రూ.705 కోట్ల సహకార పంట రుణాలు | abard to raise Rs 750crore for on-lending to co-op banks | Sakshi
Sakshi News home page

రూ.705 కోట్ల సహకార పంట రుణాలు

Published Wed, Jan 25 2017 2:17 AM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

రూ.705 కోట్ల సహకార పంట రుణాలు

రూ.705 కోట్ల సహకార పంట రుణాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సహకార పంటరుణాల కోసం నాబార్డు అదనంగా రూ.705 కోట్లు విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా సహకార పంట రుణాల మంజూరు మందగించడం, రబీలో రైతులకు పంట రుణాలు అందని నేపథ్యంలో ఆర్‌బీఐ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (టెస్కాబ్‌)కు నాబార్డు ఈ నిధులిచ్చింది. వాస్తవానికి ఈ ఏడాది పంట రుణాలకు నాబార్డు రాష్ట్రానికి రూ.1,270 కోట్లు కేటాయించింది.

రబీలో సహకార బ్యాం కుల ద్వారా రూ.2,200 కోట్ల రుణాలు అందజేయాల్సి ఉండగా నాబార్డు అదనం గా విడుదల చేసిన నిధులతో మరిన్ని పంట రుణాలు ఇచ్చేందుకు అవకాశం లభించింది. టెస్కాబ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 9 డీసీసీబీ బ్యాంకుల పరిధిలో 272 బ్రాంచీలు ఉండగా వాటిల్లో 12 లక్షల మంది రైతులకు ఖాతాలున్నాయి. ఈ రైతులందరికీ ఆయా సహకార బ్యాంకు బ్రాంచీల్లో రూ.4 వేల కోట్ల వరకు డిపాజిట్లు న్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement