పెద్దనోట్ల రద్దు సెగ.. గల్ఫ్‌లోని మన కార్మికులకు తగులుతోంది. అక్కడ పని చేస్తున్న కార్మికులు వారు పొందిన వేతనాలను మనీ ట్రాన్‌సఫర్ కేంద్రాల ద్వారా స్వగ్రామాల్లోని తమ కుటుంబాలకు పంపిస్తారు. అయితే, మన దేశంలో రూ.500, రూ. 1000 నోట్లు రద్దు కావడం, బ్యాంకుల నుంచి పరిమితంగానే నగదును డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో మనీ ట్రాన్‌సఫర్ కేంద్రాల నిర్వహణ పూర్తిగా స్తంభించిపోరుుంది. మనీ ట్రాన్‌సఫర్ కేంద్రాలకు ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు న్నా నగదు డ్రా చేయడంపై ప్రభుత్వం సీలింగ్‌ను విధించడం, కొత్తగా విడుదల చేసిన నోట్లు ఇవ్వడంలో జాప్యం జరగడం తో మనీ ట్రాన్‌సఫర్ కేంద్రాలు తమ లావాదే వీలను నిర్వహించలేక పోతున్నాయి. గల్ఫ్ దేశాలైన దుబాయ్, సౌదీ అరేబియా, ఖతర్, ఇరాక్, మస్కట్, కువైట్, అబుదాబీ తదితర దేశాల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు.