా మరోవైపు ట్విటర్ రెవెన్యూ హెడ్‌గా బ్రూస్ ఫలాక్‌ను కూడా ఆ స్థానం నుంచి తప్పిస్తున్నట్టు తొలుత ట్విటర్లో ప్రకటించారు. అయితే ఆ ట్వీట్‌ను తర్వాత తొలగించినా ఫలాక్‌ను మాత్రం కీలక బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. కీలకమైన ఈ రెండు బాధ్యతలను జే సల్లివాన్కి అప్పగించారు. ఇకపై ప్రొడక్ట్ హెడ్‌గా జే సల్లివాన్ బాధ్యతలు నిర్వర్తిసారు. రెవెన్యూ హెడ్‌గా మరొకరు వచ్చే వరకు ఆ బాధ్యతలకు ఇంఛార్జీగా ఉంటారు. I wanted to take a moment to thank all the teams and partners I’ve been lucky enough to work with during the past 5 years. Building and running these businesses is a team sport — bruce.falck() 🦗 (@boo) May 12, 2022 సమర్థుడు ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపుపై సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందిస్తూ.. సరైన సమయంలో సరైన లీడర్లు వస్తారని చెప్పారు. ప్రొడక్ట్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించిన సల్లివాన్ వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో అత్యంత సమర్థుడంటూ పరాగ్ కొనియాడారు. చదవండి: Elon Musk: నాకు ధమ్కీ ఇచ్చారు.. నా ప్రాణాలకు ఏమైనా అయితే ? మస్క్ ట్వీట్‌కి కారణం ఇదే! -
Parag Agrawal: పరాగ్ అగర్వాల్ తొలగింపు ఖాయం
ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ తొలగింపు దాదాపు ఖాయమైంది!. ట్విటర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ ఇందుకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు పంపించారు. ఈ మేరకు యూకేకు చెందిన న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. దాదాపు 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను ఎలన్ మస్క్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అటుపై ఉద్యోగులతో జరిగిన ఇంటెరాక్షన్‌లో ట్విటర్ భవితవ్యంపై ట్విటర్ సీఈవో పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు వచ్చిన ముప్పేమీ లేదన్న పరాగ్.. సోషల్ మీడియా దిగ్గజం మాత్రం అనిశ్చితిలోకి అడుగుపెట్టిందని మాత్రం సంచలన కామెంట్లు చేశాడు. దీంతో పరాగ్ ఉంటాడా? ఉద్వాసనకు గురవుతాడా? అనే దానిపై విపరీతమైన చర్చ జరిగింది. అయితే తన గురించి బెంగ పడొద్దని, కంపెనీ మెరుగ్గా పని చేస్తే చాలంటూ కొందరి ట్వీట్లకు నేరుగా బదులిచ్చాడు పరాగ్. అయితే.. ట్విటర్ మేనేజ్మెంట్పై తనకు ఎలాంటి విశ్వాసం లేదంటూ ఇంతకు ముందు నేరుగా ట్విటర్ చైర్మన్ బ్రెట్టేలర్ వద్దే ఎలన్ మస్క్ ప్రస్తావించాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో మార్పు తప్పదనే సంకేతాలను స్పష్టంగా పంపించాడు. బోర్డు సభ్యులతో పాటు షేర్ హోల్డర్స్‌కు దక్కుతున్న ప్రతిఫలాలపై భారీ కోత విధించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఎలన్ మస్క్ తేల్చేశాడు. ఇక ట్విటర్లో కీలక పదవులతో మార్పులుంటాయని చెప్పిన ఆయన.. ఆ మార్పు ఎలా ఉండబోతోంది? అయితే కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టేది ఎవరు? లాంటి ప్రశ్నలపై మాత్రం ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. కిందటి ఏడాది నవంబర్లోనే పరాగ్ అగర్వాల్.. ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు. పరాగ్ తొలగింపు దాదాపు ఖాయమైన తరుణంలో.. ఆయనకు ఒప్పందం ప్రకారం 42 మిలియన్ డాలర్ల చెల్లించాల్సి వస్తుంది ట్విటర్. ఎలన్ మస్క్ అధికారికంగా ట్విటర్ చేజిక్కించుకున్న ప్రకటన తర్వాత.. ఉద్యోగులతో పరాగ్ అగర్వాల్ అంతర్గత సమావేశం జరపడం పట్ల బోర్డు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక పూర్తిస్థాయిలో ట్విటర్ ఎలన్ మస్క్ చేతికి వెళ్లడానికి ఇంకా ఆరునెలల టైం ఉంది. చదవండి: పరాగ్ తర్వాత మరో ఇండియన్ లేడికి ఎసరు? -
ఎలన్‌మస్క్‌తో కష్టమే.. పరాగ్ తర్వాత మరో ఇండియన్ లేడికి ఎసరు?
ఎలన్‌మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకుని ప్రైవేట్ కంపెనీగా మార్చడం పట్ల ఆ సంస్థకు చెందిన ఇన్వెస్టర్లు హ్యాపీగా ఉండగా అందులో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రావాల్ బయటకు వెళ్లక తప్పందంటూ వార్తలు గుప్పుమంటుండగా ఈ జాబితాలో మరో భారత సంతతి ఉన్నత ఉద్యోగి కూడా చేరారు. ట్విటర్‌కి పరాగ్ అగ్రావాల్ సీఈవోగా ఉండగా పాలసీ మేకర్‌గా, న్యాయ సలహాదారుగా విజయ గద్దె ఉన్నారు. ట్విటర్లో పోస్టింగుల సెన్సార్‌షిప్‌పై ఆమె పని చేస్తున్నారు. ద్వేషపూరిత ట్వీట్స్ చేసినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విటర్ నిషేధం విధించడంలో విజయది ప్రముఖ పాత్ర. మరోవైపు ట్వీట్స్‌పై సెన్సార్షిప్ పెట్టడాన్ని ఎలన్‌మస్క్ ఎప్పటి నుంచో విభేదిస్తూ వస్తున్నారు. తాజాగా ట్విటర్‌ను ఎలన్‌మస్క్ సొంతం చేసుకోవడంపై ఆ సంస్థలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో విజయ గద్దె తీవ్రంగా స్పందించారు. ట్విటర్ ఉద్యోగుల భవితవ్యం, కంపెనీ పాలసీ ఏ మలుపు తీసుకుంటాయో అంటూ ఆమె తీవ్రంగా కలత చెందినట్టు ఆ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులు చెబుతున్నారు. తాజాగా జరిగిన యాజామన్య మార్పుతో ఎలన్‌మస్క్ కచ్చితంగా పాలసీ మేకింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న విజయ గద్దెకు ఉద్వాసన పలుకుతారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గతంలో సెన్సార్షిప్ విషయంలో విజయగద్దె, ఎలన్మస్క్ల మధ్య చోటు చేసుకున్న వాదనలను వారు ఉదాహారణలతో సహా బయట పెడుతున్నారు. Vijaya Gadde, the top censorship advocate at Twitter who famously gaslit the world on Joe Rogan's podcast and censored the Hunter Biden laptop story, is very upset about the @elonmusk takeover pic.twitter.com/WCYmzNEMNt — Saagar Enjeti (@esaagar) April 26, 2022 దుందూకుడు చర్యలకు, సంప్రదాయేతర ఎత్తుడగలకు పెట్టింది పేరైన ఎలన్‌మస్క్ కచ్చితంగా ట్విటర్ స్వరూప స్వభావాల్లో భారీ మార్పులు చేపడతారని.. ఈ క్రమంలో పరాగ్ అగ్రావాల్తో పాటు విజయ గద్దెలను అటు ఇటుగా బయటకు సాగనంపుతారనే ప్రచారం ఊపందుకుంది. చదవండి: ఎలన్ మస్క్ చేతిలోకి ట్విటర్...ఇన్వెస్టర్లు హ్యాపీ.. ఉద్యోగులు వర్రీ -
ట్విటర్ సీఈవో సంచలన వ్యాఖ్యలు
Twitter CEO Parag Agrawal: ట్విటర్ కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్.. తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ డీల్‌కు ట్విటర్ ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ చేతికి వెళ్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా దీనిపై ప్రకటన సైతం వెలువడింది. ఈ తరుణంలో.. సీఈవో పరాగ్ అగర్వాల్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. సోమవారం.. కంపెనీ ఉద్యోగులు, కీలక ప్రతినిధులతో ఆయన భేటీ (ఆల్ హ్యాండ్స్ మీటింగ్) అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఇంటెరాక్షన్ సందర్భంగా ఆయన ట్విటర్ భవితవ్యంపై వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండడంతో.. సోషల్ మీడియా కంపెనీలో అనిశ్చితి నెలకొనడయం ఖామని వ్యాఖ్యానించాడు. ఎలన్ మస్క్ చేతికి పగ్గాలు అప్పిగించాక.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌పై విధించిన ట్విటర్ నిషేధం ఎత్తేస్తారా? అనే ప్రశ్నకు పరాగ్ బదులిస్తూ.. ‘ఒకసారి డీల్ ముగిశాక.. ప్లాట్‌ఫామ్ పయనం ఎటువైపు ఉంటోదో మేం చెప్పలేం. కానీ, ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి వెళ్తే.. అనిశ్చితి నెలకొనడం మాత్రం ఖాయం. ఒకవేళ ఎలన్‌తో మాట్లాడేటప్పుడు దీనికంటూ(ట్రంప్‌పై నిషేధం ఎత్తివేత) ఓ సమాధానం దొరకవచ్చు’ అని పేర్కొన్నాడు. అలాగే.. ఈ కీలక సమయంలో లేఆఫ్‌లు ఉండబోవని ఉద్యోగులకు గ్యారెంటీ ఇచ్చాడాయన. ఇక భేటీకి కొత్త ఓనర్ ఎలన్ మస్క్ సైతం హాజరు కావాల్సి ఉండగా.. ఎందుకనో గైర్హాజరయ్యాడు. అలాగే సహా వ్యవస్థాపకుడు జాక్ డోర్సే, ఇతర కీ సభ్యులు సైతం హాజరు కాలేదు. చైర్మన్ బ్రెట్ టేలర్ మాత్రమే హాజరయ్యాడు. ఇక ట్విటర్, ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లడానికి ఇంకా ఆరు నెలల సమయం పట్టనుందని బ్రెట్, పరాగ్‌లు ఉద్యోగులకు స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ట్విటర్‌ను ఎలన్ మస్క్ చేజిక్కిచుకునే ప్రయత్నాలు మొదలైనప్పటి నుంచి.. ఉద్యోగుల్లో తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొందరైతే ట్విటర్లోనే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదిఏమైనా మార్పు తప్పదని సోమవారం ఉదయం ఈ డీల్‌కు సంబంధించి ఉద్యోగులకు మెయిల్ పెట్టాడు సీఈవో పరాగ్ అగర్వాల్. చదవండి: ట్విటర్-ఎలన్ మస్క్ ఒప్పందం ఎంతంటే.. -
ఎలన్ మస్క్ భారీ ఆఫర్‌కి ఉద్యోగుల స్పందన ఇలా..
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇచ్చిన భారీ ఆఫర్‌తో ట్విటర్ బోర్డు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉన్నట్టుండి ఏక మొత్తంగా ట్విటర్‌ను కొనేస్తానంటూ ప్రకటించడంతో పాటు ట్విటర్ ఫ్రీ స్పీచ్ పాలసీపై సంచలన కామెంట్లు చేశారు ఎలన్ మస్క్. దీంతో మస్క్ చేసిన భారీ ఆఫర్, ఎక్కు పెట్టిన భారీ విమర్శలపై ఎలా స్పందించాలనే అంశంపై ట్విటర్ బోర్డు సభ్యులతో పాటు ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఎలన్‌మస్క్ ఆఫర్ గురించి ఒక్కసారిగా మీడియాలో వెల్లువలా వచ్చాయి. దీంతో ట్విటర్ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. అనంతరం ట్విటర్ సీఈవో పరాగ్ ఆగ్రావాల్ ఆ సంస్థ ఉద్యోగులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. మన బోర్డు మొత్తాన్ని బిలియనీర్లతోని నింపేస్తారా , ట్విటర్‌ను ఎలన్‌మస్క్‌కి ఇచ్చేస్తారా అంటూ కొందరు ప్రశ్నించగా.. సంస్థ ఉద్యోగులుగా మనం ఏం చేయగలమో దానిపై ఫోకస్ పెట్టడం ఉత్తమం, షేర్ హోల్డర్ల ప్రయోజనాలు, ట్విటర్ భవిష్యత్తుకి ఏది మంచిదని బోర్డు భావిస్తే ఆ నిర్ణయం తీసుకుంది అంతకు మించి చెప్పలేనంటూ పరాగ్ జవాబు ఇచ్చారు. మరికొందరు ఎంప్లాయిస్ ఎలన్ మస్క్ చెప్పిన ప్రీ ఆఫ్ స్పీచ్‌ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నించగా.. ట్విటర్ నిత్యం ఆరోగ్యకరమైన సంభాషణలనే ప్రోత్సహిస్తుంటూ నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అనేక మంది కోసం ట్విటర్ ఉంది తప్పితే ఏ ఒక్కరి కోసమే లేదని, మనపై వచ్చే విమర్శలను పరిశీలిస్తూ మరింత మెగుగయ్యేందుకు ప్రయత్నించాలంటూ ఉద్యోగులకు పరాగ్ సూచించారు. అయితే అంతర్గత సమావేశం, క్యూ అండ్ ఏలో చర్చించిన అంశాలపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. చదవండి: Elon Musk: ఏకంగా ట్విటర్‌నే దక్కించుకోవాలని ప్లాన్, కానీ.. -
ఎలన్ మస్క్ మా బోర్డ్‌లో చేరడం లేదు!
ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విటర్ బోర్డ్ మెంబర్‌గా చేరడం లేదని ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ట్విటర్ బోర్డ్ మెంబర్ అవ్వడం ఎలన్ మస్క్‌కు ఇష్టం లేదు. కానీ తమ సంస్థ ఎలన్ మస్క్ ఇచ్చే అమూల్యమైన సలహాలు తీసుకుంటుందని అన్నారు. ఎలన్ ట్విటర్ బోర్డ్ మెంబర్‌గా జాయిన్ అవ్వడంపై బోర్డ్ సభ్యులం ఎలన్‌తో సమావేశం అయ్యాం. ఈ సమావేశంలో ఎలన్ తన నిర్ణయాన్ని వెల్లడించారు."ఎలన్ మస్క్ ట్విట్టర్ బోర్డ్ లో చేరకూడదని నిర్ణయించుకున్నారు. బోర్డు సభ్యుల మాదిరిగానే కంపెనీ షేర్హోల్డర్లందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎలన్‌కు బోర్డ్ మెంబర్‌గా అవకాశం ఇచ్చినట్లు”అని అగర్వాల్ పేర్కొన్నారు. Elon has decided not to join our board. I sent a brief note to the company, sharing with you all here. pic.twitter.com/lfrXACavvk — Parag Agrawal (@paraga) April 11, 2022 అందుకే బోర్డ్ మెంబర్‌గా ఎలన్ మస్క్ నియామకం గత శనివారం (9వ తేదీ)న అధికారికంగా అమల్లోకి వచ్చింది. కానీ అదే రోజు ఎలన్ మస్క్ ట్విటర్ బోర్డ్ మెంబర్‌గా జాయిన్ అవ్వడం ఇష్టం లేదనే నిర్ణయాన్ని తెలిపినట్లు గుర్తు చేశారు. తాజాగా ఇదే విషయాన్ని పరాగ్ అగర్వాల్ ట్వీట్లో తెలిపారు. ట్విటర్లో 9 శాతం అత్యధిక వాటాను కలిగి ఉన్న ఎలన్ మస్క్ ఇన్‌పుట్స్‌ను సంస్థ స్వీకరింస్తుందని, కంపెనీ భవిష్యత్ కోసం ఈ బిజినెస్ టైకూన్ నిర్ణయాలను గౌరవిస్తుందంటూ ట్విటర్ సీఈఓ పరాగా అగర్వాల్ అధికారికంగా ట్వీట్లో స్పష్టం చేశారు. చదవండి: Elon Musk: ట్విటర్ బోర్డులో ఎలన్ మస్క్! -
ఎలన్ మస్క్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్ సీఈవో
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చర్యలు ఊహాతీతం. నాటుగా చెప్పాలంటే తిక్కతిక్కగా అతని ప్రవర్తన కనిపిస్తున్నా ప్రతీదానికి ఓ కచ్చితమైన లెక్క ఉంటుంది. అందుకే అతనితో వ్యవహరించేప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగ్రావాల్. మీకు ఎడిట్ బటన్ కావాలా అంటూ ట్విట్టర్లో 2022 ఏప్రిల్ 5న పోల్ పెట్టారు ఎలన్ మస్క్. పోల్ ప్రారంభించడం ఆలస్యం వేలాదిగా యూజర్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఎడిట్ బటన్ ఉండాలని చెప్పగా మరికొందరు ఎడిట్ బటన్‌తో మజా పోతుందంటున్నారు. అయితే ఈ ట్వీట్ ఎలన్ మస్క్ నుంచి వచ్చిన గంట సేపటికే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగ్రావాల్ స్పందించారు. ఎలన్ మస్క్ నిర్వహించే పోల్, ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి జాగ్రత్తగా పోల్ చేయండి అంటూ పరాగ్ అగ్రావాల్ తెలిపారు. ఈ మేరకు ఎలన్ మస్క్ పోల్ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ కామెంట్ జత చేశారు. ఎందుకంటే ఎలన్ మస్క్ ఇప్పుడు ట్విట్టర్లో మేజర్ షేర్ హోల్డర్‌గా ఉన్నారు. మూడో కంటికి తెలియకుండా ట్విట్టర్లో 9.2 శాతం వాటాలు చేజిక్కించుకున్నారు. 2022 మార్చి 24న నిర్వహించిన పోల్‌లో ఫ్రీ స్పీచ్ స్ఫూర్తికి ట్విట్టర్ కట్టుబడి ఉందా అంటూ ఎలన్ మస్క్ ప్రశ్నించారు. ఆ తర్వాత వెంటనే ట్విట్టర్ లాంటి మరో ప్లాట్‌ఫామ్ అవసరమా అంటూ నెటిజన్లు కోరాడు. ఈ రెండు పోల్స్ నిర్వహించిన రెండు వారాల వ్యవధిలోనే ట్విట్టర్లో మేజర్ షేర్ హోల్డర్‌గా అవతరించాడు ఎలన్‌మస్క్. ఎలన్ మస్క్ చేసే కామెంట్స్ పైకి సరదాగా అనిపించినా ప్రతీ చర్య వెనుక మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంటుంది. అందువల్లే ట్విట్టర్లో ఎడిట్ ఫీచర్‌పై ఎలన్ మస్క్ పెట్టిన పోల్‌లో ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని పరాగ్ అగ్రావాల్ యూజర్లను కోరారు. కాగా ఇప్పటికే ఎడిట్ బటన్‌పై ట్విట్టర్ వర్క్ చేస్తోంది. The consequences of this poll will be important. Please vote carefully. https://t.co/UDJIvznALB — Parag Agrawal (@paraga) April 5, 2022 చదవండి: ఎలన్ మస్క్ మాయ.. అడుగుపెట్టాడో లేదో ట్విటర్‌పై కాసులవర్షం..! -
ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ దూకుడు..! కంపెనీలో రెండు వికెట్లు డౌన్..!
Twitter Chief Parag Agrawal Restructures Top Leadership Team: మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. కంపెనీలో తనదైన ముద్రను చూపించేందుకు పరాగ్ అడుగులు వేస్తున్నారు. ట్విటర్ పునర్నిర్మాణంపై పరాగ్ అగర్వాల్ దృష్టిసారించారు. ట్విటర్లో రీస్ట్రక్చరింగ్..! ట్విటర్లో తనదైన ముద్రను వేస్తూ...కంపెనీ పునర్నిర్మాణంపై పరాగ్ అగర్వాల్ ఫోకస్ చేశారు. ట్విటర్లో వివిధ హోదాలు, స్థాయిల్లో నెలకొన్న లోపాలను సవరించడంలో భాగంగా కంపెనీలో ప్రక్షాళన పనులను పరాగ్ చేపట్టారు. ట్విటర్లో పరాగ్ తీసుకుంటున్న చర్యలపై అమెరికన్ పత్రిక ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఓ కథనాన్ని ప్రచురించింది.ట్విటర్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా కంపెనీలోని ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌పై వేటు పడినట్లు తెలుస్తోంది. 2019లో ట్విటర్లో చేరి ఇంటర్నల్ ఈ-మెయిల్, కంపెనీ చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన డాంట్లే డేవిస్ తన పదవికి రాజీనామా చేశారు. పరాగ్ అగర్వాల్‌కు సమకాలీకుడైన ట్విటర్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ అధినేత మైఖెల్ మొంటానో కూడా తన పదవి నుంచి తప్పుకొనున్నట్లు తెలుస్తోంది. వీరు ఇరువురు ట్విటర్‌కు గుడ్‌బై చెప్పినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఒక కథనంలో పేర్కొంది. ఈ నెల చివరి వరకూ వీరు కొనసాగనున్నారు. బదిలీల పర్వం..! పరాగ్ రాకతో కంపెనీలో పలు కీలక పోస్ట్‌ల బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ట్విటర్ మాజీ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ కేవాన్ బేక్పౌర్ను కన్స్యూమర్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్‌గా నియమించారు. నిక్ కాల్డ్‌వెల్‌ను కోర్ టెక్ జనరల్ మేనేజర్‌గా బదిలీ చేశారు. స్ట్రాటజీ, ఆపరేషన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ లిండ్సేకు ప్రమోషన్ దొరికింది. ఆమెను పూర్తిస్థాయి ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఆపరేషన్ ఎక్సలెన్సీపైనే ప్రధాన దృష్టి..! ది వాసింగ్టన్ పోస్ట్ ప్రచురణ ప్రకారం...ఆపరేషనల్ ఎక్సలెన్సీపై పరాగ్ అగ్రవాల్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపింది. భారత్ లాంటి దేశాల్లో ట్విటర్‌పై కేంద్రం విరుచుకుపడుతూనే ఉంది. కొద్ది రోజులపాటు, ట్విటర్‌కు, కేంద్రానికి యుద్దవాతావరణమే నెలకొంది. భారతే కాకుండా ఇతర దేశాల్లో కూడా ట్విటర్ పలు ప్రతికూలతలను ఎదుర్కొంటుంది. నకిలీ వార్తలను అడ్డుకోవడంలో ట్విటర్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. చదవండి: మిలీనియల్స్‌కు ఏ కార్లంటే ఇష్టం, ఈ మిలీనియల్స్ అంటే ఎవరు? -
Elon Musk: పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్.. రచ్చ
ట్విటర్ సీఈవోగా ఒక భారతీయుడు ఎంపిక కావడంపై మన దేశంలోనే కాదు.. మేధావి వర్గం నుంచీ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఉన్నపళంగా జాక్ డోర్సే తప్పుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో స్వతహాగా ఇలాంటి అంశాల్లో తల దూర్చే ఎలన్ మస్క్.. ఓ ట్వీట్ చేసి కాక రేపాడు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ఓ ఫొటో ట్వీట్ చేశాడు. అది ఒక హిస్టారికల్ అండ్ కాంట్రవర్షియల్ ఫొటో. పై ఫ్రేమ్‌లో యూఎస్ఎస్ఆర్ నియంత జోసెఫ్ స్టాలిన్, స్టాలిన్ అంతరంగికుడు నికోలాయ్ యెజోవ్.. పక్కపక్కనే ఉంటారు. కానీ, కింద ఫ్రేమ్‌లో స్టాలిన్ ఫొటో మాత్రమే ఉంటుంది. అందుకు కారణం ఉంది. తొలినాళ్లలో స్నేహితులుగా ఉన్న నికోలాయ్-స్టాలిన్ మధ్య.. రాజకీయ పరిణామాలతో వైరం మొదలవుతుంది. ఈ తరుణంలో స్టాలిన్ ఆదేశాల మేరకే నికోలాయ్ హత్య కూడా జరిగిందని చెప్తారు. ఈ కారణంతోనే వీళ్లిద్దరూ సరదాగా గడిపిన ఫొటో తర్వాతి రోజుల్లో రష్యాలో సెన్సార్‌షిప్‌కు గురైంది. అలా స్టాలిన్ పక్క నుంచి నికోలాయ్ యెజోవ్ ఫొటోను తొలగించారు. అయితే ఈ సీరియస్ అంశాన్ని.. తర్వాతి రోజుల్లో సరదా కోణంలో వాడేసుకుంటున్నారు కొందరు. ఇక మస్క్ దానిని మరీ మించి వాడేశాడు. స్టాలిన్ బాడీకి ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ తలను, నికోలాయ్ బాడీకి ట్విటర్ మాజీ సీఈవో డోర్సే తలను అంటించాడు. పైగా రెండో టెంప్లేట్లో డోర్సే పక్కనే ఉన్న కాలువలోకి విసిరివేయబడ్డట్లు ఫన్నీ కోణంలో ఉంది. దీంతో నెటిజనులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మస్క్‌ను తిట్టిపోస్తున్నారు. అదే టైంలో మస్క్‌కు తగ్గట్లుగానే కౌంటర్ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. pic.twitter.com/OL2hnKngTx — Elon Musk (@elonmusk) December 1, 2021 ఇదిలా ఉంటే ఎలన్ మస్క్‌కు, జాక్ డోర్సేకు మాంచి స్నేహం ఉంది. ఇద్దరూ క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేయడమే కాదు.. గంజాయి ప్రియులు కూడా అంటూ గతంలో బోలెడు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు కిందటి ఏడాది జాక్ ట్విటర్ సీఈవో పదవికి గండం ఏర్పడినప్పుడు.. జాక్కి మద్దతుగా నిలిచాడు కూడా. Just want say that I support @Jack as Twitter CEO. He has a good ❤️. — Elon Musk (@elonmusk) March 3, 2020 pic.twitter.com/IYAQasGJg3 — Patel Meet (@mn_google) December 1, 2021 pic.twitter.com/tUqINMQl8s — evolve (@evolvedzn) December 1, 2021 pic.twitter.com/tUqINMQl8s — evolve (@evolvedzn) December 1, 2021 ఇదీ చదవండి: పరాగ్ ఎంపికపై ఎలన్ మస్క్ ఏమన్నాడంటే.. -
ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ శాలరీ ఎంతో తెలిస్తే షాకే..!
Parag Agrawal’s Salary As Twitter’s New CEO: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగిన విషయం తెలిసిందే. అతని స్థానంలో భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్ ట్విటర్ కొత్త సీఈవోగా కొనసాగనున్నారు. ట్విటర్ సీఈవోగా పరాగ్ పేరు ప్రకటించినప్పటీ నుంచి కొత్త మంది నెటిజన్లు.. పరాగ్ ఏక్కడ చదువుకున్నాడు, వయసు ఎంత, శాలరీ ఎంత వస్తోందని ఇలా అనేక ప్రశ్నలను గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: అమెరికాలో ‘మన’ ఆరుగురి హవా, టాలెంట్ భారత్‌ది.. బెన్ఫిట్ అమెరికాది! పరాగ్ జీతం ఏంతంటే..! పరాగ్ అగర్వాల్ వేతన వివరాలను యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కి సమర్పించిన ఫైలింగ్‌లో ట్విట్టర్ తెలిపింది. 37 ఏళ్ల పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7.5 కోట్లు)గా ఉందని తెలుస్తోంది. నియంత్రిత స్టాక్ యూనిట్ల నుంచి సుమారు 12.5 మిలియన్ల డాలర్ల(దాదాపు రూ. 93.9 కోట్లు)ను పరాగ్ పొందుతారు. వీటితోపాటుగా ట్విటర్ అందించే అన్ని బోనస్‌లను, ప్రయోజనాలను పొందేందుకు పరాగ్ అర్హులు. చదవండి: ట్విటర్ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీల కూడా భారతీయులే సీఈఓలు..! -
ట్విటర్ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీలకు కూడా భారతీయులే సీఈఓలు..!
Here’s a Look at 10 Indian-Origin CEOs: నవంబర్ 29న సీఈఓగా పరాగ్ అగ్రవాల్(45)ను ట్విటర్ కంపెనీ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అరడజనుకు పైగా గ్లోబల్ టెక్ కంపెనీలు భారతీయ-అమెరికన్ల నేతృత్వంలో ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం లాంటి సంస్థలను భారతీయులు అద్భుతంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ట్విట్టర్‌కు కొత్త సీఈఓగా నియమితులైన పరాగ్ అగర్వాల్ చేరారు. ఇప్పుడు ఎక్కడ చూసిన భారత మేధోసంపత్తి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ విషయంపై ఎలన్ మస్క్ స్పందించారు. భారతీయుల టాలెంట్‌ను గొప్పగా వాడుకుంటూ అమెరికా విపరీతంగా లాభపడుతోందంటూ తనదైన శైలిలో ఐర్లాండ్ బిలియనీర్, స్ట్రయిప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొల్లైసన్ చేసిన ఆసక్తికరమైన ట్వీట్‌కు రీట్వీట్ చేశాడు. పరాగ్ నియామకంతో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఇతర ప్రసిద్ధ సంస్థలకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయుల వివరాలు చూద్దాం. సుందర్ పిచాయ్: తమిళ నాడులో జన్మించిన సుందర్ పిచాయ్ ఆగస్టు 2015లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్, సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ తర్వాత సంస్థ మూడవ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సుందర్ పిచాయ్ ఎన్నికయ్యారు. అలాగే, 2019 డిసెంబరులో పిచాయ్ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు కూడా సీఈఓ అయ్యారు. సత్య నాదెళ్ల: హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ఆయన ఆ కంపెనీ చైర్మన్‌గానూ ఎదిగారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాప్ట్ సంస్థకు ఛైర్మన్, సీఈఓగా కొనసాగుతున్నారు. తెలుగు వ్యక్తి అయిన సత్య నాదెళ్ల 1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. అరవింద్ కృష్ణ: భారతీయ సంతతికి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ అరవింద్ కృష్ణ అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబిఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా 2020 జనవరిలో జనవరి ఎంపికయ్యారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన చదువు పూర్తి చేశారు. 1990లలో కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ ఐబీఎంలో చేరారు. గిన్ని రోమెట్టి ఐబీఎం సీఈఓ పదవి నుంచి తప్పుకోవడంతో జనవరి 2020లో ఐబీఎం సీఈఓగా అరవింద్ కృష్ట నియమితులయ్యారు. శంతను నారాయణ్: భారతీయ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ శంతను నారాయణ్ డిసెంబర్ 2007 నుంచి అడోబ్ ఇంక్ చైర్మన్, అధ్యక్షుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. అంతక ముందు 2005 నుంచి కంపెనీ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. శంతను నారాయణ్ భారతదేశంలోని హైదరాబాద్‌లో జన్మించాడు. సృజనాత్మక డిజిటల్ డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ ఫ్రాంచైజీలను పెంచేస్తూ కంపెనీని బాగా విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రంగరాజన్ రఘురామ్: భారత సంతతికి చెందిన రంగరాజన్ రఘురామ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ విఎంవేర్ కొత్త సీఈఓగా 2021 జూన్ నెలలో ఎంపికయ్యారు. 2003లో కంపెనీలో చేరిన రఘురామ్ జూన్ 1న సీఈఓ పదివిని చేపట్టారు. విఎమ్ వేర్ ప్రధాన వర్చువలైజేషన్ వ్యాపారాన్ని విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జయశ్రీ ఉల్లాల్: జయశ్రీ వి. ఉల్లాల్ ఒక అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త. జయశ్రీ ఉల్లాల్ అరిస్టా నెట్వర్క్స్ సీఈఓగా 2008 నుంచి కొనసాగుతున్నారు. అంతకు ముందు ఆమె ఏఎండీ, సిస్కో కంపెనీల్లోనూ సేవలు అందించారు. లక్ష్మణ్ నరసింహన్: గతంలో పెప్సికోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా ఉన్న లక్ష్మణ్ నరసింహన్ సెప్టెంబర్ 2019లో రాకేష్ కపూర్ తర్వాత రెకిట్ బెంకిసర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. రాజీవ్ సూరి: 1967 అక్టోబరు 10న జన్మించిన రాజీవ్ సూరి ఒక సింగపూర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మార్చి 1 2021 నుంచి ఇన్మార్శాట్ సీఈఓగా పనిచేస్తున్నారు. అతను గతంలో 31 జూలై 2020 వరకు నోకియా సీఈఓగా ఉన్నారు. దినేష్ సి. పాల్వాల్: పాల్వాల్ 2007 నుంచి 2020 వరకు హర్మన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా పనిచేశారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత అతను సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు డైరెక్టర్ల బోర్డుకు సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. పరాగ్ అగ్రవాల్: ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఐఐటీ ప్రవేశ పరీక్షలో 77వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు. 2011లో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరి తన ప్రతిభతో 2018లో ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా హోదా చేజిక్కించుకున్నారు. మరో 4 ఏళ్లలోపే ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఎదిగారు. -
ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు క్రికెట్ అంటే పిచ్చి
Twitter CEO Parag Agrawal Huge Cricket Fan.. ట్విటర్ నూతన సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఎంపికైనప్పటి నుంచి నెటిజన్లు ఆయన కోసం గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరాగ్ గురించి ఆసక్తికర ఫోటోలు, విషయాలు బయటపడ్డాయి. నవంబర్ 29న జాక్ డోర్సీ నుంచి సీఈవో బాధ్యతలు తీసుకున్న పరాగ్ అగర్వాల్‌కు క్రికెట్ అంటే ప్రాణం. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పరాగ్ అగర్వాల్ టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్‌ను ఎంకరేజ్ చేసిన ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచిన తర్వాత పరాగ్ భారత్ జెండా పట్టుకొని వీధుల్లో తిరిగిన ఫోటోలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Twitter CEO Parag Agarwal: అమెరికాలో ‘మన’ ఆరుగురి హవా, టాలెంట్ భారత్‌ది.. బెన్ఫిట్ అమెరికాది! -
Anand Mahindra: ఇది మరో ప్యాండెమిక్.. ఇండియన్ వైరస్.. వ్యాక్సిన్ కూడా లేదు
Indian industrialist Anand Mahindra Counter To Irish Billionaire: ట్విట్టర్ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ పగ్గాలు చేపడుతున్నారనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారతీయులే కాకుండా అనేక దేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఎలన్‌మస్క్ లాంటి వారు ట్విట్టర్లో కంగ్రాట్స్ తెలిపారు. ఇదే సమయంలో ఐరీష్ బిలియనీర్, స్ట్రైప్ కో ఫౌండర్ ప్యాట్రిక్ కొలిసన్ చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్ తదితర ఇంటర్నేషనల్ సంస్థలకు ఇండియన్లు సీఈవోలు అయ్యారంటూ ప్యాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. టెక్నాలజీ ప్రపంచంలో ఇండియనల్లు అద్భుతాలు చేస్తున్నాడని ప్రశంసించాడు. అయితే అంతటితో ఆగకుండా ఇంకో మాట జోడించారు. వలస వచ్చిన వారికి అమెరికా అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుందనే విషయాని గుర్తు చేస్తున్నానంటూ ముక్తాయించారు. ప్యాట్రిక్ వ్యాఖ్యలకు ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో బదులిచ్చారు. ప్యాట్రిక్ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఆ రీట్వీట్ క్యాప్షన్‌లో ‘ఇది మరో రకమైన ప్యాండెమిక్. ఇది ఇండియా నుంచి వచ్చిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఈ ప్యాండమిక్‌కి కారణం ఇండియన్ సీఈవో వైరస్. దీనికి వ్యాక్సిన్ కూడా లేదు’ అంటూ దీటుగా బదులిచ్చారు. This is one pandemic that we are happy & proud to say originated in India. It’s the Indian CEO Virus… No vaccine against it. 😊 https://t.co/Dl28r7nu0u — anand mahindra (@anandmahindra) November 29, 2021 చదవండి: అమెరికాలో ‘మన’ ఆరుగురి హవా, టాలెంట్ భారత్‌ది.. బెన్ఫిట్ అమెరికాది! -
పరాగ్ ఎంపికపై ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
Elon Musk On Parag Agrawal Twitter CEO Announcement: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్.. ఇలా ఏ కంపెనీని చూసుకున్నా ‘భారత్’ అనే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే.. ప్రతీ కంపెనీ ఉన్నత హోదాలో మనవాళ్లే ఉన్నారు కదా! ఇప్పుడు ఆ జాబితాలో ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కూడా చేరిపోయారు. ఈ క్రమంలో భారత మేధోసంపత్తి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే.. తాజా పరిణామాలపై ఐర్లాండ్ బిలియనీర్, స్ట్రయిప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొల్లైసన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. అమెరికాలో అగ్రకంపెనీలు ఆరింటిలో భారతీయుల(భారత సంతతికి చెందిన వాళ్లు) డామినేషన్ ఉందని ప్రస్తావిస్తూ.. సాంకేతిక ప్రపంచంలో భారతీయుల అమోఘమైన విజయం అద్భుతంగా ఉందని, వలసదారులకు ఇది మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందనడానికి సంకేతమంటూ ప్యాట్రిక్ ట్వీట్ చేశాడు. అంతేకాదు పరాగ్‌కు శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. అయితే ఈ ట్వీట్‌కు ప్రపంచంలో అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్ స్పందించాడు. USA benefits greatly from Indian talent! — Elon Musk (@elonmusk) November 29, 2021 భారతీయుల టాలెంట్‌ను గొప్పగా వాడుకుంటూ అమెరికా విపరీతంగా లాభపడుతోందంటూ తనదైన శైలిలో ఎలన్ మస్క్ రీట్వీటేశాడు. గతంలో టెక్ రంగంలో ఉన్న గూగుల్ పెద్ద కంపెనీలు ‘యంగ్ టాలెంట్’ను తొక్కిపడేస్తున్నాయని కామెంట్లు చేసిన మస్క్.. ఇప్పుడు ఇలా భారత మేధోసంపత్తి వంకతో ఏకంగా అమెరికా పైనే సెటైర్లు వేయడం విశేషం. Companies that have/had an Indian CEO IBM Pepsi Nokia Adobe Microsoft Cognizant Mastercard Deutsche Bank Alphabet (Google) And now Twitter — Save Invest Repeat 📈 (@InvestRepeat) November 29, 2021 చదవండి: పరాగ్ అగర్వాల్ ప్రొఫైల్ .. ఆసక్తికరమైన విషయాలివే -
Parag Agrawal : అడిషనల్ పేపర్ కోసం గొడవ.. ఆ సింగర్ క్లోజ్ ఫ్రెండ్ కూడా!
మైక్రో బ్లాగింగ్ సైట్, సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పరాగ్ అగర్వాల్ నియమితుడైనప్పటి నుంచి అతను ఎవరూ? ఎక్కడ చదివాడు ? అతని కుటుంబ వివరాల గురించి సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే వ్యక్తిగత వివరాల విషయంలో పరాగ్ అగర్వాల్ చాలా గోప్యతను పాటిస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఆయన జీవితానికి సంబంధించి సేకరించిన కొన్ని విశేషాలు... పరాగ్ అగర్వాల్ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. అటామిక్ ఎనర్జీ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా పరాగ్ తండ్రి పని చేశారు. తల్లి స్కూల్ టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. తండ్రి పని చేస్తున్న అటామిక్ ఎనర్జీ నిర్వహిస్తున్న స్కూల్లోనే పరాగ్ చదువుకున్నారు. శ్రేయా ఘోషల్ క్లాస్మేట్ ముంబైలోని అటామిక్ ఎనర్జీస్కూల్‌లో పరాగ్ అగర్వాల్, నేటి ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ కలిసే చదువుకున్నారు. పరాగ్ పుస్తకాల పురుగుగా మారి పరీక్షల్లో టాప్ ర్యాంకులు సొంతం చేసుకుంటుంటే శ్రేయ సంగీత ప్రపంచంలో తిరుగులేని మహారాణిగా ఎదిగింది. ముందుగా శ్రేయా ఇండియన్ సెలబ్రిటీగా మారగా.. ఆ తర్వాత కొంత కాలానికి పరాగ్ ఇంటర్నేషన్ ఫేమస్ పర్సన్‌గా ఎదిగారు. వీరిద్దరి మధ్య ఇప్పటీకీ స్నేహం కొనసాగుతోంది. పరాగ్ ఇండియా వచ్చినా.. శ్రేయా అమెరికా వెళ్లినా కలుస్తుంటారు. ట్విట్టర్లో తరచుగా చాట్ చేస్తుంటారు కూడా. ఇంటర్‌లోనే గోల్డ్ మెడల్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2001లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించారు. జేఈఈ ఎగ్జామ్‌లో గొడవ ఐఐటీలో సీటు లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ వచ్చిన పరాగ్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఇన్విజిలేటర్లతో గొడవ పడ్డాడు. పరీక్ష ప్రారంభమైన నలభై నిమిషాల్లోనే తనకు తెలిసిన అన్ని ప్రశ్నలకు సమాధానం రాసిన పరాగ్.. ఆ తర్వాత అడిషనల్ పేపర్లు కావాలంటూ ఇన్విజిలేటర్‌ని కోరాడు.. ‘ ఈ పరీక్షలో అడిషనల్ పేపర్ల కాన్సెప్ట్ లేదు’ అంటూ ఇన్విజిలేటర్ సమాధానం ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇన్స్ట్రక్షన్ బుక్‌లెట్‌లో ‘‘టై ఆల్ ది సప్లిమెంట్స్ కరెక్ట్‌లీ ఇన్ రైట్ ఆర్డర్’’ అనే నిబంధన ఎందుకు చేర్చినట్టు అంటూ ఎదురు ప్రశ్నించారు. అలా ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో పరీక్షలో విలువైన సమయం వృథా అయ్యిందని ఇప్పటికీ పరాగ్ గుర్తు చేసుకుని బాధపడతారు. ముంబై టూ స్టాన్ఫోర్డ్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో చిన్న గొడవ జరిగినా.. ఆలిండియా 77వ ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చేరాడు. 2005లో పట్టా పుచ్చుకుని ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చేరుకున్నాడు. అక్కడే డాక్టరేట్ పట్టా సైతం పుచ్చుకున్నాడు. అప్పటి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. మైక్రోసాఫ్ట్‌తో మొదలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పరాగ్ బయటకు వచ్చిన తర్వాత మొదటి సారి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత యాహూ, ఏటీ అండ్ టీల మీదుగా 2011లో ట్విట్టర్లో చేరారు పరాగ్. ఆ సమయంలో ట్విట్టర్ మొత్తం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి అటుఇటుగా ఉంది. అప్పటి నుంచి టీమ్ వర్క్ చేస్తూ ట్విట్టర్ ఉన్నతిలో కీలక భూమిక పోషించారు. తొలిచూపులు అక్కడే స్టాన్‌ఫోర్డ్‌లో చదివేప్పుడే వినీతతో పరిచయం. అమె అక్కడ మెడికల్ సైన్స్ విద్యార్థిగా చేరింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. వారికి అన్ష్ అగర్వాల్ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం అండర్సన్ హారోవిట్జ్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థలో భాగస్వామిగా ఆమె ఉన్నారు. చదవండి: ట్విటర్ కొత్త సీఈవో పరాగ్.. యంగెస్ట్ సీఈవో ఘనత,కానీ చిన్న మెలిక! -
Parag Agrawal: సీఈవోగా చిన్నవయస్సే! కానీ..
Twitter Parag Agrawal Youngest CEO In Top 500 Companies: మరో భారతీయుడు అత్యున్నత పదవిలో కొలువు దీరాడు. పరాగ్ అగర్వాల్ పేరును సోమవారం సోషల్ మీడియా జెయింట్ ‘ట్విటర్’కు సీఈవోగా ప్రకటించారు. ఈ ఫీట్‌తో సీఈవో హోదాలో పరాగ్ మరో అరుదైన ఘనత సాధించాడు!. ఎస్ అండ్ పీ(అమెరికా స్టాక్ మార్కెట్ ఇండెక్స్) టాప్-500 కంపెనీల్లో యంగెస్ట్ సీఈవో ఘనత Parag Agrawal సాధించినట్లు తెలుస్తోంది. మెటా (గతంలో ఫేస్బుక్) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వయసు 37 ఏళ్లు. పరాగ్ వయసు కూడా 37 ఏళ్లే! అని రిపోర్టులు చెప్తున్నాయి. కానీ, జుకర్‌బర్గ్(మే 14, 1984) పరాగ్ కంటే చిన్నవాడంట!. అయినప్పటికీ ఇద్దరి వయసు ఒకటే కావడంతో యంగెస్ట్ సీఈవో హోదాలో ఈ ఇద్దరూ నిలిచినట్లు అమెరికా మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరుస్తున్నాయి. విశేషం ఏంటంటే.. సెక్యూరిటీ కారణాలతో ఆయన పూర్తి ఐడెంటిటీని, ఇతర బయోడేటాను రివీల్ చేసేందుకు ట్విటర్ కంపెనీ అంగీకరించలేదు. అయితే పరాగ్ అగర్వాల్ 1984 ముంబైలో పుట్టినట్లు కొన్ని చోట్ల ప్రొఫైల్‌ను సెట్ చేస్తున్నారు కొందరు. సో.. అధికారికంగా ఆయన చిన్నవయస్కుడని ప్రకటన వెలువడాల్సి ఉంది. The Standard and Poor's 500(S&P 500) టాప్ 500 కంపెనీల్లో బెర్క్‌షైర్ హత్వే సీఈవో వారెన్ బఫెట్(95) అత్యధిక వయస్కుడిగా నిలిచారు. ఇక 500 పెద్ద కంపెనీల సీఈవో జాబితాను పరిశీలిస్తే సగటు వయసు 58 ఏళ్లుగా ఉంది. డైరెక్టర్ల వయసు సగటున 63 ఏళ్లుగా ఉంది. కానీ, విశాల కోణంలో పరిశీలిస్తే చిన్నవయసు వాళ్లు సీఈవో అర్హతలకు దూరంగానే ఉన్నారు. అయితే ఇలాంటి సోషల్ మీడియా కంపెనీలను సమర్థవంతంగా నడిపేందుకు వయసు పెద్ద ఆటంకం కాకపోవచ్చని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ డేవిడ్ లార్కర్ అభిప్రాయపడుతున్నారు. ట్విటర్ ఫౌండర్, సీఈవో జాక్ డోర్సే(45).. ఫైనాన్షియల్ సర్వీస్-డిజిటల్ పేమెంట్ కంపెనీ ‘స్క్వేర్’కు సైతం సీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండింటి బాధ్యతలు చేపట్టడం కష్టతరమవుతున్న తరుణంలో ఆయన ట్విటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక పరాగ్‌కు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాక.. జాక్ డోర్సే ట్విటర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవచ్చనే అంటున్నారు. కానీ, 2022 వరకు(తన కాంట్రాక్ట్ ముగిసేవరకు) బోర్డులో మాత్రం మెంబర్‌గా కొనసాగనున్నాడు. -
భారతీయుడి చేతికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా ఐఐటీ ముంబై పూర్వ విద్యార్థి
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ ప్రపంచంపై మరో భారతీయ అమెరికన్ తనదైన ముద్ర వేయనున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవో స్థానంలో ఉన్న సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌డార్సే సోమవారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీతోపాటు.. డార్సే సైతం ట్విట్టర్లో ప్రకటించారు. పరాగ్ అగర్వాల్ ఇప్పటి వరకు ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా పనిచేశారు. ఫైనాన్షియల్ పేమెంట్స్ కంపెనీ ‘స్క్వేర్’కు సైతం డార్సే చీఫ్‌గా ఉన్నారు. దీంతో సంస్థలో వాటాలు కలిగిన పెద్ద ఇన్వెస్టర్లు.. డార్సే రెండు బాధ్యతలను సమర్థవంతంగా నడిపించగలరా? అన్న సందేహాలను వ్యక్తం చేశారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వెళ్లిపోయే సమయం వచ్చింది ‘‘కంపెనీ వ్యవస్థాపకుడి నుంచి సీఈవో, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వరకు 16 ఏళ్లలో ఎన్నో బాధ్యతల్లో పనిచేశాను. కంపెనీని వీడే సమయం వచ్చిందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎందుకని? వ్యవస్థాపకుల నేతృత్వంలోని సంస్థ ప్రాముఖ్యం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అంతిమంగా ఇది ఎన్నో పరిమితులకు దారితీస్తుందని, వైఫల్యానికి ఏకైక అంశంగా మారుతుందని భావిస్తున్నాను’’ అంటూ ట్విట్టర్ పేజీలోని తన పోస్ట్‌లో డార్సే వివరించారు. ఏకాభిప్రాయంతో ఎంపిక: ‘‘బోర్డు విస్తృత ప్రక్రియ, అన్ని ఆప్షన్లను పరిశీలించి ఏకాభిప్రాయంతో పరాగ్‌ను సీఈవోగా నియమించింది. కంపెనీని ఎంతో లోతుగా అర్థం చేసు కున్న పరాగ్ ముందు నుంచి నా ఎంపికే. సంస్థలో ప్రతీ కీలక నిర్ణయం వెనుక ఆయన ఉన్నా రు. పరాగ్ ఎంతో ఆసక్తి, పరిశీలన, సృజనాత్మకత, స్వీయ అవగాహన, వినయం కలిగిన వ్యక్తి. మనస్ఫూర్తిగా సంస్థను నడిపిస్తారు. నేను నిత్యం ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. సీఈవోగా ఆయన పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది’’అని డార్సే అన్నారు. 2022 లో డార్సే పదవీకాలం పూర్తయ్యే వరకు ట్విట్టర్ బోర్డులో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. 11 ఏళ్లలోనే కీలక స్థానానికి.. పరాగ్ అగర్వాల్ ఐఐటీ బోంబేలో బీటెక్ విద్య పూర్తయిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. పదేళ్ల క్రితం 2011లో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరారు. ఆ సమయంలో సంస్థ ఉద్యోగులు 1,000 మందే ఉండడం గమనార్హం. 2018లో సీటీవో అయ్యారు. సీఈవోగా ఎంపిక కావడం తనకు గర్వకారణమని పరాగ్ ప్రకటించారు. ‘‘మీ (జాక్‌డార్సే) మార్గదర్శకత్వం, స్నేహానికి జోహార్లు. మీరు నిర్మించిన పని విధానం, సంస్కృతికి ధన్యుడను. సంస్థను కీలకమైన సవాళ్ల మధ్య నడిపించారు. దశాబ్దం క్రితం.. ఆ రోజులను నిన్నటిగానే భావిస్తాను. మీ అడుగుల్లో నడిచాను. ఉద్దాన, పతనాలు, సవాళ్లు, అడ్డంకులు, విజయాలు, తప్పులను స్వయంగా చూశాను. వీటన్నింటినీ మించి గొప్ప విజయాలను చూస్తున్నాను. గొప్ప అవకాశాలు మా ముందున్నాయి’’అని అగర్వాల్ ప్రకటించారు. భారతీయుల ముద్ర భారతీయుల అపార ప్రతిభా సామర్థ్యాలకు నిదర్శనంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను జన్మతః భారతీయులైన వారు దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ జాబితాలోకి పరాగ్ అగర్వాల్ కూడా చేరిపోయారు. గూగుల్ (ఆల్ఫాబెట్) సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, అడోబ్ సీఈవో శంతను నారాయణన్, మాస్టర్‌కార్డ్ సీఈవోగా అజయ్‌పాల్ సింగ్ బంగా తదితరులు తమ సత్తా చాటుతుండడం గమనార్హం.