ఎక్కడి లారీలు అక్కడే!
- ఇసుక, ధాన్యం తరలింపునకు తీవ్ర ఆటంకం
- ఫైనాన్స్ సంస్థలకు చెల్లింపులపై
- మూడు నెలల మారటోరియం కోసం యజమానుల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం రవాణారంగంపై తీవ్రంగా పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. ఇసుక, ధాన్యం వంటి వాటి రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోరుునందున ఫైనాన్‌స సంస్థలకు ఇవ్వాల్సిన మొత్తాలపై మూడు నెలలపాటు మారటోరియం విధించాలని లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది. తెలంగాణలో వారం రోజులుగా దాదాపు 40 వేల లారీలకు పని లేకుండాపోరుుందని, ఒక్కో లారీ యజమాని సగటున రోజుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు నష్టపోతున్నారని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రాగానే ఈ మేరకు విజ్ఞాపన అందించాలని సంఘం నేతలు భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లోని గోదావరి తీరం నుంచి ఇసుక తరలింపు దాదాపు తగ్గిపోరుుంది. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి ఈ సమయంలో భారీ ఎత్తున ధాన్యం తరలాల్సి ఉండగా, సరుకు ఎత్తేవారు లేకపోవటం, కొనేవారు సిద్ధంగా లేకపోవటంతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయారుు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతంలో ఏకంగా 500కుపైగా లారీలు ధాన్యం నిలిచిపోరుునట్టు తెలుస్తోంది.
రద్దయిన నోట్లు తీసుకోని చెక్‌పోస్టులు
మరోవైపు తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద మరోరకం సమస్య ఏర్పడింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే లారీల నుంచి తాత్కాలిక పర్మిట్ ఫీజు కోసం ఏపీ అధికారులు రద్దయిన రూ.వేయి, రూ.ఐదొందల నోట్లు తీసుకోవటం లేదు. డ్రైవర్ల వద్ద రూ.100 నోట్లకు తీవ్ర కొరత ఉండటంతో పెద్ద సమస్యే ఏర్పడింది. వాడపల్లి, గరికపాడు, అశ్వారావుపేట ఏపీ చెక్‌పోస్టుల వద్ద నిత్యం 500 వరకు లారీలు ఈ సమస్యతో నిలిచిపోతున్నాయి. నెల రోజుల తాత్కాలిక పర్మిట్‌కు రూ.5400, వారానికి అయితే రూ.1600 చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత మూడు రోజులపాటు వాటిని స్వీకరించినా ఆ తర్వాత తీసుకోవటం లేదు. అదే ఏపీ నుంచి వచ్చే లారీలకు తెలంగాణ చెక్‌పోస్టుల్లో ఆ నోట్లను తీసుకుంటున్నారు. పాత నోట్లు చెల్లుబాటయ్యేలా ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని లారీ యజమానులు కోరుతున్నారు.