
ఇద్దరు చంద్రులకు ఒళ్లంతా మచ్చలే..
• సీఎంలిద్దరూ ప్రధాని మోదీని
• పొగుడుతున్నారు: సీపీఐ నేత నారాయణ
• రిలయన్స్ జియో అవసరాలకే పెద్ద నోట్ల రద్దు
• వరంగల్‌లో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు
సాక్షి, వరంగల్: పెద్ద నోట్ల రద్దుపై మొదట్లో బాధ వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగుడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ‘ఒంటె అందాన్ని చూసి గాడిద ఆశ్చర్యపోతే... గాడిద రాగానికి ఒంటె మూర్ఛపోరుుందనే’ సామెత తరహాలో ఇద్దరు చంద్రుల తీరుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ భిక్ష కావాలని, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూతురు కేంద్ర మంత్రి కావాలని ఉందని... అందుకే ఇద్దరు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వెలుగు నిచ్చే చంద్రుడుకి ఒక మచ్చ ఉంటే... ఇద్దరు చంద్రులకు ఒళ్లంతా మచ్చలే ఉన్నాయన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరుగుతున్న సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ సభలో రెండో రోజు కె.నారాయణ ప్రసంగించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిలయన్‌స కంపెనీ జియోను ఏర్పాటు చేసి డిసెంబర్ వరకు ఉచిత సేవలు అందిస్తుందని.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను మార్చుకునే అవకాశం డిసెంబర్ 30 వరకే కల్పించారన్నారు. ‘జియోలో పెట్టుబడులకు రూ.1.25 లక్షల కోట్లు అవసరం. రిలయన్‌సకు డబ్బు ఇవ్వడానికి పెద్ద నోట్లు రద్దు చేశారు. దీంతో దాచుకున్న డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన సొమ్మును ప్రధాని, రిలయన్‌స పెట్టుబడులకు ఇవ్వబోతున్నారు.
ఇదే అసలు రహస్యం’ అని నారాయణ ఆరోపించారు. మోదీ సామాన్యులను ఇబ్బందులకు గురి చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని అన్నారు. విజయ్‌మాల్యాకు ప్రధాని నరేంద్రమోదీ సహకరించారని ఆరోపించా రు. విజయ్‌మాల్యాకు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు వేరుుంచి గెలిపించిందని, విదేశాలకు పారిపోయేందుకు సహకరించిందన్నారు. డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో సీపీఐ జాతీయ మహాసభలు జరుగనున్నాయని చెప్పారు.
వెంకయ్యది నాలుకా.. తాటిమట్టా..
కమ్యూనిస్టులు బ్లాక్‌మనీ వారిని ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందని, వెంకయ్యనాయుడిది నాలుకా తాటిమట్టా అని నారాయణ ప్రశ్నించారు. నల్లకుబేరులను ప్రోత్సహిస్తున్నది ఎవరో ప్రజాభిప్రాయం సేకరించాలని సవాల్ విసిరారు. కరెన్సీ గౌరవాన్ని కించపరిచిన ప్రధాని మోదీ ప్రజాకోర్టులో శిక్షార్హులని, వంద గుంజీలు తీరుుం చేంత శిక్ష విధించవచ్చని అన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో గెలవకపోతే ప్రధాని పదవి ఊడి పోతుందనే భయంతో మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.