online money
-
జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఇటీవల ఓ యువతి తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విభిన్న ప్లాట్ఫామ్ల్లో తనను బ్లాక్ చేసింది. అయినా అతడు ఇటీవల గూగుల్‌పే ద్వారా తనను వేధిస్తున్నట్లు యువతి పోస్ట్ చేసింది. గూగుల్‌పే యాప్‌లో ప్రతి నిమిషానికి రూ.1 పంపిస్తూ తనను వేధిస్తున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది.ఆయుషి అనే యువతి చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘జీపే ద్వారా నిమిషానికి రూ.1 చొప్పన 30 రోజుల్లో 43,800 నిమిషాల్లో రూ.40,000 కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మీ ఇద్దరి మధ్య గతంలో ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా దాన్ని మీరు వదిలించుకోవాలనుకున్నారు. సింపల్‌గా ఇగ్నోర్ చేయండి. కానీ మీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ను గూగుల్‌పేలో బ్లాక్ చేయవద్దు. ఎందుకంటే మీరు దాని ద్వారా నెలకు రూ.40 వేలు సంపాదిస్తారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీరు కొంత డబ్బు సమకూర్చుకోండి. తర్వాత గూగుల్‌పేలో కూడా తనను బ్లాక్ చేయండి’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!ఏదేమైనా ప్రతి రిలేషన్‌షిప్‌కు ఇద్దరి అంగీకారం అవసరం. అందుకు ఏ కారణంతోనైనా ఒకరికి ఇష్టం లేదంటే వేరొకరు దాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ ఏ విధమైన వేధింపులకు పాల్పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీని మంచికే వినియోగించుకోవాలని చెబుతున్నారు. -
ఎలాన్ మస్క్ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా?
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్ (ట్విటర్)’ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఎక్స్ క్రియేటర్లకు సుమారు 20 మిలియన్లు (రూ.166 కోట్ల కంటే ఎక్కువ) చెల్లించినట్లు ఆ కంపెనీ సీఈవో లిండా యక్కరినో తెలిపారు. వెరిఫైడ్ యూజర్ల పోస్టులపై డిస్ప్లే అయ్యే యాడ్స్ ద్వారా సంస్థ సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ ఏడాది జూలై నుంచి క్రియేటర్లకు చెల్లించడం ప్రారంభించింది. యూట్యూబ్‌లో వీడియోలకు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులకు, వెబ్సైట్లలో ఆర్టికల్స్‌కు డబ్బులు వస్తాయి. అదే తరహాలో ఎక్స్.కామ్ సైతం ట్వీట్లకు డబ్బులు ఇస్తున్నట్లు అధినేత ఎలాన్ మస్క్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అర్హులైన క్రియేటర్లకు ఆ మొత్తాన్ని చెల్లించినట్లు సీఈవో లిండా ట్వీట్ చేశారు. ‘క్రియేట్,కనెక్ట్, కలెక్ట్ ఆల్ ఆన్ ఎక్స్’. క్రియేటర్లు ఆర్ధికంగా విజయం సాధించేలా వారికి అండగా నిలిస్తున్నాం ’అని యాకారినో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇప్పటికే క్రియేటర్ కమ్యూనిటీకి 20 మిలియన్లు చెల్లించాం. తొలిసారిగా జులై నెలలో 5 మిలియన్లు అందించినట్లు తెలిపారు. Create. Connect. Collect all on X. We’re enabling the economic success of new segments like creators. And so far we've paid out almost $20 million to our creator community. https://t.co/kk137uPkAo — Linda Yaccarino (@lindayaX) September 29, 2023 యాక్టీవ్‌గా ఉన్న క్రియేటర్లు డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని ఎక్స్.కామ్ కల్పిస్తుంది. మానిటైజేషన్ నిబంధనలకు లోబడి చేసే ట్వీట్లకు క్రియేటర్లు ‘యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్’ కింద భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన క్రియేటర్లు డబ్బులు సంపాదించుకోవచ్చు. క్రియేటర్ యాడ్స్ రెవెన్యూ షేరింగ్ (ట్వీట్లతో డబ్బులు) సంపాదించేందుకు క్రియేటర్లు ఎక్స్ ప్రీమియం సభ్యుడై ఉండాలి. గత 5 నెలల్లో మీరు చేసిన పోస్ట్ లపై కనీసం 3 మిలియన్ ఆర్గానిక్ ఇంప్రెషన్స్, కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి. చదవండి👉 ఎంతపని చేశావయ్యా ఎలన్ మస్క్? -
మీరు విద్యార్థులా? చదువుకుంటూ డబ్బు సంపాదించండి ఇలా
పార్ట్ టైమ్ జాబ్స్.. కొన్నేళ్ల క్రితం వరకు విదేశాలకే పరిమితం. ఉన్నత విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనూ పార్ట్‌టైమ్ కొలువుల కల్చర్ విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, ఈ–కామర్స్ రంగాల విస్తరణ కారణంగా.. విద్యార్థులు చదువుకుంటూనే ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి కొంత ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. పార్ట్‌టైమ్ అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుకునేందుకు మార్గాలు, వేతనాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం... మన దేశంలో ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్స్ ట్రెండ్ మారుతోంది. గతంలో పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్ అంటే ట్రాన్స్‌లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. కానీ..ప్రస్తుత కార్పొరేట్ యుగంలో..అన్ని రంగాల్లోనూ పార్ట్ టైమ్ ఉద్యోగాల సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సేవల రంగం మొదలు ఐటీ వరకూ..పార్ట్ టైమ్ జాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. అఫ్లియేట్ మార్కెటింగ్ ఇటీవల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో వినిపిస్తున్న మాట.. అఫ్లియేట్ మార్కెటింగ్. సొంతంగా వెబ్సైట్ రూపొందించుకున్న వ్యక్తులు.. సదరు పోర్టల్‌లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్ లింక్స్‌ను, ఉత్పత్తులను తమ వెబ్సైట్ వీక్షకులకు కనిపించేలా చేయడమే అఫ్లియేట్ మార్కెటింగ్. ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్సైట్ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్‌గా పేర్కొనొచ్చు. ఈ పద్ధతిలో సంస్థలు సదరు వెబ్సైట్ నుంచి ఎక్స్టర్నల్ లింక్స్‌తో తమ ఉత్పత్తులను వీక్షించిన వారి సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లిస్తున్నాయి. ఈ విధానంలోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి. డెలివరీ అసోసియేట్స్ డెలివరీ అసోసియేట్స్ అంటే.. సంస్థల ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే వారు. ఇవి ఎక్కువగా ఈ–కామర్స్, రిటెయిల్ రంగాల్లో లభిస్తున్నాయి. వీటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతగా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారని క్వికర్జాబ్స్ నివేదిక పేర్కొంది. వీరికి సగటున రూ.15వేలు లభిస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్స్ పార్ట్ టైమ్ ఉపాధి పరంగా మరో చక్కటి అవకాశం..ట్యూటర్స్‌గా పని చేయడం. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం హోంట్యూటర్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి వీరు ఆన్లైన్,పార్ట్‌టైమ్ విధానాల్లో నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందడానికి ఇది చక్కటి మార్గం. ప్రస్తుతం ఎన్నో ఎడ్టెక్ స్టార్టప్ సంస్థలు ఆన్లైన్ ట్యాటర్స్కు స్వాగతం పలుకుతున్నాయి. కాపీ రైటర్ పార్ట్ టైమ్ జాబ్స్ విభాగంలో టాప్ లిస్టింగ్‌లో ఉన్న కొలువు.. కాపీ రైటర్. సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్‌లో ఒక సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్‌కు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా రాయడం కాపీ రైటర్ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్లైన్ విధానంలో కాపీ రైటర్స్‌ను నియమించుకుంటున్నాయి. తొలుత ఒక నమూనా కాపీని అడుగుతున్న సంస్థలు..దానికి మెచ్చితే పని చేసే అవకాశం ఇస్తున్నాయి. టైమ్ రేట్, పీస్ రేట్ ప్రాతిపదికన రూ.800 నుంచి రూ.వేయి వరకు అందిస్తున్నాయి. డేటాఎంట్రీ టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటే.. ఆదాయం అందించే మరో పార్ట్ టైమ్ అవకాశం.. డేటాఎంట్రీ. బీపీఓ, కేపీఓ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి సేవలు అందించే సంస్థలు తమ క్లయింట్లు పంపించే రికార్డ్లను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్ టైమ్ లేదా ఆన్లైన్ విధానంలో నియమించుకునేందుకు ప్రాంధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. పీస్ రేట్, టైమ్ రేట్ విధానంలో పారితోషికం లభిస్తోంది. పీస్ రేట్ విధానంలో ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్ రేట్ విధానంలో గంటకు రూ.300 నుంచి వేయి వరకు సంపాదించుకునే అవకాశముంది. యాడ్ హోస్టింగ్ ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్మెంట్ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేయడమే..ఆన్లైన్ యాడ్ పోస్టింగ్. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ ఉంటే.. ఈ పార్ట్‌టైమ్ జాబ్‌లో రాణించొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ యాడ్ హోస్టింగ్స్కు క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర వెబ్‌సైట్స్ ప్రధాన ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నాయి. ఒక్కో యాడ్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు పొందే వీలుంది. ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇది కూడా యువతకు పార్ట్ టైమ్ ఆదాయ వనరుగా నిలుస్తోంది.జిమ్‌లు,ఫిట్నెస్ సెంటర్స్‌లో ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఈ విభాగం సరితూగుతుందని చెప్పొచ్చు. పార్ట్ టైమ్ విధానంలో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్‌గా రోజుకు రెండు,మూడు గంటల సమయం వెచ్చిస్తే రూ.500 వరకు సం΄ాదించొచ్చు. సేల్స్ అసోసియేట్ ప్రతి రోజు నిర్దిష్టంగా ఒక సమయంలో.. స్టోర్స్‌లో సేల్స్ విభాగంలో పని చేసే వ్యక్తులనే పార్ట్ టైమ్ సేల్స్ అసోసియేట్స్‌గా పిలుస్తున్నారు. విధుల పరంగా సదరు అవుట్‌లెట్‌లోని స్టాక్ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. ఏ కోర్సు చదువుతున్న వారైనా రిటెయిల్ సేల్స్ అసోసియేట్‌గా పార్ట్ టైమ్‌గా పని చేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించే వీలుంది. క్యాబ్ డ్రైవర్స్ ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మరో పార్ట్ టైమ్ ఆదాయ మార్గం.. క్యాబ్ డ్రైవర్స్‌గా పని చేయడం. ప్రస్తుతం పలు సంస్థలు ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్ ద్వారా సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి రైడర్స్ కొరత ఏర్పడుతోంది. దీంతో పార్ట్ టైమ్ అవకాశాలకు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తో పాటు, పదో తరగతి ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. సోషల్ మీడియా అసిస్టెంట్ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వీసులు, ప్రొడక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ తదితరాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు ఉండాలి. సోషల్ మీడియా రైటింగ్‌పై అవగాహనతో పాటు,ఎస్ఈఓ, ఎస్ఈఎం, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం. వీరు సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందొచ్చు. ఐటీ రంగంలోనూ ఐటీ రంగంలో సైతం పార్ట్ టైమ్ జాబ్స్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రోగ్రామర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్ కోర్సులు చదువుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న వారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకున్న జాబ్ ప్రొఫైల్,ప్రాజెక్ట్ ఆధారంగా నెలకు రూ.20వేల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఆన్లైన్ కన్సల్టెంట్ ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి..ఆన్లైన్ కన్సల్టెంట్. కంపెనీల్లో ఉన్నత స్థాయి వ్యూహాలు మొదలు ప్రోగ్రామింగ్, కోడింగ్ వరకూ.. ఆన్లైన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. అందుకునే మార్గాలివే ప్రస్తుత టెక్ యుగంలో ఒక్క క్లిక్‌తో వందల ఉద్యోగాల సమాచారం అందించే వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో జాబ్ సెర్చ్ పోర్టల్స్ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే చాలు.. వాటికి సంబంధించిన సమాచారం, నిర్వర్తించాల్సిన విధులు, లభించే పారితోషికం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. పలు మొబైల్ యాప్స్ కూడా పార్ట్‌టైమ్ జాబ్స్ వివరాలు అందిస్తున్నాయి. -
ఈ యూట్యూబర్ల నెలవారీ సంపాదన తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!
మీరెప్పుడైనా నిద్రపోతున్నా.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే ఎలా ఉంటుందో ఊహించుకున్నారా? కానీ వీళ్లు మాత్రం అలాగే అనుకున్నారు. అలా అని ఊహల్లో తేలిపోలేదు. రేయిం భవళ్లు శ్రమించారు. గంటల నిడివి గల వీడియోల్ని తీశారు. ఇష్టా ఇష్టాల్ని వదులుకున్నారు. మేం యూట్యూబర్లం అని చెబితే తేలిగ్గా తీసి పారేసిన వాళ్ల ముందు.. శ్రీ శ్రీ చెప్పినట్లు కన్నీళ్ళు కారుస్తూ కూర్చోలేదు. చెమట చుక్కని చిందించారు. మనదేశ యూట్యూబ్ చరిత్రలో నిలిచిపోయేలా ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచారు. ఇప్పుడు అలాంటి వారిలో ప్రముఖులైన దేశీయ యూట్యూబర్ల గురించి, వారి ఆదాయం గురించి తెలుసుకుందాం. గౌరవ్ చౌదరి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 30 ఏళ్ల గౌరవ్ చౌదరి వరల్డ్ లార్జెస్ట్ యూట్యూబర్‌గా చెలామణి అవుతున్నాడు. దుబాయ్ బిట్స్ ఫిలానీ క్యాంపస్‌లో ఎంటెక్ (మైక్రో ఎలక్ట్రానిక్) చదివాడు. దుబాయ్‌లో ఉంటూ ఆ దేశ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్నాడు. మరో పక్క 'టెక్నికల్ గూరూజీ' యూట్యూబ్ ఛానల్ పేరుతో టెక్నాలజీపై వీడియోలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానెల్‌కు 22.1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫోర్బ్స్ ఇండియా అండర్-30 జాబితాలో గౌరవ్ చోటు సంపాదించుకున్న అతని నెలవారీ సంపాదన కోటి రూపాయిలకు పైగా ఉంటుంది. అతని ఆస్తుల విలువ అక్షరాల 50 మిలియన్ డాలర్లు . మన దేశ కరెన్సీలో (రూ.300కోట్లుకు పై మాటే) క్యారీ మినాటీ పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్లు హర్యానాలోని ఫరిదాబాద్‌కు చెందిన 23ఏళ్ల క్యారీ మినాటీ రెండు ఛానెళ్లను నిర్వహిస్తున్నాడు. క్యారీ మినాటీ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్లో అదిరిపోయే కామెడీ స్కిట్లు చేస్తుంటే..క్యారీస్ లైవ్ పేరుతో గేమింగ్ ఛానెల్ నడుపుతున్నాడు.10ఏళ్ల వయస్సు నుంచే యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు అప్లోడ్ చేయడం మొదలు పెట్టాడు. బాలీవుడ్ యాక్టర్ సన్నిడియోల్‌ను ఇమిటేట్ చేయడంలో దిట్ట. అందుకే చదువు మధ్యలోనే వదిలేశాడు. చదివింది 10వ తరగతే అయినా (ఇంటర్ ఎగ్జామ్స్ భయంతో మధ్యలోనే చదువు వదిలేశాడు) 2014 నుంచి వీడియోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అతని ఆదాయం నెలకు రూ.16లక్షలకు పై మాటే. ప్రస్తుతం క్యారీ మినాటీ యూట్యూబ్ ఛానెల్‌కు 35.9 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. క్యారీస్లైవ్కు 11.1మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లతో రాణిస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతని ఆస్తుల విలువ అక్షరాల 3.5 మిలియన్లు. అంతే కాదండోయ్ ఏప్రిల్ 2020 ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో ఆసియా నుంచి క్యారీ చోటు దక్కించుకున్నాడు. భువన్ బామ్ భువన్ బామ్. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన 28 ఏళ్ల భువన్ బామ్ బీవీ కి వినీష్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తున్నాడు. ఢిల్లీలో హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఓవైపు వీడియోలు చేస్తూనే మరోవైపు మింత్రాతో పాటు ఇతర సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్‌గా పనిచేస్తున్నాడు. బిజినెస్ కనెక్ట్ ఇండియా-2021 ప్రకారం..అతని ఆస్తుల విలువ అక్షరాల 3మిలియన్లు. భారత్ కరెన్సీలో రూ.25 కోట్లుగా ఉంది. ఇక నెలవారీ సంపాదన రూ.కోటి పై మాటే. ఆశిష్ చంచలాని ఆశిష్ చంచలాని. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ల్ఫుయన్సర్. నేవి ముంబై దత్తా మేఘే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానెల్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నాడు. అశిష్ చంచలానికి వినిస్ పేరుతో నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 28.3 మిలియన్ మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. నెలకు 115,000 డాలర్ల నుంచి 180,000 డాలర్ల వరకు సంపాదిస్తున్నాడు. అమిత్ భదానా అమిత్ భదానా 27ఏళ్ల యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. సౌత్ ఢిల్లీకి చెందిన జోహ్రీపూర్ నివాసి.ప్రస్తుతం అమిత్ 'అమిత్ భదానా' అనే యూట్యూబ్ ఛానెల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్‌ను అప్లోడ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానెల్‌కు 24 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉండగా..అలా అప్లోడ్ చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. వాటికి వచ్చే వ్యూస్, డిస్ప్లే అయ్యే యాడ్స్ కారణంగా ప్రతి వీడియోకి రూ.10 లక్షలు సంపాదిస్తాడని యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక అతని ఆస్తులు అక్షరాల రూ.44కోట్లు. Amit Bhadana: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది -
ఆన్లైన్ లోన్ యాప్ మోసం: మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్లో యువతను లక్ష్యంగా చేసుకుని రుణాలు ఇచ్చి వేధించిన కేసులో చార్జ్‌షీట్ దాఖలైంది. దీనిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆన్లైన్ రుణ యాప్‌లను షాంఘైలో రూపొందించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ల్యాంబో సహా 28 మంది అరెస్టయ్యారు. అయితే ప్రధాన సూత్రధారి జెన్నిఫర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూరు, ముంబై, ఢిల్లీలో అధికంగా బాధితులు ఉన్నారు. ఈ రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు తాళలేక తెలంగాణలో ఏడుగురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చైనాలో ఓ ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెంట్లుగా పని చేస్తున్న జెన్నిఫర్, వాంగ్ జియాంగ్ ఇద్దరు కలిసి 2019 నవంబర్‌లో ఢిల్లీలో మూడు సంస్థలు ప్రారంభంచారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్‌లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రుణాల ఇస్తామని యువతను ఆకర్షించారు. వీరిలో జియాంగ్ బెంగళూరు బాధ్యతలు చూసుకున్నాడు. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు చైనాకు జియాంగ్ పరార్. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై బాధ్యతలు ల్యాంబోకు అప్పగించి జెన్నిఫర్ వెళ్లారు. ఆన్లైన్ లోన్ యాప్‌లతో 7 నెలల్లో రూ.30 వేల కోట్లు లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీటిలో రూ.11 వేల కోట్ల లాభం పొందారు. వచ్చిన లాభంతో ఐల్యాండ్‌లో ఉన్న బినామీ ఖాతాలోకి నగదు బదిలీ దశల వారీగా వందల కోట్ల రూపాయలు షాంఘైకు తరలించారు. ఒక్కరోజులో రూ.250 కోట్లు రుణంగా నిర్వాహకులు ఇచ్చారు. నిర్వాహకుల ఖాతా నుంచి రూ. 315 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. -
అమెజాన్ ప్రొడక్ట్స్ పేరుతో భారీ మోసం
ఇటీవల ఆన్లైన్ లో మోసం పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే ఆన్లైన్ లోన్ యాప్స్ పేరిట మోసాలు పెరిగిపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఆన్లైన్ లోన్ యాప్స్ గురుంచి పోలిసులతో పాటు ఆర్బీఐ కూడా ప్రజలను హెచ్చరించింది. లోన్ యాప్స్ తో పాటు ఇతర యాప్స్ మీద పోలీసులు సెర్చ్ ఆపరేషన్ పెట్టడంతో చాలా ఫ్రాడ్ యాప్స్ ఈ నెల 21 నుంచి తమ యాక్టివిటీని నిలిపివేశాయి. అయితే ఇవన్నీ మరవక ముందే మరో స్కామ్ బయటపడింది. ఆన్లైన్ లో జోరుగా కొనసాగుతున్న"బర్స్ మనీ యాప్" ఫ్రాడ్ పై ఇటీవల సైబర్ పోర్టల్స్, సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. దీనిలో డబ్బులు పెట్టుబడి పెట్టిన భాదితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రొడక్ట్స్ క్లిక్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు: ఆన్లైన్ లో అమెజాన్ కి సంబందించిన ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు సంపాందించవచ్చు అంటూ బల్క్ ఎస్ఎంఎస్లు, యాప్ లింక్స్ పంపిస్తున్నారు. అయితే, ఎవరైతే దీనిలో జాయిన్ కావాలని అనుకుంటున్నారో వారు కొత్త మొత్తంలో నగదు మాత్రం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమెజాన్ వెబ్పేజ్తో వివిధ రకాల ప్రొడక్ట్స్ ను డిస్ ప్లే చేస్తున్నారు. బక్కెట్ సిస్టమ్ పేరుతో రీచార్జ్(ఇన్వెస్ట్ మెంట్) ఆప్షన్స్ కూడా తీసుకొచ్చారు. మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం వాటిని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు క్లిక్ చేసిన ద్వారా వచ్చిన డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి కొంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు. దీని ద్వారా కొన్ని రోజుల పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ యాప్ అమెజాన్ కి సంబంధించింది అని భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. ఇందులో ఉండే నాలుగు ఎ,బి,సి,డి అనే ఆప్షన్స్ ద్వారా ప్రతిరోజు 5-35 శాతం వరకు క్యాష్ విత్డ్రాల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందులో ఎవరైతే డబ్బులు డిపాజిట్ చేస్తారో వారి డబ్బు యాప్ నిర్వాహకుల దగ్గరే ఉంటుంది. ఇందులో డిపాజిట్ చేస్తేనే డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేల మీరు డిపాజిట్ చేసిన నగదును ఉపసంహరించుకుంటే ఎలాంటి డబ్బులను సంపాదించు కోవడానికి అవకాశం ఉండదు. ఇందులో కమిషన్ ద్వారా వచ్చిన నగదును మాత్రమే మీ అకౌంట్ లోకి జమ అవుతుంది. యాప్‌లో పెట్టుబడి పెట్టిన వారికి గ్రాబ్ ఆర్డర్స్, పర్చేస్ కింద మనీ యాడ్ అవుతుంది. రూ. 5000 పెట్టుబడి పెట్టిన వారు 30 ఆర్డర్స్ చేస్తే ప్రతిరోజూ 400 రూపాయలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్లీ ఇందులో జీఎస్టీ పేరుతో 18 శాతం కట్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరి నుండి డబ్బులు పెట్టుబడి పెట్టేలా చేసి తర్వాత మోసం చేస్తున్నట్లు భాదితులు చెప్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో బర్స్ యాప్ దందా జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే చాల మంది ఇందులో రూ.100 నుంచి రూ.లక్షా 80 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. పనిచేయని విత్డ్రాల్ ఆప్షన్స్ తాజాగా ఈ నెల నుంచి బర్స్ యాప్‌లో రీచార్జ్, విత్డ్రాల్ ఆప్షన్స్ పనిచేస్తలేవని బాధితులు చెప్తున్నారు. వారు డిపాజిట్ చేసిన కూడా తిరిగి పొందలేకపోతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో చాలా మంది బాధితులు భయాందోళనకు గురౌతున్నారు. ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే ఈ యాప్ నిర్వాహుకుల అడ్రస్ లేకపోవడం అందరిని భయానికి గురిచేస్తుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇలా జరుగుతుందని యాప్ నిర్వాహకులు యాప్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బర్స్ యాప్ కాల్ సెంటర్స్ కి ఫోన్ చేస్తే సరైన స్పందన లేదని భాదితులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేసి సాఫ్ట్ వెర్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు కూడా మోస పోయినట్లు తెలుపుతున్నారు. -
లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
సాక్షి, ఫెర్టిలైజర్ సిటీ (రామగుండం): ఆన్లైన్ లోన్ యాప్‌ల కారణంగా ఇటీవల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్ ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలో సైట్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నాడు. ఎన్టీపీసీ మల్కాపూర్ గ్రామంలో అద్దెకు ఉంటున్న సంతోష్ ఇంట్లోనే చిన్న కిరాణా దుకాణం కూడా నడుపుతున్నాడు. దీని నిర్వహణకు ఐదు ఆన్లైన్ యాప్‌ల ద్వారా రూ.60 వేల వరకు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పుకు వడ్డీ, అసలు మొత్తం చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు రోజూ బెదిరిస్తుండటంతో భయాందోళనకు గురైన సంతోష్ ఈ నెల 18న ఇంట్లో గడ్డిమందు తాగాడు. చదవండి: (ప్రాణాంతక యాప్‌లు!) ఆన్లైన్ వడ్డీ వ్యాపారులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని మొబైల్ ద్వారా స్నేహితులకు వీడియో పంపించాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. ఈ విషయం బాధితుడి కుటుం బసభ్యులకు మిత్రులు సమాచారమందించగా ఈనెల 21న సంతోష్‌ను తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందా డు. తన మిత్రుడు ఆన్లైన్ వేధింపుల వల్లే మృతిచెందాడని, దీనికి కారణమైన లోన్ యాప్ యజమానులపై చర్యలు తీసుకోవాలని గురువారం సంతోష్‌కుమార్ మిత్రుడు బ్రహ్మచారి ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. -
ప్రాణాంతక యాప్‌లు!
చైనా గేమింగ్ యాప్‌లు, ఇతర యాప్‌లు కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తరుణంలో, ఆ దేశానికి చెందిన వస్తువులు కొనకపోవడం దేశభక్తికి నిదర్శనమని కొందరు ప్రచారం చేస్తున్న సమయంలో అందరి కళ్లూ కప్పి చాపకింద నీరులా చైనా మూలాలున్న లోన్ యాప్స్ దేశంలో అనేకచోట్ల స్వైరవిహారం చేసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ యాప్స్ బారినపడి మూడు నిండు ప్రాణాలు బలికాగా, నిత్యం వీరి వేధింపులు చవిచూస్తున్నవారు మరెందరో. ఇక్కడే కాదు... కేరళ మొదలుకొని ఢిల్లీ వరకూ ఈ యాప్స్ నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నవారికి వలపన్ని, సాయం చేసే పేరిట అడ్డగోలుగా దోచుకుతిన్నారని, వారిని మానసికంగా వేధిస్తూ నరకం చవిచూపించారని ఇప్పుడిప్పుడు బయటపడుతున్న కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంస్థలను నమ్మొద్దని, వారి బారినపడి నష్టపోవద్దని బుధవారం రిజర్వ్‌బ్యాంక్ సైతం హెచ్చరించింది. ఇంతక్రితం చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కాల్‌మనీ సెక్స్ రాకెట్ యధేచ్ఛగా సాగింది. అందులో ఆయన పార్టీకి చెందినవారే అనేకులు వుండటంతో నిందితులంతా తేలికపాటి సెక్షన్లకింద అరెస్టయి బెయిల్ కూడా తెచ్చుకోగలిగారు. ఈ యాప్స్ కూడా దాదాపు అటువంటివే. లాక్డౌన్ల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులు, కొలువు పోగొట్టుకుని రోడ్డునపడిన యువతీయువకులు, అనుకోకుండా అనారోగ్యంలో చిక్కుకుని చికిత్స కోసం డబ్బు అవసరమైనవారు, వినియోగ వస్తు వ్యామోహంలో పడేవారు... ఇలా అనేకమంది అభాగ్యులు ఈ సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ లోన్ యాప్‌ల పేర్లు కూడా తమాషాగా వుంటాయి. బబుల్ లోన్, లిక్విడ్ క్యాష్, రుపీ ఫ్యాక్టరీ, పైసాలోన్, ఫ్లిప్‌క్యాష్, ఇన్‌నీడ్, రుపీప్లస్, పాన్‌లోన్, క్యాష్‌పాట్, వన్‌హోప్... ఇలా వీటికి అంతేలేదు. ఒక లెక్క ప్రకారం గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ బాపతు మారీచ సంస్థలు 500పైగానే వున్నాయి. వీటిల్లో అధికభాగం మూలాలు చైనాలోనే వుంటాయి. ఒక్కో యాప్‌కు దాదాపు పది లక్షలకుపైగా డౌన్లోడ్లు వున్నాయంటే ఇవి ఎంతగా అల్లుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. వీటికి ఒక వెబ్‌సైట్‌గానీ, చెప్పుకోవడానికి కార్యాలయంగానీ వుండవు. కనీసం సంప్రదించడానికి ఫోన్ నంబరైనా ఉండదు. అన్నిటికీ యాప్ ఒక్కటే మార్గం. ఇవ్వడమైనా, గుంజుకోవడమైనా ఆన్లైనే! యాప్‌ల నిర్వాహణ తీరు కూడా విలక్షణమైనది. ఎక్కడో చైనాలో గుట్టుగా వుంటూ అనేకానేక సంస్థల చాటున దీన్నంతా కొనసాగిస్తారు. ఔట్సోర్సింగ్ సంస్థలతో కూడా వీరికి నేరుగా సంబంధాలుండవు. మనదేశంలో వున్న నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లోగానీ, నేరుగాగానీ రుణాలిచ్చే సంస్థలు తప్పనిసరిగా రిజిస్టరైన బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు అయివుండాలి. లేదా రాష్ట్రాల్లోని చట్టాలకింద వడ్డీ వ్యాపారం చేసే సంస్థలైనా అయివుండాలి. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొనివుండాలి. ఏమీ లేకుండా ఇలా రుణాలిచ్చే వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. కానీ ఈ యాప్స్ నిర్వాహకుల తీరు చూస్తే వీళ్లు నకిలీగాళ్లనే అనుమానం ఎవరికీ రాదు. లోన్ కోసం ఆశ్రయించినప్పుడు తీయగా మాట్లాడటం, సరిగా చెల్లించే స్థితిలో లేరని తెలియగానే దుర్భాషలాడటం ఈ యాప్స్ నిర్వాహకులకు అలవాటు. పోలీసు కేసులు పెడతామని బెదిరించడం, కోర్టుకీడుస్తామని హెచ్చరించటం రివాజు. దక్షిణాది రాష్ట్రాలవారికి హిందీ భాషా ప్రాంతవాసులతో ఫోన్ చేయించి బెదిరించటం, ఇంటికొస్తున్నామని హడలెత్తించటం వీరనుసరించే విధానం. ఏదోవిధంగా ఇచ్చిన సొమ్ముకంటే అనేక రెట్లు అధికంగా గుంజటం వీరి ధ్యేయం. ఏం చేసినా కట్టే స్థితిలో లేరని నిర్ధారణయ్యాక యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సేకరించిన డేటా ఆధారంగా వారి బంధుమిత్రులందరి ఫోన్లకూ వారిని దారుణంగా చిత్రిస్తూ సందేశాలు పంపి పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని చూస్తారు. డబ్బు చెల్లించకపోతే తమతో నగ్నంగా వీడియో చాటింగ్ చేయాలని యువతిని బెదిరించిన ఉదంతం, అప్పు తీసుకున్న యువకుడి తల్లి ఫొటోను మార్ఫింగ్ చేసి అతని పరిచయస్తులకు పంపిన ఉదంతంవంటివి వెల్లడయ్యాయి. వీరు ఇంకేం చేశారో, ఎందరు వీరి ఆగడాలకు బలయ్యారో మున్ముందు చూడాల్సివుంది. లాక్డౌన్ తర్వాత సాధారణ జనం ఆర్థికంగా ఎంత కుంగిపోయారో చెప్పడానికి ఈ యాప్‌ల స్వైరవిహారమే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ తరహాలో సాధారణ ప్రజానీకం చేతుల్లో డబ్బుండేలా చూసే పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాలు దేశంలో చాలా తక్కువ. ఈ పరిస్థితిని లోన్ యాప్స్ నిర్వాహకులు చక్కగా వినియోగించుకున్నారు. రుణం ఇచ్చేటపుడు ఆధార్ నంబర్ మినహా మరే డాక్యుమెంటూ అవసరం లేదనడం వల్ల చాలామంది వీటికి ఆకర్షితులవుతారు. కానీ యాప్ డౌన్లోడ్ సమయంలోనే ఫోన్లోని సమస్త సమాచారమూ వారికి పోతుంది. అప్పు తీసుకున్నవారు కదలికలేమిటి... ఏ బ్యాంకులో వారికి ఖాతా వుంది... వారు ఏఏ దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేస్తారు వంటి వివరాలన్నీ ఆ యాప్స్ నిర్వాహకుల చేతుల్లోకి పోతాయి. అన్నిటికీ ఆన్లైన్ వ్యవస్థపైనే ఆధారపడేలా, అత్యధిక లావాదేవీలు డిజిటల్ మార్గాల్లోనే జరిగేలా చూసేందుకు గత దశాబ్దకాలంగా కేంద్రం అనేక విధానాలు అమల్లోకి తెచ్చింది. ఆధార్‌తో మొదలుపెట్టి అన్నీ డిజిటల్ మార్గంలోకి పోయాయి. కానీ దీనికి దీటుగా ప్రజలకు డిజిటల్ అవగాహన కల్పించడంలో మాత్రం పాలకులు విఫలమయ్యారు. ఫలితంగా తమ విలువైన డేటా ప్రమాదకర వ్యక్తుల చేతుల్లోకి పోతోందని జనం గ్రహించలేకపోతున్నారు. దాదాపు ఏడాదినుంచి లోన్ యాప్‌లు స్వైరవిహారం చేస్తుంటే రిజర్వ్‌బ్యాంకు మొన్న జూన్‌లో తొలిసారి హెచ్చరించింది. ఆ తర్వాతైనా దానిపై గట్టి ప్రచారం జరగలేదు. మళ్లీ ఇప్పుడే అది మాట్లాడటం! గూగుల్ వంటి సంస్థలు జవాబుదారీతనంతో వుండేలా చూడటం, యాప్‌లపై నిపుణుల సాయంతో నిఘా పెట్టడంవంటి చర్యలతోనే ఈ మాయదారి యాప్‌లకు అడ్డుకట్టవేయగలం. -
అంతా ఆన్లైన్ చెలా‘మనీ’
విజయనగరం అర్బన్: నోట్ల కొరత నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందులను పోగొట్టుకోవడానికి నగదు రహిత లావాదేవీలే శరణ్యమని, దాన్ని ప్రతి ఒక్కరి చేతా అలవాటు చేయించాలన్న సీఎం ఆదేశాలు ఇక్కడి బ్యాంకర్లు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. జిల్లాలోని పలు బ్యాంక్‌ల్లో బుధవారం అరకొర నగదు ఉన్నప్పటికీ నగదు రహిత లావాదేవీలనే అందించడం కనిపించింది. ప్రధానంగా ఎస్బీఐ శాఖల్లోనే ఈ ఆదేశాలు అమలవుతున్నాయి. ఇప్పటికే రూపేకార్డు పొందిన ఖాతాదారుడు నగదు కోసం పట్టణంలోని ఒక జాతీయ బ్యాంక్‌కు వస్తే ఆయనకు నగదు లేదని చెప్పి, స్వైపింగ్ మెషీన్ ద్వారా లావాదేవీలను చేరుుంచారు. విత్‌డ్రా చేస్తున్న ఖాతాదారుని అవసరాన్ని తెలుసుకొని నగదు ఇవ్వాలని, ఆ మేరకు నోట్ల కొరతను తీర్చుకుంటూ నగదు రహిత లావాదేవీలను అలవాటు చేయించాలని తమకు ఆదేశాలొచ్చినట్టు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. రూపే కార్డులేని వారికి తక్షణమే మంజూరు చేస్తున్నామని తెలిపారు. బిజినెస్ కరస్పాండెంట్లు జిల్లాలో బ్యాంక్‌లు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో సమీప బ్యాంక్‌లు ఇప్పటికే బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసి వారి ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారుు. తాజా పరిస్థితులకు అనుగుణంగా వారికి ’రూపేకార్డుల వినియోగం, మొబైల్ బ్యాంక్, ఆన్లైన్ బ్యాంకింగ్...’ వంటి సేవలపై శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎస్బీఐకి దాదాపు 1,350 మంది బిజినెస్ కరస్పాండెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌పైనా విసృ్తతంగా ప్రచారం చేపడుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు ఇంకా రూ. 500ల నోట్లు రాలేదు. దీనివల్ల ఇక నగదు లావాదేవీలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. కొందరికే బ్యాంకు ఖాతాలు జిల్లాలో 14,53,543 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిలో తాజా లెక్కల మేరకు 83 శాతం ఖాతాదారులకే రూపే కార్డులున్నాయి. ఇవికాకుండా జన్‌ధన్ యోజనలో 5.69 లక్షల ఖాతాల్లో 3.84 లక్షల మందికి రూపేకార్డులు ఇచ్చారు. వీటితో లావాదేవీలకు విధిగా ఆధార్ సీడింగ్ ఉండాలి. ఇందులో అయితే 20వేల మంది జన్‌ధన్ ఖాతాదారులకు ఆధార్‌సీడింగ్ పూర్తికాలేదు. వీరిలో దాదాపు 80 శాతం మంది నిత్యవసరాల కోసమే నగదు విత్‌డ్రా చేస్తారు. ఈ నేపధ్యంలో బ్యాంకుల్లో నోట్లు ఇవ్వకపోడంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.