ఎలాన్‌ మస్క్‌కు భారీ షాకిచ్చిన ‘ఎక్స్‌’ మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, విజయా గద్దె | Former Twitter CEO Parag Agrawal And Team Win 1.1 Million Dollars In Legal Fees From Elon Musk’s X - Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్‌కు భారీ షాకిచ్చిన ‘ఎక్స్‌’ మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, విజయా గద్దె

Published Wed, Oct 4 2023 7:45 PM | Last Updated on Wed, Oct 4 2023 9:10 PM

Parag Agrawal Win 1.1 Million Dollars In Legal Fees From Musk’s X - Sakshi

టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్‌ (ట్విటర్‌) అధినేత ఎలాన్ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. భారత సంతతికి చెందిన మాజీ ఎక్స్‌ సీఈవో పరాగ్ అగర్వాల్, పాలసీ హెడ్ విజయా గద్దె సహా ఇతర ఎగ్జిక్యూటివ్‌లు 1.1 మిలియన్ డాలర్ల లీగల్ ఫీజులను గెలుచుకున్నారు.  

పలు నివేదికల ప్రకారం..ఎక్స్‌లో పనిచేసే సమయంలో సంస్థ (ఎక్స్‌) కోసం నిబంధనల్ని ఉల్లంఘించి మరి పనిచేశాం. దీంతో చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు తమకు ఎక్స్‌ 1.1 మిలియన్‌ డాలర్ల మేర నష్టపరిహారం కావాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ ఫిర్యాదుపై సుదీర్ఘ కాలం పాటు జరిగిన విచారణ అనంతరం తాజాగా, డెలావేర్ ఛాన్సరీ కోర్టు న్యాయమూర్తి కాథలీన్ సెయింట్ జె. మెక్‌కార్మిక్ పరాగ్‌ అగర్వాల్ అతని బృందానికి అనుకూలంగా తీర్పునిచ్చారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

పరాగ్‌కు 40 మిలియన్‌ డాలర్లు 
నివేదికల ప్రకారం, ఈ ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ట్విట్టర్‌ను విడిచిపెట్టినప్పుడు దాదాపు 90 నుంచి 100 మిలియన్ల ఎగ్జిట్ ప్యాకేజీని పొందారు. విధుల నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా పరాగ్‌ అగర్వాల్ దాదాపు 40 మిలియన్ల డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement