ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ట్విటర్ సీఈవో పదవికి రాజీనామా చేయనున్నారా? ఆయన స్థానంలో మహిళను సీఈవోగా నియమించనున్నారా? ఆరు నెలలుగా నాన్చుతూ వచ్చిన మస్క్ కొత్త సీఈవో పదవిపై క్లారిటీ ఇచ్చారా? అంటే అవుననే అంటున్నారు ట్విటర్ బాస్.
మరో ఆరు వారాల్లో కొత్త మహిళా సీఈవోని నియమించనున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఆమె ఎవరు? అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
Excited to announce that I’ve hired a new CEO for X/Twitter. She will be starting in ~6 weeks!
— Elon Musk (@elonmusk) May 11, 2023
My role will transition to being exec chair & CTO, overseeing product, software & sysops.
ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఎన్‌బీసీ యూనివర్సల్ ఎగ్జిక్యూటీవ్ లిండా యక్కరినో త్వరలో ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. నియామకంపై ఆమెను సంప్రదించగా.. వివరణ ఇవ్వలేదు.
రూ.3.37లక్షల కోట్లు పెట్టి..
గత ఏడాది మస్క్ ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనుగోలు చేసిన విషయం తెలిసింది. నాటి నుంచి ట్విటర్‌ను ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చేందుకు శ్రమిస్తున్నారు. ఒకానొక సమయంలో సంస్థలోని మార్పులు కారణంగా ఆఫీస్‌లోనే నిద్రపోవాల్సి వస్తుంది అంటూ వర్క్‌పై తన డెడికేషన్ ఎలా ఉందో చెప్పకనే చెప్పారు.
సీఈవో పదవి నుంచి వైదొలగాలా?
మార్పులు చేర్పులు కొనసాగుతుండగా.. డిసెంబర్ నెలలో మస్క్ చేసిన ట్విట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తాను ట్విటర్ సీఈవో పదవి నుంచి వైదొలగాలా? అని నెటిజన్లను ప్రశ్నించగా.. అందుకు 57.5 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. ఆ పోల్ దెబ్బకు ట్విటర్ 50 శాతానికి పైగా నష్టపోయింది.
Should I step down as head of Twitter? I will abide by the results of this poll.
— Elon Musk (@elonmusk) December 18, 2022
చర్చాంశనీయంగా ఎలాన్ మస్క్ ప్రకటన
2022 ప్రారంభం నుండి రోజువారీ వినియోగదారులలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ, ప్రకటనలలు భారీగా తగ్గాయి. ఫలితంగా అక్టోబర్ నుండి ట్విటర్ ఆదాయం 50శాతానికి తగ్గిందని మస్క్ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో పాటు ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ అట్టర్ ప్లాప్ అయ్యింది. వేలాది ఉద్యోగులను తొలగించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గతంలో నిషేధించబడిన ఖాతాలను తిరిగి రావడానికి అనుమతించారు. ఇలా ట్విటర్ స్వరూపాన్ని మార్చేసిన మస్క్ తాజాగా కొత్త సీఈవోని తెస్తున్నట్లు ప్రకటన చేయడం చర్చానీయాంశంగా మారింది.
చదవండి👉 ‘నిద్ర పోండి..సంపాదించండి’, ట్విటర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ సరికొత్త ప్రయోగం!
Comments
Please login to add a commentAdd a comment