money transfer
-
తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్థులు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, పేటీఎం, ఫోన్‌పే, జీపే వంటి థర్డ్‌పార్టీ మోబైల్ యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని నంబర్ నుంచి మెసేజ్‌లు, లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయకూడదని సైబర్ పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు చిన్నమొత్తాల్లో ఖాతాల్లోకి డబ్బు పంపించి తిరిగి ఆ ఖాతాలను లూటీ చేసేలా ప్రయత్నిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల సైబర్ మోసగాళ్లు ఫోన్‌పే, జీపే, పేటీఎం వంటి థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా తక్కువ మొత్తంలో నగదును ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. దాంతో డబ్బు అందుకున్న వారికి మెసేజ్ వస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నమ్మించి ‘మీ ఖాతాలో నగదు జమైంది. ఈ లింక్‌పై క్లిక్ చేయండి’అంటూ మెసేజ్‌లో కింద లింక్ ఇస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే పిన్ జనరేట్ చేయమనేలా అడుగుతుంది. పొరపాటున పిన్ జనరేట్ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు ట్రాన్స్పర్ చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చినట్లవుతుందని పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయంఖాతాలో గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బు జమ అవుతుందంటే అనుమానించాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చిన మేసేజ్‌లను, లింక్‌లను ఓపెన్ చేయకుండా నేరుగా డెలిట్ చేయాలని చెబుతున్నారు. -
జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఇటీవల ఓ యువతి తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విభిన్న ప్లాట్ఫామ్ల్లో తనను బ్లాక్ చేసింది. అయినా అతడు ఇటీవల గూగుల్‌పే ద్వారా తనను వేధిస్తున్నట్లు యువతి పోస్ట్ చేసింది. గూగుల్‌పే యాప్‌లో ప్రతి నిమిషానికి రూ.1 పంపిస్తూ తనను వేధిస్తున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది.ఆయుషి అనే యువతి చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘జీపే ద్వారా నిమిషానికి రూ.1 చొప్పన 30 రోజుల్లో 43,800 నిమిషాల్లో రూ.40,000 కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మీ ఇద్దరి మధ్య గతంలో ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా దాన్ని మీరు వదిలించుకోవాలనుకున్నారు. సింపల్‌గా ఇగ్నోర్ చేయండి. కానీ మీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ను గూగుల్‌పేలో బ్లాక్ చేయవద్దు. ఎందుకంటే మీరు దాని ద్వారా నెలకు రూ.40 వేలు సంపాదిస్తారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీరు కొంత డబ్బు సమకూర్చుకోండి. తర్వాత గూగుల్‌పేలో కూడా తనను బ్లాక్ చేయండి’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!ఏదేమైనా ప్రతి రిలేషన్‌షిప్‌కు ఇద్దరి అంగీకారం అవసరం. అందుకు ఏ కారణంతోనైనా ఒకరికి ఇష్టం లేదంటే వేరొకరు దాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ ఏ విధమైన వేధింపులకు పాల్పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీని మంచికే వినియోగించుకోవాలని చెబుతున్నారు. -
రోజూ 50 కోట్ల లావాదేవీలు
దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 500 మిలియన్లు(50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇది బిలియన్(100 కోట్లు) మార్కును చేరనున్నట్లు చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ‘గ్రూప్ ఆఫ్ థర్టీస్ వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సెమినార్’లో పాల్గొని ఆయన మాట్లాడారు.‘భవిష్యత్తులో ఆన్లైన్ లావాదేవీలకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఆమేరకు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. అందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అన్ని చర్యలు తీసుకుంటోంది. యూపీఐ విధానం ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను ఒక బిలియన్(100 కోట్లు)కు చేర్చాలని భావిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ రోజువారీ లావాదేవీల సంఖ్య 483 మిలియన్లకు చేరింది. ఇది సెప్టెంబర్‌లో సుమారు 500 మిలియన్లుగా ఉంది. సెప్టెంబర్ 2024లో మొత్తం యూపీఐ చెల్లింపుల సంఖ్య 15.04 బిలియన్లు(1500 కోట్లు). ఫలితంగా వీటి విలువ రూ.20.64 లక్షల కోట్లకు చేరింది. ఆన్లైన్ చెల్లింపులు పెంచడానికి ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌లతో కూడా యూపీఐను లింక్ చేస్తున్నాం. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, శ్రీలంక, మారిషస్, నేపాల్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది’ అని దాస్ చెప్పారు. -
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నాం. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమ. కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం. 57 నెల్లలో రైతు భరోసా కింద అందించిన మొత్తం రూ.34,288 కోట్లు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఒక్కో రైతన్నకు అదనంగా రూ.17,500 ఇస్తున్నాం. రైతు ప్రభుత్వం మనది.. మన ప్రభుత్వం వేసిన ప్రతీ అడుగూ కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలని వేశాం. క్రమం తప్పకుండా వైయస్సార్ రైతు భరోసా కింద సహాయాన్ని అందించాం. పెట్టుబడి సహాయంగా, రైతన్నకు దన్నుగా ఇది అందించాం. రాష్ట్రంలో దాదాపు 50శాతం లోపు రైతులన్నకున్న భూమి అర హెక్టారు లోపలే. హెక్టారు లోపల ఉన్న రైతులు 70 శాతం ఉన్నారు. ఈ పెట్టుబడి సహాయం వారికి ఎంతో మేలు చేసింది. వంద శాతం రైతులకు 80శాతం ఖర్చు రైతు భరోసా కింద కవర్ అయ్యింది. పేద రైతుల పక్షపాత ప్రభుత్వం మనది, దీనికి నేను గర్వపడుతున్నాను. సున్నా వడ్డీ కింద కూడా రూ.215.98 కోట్లు విడుదల చేస్తున్నాం. రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా కట్టే రైతులకు మేలు చేస్తున్నాం.ఇప్పటివరకూ 84.66 లక్షల మంది రైతన్నలకు ఇప్పటి వరకూ అందించిన వడ్డీ రాయితీ 2,050 కోట్లు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ కింద రైతులకు ఇవాళ విడుదలచేస్తున్న మొత్తం రూ.1,294.38 కోట్లు అందించాం. ప్రతీ అడుగులోనూ రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాం. ప్రతీ పథకం దాదాపుగా పేద రైతు కుటుంబానికి అందుబాటులో ఉంచడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఏడాదికి రూ.12500 బదులు వేయి పెంచి రూ.13500 ఇచ్చాం. 50వేల స్థానంలో ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చాం. చెప్పినదానికంటే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం మనది. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ముందుకు సాగాము. ప్రతీ సందర్భంలోనూ వారికి తోడుగా నిలిచాం. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్.. 19 లక్షల మంది రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ కింద ప్రతి రైతుకు రూ.45వేల మేర మేలు జరుగుతుంది. ఏడాదికి దాదాపుగా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతుల తరఫున ఉచిత పంటల బీమాకు ప్రీమియం కడుతున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం మనది. గతంలో ఎప్పుడూ కూడా రైతుల తరఫున ఎప్పుడూ బీమా ప్రీమియం చెల్లించలేదు. దేశంలో కూడా ఎక్కడా లేదు. రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. కేవలం ఈ ఐదేళ్లలో మాత్రమే ఇలా జరిగింది. ఇదొక విప్లవాత్మక మార్పు. నష్టం నుంచి రైతు తట్టుకుని నిలబడి తిరిగి పంటలు వేసుకునే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యగా దీన్ని అమలు చేసింది. ఆక్వా రైతులకు సాయం.. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను పెట్టాం. అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను రైతుకోసం పెట్టాం. రైతులకు ఇ-క్రాప్ చేస్తూ అన్నిరకాలుగా ఆదుకుంటున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా రైతులను చేయిపట్టుకుని నడిపించాం. ఈ ఐదేళ్లకాలంలో మాత్రమే ఇలా జరిగింది. ఆక్వా రైతులకు రూ.1.5కే కరెంటు ఇస్తూ ఆదుకున్నాం. ఆక్వాజోన్లలో ఉన్న ఆక్వారైతులకు తోడుగా నిలిచాం. పాల సేకరణలో కూడా రైతులకు తోడుగా నిలిచాం. రూ.10-20ల వరకూ రైతులకు అధిక ధరలు వచ్చాయి. పాలసేకరణలో ఈ ఐదేళ్ల కాలంలోనే రైతులకు రేట్లు పెరిగాయి. సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్‌ను తీసుకు వచ్చి ఈ రంగంలో పోటీని పెంచాం. తద్వారా రైతులకు మేలు జరిగింది. భూ సర్వే.. 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగింది. అప్పటినుంచి రికార్డులు అప్డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు జరక్కపోవడం జరిగింది. వివాదాలకు చెక్‌పడుతూ సమగ్ర సర్వే చేపట్టాం. రికార్డులను అప్డేట్ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవలను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం. 34.77 లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులను రైతులకు, పేదలకు కల్పించాం. గతానికి, ఈ ఐదేళ్ల కాలానికి తేడా గమనించాలని కోరుతున్నాను. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీచేస్తామని చంద్రబాబు చెప్పారు. బ్యాంకుల్లో బంగారం రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. దీంతో రైతులు నమ్మి అధికారం ఇస్తే.. దారుణంగా మోసం చేశారు. బేషరుతుగా రుణాలు మాఫీచేస్తానని చెప్పి చివరకు రుణమాఫీ పత్రాలు ఇచ్చి మోసం చేశారు. చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగొట్టారు. చివరకు మన ప్రభుత్వమే చెల్లించింది. బాబు హయాంలో రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్రవడ్డీలే ఏడాదికి దాదాపు రూ.5-6 వేల కోట్లు. అంత దారుణంగా చంద్రబాబు గతంలో మోసం చేశారు. మనం ఈ ఐదేళ్లలో వైయస్సార్ రైతు భరోసా కింద రూ.34వేల కోట్లు ఇచ్చాం. ధాన్యం కొనుగోలుకోసం రూ.65 కోట్లు ఖర్చు చేశాం. ఇదికాక రూ.1.2 లక్షల కోట్లు రైతున్నలకు వివిధ పథకాలు ద్వారా అందించాం అని అన్నారు. -
ప్రభుత్వ ‘యూకో’ బ్యాంక్ బాగోతం.. ప్రశ్నార్ధకంగా 114 కోట్లు!
డిసెంబర్ 7న ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ యూకో బ్యాంక్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా యూకో బ్యాంక్‌కు చెందిన 41వేల అకౌంట్లలో పొరపాటున రూ.820 కోట్లు జమయ్యాయి. వాటిల్లో రూ. 705.31 కోట్లు రికవరీ అయ్యాయి. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ చానెల్లో సాంకేతిక లోపంతో జరిగిన నిధుల బదిలీలో రూ.114.69 ఇంకా రికవరీ కాలేదని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవత్ కరద్ లోక్ సభ సమావేశాల్లో లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన యూకో బ్యాంక్ ఉద్యోగుల్ని గుర్తించింది. గుర్తించలేని ఇతర వ్యక్తులపై సీబీఐ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక పశ్చిమ బెంగాల్, కర్నాటకలోని 13 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిల్ ఆర్కైవ్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. -
రిమ్స్ మళ్లీ తెరపైకి.. స్టాఫ్‌నర్సుల నుంచి డబ్బులు వసూలు!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరచూ వివాదంలోకి ఎక్కుతోంది. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొంతమంది ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. లంచం తీసుకుంటూ బయటపడుతున్నప్పటికీ నవ్వి పోదురుగా.. మాకేమిటి అన్న చందంగా మారింది వీరి పరిస్థితి. ప్రభుత్వం నుంచి రూ.వేలల్లో వేతనం తీసుకుంటున్నా అది చాలదనట్టుగా తోటి ఉద్యోగులను వేధించడం, డబ్బులు ఇస్తే గాని ఫైల్ కదలనివ్వడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రిమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో కొంతమంది ఉద్యోగులు ముడుపులు ఇస్తే కానీ ఏ ఫైల్‌ను ముట్టడం లేదని కొంతమంది కాంట్రాక్ట్, అవుట్‌సో ర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో ఓ ఇద్దరు ఉద్యోగులు స్టాఫ్ నర్సుల నుంచి డబ్బులు తీసుకొని సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని మరవక ముందే మరో ఉద్యోగి వసూళ్ల దందాలో తెరపైకి రావడం రిమ్స్‌లో చర్చనీయాంశంగా మారింది. స్టాఫ్‌నర్సుల నుంచి వసూళ్లు.. రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల నుంచి ఓ ఉద్యోగి రూ.1లక్ష 40వేలు వసూలు చేసినట్లు అక్క డ పనిచేస్తున్న కొంతమంది బాధితులు చెబుతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన వీరికి ఫిబ్రవరిలో 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అయితే వీరికి ఇంక్రిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి వీరి దృష్టికి తీసుకొచ్చారు. మొదట రూ.2వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత వెయ్యి పెంచి రూ.3వేలు అడగగా, చివరగా మరో వెయ్యి పెంచి రూ.4వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బులు వసూలుకు సామాజిక మాధ్యమం (వాట్సాప్)లో ఏకంగా ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో మెస్సేజ్ రూపంలో డబ్బులు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. స్టాఫ్‌నర్సుగా పనిచేసే ఓ ఉద్యోగి నగదు రూపంలో వీటిని వసూలు చేసి సదరు ఉద్యోగికి ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తం 36 మందికి గాను 35 మంది డబ్బులు ఇచ్చినట్లు పేపర్‌పై రాసుకొని గ్రూప్‌లో వేశారు. ఇంక్రిమెంట్ కాకపోతే పీఆర్సీ, ఐఆర్‌లో తమ వేతనం పెరగదని భయంతో వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రూప్‌ను డిలీట్ చేశారు. అయితే డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగి టేబుల్‌పై పెట్టిన ఫొటోలు, గ్రూప్ చాటింగ్ మెస్సేజ్‌లు బయటకు రావడంతో సదరు ఉద్యోగి అయోమయానికి గురవుతున్నారు. మంగళవారం ఆ ఉద్యోగి స్టాఫ్ నర్సులందరినీ పిలిపించి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలని, తనకు డబ్బులిచ్చింది ఎవరికి చెప్పవద్దని వారికి సూచించారు. లేకపోతే మీ పని కాదని, తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారిని హెచ్చరించడం గమనార్హం. అయితే విషయం బయటకు పొక్కడంతో ఎవరు బయటకు లీక్ చేశారంటూ ఆరా తీసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. సర్వీసు బుక్‌లో వివరాలు నమోదుకు గాను 2021లో కొత్తగా రిక్రూట్మెంట్ అయిన స్టాఫ్ నర్సుల నుంచి రిమ్స్‌లో కొంతమంది ఉద్యోగులు డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ కథనానికి స్పందించిన అప్పటి కలెక్టర్ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. రిమ్స్‌లో స్టాఫ్ నర్సుల నుంచి ఓ అధికారి డబ్బులు వసూలు చేశారు. తన బర్త్‌డే సందర్భంగా కానుకలు తీసుకున్న విషయం విదితమే. తర్వాత అధికారులు సదరు అధికారిపై విచారణ చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలకు పూనుకోలేదు. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పిస్తానని రిమ్స్‌లో పనిచేసే ఓ ల్యాబ్ అసిస్టెంట్ నుంచి మరో ల్యాబ్ అసిస్టెంట్ రూ.లక్ష 50వేలు వసూలు చేశారు. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అందులో నుంచి కొంత డబ్బులు బాధితుడికి తిరిగివ్వడం జరిగింది. అయితే సదరు ఉద్యోగి నెలలు గడుస్తున్నా ఇంకా విధులకు హాజరుకాకపోవవడం గమనార్హం. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో స్టాఫ్‌నర్సుల ఇంక్రిమెంట్ల కోసం ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. స్టాఫ్ నర్సులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకుంటాను. డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్‌డైరెక్టర్ -
Upi-Paynow Linked: పేనౌతో ఎస్బీఐ జట్టు
ముంబై: యూపీఐ ప్లాట్‌ఫాం ఆధారంగా సీమాంతర చెల్లింపులకు వెసులుబాటు కల్పించే దిశగా సింగపూర్‌కి చెందిన పేనౌతో జట్టు కట్టినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. భీమ్ ఎస్బీఐపే మొబైల్ యాప్ ద్వారా ఈ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. భారత్ నుంచి సింగపూర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ల ద్వారా, సింగపూర్ నుంచి భారత్‌కు యూపీఐ ఐడీ ద్వారా నగదు బదిలీ చేయొచ్చని వివరించింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక రెమిటెన్సులు ఏటా దాదాపు 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. -
కిలాడీ ఆటో డ్రైవర్.. పంజగుట్టకు చేరుకోగానే ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసి..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసిన ఓ ఆటో డ్రైవర్ సదరు వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి గూగుల్ పే ద్వారా రూ. 57 వేల నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్‌కు చెందిన పి.వీరప్రతాప్ సింగరేణి ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చిన అతను అర్జెంట్‌గా మంచిర్యాల వెళ్లే క్రమంలో తెల్లవారు జామున 4:25కు ఈఎస్ఐ వద్ద సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. ఆటో పంజగుట్ట కూడలికి చేరుకోగానే ఆటోడ్రైవర్ వీరప్రతాప్‌ను ఆటోలోనుంచి బలవంతంగా బయటకు నెట్టివేసి ఆటో తీసుకుని బంజారాహిల్స్ వైపు వేగంగా వెళ్లిపోయాడు. వీరప్రతాప్ తేరుకుని కొద్దిసేపు తర్వాత చూసుకోగా అతని సెల్‌ఫోన్ కనిపించలేదు. అర్జెంట్‌గా ఊరు వెళ్లే క్రమంలో అతను మంచిర్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఎటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసేందుకు చూడగా నో బ్యాలెన్స్ చూపించింది. దీంతో మంచిర్యాల యాక్సిస్ బ్యాంకులో సంప్రదించగా తన అకౌంట్ నుండి గూగుల్ పే ద్వారా 57362 రూపాయలు బదిలీ అయినట్లు నిర్ధారించారు. దీంతో తిరిగి నగరానికి వచ్చిన వీరప్రతాప్ శుక్రవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్.. 28 నుంచి కార్యకలాపాలు -
గుడ్‌న్యూస్: కొత్త సేవలు వచ్చాయ్.. ఇలా చేస్తే ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్!
టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా మర్పులే వచ్చాయి. దీంతో కస్టమర్ల ఆర్థికపరమైన పనులన్నీ కూడా చిటికెలో అయిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా డిజిటెల్ చెల్లింపులు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ సేవలకు ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదీ కాక చెల్లింపులు విషయంలో ఏ చిన్న నెట్వర్క్ సమస్యలు తలెత్తిన ఇబ్బందులు తప్పవన్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు ఓ దారి దొరికింది. నెట్వర్క్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు.. ఇటీవల నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఒక్కోసారి ఈ లావాదేవీలు జరుపుతున్న సమయంలో నెట్వర్క్ సమస్యలు వస్తుంటాయి. అయితే నెట్‌వర్క్‌తో పనిలేకుండా కేవలం ఆఫ్‌లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది మనలో చాలా మందికి తెలియదు. భారతదేశంలోని బ్యాంకుల అంతటా యూపీఐ (UPI) సేవలను మరింత మెరుగపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సేవ'ను ప్రారంభించింది. యూజర్లు చేయాల్సిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడమే. ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు.. ఇలా చేయండి ► మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి. ► తరువాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి.కొన్ని సందర్భాల్లో ఐఎఫ్ఎస్ కోడ్ అడుగుతుంది. దాని ప్రకారం, కోడ్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ► ఇది పూర్తికాగానే ఇలా కనిపిస్తుంది.. ►1.Send Money ►2. Request Money ►3. Check Balance ►4. My Profile ►5. Pending Request ►6. Transactions ►7. UPI Pin ► పైన చూపిస్తున్న సేవలలో మీకు ఏది కావాలో అది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు నగదు ఇతరులకు పంపాలనుకుంటున్నారు. డబ్బు పంపేందుకు 1 నంబర్ ఎంటర్ చేయండి. ► ఇప్పుడు మీరు ఏ ఖాతా నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో వివరాలను ఎంచుకోండి. ఇలా.. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేయబడిన లబ్ధిదారుని వివరాలు.. టైప్ చేసి (send) ఎంటర్ చేయండి. ► మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకున్నట్లయితే, రిసీవర్ యూపీఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ► ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న మొత్తం నగదు ఎంటర్ చేసి పంపండి. ► ఆపై మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి (send) ఆప్షన్ క్లిక్ చేయడంతో మీ లావాదేవీ ఇంటర్నెట్ లేకుండా పూర్తవుతుంది. చదవండి: అసలే డిజిటలైజేషన్ డేస్.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం! -
వడ్డిస్తారా? వదిలేస్తారా?
చూస్తూ చూస్తుండగానే వామనుడు త్రివిక్రమావతారం దాల్చడమంటే ఇదే! ఆరేళ్ళ క్రితం 2016 జూలైలో నెలకు కేవలం కోటి రూపాయల లోపలున్న ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (యూపీఐ) లావాదేవీల విలువ ఈ జూలైలో ఏకంగా రూ. 10.6 లక్షల కోట్ల స్థాయికి చేరింది. సామాన్యులు, పేదలకు సైతం బ్యాంకింగ్‌ను అందుబాటులోకి తెచ్చి, చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తో రోజువారీ లావాదేవీలను జరిపే సాంకేతికతను అందించడం అపూర్వ విజయమే! ప్రపంచంలోని దేశదేశాలు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి, ఇండియా వైపు తిరిగి చూసేలా చేసిన డిజిటల్ చెల్లింపుల విప్లవమిది. ఈ యూపీఐ చెల్లింపులపై సర్వీస్ ఛార్జ్ వేయాలా, వద్దా అన్నది తాజా ప్రశ్న. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చర్చాపత్రం గత వారం ఈ అంశాన్ని లేవనెత్తింది. రాజకీయ విమర్శలకు వెరచి, ఆర్థికశాఖ తక్షణమే బరిలోకి దిగింది. భారం మోపే ఆలోచనను కొట్టిపారేసింది. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి దేశంలో ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ వ్యాలెట్లు – ఇలా అనేక వ్యవస్థలున్నాయి. ఆర్బీఐ పక్షాన డిజిటల్ కరెన్సీ సైతం రానుంది. భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్పీసీఐ) వారి ‘యూపీఐ’ పల్లెపల్లెకూ పాకి, మొత్తం రిటైల్ నగదు బదలీల్లో 82 శాతం వాటా దక్కించుకోవడానికి పలు కారణాలు. మొబైల్ ఇంటర్నెట్ విప్లవం, బాదరబందీలు లేని బ్యాంకు ఖాతాల ‘జన్‌ధన్ యోజన’, నగదు రహిత చెల్లింపులపై సర్కారు మొగ్గు... ఇలా అనేకం ఈ విజయగాథ వెనక ఉన్నాయి. యూపీఐలో అప్పటికే నిర్ధారించిన ఫోన్ నంబర్ల ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదలీ అవుతుంది. డబ్బు అందుకున్నవారు సదరు లావాదేవీ విలువలో 0.3 శాతాన్ని (తక్కువలో తక్కువ రూ. 100) రుసుముగా గతంలో చెల్లించాల్సి వచ్చేది. నగదు రహిత లావాదేవీల్ని పెంచడానికి 2020 జనవరిలో ప్రభుత్వం ఆ ఫీజును తొలగించింది. అప్పటి నుంచి యూపీఐ తారాపథాన్ని తాకింది. ప్రజలపై భారం ఎత్తేసినా, అసలంటూ యూపీఐ కార్యకలాపాల నిర్వహణకైతే 0.25 శాతం మేర ఖర్చవుతున్నట్టు ఆర్బీఐ అంచనా. ఆర్థిక మధ్యవర్తులకు పడే ఆ లోటును కేంద్ర నిధులతో సర్కారు భర్తీ చేస్తూవస్తోంది. ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్ లానే యూపీఐ నిర్వహణ భారాన్నీ జనంపై వేయాలని ప్రతిపాదన. సుమారు రూ. 800 విలువైన లావాదేవీకి ఇచ్చే బ్యాంకు, తీసుకొనే బ్యాంకు, ఎన్పీసీఐ, యూపీఐ యాప్‌లు అన్నింటికీ కలిపి రూ. 2 ఖర్చవుతుందట. ప్రతి సేవకూ కొంత ఖర్చయ్యే మాట నిజమే. అలాగని అన్నిటికీ రుసుము వసూలు చేస్తామనడం సరికాదు. కొన్ని సేవలకు పబ్లిక్ సబ్సిడీ అవసరం. ఇవాళ యూపీఐ సేవలు లాంటివే. ఏ వ్యవస్థ అయినా నిలదొక్కుకోవాలంటే, అది వాడే వారికి భారం కాకూడదనేది సాధారణ సూత్రం. ఛార్జీల్లేని యూపీఐ మరింత కాలం కొనసాగాలం టున్నది అందుకే. వినియోగదారులకు సౌకర్యం, మన ఆర్థిక వ్యవస్థకు ఒనగూరే లబ్ధి రీత్యా చూస్తే యూపీఐ ‘డిజిటల్ జనహిత’ వ్యవస్థ. ఆర్థిక శాఖే ఆగస్టు 21న ఆ మాట అన్నది. నిర్ణీత అవసరాన్ని తీరుస్తూ, ఎవరైనా వాడుకొనేలా ఉచితంగా అందుబాటులో ఉంటేనే ప్రజాశ్రేయో వ్యవస్థ. లేదంటే అది కొందరి స్వలాభానికే పరిమితమై, చివరకు సంక్షేమం క్షీణిస్తుందని ఆర్థిక శాస్త్రవేత్తల హెచ్చరిక. నల్లధనం చెల్లింపులకు చోటివ్వకుండా, పారదర్శకమైన డిజిటల్ మార్గంలో పురోగమించడం దేశానికి మంచిదని భావిస్తున్న కేంద్రం దీని నిర్వహణ వ్యయాన్నీ భరించాలి. పోనుపోనూ అది బరువయ్యే మాట నిజమే. వచ్చే 2023–24 నాటికి డిజిటల్ చెల్లింపులు ఏటా రూ. 120 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. ప్రభుత్వ సబ్సిడీ బిల్లు రూ. 30 వేల కోట్ల పైకి ఎగబాకవచ్చు. కానీ, సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వాలు ఆ భారానికి సిద్ధపడాలి. యూపీఐ లావాదేవీల్లో 1.4 శాతానికి పైగా విఫలమవుతున్నాయనీ, ఇటీవల ఆ రేటు పెరుగుతోందనీ, ఈ చెల్లింపు వ్యవస్థను దీర్ఘకాలం సమర్థంగా నడపాలంటే వినియోగ ఛార్జ్ తప్పదనే వారున్నారు. ఒకవేళ రేపు తప్పనిసరై ఛార్జ్ చేయాల్సి వచ్చినా ఇటు కస్టమర్ల, అటు ఆపరేటర్ల ప్రయోజనాల సమతూకంతో దాన్ని నిర్ణయించాలి. నిర్ణీత మొత్తం లోపల ఛార్జ్ మినహాయించడం ఒక మార్గం. లేదంటే నెలకు నిర్ణీత యూపీఐ లావాదేవీలు ఉచితమంటూ, అది దాటితేనే ఛార్జ్ అన్నది మరో మార్గం. ప్రతి యూపీఐ లావాదేవీకీ ఒక పైసా వంతున స్వల్పఛార్జ్ వసూలు చేసినా, ఈ జూలైకి ముగిసిన ఏడాదికి రూ. 5,842 కోట్ల ఆదాయం వచ్చేదని కొందరు లెక్కలు కడుతున్నారు. వెయ్యిసార్లు యూపీఐ వాడితే... కస్టమర్ పది రూపాయలే చెల్లించాల్సి వస్తుందనీ, ఈ నామ మాత్రపు రుసుముతో కొత్త ఆవిష్కరణలకూ, మెరుగుదలకూ వీలుంటుందనీ చెబుతున్నారు. పైకి ఇవన్నీ బాగానే ఉన్నా, కొన్నదానికీ, తిన్నదానికీ జీఎస్టీ సహా రకరకాల పన్నులు కడుతున్న ప్రజలు తమ నగదు చెల్లింపులకూ సర్కార్ వారి బాదుడు ఆలోచనను స్వాగతిస్తారా అన్నది ప్రశ్న. ఫలితంగా వారు మళ్ళీ డిజిటల్ కన్నా నగదు చెల్లింపుల వైపే మొగ్గే ప్రమాదం ఉంది. పెద్ద మొత్తాల బదిలీకి వాడే ఇతర ఆన్లైన్ చెల్లింపు విధానాలకు పాలకులు సబ్సిడీ ఇవ్వకున్నా ఫరవాలేదేమో కానీ, కోట్లాది సామాన్యుల్ని డిజిటల్ వైపు నడిపించిన యూపీఐని అపురూపంగా చూసుకోవడం ప్రస్తుతం అవసరం. అతి ఛార్జీలతో ఆన్లైన్ చెల్లింపుల్ని నిరుత్సాహపరిస్తే డిజిటల్ లక్ష్యమే దెబ్బ తింటుంది. కథ మళ్ళీ మొదటికి వస్తుంది! -
బ్రిటన్ వెళ్లే భారతీయలుకు శుభవార్త.. ఓ సమస్య తీరింది!
