
Elon Musk Vs Parag Agrawal: ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రావాల్ ప్రపంచ కుబేరుడు ఈలాన్‌మస్క్‌ల మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఆది నుంచి ట్విటర్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు, విసుర్లతో విరుచుకుపడుతున్నాడు ఈలాన్ మస్క్. అలా వ్యవహరిస్తూనే ఏకమొత్తంగా ట్విటర్ కొనుగోలుకు ముందుకు వచ్చాడు. రేపో మాపో ట్విటర్ ఈలాన్ మస్క్ సొంతమవుతుందని తెలిసినా ప్రస్తుత ఈసీవో పరాగ్ అగ్రవాల్ వెనక్కి తగ్గడం లేదు.
ట్విటర్‌లో ఫేక్ అకౌంట్లు 5 శాతం మించి ఉండవంటూ ఆ సంస్థ మేనేజ్‌మెంట్ చెప్పిన వివరాలపై ఈలాన్ మస్క్ సంతృప్తి చెందలేదు. ఫేక్ అకౌంట్ల వివరాల్లో స్పస్టత రాని పక్షంలో ట్విటర్‌ను టేకోవర్ చేసే విషయం పునరాలోచించుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చిరకాలు జారీ చేశాడు.
ట్విటర్ కొనుగోలు డీల్‌ను హోల్డ్‌లో పెడుతున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించినా పరాగ్ అగ్రవాల్ వెనక్కి తగ్గడం లేదు. తమ టీమ్ ఫేక్/స్పాన్ అకౌంట్లను పట్టుకోవడంలో నిరంతం శ్రమిస్తుందని చెబుతున్నారు. ఫేక్ అకౌంట్లను సృష్టించేది మనిషో/ లేక యంత్రమో కాదు. ఈ రెండు కలిసి అధునాతన పద్దతుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులుజిత్తులు వేస్తూ ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు. మా శాయశక్తుల వాటిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే ఈ విషయంలో ఎవరికో సందేహాలు ఉన్నాయని ఫేక్ అకౌంట్ల నిగ్గు తేల్చేందుకు బయటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాని పని అంటూ పరాగ్ అగర్వాల్ తేల్చి చెప్పాడు.
Let’s talk about spam. And let’s do so with the benefit of data, facts, and context…
— Parag Agrawal (@paraga) May 16, 2022
ట్విటర్‌లో స్పామ్ అకౌంట్ల ఎన్ని ఉన్నాయనేది నిర్థారించేందుకు బయటి వాళ్లకు అవకాశం ఎందుకు ఇవ్వడం వీలు పడదో వివరిస్తూ అనేక ట్వీట్‌లు చేశాడు పరాగ్ అగ్రవాల్. అయితే వాటన్నింటికి వ్యంగంగా కామెడీ చేసే ఓ ఈమోజీని రిప్లైగా ఇస్తూ మరింత వెటకారం చేశారు ఈలాన్ మస్క్.
పరాగ్ అగ్రవాల్, ఈలాన్ మస్క్ వివాదంపై నెటిజన్లు కూడా భారీగానే స్పందిస్తున్నారు. ట్విటర్ కనుక పారదర్శకంగా ఉండాలనుకుంటే స్పామ్ అకౌంట్ల విషయంలో బయటి వాళ్ల చేత వెరిఫై చేయించాలంటున్నారు చాలా మంది. మరికొందరు ట్విటర్ సీఈవోను ఈలాన్ మస్క్ దారుణంగా అవమానిస్తున్నాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: ట్విటర్ డీల్‌కు మస్క్ బ్రేకులు