సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరో మూడు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో లిండా యక్కరినో తెలిపారు.
పలు నివేదికల ప్రకారం..ఎక్స్.కామ్‌ను వినియోగించే సమయంలో యూజర్లకు ఎన్ని యాడ్స్ కావాలనుకుంటున్నాదో దానికి అనుగుణంగా డబ్బులు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం వెరిఫైడ్ అకౌంట్లకు నెలకు రూ.650, ఏడాదికి రూ.6,800 చెల్లించి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకున్నారో వాళ్లకి ఇది అవసరం లేదని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రధాని కలిసి..
గత నెలలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న మస్క్.. త్వరలో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను పరిచేయం చేస్తామని, ప్రస్తుతం దానిపై పనిచేస్తున్నట్లు చెప్పారు. అయితే తాజాగా మస్క్ దానిని నిజం చేశారు.
బేసిక్, స్టాండర్డ్, ప్లస్ పేరుతో
బేసిక్, స్టాండర్డ్, ప్లస్ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ ప్లాన్‌లకు పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో ఎక్స్ సీఈవో లిండా యాకరినో ఆమోదం తెలిపారు. యాకరినో ప్రకారం.. టెస్టింగ్ దశలో ఉన్న బేసిక్ ప్లాన్‌లో పూర్తిస్థాయిలో యాడ్‌లు ఉంటాయి. స్టాండర్డ్‌లో బేసిక్‌తో పోలిస్తే యాడ్‌ల సంఖ్య సగానికి తగ్గుతుంది. ప్లస్‌లో ఎలాంటి యాడ్‌లు ఉండవు.
ఉచితం కాదు.. డబ్బులు చెల్లించాల్సిందే
మరోవైపు యూజర్లు చేజారిపోకుండా ఉండేలా వారికి మిలియన్ డాలర్లను చెల్లిస్తున్న విషయం తెలిసిందే. మానిటైజేషన్ పేరుతో కంటెంట్ క్రియేటర్లకు ఏడాదికి 20 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఎక్స్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జులై నుంచి ఎక్స్ యాడ్ రెవెన్యూ నుంచి కొంత మొత్తాన్ని యూజర్లకు అందించడం ప్రారంభించింది. కాగా, మస్క్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో రానున్న రోజుల్లో ఎక్స్‌ను వాడుకోవాలంటే తప్పని సరిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు.
చదవండి👉 ఎలాన్ మస్క్‌కు భారీ షాకిచ్చిన ‘ఎక్స్’ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, విజయా గద్దె
Comments
Please login to add a commentAdd a comment