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) తాజాగా బ్రిటన్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యూపీఐని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్లో భాగమైన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్) చెల్లింపు సేవల సంస్థ పేఎక్స్‌పర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం బ్రిటన్‌లో పేఎక్స్పర్ట్కి చెందిన ఆండ్రాయిడ్ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాలు ఉండే స్టోర్స్‌లో యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. బ్రిటన్‌కు వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని, ఎన్ఐపీఎల్ తెలిపింది. యూపీఐ విధానం ఇప్పటికే భూటాన్, నేపాల్‌లో కూడా అందుబాటులో ఉంది. చదవండి: భారత్‌లో యాప్స్, గేమ్స్‌కి పెరిగిపోతున్న క్రేజ్! -
పేటీఎం సేవల్లో అంతరాయం, యాప్‌లో మీ డబ్బులు ఆగిపోయాయా?
దేశ వ్యాప్తంగా ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం సేవలు స్తంభించిపోయాయి. యాప్‌లో లాగిన్ సమస్యలు ఉత్పన్నం కావడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ యాప్‌లో,వెబ్సైట్లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆటోమెటిక్‌గ్గా లాగవుట్ అవుతుందని ట్విట్టర్లో పేటీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో పేటీఎం యూజర్లు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో జాగ్రత్తలు వహించాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంస్థకు సంబంధించిన సేవల అంతరాయాల్ని గుర్తించే డౌన్ డిక్టేటర్ సైతం దేశ వ్యాప్తంగా యూజర్లు పేటీఎం యాప్ నుంచి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. దేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో పేటీఎం యాప్ పని తీరు మందగించినట్లు తన నివేదికలో పేర్కొంది. Due to a network error across Paytm, a few of you might be facing an issue in logging into the Paytm Money App/website. We are already working on fixing the issue at the earliest. We will update you as soon as it is resolved — Paytm Money (@PaytmMoney) August 5, 2022 నెట్వర్క్ ఎర్రర్ పేటీఎం సేవల్లో అంతరాయం కలగడంపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించింది. నెట్ వర్క్ ఎర్రర్ వల్లే ఈ సమస్య ఏర్పడిందని తెలిపింది. అయితే ఇప్పుడా నెట్ వర్క్ ఇష్యూని పరిష్కరించామని పేటీఎం ట్వీట్ చేసింది. ఐటీ సిబ్బంది ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ట్వీట్ చేసింది. We understand that few of our Trading & F&O users would have faced real issues with their trades & positions. In our continued efforts to always have your back & to be fair & transparent, we request you write to us over email at exg.support@paytmmoney.com with your concerns (2/5) — Paytm Money (@PaytmMoney) August 5, 2022 ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోలేం యూజర్ల అంతరాయానికి చింతిస్తున్నాం. యాప్, వెబ్ సైట్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాం. యాప్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే సమయంలో నెట్ వర్క్ సమస్య, మనీ స్ట్రక్ అవ్వడంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు ట్వీట్లు చేస్తున్నారు.ఈ క్లిష్ట సమయాల్లో ఆ ట్వీట్లను పరిగణలోకి తీసులేం. తమకు ఫిర్యాదు చేయాలనుకుంటే 'సపోర్ట్@పేటీఎంమనీ.కాం.' కు మెయిల్ చేయాలని కోరింది. -
అమెరికాలో మరో భారతీయుని అరెస్టు
వాషింగ్టన్: అమెరికాలో సీనియర్ సిటిజన్ల ఖాతాలను దోచేసిన కేసులో తాజాగా మరో భారతీయుడు అరెస్టయ్యాడు. వర్జీనియాకు చెందిన అనిరుధ్ కల్‌కోటెను (24) శుక్రవారం హూస్టన్‌లో కోర్టులో హాజరుపరిచారు. సీనియర్ సిటిజన్ల నుంచి డబ్బులు దోచేందుకు వారికి కొందరు బెదిరింపు మెయిల్స్ పంపడం, ఇవ్వకుంటే దాడులకు దిగుతామని హెచ్చరించడం వంటివి చేశారు. హూస్టన్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్న కొందరు భారతీయులు ముఠాగా ఏర్పడి వెస్ట్రన్ యూనియన్, మనీగ్రాం వంటి ట్రాన్స్మిటర్ బిజినెస్‌ల లింకులు పంపి వృద్ధుల ఖాతాల్లోని సొమ్ము కాజేశారు. మహమ్మద్ ఆజాద్ (25) అనే వ్యక్తితో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడన్నది అనిరుధ్‌పై అభియోగం. ఆజాద్‌ను 2020లోనే అరెస్టు చేశారు. నేరాలు రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష, 20 వేల డాలర్ల జరిమానా పడొచ్చు. -
డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలదే హవా!,10 ట్రిలియన్ డాలర్లకు!
ముంబై: ప్రజలు నగదు రహిత చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి నిదర్శనం ప్రస్తుతం ప్రతీ 10 లావాదేవీల్లో నాలుగు డిజిటల్ రూపంలోనే నమోదవుతున్నాయి. 2026 నాటికి యూపీఐ తదిర నగదు రహిత లావాదేవీల వాటా 65 శాతానికి చేరుకుంటుందని బీసీజీ, ఫోన్‌పే సంయుక్త నివేదిక అంచనా వేసింది. అలాగే, 2026 నాటికి డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ 10 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని.. అది ప్రస్తుతం 3 ట్రిలియల్ డాలర్ల స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. 2020–21 నాటికి దేశ ప్రజల్లో 35 శాతం మందికే చేరువ అయిన యూపీఐ చెల్లింపుల సేవలు వచ్చే ఐదేళ్ల కాలంలో 75 శాతం ప్రజలను చేరుకుంటాయని పేర్కొంది. కరోనా అనంతరం దేశంలో యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ అంశంపై నివేదిక వెలువడడం గమనార్హం. మర్చంట్ పేమెంట్స్ ప్రస్తుత స్థాయి నుంచి ఏడు రెట్లు పెరిగి 2026 నాటికి 2.5–2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని పేర్కొంది. మరింత మంది మర్చంట్లు (వర్తకులు) డిజిటల్ చెల్లింపులను అమోదిస్తే.. చిన్న వర్తకులకు రుణ సదుపాయం విషయంలో పెద్ద మార్పు కనిపిస్తుందని బీసీజీ ఎండీ ప్రతీక్ రూంగ్తా చెప్పారు. చిన్న పట్టణాల నుంచి తదుపరి డిజిటల్ పేమెంట్స్ వృద్ధి టైర్ 3 నుంచి టైర్ 6 పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. గత రెండేళ్ల కాలంలో కొత్త కస్టమర్లలో 60–70 శాతం ఈ పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ చెల్లింపులను వర్తకులు ఆమోదించేలా వారిని ప్రోత్సహించాలని.. ఇందుకు వీలుగా స్థిరమైన మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. తక్కువ విలువ లావాదేవీలపై ఎండీఆర్ రేటు 0.2–0.3 శాతం ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని సూచించింది. అప్పుడు బ్యాంకులు, పేమెంట్ సంస్థలు వ్యాపారాన్ని కొనసాగించడానికి వీలుంటుందని పేర్కొంది. ‘‘డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడం బ్యాంకులపై ఒత్తిడిని పెంచుతోంది. కొన్ని బ్యాంకులు డిమాండ్‌ను తట్టుకోలేకున్నాయి. యూపీఐ లావాదేవీల వైఫల్యానికి ఇదే కారణం. అందుకుని బ్యాంకులు కోర్ బ్యాంకింగ్‌కు వెలుపల క్లౌడ్ తదితర ఆప్షన్లను పరిశీలించాలి’’ అని ఈ నివేదిక సూచించింది. -
అదృష్టం తలుపుతట్టి అంతలోనే అదృశ్యం
వికారాబాద్ అర్బన్/దస్తురాబాద్/మంథని: అదృష్టలక్ష్మి తలుపు తట్టి అంతలోనే అదృశ్యమైంది. కోటీశ్వరులం అయ్యామనే ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైంది. వికారాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లోని పలువురు హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు అకౌంట్లలో అప్పనంగా రూ. కోట్లు జమయ్యాయి. టెక్నికల్ సమస్య వల్లే డబ్బులు జమ అయ్యాయని తెలుసుకున్న బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఖాతాలను స్తంభింపజేశారు. వికారాబాద్‌లోని సెవెన్ హిల్స్ మొబై ల్స్ యజమాని వెంకట్‌రెడ్డికి హెచ్డీఎఫ్సీ స్థానిక బ్రాంచ్‌లో కరెంట్ అకౌంట్ ఉంది. ఆదివారం రాత్రి తన అకౌంట్లో రూ.18.52 కోట్లు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. మరునాడు ఉదయం బ్యాంకు అధికారులకు విషయం చెప్ప డంతో వెంటనే అతడి ఖాతాను స్తంభింపజేశారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజిపేటకి చెందిన వంగల సాయి అనే యువకుడికి నిర్మల్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉంది. రూ.1,27,07,978 జమ అయినట్లు ఫోన్‌కు సమాచారం రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నిజమా కాదా అనే అనుమానంతో ఖాతా నుంచి రూ.లక్ష మరో ఖాతాకు బదిలీ చేశాడు. ఆ వెంటనే బ్యాంకు ఖాతా స్తంభించిపోయింది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇల్లందుల సాయి అనే మొబైల్ షాపు నిర్వాహకుడికి స్థానిక హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉంది. ఆయన ఖాతాలో రూ.5.68 కోట్లు జమ అయినట్లు ఆదివారం మెసేజ్ వచ్చింది. 6 గంటల అనంతరం అవి వెనక్కి వెళ్లాయి. పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడంతో మొదట ఆనందం వేసినా.. ఆ డబ్బు ఎవరైనా కావాలనే వేశారా..? అని భయపడ్డానని సాయి తెలిపాడు. -
నవ్వితే చాలు అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయ్!
నవ్వు గురించి ఓ సినిమాలో "నవ్వవయ్యా బాబూ నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుందనే" పాట విని ఉంటాం. ఆ పాట సంగతి అటుంచితే టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు నిజంగానే నవ్వితే చాలు అకౌంట్లో ఉన్న మన సొమ్ము మాయం కానుంది. మన అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ కానుంది. ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఫైనాన్షియల్ సర్వీస్ దిగ్గజం మాస్టర్ కార్డ్ యూజర్లకు అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. మాస్టర్ కార్డ్ వినియోగదారులు పేమెంట్ చేసేందుకు బయో మెట్రిక్ తంబ్ లేదంటే నవ్వితే చాలు కార్డ్, స్మార్ట్ ఫోన్, టెలిఫోన్‌తో అవసరం లేకుండా మరో అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేయోచ్చు. ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్‌ను బ్రెజిల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త టెక్నాలజీతో బెన్ఫిట్స్ ఏంటంటే! ఈ కొత్త టెక్నాలజీతో కరోనాలాంటి వైరస్ల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉంచడంతో పాటు సెక్యూర్‌గా మరింత ఫాస్ట్‌గా డబ్బుల్ని మాస్టర్ కార్డ్ తెలిపింది. నేటి ఆధునిక జీవన శైలికి తగ్గట్లుగా వేగంగా పేమెంట్ సేవలందించేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాం. ఇదే సమయంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశామని మాస్టర్ కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. కేబీవీ రీసెర్చ్ ఏం చెబుతోంది 2026 నాటికి ఈ కాంటాక్ట్ లెస్ బయో మెట్రిక్ టెక్నాలజీ బిజినెస్ 18.6బిలియన్ డాలర్లకు చేరుకోనుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కేబీవీ రీసెర్చ్ తెలిపింది. అయితే మాస్టర్ కార్డ్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త సౌకర్యం ఇప్పటికే వీసా, అమెజాన్లు అభివృద్ధి చేశాయని తెలిపింది. చదవండి👉ఏటీఏం కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త! -
న్యూయర్ గిఫ్ట్..బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2000; మీకు వచ్చాయో లేదో చెక్ చేసుకోండి ఇలా..!
ప్రధాన మంతి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతులకు నూతన సంవత్సర కానుకను అందించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకం కింద 10వ విడత నగదును రైతుల ఖాతాల్లోకి జమచేసింది. సుమారు 10 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ. 20,000 కోట్లకు పైగా నగదు బదిలీని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. అట్టడుగు రైతులకు సాధికారత కల్పించాలనే ప్రధాని మోదీ నిబద్ధత, సంకల్పానికి అనుగుణంగా నగదు బదిలీ జరిగిందని ప్రధాన మంత్రి కార్యాలయం పీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఇవ్వనుంది. నాలుగు-నెలల వాయిదాలలో రూ. 2,000 చొప్పున ప్రభుత్వం రైతులకు చెల్లిస్తోంది. ఈ పథకంలో భాగంగా రైతులకు ఇప్పటివరకు రూ. 1.6 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. అయితే పదో విడత నగదు ఖాతాలో పడ్డాయో లేదో అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొందరికి ఎస్ఎమ్ఎస్ రూపంలో మెసేజ్ లు కూడా వస్తాయి. ఒకవేల మెసేజ్ రాకపోతే ఈ క్రింది విధంగా చెక్ చేస్తే సరిపోతుంది. స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా..! పీఏం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ pmkisan.gov.inకు వెళ్లి, మెనూ బార్ లో ఉన్న 'ఫార్మర్స్ కార్నర్' పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి (ఎ) ఆధార్ సంఖ్య, (బి) బ్యాంక్ ఖాతా సంఖ్య, (సి) మొబైల్ నంబర్. ఇందులో ఏదైనా ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు చెల్లింపు చెక్కు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, మీరు 'గెట్ డేటా' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నగదు జమ అయ్యిందో లేదో మీకు చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఎఫ్టీ(రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్)ని ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ఎఫ్‌టిఒ(ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) కనిపిస్తుంది. ఒకవేల మీకు రాకపోతే ముందుగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి. అలాగే, పీఏం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉంటేనే నగదు వస్తాయనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. చదవండి: గుడ్‌న్యూస్! గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు -
APSSDC Scam: హవాలా దారిలో ‘పెద్దలకు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.242 కోట్ల చిక్కుముడి వీడుతోంది. గత సర్కారు హయాంలో వర్సిటీలు, కాలేజీలకు పరికరాలు సరఫరా చేసినందుకు నిధులు చెల్లించామన్న వాదన కట్టుకథేనని తేటతెల్లమవుతోంది. చంద్రబాబు సర్కారు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.242 కోట్లు హవాలా మార్గంలో తిరిగి ‘పెద్దలకే’ చేరాయని స్పష్టమైంది. 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు వ్యక్తం చేసిన సందేహాలు నిజమేనని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. చదవండి: ‘స్కిల్’ స్కామ్‌లో షెల్.. షా హవాలా దారిలో రూ.242 కోట్లు కాంట్రాక్టు నిబంధనలను పాటించకున్నా గత ప్రభుత్వం డిజైన్‌టెక్ కంపెనీకి పూర్తి సానుకూలంగా వ్యవహరించింది. నిబంధనల ప్రకారం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు 90% నిధులు సమకూర్చాలి. అయితే ఒక్క శాతం కూడా వెచ్చించకున్నా టీడీపీ సర్కారు తన వాటాగా రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది. అందులో రూ.242 కోట్లను డిజైన్ టెక్ బోగస్ కంపెనీ స్కిల్లర్కు చెల్లించింది. స్కిల్లర్ ఆ నిధులను ఏసీఐ అనే మరో షెల్ కంపెనీకి మళ్లించింది. నకిలీ ఇన్వాయిస్లతో బురిడీ కొట్టించిన ఏసీఐ కంపెనీ రూ.242 కోట్లను మళ్లీ డిజైన్ టెక్ ఖాతాలోనే వేసింది. ఆ నిధులను డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధులు విత్‌డ్రా చేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అంత మొత్తాన్ని విత్‌డ్రా చేసినప్పటికీ కంపెనీ రికార్డుల్లో ఎలాంటి ఎంట్రీలు లేకపోవడం గమనార్హం. రూ.242 కోట్లను హవాలా మార్గంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు డిజైన్ టెక్ ప్రతినిధులు చేరవేసినట్లు స్పష్టమైంది. అందుకే వాటికి సంబంధించి రికార్డుల్లో ఎలాంటి ఎంట్రీలు లేవు. ఇలా ఈ నిధులు గత సర్కారు పెద్దల జేబుల్లోకి చేరిపోయాయి. ఆనాడే గుర్తించిన కేంద్ర జీఎస్టీ... కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పుణెలోని షెల్ కంపెనీలపై దాడులు నిర్వహించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏఐసీ, స్కిల్లర్ తదితర కంపెనీలు సమర్పించిన ఇన్వాయిస్లన్నీ నకిలీవేనని జీఎస్టీ అధికారుల దాడుల్లో నిర్ధారణ అయ్యింది. తాము ఏపీఎస్ఎస్డీసీకి ఎలాంటి హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సరఫరా చేయలేదని ఆ రెండు కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు. తమ రికార్డుల్లో చూపిస్తున్న రూ.242 కోట్ల లావాదేవీలన్నీ కల్పితాలేనని వెల్లడించారు. కేంద్ర జీఎస్టీ అధికారులు ఇదే విషయాన్ని 2018లోనే టీడీపీ సర్కారు దృష్టికి తెచ్చారు. రూ.242 కోట్లు దారి మళ్లాయని స్పష్టం చేశారు. దీనిపై గత సర్కారు ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చింది. తాజాగా సీఐడీ అధికారుల దర్యాప్తులో ఆ అవినీతి బండారం బట్టబయలైంది. షా అరెస్టుతో టీడీపీ నేతల్లో గుబులు.. ముంబైకి చెందిన షెల్ కంపెనీల సృష్టికర్త శిరీష్ చంద్రకాంత్ షా అరెస్టుతో టీడీపీ పెద్దల్లో ఆందోళన మొదలైంది. రూ.242 కోట్లు హవాలా మార్గంలో తరలించిన ఉదంతంలో తమ పేరు వెలుగులోకి వస్తోందని కలవరం చెందుతున్నారు. చంద్రకాంత్ షా సృష్టించిన షెల్ కంపెనీల ద్వారానే ఏపీఎస్ఎస్డీసీతోపాటు మరికొన్ని శాఖల్లో కుంభకోణాల నిధులను పక్కాగా దారి మళ్లించినట్టు తెలుస్తోంది. -
వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై అందరు వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. వాట్సాప్ ఈ సదుపాయాన్ని గతేడాది అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామందికి ఆ ఫీచర్ అందుబాటులోకి రాకపోవడంతో పాటు పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఏడాది కాలంగా "వాట్సాప్ పే" ఫీచర్‌పై వర్క్ చేస్తుంది. తాజాగా ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చిందని, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది. కాగా, ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ) సహకారంతో ఇండియాలోనే తొలిసారిగా 160 బ్యాంక్‌ల మద్దతుతో వాట్సాప్పే ఫీచర్ పనిచేస్తుంది. వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలంటే ♦ ముందుగా వాట్సాప్ సెట్టింగ్ మెనూ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ♦ ట్యాప్ చేసిన వెంటనే మనకు యాడ్ న్యూ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ♦ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ... 160 బ్యాంక్‌ల లిస్ట్ చూపిస్తుంది ♦ ఆ లిస్ట్ లో మీకు కావాల్సిన బ్యాంక్ నేమ్ పై క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ను వెరిఫై చేయాలి ♦ వెరిఫై చేసే సమయంలో బ్యాంక్ కు లింక్ చేసిన ఫోన్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. ♦ ఒక వేళ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ♦ బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసి మీరు డబ్బుల్ని మీ వాట్సాప్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు -
రైతుబంధు సహాయం మరొకరి ఖాతాలోకి..
సాక్షి, తాండూరు: వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో ఓ మహిళ రైతుబంధు డబ్బులు మరొకరి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. సంబంధిత రైతు ఖాతాలో పడాల్సిన డబ్బులు హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి ఖాతాలో పడ్డాయి. తాండూరు మండలం గౌతపూర్ గ్రామానికి చెందిన జెన్నె ఎల్లమ్మకు అల్లాపూర్ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 200, 201లో 4.35 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేస్తూ ఆమె జీవిస్తోంది. అయితే ఆమెకు అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి సహాయం ఆమె ఖాతాలో జమ కాలేదు. తనకు డబ్బులు పడలేదని ఆమె వ్యవసాయ అధికారులు, ఆంధ్రాబ్యాంక్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. అయితే ఆమెకు రావాల్సిన 2018, 2019 కు సంబంధించిన రైతుబంధు డబ్బులు ఆమె ఖాతాలో కాకుండా ఇతరుల ఖాతాల్లో పడ్డాయని సమాచారం తెలిసింది. హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌కు సంబంధించిన సిండికేట్ బ్యాంక్ ఖాతా ఉన్న ఓ వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఎల్లమ్మ కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి సిండికేట్ బ్యాంకులో వెళ్లి నగదు విషయమై బ్యాంక్ అధికారులను అడగ్గా తిరస్కరించారు. దీంతో ఎల్లమ్మ తాండూరులోని వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతుబంధు డబ్బుల కోసం తిరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ ఉన్నతాధికారులు స్పందించి రైతుబంధు డబ్బులు ఎల్లమ్మ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు. -
అంత డబ్బు ఎలా ఇచ్చేస్తారండీ!
న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ నిధుల బదలాయింపుపై అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్బీఐ అదనపు నిధుల బదలాయింపును ప్రస్తావిస్తూ, ‘‘ఇది తీవ్ర ఆందోళనకర అంశం’’ అని పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్బీఐ అదనపు బ్రాంచ్ ఆఫీస్ (ఎక్స్టెన్షన్ కౌంటర్) కారాదని స్పష్టంచేసింది. ఒక స్వతంత్ర సంస్థగా ఆర్బీఐ ఏర్పాటయ్యిందని పేర్కొంటూ, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, విదేశీ అనిశ్చితి పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ, ద్రవ్య స్థిరత్వం, దవ్య లభ్యత, సరఫరాల్లో ఇబ్బందులు లేకుండా చూడ్డం వంటివి ఆర్బీఐ ప్రధాన లక్ష్యాలుగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఆర్బీఐ మిగులు నిధులను కేంద్రానికి బదలాయింపులపై ఏర్పాటయిన బిమల్ జలాన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్బీఐ ఆమోదించిన నేపథ్యంలో ఏఐబీఈఏ తాజా వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1,23,414 కోట్లు మిగులు లేదా డివిడెండ్ రూపంలో, మరో రూ. 52,637 కోట్లు మిగులు మూలధనం రూపంలో మొత్తం రూ.1,76,051 కోట్లను కేంద్రానికి బదలాయించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఎంవీఐ లంచం.. వయా గూగుల్ పే
సాక్షి, కరీంనగర్ : రవాణాశాఖ కరీంనగర్ జిల్లా పరిధిలో ఆయనే సుప్రీం. పేరుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) అయినా... రవాణా శాఖ జిల్లా అధికారికి తగ్గని స్థాయి ఆయనది. జిల్లాల పునర్విభజన తరువాత నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిమితమైన కరీంనగర్‌కు ఆయనొక్కడే ఎంవీఐ. ఐదేళ్లుగా రెగ్యులర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ లేరు. ప్రస్తుతం ఆదిలాబాద్ డీటీసీ శ్రీనివాస్ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీఐదే ఇష్టారాజ్యం. మూడేళ్లలో పదవీ విరమణ చేయాల్సిన ఆయన వాహనాల తనిఖీ పేరిట సాగించే అవినీతి దందాకు సరికొత్త విధానాన్ని ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నగదు రహిత లావాదేవీల విధానాన్ని లంచం వసూళ్లకు కూడా వాడుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నుంచి వసూలు చేసే అపరాధ రుసుమును ‘గూగుల్ పే’ ద్వారా చెల్లించాలని డ్రైవర్లకు ఆదేశాలిచ్చారు. అయితే అది వెళ్లేది మాత్రం రవాణా శాఖకు కాకుండా సొంతానికి. ఇందుకోసం ప్రైవేటు సైన్యాన్ని కూడా నియమించుకున్నట్లు సమాచారం. ఇటీవల తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం ఎంపీటీసీ భర్త అశోక్‌రెడ్డి నుంచి రూ.5 వేలు గూగుల్‌పే యాప్ ద్వారా ఎంవీఐ లంచం తీసుకున్నాడు. అలాగే వాహన తనిఖీ పేరిట పెద్ద ఎత్తున డబ్బులు పలు ఖాతాల్లో జమ చేయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు అశోక్‌రెడ్డి డీటీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, మీడియాలో రవాణా శాఖలో జరుగుతున్న దందాపై కథనాలు రావడంతో కరీంనగర్ ఇన్చార్జి డీటీసీ శ్రీనివాస్ సదరు ఎంవీఐని రవాణాశాఖ కమిషనర్‌కు సరెండర్ చేశారు. ఎంవీఐ గౌస్‌పాషా సరెండర్ కరీంనగర్ జిల్లా రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్‌పాషాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను రవాణాశాఖ కమిషనర్‌కు సరెండర్ చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి డీటీసీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనలు, ఇతర ఫిర్యాదుల మేరకు జరిపిన ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిన అంశాల ఆధారంగా గౌస్‌పాషాను సరెండర్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గుర్తించిన అంశాలపై పూర్తిస్థాయిలో రవాణాశాఖ కమిషనర్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కాగా, గౌస్‌పాషా సరెండర్‌తో ప్రస్తుతం జిల్లాలో రెగ్యులర్ ఎంవీఐ లేకుండా పోయినట్లయింది. మూడేళ్ల సర్వీస్.. పర్సనల్ గార్డుల నియామకం సరెండర్ అయిన వీఎంఐకి ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉంది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న కాలంలో అందిన కాడికి దండుకోవాలనే ఆలోచనతో నిత్యం వాహనాల తనిఖీ పేరిట వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. డీటీసీకి సైతం సమాచారం ఇవ్వకుండా తనే వాహనంలో వెళ్లి తనిఖీల దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులను గార్డులుగా నియమించుకొని మరీ వాహనాలను నిలిపివేయించి, నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరైనా మీరెవరు..? మీ గుర్తింపు కార్డేది? అని ప్రశ్నిస్తే వెంటనే ఎంవీఐకి ఫోన్‌చేసి మాట్లాడిస్తారు. అధికారి స్వయంగా మాట్లాడి తానే వారిని నియమించానని, మీ పత్రాలు చూపించి వెళ్లాలని చెప్పి... వారికి డబ్బులు ఇచ్చి వెళ్లాని ఆదేశించేవారని తెలిసింది. ఇటీవల కూడా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో సదరు పర్సనల్ హోంగార్డులు వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై గతంలో కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. కొత్తగూడెంలో పనిచేసిన సమయంలోనూ ఇదేరీతిన వ్యవహరించినట్లు సమాచారం. గూగుల్ పేతో పలు నెంబర్లకు మనీ ట్రాన్స్ఫర్ రవాణా అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఎంవీఐ లంచం తీసుకున్నాడని నిర్ధారణ అయినట్లు తెలిసింది. తన చేతికి కరెన్సీ నోట్లు అంటని విధంగా... నేరుగా డబ్బులు తీసుకోకుండా ‘గూగుల్ పే’ ద్వారా పలు బినామీ నంబర్లకు మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు తేలింది. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. వాహనాల తనిఖీలో నిబంధనలు పాటించని వాహనాలపై వేసే అపరాధ రుసుము ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సి ఉండగా... తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు తేలింది. గతమంతా అవినీతిమయమే.. కరీంనగర్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంవీఐ గత చరిత్ర కూడా అవినీతిమయమే అని తెలుస్తోంది. గతంలో కొత్తగూడెం రవాణా శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించిన సమయంలో వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీకి పట్టుపడ్డట్టు సమాచారం. దీంతో రవాణా అధికారులు ఈయనతోపాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. దీంతో ఆయన ఉన్నతాధికారులు, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని తిరిగి విధుల్లో చేరారు. అతడిని విధుల్లోకి తీసుకున్న అధికారులు కరీంనగర్ రవాణా కార్యాలయానికి బదిలీ చేశారు. -
స్మగ్లింగ్ స్పెషలిస్ట్
సాక్షి, సిటీబ్యూరో: ‘జీరో నెంబర్’ దందా చేసే మైసూర్ వాసి రాజు నాంగ్రే పసిడి, డబ్బు రవాణాలు కారుల్లో ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి డ్రైవర్లుగా పని చేసే వారికి ఓ కీలక విషయంలో తర్ఫీదు కూడా ఇచ్చాడు. వివిధ రాష్ట్రాలకు తిరిగే వీళ్ళు ఏదైనా నేరం బారినపడితే స్థానిక పోలీసులకు ఇచ్చే ఫిర్యాదులో ఎక్కడా బంగారం, డబ్బు విషయం ప్రస్తావించకుండా కౌన్సిలింగ్ చేశాడు. ‘పన్ను’పోటు తప్పించుకోవడానికే ఈ ఎత్తులు వేశాడు. ఫలితంగానే గతంలో కేరళ, కర్ణాటక పోలీసులతో కలిసి మేనేజ్ చేసుకుంటూ తన దందాను రికార్డుల్లోకి ఎక్కించలేదు. ఈసారి నేరం సైబరాబాద్‌లో జరగడంతో అతడికి ఆ చాన్స్ లేకుండా పోయింది. షాద్‌నగర్ ఠాణా పరిధిలోని రాయకల్ టోల్‌ప్లాజా సమీపంలో గత నెల 28న జరిగిన బందిపోటు దొంగతనం కేసులో ఉన్న కీలకాంశమిది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల్ని సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. అక్రమ బంగారంగా అనుమానం... మహారాష్ట్రకు చెందిన రాజు నాంగ్రే మైసూర్లో స్థిరపడ్డారు. అక్కడ ఉంటూనే కేరళ నుంచి తక్కువ ధరకు బంగారం ఖరీదు చేస్తుంటాడు. ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది విదేశాల్లో ఉంటున్నారు. స్థానిక ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న రాజు ఆయా దేశాల నుంచి వాళ్ళు తిరిగి వచ్చేప్పుడు బంగారం అక్రమంగా తీసుకువచ్చేలా చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా దేశంలోని స్మగుల్డ్ అయిన గోల్డ్‌ను తక్కువ ధరకు వారి నుంచి ఖరీదు చేసే వాడు. దీన్ని హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్న బంగారం వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రయించేవాడు. వ్యాపారులకు పసిడి డెలివరీ చేయడానికి, వారి నుంచి డబ్బు వసూలు చేసుకు రావడానికి ఏడు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. ఈ వాహనాలను తీసుకువెళ్ళే, తిరిగి తీసుకువచ్చే డ్రైవర్లకు రాజు ఓ విషయం స్పష్టం చేసేవాడు. ఎక్కడైనా నేరం బారినపడితే కారులో ఉండే బంగారం, డబ్బు విషయం బయటకు చెప్పకుండానే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పదేపదే చెప్పేవాడు. తలలు పట్టుకున్న పోలీసులు... ఓ మధ్యస్థాయి కారు కోసం నలుగురు వ్యక్తులు వచ్చి, తుపాకీ చూపించి మరీ ఎత్తుకుపోవడం ఏంటని పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే అనుమానం వచ్చిన అధికారులు ఫిర్యాదుదారుడైన రాహుల్‌ను వివిధ కోణాల్లో, లోతుగా ప్రశ్నించారు. దీంతో ఆ కారులో రహస్య లాకర్ ఉండటం, అందులో రూ.3.67 కోట్ల నగదు ఉన్న విషయం బయటపెట్టక తప్పలేదు. దీంతో అసలు విషయం తెలుసుకున్న అధికారులు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ గాలించారు. చివరకు ఏడుగురు బందిపోటు దొంగల్నీ పట్టుకుని రూ.2.89 కోట్లు, బంగారం రికవరీ చేశారు. యజమాని రాజు ఎంతగా ప్రయత్నించినా నగదును రికార్డుల్లోకి ఎక్కకుండా ఆపలేకపోయాడు. ఇది భారీ మొత్తం కావడంతో ఈ విషయంపై ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాయాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నిర్ణయించారు. డీమానిటైజేషన్ తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు కలిగి ఉండటమూ నేరమే అని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూసుకుంటారని అంటున్నారు. ఈ బందిపోటు ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు పోలీసు కమిషనర్ ప్రత్యేక రివార్డులు అందించారు. ఆ రెండు చోట్లా సాధ్యమైనా... రాజుకు చెందిన వాహనాలు బంగారం, డబ్బుతో వెళ్ళి వస్తున్నప్పుడు గతంలోనూ మాయమయ్యాయి. కొన్ని ముఠాలు ఆ కారుతో సహా సర్వం దోచుకుపోయాయి. అయినప్పటికీ అప్పట్లో ఆయా వాహనాలకు డ్రైవర్లుగా వ్యవహరించిన వాళ్ళు పోలీసులకు కేవలం వాహనం పోయిందని మాత్రమే ఫిర్యాదు చేశారు.విషయం తెలుసుకున్న ఆ పోలీసుస్టేషన్‌కు చేరుకునే రాజు అధికారులను మేనేజ్ చేయడం ద్వారా తన డబ్బు, బంగారం రికార్డుల్లోకి ఎక్కకుండానే రికవరీ చేయించుకునేవాడు. ఇలా కేరళ, కర్ణాటకల్లోనూ జరిగింది. రాయకల్‌లో బందిపోటు దొంగతనానికి గురైన వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరించిన రాహుల్ కూడా ఇలానే చేశాడు. గత నెల 28న నేరం జరిగిన తర్వాత షాద్‌నగర్ ఠాణాకు వెళ్ళాడు. గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు తనకు పిస్టల్ చూపించి, కారు పట్టుకుపోయారని ఫిర్యాదు చేశాడు. దుండగులు ఎత్తుకుపోయిన కారు మారుతి బ్రిజా అని, కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉందని అందులో పేర్కొన్నాడు. -
ధాన్యం.. ‘ధనం’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో దశలవారీగా జమ అవుతున్నాయి. రబీ సీజన్‌కు సంబంధించి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మగా.. పౌరసరఫరాల శాఖ అధికారులు నగదు చెల్లింపు చర్యలు చేపట్టారు. వాస్తవానికి ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతులకు నగదు ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల సకాలంలో చెల్లించలేదు. దీంతో రైతుల ఇబ్బందులను గుర్తించిన ప్రజాప్రతినిధులు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సమస్యపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జేసీ అనురాగ్ జయంతి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు 3,500 మంది రైతులకు ఇంకా నగదు రావాల్సి ఉండగా.. వారిలో ఇప్పటివరకు చాలా మంది ఖాతాల్లో నగదు జమ చేశారు. రబీ సీజన్లో రైతులు జిల్లాలో 25వేల హెక్టార్లలో ధాన్యం సాగు చేశారు. ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తం 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ, ఐకేపీ ఆధ్వర్యంలో 18, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 72 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్డీఏ–ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 4,116 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 24,500.240 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 1,752.200 మెట్రిక్ టన్నులు.. మొత్తం 26,252.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే పీఏసీఎస్‌ల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 12,868 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 99,709.560 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 4,125.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,03,835.000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అంటే మొత్తం 90 కొనుగోలు కేంద్రాల ద్వారా 16,984 మంది రైతుల నుంచి గ్రేడ్–‘ఏ’ రకం 1,24,209.800 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 5,877.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం 1,30,087.440 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశారు. నగదు రాకపోవడంతో ఆందోళన.. సాధారణంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సంబంధిత రైతులకు 48 గంటల్లో నగదు వారి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈసారి చాలా మంది రైతులకు నెలలు గడుస్తున్నా నగదు మాత్రం వారి ఖాతాల్లో జమ కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల నుంచి వివరాలను అప్లోడ్ చేసిన అనంతరం సంబంధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అయితే రైతులకు సకాలంలో నగదు రాకపోవడంతో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సాధారణ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు రైతుల ఖాతాల్లో నగదు జమ కాని విషయంపై అధికారులను ప్రశ్నించారు. కొనుగోళ్లు జరిగి ఇంత కాలమైనా ఇంకా నగదు రాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. దాదాపు 3,500 మందికి ఇంకా నగదు రాలేదని, వారి పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు త్వరలోనే రైతులకు నగదు అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు చెల్లింపులు.. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు నగదు చెల్లింపులు చేపట్టారు. గతంలో రైతులకు నగదు అందకపోవడంతో ఇబ్బందులు పడిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం దశలవారీగా అందరు రైతులకు ధాన్యానికి సంబంధించిన నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 16,984 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. వీరిలో అనేక మందికి నగదు చెల్లింపులు ఇప్పటికే చేయగా.. మిగిలిన వారికి కూడా వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాతాల్లో నగదు జమ కావడంతో రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది. ఖాతాల్లో జమ చేస్తున్నాం.. పెండింగ్‌లో ఉన్న రైతులందరి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం. మరో వారం రోజుల్లో రైతులందరికీ నగదు అందించేందుకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ -
రైతుకు భరోసా
నారాయణపేట: ‘భూ ప్రక్షాళనలో చిన్న చిన్న తప్పులతో కొంతమందికి మాత్రమే కొత్త పాసు పుస్తకాలు రాలేదు.. ఇందుకు ఎవరూ పరేషాన్ కావొద్దు.. రెవెన్యూ రికార్డుల్లో భూములు మీవైతే.. మీకు తప్పకుండా కొత్త పాసుపుస్తకాలు వస్తాయ్.. రైతు బంధు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయి.. ఇందులో ఎలాంటి అపోహలు పెంచుకోవద్దు..’ అని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. భూ సమస్యలు, రైతుబంధు తదితర సమస్యలపై ప్రజలు తమ గోడును వినిపించేందుకు కలెక్టర్‌తో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్లో నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పలువురు రైతులు ‘సాక్షి’ ఫోన్ ఇన్ ద్వారా భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు చెప్పిన సమస్యలను కలెక్టర్ ఓపికగా విని.. పరిష్కారానికి భరోసా ఇచ్చారు. సమస్యల ఏకరువు.. చాలామంది రైతులు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం రావడం లేదని.. కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. పట్టాదారు పాస్ పుస్తకాలకు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్‌కు ఫోన్లో ఏకరువు పెట్టారు. స్పందించిన కలెక్టర్ ఫోన్ చేసిన రైతులందరి సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. సమస్య పరిష్కారం తర్వాత వారికి తిరిగి ఫోన్ చేసి చెప్పాలని తహసీల్దార్లను ఆదేశించారు. కొంతమంది రైతుల ఫోన్ నంబర్లను నోట్ చేసుకొని సంబంధిత వీఆర్ఓలకు సమాచారం అందించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మరి కొంతమంది రైతులకు మాత్రం ఈ రోజు (మంగళవారం) సాయం త్రం వరకు మీమీ మండల తహసీల్దార్ల వద్దకు వెళ్లి సమస్యను వివరించాలని చెప్పారు. ఫోన్ ఇన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆర్డీఓ నోట్ చేసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రఘువీరారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ బాలాజీ, నారాయణపేట తహసీల్దార్ రాజు, జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు. సార్ నీ కాల్మొక్త.. పాసు బుక్ ఇస్తలేరు కలెక్టర్ సార్ నీ కాల్మొక్త.. నా పేరు హన్మంతు. దామరగిద్ద మండలం ఆశన్‌పల్లి గ్రామం. 1996లో సర్వే నంబర్లు 91, 92, 94లలో ఐదెకరాల భూమి కొన్నాం. డాక్యుమెంట్లు, ఈసీ ఉన్నాయి. ఉర్దూలో ఉన్న డాక్యుమెంట్లను తెలుగులోకి మార్పించా. సంబంధిత పత్రాలను రెవెన్యూ అధికారులకు చూపించినా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. నాకు న్యాయం చేయండి సారూ. కలెక్టర్ స్పందిస్తూ.. హన్మంతు మీ డాక్యుమెంట్లు తీసుకెళ్లి ఈ రోజు సాయంత్రం దామరగిద్ద తహసీల్దార్‌ను కలవండి. వాటిని సరిచూసి విచారణ జరిపి మీకు న్యాయం జరిగిలే చూస్తాం. సరే సార్ మీకు రుణపడి ఉంటా. నా భూమి నాకు ఇప్పించండి సార్.. నా పేరు కుర్వ దశరథ్. ఊట్కూర్ మండలం పెద్దపొర్ల గ్రామం. సర్వే నంబర్ 170/సీ/5లో 18 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో మార్చి నాకు భూమి లేకుండా చేశారు. నా వద్ద పట్టా పాసు బుక్కు ఉంది. రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ స్పందిస్తూ.. అక్కడే ఉన్న ఊట్కూర్ తహసీల్దార్‌ను విచారణ జరిపి భూమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. భూమి దశరథ్‌దే అని తేలితే సంబంధిత వీఆర్ఓపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. పట్టా చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని హెచ్చరించారమూడెకరాలకు ఎకరానే వచ్చింది సార్ మా మామయ్య హన్మంతు పేరిట సర్వే నంబర్లు 692, 704లో మూడెకరాల భూమి ఉంది. కొత్త పుస్తకంలో ఒక ఎకరా మాత్రమే వచ్చింది. నా పేరు పవిత్ర. మాది మరికల్ గ్రామం. ఇంకా రెండు ఎకరాల భూమి ఎక్కడపోయింది. మాకు న్యాయం చేయండి. కలెక్టర్ స్పందిస్తూ.. మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఖలీద్ ను కలిసి భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు చూయించండి. రికార్డులను పరిశీలించి సరిచేసుకునే అవకాశం ఉంది. కొత్త పాసుపుస్తకం రాలేదు సార్.. నా పేరు నీరటి వెంకటమ్మ. మాది నారాయణపేట పట్టణం పళ్లబురుజు. సర్వే నంబర్లు 441, 443లో తొమ్మిది ఎకరాలకు 10 సెంట్లు తక్కువగా ఉంది. మొదటి విడతలో పాసుపుస్తకం రాకపోయినా రైతుబంధు డబ్బులు ఇచ్చారు. ఇంత వరకు కొత్త పాసుపుస్తకం రాలేదు. రెండో విడత డబ్బులు పడలేదు. దయచేసి నాకు కొత్త పాసు పుస్తకం ఇప్పించి రైతుబంధు డబ్బులు వేయించండి సార్ మీకు పుణ్యమొస్తది. తక్షణమే కలెక్టర్ స్పందించి ఫోన్ ఇన్ నీరటి వెంకటమ్మను లైన్లోనే పెట్టి వెంటనే వీఆర్ఓ కు ఫోన్ కలపండంటూ పక్కనే ఉన్న నారాయణపేట తహసీల్దార్‌కు ఆదేశించారు. వీఆర్ఓ తో ఫోన్లో మాట్లాడుతూ నీరటి వెంకటమ్మకు సంబంధించిన భూమిపై నివేదిక సాయంత్రం వరకు నా టేబుల్‌పై ఉండాలని ఆదేశించారు. ఇనాం భూములకు.. సార్.. నాపేరు గజలప్ప. దామరగిద్ద మండలం బాపన్‌పల్లి గ్రామం. సర్వే నంబర్లు 9, 10, 11, 16లలో దాదాపు 20 కుటుంబాలకు ఇనాం భూ ములు ఇచ్చారు. కొత్త పాసు పుస్తకాలు ఇవ్వ మంటే ఇవ్వడం లేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ స్పందిస్తూ.. బాపన్‌పల్లిలో ఈనాం భూములకు సంబంధించి వెంటనే విచారణ చేపట్టి నివేదికలను సమర్పించాలని ఆర్డీఓ శ్రీనివాసులు సూచించారు. బాపన్పల్లితోపాటు ఇతర గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉంటే తహసీల్దార్లతో సమీక్షించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. బుక్క రాలే.. పైసలు పడలే సార్.. నా పేరు నర్సింహులు. దామరగిద్ద మండలం లక్ష్మీపూర్. ఇంత వరకు కొత్త పాసు పుస్తకం రాలేదు. రైతుబంధు డబ్బులు పడలేదు. ఆరు నెలలుగా రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. అప్పుడు.. ఇప్పుడు అంటూ తిప్పుతున్నారు. కానీ, ఇంత వరకు బుక్ ఇస్తలేరు. నాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ స్పందిస్తూ..ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దామరగిద్ద తహసీల్దార్‌ను వెళ్లి కలవండి. మీ దగ్గర ఉన్న పాత పాసు బుక్కులు చూయించండి. ఏమైనా సమస్య ఉంటే వాటి ని సరిచేసి కొత్తపాసు బుక్కు ఇచ్చేందుకు చర్యలు చేపడుతాం. నా కొడుకు జర్మనీలో ఉంటాడు సార్.. నా పేరు రఘుపతిరెడ్డి. మద్దూరు మండలం నిడ్జింత. నా కొడుకు జర్మనీలో ఉంటాడు. భూమి కొడుకు పేరు మీద ఉంది. కొత్త పట్టా పాసు పుస్తకం రాలేదు. ఆఫీసులో అడిగితే ఈకేవైసీ సమస్య ఉందంటున్నారు. మాకు పట్టా పాసుపుస్తకం ఇప్పించండి. కలెక్టర్ స్పందిస్తూ.. మీ కుమారుడి ఆధార్ కార్డును ఈకేవైసీ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలి. మీరు తహసీల్దార్ కార్యాలయంలో వెళ్లి కలవండి. మీ కుమారుడి ఆధార్ నంబర్‌కు లింకైన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నంబ ర్ చెబితే లింకప్ చేసి ఓకే చేస్తారు. అప్పుడు మీ కొడుకు పేరిట కొత్త పాసుపుస్తకం వస్తుంది. తహసీల్దార్‌ను కలిసిన రైతులు తమకు పొలాలు ఉన్న కొత్త పట్టా పాసు పుస్తకాలు రాలేదని ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన సిద్దన్ కిష్టమ్మ, నీటి వెంకటమ్మల కుటుంబ సభ్యులు కలెక్టర్ సూచన మేరకు సాయంత్రం 4 గంటలకు తహసీల్దార్ రాజు ను కలిసి భూముల పట్టా పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను అందజేశారు. కలెక్టర్‌కు ఫోన్ ఇన్‌లో తమ సమస్యను వివరించామని, మిమ్మల్ని కలవాలని చెప్పారని వివరించారు. దీంతో తహసీల్దార్ స్పందిస్తూ.. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.