
Parag Agrawal’s Salary As Twitter’s New CEO: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగిన విషయం తెలిసిందే. అతని స్థానంలో భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్ ట్విటర్ కొత్త సీఈవోగా కొనసాగనున్నారు. ట్విటర్ సీఈవోగా పరాగ్ పేరు ప్రకటించినప్పటీ నుంచి కొత్త మంది నెటిజన్లు.. పరాగ్ ఏక్కడ చదువుకున్నాడు, వయసు ఎంత, శాలరీ ఎంత వస్తోందని ఇలా అనేక ప్రశ్నలను గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: అమెరికాలో ‘మన’ ఆరుగురి హవా, టాలెంట్ భారత్‌ది.. బెన్‌ఫిట్ అమెరికాది!
పరాగ్ జీతం ఏంతంటే..!
పరాగ్ అగర్వాల్ వేతన వివరాలను యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కి సమర్పించిన ఫైలింగ్‌లో ట్విట్టర్ తెలిపింది. 37 ఏళ్ల పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7.5 కోట్లు)గా ఉందని తెలుస్తోంది. నియంత్రిత స్టాక్ యూనిట్ల నుంచి సుమారు 12.5 మిలియన్ల డాలర్ల(దాదాపు రూ. 93.9 కోట్లు)ను పరాగ్ పొందుతారు. వీటితోపాటుగా ట్విటర్ అందించే అన్ని బోనస్‌లను, ప్రయోజనాలను పొందేందుకు పరాగ్ అర్హులు.
చదవండి: ట్విటర్ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీల కూడా భారతీయులే సీఈఓలు..!