notes Cancel
-
కార్ల అమ్మకాలు పుంజుకున్నాయ్
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం తగ్గుతోందని, కార్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయని సియామ్ తెలిపింది. గత నెలలో ప్రయాణికుల వాహన విక్రయాలు 14 శాతం పుంజుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్)పేర్కొంది. వాహన పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని సాధించగలదన్న అంచనాలు పెరిగాయని వివరించింది. అయితే టూ–వీలర్ల అమ్మకాలు తగ్గడం కొనసాగుతోందని పేర్కొంది. 2015, జనవరిలో 1,68,303గా ఉన్న దేశీయ మార్కెట్లో కార్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో 11 శాతం వృద్ధితో 1,86,523కు పెరిగాయని తెలిపింది. -
రూ.705 కోట్ల సహకార పంట రుణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సహకార పంటరుణాల కోసం నాబార్డు అదనంగా రూ.705 కోట్లు విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా సహకార పంట రుణాల మంజూరు మందగించడం, రబీలో రైతులకు పంట రుణాలు అందని నేపథ్యంలో ఆర్బీఐ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్)కు నాబార్డు ఈ నిధులిచ్చింది. వాస్తవానికి ఈ ఏడాది పంట రుణాలకు నాబార్డు రాష్ట్రానికి రూ.1,270 కోట్లు కేటాయించింది. రబీలో సహకార బ్యాం కుల ద్వారా రూ.2,200 కోట్ల రుణాలు అందజేయాల్సి ఉండగా నాబార్డు అదనం గా విడుదల చేసిన నిధులతో మరిన్ని పంట రుణాలు ఇచ్చేందుకు అవకాశం లభించింది. టెస్కాబ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 9 డీసీసీబీ బ్యాంకుల పరిధిలో 272 బ్రాంచీలు ఉండగా వాటిల్లో 12 లక్షల మంది రైతులకు ఖాతాలున్నాయి. ఈ రైతులందరికీ ఆయా సహకార బ్యాంకు బ్రాంచీల్లో రూ.4 వేల కోట్ల వరకు డిపాజిట్లు న్నాయి. -
ఎయిర్టెల్ లాభం 54% డౌన్
క్యూ3లో రూ. 504 కోట్లు... • నాలుగేళ్ల కనిష్టస్థాయి ఇది... • రిలయన్స్ జియో ఉచిత ఆఫర్, పెద్ద నోట్ల రద్దు ప్రభావం.. న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి.. భారతీ ఎయిర్టెల్ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 54 శాతం క్షీణించి.. రూ.503.7 కోట్లకు పరిమితమైంది. నాలుగేళ్ల కనిష్ట స్థాయికి దిగజారింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,108 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా కొత్తగా సేవలు ప్రారంభించిన రిలయన్స్ జియో ఉచిత ఆఫర్, నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కారణంగా కంపెనీ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. క్యూ3లో కంపెనీ ఆదాయం 3 శాతం దిగజారి... రూ.24,103 కోట్ల నుంచి రూ. 23,364 కోట్లకు తగ్గింది. ‘కొత్త ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రకటించిన ఉచిత ఆఫర్ కారణంగా అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో తీవ్ర కుదుపులను చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న కాల్ టెర్మినేషన్ కాస్ట్ 14 పైసలు(ఒక్కో నిమిషానికి) అనేది మాకు అవుతున్న వ్యయాల కంటే చాలా తక్కువగా ఉంది. రిలయన్స్ జియో నుంచి వస్తున్న కాల్స్ సునామీతో పరిశ్రమ ఆదాయం గతేడాదితో పోలిస్తే భారీగా పడిపోయేందుకు దారితీసింది. మార్జిన్లపై ఒత్తిడి పెరిగి.. మొత్తం దేశీ టెలికం రంగం ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోపక్క, నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కూడా క్యూ3లో ప్రభావం చూపింది. అయితే, ఇది తాత్కాలికమేనని మేం భావిస్తున్నాం’ అని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ(ఇండియా, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. అయితే, ఇదే సమయంలో ఆదాయానికి సంబంధించి మొత్తం దేశీ మార్కెట్లో ఎయిర్టెల్ వాటా లైఫ్‌టైమ్ గరిష్టాన్ని అధిగమించి 33 శాతానికి చేరిందని తెలిపారు. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో గతేడాది సెప్టెంబర్‌లో 4జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట 2015 డిసెంబర్ 31 వరకూ ఉచిత డేటా, కాల్స్‌ను ఆఫర్ చేసిన జియో.. దీన్ని ఆతర్వాత ఈ ఏడాది మార్చి 31 వరకూ పొడిగించింది. ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ భారత్‌కు సంబంధించి కంపెనీ మొబైల్ సేవల ఆదాయం 1.8 శాతం వృద్ధితో రూ.18,013 కోట్లకు చేరింది. ఆదాయ వృద్ధి మందగించడానికి ప్రధానంగా జియో వాయిస్, డేటా ఉచిత ఆఫర్ కారణమని ఎయిర్టెల్ పేర్కొంది. ⇔ క్యూ3లో కంపెనీ కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ఆదాయం క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే దాదాపు అదేస్థాయిలో రూ.4,049 కోట్లుగా నమోదైంది. ⇔ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 22 శాతం పెరిగారు. కంపెనీ మొబైల్ డేటా ఆదాయాలు మొత్తం మొబైల్ ఆదాయాల్లో(భారత్) 22.8 శాతానికి చేరాయి. గతేడాది క్యూ3తో పోలిస్తే 23.1 శాతం వృద్ధి నమోదైంది. ⇔ భారతీయ కార్యకలాపాలకు సంబంధించి మొత్తం కస్టమర్ల సంఖ్య 9.3% వృద్ధి చెంది 26.58 కోట్లకు చేరింది. వాయిస్ కాల్ మినిట్స్‌లో 14%, డేటా వినియోగం 28.3% వృద్ధి చెందింది. ⇔ అయితే, క్యూ3లో ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం రూ.192 నుంచి రూ.172కు పడిపోయింది. దీనికి ప్రధానంగా రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ ప్రభావం చూపింది. ⇔ ఆఫ్రికాలో మొబైల్ ఆదాయం 6% వృద్ధి చెందింది. అయితే, ఇక్కడి కార్యకలాపాలపై నికర నష్టం 7.4 కోట్ల డాలర్ల నుంచి 9.3 కోట్ల డాలర్లకు ఎగబాకింది. నైజీరియా కరెన్సీ విలువ తగ్గింపు(డీవేల్యుయేషన్)... ఆఫ్రికా వ్యాపారంపై ప్రభావం చూపింది. ⇔ ఇక డిసెంబర్ చివరినాటికి ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ రుణ భారం 24 శాతం ఎగబాకి రూ.97,395 కోట్లకు చేరింది. 2015 డిసెంబర్ నాటికి రుణ భారం రూ.78,452 కోట్లుగా ఉంది. ⇔ క్యూ3లో నికర వడ్డీ వ్యయాలు రూ.1,360 కోట్ల నుంచి రూ.1,810 కోట్లకు పెరిగాయి. దీనికి స్పెక్ట్రం సంబంధిత వడ్డీ వ్యయాల పెరుగుదల కారణంగా నిలిచింది. ఇక డిసెంబర్ క్వార్టర్లో ఫారెక్స్, డెరివేటివ్ సంబంధ నష్టాలు రూ.57 కోట్ల నుంచి రూ. 126 కోట్లకు పెరిగాయి. ⇔ కంపెనీ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో దాదాపు 1 శాతం నష్టపోయి రూ.316 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
దక్షిణాదిలో సిమెంటు విక్రయాల జోరు
• నవంబర్, డిసెంబర్ అమ్మకాల్లో వృద్ధి • పెద్ద నోట్ల రద్దు ప్రభావం లేదు • దాదాపు స్థిరంగా ఉన్న సిమెంటు ధరలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా పెద్ద నోట్ల రద్దు ప్రభావం సిమెంటు పరిశ్రమపై ఏమాత్రం లేదు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు పెరుగుతుండడం ఇందుకు నిదర్శనమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తుడటంతో సిమెంటు విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిమెంటు ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. రద్దు ప్రభావమే లేదు.. పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) కారణంగా అమ్మకాలు భారీగా పడిపోవచ్చని, ధరల్లో క్షీణతకు ఆస్కారం ఉండొచ్చని సిమెంటు పరిశ్రమ తొలుత భావించింది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం కంపెనీలకు ఆశ్చర్యం కలిగించింది. దేశవ్యాప్తంగా చూస్తే ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల్లో స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. ఈ తగ్గుదల కూడా గుజరాత్‌కు మాత్రమే పరిమితమైంది. సిమెంటు ధరల్లో 3–5 రూపాయలు మాత్రమే సవరణ జరి గింది. దక్షిణాది రాష్ట్రాల్లో డీమో నిటైజేషన్ ప్రభావం ఏమాత్రం పడలేదు. పైగా 2015తో పోలిస్తే 2016లో విక్రయాలు పెరగడం గమనార్హం. పెరిగిన అమ్మకాలు.. దక్షిణాది రాష్ట్రాల్లో 2015 నవంబరులో 40 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. అదే ఏడాది డిసెంబరులో 48 లక్షల టన్నులకు ఎగిశాయి. ఇక 2016 వచ్చేసరికి విక్రయాల్లో భారీ పెరుగుదల కనిపించింది. అక్టోబరులో 51 లక్షల టన్నులు నమోదయ్యాయి. నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. దీని ప్రభావం దాదాపు అన్ని రంగాల లావాదేవీలపైనా పడింది. వాస్తవానికి నవంబరులో అమ్మకాలు ఎలా ఉంటాయోనని సిమెంటు కంపెనీలు ఆందోళన చెందాయి. అందరి అంచనాలు తలకిందులయ్యాయి. నవంబరులో కూడా 51 లక్షల టన్నుల సేల్స్ జరిగాయి. డిసెంబరులో విక్రయాలు కాస్త పెరిగి 52 లక్షల టన్నులకు చేరాయి. ఇక సిమెంటు విక్రయాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ వృద్ధిలో ఉన్నాయి. 2016లో అక్టోబరులో 15 లక్షల టన్నులు, నవంబరులో 15, డిసెంబరులో 16 లక్షల టన్నులు జరిగాయి. ఆగని నిర్మాణాలు..: వాస్తవానికి ఇల్లు కట్టుకోవడానికి అత్యధికులు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. నిర్మాణానికి కావాల్సిన నిధుల కొరత ఉండదు. ఇలా రుణం తీసుకున్న వినియోగదారుకు ఖచ్చితంగా బ్యాంకు ఖాతా ఉంటుంది. వీరివద్ద చెక్కు బుక్, డెబిట్/క్రెడిట్ కార్డు సైతం ఉంటుంది కాబట్టి చెల్లింపులకు అడ్డంకులు లేవని కంపెనీలు అంటున్నాయి. నిర్మాణ రంగంలో డీమోనిటైజేషన్ ప్రభావం లేదని, నవంబరు, డిసెంబరు సిమెంటు అమ్మకాలను చూస్తే ఇది అవగతమవుతుందని ప్రముఖ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో అన్నారు. వడ్డీ రేట్లూ తక్కువే.. సిమెంటు ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 2016 జనవరిలో బస్తా ధర బ్రాండ్, రకాన్నిబట్టి రూ.320–355 మధ్య పలికింది. ఇప్పుడిది రూ.300–330 మధ్య ఉంది. విజయవాడలో రూ.300–335, విశాఖపట్నంలో రూ.320–350 మధ్య పలుకుతోంది. బ్యాంకులు ఒకదాని వెంట ఒకటి పోటీగా గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించడంతో కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతోందని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రుణం తీసుకునే వారికి వడ్డీలో 4 శాతం వరకు సబ్సిడీని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా నిర్మాణ రంగానికి కలసి వచ్చే అంశాలని అన్నారు. సాధారణంగా ఇంటి నిర్మాణానికి జనవరి–జూన్ అనువైనవి. పైగా హైదరాబాద్‌లో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు బస్తాకు రూ.20–25 తక్కువగా ధర పలుకుతోంది. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకేముంది సొంతింటి కల నిజం చేసుకోవడానికి సరైన సమయం వచ్చిందని సిమెంటు సంస్థలు అంటున్నాయి. ధరలు పెరిగే అవకాశం.. డీజిల్ ధర కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోంది. కోల్ సైతం అదే దారిలో నడుస్తోంది. దిగుమతి అవుతున్న పెట్ కోక్ ధర 2016 ఏప్రిల్‌లో 40 డాలర్లుంటే, ఇప్పుడు 70 డాలర్లకు ఎగసింది. వెరశి తయారీ వ్యయం ఒక బస్తాకు రూ.10 దాకా అధికమైందని ఒక కంపెనీ డైరెక్టర్ వెల్లడించారు. తయారీ వ్యయం పెరిగితే తుది ఉత్పాదన ధరను సవరించాల్సిందేనని, అలా కాని పక్షంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ధర స్వల్పంగా పెరిగే చాన్స్ ఉందన్నారు. దక్షిణాది కంపెనీల ప్లాంట్ల వినియోగం 50–60 శాతముందని వివరించారు. ఏపీ, తెలంగాణలో ఇలా... ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులకుగాను 30 లక్షల టన్నుల సిమెంటు అవసరమనేది కంపెనీల అంచనా. బలహీన వర్గాల ఇళ్లకు రూ.230, కాం క్రీటు రోడ్లకు రూ.240, పోలవరం ప్రాజెక్టుకు రూ.250లకు సిమెంటు సరఫరాకు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పరిస్థితి: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తోంది. వీటి నిర్మాణానికి అవసరమైన సిమెంటుకై ఒక్కో బస్తాకు కంపెనీలకు రూ.230 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఇళ్లకు వచ్చే మూడేళ్లలో 27 లక్షల టన్నుల సిమెంటు అవసరం అవుతుందని అంచనా. -
డీమానిటైజేషన్ చిన్న కుదుపు మాత్రమే
• భారత్ నిలకడగా 7 శాతం పైగా వృద్ధి సాధించగలదు • సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ జైపూర్: వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద నోట్ల రద్దు ఒక చిన్న కుదుపులాంటిది మాత్రమేనని సిస్కో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ ఛాంబర్స్ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో నిలకడగా 7 శాతం పైగా వృద్ధి రేటు సాధించేసత్తా భారత్‌కి ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాల్లో అగ్రస్థానంలో ఉండగలదని చాంబర్స్ చెప్పారు. యూఎస్ఐబీసీ చైర్మన్ కూడా అయిన చాంబర్స్.. 8వ వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలోపాల్గొనేందుకు అమెరికా వ్యాపార దిగ్గజాల బృందంతో భారత్ వచ్చారు. ఈ నేపథ్యంలో డీమోనిటైజేషన్ వంటి ఆకస్మిక పరిణామం భారత్‌లో వ్యాపారాల నిర్వహణపై విదేశీ సంస్థల అభిప్రాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందా అన్న ప్రశ్నపైస్పందిస్తూ.. ఆర్థిక ప్రపంచంలో నోట్ల రద్దు అంశాన్ని తప్పు బట్టే వారు చాలా తక్కువే ఉంటారని చాంబర్స్ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములయ్యేందుకు ఇది పునాది వేయగలదని ఆయన చెప్పారు. సాధారణంగా కొత్తఆవిష్కరణలు తెరపైకి వచ్చినప్పుడు కచ్చితంగా కుదుపులు ఉంటాయన్నారు. అయితే, భారత్ సరైన వ్యూహం, దార్శనికతతో సరైన దిశలో వేగంగా పయనిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అసూయ చెందేలా వృద్ధి..: దేశీ ఎకానమీపై డిజిటల్ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఇంటర్నెట్ వల్ల అత్యంత వేగంగా 3–5 రెట్లు అధికంగా సానుకూల ఆర్థిక ప్రభావాలు ఉండగలవని చాంబర్స్ చెప్పారు. ‘ఈ మార్పుల ఊతంతో ఇప్పట్నుంచి ఏడాదివ్యవధిలో ప్రపంచం అసూయ చెందేలా భారత జీడీపీ మరింత పటిష్టంగా మారుతుంది. జీడీపీ వృద్ధి ఏడు శాతం స్థాయిలో నిలకడగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. 8..9..10 శాతం కూడా సాధించే అవకాశాలు లేకపోలేదు’ అని చాంబర్స్పేర్కొన్నారు. గతంలో మందకొడిగా మిగతా దేశాలను అనుసరిస్తుందంటూ పేరొందిన భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న దేశంగా పేరు తెచ్చుకుంటోందని చెప్పారు. -
అమ్మకాల వెల్లువ.. 263 పాయింట్లు డౌన్
ఏడో రోజూ నష్టాలు... • నోట్ల రద్దుతో కంపెనీల ఫలితాలపై ప్రభావం • 26వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్.. • ఏడు రోజుల్లో సెన్సెక్స్ నష్టాలు 718 పాయింట్లు • 8,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ • 82 పాయింట్ల నష్టంతో 7,979 వద్ద ముగింపు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా కంపెనీల ఆదాయాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే ఆందోళనతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెల్లువ కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 26వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 వేల పాయింట్ల దిగువకు పడిపోయాయి. స్టాక్ సూచీలు వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలపాలయ్యాయి. గత ఏడాది మార్చి తర్వాత.. అంటే ఏడాదిన్నర కాలం తర్వాత సూచీలు వరుసగా ఇన్ని రోజులు నష్టపోవడం ఇదే మొదటిసారి. సెన్సెక్స్ 263 పాయింట్లు(1 శాతం) నష్టపోయి 25,980 పాయింట్ల వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 7,979 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలకు ఇది దాదాపు నెల కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 300 పాయింట్ల వరకూ నష్టపోయింది. లోహ, మౌలిక, కన్సూమర్ డ్యూరబుల్స్, బ్యాంక్, ఆయిల్, గ్యాస్... అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ఈ ఏడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 718 పాయింట్లు నష్టపోయింది. పతనానికి పలు కారణాలు.... అమెరికా స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగియడం, ఇటలీ బ్యాంకింగ్ రంగం కష్టాల్లో ఉండడం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. గురువారంప్రారంభమైన రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ సమావేశ ఫలితం కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌లో ఆచితూచి వ్యవహరించారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే ఆందోళన, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, దేశీయ క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్ల పెట్టుబడులు నవంబర్‌లో మూడేళ్ల కనిష్ట స్థాయికి, రూ.1.79 లక్షల కోట్లకు పడిపోవడం, క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవుల సీజన్ సందర్భంగా లావాదేవీలు తక్కువగా చోటు చేసుకోవడం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మూడు సార్లు రేట్లు పెంచుతుందన్న అంచనాలతొ విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. మూడు సెన్సెక్స్ షేర్లకే లాభాలు.. 30 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లు నష్టపోయాయి. కేవలం మూడు షేర్లు... ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ మాత్రమే లాభపడ్డాయి. హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ షేర్లు 3–4 శాతం రేంజ్లో పతనమయ్యాయి. ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతం వరకూ నష్టపోయాయి. బీఎస్ఈలో 1,995 షేర్లు నష్టపోగా, 655 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం... నగదు కొరత కారణంగా సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావమే ఉంటుందని జపాన్ ఆర్థిక సేవల దిగ్గజం నొముర వ్యాఖ్యానించింది. ఆర్బీఐ అంచనాల కంటే అధికంగానే ఆర్థిక వ్యవస్థకు డ్యామేజ్ జరుగుతుందని పేర్కొంది. నగదు కొరత సమస్య వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగుతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
చిన్న నోట్లు పెద్ద మొత్తంలో ఇవ్వండి :దత్తాత్రేయ
జైట్లీని కోరిన దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చిన్ననోట్లను పెద్ద మొత్తంలో కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరున్జైట్లీని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు జైట్లీని దత్తా త్రేయ కలిశారు. రాష్ట్రంలో చిల్లర సమస్య తీవ్రమైందని, కార్మికులు, గ్రామీణ ప్రాంత కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలి పారు. రూ.10, 20, 50, 100 నోట్లను అధిక మొత్తంలో రాష్ట్రానికిస్తే కాస్త ఉపశమ నం కలుగుతుందన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని.. కార్మిక శాఖ, బ్యాంకర్లు సంయుక్తంగా 52,852 క్యాంపులు నిర్వహించి 13.76 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు వివరించారు. -
జైట్లీతో కేసీఆర్ భేటీ
‘నోట్ల రద్దు’ పరిణామాలపై చర్చ ప్రభుత్వ పథకాల అమల్లో ఇబ్బందులు వస్తున్నాయన్న కేసీఆర్! కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం చేయాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం కె.చంద్రశేఖరరావు గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. జైట్లీ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రెండో విడత నిధులు రూ.450 కోట్లు విడుదల చేయాలని జైట్లీని కోరారు. అనంతరం నోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితిపై వారు చర్చించారు. రాష్ట్ర ఖజానాపై ప్రభావం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను అధిగమించడానికి అవసరమైన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దు వల్ల తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల అమల్లో జాప్యం ఏర్పడుతున్న నేపథ్యంలో.. వాటి అమలుకు కేంద్రం సాయం చేయాల్సిందిగా కేసీఆర్ కోరినట్టు సమాచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల కాల పరిమితిని వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆసరా పింఛన్ల మంజూరులో ఏర్పడుతున్న సమస్యలు, ప్రజల ఇక్కట్లు తీర్చడానికి బ్యాంకర్లతో జరిగిన సమీక్ష సమావేశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అలాగే పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపైనా వారు చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట ఎంపీలు జితేందర్‌రెడ్డి, కె.కేశవరావు, బి.వినోద్ కుమార్ ఉన్నారు. గడ్కరీ కుమార్తె రిసెప్షన్‌కు సీఎంలు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, చంద్రబాబు హాజరయ్యారు. గురువారం గడ్కరీ నివాసం లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. -
కార్డు చెల్లింపులు 75 శాతానికి...
స్పెన్సర్స్ ఈడీ రాహుల్ నాయక్.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు తర్వాత కార్డుతో చెల్లింపులు పెరిగాయని స్పెన్సర్స్ రిటైల్ తెలిపింది. రద్దుకు ముందు వరకు మెట్రో నగరాల్లోని తమ ఔట్లెట్లలో 60% ఉన్న కార్డు పేమెంట్లు ప్రస్తుతం 75%కి చేరాయని కంపెనీ ఈడీ రాహుల్ నాయక్ ఆదివారం చెప్పారు. ఇక్కడి బోరుునపల్లిలో స్పెన్సర్స్ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా కోస్టల్ ఏపీ, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎం.రామనాథన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. డిజి టల్ పేమెంట్ సౌకర్యం ఉన్న కారణంగా పెద్ద ఔట్లెట్లలో కస్టమర్ల తాకిడి గణనీయంగా పెరిగిందన్నారు. ఇక దేశవ్యాప్తంగా 122 స్టోర్లకుగాను హైపర్ మార్కెట్ల సంఖ్య 38కి చేరుకుందని వివరించారు. హైదరాబాద్‌లో 18 ఔట్లెట్లలో 5 హైపర్ స్టోర్లున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఏటా 2-3 కేంద్రాలు నెలకొల్పుతున్నట్టు తెలిపారు. -
వాలెట్ వాడుతుంటే!
ప్రస్తుతం దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడుతూ బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. పాల ప్యాకెట్ల మొదలు పప్పు దినుసుల వరకు.. మంచి నీళ్లు మొదలు.. మెడికల్ షాపు, ఆసుపత్రుల వరకు.. ఎక్కడికెళ్లినా అందరిదీ ఒకటే సమస్య. అందరూ నగదు కోసం తిరుగుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో.. డిజిటల్ వాలెట్/మొబైల్ వాలెట్/ఈ-వాలెట్ కంపెనీలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. పనిలో పనిగా వినియోగదారులను ఆకర్షించడానికి విన్నూతమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ వాలెట్ లావాదేవీల గురించి తెలుసుకుందాం... సర్వం జేబులో..! డబ్బులు పాకెట్లో కాకుండా మొబైల్ వాలెట్లో ఉంచుకోవడం నేటి ట్రెండ్. ఆన్లైన్ షాపింగ్ చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, హోటల్ బిల్లులు కట్టడానికి డిజిటల్ వాలెట్లు ఒక సులభమైన మార్గం. మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉంటే చాలు.. పేటీఎం, మొబిక్విక్ లాంటి మొబైల్ వాలెట్స్, ఎయిర్టెల్ వంటి టెలికాం బేస్డ్ మొబైల్ వాలెట్లలో నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ అకౌంట్లోని అమౌంట్‌ని మొబైల్ వాలెట్స్ ద్వారా వేర్వేరు అవసరాలకు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా యువత షాపింగ్, హోటల్స్, సినిమాలు, క్యాబ్ బుకింగ్ ఇలా అన్నీ వాలెట్స్ నుంచే కానిచ్చేస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి మొబైల్ వాలెట్‌లోకి సులభంగా నగదు బదిలీ చేసుకునే సదుపాయం ఉండటం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాలెట్లు మూడు రకాలు 1. CLOSED క్లోజ్డ్ వాలెట్స్ అంటే.. కంపెనీలు సొంతంగా అందించేవి. బిగ్ బాస్కెట్, ఓలా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఉబర్ వంటి చాలా ఆన్లైన్ సంస్థలు సొంత వాలెట్లను అందిస్తున్నాయి. వీటిలో డబ్బు వేసుకుని సదరు సంస్థ అందించే సేవలు, ఉత్పత్తులను మాత్రమే కొనాలి/వినియోగించాలి. ఇవి పూర్తిగా ఆయా సంస్థల పరిధిలో ఉంటాయి కాబట్టి వీటికి ఆర్బీఐ అనుమతి అవసరం లేదు. ఆయా సంస్థలు తమ వాలెట్ల ద్వారా జరిపే లావాదేవీలకు అత్యధిక డిస్కౌంట్ ఇస్తుంటాయి. వీటిలో వేసుకునే డబ్బుకు పరిమితి ఉండదు. ఎంతైనా వేసుకోవచ్చు. ఒకసారి డిపాజిట్ చేసిన డబ్బును విత్ డ్రా చేయడానికి వీలుండదు. దీనిపై ఎలాంటి వడ్డీ రాదు. 2. SEMI CLOSED ఈ వాలెట్లలో డబ్బులు వేస్తే ఇతర ఆన్లైన్ సైట్లలోనూ వినియోగించవచ్చు. అయితే ఈ వాలెట్ నిర్వహిస్తున్న కంపెనీకి ఏయే సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయో వాటిలో మాత్రమే లావాదేవీలు జరపాలి. పేటీఎం, మొబిక్విక్, పేయూ, సిట్రస్ క్యాష్, ఫ్రీచార్జ్ తదితర వాలెట్లన్నీ ఈ కోవకు చెందినవే. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఈ వాలెట్ల ద్వారా అత్యవసర చెల్లింపులు చేయొచ్చు. అయితే ఈ వాలెట్లలో బిల్లు చెల్లింపులు, డిపాజిట్ల పరిమితి గరిష్టంగా పది వేలు మాత్రమే. పదివేలకు మించి లావాదేవీలు వీటి ద్వారా నిర్వహించలేం. వీటిలోనూ ఒకసారి డిపాజిట్ చేస్తే తిరిగి తీసుకోలేం. వీటిపై ఎలాంటి వడ్డీ రాదు. 3. OPEN VALLETS ఇవి ఓ రకంగా బ్యాంక్ ఖాతాల్లాంటివే. వీటి ద్వారా డబ్బుల డిపాజిట్, విత్ డ్రా, చెల్లింపులు చేయొచ్చు. వీటిలో డిపాజిట్ చేసిన సొమ్మును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. వీటిని బ్యాంకులు మాత్రమే జారీ చేస్తాయి. ఉదాహరణకు వోడాఫోన్ ఎంపైసా. దీన్ని ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి వోడాఫోన్ నిర్వహిస్తోంది. ఎయిర్టెల్ మనీ, టాటా టెలీ ఎం రూపీ కూడా బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నవే. అయితే వీటి ద్వారా నిర్వహించే లావాదేవీల విలువ రూ.50 వేలకు మించకూడదు. -
ఇద్దరు చంద్రులకు ఒళ్లంతా మచ్చలే..
• సీఎంలిద్దరూ ప్రధాని మోదీని • పొగుడుతున్నారు: సీపీఐ నేత నారాయణ • రిలయన్స్ జియో అవసరాలకే పెద్ద నోట్ల రద్దు • వరంగల్‌లో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు సాక్షి, వరంగల్: పెద్ద నోట్ల రద్దుపై మొదట్లో బాధ వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగుడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ‘ఒంటె అందాన్ని చూసి గాడిద ఆశ్చర్యపోతే... గాడిద రాగానికి ఒంటె మూర్ఛపోరుుందనే’ సామెత తరహాలో ఇద్దరు చంద్రుల తీరుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ భిక్ష కావాలని, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూతురు కేంద్ర మంత్రి కావాలని ఉందని... అందుకే ఇద్దరు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వెలుగు నిచ్చే చంద్రుడుకి ఒక మచ్చ ఉంటే... ఇద్దరు చంద్రులకు ఒళ్లంతా మచ్చలే ఉన్నాయన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరుగుతున్న సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ సభలో రెండో రోజు కె.నారాయణ ప్రసంగించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిలయన్స కంపెనీ జియోను ఏర్పాటు చేసి డిసెంబర్ వరకు ఉచిత సేవలు అందిస్తుందని.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను మార్చుకునే అవకాశం డిసెంబర్ 30 వరకే కల్పించారన్నారు. ‘జియోలో పెట్టుబడులకు రూ.1.25 లక్షల కోట్లు అవసరం. రిలయన్‌సకు డబ్బు ఇవ్వడానికి పెద్ద నోట్లు రద్దు చేశారు. దీంతో దాచుకున్న డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన సొమ్మును ప్రధాని, రిలయన్స పెట్టుబడులకు ఇవ్వబోతున్నారు. ఇదే అసలు రహస్యం’ అని నారాయణ ఆరోపించారు. మోదీ సామాన్యులను ఇబ్బందులకు గురి చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని అన్నారు. విజయ్‌మాల్యాకు ప్రధాని నరేంద్రమోదీ సహకరించారని ఆరోపించా రు. విజయ్‌మాల్యాకు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు వేరుుంచి గెలిపించిందని, విదేశాలకు పారిపోయేందుకు సహకరించిందన్నారు. డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో సీపీఐ జాతీయ మహాసభలు జరుగనున్నాయని చెప్పారు. వెంకయ్యది నాలుకా.. తాటిమట్టా.. కమ్యూనిస్టులు బ్లాక్‌మనీ వారిని ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందని, వెంకయ్యనాయుడిది నాలుకా తాటిమట్టా అని నారాయణ ప్రశ్నించారు. నల్లకుబేరులను ప్రోత్సహిస్తున్నది ఎవరో ప్రజాభిప్రాయం సేకరించాలని సవాల్ విసిరారు. కరెన్సీ గౌరవాన్ని కించపరిచిన ప్రధాని మోదీ ప్రజాకోర్టులో శిక్షార్హులని, వంద గుంజీలు తీరుుం చేంత శిక్ష విధించవచ్చని అన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో గెలవకపోతే ప్రధాని పదవి ఊడి పోతుందనే భయంతో మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. -
కేసీఆర్ ది ఫ్యూడల్ పాలన: సురవరం
-
కేసీఆర్ ది ఫ్యూడల్ పాలన
• సీఎం కేసీఆర్‌పై సురవరం మండిపాటు • నోట్ల రద్దుపై నేరుగా నిరసన తెలపలేకపోయారు • రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారు సాక్షి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని పిరికిపంద అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ ముందస్తు ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేస్తే కేసీఆర్ నేరుగా నిరసన తెలపలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలోని అవినీతి, అక్రమాలు కేంద్రానికి తెలిసి ఉంటాయని, కేంద్రం ఎక్కడ ఇబ్బందులకు గురిచేస్తుందోనన్న ఆందోళనతోనే కేసీఆర్.. ప్రధానికి కేవలం వినతిపత్రం ఇచ్చి ఊరుకున్నారన్నారు. కేసీఆర్‌కు సిగ్గు, శరం, నైతికత లేవని ధ్వజమెత్తారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ మహాసభలు హన్మకొండలో సోమవారం ప్రారంభమయ్యారుు. సురవరం ఈ సభలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఫ్యూడల్ విధానాలతో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఉంటే తనను నిలదీస్తాయన్న అభద్రతతో... ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. దేవుళ్లను, పుష్కరాలను, యాగాలను ముందు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. దేశంలో నియంతృత్వ ప్రభుత్వం దేశంలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోందని సురవరం వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు బీజేపీ ప్రభుత్వం చేసిన ఘోర రాజకీయ తప్పిదమన్నారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువస్తానన్న మోదీ.. రెండున్నరేళ్లరుునా తీసుకురాలేదన్నారు. దీనిపై ప్రజలకు సమాధానాలు చెప్పలేకే పెద్దనోట్లను రద్దు చేశారన్నారు. ‘‘ప్రధాని నిర్ణయంతో సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ శక్తులకు, సంపన్నులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. పేదలు కూడ బెట్టుకున్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటే నోటీసులు జారీచేస్తున్నారు. ఫోన్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని ప్రధాని చెబుతున్నారు. కూరగాయలు కొనడానికి, చెప్పులు కుట్టించడానికీ సెల్‌ఫోన్‌తో చెల్లింపులు చేస్తారా? సామాన్యుడు ఆన్లైన్ చెల్లింపులు చేయగలుగుతాడా? మెడపై తల ఉన్నవాడు, తలలో మెదడు ఉన్నవాడు ఇలాంటి ఆలోచన చేయడు’’ అని దుయ్యబట్టారు. మోదీవి ఫాసిస్టు ఆలోచనలు దేశంలో మతపరమైన దాడులు, దళి తులపై దాడులు పెరుగుతున్నాయని సుర వరం ఆందోళన వ్యక్తంచేశారు. గోరక్షణ పేరుతో ఊచకోత కోస్తున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ అనే రిమోటు కేంద్రాన్ని నడిపి స్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం యూపీఏ విధానాలనే అవలంభిస్తోందని, ఆయన ప్రధాని అయ్యాక ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు దెబ్బతిన్నాయ న్నారు. ‘‘మోదీ ఫాసిస్టు ఆలోచన, విధానా లతో ముందుకుపోతున్నారని, అందుకు వ్యతిరేకంగా సీపీఐ ముందుకు పోతుం దన్నారు. విదేశీయులను వెనక్కి పంపి స్తానని విష ప్రచారం చేసిన వంచకుడు, రేపిస్టు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యా డని అన్నారు. కమ్యూనిస్టులు శాస్త్రీయ ఆలోచనతో పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. నూతన ఆర్థిక, రాజకీయ పరిణా మాలు, డబ్బు ప్రభావం కమ్యూనిస్టు పార్టీలకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. వరంగల్ మహాసభ పార్టీ బలమైన నిర్మా ణానికి వేదిక కావాలని ఆకాంక్షించారు. మహాసభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నేతలు పువ్వాడ నాగేశ్వర్ రావు, అజీజ్‌పాషా, గుండా మల్లేష్, పి.పద్మ పాల్గొన్నారు. -
నోట్ల రద్దు అతిపెద్ద తప్పుడు ప్రయోగం
-
అతిపెద్ద తప్పుడు ప్రయోగం
- నోట్లరద్దు విషయంలో ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు - పార్లమెంటు ఆవరణలో నిరసనకు 200 మంది విపక్ష ఎంపీలు హాజరు న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో.. దాదాపు 200 మంది ఎంపీలు (కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం) హాజరై.. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కేంద్రం నిర్ణయం ఆర్థికంగా అతిపెద్ద తప్పుడు ప్రయోగం. దీనిపై మోదీ ఆర్థిక మంత్రి సహా ఎవరినీ సంప్రదించలేదు. ఈ స్కాంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలి’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇంతపెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, ఉద్దేశపూర్వకంగానే కొందరు పారిశ్రామికవేత్తలకు లీక్ చేశారో పార్లమెంటులో చెప్పాలన్నారు. కోట్ల మంది ఇబ్బందులు ఎందుకు పడాలన్నారు. ‘పార్లమెంటుకు ప్రధాని హాజరై.. చర్చ మొత్తం విని జవాబుచెప్పాలి. దీని వెనక స్కాం ఉంది. అందుకే జేపీసీ వేయాలి’ అని విపక్షాలు డిమాండ్ చేశారుు. ప్రజాసమస్యలను పార్లమెంటులో ప్రతిబింబిస్తామని, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారుు. దేశానికి భద్రత కరువైంది: మమత అటు జంతర్‌మంతర్ వద్ద తృణమూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మోదీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ చేతుల్లో దేశానికి భద్రత లేదన్నారు. ‘హిట్లర్ కంటే ప్రధాని అహంభావి. స్విస్ అకౌంట్లున్నవారిని ముట్టుకోకుండా సామాన్యులను ఇబ్బంది పెడతారా?’ అని మండిపడ్డారు.ర్యాలీకి ఆప్, జేడీయూ, ఎస్పీ, ఎన్సీపీ మద్దతు ప్రకటించారుు. -
చేతికొచ్చేనా..?
సాక్షి, నల్లగొండ : ఒకటో తేదీకి ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల నవంబర్ నెల వేతనాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకింగ్ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురావడంతో వేతనాలు పొందేందుకు ఎలాంటి సమస్యా లేకపోయినా, పొందిన వేతనాలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే వేతనాల కోసం 10 రోజుల ముందు నుంచే ప్రణాళికలు వేసుకుని ఉండే ఉద్యోగులు వేతనాలు వచ్చిన 10 రోజుల్లోనే తమ అవసరాల కోసం ఆ వేతనాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ, ఈ క్రమంలో ప్రస్తుతమున్న నిబంధనల కారణంగా తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, పింఛన్‌దారులు కలిసి కనీసం లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. ఈ ఉద్యోగుల పరిస్థితి ఒకటో తేదీ తర్వాతేంటనే దానిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కానీ స్పష్టత నివ్వకపోవడం మరింత గందరగోళానికి దారి తీస్తోంది. రోజుకు రూ. 2వేలేనా? జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగో తర గతి ఉద్యోగుల నుంచి శాఖాధిపతుల వరకు 35 వేల వరకు ఉద్యోగులున్నారు. వీరితో పాటు ఆరువేల మందికి పైగా టీచర్లు కూడా ఉన్నారు. పోస్టల్, బీఎస్ఎన్ఎల్, ఎఫ్‌సీఐ, ఎల్ఐసీ తదితర సంస్థల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 వేల వరకు ఉంటారు. లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు, పింఛన్‌దారులు కలిపి మొత్తం లక్ష మంది వరకు ఉంటారు. వీరే కాకుండా వివిధ ప్రైవేటు సంస్థలు, అన్ని రకాల దుకాణాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వీరంతా ప్రతి నెల ఒకటి నుంచి పదో తేదీ లోపు వేతనాలను తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులక యితే ఠంచన్‌గా ఒకటో తేదీన జీతం వస్తుంది. అయితే, జీతం పొందే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి అనుమానం లేకపోయినా, పొందిన వేతనాన్ని తమ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్నదే సమస్యగా మారింది. బ్యాంకుల్లో గంటల తరబడి ఉన్నా.. ఏటీఎంల వద్ద క్యూలలో పడిగాపులు కాసినా రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేకపోవడంతో నెలసరి ఖర్చులెలా అన్నది ఇప్పుడు ఉద్యోగులకు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంటి కిరాయిలు, పాలు, కిరాణా దుకాణం ఖర్చులు, చిట్టీలు, పిల్లల ఖర్చులు... ఇలా అన్ని రకాల అవసరాల కోసం 5-10 తేదీల్లోపే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, రోజుకు రూ.2 వేల చొప్పున ఇస్తే వీటికి ఎప్పటికి చెల్లింపులు చేయాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజల్లాగా గంటల తరబడి ఏటీఎంల వద్ద ఉండే అవకాశం కూడా తమకు లేదని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు వెసులుబాటు కల్పించకపోతే సాధారణ జీవనానికి ఇబ్బందులు తప్పవనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఈ వెసులు బాట్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడం, ఒకటో తేదీ సమీపిస్తుండడం మరింత సమస్యగా మారుతోంది. బ్యాంకుల్లోనే? వాస్తవానికి, ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగేంత వరకు తమ నగదు రూపంలో వేతనాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పరిమితులతో పాటు, ఉద్యోగుల వేతనాల నుంచి కొన్ని రకాల మినహాయింపులు చేసుకుని మిగిలిన జీతం చెల్లించాల్సి ఉండడం, నగదు రూపంలో ఇవ్వాలంటే ప్రతి ఒక్కరి దగ్గరా సంతకాలు తీసుకోవాల్సి రావడం సమస్యగా మారింది. దీనికి తోడు బ్యాంకర్లు కూడా అంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎప్పటిలాగే బ్యాంకుల్లోనే నవంబర్ నెల వేతనాలు జమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. అయితే, నవంబర్ నెల వేతనంలో రూ.10 వేలను ప్రతి ఉద్యోగికి అడ్వాన్స్‌గా ఇస్తారని, లేదంటే సగం జీతం నగదు రూపంలో ఇస్తారని మొదట్లో చర్చ జరిగినా అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో జమ అయిన వేతనాలను తమకు ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా తమ వేతనాల ఉపసంహరణ కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్‌గా కనిపిస్తోంది. దీంతో పాటు బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఉపసంహరణ చేసుకునే పరిమితిని కూడా పెంచాలని వారు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో.. బ్యాంకర్లు ఏ విధంగా సహకరిస్తారో వేచి చూడాల్సిందే. నగదు ఇస్తేనే బాగుంటుంది.. పెద్ద నోట్ల రద్దు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం నల్ల ధనాన్ని అరికట్టే విషయంలో మంచిదే అనుకున్నా.. ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఉద్యోగుల పరిస్థితి సామాన్య ప్రజల కంటే భిన్నమైనది. ఉద్యోగులకు ఈనెల వేతనాలు నగదు ఇస్తేనే బాగుంటుంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. మంగళ, బుధ వారాల్లో స్పష్టత వస్తుంది. - పందిరి వెంకటేశ్వరమూర్తి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎవర్నీ ఇబ్బంది పెట్టవద్దు. జిల్లాలో 6 వేలకు మందికి పైగా టీచర్లున్నారు. వీరికి నెలసరి వేతనాలే జీవనాధారం. ఈ పరిస్థితుల్లో వేతనాలు డ్రా చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు బ్యాంకుల్లో జమ చేస్తే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలి. ఉపసంహరణ పరిమితిని పెంచాలి. మాతో పాటు సామాన్య ప్రజలకు కూడా కౌంటర్లు పెంచాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. - పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, -
జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లు
న్యూఢిల్లీ: జన్‌ధన్ ఖాతాలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కాసులతో కళకళలాడుతున్నాయి. గత 13 రోజుల్లో ఈ ఖాతాల్లోకి రూ. 21 వేల కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ అయిన రాష్ట్రాల్లో.. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ సీఎంగా ఉన్న పశ్చిమ బెంగాల్ తొలి స్థానంలో నిలవగా కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. నవంబర్ 9 నాటికి 25.5 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో ఉన్న రూ. 45,636.61 కోట్లు నిల్వ ప్రస్తుతం రూ. 66 వేల కోట్లను దాటినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల్లో డిపాజిట్ పరిమితి రూ. 50 వేలు. కాగా జన్‌ధన్ ఖాతాల్లోకి భారీగా నగదు చేరిందన్న వార్తల నేపథ్యంలో ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స యూనిట్(ఎఫ్ఐయూ) విచారణ ప్రారంభించింది. అనుమానాస్పద ఖాతాల వివరాల్ని సేకరించే పని మొదలుపెట్టింది. -
‘తపాలా’లో కాసుల గలగల
13 రోజుల్లో రూ.421 కోట్లు కొత్తగా 5 వేల పొదుపు ఖాతాలు సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు వ్యవహారం తపాలా శాఖకు మాత్రం కొత్త ఊపునిచ్చింది. ముందెన్నడూ లేనిస్థాయిలో కేవలం 13 రోజుల్లో ఏకంగా రూ.421.5 కోట్ల డిపాజిట్లు నమోదయ్యాయి. సాధారణ రోజుల్లో ఇది రూ.100 కోట్లు కూడా ఉండకపోవడం గమనార్హం. తెలంగాణ తపాలా సర్కిల్ పరిధిలో నెలకు అతికష్టమ్మీద రూ.200 కోట్ల డిపాజిట్లు కూడా రావు మరి. అలాంటిది నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.421.5 కోట్లు జమయ్యారుు. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధితో కూడిన హైదరాబాద్ సిటీ రీజియన్ పరిధిలో రూ.195.35 కోట్లు, మిగతా జిల్లాలతో కూడిన హైదరాబాద్ రీజియన్ పరిధిలో రూ.226.15 కోట్లు సమకూరాయి. ఇక ఆర్బీఐ, స్టేట్‌బ్యాంకులు కొంతమేర నగదును తపాలా కార్యాలయాలకు పంపడంతో వారం పాటు జనం క్యూ కట్టి పాత నోట్లు మార్చుకున్నారు. రూ.161.71 కోట్ల నగదు మార్పిడి జరిగింది. కొత్తగా 5 వేల ఖాతాలు ఎప్పుడూ తపాలా కార్యాలయం గడప తొక్కని యువత కూడా ఇప్పుడు వాటిల్లో పొదుపు ఖాతాలు తెరిచేందుకు క్యూ కడుతోంది. తెలంగాణ తపాలాశాఖ పరిధిలో అన్ని రకాలు కలుపుకొని 2 కోట్లకుపైగా ఖాతాలున్నారుు. అందులో పొదుపు ఖాతాల సంఖ్య 50 లక్షల వరకు ఉంది. అరుుతే గత పది రోజుల్లో కొత్తగా ఐదు వేల వరకు ఖాతాలు తెరవడం విశేషం. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోనే 3,500 కొత్త ఖాతాలున్నాయి. తపాలా ఖాతాలపై అవగాహనలేనివారు కూడా నోట్ల మార్పిడి కోసం వచ్చి ఖాతాల వివరాలు తెలుసుకుని తెరుస్తున్నట్టు తపాలా సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ ఊపు కొద్దిరోజుల్లో తగ్గినా.. తపాలాపై ప్రచారం పెరిగిందని, భవిష్యత్తులో ఖాతాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. కొత్త ఖాతాలతోనే ఆదాయం తపాలా కార్యాలయాల్లో డిపాజిట్లు ఎంత పెరి గినా వాటితో తపాలా శాఖకు పెద్దగా ప్రయో జనమేమీ ఉండదు. ఆ మొత్తం నేరుగా కేంద్ర ఆర్థిక శాఖకే జమవుతుంది. కేంద్రం అవస రాలకు, అభివృద్ధి పనులకు ఆ నిధులను వాడుకుంటుంది. కొత్త ఖాతాలు తెరిస్తే.. ఒక్కో ఖాతాకు రూ.235 చొప్పున తపాలాకు కేంద్రం చెల్లిస్తుంది. నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త ఖాతాలకు జనం మొగ్గు చూపుతుండడంతో.. తపాలాశాఖకు ఆదాయం సమకూరనుంది. ప్రజలు కొత్త ఖాతాలు తెరిచేలా తపాలా అధికారులు కూడా ప్రచారం చేస్తున్నారు. -
ఏం చర్యలు తీసుకుంటున్నారు..
- సామాన్యులకు ఇబ్బందులను దూరం చేసేందుకు ఏం చేశారు - పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి - నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం - విచారణ మూడు వారాలకు వారుుదా సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు.. ముఖ్యంగా రోజూ వారీ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జీవనోపాధి లేక పస్తులు ఉంటున్నారని, వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ రియాజుద్దీన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యా జ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రోజూ వారీ కూలీలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు నోట్ల రద్దు వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, పూట కూడా గడవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది యాసర్ మమూన్ తెలిపారు. వారికి తిండి, ఆర్థిక సా యం అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలన్నారు. ఈ సమయంలో ధర్మా సనం స్పందిస్తూ, నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలు కొన్ని వారాల్లో పరిష్కారమవు తాయని చెబుతున్నారని వ్యాఖ్యానించింది. నోట్ల రద్దు పెద్ద విషయం.. సంయమనం పాటించాలి నోట్ల రద్దుకు సంబంధించిన వ్యాజ్యాలపై కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లుందని, దాని సంగతేమిటని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది బి.నారాయణరెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. నోట్ల రద్దుపై అన్ని హైకోర్టుల్లోని కేసులను బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసిందని, దానిపై బుధవారం విచారణ జరగనుందని ఆయన తెలిపారు. తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి పాలు, ఇతర ఆహారపదార్థాలు అందించడంతో పాటు తదుపరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాసర్ కోరారు. ఎవరు.. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో నిర్దిష్టంగా చెబితే వారికి సాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు వీలవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. సమస్య దేశవ్యాప్తంగా ఉందని యాసర్ చెప్పడంతో, అటువంటప్పుడు తాము ఆదేశాలు ఎలా ఇవ్వగలమని, కొన్ని విషయాల్లో న్యాయస్థానాలు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుందని, నోట్ల రద్దు పెద్ద విషయమని, కొన్ని సమస్యలు ఉంటాయని, వాటిని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే పిటిషనర్ కోరినవన్నీ చేయడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. -
గల్ఫ్‌కూ తాకిన నోట్ల రద్దు సెగ
-
ప్రధానిది తొందరపాటు నిర్ణయం
ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. నల్లధనాన్ని నిరోధించడానికంటూ ప్రధాని అకస్మాత్తుగా విసిరిన బాణం దిశ మారి పేదలను తీవ్రంగా తాకింది’అని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. బురక్రథకుని వేషధారణలో తిరుపతి వీధుల్లోకి వచ్చిన ఎంపీ.. సోమవారం ఉదయం తిలక్‌రోడ్డులోని ఘంటసాల సర్కిల్లో మోదీ నిర్ణయంపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బుర్రకథ రూపంలో ఆయన ప్రజలకు వివరించారు. -
ఉసురు తీసిన పింక్ నోటు
సకాలంలో చిల్లర దొరక్క ఆస్తమాతో బాధపడుతున్న తాపీ మేస్త్రి మృతి కిండ్ర (రాజవొమ్మంగి): పెద్ద నోట్ల రద్దు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంటే, మరో వ్యక్తి జేబుకు చిల్లు పెట్టింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామంలో రూ.2 వేల నోట్లకు సకాలంలో చిల్లర దొరక్క ఆస్తమాతో బాధపడుతున్న ఓ తాపీమేస్త్రి మృతి చెందాడు. గ్రామానికి చెందిన గంగబోయిన కృష్ణ (45) వ్యవసాయంతో పాటు తాపీపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల కిందట తాను సాగు చేసిన పత్తి అమ్మగా రూ.2 వేల నోట్లు రెండు అందాయి. అప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న అతడు వైద్యం కోసం మైదాన ప్రాంతంలోని ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆదివారం పగలంతా రూ.2 వేల నోట్లకు చిల్లర కోసం తిరిగాడు. ఆస్పత్రికి వెళ్లాలని, చిల్లర ఇప్పించాలని పలువురిని ప్రాధేయపడ్డాడు. చివరకు ఒక నోటుకు చిల్లర లభించింది. ఆ సొమ్ముతో కిండ్ర నుంచి తన మోటారు సైకిల్‌పై సాయంత్రం ఏలేశ్వరం వైపు పయనమయ్యాడు. అప్పటికే శ్వాస ఆడక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కృష్ణ ఊరి చివరకు వెళ్లేసరికే మోటారు సైకిల్‌పై నుంచి కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాలుగు వేల కోసం వెళితే లక్ష ఖర్చు మార్టూరు: ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన పొత్తూరి సత్యబ్రహ్మం స్థానిక గన్నవరంలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తుంటాడు. స్థానిక స్టేట్ బ్యాంకులో రూ. 4 వేల నోట్లు మార్చుకోవటానికి శనివారం క్యూలో నిలుచున్నాడు. బ్యాంకు గేటు తెరవడంతో తొక్కిసలాటలో గాయపడ్డాడు. చిన్న గాయమనుకుని ఆస్పత్రికి వెళ్లిన బ్రహ్మ ంకు వైద్యులు షాకిచ్చారు. వెన్నెముక, నడుముకు మధ్య ఉన్న జాయింట్ విరిగినందున సర్జరీ చేయాలని చెప్పారు. లక్ష రూపాయలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకుని ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు. -
గల్ఫ్‌కూ తాకిన నోట్ల రద్దు సెగ
విదేశాల నుంచి నిలిచిన ‘మనీ ట్రాన్సఫర్’ - ఇబ్బందుల్లో గల్ఫ్ కార్మిక కుటుంబాలు - అక్కడ డబ్బులున్నా.. ఇంటికి పంపలేని వైనం - రోజుకు రూ. 20 కోట్ల నుంచి 30 కోట్ల వ్యాపారం మోర్తాడ్: పెద్దనోట్ల రద్దు సెగ.. గల్ఫ్‌లోని మన కార్మికులకు తగులుతోంది. అక్కడ పని చేస్తున్న కార్మికులు వారు పొందిన వేతనాలను మనీ ట్రాన్సఫర్ కేంద్రాల ద్వారా స్వగ్రామాల్లోని తమ కుటుంబాలకు పంపిస్తారు. అయితే, మన దేశంలో రూ.500, రూ. 1000 నోట్లు రద్దు కావడం, బ్యాంకుల నుంచి పరిమితంగానే నగదును డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో మనీ ట్రాన్సఫర్ కేంద్రాల నిర్వహణ పూర్తిగా స్తంభించిపోరుుంది. మనీ ట్రాన్సఫర్ కేంద్రాలకు ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు న్నా నగదు డ్రా చేయడంపై ప్రభుత్వం సీలింగ్‌ను విధించడం, కొత్తగా విడుదల చేసిన నోట్లు ఇవ్వడంలో జాప్యం జరగడం తో మనీ ట్రాన్సఫర్ కేంద్రాలు తమ లావాదే వీలను నిర్వహించలేక పోతున్నాయి. గల్ఫ్ దేశాలైన దుబాయ్, సౌదీ అరేబియా, ఖతర్, ఇరాక్, మస్కట్, కువైట్, అబుదాబీ తదితర దేశాల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో అనేక మంది తమ వేతనాలను ఎప్పటికప్పుడు ఇంటికి పంపిస్తుంటారు. గల్ఫ్ దేశాల నుంచి మనీ ట్రాన్సఫర్ కేంద్రాల ద్వారా రోజుకు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు లావాదేవీలు కొనసాగుతాయని అంచనా. గల్ఫ్‌లో మన దేశానికి సంబంధించిన బ్యాం కుల శాఖలు ఉన్నా కార్మికులు ఎక్కువగా మనీ ట్రాన్సఫర్ కేంద్రాలనే ఆశ్రరుుస్తు న్నారు. బ్యాంకు ఖాతాల్లో పంపే డబ్బును ఇక్కడివారు తీసుకోవడానికి కొంత సమ యం పడుతుంది. మనీ ట్రాన్సఫర్ కేంద్రాల ద్వారా పంపించే సొమ్మును క్షణాల్లో తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో అక్కడి వారంతా మనీ ట్రాన్సఫర్ కేంద్రాలనే ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో గల్ఫ్‌లోని కార్మికులు అక్కడ ఉన్న మనీ ట్రాన్సఫర్ కేంద్రాలలో సొమ్ము జమ చేస్తున్నా ఇక్కడ తమవారికి మాత్రం ఆ సొమ్ము అందే లేకుండా పోరుుందని ఆవేదన వ్యక్తమవుతోంది. గల్ఫ్ నుంచి తమవారు సొమ్ము పంపిస్తున్నా ఇక్కడ ఉన్న వారికి డబ్బులు పొందే అవకాశం లేక పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి కార్మికుల వద్ద ఇక్కడి కరెన్సీ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు ముందు జాగ్రత్త చర్యగా మన కరెన్సీని కొంత దాచుకుంటారు. సెలవు సమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సదరు సొమ్ము ఖర్చులకు ఉపయోగపడ తాయనే ఉద్దేశంతో ప్రతి కార్మికుడు మన కరెన్సీని తన దగ్గర కొంత దాచుకుంటాడు. ఒక్కో కార్మికుడి వద్ద రూ.వెరుు్య నుంచి రూ.5 వేల వరకు మన కరెన్సీ ఉంటుంది. అరుుతే, మన దేశంలో రూ.500, రూ.వెరుు్య నోట్లు రద్దు కావడంతో గల్ఫ్‌లో ఉన్న కార్మికులు అయోమయంలో పడ్డారు. గతంలో గల్ఫ్‌లో మన కరెన్సీని మార్చుకోవడానికి మనీ ట్రాన్సఫర్ కేంద్రాలు అనుమతి ఇచ్చేవి. ఇప్పుడు గల్ఫ్‌లోని మనీ ట్రాన్సఫర్ కేంద్రాలు మన కరెన్సీని తీసుకోవడం లేదు. గల్ఫ్ దేశాల్లో మన బ్యాంకులు ఉన్నా.. అవి గల్ఫ్ చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తారుు. విదేశాల్లో మన కరెన్సీతో వ్యాపారం చేయడం ఫెమా చట్టం ప్రకారం నేరం. అందువల్ల గల్ఫ్ దేశాల్లోని మన కార్మికుల వద్ద ఉన్న కరెన్సీ చెత్తబుట్టపాలు అవుతోంది. ఒక్కో కార్మికుని వద్ద రూ. వెరుు్య చొప్పున మన కరెన్సీ ఉంటే దాని విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుంది. ఈ కరెన్సీని ఎలాగైనా మార్చుకోవడానికి విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేయాలని గల్ఫ్‌లో ఉన్న కార్మికులు కోరుతున్నారు. మా కొడుకు డబ్బులు పంపించానని చెప్పాడు మా కొడుకు తెడ్డు సతీష్ మూడు నెలల కింద దోహఖతర్కు వెళ్లాడు. అక్కడ ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల కింద ఫోన్ చేసి డబ్బులు పంపిస్తున్నానని చెప్పాడు. వెస్టర్న్‌మనీ సెంటర్‌కు వెళ్లాం, కోడ్ నంబర్ చెప్పా.. డబ్బులు మా పేరుమీద వచ్చారుు కానీ, ఇప్పుడు ఇవ్వడం కుదరదంటున్నారు. డబ్బులు ఎప్పుడు ఇస్తామో ఇప్పుడు చెప్పలేమన్నారు. - తెడ్డు రాజు, దశరథ్ మోర్తాడ్ చెక్ ఇస్తామంటున్నారు నేను బెహరాన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నా.. నా భార్యకు ఆరోగ్యం బాగాలేక నెల రోజుల కింద ఇంటికి వచ్చాను. కంపెనీ వారు నాకు రూ.25 వేల జీతం డబ్బులు ఇవ్వాల్సి ఉంది. నేను ఇండియాకు వచ్చేటప్పుడు కంపెనీ మేనేజర్ లేకపోవడంతో నా స్నేహితుడిని జీతం తీసుకుని పంపమన్నాను. నా జీతం డబ్బులు నా స్నేహితునికి ఇచ్చారు. యూఏ ఈ ఎక్ఛ్సేంజ్‌కు పంపితే చెక్ ఇస్తామంటున్నారు. - రాకేష్, తొర్తి (బెహరాన్‌లో డ్రైవర్) జీతం పంపానని చెప్పాడు నా కొడుకు సారుుకుమార్ దుబాయ్‌లో పని చేస్తున్నా డు. ప్రతి నెలా 10న నా కొడుకు జీతం వస్తుంది. జీతం పైసలు ఎప్పటి లెక్కనే వెస్టర్న్‌మనీ సెంటర్లో పంపించాడు. వారు డబ్బులివ్వడంలేదు. బాకీలోల్లకు వడ్డీ కట్టాల్సి ఉంది. చిట్టీలు కట్టాల్సి ఉంది. వెస్టర్న్ మనీ సెంటర్లో ఎప్పుడైనా పది నిమిషాల్లో పైసలిచ్చేటోల్లు ఎప్పుడిత్తమో తెల్వదంటాండ్లు. - సాయమ్మ, మోర్తాడ్ డబ్బులు చేతికందక ఇబ్బంది నా కొడుకు సంజీవ్ ఖతర్‌లో పని చేస్తున్నాడు. ప్రతి నెలా 5వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య జీతం డబ్బులు పంపిస్తాడు. ఈసారి కూడా జీతం తీసుకున్నా.. బ్యాంకులల్ల పైసలు ఇస్తలేరనీ, మనీ ట్రాన్స్ఫర్ సెంటర్ వాళ్లుకూడా డబ్బులు ఇవ్వడం లేదని నా కొడుకు చెప్పిండు. మరి ఏం చేస్తం. కొన్నిరోజులైన తర్వాత డబ్బు పంపిస్తానని అతను ఫోన్ చేసిండు. కానీ, మాకు ఇబ్బందిగానే ఉంది. - లక్ష్మి, మోర్తాడ్ -
ముందే సర్దేశారు
- నోట్ల రద్దు చంద్రబాబుకు ముందే తెలుసు: పీఏసీ చైర్మన్ బుగ్గన - హెరిటేజ్‌లోని తన షేర్లను ముందుగానే అమ్ముకున్నారు - రెండున్నరేళ్లలో హెరిటేజ్షేర్ ధర నాలుగున్నర రెట్లు ఎలా పెరిగిందని సూటి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు గురించి సీఎం చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసని, అందుకే తన వ్యవహారాలన్నింటినీ ముందుగానే సర్దుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుపై ముందుగానే సంప్రదించిన కొద్దిమందిలో చంద్రబాబు ఒకరని, అందుకే రద్దుకు రెండు రోజుల ముందే హెరిటేజ్‌లో తన షేర్లను అమ్మేశారన్నారు. కానీ పైకి మాత్రం తానే పెద్ద నోట్ల రద్దు సూచన చేస్తూ లేఖ రాసినట్లుగా ప్రజల్ని మభ్యపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు మార్చి, 2014లో హెరిటేజ్ సంస్థ షేర్ ధర రూ.199గా ఉంటే ఆయన అధికారానికి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.909(నాలుగున్నర రెట్లు)కి పెరిగిందన్నారు. ఇంత తక్కువ కాలంలో ప్రపంచంలోనే ఇన్ని రెట్లు పెరిగిన షేర్లు ఇంతవరకు ఏవీ లేవని బుగ్గన పేర్కొన్నారు. ప్రజల కష్టాలు పట్టవా? పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు పట్టించుకోవట్లేదని బుగ్గన మండిపడ్డారు. ప్రతిసారి.. ఆర్బీఐ, సోషియో ఎకనమిక్ సర్వేలు చెప్పే చంద్రబాబు వాస్తవాలు గుర్తెరగాలన్నారు. అసలు డబ్బులు ఎందుకని, ఆన్లైన్, డెబిట్/క్రెడిట్ కార్డులే వాడాలంటూ ఉచిత సలహాలిస్తున్న చంద్రబాబుకు ప్రజలెలా జీవిస్తారో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలియదని స్పష్టమైందన్నారు. నిరక్షరాస్యత, పేదరికం ఉన్న రాష్ట్రంలో 64 శాతం ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారని, అసలు బ్యాంకు ఖాతాలు లేనివారు కార్డులను ఎలా ఉపయోగిస్తారని నిలదీశారు. దేశంలో 50 శాతానికిపైగా వ్యవసాయరంగం మీదనే ఆధారపడ్డారని, 92 శాతం గ్రామాలకు బ్యాంకుల్లేవని, 53 శాతానికిపైగా ప్రజలకు బ్యాంకు ఖాతాల్లేవని చెప్పారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోలాగా కార్డులు వాడమని సలహాలివ్వటం చంద్రబాబు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. పైగా నాకేం అవసరముందండి... ఇంట్లో కూరగాయలున్నారుు.. ప్రభుత్వం పెట్రోలు కొట్టిస్తుందనటం నిర్లక్ష్య సమాధానాలకు తార్కాణమన్నారు. ఒక్కరోజైనా సొంతగ్రామంలో గడిపి, సన్నిహితులను పిలిచి తన పాలన ఎలా ఉందో తెల్సుకోవాలని ఆయన హితవు పలికారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నేపథ్యంలో అనకాపల్లిలో బెల్లం మార్కెట్ నుంచి బేగంబజార్‌లో మార్కెట్ వరకూ మూతపడ్డాయన్నారు. రాష్ట్రమంతా అల్లాడిపోతుంటే టీడీపీ నేతలు ‘జనచైతన్య యాత్రల’పేర్లతో చేయనివి కూడా చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని బుగ్గన దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతుంటే.. బ్యాంకుల్లో క్యూలలో నించున్నవారికి మజ్జిగ పంచండనటం బాబు హోదాకు తగదన్నారు. సలహా ఇస్తే విమర్శలా కనిపిస్తోంది.. నోట్ల రద్దు తమ వల్ల జరిగిందని చెప్పుకునేందుకు ఆరాటపడుతున్న టీడీపీ నేతలు ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు. అధికారంలో ఉండి చేయటం చేతగాక విపక్షంపై విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. ప్రతిపక్షం అభ్యంతరాలు చెప్పినంత మాత్రాన ప్రభుత్వం ఏమీ ఆపలేదని, వారికి నచ్చింది చేసుకుంటూ పోయారని ఆయన అన్నారు. సలహా ఇస్తే విమర్శలా వారికి కనిపిస్తోందని తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వంద మందికిపైగా మరణించటం, భారీసంఖ్యలో గాయపడటంపై బుగ్గన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతోందన్నారు. ‘ఓటుకు కోట్లు’ దర్యాప్తు నిదానంగా సాగడానికి బాబు పరపతే కారణం ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు నిదానంగా జరుగుతోందని, పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పరపతి సాగుతుందనేందుకు ఇది నిదర్శనమని బుగ్గన అన్నారు. 32 సార్లు తెలంగాణ ఏసీబీ చార్జిషీటులో బాస్ అంటే ఎవరని నమోదైనా కేసు నిదానించడానికి చంద్రబాబు పరపతే కారణమన్నారు. అదే పరపతితోనే పెద్ద నోట్ల రద్దుపై చంద్రబాబు ముందుగానే తెలుసుకుని తన హెరిటేజ్ షేర్లను అమ్ముకున్నారని ఆయన అన్నారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో అసలు ఫోన్ ట్యాప్ చేసే అధికారం మీకేవరిచ్చారని ప్రశ్నించిన చంద్రబాబు.. అదే సమయంలో బ్రీఫ్డ్మీ అన్న గొంతు తనది కాదని అనరు. రేవంత్‌రెడ్డిని తాను పంపించానని చెప్పరు. ఆ డబ్బు తమవి కాదని కూడా అనరు. తద్వారా అన్నింటికీ తప్పు ఒప్పుకుంటూనే వితండ వాదన చేస్తారు’’అని బుగ్గన ధ్వజమెత్తారు. -
‘రెండో స్వచ్ఛత’కు ప్రజల మద్దతు
-
వసతిగృహాలకు ‘పెద్ద’ కష్టం
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఇబ్బందులు - పిల్లల భోజనంలో మాయమైన గుడ్డు, పండ్లు - సాయంత్రం ఇచ్చే చిరుతిళ్లకు బ్రేక్ - గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో డైట్ బిల్లులు - దాదాపు రూ.180 కోట్ల బకాయిలు - ఆందోళనలో వసతిగృహ సంక్షేమాధికారులు సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రభావం సంక్షేమ వసతి గృహాలపై తీవ్రంగా ఉంది. విద్యార్థులకు అందించే భోజనం మెనూలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పౌష్టికాహారం కింద ఇచ్చే గుడ్డు, పండ్లను పలువురు వసతిగృహ సంక్షేమాధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా బడి నుంచి వసతిగృహానికి చేరుకున్న తర్వాత ఇచ్చే చిరుతిళ్ల(స్నాక్స్)కు సైతం మంగళం పాడారు. దీంతో సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులు గత పది రోజులుగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం భోజనంతో సరిపెట్టుకుంటున్నా రు. రాష్ట్రంలో 1,635 సంక్షేమ వసతి గృహాలు న్నారుు. ఇందులో గిరిజన సంక్షేమ శాఖ పరిధి లో 462 హాస్టళ్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కింద 454 హాస్టళ్లు, ఎస్సీ అభి వృద్ధిశాఖ పరిధిలో 719 వసతిగృహాలున్నారుు. వీటిలో రెండు లక్షలకు పైగా విద్యార్థులున్నారు. ఇవన్నీ పాఠశాలస్థారుు హాస్టళ్లే. వీటిలో వసతి పొందే విద్యార్థులు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం.. ఉదయం వస తిగృహంలో బ్రేక్‌ఫాస్ట్(ఉప్మా, పులిహోర, కిచి డీలలో ఒకటి) చేస్తారు. మధ్యాహ్నం పాఠశా లలో మధ్యాహ్న భోజనాన్ని భుజిస్తారు. బడి ముగిసిన తర్వాత సాయంత్రం వసతి గృహా నికి చేరుకుని స్నాక్స్(అటుకులు, చిక్కిలు, ఉడికించిన బొబ్బర్లు, పెసర్లలో ఒకటి) తీసు కోవడంతో పాటు రాత్రి భోజనం చేస్తారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వసతి గృహాల్లో మెనూ తలకిందులైంది. పెద్దనోట్లు మార్కెట్లో చెల్లుబాటు కాకపోవడంతో సంక్షే మాధికారులకు సరుకులు కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోరుుంది. గుడ్లు, పండ్లకు రోజువారీగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు కావడం, కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో సంక్షేమాధికారులు రోజువారీ చెల్లింపులపై చేతులెత్తేశారు. ఫలితంగా విద్యార్థులకు ఇచ్చే కోడి గుడ్డు, పండుకు బ్రేక్ పడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నాలుగు రోజుల వరకు గుడ్లు, పండ్లు పంపిణీ చేశామని, తర్వాతే ఇబ్బందులు వచ్చాయని వికారాబాద్ జిల్లా పరిగి వసతిగృహానికి చెందిన ఓ సంక్షేమాధికారి పేర్కొన్నారు. నిధుల సమస్యకు తోడు నోట్ల రద్దుతో ఇబ్బందులు తలెత్తడంతో శనివారం సాయంత్రం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ఎస్సీ సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులకు చారు, మజ్జిగతో భోజనాన్ని వడ్డించారు. బకాయిలతో మరిన్ని ఇబ్బందులు వసతిగృహాల్లో డైట్ బిల్లుల చెల్లిం పులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.180 కోట్ల బకారుు లున్నారుు. ఈ నిధులను సంక్షేమ శాఖలు విడుదల చేసినప్పటికీ.. ట్రెజరీలు మాత్రం వాటిని సంక్షేమా ధికారుల ఖాతాల్లో జమ కాకుండా నిలిపేశారుు. సంక్షేమ హాస్టళ్లకు ప్రతినెలా పౌరసరఫరాల శాఖనుంచి బియ్యం కోటా విడుదల కావడంతో కొంత ఉపశమనం కలుగుతోంది. కానీ కిరాణా సరుకులు, కూరగాయలు, చిల్లర కొను గోళ్లకు డైట్‌చార్జీలే కీలకం. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో సంక్షే మాధికారులు అప్పులు చేయాల్సి వస్తోంది. నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతో రూ.2లక్షలు అప్పు చేసినట్లు ఓ అధికారి వాపోయారు. -
ఎక్కడి లారీలు అక్కడే!
- ఇసుక, ధాన్యం తరలింపునకు తీవ్ర ఆటంకం - ఫైనాన్స్ సంస్థలకు చెల్లింపులపై - మూడు నెలల మారటోరియం కోసం యజమానుల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం రవాణారంగంపై తీవ్రంగా పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. ఇసుక, ధాన్యం వంటి వాటి రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోరుునందున ఫైనాన్స సంస్థలకు ఇవ్వాల్సిన మొత్తాలపై మూడు నెలలపాటు మారటోరియం విధించాలని లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది. తెలంగాణలో వారం రోజులుగా దాదాపు 40 వేల లారీలకు పని లేకుండాపోరుుందని, ఒక్కో లారీ యజమాని సగటున రోజుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు నష్టపోతున్నారని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రాగానే ఈ మేరకు విజ్ఞాపన అందించాలని సంఘం నేతలు భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లోని గోదావరి తీరం నుంచి ఇసుక తరలింపు దాదాపు తగ్గిపోరుుంది. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి ఈ సమయంలో భారీ ఎత్తున ధాన్యం తరలాల్సి ఉండగా, సరుకు ఎత్తేవారు లేకపోవటం, కొనేవారు సిద్ధంగా లేకపోవటంతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయారుు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతంలో ఏకంగా 500కుపైగా లారీలు ధాన్యం నిలిచిపోరుునట్టు తెలుస్తోంది. రద్దయిన నోట్లు తీసుకోని చెక్‌పోస్టులు మరోవైపు తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద మరోరకం సమస్య ఏర్పడింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే లారీల నుంచి తాత్కాలిక పర్మిట్ ఫీజు కోసం ఏపీ అధికారులు రద్దయిన రూ.వేయి, రూ.ఐదొందల నోట్లు తీసుకోవటం లేదు. డ్రైవర్ల వద్ద రూ.100 నోట్లకు తీవ్ర కొరత ఉండటంతో పెద్ద సమస్యే ఏర్పడింది. వాడపల్లి, గరికపాడు, అశ్వారావుపేట ఏపీ చెక్‌పోస్టుల వద్ద నిత్యం 500 వరకు లారీలు ఈ సమస్యతో నిలిచిపోతున్నాయి. నెల రోజుల తాత్కాలిక పర్మిట్‌కు రూ.5400, వారానికి అయితే రూ.1600 చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత మూడు రోజులపాటు వాటిని స్వీకరించినా ఆ తర్వాత తీసుకోవటం లేదు. అదే ఏపీ నుంచి వచ్చే లారీలకు తెలంగాణ చెక్‌పోస్టుల్లో ఆ నోట్లను తీసుకుంటున్నారు. పాత నోట్లు చెల్లుబాటయ్యేలా ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని లారీ యజమానులు కోరుతున్నారు. -
లిమిట్ దాటిందా? నోటీసులే..!
- భారీగా డిపాజిట్ చేసిన వారికి ఐటీ తాఖీదులు - ఆధారాలివ్వాలంటూ ఆదేశం - పెళ్లికి రూ.2.5 లక్షల విత్‌డ్రాపై ఆదేశాలు అందలేదు: బ్యాంకులు న్యూఢిల్లీ/ముంబై: అక్రమార్కుల పని పడతాం... నల్లధనం గుట్టు రట్టు చేస్తామంటూ పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు అమలవుతోంది? నోట్ల రద్దుతో సామాన్యులకు ఇక్కట్లు తప్పితే... ఇంతవరకూ బడాబాబుల నల్లధనం వివరాలు బయటికి వచ్చాయా? అన్న విమర్శల నేపథ్యంలో ఆ వివరాలు రాబట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ పూర్తి స్థారుులో రంగంలోకి దిగింది. రద్దయిన రూ. 500, రూ.వెరుు్య నోట్లను ఖాతాల్లో భారీగా డిపాజిట్ చేసిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీచేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకు ఖాతాల్లో పరిమితికి మించి వేసిన నగదు వివరాలు వెల్లడించాలంటూ ఐటీ యాక్ట్ 133(6) సెక్షన్ కింద వివిధ నగరాలు, పట్టణాల్లో నోటీసులు ఇచ్చినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. 2.5 లక్షలు దాటి జమైన అనుమానాస్పద ఖాతాలపై బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నోటీసులు జారీచేశామన్నారు. రియల్ ఎస్టేట్, బంగారం వర్తకులపై నిఘా ఖాతాల్లో డిపాజిట్ చేసిన నగదు మొత్తం, తేదీ వివరాలు చెప్పాలని, నగదు ఎక్కడి నుంచి వచ్చిందో పేర్కొంటూ సంబంధిత పత్రాలు, ఖాతా పుస్తకాలు, బిల్లులు సమర్పించాలని నోటీసుల్లో ఐటీ శాఖ కోరింది. ఆ మొత్తానికి ఆదాయపు పన్ను కడితే...రిటర్న్స్ కాపీ జతచేయాలని సూచించింది. నోట్ల రద్దు అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంగారం వర్తకులు, అనుమానిత హవాలా నిర్వాహకుల కార్యకలాపాలపై గట్టి నిఘా కొనసాగుతోంది. సహకార బ్యాంకులపై కూడా నిఘా పెట్టిన ఐటీ శాఖ మంగళూరులో రూ. 8 కోట్ల పాత నోట్ల మార్పిడిని వెలుగులోకి తెచ్చింది. అక్కడి సహకార బ్యాంకులో ఖాతాలు ఉన్న ఐదుగురు ఆ నగదు మార్చినట్లు గుర్తించింది. పన్ను మినహారుుంపులు అనుభవిస్తోన్న వందలాది స్వచ్ఛంద, మత సంస్థలు తమ నగదు నిల్వల వివరాలు తెలపాలంటూ ఇటీవలే ఐటీ శాఖ ఆదేశాలు జారీచేసింది. పెళ్లికి విత్‌డ్రా వచ్చే వారమే: బ్యాంకులు పెళ్లిళ్లకు రూ. 2.5 లక్షల విత్‌డ్రా సౌకర్యం వచ్చే వారం నుంచి ప్రారంభం కావచ్చని బ్యాంకులు చెప్పాయి. శుక్రవారం నుంచి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా.. తమకు ఆర్బీఐ నుంచి మార్గదర్శకాలు ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని పంజాబ్ నేషన్ బ్యాంక్ ఎండీ ఉషా అనంతసుబ్రమణియన్ తెలిపారు. ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుందని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ తెలిపింది. ‘సోమవారం ఆర్బీఐ నిబంధనలు మాకు అందవచ్చు. మంగళవారం నుంచి పెళ్లిళ్ల కోసం బ్యాంకులు డబ్బులు అందచేస్తారుు’ అని అన్నారు. ఏటీఎంల ముందు తగ్గని క్యూ శనివారం బ్యాంకుల ముందు రద్దీ తగ్గినా... ఏటీఎంల ముందు మాత్రం అలానే కొనసాగింది. సొంత బ్రాంచీలోనే నగదు విత్‌డ్రా చేసుకోవాలన్న నిబంధనతో జనం తగ్గడంతో ఖాతాదారులకు విత్‌డ్రా అవకాశం చిక్కింది. ఎక్కువ శాతం ఏటీఎంల్లో నగదు వెంటనే అరుుపోవడంతో క్యూలో నిలబడ్డ చాలామంది నిరాశగా వెనుదిరిగారు. కాగా, మహరాష్ట్రలోని నవీ ముంబైలో వషి వద్ద పోలీసులు రూ. కోటి విలువున్న వెరుు్య రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. -
‘రెండో స్వచ్ఛత’కు ప్రజల మద్దతు
గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్లో మోదీ ముంబై: నల్ల ధనానికి వ్యతిరేకంగా తాను ప్రారంభించిన ‘రెండో స్వచ్ఛత కార్యక్రమా’నికి (నోట్ల రద్దు) ప్రజల మద్దతు ఉందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో శత్రు స్థావరాలను శుభ్రం చేసే చర్యలైనా, దేశంలోని నల్లధనాన్ని శుభ్రం చేసే చర్యలైనా, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని చెప్పారు. ముంబైలో జరిగిన గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌కు పంపిన వీడియో సందేశంలో ఆయన పై మాటలన్నారు. స్వచ్ఛభారత్ విజయవంతమైందని చెప్పారు. దేశంలో నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితిని నోబెల్ గ్రహీత బాబ్‌డిలన్ పాట ద్వారా మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. డిలన్ 1960లో మార్పు అంశంపై ‘ద టైమ్స్ దె ఆర్ ఎ-చేంజింగ్’ అనే పాటను రాసి, పాడారు. ఆ పాటలోని వాక్యాలను మోదీ ఉటంకించారు. ‘2014లో న్యూయార్క్‌లో నేను గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌కు హాజరై ఆస్వాదించాను. ఈ సారి ముంబైలో జరుగుతున్నా రాలేకపోతున్నాను’ అని మోదీ చెప్పారు. కాలం మారుతున్నప్పుడు మనం కూడా పాత దారిని వదిలేయడం మంచిదన్నారు. తాను అభిమానించే కళాకారులు వేరే ఉన్నారనీ, బాబ్ డిలన్, నోరా జోన్స, క్రిస్ మార్టిన్, ఏఆర్ రెహ్మాన్ లాంటివారు ప్రస్తుత తరానికి బాగా పరిచయం ఉన్నవారన్నారు. నటులు అమితాబ్, షారుక్ ఖాన్, కత్రినా కై ఫ్, ఏఆర్ రెహ్మాన్ ఈ కార్యక్రమంలో ప్రదర్శనలిచ్చారు. -
పరిస్థితి ఆందోళనకరం..అల్లర్లకు దారితీయొచ్చు..
పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇక్కట్లపై సుప్రీంకోర్టు - ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు - ఇలాంటి పరిస్థితుల్లో కోర్టుల తలుపులు మూయలేం - హైకోర్టులు నోట్ల రద్దు కేసులను స్వీకరించొద్దన్న అభ్యర్థన తిరస్కరణ న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. తదనంతరం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులు, పోస్టాఫీసుల ఎదుట భారీ క్యూలు తీవ్రమైన అంశమని, ప్రస్తుతం సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే అల్లర్లకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు తలుపులను మూయలేమని, ప్రజలకు కోర్టులను ఆశ్రరుుంచే హక్కు ఉందని, ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 8న పాత నోట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా హైకోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లను విచారణకు స్వీకరించొద్దని, దీని వల్ల గందరగోళం చెలరేగుతుందని కేంద్రం దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. నోట్ల రద్దు, ఇతర సమాచారాన్ని లిఖితపూర్వకంగా సిద్ధం చేసుకోవాలని వివిధ పక్షాలకు సూచిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 25కు వారుుదా వేసింది. ఏ చర్యలు తీసుకున్నారు.. ‘కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రో తెలుసుకోవాలి. ప్రజలు అవసరమైతే హైకోర్టులకు వెళ్లొచ్చు. వారు హైకోర్టులకు వెళ్లకుండా మేము తలుపులు మూసేస్తే.. సమస్య తీవ్రత మాకు ఎలా తెలుస్తుంది. సమస్య తీవ్రతను తెలియ జేసేందుకు ప్రజలు వివిధ కోర్టులకు వెళుతుంటారు’ అని ధర్మాసనం పేర్కొంది. సామాన్యులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు కదా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఇందులో సందేహం ఏమీ లేదని, అరుుతే బ్యాంకుల ఎదుట క్యూల్లో నిలబడే వారి సంఖ్య తగ్గుతోం దని, భోజన విరామ సమయంలో సీజేఐ.. బ్యాంకుల వద్ద క్యూలు ఎలా ఉన్నాయనే విషయాన్ని స్వయంగా పరిశీలించవచ్చని విన్నవించారు. అరుుతే దీనిపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నవంబర్ 8న పాత నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి 47 మంది ప్రాణాలు కోల్పోయారని, బ్యాంకుల్లో కరెన్సీ లేకపోవడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. మార్పిడి పరిమితిని ఎందుకు తగ్గించారు గత విచారణ సందర్భంగా రానున్న రోజుల్లో ప్రజలకు కొంత ఊరట లభిస్తుందని చెప్పారని, ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ఏమిటని ఏజీని సుప్రీం ప్రశ్నించింది. గతంలో మార్పిడి పరిమితి రూ.4,500 ఉంటే ఇప్పుడు దానిని రూ.2,000లకు తగ్గించారని, ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. రూ.100 నోట్లకు ఏమైనా కొరత ఉందా అని ప్రశ్నించింది. దీనికి ఏజీ స్పందిస్తూ.. నోట్ల ముద్రణ తర్వాత దేశంలోని వేలాది కేంద్రాలకు వాటిని బదిలీ చేయాల్సి ఉందని, ఆ తర్వాత వాటిని ఏటీఎంలకు చేరవేయాల్సి వస్తోందని, కరెన్సీ నోట్లకు ఎటువంటి కొరతా లేదని స్పష్టం చేశారు. -
ఉధృతంగా ఉద్యమించండి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా జిల్లాల వారీగా ఉధృతంగా పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉడీ ఘటనలో కంటే నోట్ల రద్దుతో చనిపోరుున వారే ఎక్కువంటూ సైనికుల త్యాగాలను కించపర్చేలా మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని, అప్పటి వరకు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. బీజేవైఎం దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వేముల అశోక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేసి ఆ వర్గాలకు చేరువ కావాలని కోరారు. ‘‘రాష్ట్రం ఏర్పడితే దళితుడే సీఎం అవుతారన్న టీఆర్ఎస్ హామీ మొదలు దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ఫీజు బకారుులవల్ల ఉన్నత చదువుకు నోచుకోకుండా ఉన్న దళిత విద్యార్థులు, బస్తీల్లో పడుతున్న పాట్లు వంటి అంశాలపై బీజేవైఎం క్షేత్రస్థారుులో పోరాటాలను ఉధృతం చేయాలి’’ అని కోరారు. -
ఈ ఇబ్బందులు ప్రసవ వేదన లాంటివి
‘నోట్ల’ రద్దుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వాఖ్యలు సాక్షి, బెంగళూరు: దేశాభివృద్ధికి ప్రధాన సమస్యగా మారిన నల్లధనాన్ని అరికట్టడానికి ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం తలెత్తుతున్న ఇబ్బందులు ప్రసవ వేదన లాంటివని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వాఖ్యానించారు. ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా భవిష్యత్‌లో ఈ నిర్ణయం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. ’నల్లధనం నియంత్రణ’ అనే అంశంపై బెంగళూరులోని భారతీయ విద్యాభవన్‌లో శుక్రవారం జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్లధనంపై మోదీ నేతృత్వంలోని కేంద్రం యుద్ధం ప్రారంభించిందన్నారు. దీని వల్ల మొదట్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నా క్రమంగా వీటి ఫలితాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. పెద్దనోట్ల రద్దు రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. -
‘అవంతి’ అమానుషం!
- పాత నోట్లు మార్చాలంటూ అవంతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వేధింపులు.. - తట్టుకోలేక క్యాషియర్ ఆత్మహత్యాయత్నం! సాక్షి, విశాఖపట్నం/భోగాపురం: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం విశాఖ జిల్లా తగరపువలస సమీపంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఓ క్యాషియర్ ప్రాణం మీదకు తెచ్చింది. పాత నోట్లు మార్చాలంటూ కళాశాల యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తేవడంతో తట్టుకోలేని పరిస్థితుల్లో క్యాషియర్‌గా పనిచేస్తున ్న రెరుు్య సూర్యనారాయణ(58) శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యాజమాన్య వేధింపులు భరించలేకే ఆయన ఇందుకు ఒడిగట్టినట్టు భావిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. అరుుతే ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు చేయాలని అధికారపార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ బంధువులు, కళాశాల నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంఘటనను కవర్ చేయకుండా మీడియాపై ఆంక్షలు విధించారు. ఒక్క పోలీసును కూడా సంఘటన జరిగిన ప్రాంతానికిగానీ, ఆస్పత్రికిగానీ రాకుండా కట్టుదిట్టం చేశారు. బంధువులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నారుు. విపరీతమైన ఒత్తిడి..: జీవీఎంసీ 4వ వార్డు రేవళ్లపాలెంలో భార్య, ముగ్గురు పిల్లలతో నివాసముంటున్న సూర్యనారాయణ విశాఖ జిల్లా తగరపువలస సమీపంలో ఉన్న అవంతి శ్రీనివాస్‌కు చెందిన అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభం నుంచి పనిచేస్తున్నారు. అరుుతే ఇటీవల పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో వాటిని మార్చాలంటూ యాజమాన్యం ఆయనపై ఒత్తిడి తెచ్చింది. నాలుగు రోజులుగా రాత్రిళ్లు ఇంటికి కూడా వెళ్లనివ్వకుండా ఆయన్ను కళాశాలలోనే ఉంచేశారు. అరుుతే ఆయన కుటుంబీకులకు శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో యాజమాన్యం ఫోన్ చేసి.. తెల్లవారుజాము 3.30 గంటల ప్రాంతంలో కళాశాల సమీపంలోని జాతీయరహదారి వద్ద సూర్యనారాయణ పడి ఉన్నారని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. కుటుంబసభ్యులు వివరాలడిగితే చలనం లేకుండా పడివున్నట్టు మాత్రమే చెప్పి ఫోన్ పెట్టేశారు.వారు సంఘటనాస్థలికి వచ్చేలోగానే కళాశాల యాజమాన్యం ఆయన్ను సంగివలస ఎన్ఆర్ఐ జనరల్ ఆసుపత్రిలోని క్యాజువల్ వార్డులో చేర్చించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కి తరలించింది. -
నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు
- సీఎం చంద్రబాబు - సమస్య పరిష్కరించాలని కేంద్రానికి లేఖ సాక్షి, అమరావతి: నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిలో నిరసన వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రూ.1000, 500 నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో ప్రవేశపెట్టిన నోట్లు అందుబాటులోకి సరిగా రాకపోవటం వల్ల చిన్న వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్యూ లైన్లలో నిలబడ్డ దివ్యాంగులు, మహిళలు, వృద్ధులను చూస్తే బాధ కలుగుతోందన్నారు. వారికి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలోని నోట్ల మార్పిడి సమస్య పరిష్కారానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్టు శుక్రవారం విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మీడియాకు వివరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్లు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స ద్వారా పెద్దనోట్ల తాజా పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం విడుదల చేసిన రూ.2000 నోట్లు వల్ల చిన్న వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని సీఎం చెప్పారు. రూ.2000 నోటు కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ఓటు రేటు రూ.2000కు పెరిగే అవకాశం లేకపోలేదని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ నోటు విడుదల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. అవినీతిపరులకు, అక్రమార్కులకు ఎక్కువగా ఉపయోగపడే ఈ నోటు శాశ్వతంగా ఉండే అవకాశం లేదని ఆయన చెప్పారు. ఆన్లైన్ లావాదేవీలకు ప్రోత్సాహకాలివ్వాలి ఆన్లైన్ లావాదేవీలను నిర్వహించే వారిపై విధించే యూజర్ చార్జీలను రద్దు చేయడమే కాకుండా వారికి ప్రోత్సాహకాలను ఇవ్వాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 80 శాతం సబ్సిడీతో ఈ-పాస్ యంత్రాలను సరఫరా చేయాలన్నారు. రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల చిన్న నోట్లు విడుదల చేయాలని కోరారు. సహకార బ్యాంకుల బకారుులను రైతులు చెల్లించేటప్పుడు పాత నోట్లకు అనుమతి ఇచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోల్, గ్యాస్ తదితర అత్యవసర సర్వీసుల్లో ఇచ్చిన మినహారుుంపులు ఇతర ప్రాధాన్యతా రంగాలకు కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ఆర్బీఐ ఏపీని ఒక బ్రాంచిగా కాకుండా ఫ్రధాన రాష్ట్రంగా భావించాలని, ఆర్బీఐ అధికారులు అమరావతికి వచ్చి పనిచేయాలని కోరారు. రాష్ట్రంలోని 29 వేల చౌకధరల దుకాణాలను డిసెంబరు నుంచి విలేజ్ మాల్స్‌గా మార్చుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ’అన్న క్యాంటీన్లు’ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వెంటనే ’అన్న క్యాంటీన్ల’ను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ సమీక్షలో ఆయన మాట్లాడుతూ... అన్న క్యాంటీన్లను ముందుగా నగరాలు, పట్టణాల్లో వాటిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రేషన్ షాపులను రిటైల్ కిరాణా దుకాణాలుగా, మినీ సూపర్ మార్కెట్లుగా మార్పు చేసి నిత్యావసర వస్తువులు అన్నీ అక్కడే లభించేలా చూడాలన్నారు. -
పెళ్లికి 2.5 లక్షలు, రైతుకు 50 వేలు
-
మరో రోజు.. క్యూలోనే..
నోట్ల మార్పిడి కోసం జనానికి తప్పని అవస్థలు - ఇంకా అందుబాటులోకి రాని రూ.500 నోట్లు - బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద బారులు తీరుతున్న జనం - చిల్లర సమస్యతో వ్యాపారాలు బంద్ - కార్డు స్వైపింగ్ యంత్రాల కోసం వ్యాపారుల అర్జీలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు కష్టాలు సామాన్య జనాన్ని మరింతగా ముసురు కుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. దినసరి కూలీలు మొదలు చిరు వ్యాపారులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. షాపింగ్ మాల్స్, కార్పొరేట్, బడా వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ వెలవెలబోరుు కనిపిస్తున్నాయి. గురువారం కూడా బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎం సెంటర్ల వద్ద జనం బారులు తీరారు. కొత్త రూ.500 నోట్లు ఇంకా రాకపోవడం, ఏటీఎంలలో సాఫ్ట్వేర్ మార్చి కొత్త నోట్లను అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏటీఎంలలో నగదు నిల్వచేసిన గంట, రెండు గంటలలోపే అరుుపోతున్నాయి. పలు జాతీయ బ్యాంకులు నగదు మార్పిడి కోసం వచ్చే వారికి సిరా చుక్క పెడుతున్నా.. పలు ప్రైవేటు బ్యాంకులు ఇంకా ఆ పని చేయకపోతుండడంతో కొందరు మళ్లీ, మళ్లీ క్యూ కడుతున్నారు. దీంతో అవసరమున్న వారికి నగదు అందడం లేదు. బ్యాంకర్లు వేలికి పెడుతున్న సిరా చుక్క కూడా సులువుగానే తుడిచివేయవస్తోందని పలువురు పేర్కొంటున్నారు. చిల్లర కోసం కష్టాలు: బ్యాంకుల్లో ఇస్తున్న రూ.2 వేల కొత్త నోట్లు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. నిత్యావసరాలు, పళ్లు, పాలు, కూరగాయల కోసం ఈ నోటుతో వెళితే వ్యాపారులు చిల్లర లేదంటూ తిప్పి పంపుతున్నారు. మాల్స్‌లోనూ రూ.2 వేల కొత్త నోటుతో వెళితే రూ.1,500 మేర కొనుగోలు చేయాల్సిందేనని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులను స్వైప్ చేసిన వారి నుంచి బిల్లుపై నాలుగు శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక చిల్లర అందుబాటులో లేకపోవడంతో పలువురు చిరు వ్యాపారులు, దుకాణదారులు స్వైపింగ్ యంత్రాలు జారీ చేయాలని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు పలు ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులకే నగదు మార్పిడి చేస్తుండడం, మరికొన్ని బ్యాంకుల్లో మధ్యాహ్నం వరకే నగదు మార్పిడికి అనుమతించడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు బడాబాబులు కూలీలను వారి ఆధార్‌కార్డుతో సహా తీసుకొచ్చి క్యూలైన్లలో నిలబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముత్యాల వ్యాపారంపైనా ఎఫెక్ట్ పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పాతబస్తీలోని బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసింది. బంగారు ఆభరణాలు తయారు చేసే కార్మికులు, స్వర్ణకారులు పనిలేక ఇబ్బందులకు గురవుతున్నారు. నోట్ల రద్దుతో అడ్డాకూలీలు సైతం పనుల్లేక, చేతిలో డబ్బుల్లేక దీనంగా కాలం వెల్లదీస్తున్నారు. ప్రతి గురువారం జరిగే జుమ్మెరాత్‌బజార్ సంత కొనుగోలుదారులు లేక వెలవెలబోరుుంది. -
ఉల్లి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఈ నెల 24 వరకు బంద్ ప్రకటించడంతో రైతులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ, అనుబంధశాఖల కార్యదర్శి పార్థసారథి తెలి పారు. గురువారం మలక్‌పేట మార్కెట్ ఉల్లి కొనుగోలు ప్రక్రియను మార్కెటింగ్ శాఖ డైరక్టర్ లక్ష్మీబారుుతో కలసి పరిశీలించి వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో పార్థసారథి భేటీ అయ్యారు. రైతుల నుంచి రూ.8 సహేతుకమైన ధరకు మార్కెటింగ్ శాఖ ఉల్లి కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రరుుస్తుందని ఆయన తెలిపారు. రైతులకు చెక్కులు, ఆన్లైన్, ఆర్జీటీఎస్ ద్వారా చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని మార్కెట్ యార్డులు తెరిచే ఉంచటంతోపాటు స్థానిక వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సంప్రదించి క్రయవిక్రయాలు జరిగేలా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. మార్కెటింగ్ శాఖ జేడీ రవికుమార్, మార్కెట్‌యార్డు కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సహకార బ్యాంకులకు అవకాశం
నోట్ల విషయంలో ప్రధాని పునరాలోచించాలి: పోచారం సాక్షి, మెదక్: నోట్ల రద్దుపై ప్రధాని మోదీ పునరాలోచించాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు దాచుకున్న డబ్బుల కోసం సద్దులు కట్టుకుని బ్యాం కుల వద్ద బారులు తీరుతున్నట్లు చెప్పారు. పెద్దనోట్ల రద్దు కారణంగా రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎకై ్సజ్, ట్రాన్సపోర్టు తదితర శాఖల ఆదాయం సగానికి తగ్గినట్లు వివరిం చారు. సహకార బ్యాంకులకు నోట్లు మార్పిడి చేసుకునే అవకాశం కేంద్రం కల్పించకపోవటం బాధాకరమన్నారు. ఈ చర్య సహకార బ్యాంకులకు రైతులను దూరం చేసేలా ఉందన్నారు. రాష్ట్రంలోని 60 శాతం మంది రైతులు సహకార బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉంటారని తెలిపారు. సహకార బ్యాం కులకు డబ్బులు మార్చుకునే రైతులు తమ అకౌంట్ల నుం చి రూ.50 వేల వరకు డబ్బు లు తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి, ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాసినట్లు వివరించారు. రబీలో రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరిం చారు. త్వరలోనే రైతులకు బ్యాం కుల ద్వారా రుణాలు మంజూరు చేరుుస్తామన్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు దళారులను ఆశ్రరుుంచి మోసపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు లాభం చేకూరేలా నూతన మార్కెటింగ్ విధానం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి ఉన్నారు. -
మోదీ నిర్ణయంపై విపక్షాల వక్రభాష్యం
• బీజేపీ నేత లక్ష్మణ్ పెద్ద నోట్ల రద్దుపై ప్రజలను • తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజం సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుకు తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు వక్రభాష్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మోదీ అనుకున్న విధంగా నల్లధనంపై నియంత్రణ సాధిస్తే రాజకీయంగా తమకు భవిష్యత్ ఉండదని, ఈ నిర్ణయం వల్ల తాత్కాలికంగా ఎదురవుతున్న సమస్యలను దీర్ఘకాలికమైనవిగా ప్రజల్లో భ్రమలు కలిగించేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ నిర్ణయం తర్వాత రాజకీయ పార్టీల అసలు రంగు బయట పడిందన్నారు. కొన్ని పార్టీలు ఏకంగా ఈ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ హెచ్చరికలు జారీచేయడం ఎవరి కోసమని ప్రశ్నించారు. పేదలు కూడా ధైర్యంగా ఎన్నికల్లో నిలబడే పరిస్థితి రావాలన్నది మోదీ లక్ష్యమన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అవేర్నెస్ ఇన్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో ‘‘నల్లధనం-నిర్మూలన-నరేంద్రమోదీ’’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రలోభాలకు గురికాకండి... ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 2004-14 మధ్యకాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ అవినీతి, కుంభకోణాలను పతాకస్థారుుకి తీసుకెళ్లిందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు భూమి, సముద్రం, ఆకాశం అనే తేడా లేకుండా దోచుకుని, విదేశాల్లో డబ్బును దాచుకున్నారని ఆరోపించారు. జన్‌ధన్ ఖాతాల్లో లక్ష,, రెండు లక్షలు వేస్తామని ఎవరైనా వస్తే ప్రలోభాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పేదలకు లక్ష్మణ్ విజ్ఞప్తిచేశారు. ఆ విధంగా చేస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కోల్పోయే ప్రమాదం ఎదురవుతుందని హెచ్చరించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ తిరుపతిరావు మాట్లాడుతూ ఈ నిర్ణయం వల్ల స్వల్పకాలానికి ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలంలో మేలు జరుగుతుందన్నారు. ఆర్థిక నిపుణుడు హన్మాండ్లు మాట్లాడుతూ ఆదాయ మార్గాలు, వచ్చిన ఆదాయం గురించి తెలియజేసి పన్నులు కట్టడం ద్వారా మినహా ఈ నోట్ల రద్దు నిర్ణయం నుంచి తప్పించుకునే అవకాశం లేదని స్పష్టంచేశారు. సంస్థ ప్రతినిధులు రాకా సుధాకరరావు, చక్కిలం రఘునాథ్, తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
పెళ్లికి 2.5 లక్షలు, రైతుకు 50 వేలు
నగదు విత్‌డ్రా నిబంధనల్లో సడలింపు - పెళ్లిళ్లు, పంటల సీజన్ కావడంతో వెసులుబాటు - నగదు మార్పిడి పరిమితి రూ.2 వేలకు తగ్గింపు - నాన్ గెజిటెడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 10 వేల అడ్వాన్స న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నగదు విత్‌డ్రా నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం రోజుకో మార్పు చేస్తోంది. దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు, వ్యవసాయ పనుల సీజన్ కావడంతో బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రాలో వారికి సడలింపునిచ్చింది. పెళ్లిళ్ల కోసం రూ.2.5 లక్షల వరకూ, రైతులు రూ. 50 వేల వరకూ నగదును తమ ఖాతాల నుంచి తీసుకోవచ్చని వెల్లడించింది. అదే సమయంలో నగదు మార్పిడి పరిమితిని రూ. 4,500 నుంచి రూ. 2 వేలకు తగ్గించారు. ‘పెళ్లి పనుల కోసం రూ. 2.5 లక్షల వరకూ ఒక కుటుంబం విత్‌డ్రా చేసుకోవచ్చు. పాన్‌కార్డు వివరాలు, వాంగ్మూలం బ్యాంకుకు సమర్పించాలి. ఒక పెళ్లికి ఒక వ్యక్తే విత్ డ్రా చేసుకోవాలి. తండ్రి, తల్లి, వరుడు, వధువుల్లో ఎవరో ఒకరు తమ ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు. ఖాతాకు తప్పకుండా కేవైసీ(నో యువర్ కస్టమర్) పత్రం ఉండాలి. పెళ్లిళ్ల కోసం విత్‌డ్రా పరిమితి సులభతరం చేయాలని ప్రధాని, ఆర్థిక మంత్రులకు అనేక విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం చెప్పారు. రైతులు తమ ఖాతాల నుంచి నగదు తీసుకునే పరిమితిని రూ. 50 వేలకు పెంచామన్నారు. ‘రైతులు వారానికి రూ. 25 వేల వరకూ తీసుకోవచ్చు. పంట రుణం తీసుకున్న రైతులు, కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు దీన్ని వినియోగించుకోవచ్చు. అలాగే ఆర్టీజీఎస్ లేదా చెక్ ద్వారా ఖాతాలోకి నగదు వస్తే మరో రూ.25 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు. రైతు బ్యాంకు ఖాతాకు కేవైసీ పత్రం జత చేసి ఉండాల’న్నారు. డిసెంబర్ 30 వరకూ ఒక్కసారే నగదు మార్పిడి రోజుకు రూ. 4,500గా ఉన్న నగదు మార్పిడిని రూ. 2 వేలకే పరిమితం చేశారు. డిసెంబర్ 30 వరకూ కేవలం ఒక్కసారే ఈ అవకాశం వాడుకోవాలంటూ నిబంధన పెట్టారు. ‘ఎక్కువ మందికి నగదు మార్పిడి సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు పరిమితి తగ్గించాం. కొందరు వ్యక్తులే పదే పదే బ్యాంకులకు వస్తున్నారు. అందువల్ల చాలామందికి నగదు మార్పిడి అందుబాటులో లేదు.’ అని దాస్ వెల్లడించారు. కేంద్ర ఉద్యోగులకు రూ. 10 వేల అడ్వాన్స్ నాన్ గెజిటెడ్(టైప్ సీ) కేంద్ర ఉద్యోగులు ముందస్తు జీతంగా రూ. 10 వేల నగదు తీసుకోవచ్చు. ఆ నగదును నవంబర్ నెల జీతం నుంచి మినహారుుస్తారు. నగదు విత్‌డ్రా కోసం ఉద్యోగులు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టోల్ మినహారుుంపు 24 వరకు పొడిగింపు జాతీయ రహదారులపై టోల్ ఫీజు రద్దును ఈనెల 24 అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొదట ఈనెల 9 నుంచి 11 వరకు టోల్ ఫీజు రద్దు చేసింది. అనంతరం దానిని 14 వరకు పొడిగించింది. అరుునా చిల్లర సమస్య కొలిక్కిరాకపోవడంతో కేంద్రం మళ్లీ 18 అర్ధరాత్రి వరకు టోల్ రద్దు చేసింది. తాజాగా మళ్లీ ఈనెల 24 అర్ధరాత్రి వరకు టోల్ మినహారుుంపునిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రధాని సమీక్ష పెద్ద నోట్ల రద్దు ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఉన్నత స్థారుు అధికారులతో సమీక్షించారు. బ్యాంకులు, ఏటీఎంల్లో అందుబాటులో ఉన్న నగదుపై ప్రధానికి అధికారులు వివరించారు. పీఎంఓ, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఆత్మహత్యాయత్నమే: శౌరి నోట్ల రద్దు నిర్ణయాన్ని విప్లవాత్మక చర్యగా అభివర్ణించడాన్ని వాజ్‌పేయి హయాం మంత్రిఅరుణ్ శౌరీ తప్పుపట్టారు. బావిలో దూకడం, ఆత్మహత్యా ప్రయత్నం కూడా విప్లవాత్మకమేనని ఎద్దేవా చేశారు ‘ఇది నల్లధనంపై కాదు.. భారత్‌లో నోట్ల చలామణీపై దాడి’ అని అన్నారు. -
రూ.50, 100 నోట్ల రద్దు లేదు
న్యూఢిల్లీ: త్వరలో రూ.100, రూ.50 నోట్లను కూడా రద్దు చేస్తారంటూ వచ్చిన వదంతులను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆ నోట్లను రద్దు చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేసింది. రూ.50/100 నోట్లు చెల్లవంటూ ప్రధానమంత్రి జాతినుద్దేశించి మరోసారి ప్రసంగిస్తారంటూ వచ్చిన వార్తలు కట్టుకథలని తేల్చిచెప్పింది. నోట్ల రద్దుతో ప్రయోజనాల కంటే వ్యయమే ఎక్కువగా ఉందన్న వ్యాఖ్యలను కూడా కేంద్రం ట్విటర్లో కొట్టిపారేసింది. అలాగే బ్యాంకు లాకర్లను, బంగారు, వజ్రాల ఆభరణాలను సీజ్ చేసే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని తెలిపింది. రూ.2వేల నోటు నాణ్యత సరిగాలేదని, నోటు రంగు వెలిసిపోతోందంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ.. దీని గురించి ఆందోళనవసరం లేదని, అదొక భద్రతాపరమైన అంశమని పేర్కొంది. వీటిని ఇంటాగ్లియో ప్రింటింగ్ అనే ఫీచర్‌తో రూపొందించామని, అసలు నోటుపై బట్టతో రుద్ది పరీక్షిస్తే టర్బో ఎలక్ట్రిక్ ప్రభావం వల్ల ఆ ఇంకు రంగు బట్టకు అంటుకుంటుందని తెలిపింది. రూ.2 వేల నోటులో చిప్‌ను దాచి ఉంచారని వచ్చిన వదంతులను తోసిపుచ్చింది. నల్లధనాన్ని నియంత్రించేందుకు విదేశీ ప్రభుత్వాలతో సమాచారాన్ని పంచుకుంటామని, బినామీ లావాదేవీల చట్టంలో సవరణలు తెస్తామని తెలిపింది. నోట్ల రద్దు విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచామని, ఏ ఒక్కరికీ లీక్ చేయలేదని స్పష్టంచేసింది. -
వలస కూలీలకు తప్పని తిప్పలు
-
ఈ నెల.. గడిచేదెలా?
• నవంబర్‌లో రూ.2 వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా • నోట్ల రద్దుతో తక్షణ ప్రభావం.. భవిష్యత్తుపై ప్రభుత్వం ఆరా సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం ఈ నెలలో రూ.2 వేల కోట్లకు పైగా పడిపోతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఆర్థికంగా గడ్డు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమైంది. ఏ రోజుకా రోజు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి భవిష్యత్తుపై వ్యూహ రచన చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. వివిధ రంగాల వారీగా ప్రభుత్వ ఆదాయంపై పడే ప్రభావాన్ని అంచనా వేసుకోవాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించి గడచిన ఏడు నెలల్లో వచ్చిన ఆదాయంతోపాటు నోట్ల రద్దు తర్వాత నవంబర్‌లో వచ్చిన ఆదాయాన్ని బేరీజు వేసుకున్నారు. ప్రదానంగా వ్యాట్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాహనాల కొనుగోళ్లు, రవాణా శాఖ అదాయం గణనీయంగా పడిపోరుుందని అంచనాకు వచ్చారు. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం అరుుదు శాతం కూడా చేరకపోవడాన్ని ఆందోళనకర పరిణామంగా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించటం, భూముల క్రయ విక్రయాలు నిలిచిపోవటంతో దీని ప్రభావం వివిధ రంగాలకు విస్తరిస్తుందనే అభిప్రాయాలపై చర్చించారు. రవాణా శాఖకు రోజుకు రూ.3 కోట్ల గండి వాహనాల కొనుగోళ్లు సగానికి సగం తగ్గిపోవటంతో రవాణా శాఖకు రోజుకు రూ.3 కోట్లకు పైగా గండి పడింది. మద్యం అమ్మకాలపై ఇప్పటికిప్పుడు ప్రభావం లేదని, వచ్చేవారంలో అమ్మకాలు కొంత మేర తగ్గుతాయని అంచనా వేశారు. నగదు చెలామణిలో లేకపోవటంతో బడా మాల్స్ మొదలు చిన్న వ్యాపారాలు దివాళా తీశాయని అధికారులు పేర్కొన్నారు. వరుసగా నాలుగు రోజులు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు దాదాపు 110 శాతం పెరిగినా ఆ తర్వాత బంక్‌లు వెలవెలబోతున్నాయని సంబంధిత అధికారులు వివరించారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయంపై పడే ప్రభావంపై ప్రతిరోజు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. తమ శాఖలలో తలెత్తే ప్రభావాన్ని లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల ద్వారా రాబోయే మాసాల్లో లభించే ఆదాయం, గ్రాంట్స్, తదితర అంశాలపైనా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, ఎస్.పి.సింగ్, ఎంజి.గోపాల్, రంజీవ్ ఆర్.ఆచార్య, ఎస్కే జోషి, అజయ్ మిశ్రా, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిఖ శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇంటెలిజెన్స ఐజీ నవీన్ చంద్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. -
చాయ్ డబ్బా తలకిందులు!
సాక్షి, హైదరాబాద్: ‘‘పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు కడక్ చాయ్ ఇచ్చా.. వారిని వదిలే ప్రసక్తే లేదు..’’ ప్రధాని మోదీ అన్న మాటలివీ! కుబేరుల సంగతేమోగానీ పెద్దనోట్ల రద్దుతో చాయ్‌వాలాల పరిస్థితి మాత్రం తలకిందులవుతోంది!! బతుకుబండిని నడిపించే చాయ్ డబ్బా పట్టాలు తప్పుతోంది. దశాబ్దాలుగా నడుపుకొంటూ వస్తున్న చాయ్ దుకాణాలు వారం రోజుల్లోనే చతికిల పడ్డారుు. మహానగరం హైదరాబాద్‌లో ఇలా చాయ్ డబ్బాలు పెట్టుకొని పొట్టబోసుకునేవారెందరో అష్టకష్టాలు పడుతున్నారు. అందులో యాదగిరి ఒకరు. పెద్దనోట్ల రద్దుతో ఆయన దయనీయ పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నాలుగు దశాబ్దాల ప్రస్థానం.. త్యాగరాయగాన సభ మీదుగా చిక్కడపల్లి నుంచి అశోక్‌నగర్‌కు వెళ్లే మార్గంలో నగర కేంద్ర గ్రంథాలయానికి ఎదురుగా ఉంటుంది యాదగిరి చాయ్ డబ్బా. నలభై ఏళ్లుగా యాదగిరి అక్కడే చాయ్ దుకాణం నడిపిస్తున్నాడు. అప్పట్లో చిక్కడపల్లి ఏ మాత్రం జనసంచారం లేని అతి సాదాసీదా ప్రాంతం. అక్కడొకటి, ఇక్కడొకటి విసిరేసినట్లుగా ఉండే ఇళ్లు, లైబ్రరీ మాత్రమే ఉండేవి. ఆ రోజుల్లో పత్రికలు, నవలలు, కథలు చదివే పాఠకులు చాలా తక్కువ సంఖ్యలో వచ్చేవారు. అలా వచ్చేవారికి కట్ల అబ్బయ్య చాయ్ డబ్బా బాగా పరిచయం. యాదగిరి తండ్రే అబ్బయ్య. తొలినాళ్లలో అబ్బయ్య చాయ్ దుకాణం నడిపించినా ఆ తర్వాత క్రమంగా దాని బాధ్యత యాదగిరిపైనే పడింది. ‘‘పది పైసలు, పదిహేను పైసలు ఉన్నప్పట్నుంచి చాయ్ అమ్ముతున్నం. మా నారుున తర్వాత నేను చాయ్ దుకాణానికి ఎక్కిన తర్వాత చారాణా అరుుంది. అట్లా అట్లా పెంచుకుంటా ఇప్పడు ఆరు రూపాయాల దాకా వచ్చినం’’ అని అన్నాడు యాదగిరి. క్రమంగా చిక్కడపల్లి-అశోక్‌నగర్ మార్గం జనసమ్మర్ధంతో నిండడంతో యాదగిరి కుటుంబం మొత్తం ఈ చాయ్ దుకాణం పైనే ఆధారపడే స్థారుుకి చేరుకుంది. చిల్లర కోసం తలోదిక్కు.. పిడుగుపాటులా వచ్చి పడ్డ నోట్ల కష్టం ఇప్పుడు యాదగిరి కుటుంబానికి పెద్ద కష్టాలనే తెచ్చిపెట్టింది. మొన్నటి వరకు రోజుకు 20 లీటర్ల పాలు ఖర్చయ్యేవి. వెరుు్యకి పైగా చాయ్‌లు అమ్మేవాళ్లు. ఉదయం నుంచి రాత్రి వరకు యాదగిరి, అతని కొడుకులు కలిసి పనిని పంచుకొనేవాళ్లు. ముషీరాబాద్‌లోని ఇంటి దగ్గర నుంచి తెల్లవారు జామున 4 గంటలకు బయల్దేరి బండి దగ్గరకు వస్తే రాత్రి 10 తర్వాత ఇంటికి వెళ్లేవాళ్లు. కానీ వారం రోజుల నుంచి పరిస్థితి మారింది. ఉదయాన్నే తలా ఒక దిక్కు బ్యాంకులకు, ఏటీఎం సెంటర్లకు పరుగెత్తుతున్నారు. నోట్లు మార్చుకొనేందుకు మధ్యాహ్నం వరకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. అరుునా వంద నోట్లు లభించడం లేదు. చిల్లర కొరత భయానకంగా మారింది. ఆ సమయంలో యాదగిరి బండి దగ్గరే ఉండి గిరాకీ చూసుకుంటున్నాడు. చేతిలో చిల్లర లేకపోవడంతో ఉద్దెర బేరానికి తలొగ్గాల్సి వస్తుంది. లేదంటే గిరాకీ వదులుకోవలసి వస్తుంది. ‘‘గిరాకీ బాగా ఉన్న రోజుల్లో ఖర్చులన్నీ పోను రోజుకు రూ.1000 నుంచి రూ.500 ఆదాయం లభించేది. ఇప్పుడు రూ.500 కూడా రావడం లేదు. 20 లీటర్ల పాలు అమ్మిన చోట 10 లీటర్లు కూడా అమ్మలేకపోతున్నాం. పరిస్థితి పూర్తిగా మారింది. వెరుు్య చాయ్‌లు అమ్మిన చోట ఇప్పుడు రెండు, మూడు వందలు కూడా అమ్మలేకపోతున్నాం’’ అంటూ యాదగిరి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘పెద్ద’ దెబ్బ... యాదగిరి, ఆయన తల్లి, ఆయన భార్య, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అంతా కలిపి 15 మందికి ఆ చాయ్ డబ్బాయే ఆధారం. ఆయన భార్య రాజ్యలక్ష్మి కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతోంది. ఇప్పటికే రూ.6 లక్షలు ఖర్చయ్యారుు. తరచుగా ఆసుపత్రికి వెళ్లాలి. రూ.వేలల్లో ఖర్చు. రేషన్, నిత్యాసవరాలు తడిచి మోపెడవుతున్నారుు. ‘‘ఇప్పటి వరకు చాయ్ దుకాణాంపైనే ఆధారపడి అన్ని కష్టాలను గట్టెక్కుతూ వచ్చినం. పరిస్థితి ఇట్లాగే ఉంటే ఏం చేయాల్నో అర్థమైతలేదు. వెనుకటికి ముషీరాబాద్ మహాత్మానగర్ల 50 గజాల ఇంటిస్థలం సంపాదించి పోరుుండు మా నారుున. ఇంటి కిరారుు బాధలు లేవు కానీ. మిగతా ఖర్చులన్నీ భారీగానే ఉన్నారుు’’ అని యాదగిరి చెప్పాడు. ఇలాంటి ఎంతో మంది చాయ్వాలాలు ఇప్పుడు ఆ ‘చాయ్‌వాలా’ సృష్టించి న బాధల సుడిగుండాల్లో చిక్కుకున్నారు. నేనెక్కడికి పోవాలే? ‘‘యాదగిరి చాయ్ డబ్బా అంటే ఈ రాస్తాల అందరికీ తెలుసు. కానీ ఏం లాభం? జేబుల చిల్లర పైసలు లేవని చాలామంది చాయ్ తాగడానికి వస్తలేరు. ఉద్దెర గిరాకీ పెరిగింది. చాయ్‌కి రూ.500 నోటు ఇస్దే దాన్ని తీసుకొని నేనెక్కడికి పోవాలే? అరుునా రాత్రనకా, పగలనకా నా కొడుకులూ, నేను అటు బ్యాంకులకు. ఇటు ఏటీఎం సెంటర్లకు పరుగెత్తుతూనే ఉన్నం. ఎక్కడికి పోరుునా వంద నోట్లు దొరుకుడు కష్టంగానే ఉంది’ - చాయ్‌వాలా యాదగిరి ఆవేదన ఇది. -
మరింత పెరిగిన ‘నోటు’ కష్టాలు
- రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద భారీ క్యూలు - ఖాతాదారులకే సేవలందిస్తున్న బ్యాంకులు.. కోలుకోని వ్యాపారాలు - క్యూలలో నిలబడిన వారికి మంచి నీటి ప్యాకెట్లను సరఫరా చేస్తున్న పలు స్వచ్చంద సంస్థలు సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు, మార్పిడి వ్యవహారంతో జనం కష్టాలు రోజు రోజుకూ మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద క్యూలైన్లు మరింత భారీగా తయారయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 7 వేల ఏటీఎంలు ఉండగా నగదు పెట్టిన ఒకటి రెండు గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. బ్యాంకుల్లోనూ కేవలం రూ.2,000 నోట్లను మాత్రమే ఇస్తున్నారు. మార్కెట్లో వాటికి చిల్లర లభించడం లేదు. దీంతో వ్యాపారాలన్నీ చితికిపోతున్నాయి. పాలు, పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల వ్యాపారులు ఓ వైపు చిల్లర లేక.. మరోవైపు గిరాకీలేక నానా అవస్థలు పడుతున్నారు. ఆటోవాలాలు సైతం చిల్లర సమస్యతో సతమతమయ్యారు. ఉద్యోగులు, కూలీలు బ్యాంకుల వద్ద క్యూలలో నిల్చుని విలువైన పనిగంటలు కోల్పోతున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లలో నిల్చున్న వినియోగదారులకు పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేయడం కనిపించింది. పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాం కులు తమ ఖాతాదారులకు సేవలందించేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో నగదు మార్పిడి కోసం వచ్చినవారు గంటల తరబడి క్యూలలో నిల్చోవాల్సి వచ్చింది. అరుుతే ఆస్పత్రులు, పెట్రోలు బంకులు, బస్సు, రైలు టికెట్ల కొనుగోలుకు ఈనెల 24 వరకు అనుమతించడం కాస్త ఊరటనిచ్చింది. చాలా పెట్రోలు బంకుల్లో రూ.500 పాత నోటుతో వెళితే చిల్లర లేదని.. పూర్తి మొత్తానికి పెట్రోల్/డీజిల్ పోసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. -
ఇంటర్ ఫీజు 21 దాకా కట్టొచ్చు
పరీక్ష ఫీజుల చెల్లింపుపైనా పెద్ద నోట్ల రద్దు ప్రభావం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం పరీక్ష ఫీజులు చెల్లించే విద్యార్థులపైనా పడింది. బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయలేక ఇంటర్ విద్యార్థుల్లో చాలామంది ఇంకా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. సాధారణ గడువులోగా, అంటే ఈ నెల 4వ తేదీలోగా ఫీజు చెల్లించిన వారికి సమస్య తలెత్తకపోరుునా ఆలస్య రుసుముతో చెల్లించేవారు ఇబ్బందులు పడుతున్నారు. రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 14తో ముగిసింది. కానీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల్లో 15 శాతం మంది ఇంకా ఫీజు చెల్లించలేదు. ఈ నేపథ్యంతో రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 21 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపళ్లు ఆలస్య రుసుముతో ఫీజును స్వీకరించాలని, ఆ మొత్తాన్ని 22న మొత్తాన్ని బోర్డుకు పంపాలని సూచించారు. రూ. 50 ఆలస్య రుసుముతో టెన్త ఫీజు చెల్లింపు అవకాశం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఈ నెల 23వ తేదీ వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 1 దాకా, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 9 దాకా చెల్లించవచ్చన్నారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు గడువు అక్టోబరు 31తో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు నవంబర్ 15 దాకా పొడిగించారు. ఆ గడువూ ముగిసినా మరో 10 శాతం విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంది. -
మోదీకి ఎన్డీయే అండ
-
గల్ఫ్‌లోనూ తప్పని నోట్ల కష్టాలు
దుబాయ్: మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై దుబాయ్‌లోని ప్రవాస భారతీయుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇది సరైన నిర్ణయమేనని భారత సంతతి పారిశ్రామిక వేత్తలు భావిస్తుండగా, తమ దగ్గరున్న పెద్ద నోట్లను ఎలా మార్చుకోవాలని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లధనంపై ప్రస్తుత నిర్ణయం కేవలం 10 శాతం కంటే తక్కువే ప్రభావం చూపుతుందని, కానీ తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకునేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తుందని, ఇక్కడి మనీ ఎక్స్చేంజ్ కేంద్రాలు కూడా వాటిని తీసుకోవట్లేదని అక్కడ పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్షద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
మోదీకి ఎన్డీయే అండ
నోట్ల ఉపసంహరణ, సర్జికల్ దాడులకు మద్దతు తెలిపిన మిత్రపక్షాలు న్యూఢిల్లీ: అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స (ఎన్డీయే)లోని అన్ని పార్టీలు పెద్ద నోట్ల ఉపసంహరణ, సర్జికల్ దాడులపై ప్రధాని మోదీ వెంట నిలిచారుు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం సోమవారం జరిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాలపై విపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమని మిత్ర పక్షాలు ప్రకటించారుు. నోట్ల ఉపసంహరణ విషయంలో పునరాలోచించే ప్రసక్తే లేదనీ, నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న మహాయుద్ధం సరైన ఫలితాన్ని ఇస్తుందని భేటీ అనంతరం సమాచార, ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కష్టాన్ని ఓర్చుకుంటూనే నోట్ల రద్దుకు ప్రజలు భారీ మద్దతు తెలుపుతున్నందున పార్లమెంటు సమావేశాల్లో రక్షణాత్మక ధోరణితో వ్యవహరించకుండా ప్రతిపక్షాలకు గట్టి సమాధానమివ్వాలని మోదీ భాగస్వామ్య పక్షాలతో అన్నారు. ప్రజల్లోకి వెళ్లి నోట్ల ఉపసంహరణ వల్ల దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనాలను వివరించాలని ఆయన మిత్ర పక్షాలను కోరారు. శివసేన, శిరోమణి అకాలీదల్‌లు నోట్ల ఉపసంహరణను సమర్థిస్తూనే ప్రజలు పడుతున్న కష్టాలను సమావేశంలో లేవనెత్తారుు. శివసేన తన పత్రిక ‘సామ్నా’లో నోట్ల రద్దును విమర్శించింది. నల్లధనం, నకిలీ నోట్ల నిరోధానికి మోదీ చేపట్టిన చర్యను తామంతా స్వాగితిస్తున్నామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన మౌఖిక తీర్మానాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆమోదించింది. -
ఈ-కామర్స్‌కు ‘నోటు’ పోటు
-
ఈ-కామర్స్‌కు ‘నోటు’ పోటు
• క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల తాత్కాలిక నిలిపివేత.. • నియంత్రణల విధింపు న్యూఢిల్లీ: మోదీ సర్కారు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఈ-కామర్స్ కంపెనీల వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కస్టమర్లు నగదు రూపంలో చెల్లింపులు (సీఓడీ) చేసే ఆర్డర్ల డెలివరీకి బ్రేక్ పడింది. అమెజాన్, పేటీఎం తదితర ఆన్లైన్ విక్రయ సంస్థలు సీఓడీ ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారుు. అరుుతే, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి మరికొన్ని సంస్థలు సీఓడీ ఆర్డర్ విలువపై పరిమితులు విధించారుు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం ఈ-కామర్స్ లావాదేవీల్లో 70 శాతం నగదు రూపంలోనే జరుగుతున్నారుు. దీనిబట్టి చూస్తే, పెద్ద నోట్ల రద్దు ఉదంతం ఈ కంపెనీలకు కొంతకాలంపాటు ఎదురుదెబ్బేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘కొత్త ఆర్డర్లకు సంబంధించి క్యాష్ చెల్లింపులను తాత్కాలికంగా ఆపేశాం. అరుుతే, మంగళవారం(8న) అర్థరాత్రికి ముందు సీఓడీ ఆర్డర్‌ను చేసిన కస్టమర్లకు మాత్రం డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా చెల్లుబాటు అయ్యే డినామినేషన్లలో మాత్రమే చెల్లింపులకు అనుమతిస్తున్నాం’ అని అమెజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు సీఓడీ ఆర్డర్ల విలువను రూ.1,000; రూ.2,000కు మాత్రమే పరిమితం చేశారుు. అది కూడా తక్కువ డినామినేషన్లలోనే చెల్లించాలని సూచించారుు. ఉబెర్, బిగ్‌బాస్కెట్‌లు కూడా తక్కువ డినామినేషన్లలోనే చెల్లింపులు జరపాలని కోరారుు.