OMG Burse App: Withdrawal Not Working | Commission on Amazon Products, in Telugu - Sakshi
Sakshi News home page

అమెజాన్ ప్రొడక్ట్స్ పేరుతో భారీ మోసం

Published Mon, Dec 28 2020 7:17 PM | Last Updated on Wed, Dec 30 2020 12:22 PM

Click on Amazon Products in OMG Burse App Scam - Sakshi

ఇటీవల ఆన్లైన్ లో మోసం పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే ఆన్లైన్ లోన్ యాప్స్ పేరిట మోసాలు పెరిగిపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఆన్లైన్ లోన్ యాప్స్ గురుంచి పోలిసులతో పాటు ఆర్బీఐ కూడా ప్రజలను హెచ్చరించింది. లోన్ యాప్స్ తో పాటు ఇతర యాప్స్ మీద పోలీసులు సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టడంతో చాలా ఫ్రాడ్ యాప్స్ ఈ నెల 21 నుంచి తమ యాక్టివిటీని నిలిపివేశాయి. అయితే ఇవన్నీ మరవక ముందే మరో స్కామ్ బయటపడింది. ఆన్లైన్ లో జోరుగా కొనసాగుతున్న"బర్స్ మనీ యాప్" ఫ్రాడ్ పై ఇటీవల సైబర్ పోర్టల్స్, సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. దీనిలో డబ్బులు పెట్టుబడి పెట్టిన భాదితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.        

 ప్రొడక్ట్స్‌  క్లిక్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు:  

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లో అమెజాన్ కి సంబందించిన ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు సంపాందించవచ్చు అంటూ బల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, యాప్ లింక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిస్తున్నారు. అయితే, ఎవరైతే దీనిలో జాయిన్ కావాలని అనుకుంటున్నారో వారు కొత్త మొత్తంలో నగదు మాత్రం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వివిధ రకాల ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను డిస్ ప్లే చేస్తున్నారు. బక్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో రీచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఇన్వెస్ట్ మెంట్) ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా తీసుకొచ్చారు. మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం వాటిని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు క్లిక్ చేసిన ద్వారా వచ్చిన డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి కొంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు. దీని ద్వారా కొన్ని రోజుల పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ యాప్ అమెజాన్ కి సంబంధించింది అని భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు.     

ఇందులో ఉండే నాలుగు ఎ,బి,సి,డి అనే ఆప్షన్స్ ద్వారా ప్రతిరోజు 5-35 శాతం వరకు క్యాష్ విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందులో ఎవరైతే డబ్బులు డిపాజిట్ చేస్తారో వారి డబ్బు యాప్ నిర్వాహకుల దగ్గరే ఉంటుంది. ఇందులో డిపాజిట్ చేస్తేనే డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేల మీరు డిపాజిట్ చేసిన నగదును ఉపసంహరించుకుంటే ఎలాంటి డబ్బులను సంపాదించు కోవడానికి అవకాశం ఉండదు. ఇందులో కమిషన్ ద్వారా వచ్చిన నగదును మాత్రమే మీ అకౌంట్ లోకి జమ అవుతుంది. యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడి పెట్టిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారికి గ్రాబ్ ఆర్డర్స్, పర్చేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద మనీ యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుంది. రూ. 5000 పెట్టుబడి పెట్టిన వారు 30 ఆర్డర్స్ చేస్తే ప్రతిరోజూ 400 రూపాయలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్లీ ఇందులో జీఎస్టీ పేరుతో 18 శాతం కట్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరి నుండి డబ్బులు పెట్టుబడి పెట్టేలా చేసి తర్వాత మోసం చేస్తున్నట్లు భాదితులు చెప్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో బర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దందా జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే చాల మంది ఇందులో రూ.100 నుంచి రూ.లక్షా 80 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది.   

పనిచేయని విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్షన్స్
తాజాగా ఈ నెల నుంచి బర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రీచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనిచేస్తలేవని బాధితులు చెప్తున్నారు. వారు డిపాజిట్ చేసిన కూడా తిరిగి పొందలేకపోతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో చాలా మంది బాధితులు  భయాందోళనకు గురౌతున్నారు. ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే ఈ యాప్ నిర్వాహుకుల అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం అందరిని భయానికి గురిచేస్తుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇలా జరుగుతుందని యాప్ నిర్వాహకులు యాప్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బర్స్ యాప్ కాల్ సెంటర్స్ కి ఫోన్ చేస్తే సరైన స్పందన లేదని భాదితులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేసి సాఫ్ట్ వెర్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు కూడా మోస పోయినట్లు తెలుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement