ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్ (ట్విటర్)’ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఎక్స్ క్రియేటర్లకు సుమారు 20 మిలియన్లు (రూ.166 కోట్ల కంటే ఎక్కువ) చెల్లించినట్లు ఆ కంపెనీ సీఈవో లిండా యక్కరినో తెలిపారు. వెరిఫైడ్ యూజర్ల పోస్టులపై డిస్‌ప్లే అయ్యే యాడ్స్ ద్వారా సంస్థ సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ ఏడాది జూలై నుంచి క్రియేటర్లకు చెల్లించడం ప్రారంభించింది.
యూట్యూబ్‌లో వీడియోలకు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులకు, వెబ్‌సైట్‌లలో ఆర్టికల్స్‌కు డబ్బులు వస్తాయి. అదే తరహాలో ఎక్స్.కామ్ సైతం ట్వీట్‌లకు డబ్బులు ఇస్తున్నట్లు అధినేత ఎలాన్ మస్క్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అర్హులైన క్రియేటర్లకు ఆ మొత్తాన్ని చెల్లించినట్లు సీఈవో లిండా ట్వీట్ చేశారు.
‘క్రియేట్,కనెక్ట్, కలెక్ట్ ఆల్ ఆన్ ఎక్స్’. క్రియేటర్లు ఆర్ధికంగా విజయం సాధించేలా వారికి అండగా నిలిస్తున్నాం ’అని యాకారినో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇప్పటికే క్రియేటర్ కమ్యూనిటీకి 20 మిలియన్లు చెల్లించాం. తొలిసారిగా జులై నెలలో 5 మిలియన్లు అందించినట్లు తెలిపారు.
Create. Connect. Collect all on X. We’re enabling the economic success of new segments like creators. And so far we've paid out almost $20 million to our creator community. https://t.co/kk137uPkAo
— Linda Yaccarino (@lindayaX) September 29, 2023
యాక్టీవ్‌గా ఉన్న క్రియేటర్లు డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని ఎక్స్.కామ్ కల్పిస్తుంది. మానిటైజేషన్ నిబంధనలకు లోబడి చేసే ట్వీట్‌లకు క్రియేటర్లు ‘యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్’ కింద భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన క్రియేటర్లు డబ్బులు సంపాదించుకోవచ్చు.
క్రియేటర్ యాడ్స్ రెవెన్యూ షేరింగ్ (ట్వీట్‌లతో డబ్బులు) సంపాదించేందుకు క్రియేటర్లు ఎక్స్ ప్రీమియం సభ్యుడై ఉండాలి. గత 5 నెలల్లో మీరు చేసిన పోస్ట్ లపై కనీసం 3 మిలియన్ ఆర్గానిక్ ఇంప్రెషన్స్, కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి.
చదవండి👉 ఎంతపని చేశావయ్యా ఎలన్ మస్క్?
Comments
Please login to add a commentAdd a comment