టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఇటీవల ఓ యువతి తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విభిన్న ప్లాట్‌ఫామ్‌ల్లో తనను బ్లాక్ చేసింది. అయినా అతడు ఇటీవల గూగుల్‌పే ద్వారా తనను వేధిస్తున్నట్లు యువతి పోస్ట్ చేసింది. గూగుల్‌పే యాప్‌లో ప్రతి నిమిషానికి రూ.1 పంపిస్తూ తనను వేధిస్తున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది.
ఆయుషి అనే యువతి చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘జీపే ద్వారా నిమిషానికి రూ.1 చొప్పన 30 రోజుల్లో 43,800 నిమిషాల్లో రూ.40,000 కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మీ ఇద్దరి మధ్య గతంలో ఎలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా దాన్ని మీరు వదిలించుకోవాలనుకున్నారు. సింపల్‌గా ఇగ్నోర్ చేయండి. కానీ మీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ను గూగుల్‌పేలో బ్లాక్ చేయవద్దు. ఎందుకంటే మీరు దాని ద్వారా నెలకు రూ.40 వేలు సంపాదిస్తారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీరు కొంత డబ్బు సమకూర్చుకోండి. తర్వాత గూగుల్‌పేలో కూడా తనను బ్లాక్ చేయండి’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!
ఏదేమైనా ప్రతి రిలేషన్‌షిప్‌కు ఇద్దరి అంగీకారం అవసరం. అందుకు ఏ కారణంతోనైనా ఒకరికి ఇష్టం లేదంటే వేరొకరు దాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ ఏ విధమైన వేధింపులకు పాల్పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీని మంచికే వినియోగించుకోవాలని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment