Finance companies
-
కిస్తీ కోసం కుస్తీ!
‘ భార్యా భర్తలతో పాటు ఇంటిల్లిపాదీ కాయకష్టం చేసుకుని, సంవత్సరాల తరబడి కిస్తీలు కట్టుకుంటూ ఇంటిలో ఒక్కొక్కటిగా సమకూర్చుకున్న వస్తువులన్నీ వరద పాలయ్యాయి. నష్టపరిహారం ఇస్తామంటూ రెండుసార్లు వచ్చి రాసుకుని వెళ్లినా.. ఇంతవరకు సాయమందలేదు. అందుకోసం ఇప్పుడు నేను కూలి వదిలేసుకుని ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా. కిస్తీ కట్టలేదని ఫైనాన్స్ వాళ్లు నా బైక్ తీసుకెళ్లిపోయారు. మా అకౌంట్లో ఉన్న కాస్త డబ్బులను కూడా ఫైనాన్స్ వాళ్లు లాగేసుకుంటున్నారు. ఇక మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వగలం’ అంటూ వాంబే కాలనీకి చెందిన తాపీ కార్మికుడు ఆకుల గణేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘వరదల్లో మునిగిన ఆటోకు రూ.10వేలు సాయం చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే వరకు ఫైనాన్స్ కంపెనీలు ఊరుకోవు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోన్లు చేసి డబ్బులు కట్టమని వేదిస్తున్నారు. కిస్తీ కట్టకుంటే బండి తీసుకెళ్లిపోతారు. అలా జరిగితే నేను ఇప్పటి వరకు కట్టిన 22 కిస్తీలు, డౌన్ పేమెంట్ మొత్తం పోయినట్టే. ఇన్నాళ్లూ బండి నడవకున్నా అప్పు చేసి కిస్తీ కట్టాను. మరో రూ.15వేలు అప్పులు తీసుకుని రిపేర్ చేయించాను. మా ఇళ్లు నీట మునిగిపోయినా.. నా ఆటో పాడైనా ప్రభుత్వ జాబితాలో పేరు లేదంటున్నారు. ఎక్కడికి వెళ్లి ఎవరిని అడగాలో తెలియడం లేదు’ అంటూ వాంబే కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కె.రమేష్ వాపోయాడు. సాక్షి, అమరావతి: విజయవాడను బుడమేరు వరద విడిచిపెట్టినా.. ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రం పట్టిపీడుస్తోంది. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడిన జీవితాలకు భరోసా కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ‘తాంబూళాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి’ అన్న చందాన వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించి.. దానిని పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైంది. సోమవారం విజయవాడలోని వాంబేకాలనీ, వడ్డెర కాలనీ, శాంతిప్రశాంతి నగర్లో సాక్షి క్షేత్ర స్థాయిలో పర్యటించగా.. వరద బాధితులు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉక్కిరిబిక్కిరవుతూ కనిపించారు. నెలవారీ కిస్తీలు కట్టలేక దిక్కులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మారటోరియం ఇస్తారంటూ చేసిన ప్రకటనలు ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడంలేదు. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకర్లతో సమావేశం పెట్టి ఈఎంఐలు కట్టుకోవడానికి సమయం ఇచ్చేలా ఒప్పించామంటూ చేసిన హడావుడితో ఒనగూరిందేమీ లేదని తేలిపోయింది. రోజు ఉదయాన్నే ఫైనాన్స్ కంపెనీలు బాధితులకు ఫోన్లు చేసి వాయిదాలు కట్టాల్సిందేనని వేదిస్తుండం పరిపాటిగా మారింది. నష్ట పరిహారం అందకపోవడంతో బంధువులు, స్నేహితుల నుంచి అప్పులు చేస్తున్నారు. తీరా ఆ మొత్తం బ్యాంకు ఖాతాల్లో పడిన వెంటనే కిస్తీల రూపంలో సదరు ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు లాగేసుకుంటున్నాయి. జీరో అకౌంట్‌కు 15 రోజులా? సాధారణంగా బ్యాంకులో కొత్తగా ఖాతా తీసుకోవాలంటే ఒక్క రోజులోనే పూర్తవుతుంది. కానీ, వరద ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో సుమారు 15 రోజులు పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాలు ఏదో ఒక ఈఎంఐకు లింక్ పెట్టి ఉండడంతో.. ఒకవేళ ప్రభుత్వ సాయం అందితే.. ఆ మొత్తం పాత ఖాతాలో పడితే ఎక్కడ బ్యాంకర్లు, ఫైనాన్స్ కంపెనీలు లాగేసుకుంటాయోనని బాధితులు నానా అగచాట్లు పడుతున్నారు. జీరో అకౌంట్ల కోసం బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్‌కు, బ్యాంకు ఖాతాలకు, ఫోన్ నంబర్లు ఒకదానికొకటి లింక్ కాపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎన్యుమరేషన్లో బైక్‌లు వదిలేసి.. వరద బాధితులకు నష్ట పరిహారం అందించే క్రమంలో వీలైనంత వరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఎన్యుమరేషన్ ప్రక్రియలో చాలా కుటుంబాలకు చెందిన ద్విచక్ర వాహనాలు, ఆటోలను కావాలనే విస్మరించింది. దీంతో వాహనాలు దెబ్బతిన్న బాధితులు నష్టపోయారు. తీరా అకౌంట్లలో నగదు జమవుతుందని తెలిసి సచివాలయాలకు వెళ్లడంతోఎన్యుమరేషన్లో తమ వాహనాలు నమోదు చేయలేదని తెలుసుకున్నారు. మళ్లీ కొత్తగా దరఖాస్తులు పట్టుకుని సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు బైక్‌లకు రూ.3వేలు, ఆటోలకు రూ.10 వేలు సాయం ఎంత మందికి ఇచ్చారన్నదే ప్రశ్నార్థకం. -
18 లక్షల జాబ్స్.. అభ్యర్థులు కరువు!
దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని వార్తల్లో చూస్తున్నాం. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు వేల సంఖ్యలో అభ్యర్థులు వస్తుండటం గమనిస్తున్నాం. అయితే ఆర్థిక సేవల రంగంలో మాత్రం సరైన అభ్యర్థుల్లేక లక్షల్లో జాబ్స్ ఖాళీగా ఉన్నాయి.గత ఏడాది ఆర్థిక సేవల రంగంలో దాదాపు 18 లక్షల ఉద్యోగాలు అభ్యర్థులు లేక ఖాళీగా ఉండిపోయాయని, దీంతో ఆ రంగం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా (ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్) ఉన్నతాధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.ఆర్థిక సేవల రంగంలో దాదాపు 6,000 మందికి ఉపాధి కల్పిస్తున్న గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీ వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో దాదాపు 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా సీఈవో క్రిషన్ మిశ్రా పీటీఐకి తెలిపారు."గత సంవత్సరం, కేంద్ర ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్ అందించిన డేటా ప్రకారం, భారత్ ఆర్థిక సేవలలో 46.86 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. వాటిలో 27.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. 18 లక్షల ఉద్యోగాలకు అభ్యర్థులు లేరని చూపిస్తోంది. ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాటికి తగిన సామర్థ్యం కలిగిన అభ్యర్థులు లేరు" అని మిశ్రా అన్నారు."బ్యాంకులు, బీమా కంపెనీలు, బ్రోకరేజ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు ఎల్లప్పుడూ శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుంది. మీరు ఆన్లైన్ జాబ్ సెర్చ్ చేస్తే, ప్రస్తుతం ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (CFP) నిపుణులకు 40 రెట్లు అధికంగా ఉద్యోగఖాళీలున్న విషయం తెలుస్తుంది”అని పేర్కొన్నారు. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా 2.23 లక్షల మంది సీఎఫ్‌పీ నిపుణులు ఉండగా భారత్‌లో 2,731 మంది మాత్రమే ఉన్నారు. -
కొత్తగా ‘160’ సిరీస్ ఫోన్ నంబర్లు.. ఎవరికంటే..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల ‘160’ సిరీస్ నంబర్లను ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఉన్న సంస్థలు మొదటి దశలో సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం '160' ఫోన్ నంబర్ సిరీస్‌కు మారుతున్నట్లు ట్రాయ్ తెలిపింది.అంటే ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర సంస్థల నుంచి సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ '160'తో మొదలయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తాయి. మోసగాళ్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించడంలో సహాయపడటానికి ట్రాయ్ ఈ చర్య తీసుకుంది.ట్రాయ్ అధికారులు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 25కు పైగా బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ బ్యాంకులు, టెల్కోలు సహా ఇతర ఆర్థిక సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రమోషనల్ అవసరాల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న 140 సిరీస్ కార్యకలాపాలను డీఎల్టీ (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ)కి మార్చడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు, డిజిటల్ సమ్మతిని కూడా అమలు చేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం 160 సిరీస్, మార్కెటింగ్ కోసం 140 సిరీస్‌ను అమలు చేయడంతో.. 10 అంకెల నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ పై గణనీయమైన నియంత్రణ ఉంటుందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలకు చెందిన 10 అంకెల స్పామ్ నంబర్లలో చాలా వరకు కృత్రిమ మేధను ఉపయోగించి టెల్కోలు నేరుగా బ్లాక్ చేస్తున్నాయి. -
రాష్ట్రంలోని చిట్ ఫండ్ కంపెనీలపై రెండో రోజు తనిఖీలు
-
ఏపీలో 18 చిట్ ఫండ్ సంస్థల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలు
-
ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్! అంతకు మించి!
న్యూఢిల్లీ: చౌక గృహ రుణ మార్కెట్లో మరింత పురోగమించడానికి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందడుగు వేసింది. ఐదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)లతో సహ–రుణ ఒప్పందాలను (కో–లెండింగ్) కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. గృహ రుణాల విషయంలో ఎటువంటి సేవలకూ నోచుకోని, పొందలేని అసంఘటిత, అల్పాదాయ వర్గాలే ఈ ఒప్పందాల లక్ష్యమని వివరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విభాగాల్లో రుణ మంజూరీలకు కృషి చేస్తామని తెలిపింది. ప్రాధాన్యతా రంగానికి రుణాల కోసం బ్యాంకులు, హెచ్ఎఫ్సీ, ఎన్బీఎఫ్సీలు సహ రుణ పథకాలు రూపొందించడానికి ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యలో ఎస్బీఐ తాజా అవగాహనలు కుదుర్చుకుంది. ఆర్థిక వ్యవస్థలోని అట్టడుగు, అసంఘటిత రంగాల్లో తక్కువ వడ్డీకి రుణ లభ్యత ఉండాలన్నది ఆర్బీఐ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. ఐదు సంస్థలూ ఇవీ... ఎస్బీఐ ఒప్పందం చేసుకున్న ఐదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్, ఎడెల్వీస్ హౌసింగ్ ఫైనాన్స్, కాప్రి గ్లోబల్ హౌసింగ్ ఫైనాన్స్‌లు ఉన్నాయి. ఎస్బీఐ ప్రకటన అంశాలను విశ్లేషిస్తే... ►చౌక గృహాల కొరత భారతదేశానికి, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్), సమాజంలోని అట్టడుగు, అసంఘటిత వర్గాలకు ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఈ సవాళ్లు తగ్గించడానికి ఎస్బీఐ తన వంతు కృషి చేస్తుంది. ► ఐదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహకారం బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐ రుణ పంపిణీ నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తుంది, ► 2024 నాటికి అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ దార్శినికత దిశలో పురోగతికి ఈ ఒప్పందాలు దోహదపడతాయి. రుణ విస్తరణ లక్ష్యం... అసంఘటిత, బలహీన వర్గాలకు గృహ రుణ విస్తరణ జరగాలన్నది మా అవగాహనల లక్ష్యం. భారతదేశంలోని చిన్న గృహ కొనుగోలుదారులకు సమర్థ వంతమైన, సరసమైన వడ్డీలకు రుణాలను వేగవంతం చేరాలన్న బ్యాంక్ లక్ష్యాన్ని చేరుకోడానికి ఇటువంటి భాగస్వామ్యాలు దోహదపడతాయి. – దినేష్ ఖారా,ఎస్బీఐ చైర్మన్ 20:80 విధానంలో... ఆర్బీఐ 20:80 సహ–లెండింగ్ నమూనా ప్రకారం సంయుక్తంగా కస్టమర్లకు సేవలు అందిస్తాము. చౌక విభాగంలో హౌసింగ్ డిమాండ్ విపరీతంగా ఉంది. కో–లెండింగ్ మోడల్ ద్వారా మేము మా పూచీకత్తు సామర్థ్యాల మెరుగుదలనూ కోరుకుంటున్నాము. – రవి సుబ్రమణియన్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ విస్తరణకు మార్గం ఎస్బీఐతో వ్యూహాత్మక భాగస్వామ్యం మా రిటైల్ హోమ్ లోన్ సెగ్మెంట్ సేవల విస్తరణలో ఒక కీలకమైన ఘట్టం. భారత్‌లోని శ్రామిక, అసంఘటిత, అట్టడుగు వర్గాలకు హౌసింగ్ రుణాల విషయంలో మెరుగైన సేవలందించేందుకు దీనివల్ల మాకు వీలు కలుగుతుంది. – హరదయాళ్ ప్రసాద్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ అండ్ సీఈఓ లాభాలను పెంచుతుంది.. ఒప్పందం రెండు సంస్థల లాభదాయకతను పెంచడానికి, హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియోలను విస్తరించడానికి సహాయపడుతుంది. విలువైన ప్రతి రుణగ్రహీతకు మరింత ఫైనాన్స్ అవకాశాలను సృష్టిస్తుంది. సామాన్యుని సొంత ఇంటి కల నెరవేర్చడంలో ఈ భాగస్వామ్యం కీలకమవుతుంది. – రాజేష్ శర్మ ,కాప్రి గ్లోబల్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ ఆకర్షణీయమైన రేట్లకే... ఈ ఒప్పందం కింద.. రుణ గ్రహీతను గుర్తించడం, రుణాన్ని మంజూరు చేయడం, వసూలు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తాం. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో మరింత విస్తరించేందుకు అలాగే రుణ గ్రహీతలకు ఆకర్షణీయమైన రేట్లకే రుణాలు అందించడానికి ఒప్పందం దోహదపడుతుంది. – మోను రాత్రా,ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్ చీఫ్ -
ఘరానా మోసగాడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల్ని మోసం చేసిన ఘరానా నిందితుడు దీపక్ కిండోను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు రూ.200 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడిన ఇతనిపై ఆయా రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం వెల్లడించారు. ఒడిశాలోని రూర్కెలా కేంద్రంగా పనిచేస్తున్న సంబంధ్ ఫిన్‌సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు దీపక్ ఎండీ, సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. నాబార్డ్‌కు అనుబంధంగా పనిచేసే నవ్‌సమృద్ధి ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సంబంధ్ సంస్థ పేరుతో దీపక్ రూ.5 కోట్ల క్రెడిట్ ఫెసిలిటీ తీసుకున్నాడు. 2019 మార్చి ఒకటిన ఈ మొత్తాన్ని తన సంస్థ ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో నవ్‌సమృద్ధి నిర్వాహకులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. -
ఆకర్షణీయంగా ఆటోమొబైల్, కార్పొరేట్ బ్యాంకులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్, కార్పొరేట్ బ్యాంకులు, పటిష్టమైన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, ఫార్మా, టెలికం సంస్థలు ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉన్నాయని ఐటీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ సీఈవో జార్జి హెబర్ జోసెఫ్ తెలిపారు. పదేళ్ల వ్యవధిలో రియల్టీ కూడా మంచి రాబడులు అందించగలదని పేర్కొన్నారు. మరోవైపు అధిక వేల్యుయేషన్స్ ఉన్న ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ స్టేపుల్స్ వంటి రంగాల సంస్థలకు దూరంగా ఉండటం శ్రేయస్కరమని బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. స్మాల్ క్యాప్ సంస్థల విషయంలో బులి‹Ùగా ఉన్నట్లు జోసెఫ్ చెప్పారు. స్మాల్ క్యాప్ ఫండ్ ఏర్పాటుకు ఆర్బీఐ అనుమతి వచ్చిన పక్షంలో వచ్చే ఏడాది జనవరిలో దీన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం తమ సంస్థ ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) రూ. 200 కోట్లుగా ఉందన్నారు. 13 శాఖలు ఉండగా.. మార్చి ఆఖరు నాటికి 25కి పెంచుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు, తాజాగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజి ఫండ్‌ను ప్రారంభించినట్లు జోసెఫ్ తెలిపారు. ఇది డిసెంబర్ 23తో ముగుస్తుంది. సందర్భానుసారంగా ఈక్విటీ, డెట్ సాధనాల్లోకి ఇన్వెస్ట్ చేస్తూ మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్ ప్రత్యేకతని జోసెఫ్ చెప్పారు. -
బ‘కాసు’రులు..
ఎవరైనా.. ఆపదలో ఉన్నామని గొంతు చించుకుని గోలపెట్టినా చిల్లిగవ్వ బయటకు తీయని నైజం.. ఎక్కడ మోసపోతామోనని అనుక్షణం అప్రమత్తంగా ఉండే తత్వం.. రూపాయి ఇస్తున్నామంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే గుణం.. ఇదీ ప్రస్తుతం లోకం పోకడ. ఇలాంటి సమాజంలో పిల్లల పెళ్లనో.. పిల్లాడి చదువనో.. ఇంకేదో భవిష్యత్తు అవసరాలనో పొదుపు చేసే బడుగు జీవులు ‘పైకం’ పోకడ తెలీక ఆర్థిక మాయగాళ్ల ఉచ్చులోపడి మోసపోతున్నారు. అక్రమార్కుల హంగూ ఆర్భాటం, అధిక వడ్డీల ఎరకు చిక్కుతున్నారు. నమ్మించి జనాల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డులు తిప్పేసే మోసగాళ్ల ఉదంతాలు జిల్లాలో తరచూ వెలుగు చూస్తున్నాయి. అయినా ప్రజల్లో మార్పు రానంతకాలం కుచ్చుటోపీ పెట్టే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి. సాక్షి, ఏలూరు(తూర్పుగోదావరి): బ్యాంకుల్లో పొదుపు చేస్తే తక్కువ వడ్డీ వస్తుందని, బయటైతే వందకు రూ.2 వడ్డీ వస్తుంది కదా అని పేదలు, బడుగు జీవులు బడాబాబుల హంగూఆర్భాటం చూసి ప్రైవేటు కంపెనీల్లో కోట్లాది రూపాయలు డిపాజిట్లు చేసేస్తున్నారు. ఆ తర్వాత ఆ సంస్థలు చేతులెత్తేస్తే లబోదిబోమంటూ గగ్గోలు పెడుతున్నారు. చిన్న మొత్తాల్లో డిపాజిట్లు చేసే అనేకమంది బడుగుజీవులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అగ్రిగోల్డ్ ఉదంతం కళ్ల ముందే ఉన్నా ఇంకా ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు, అనధికార చిట్స్ వైపు ప్రజలు మొగ్గు చూపుతూనే ఉన్నారు. జిల్లాలో గతంలో ఇటువంటి ఘటనలు ఎన్ని జరిగినా జనంలో అధిక వడ్డీ ఆశలు పోవడంలేదు. ఘటన జరిగినప్పుడు జరిగింది మన ఊరిలో కాదుగా.. మనం డిపాజిట్ చేసిన వ్యక్తి చాలా మంచివాడు అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే చిట్‌ఫండ్, ఫైనాన్స్, రియల్ఎస్టేట్ వ్యాపారులకు ఒక వరంలా మారుతోంది. రెండేళ్లలోనే రూ.2కోట్ల 28లక్షలు స్వాహా! జిల్లాలో ఇటువంటి ఫైనాన్స్ కంపెనీలు అనేకం బోర్డు తిప్పేస్తున్నాయి. 2017–18లో 11 సంస్థలు బోర్డు తిప్పేస్తే, 2018–19లో ఇప్పటి వరకూ ఐదు సంస్థలు బోర్డు తిప్పేశాయి. అధికారికంగా రెండు కోట్ల 38 లక్షల రూపాయలు నష్టపోయినట్లు ఫిర్యాదులు అందాయి. ఇటీవలే నరసాపురంలో చిట్స్ పేరుతో ఒక కుటుంబం రూ.ఐదు కోట్లకు టోపీ పెట్టింది. ఏప్రిల్‌లో తణుకులో ఒక ఫర్నిచర్ షోరూమ్ స్కీమ్‌ల పేరుతో ప్రజలను మోసగించి బోర్డు తిప్పేసింది. పాల‘ఘెల్లు’! తాజాగా పాలకొల్లు ప్రాంతానికి చెందిన ఓ ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ రూ.108 కోట్లకు బోర్డు తిప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పైనాన్సర్ వద్ద ఉన్న ఆస్తుల విలువలు లెక్కిస్తే సుమారు రూ.40 కోట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. చిన్నచిన్న డిపాజిటర్లు మాత్రం ఎవరిని కలుసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన కొందరు బడాబాబులు మాత్రం అతని ఇంటి చుట్టూ తిరిగేస్తున్నారు. తమ సొమ్ములు మాత్రం పూర్తిగా ఇచ్చేయాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నట్లు తెలిసింది. ఆ పట్టణంలో ఓ సెటిల్మెంట్ బ్యాచ్ నిర్వాహకునితో కలిసి మరో వ్యాపారి తాము సెటిల్ చేస్తామని, అయితే తమ వారికి మాత్రం పూర్తిగా బాకీ చెల్లించేయాలంటూ ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. గతంలో డిపాజిట్లు చేసిన చిన్న డిపాజిట్‌దారులు, బడా బాబులు ఇప్పటి వరకూ వడ్డీల రూపంలో ఎంతోకొంత తీసుకున్నారని, తాము మాత్రం ఇటీవలే ఇచ్చామని తమ సొమ్ములు పూర్తిగా వెనక్కి ఇవ్వాలని వారు సదరు నిర్వాహకునిపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి నెలా టంఛన్‌గా వడ్డీలు చెల్లించే సదరు సంస్థ నిర్వాహకుడు గత మూడు నెలల నుంచి వడ్డీలు చెల్లించడం లేదని సమాచారం. కానీ ఫైనాన్స్ వ్యాపారి మాత్రం అందరికీ సొమ్ములు ఇచ్చేస్తానంటూ చెబుతున్నా డిపాజిట్‌దారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులను ఆశ్రయించేందుకు మరికొందరు సన్నద్ధం అవుతున్నారు. -
అట్టపెట్టెలో అరవైఐదు లక్షలు!
సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ సాయంత్రం 4 కావస్తోంది. ముంబై వెళ్లేందుకు నలుగురు వ్యక్తులు ప్లాట్‌ఫాంపై కొన్ని అట్టపెట్టెలతో నిలుచుని ఉన్నారు. పది నుంచి ఇరవై బాక్సులను రైల్లో ఎక్కించేందుకు సిద్ధపడుతుండగా రైల్వే పోలీసులు వచ్చి వాటిల్లో రెండు బాక్సులను తెరచి చూశారు. అట్టపెట్టెల్లో పైన ఎల్ఈడీ బల్బులు వాటి కింద నోట్ల కట్టల్ని చూసి షాక్ అయ్యారు. తర్వాత అన్ని బాక్సుల్లో ఉన్న రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. జనరల్ రైల్వే పోలీసు విభాగం ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వెంటనే రంగంలోకి దిగారు. హవాలా కాదు..: ఈ నెల 5న వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై రైల్వే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముందు హవా లా డబ్బుగా భావించినా విచారణలో ఆసక్తికరమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన పలు ఫైనాన్స్ సంస్థలు హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో జీరో దందా చేస్తున్న వ్యాపారులకు ఏటా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అప్పులిచ్చాయి. వీటికి సంబంధించి ప్రతి నెలా చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను ఈ విధంగా పంపిస్తున్నారు. ముంబైకి చెందిన 4 ప్రధాన ఫైనాన్స్ కంపెనీలు బేగంబజార్ నుంచి వడ్డీ సొమ్మును రెండున్నరేళ్లుగా ఇదే రీతిలో తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది. ఎలాంటి సందేహం రాకుండా ఉండేందుకు వడ్డీ వ్యాపార మాఫియా ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్లు బయటపడింది. వడ్డీకిచ్చిన సొమ్ముకు లీగల్‌గా లెక్కాపత్రం లేకపోవడంతో తిరిగి వసూలు చేసుకునే వ్యవహారాన్నీ చీకటి మార్గం లోనే చలామణీ చేస్తున్నట్లు గుర్తించారు. ఆంధ్రా పార్శిల్స్ కేంద్రంగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బాలపై ఉస్మాన్‌గంజ్‌లోని ఆంధ్రా పార్శిల్స్ సర్వీసెస్‌కు చెందిన ప్యాకింగులుండటం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు ఏజెన్సీ వ్యక్తులు బిహార్‌కు చెందిన వారు కావడం, వీరంతా ఆంధ్రా పార్శిల్స్ సర్వీస్‌లో పనిచేస్తుండటం వడ్డీ మాఫియా వ్యవహారంలో కీలకంగా మారింది. ఆంధ్రా పార్శిల్స్ పేరుతో హవాలా సొమ్ము రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రా పార్శిల్స్ మేనేజర్ లాల్జీ పరారీలో ఉండటంతో కేసులో అతడే కీలక సూత్రధారి అని భావిస్తున్నారు. అతడు నేరుగా వెళ్లకుండా వడ్డీ డబ్బులను ఈ రకంగా ముంబై ఫైనాన్స్ కంపెనీలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచే కాకుండా ఆంధ్రా పార్శిల్స్ పేరుతో దేశవ్యాప్తంగా ఇంకా ఎన్ని ప్రాంతాల నుంచి ఇలాంటి దందా సాగుతుందో విచారణలో తెలుసుకుంటామని, లాల్జీ కోసం తమ బృందాలు వెతుకుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఫైనాన్షియర్లు, బేగంబజార్‌కు చెందిన వ్యాపారుల జాబితా కూడా తేలాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. -
ఎక్కడి లారీలు అక్కడే!
- ఇసుక, ధాన్యం తరలింపునకు తీవ్ర ఆటంకం - ఫైనాన్స్ సంస్థలకు చెల్లింపులపై - మూడు నెలల మారటోరియం కోసం యజమానుల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం రవాణారంగంపై తీవ్రంగా పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. ఇసుక, ధాన్యం వంటి వాటి రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోరుునందున ఫైనాన్స సంస్థలకు ఇవ్వాల్సిన మొత్తాలపై మూడు నెలలపాటు మారటోరియం విధించాలని లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది. తెలంగాణలో వారం రోజులుగా దాదాపు 40 వేల లారీలకు పని లేకుండాపోరుుందని, ఒక్కో లారీ యజమాని సగటున రోజుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు నష్టపోతున్నారని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రాగానే ఈ మేరకు విజ్ఞాపన అందించాలని సంఘం నేతలు భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లోని గోదావరి తీరం నుంచి ఇసుక తరలింపు దాదాపు తగ్గిపోరుుంది. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి ఈ సమయంలో భారీ ఎత్తున ధాన్యం తరలాల్సి ఉండగా, సరుకు ఎత్తేవారు లేకపోవటం, కొనేవారు సిద్ధంగా లేకపోవటంతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయారుు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతంలో ఏకంగా 500కుపైగా లారీలు ధాన్యం నిలిచిపోరుునట్టు తెలుస్తోంది. రద్దయిన నోట్లు తీసుకోని చెక్‌పోస్టులు మరోవైపు తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద మరోరకం సమస్య ఏర్పడింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే లారీల నుంచి తాత్కాలిక పర్మిట్ ఫీజు కోసం ఏపీ అధికారులు రద్దయిన రూ.వేయి, రూ.ఐదొందల నోట్లు తీసుకోవటం లేదు. డ్రైవర్ల వద్ద రూ.100 నోట్లకు తీవ్ర కొరత ఉండటంతో పెద్ద సమస్యే ఏర్పడింది. వాడపల్లి, గరికపాడు, అశ్వారావుపేట ఏపీ చెక్‌పోస్టుల వద్ద నిత్యం 500 వరకు లారీలు ఈ సమస్యతో నిలిచిపోతున్నాయి. నెల రోజుల తాత్కాలిక పర్మిట్‌కు రూ.5400, వారానికి అయితే రూ.1600 చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత మూడు రోజులపాటు వాటిని స్వీకరించినా ఆ తర్వాత తీసుకోవటం లేదు. అదే ఏపీ నుంచి వచ్చే లారీలకు తెలంగాణ చెక్‌పోస్టుల్లో ఆ నోట్లను తీసుకుంటున్నారు. పాత నోట్లు చెల్లుబాటయ్యేలా ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని లారీ యజమానులు కోరుతున్నారు. -
‘కాల్‌మనీ’ని నీరుగార్చేందుకు కుట్ర
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి కారంపూడి : కాల్‌మనీ వ్యవహారంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం దాన్ని వదిలేసి రాష్ట్రవ్యాప్తంగా ఫైనాన్స్ సంస్థలు నడుపుతున్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలపై పోలీసు సోదాలు నిర్వహిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. వడ్డీ వ్యాపారులను ఇందులో ఇరికించి అన్ని పార్టీల పాత్ర వుందని చెబుతూ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం విఫల యత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారంపూడిలో గురువారం రాష్ట్రస్థాయి ఎండ్ల పందేలను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం దగ్గర కాల్ మనీ నిందితుల పూర్తి సమాచారం వుందన్నారు. కాలయాపన చేస్తే ప్రజలు మర్చిపోతారని హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తానంటోందని ఆరోపించారు. గుంటూరులో వడ్డీ వ్యాపారంతో సంబంధం లేని వైఎస్సార్సీపీ యువజన విబాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించడంతోనే ప్రభుత్వ వైఖరి స్పష్టం అవుతోందన్నారు. ఇలాగానే ఆదుకునేది.. పత్తి ఎకరాకు ఐదు క్వింటాళ్లు దిగుబడి వచ్చి కుమిలి పోతుంటే కనీస మద్దతు ధర రూ.4,100 సీసీఐ కేంద్రాల్లో కూడా ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు. కష్టకాలంలో క్వింటాకు ఆరువేలు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలనే ఆలోచన లేదన్నారు. పత్తి వ్యాపారి వ్యవసాయ మంత్రి ఐతే పరిస్థితి ఇలాగే వుంటుందని రాజశేఖర్ ఎద్దేవా చేశారు నిందితులను రక్షించేందుకే.. : జంగా కృష్ణమూర్తి గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అప్పులు ఇచ్చి పుచ్చు కోవడం అనాదిగా వస్తోందని, అసలు అలా చేయడమే తప్పు అన్నట్లుగా పోలీసు తనిఖీల ద్వారా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. ఇదంతా కాల్‌మనీ నిందితులపై చర్యలు తీసుకోకుండా ఉంటేందుకు ప్రభుత్వం ఆడుతున్న డ్రామాగా పేర్కొన్నారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు బంధువులను బినామీలుగా రంగంలోకి దించి మట్టి నుంచి బ్రాందీ షాపుల వరకు అందర్ని దోచుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కూడా తన తనయుడి ద్వారా దోచుకో దాచుకో పద్ధతికి తెరతీసి మిగతా ప్రభుత్వ పెద్దలకు తప్పుడు మార్గం చూపారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు గజ్జెల బ్రహ్మారెడ్డి, నియోజకవర్గ, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఫైనాన్స్ కంపెనీలపై పోలీసుల దాడులు
నర్సరావుపేట (గుంటూరు) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'కాల్ మనీ' వ్యవహారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న పలువురిని అరెస్ట్ చేయడంతోపాటు ఫైనాన్స్ కంపెనీలపై నిఘా పెంచారు. తాజాగా గుంటూరు జిల్లా నర్సరావుపేటలో గురువారం సాయంత్రం నుంచి పలు ఫైనాన్స్ కంపెనీలతో పాటు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో దాదాపు 100 మంది పోలీసులు పాల్గొంటున్నారు. -
అప్పుకూ కావాలి... మార్కులు!
మీకు కొత్త క్రెడిట్ కార్డు కావాలా? లేదా మీ ప్రస్తుత క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుకోవాలనుకుంటున్నారా? లేదా గృహం... కారు వంటి అవసరాలకు సంబంధించి రుణం కోరుకుంటున్నారా..? విషయం ఏదైనా... మీ రుణ దరఖాస్తుకు ఆమోద ముద్ర వేయాలంటే... బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు- అసలు మీ రుణ సామర్థ్యం ఎంత అన్న అంశాన్ని పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు, లీవరేజ్ వంటి అంశాలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే సాధారణంగా వీటి గురించి చాలా మంది కస్టమర్లకు అసలు అవగాహన ఉండదు. ఆయా అంశాల గురించి తెలుసుకుని ‘మీ రుణ సామర్థ్యం’మీద ఎల్లప్పుడూ బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్ వ్యవస్థలు విశ్వాసం ఉంచుకునేలా చూసుకోవాల్సిన బాధ్యత తప్పనిసరి. క్రెడిట్ స్కోరంటే... క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్- సిబిల్, ఈక్విఫాక్స్ వంటి క్రెడిట్ బ్యూరో సంస్థలు గడచిన 10 సంవత్సరాలుగా వ్యక్తిగత రుణ గ్రహీతలకు సంబంధించిన గణాంకాలను (డేటాబేస్)ను రూపొందిస్తున్నాయి. ఒక వ్యక్తి రుణం... నెలవారీ చెల్లింపుల పరిస్థితి... డిఫాల్ట్‌లు... ఇలా అన్ని విషయాలపై సమగ్ర సమాచారాన్ని సమీకరించి, నిక్షిప్తం చేసుకోవడం ఈ సంస్థల పని. తద్వారా ఆయా వ్యక్తిగత రుణ గ్రహీతలకు తగిన స్కోర్‌ను ఆయా సంస్థలు ఇస్తాయి. ఈ సమాచారాన్ని బ్యాంకింగ్, బ్యాంకింగ్ యేతర రుణ సంస్థలకు క్రెడిట్ బ్యూరోలు అందుబాటులో ఉంచుతాయి. ఏదైనా రుణానికి సంబంధించి రుణ దరఖాస్తు అందడంతోటే- క్రెడిట్ బ్యూరో స్కోర్ ఎంతన్న విషయాన్ని ఆయా ఆర్థిక సంస్థ పరిశీలిస్తుంది. దీనిపైన ఆధారపడే రుణ మంజూరు నిర్ణయం ఉంటుంది. రుణ అప్లికేషన్ ప్రక్రియ పూర్తికి పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సిబిల్ ట్రాన్స్ యూనియన్ స్కోర్‌ను ప్రమాణంగా తీసుకుంటున్నాయి. లీవరేజ్ అంటే... ఇక రుణం పొందడంలో కీలక పాత్ర పోషించేది లీవరేజ్. క్లుప్తంగా... కస్టమర్ రుణ మదింపు ప్రక్రియ ఇది. రుణ దరఖాస్తుదారునికి వచ్చే ఆదాయం ఎంత? ఇప్పటికే అతనికి ఎంత అప్పు ఉంది? (ఫిక్స్డ్ ఆబ్లిగేషన్స్ టూ ఇన్కమ్ రేషియో- ఎఫ్ఓఐఆర్)అన్న అంశం ప్రాతిపదికన ఈ మదింపు జరిగి, ఒక నిష్పత్తిని ఇక్కడ క్రెడిట్ బ్యూరోలు ఇస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలసరి వేతనం లక్ష రూపాయలని అనుకుందాం. నెలవారీ విడతల చెల్లింపులు (ఈఎంఐ) రూ.60 వేలు ఉంది. అంటే ఇక్కడ అతని ఎఫ్ఓఐఆర్ 60 శాతం. ఈ శాతం ఎంత తక్కువ ఉంటే... మీ రుణ దరఖాస్తుకు అంత వేగంగా ఆమోదముద్ర పడే వీలుంటుంది. ఈ శాతం ఎక్కువగా ఉందంటే... అతని రుణ చెల్లింపు సామర్థ్యం తక్కువ అని రుణ సంస్థలు భావిస్తాయి. విభిన్న విధానాలు..! రుణ అవసరం కావచ్చు లేదా దీనితో ముడివడి ఉన్న రుణ మొత్తం కావచ్చు... తాము ఇస్తున్న రుణం విషయంలో క్రెడిట్ బ్యూరో స్కోర్ ఎంత ఉండాలి? ఎఫ్ఓఐఆర్ ఎంత అవసరం? అన్న అంశాల్లో ఒక్కొక్క బ్యాంక్ లేదా బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు తమ తమ స్థాయిల్లో, అంతర్గత రుణ మంజూరు విధానాల మేరకు నడుచుకుంటాయి. మీరు చేయాల్సింది? మీ క్రెడిట్ స్కోర్ అత్యధికంగా ఉండాలంటే... తీసుకున్న రుణాన్ని ఎటువంటి డిఫాల్ట్ లేకుండా సకాలంలో తీర్చడంపై దృష్టి పెట్టాలి. ఇక ఎఫ్ఓఐఆర్ విషయానికి వస్తే- ఆమోద స్థాయిని మించి ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు తీసుకోకుండా ఉండడం ఇక్కడ మీకు కలిసివచ్చే అంశం. మీరు ఒకవేళ రుణానికి దరఖాస్తు పెడితే... సంబంధిత రుణ సంస్థే మీ స్కోర్ లేదా ఎఫ్ఓఐఆర్ను పరిశీలిస్తుంది. మీరూ కావాలనుకుంటే... ప్రత్యక్షంగా క్రెడిట్ బ్యూరోల నుంచి మీ ‘క్రెడిట్ సామర్థ్యం’ స్కోర్ సమాచారాన్నీ పొందవచ్చు. సందేహాలు... ► క్రెడిట్ స్కోర్ లెక్కించడంలో టెలిఫోన్, మొబైల్, విద్యుత్, వాటర్ బిల్లుల చెల్లింపులను ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోవడం లేదు. అయితే ఈ విషయం పరిశీలనలో ఉంది. ► అలాగే వ్యక్తిగత సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, బీమా పథకాలు క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయలేవు. ► ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు గానీ, ఏ రకమైన రుణాలను గానీ తీసుకోకపోయి ఉంటే వారి గురించి సిబిల్ ఎలాంటి నివేదికా ఇవ్వదు. ముఖ్యాంశాలు చూస్తే... ► ఉదాహరణకు సిబిల్ మూడంకెల స్కోర్‌ను వ్యక్తిగత రుణ గ్రహీతలకు ఇస్తుంది. సహజంగా 300 నుంచి 900 మందికి ఈ స్కోర్ ఉంటుంది. ► మీ మార్కులు 900 దరిదాపుల్లో ఉంటే మీ రుణ దరఖాస్తుకు దాదాపు ఎటువంటి అడ్డంకులూ లేనట్లే. అంటే మీ ‘రుణ’ చరిత్ర అంతా పూర్తి సానుకూలంగా ఉందని అర్థం. సకాలంలో రుణ బకాయిలు చెల్లించడం ఈ స్కోర్‌కు చక్కటి మార్గం. ► సెక్యూర్డ్ రుణాలు అంటే... గృహ, ఆటో రుణాల విషయంలో ఆయా సంస్థలు కస్టమర్‌కు 650కి మించి సిబిల్ స్కోర్ ఉండాలని భావిస్తాయి. వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డుల వంటి అన్సెక్యూర్డ్ రుణాల విషయంలో ఈ స్కోర్ 750కి మించి ఉండాలని నిర్దేశించుకుంటాయి. ► రుణ పునఃచెల్లింపుల్లో వైఫల్యాలు, ఆ తరహా ప్రవర్తన, సెటిల్మెంట్లు వంటి అంశాల్లో ఆయా సంస్థల నుంచి పొందిన సమాచారం మేరకు స్కోరింగ్ సంస్థలు ‘రుణ చరిత్ర’కు సంబంధిత కస్టమర్‌కు తక్కువ మార్కులు వేస్తాయి. ఇలాంటి కారణాలు తదుపరి సందర్భాల్లో సంబంధిత రుణ గ్రహీతకు రుణ సంస్థల నుంచి అప్పు పుట్టని పరిస్థితిని సృష్టిస్తాయి. ► ఒక వ్యక్తికి బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో ఎంత అప్పు ఉంది? అతని ఆర్థిక పరిస్థితులు ఏమిటి? వంటి అంశాలు సైతం క్రెడిట్ బ్యూరోలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. ఆయా సమాచారం ప్రాతిపదికన స్కోర్‌ను క్రెడిట్ సంస్థలు రుణ సంస్థలకు అందుబాటులో ఉంచుతాయి. -
‘ఎన్వోసీ’ మాయగాడి అరెస్ట్
10 వాహనాలు స్వాధీనం మరో ఏడు వాహనాల కోసం ఆరా రూ. 2.5 కోట్ల మేర దందా సాక్షి, సిటీబ్యూరో: ఫైనాన్స్ వాహనాలకు నకిలీ ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) సృష్టిస్తాడు. అనంతరం దాన్ని మరొకరికి కట్టబెడతాడు. ఇలా 17 వాహనాలను విక్రయించి ఇటు ఫైనాన్స్ కంపెనీలు, వాహ న యజమానులకు రూ.2.5 కోట్ల కుచ్చు టోపీ పెట్టిన నిందితుడిని సీసీఎస్ పోలీ సులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ పాలరాజు వె ల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఆర్.శ్రీనివాస్‌రెడ్డి (30) డిగ్రీ వరకు చదివాడు. అనంతరం సొం తంగా మెకానిక్ షాప్ పెట్టాడు. ఇందులో లాభాలు రాకపోడంతో మూడు లారీలు ఫైనాన్స్‌పై ఖరీదు చేసి ఇసుక రవాణా మొదలు పెట్టాడు. ఇక్కడ నష్టాలు రావడంతో ఫైనాన్స్‌పై ఉన్న తన మూడు వాహనాలకు నకిలీ ఎన్వోసీలు సృష్టించా డు. ఆర్టీఏ ఏజెంట్ల సహకారంతో ఫెనా న్స్ క్లియర్ అయినట్లు ఒరిజినల్ ఆర్సీలను తయారు చేయించాడు. ఈ ఆర్సీలతో ఆ వాహనాలను ఇతరులకు విక్రయించాడు. డబ్బులు దండిగా వస్తుండడంతో ఇదే రకంగా ఫైనాన్స్‌పై ఉన్న కార్లకు సైతం క్లియర్ అయినట్లు నకిలీ ఎన్వోసీలు తయారు చేసి ఆర్టీఏ నుంచి ఒరిజినల్ ఆర్సీలు సృష్టించి వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఇతని అక్రమాలకు షాద్‌నగర్‌కు చెందిన రాజే ందర్‌రెడ్డి సహకరించాడని సీసీఎస్ ఆటోమొబైల్ టీం ఇన్స్పెక్టర్లు టి.ఎస్.ఎ.ప్రసాద్, మహ్మద్ గౌస్మొహిద్దీన్ల విచారణలో తేలింది. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కారులో నగరానికి వస్తుండగా జూపార్క్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా 17 వాహనాలకు నకిలీ ఎన్వోసీలు సృష్టించి విక్రయించానని అంగీకరించాడు. ఇందులో పది వాహనాలను ఒక లారీ, తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాహనాలను కూడా త్వరలో సీజ్ చేస్తామని పాల్రాజు తెలిపారు. -
అప్పు.. ఆరు రకాలు
అర్జెంటుగా డబ్బు అవసరమైందనుకోండి. ఠక్కున గుర్తొచ్చేది పర్సనల్ లోనే. అసలు పర్సనల్ లోన్స్ ఉన్నదే వ్యక్తిగత అవసరాల కోసం కదా..!! కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీటిపై వడ్డీ రేటు ఎక్కువ. ఇపుడు వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతున్నాయి కనుక మరేంటి దారి? ప్రత్యామ్నాయమేంటి? ఉండకేం!! ఉన్నాయి. మార్కెట్లో తక్కువ వడ్డీకి వచ్చే రుణాలు చాలా ఉన్నాయి. అవసరమైన సందర్భాల్లో వాటిని ఆశ్రయించవచ్చు కూడా. అలాంటి మార్గాల విశ్లేషణే ఈ కథనం... బంగారంపై రుణం బంగారం ధరిస్తే అందం పెరుగుతుంది. అంతేకాదు! ఇది అవసరానికి ఆదుకుంటుంది కూడా. అందరికీ తెలిసిందే అయినా... వ్యక్తిగత రుణానికి సరైన ప్రత్యామ్నాయం గోల్డ్ లోనే. ఈ రుణాలపై వ్యక్తిగత రుణాలకన్నా వడ్డీ రేటు తక్కువ. ప్రస్తుతం బంగారు నాణేలు, ఆభరణాలపై ముత్తూట్, మణప్పురం వంటి ఫైనాన్స్ కంపెనీలు కూడా రుణమిస్తున్నాయి. ఈ బంగారం రుణాలపై వడ్డీ రేట్లు రెండంశాలపై ఆధారపడి ఉంటాయి. మొదటిది సెక్యూరిటీగా ఉంచే బంగారం విలువ ఎంత ఎక్కువ ఉందన్నది. రెండోది తీసుకునే రుణ మొత్తం. అంటే బంగారం విలువకు, తీసుకునే రుణానికి మధ్య తేడా పెద్ద ఎక్కువ లేదనుకోండి. వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. అదే ఎక్కువ విలువైన బంగారాన్ని పెట్టి తక్కువ రుణం తీసుకుంటే వడ్డీ తగ్గుతుంది. ఈ రుణాలకు చాలా తక్కువ ప్రాసెసింగ్ సమయం పడుతుంది. 24 గంటల్లోపే రుణం మంజూరవుతుంది కూడా. తక్కువ డాక్యుమెంటేషన్, అతి తక్కువ ప్రీప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్‌పై.. అత్యవసర సమయాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను బ్రేక్ చేయాల్సిన అవసరం లేకుండా వాటిపైనా రుణం తీసుకోవచ్చు. చాలా బ్యాంకులు డిపాజిట్ మొత్తంలో 75 శాతం నుంచి 85 శాతం దాకా లోన్ ఇస్తాయి. ఇలాంటి రుణాలపై వడ్డీ రేటు విషయానికొస్తే.. సాధారణంగా ఎఫ్డీపై ఇచ్చే దానికన్నా 1-2 శాతం దాకా అధికంగా బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తుంటాయి. అంటే.. మీ ఎఫ్డీపై 8 శాతం వడ్డీ వస్తోందనుకుంటే.. ఆ ఎఫ్డీ మీద తీసుకున్న రుణంపై 9 శాతం నుంచి 10 శాతం దాకా వడ్డీ కట్టాల్సి వస్తుంది. మరో విషయం.. డిపాజిట్ మెచ్యూరిటీ తేదీలోగా రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. బీమా పాలసీలపై రుణం వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇది కూడా మంచి ప్రత్యామ్నాయమే. ఎండోమెంట్ సహా మనకుండే బీమా పాలసీలను తనఖా పెట్టడం ద్వారా ఆ పాలసీల సరెండర్ విలువలో 90 శాతం వరకూ రుణంగా పొందొచ్చు. ఈ రుణాలపై వడ్డీ రేటు 9 నుంచి 13 శాతంగా ఉంటుంది. అయితే మూడేళ్లు అంతకుమించిన కాలానికి రెగ్యులర్‌గా ప్రీమియం చెల్లించిన పాలసీలపైనే ఇలాంటి రుణాలు తీసుకునే అవకాశముంది. ఇక రుణం రావడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. పెట్టుబడులపై రుణాలు.. షేర్లూ, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల మీద కూడా లోన్ పొందడానికి అవకాశం ఉంది. వీటిని గ్యారంటీ పెట్టి రుణం తీసుకోవచ్చు. అయితే, అన్ని రకాల షేర్లూ, డిబెంచర్లకు ఇది వర్తించదు. అప్పు ఇచ్చే సంస్థ ఏయే ఫండ్లు, షేర్లపై రుణాలు ఇవ్వవచ్చన్నది ఒక లిస్టు పెట్టుకుంటాయి. వాటి మీద మాత్రమే ఇస్తాయి. మరో విషయం, వీటి విలువ రోజు రోజూ మారిపోతుంటుంది కనుక అధిక మార్జిన్లు తీసుకుంటాయి. కాబట్టి పది లక్షల విలువ చేసే షేర్లకు పది లక్షల రుణం రాదు.. అంతకంటే తక్కువే చేతికి అందుతుంది. స్థిరాస్తిపై.. ఇల్లు, ప్లాటు, కార్యాలయం వంటి స్థిరాస్తులపైనా రుణాలు లభిస్తాయి. బ్యాంకులు ఆయా ప్రాపర్టీ మార్కెట్ విలువలో 50 శాతం నుంచి 60 శాతం దాకా మాత్రమే రుణం ఇస్తుంటాయి. సాధారణంగా రుణాలిచ్చే సంస్థలు ప్రాపర్టీ విలువను చాలా తక్కువగా లెక్కగట్టే అవకాశం ఉంది కాబట్టి.. మరింత అధిక రుణం పొందాలంటే.. థర్డ్ పార్టీతో వేల్యుయేషన్ చేయించుకుంటే మంచిది. వీటిపై వడ్డీ రేట్లు దాదాపు పర్సనల్ లోన్స్‌పై ఉన్నంత స్థాయిలోనే ఉంటున్నాయి. ప్రాసెసింగ్‌కి వారం, పదిరోజులు సమయం పట్టవచ్చు. కంపెనీ నుంచి లోన్.. ఆర్థిక అవసరాల సమయంలో మీరు పనిచేసే కంపెనీలో శాలరీ అడ్వాన్స్ కోసం ప్రయత్నించడం మరో మెరుగైన ఆప్షను. చాలా మటుకు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇలా లోన్లు ఇస్తుంటాయి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని నెలకి ఇంత చొప్పున జీతంలో నుంచి జమ చేసుకుంటుంటాయి. వీటిపై వడ్డీ రేటు లాంటిదేమైనా ఉన్నా.. అది చాలా తక్కువగా 4 శాతం నుంచి 10 శాతం స్థాయిలో ఉంటుంది. పెపైచ్చు.. మిగతా మార్గాల్లోలాగా వీటికి సవాలక్ష షరతుల్లాంటి సమస్యలు ఉండవు. -
ఒక్కో నేరం ఒక్కో తీరు!
=ఆర్థిక మోసాల నామ సంవత్సరం =గంజాయితో గుప్పుమన్న గ్రామీణ జిల్లా =కొత్త సవాల్ నకిలీ కరెన్సీ =కలవరపరిచే రీతిలో హత్యలు నిర్దాక్షిణ్యంగా పీక నరికేయడం...కత్తితో పొట్టను తూట్లుతూట్లుగా పొడవడం...కసాయిహత్యలకు ఆనవాళ్లు. ఇప్పుడివి విశాఖ జిల్లాలో నిత్యకృత్యమైపోతున్నాయి. జల్సాలకు అలవాటుపడో..అడ్డదార్లో ఆస్తులు సంపాదించేయాలనో...లేదా పాత కక్షలతోనో కిరాతక హత్యలు చేసేవాళ్ల సంఖ్య రానురాను ఎక్కువైపోతుండడంతో 2013 భీతి గొలిపింది. ఇదంతా ఒకెత్తయితే... తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ ఆశచూపి అనేక ఫైనాన్స్ కంపెనీలు ఈ ఏడాదిలోనే జిల్లాలో రూ.925 కోట్లకుపైగా వసూలుచేసి అడ్డంగా బోర్డులు తిప్పేసి జనానికి టోపీ పెట్టాయి. ఇది కాక అడ్డదార్లో సంపాదించాలనుకునే అక్రమార్కులు గ్రామీణ జిల్లాను అక్రమ గంజాయి రవాణాకు అడ్డంగా వాడుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పేరు వినిపించింది. ఈ ఏడాది గంజాయి రవాణా రూ.100 కోట్లు దాటిపోయి పోలీసు శాఖకే సవాల్ విసిరింది. మరోపక్క నకిలీ కరెన్సీ చాపకింద నీరులా జిల్లా అంతటా విస్తరిస్తోంది. అవతారం ఎత్తడం.... ఇలా రకరకాల నేరాలతో విశాఖ ఉలిక్కిపడుతూనే ఉంది. ఈ నేరాల చిట్టా విప్పితే...ఇదిగో ఇలా ఉంది...! రూ.925 కోట్లకుపైగా ఫైనాన్స్ కంపెనీల కుచ్చుటోపీ గడచిన ఏడాదంతా విశాఖకు ‘ఆర్థిక మోసాల నామ సంవత్సరమే’. తక్కువ పెట్టుబడితో ఎక్కువ వడ్డీ ఆశ చూపి వేలాదిమందిని పదుల సంఖ్యలో ఫైనాన్స్ కంపెనీలు నిట్టునిలువునా ముంచేశాయి. సిమ్స్, సురక్ష ఇన్ఫ్రా (5 కోట్లు),స్పార్క్, స్నేహ, సిద్ధివినాయక, రాగా, కోమలి, మేజిక్, తిరుగుణ, కనకగ్రూప్ తదితర ఫైనాన్స్ కంపెనీలు రాత్రికిరాత్రే బిచాణా ఎత్తేయడంతో జిల్లాలో రూ.925 కోట్లకుపైగా ఆర్థికమోసం జరిగింది. వీటిలో ఒక్క సిమ్స్ సంస్థే రూ.321 కోట్లకుపైగా డిపాజిట్‌దారులను మోసం చేయడం అత్యంత సంచలనాత్మకంగా మారింది. ఇదికాక అసలైన డిపాజిట్దారులకే రూ.100కోట్లకుపైగా చెల్లించకుండా ఫైనాన్స్ శుభకార్యాలు,పైచదువుల కోసం డబ్బుదాచుకున్న వేలాదిమంది ఆశలను అడియాసలు చేసి రోడ్డునపడేశాయి. అదేవిధంగా గుడ్‌లక్ ఎంటర్ప్రైజెస్ ఆన్‌లైన్‌ట్రేడింగ్ పేరుతో రూ.6 కోట్లు, కనకగ్రూప్ రూ.5కోట్లు చొప్పున వసూలు చేసి బిచాణా ఎత్తేశాయి. మోసం జరిగిన నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బాధితులకు కనీసం న్యాయం జరగలేదు. గుప్పుమన్న గంజాయి రూ.100 కోట్లకుపైనే జిల్లాలో గంజాయి వ్యాపారం గుప్పుమంటోంది. ఈ ఏడాదంతా అక్రమ రవాణాతో జిల్లా పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఒకప్పుడు పాడేరు, అరకు, చింతపల్లి తదిత ర ప్రాంతాల నుంచి అడపాదడపా రవాణా అయ్యే గంజాయి ఇప్పుడు కొత్తపద్ధతిలో దారి మళ్లుతోంది. అధికంగా రోలుగుంట మీదుగా కార్లలోను, పార్సిల్ వ్యాన్లలోను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఈవిధంగా జిల్లాలో ఈ ఏడాదిలో రూ.100 కోట్లకుపైగా రవాణాతోపాటు వ్యాపారం సాగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసుల విషయానికివస్తే గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని 2013లో మొత్తం 124 కేసులు నమోదు చేస్తే... ఇవి 2012లో 116 కేసులుగా ఉన్నాయి. పట్టుబడ్డ సరకు మొత్తం 11,051 కిలోలు మాత్రమే. వాస్తవానికి అక్రమంగా రవాణా అవుతున్న సరకులో పట్టుబడేది కేవలం పది శాతమేకాగా, మిగిలింది చడీచప్పుడు కాకుండా పోలీసుల కన్నుపడకుండా తరలిపోతున్నదే ఎక్కువ. బెంబేలెత్తించిన ఇసుక మాఫియా గ్రామీణ విశాఖలో ఈ ఏడాది ఇసుక మాఫియా మరింత విజృంభించింది. ఇది నదులు, చెరువులు, వంతెనలతోపాటు సముద్రాన్ని కూడా కబళిస్తూ బరితెగిస్తోంది. పెరుగుతున్న పారిశ్రామిక, ఊపుమీదున్న నిర్మాణరంగ అవసరాలను సొమ్ము చేసుకుంటూ కనిపించిన చోటల్లా ఇసుకను రాత్రికిరాత్రే ఊడ్చిపారేసింది. దీనికి రాజకీయ అండదండలు కూడా తోడవడంతో ఇసుక మాఫియా విర్రవీగుతోంది. జిల్లాల్లో రియల్ఎస్టేట్ రంగం ఊపుమీదుండడంతో ఇసుకకు ఊహించని డిమాండ్ పెరిగిపోయింది. దీంతో అధికారికంగా ప్రభుత్వం నుంచి తవ్వకాలకు అనుమతి లేకపోవడంతో జిల్లాలో శారద, తాండవ నదులతోపాటు రైవాడ, కోనాం, కల్యాణపులోవ , మేఘాద్రిగెడ్డ, గంభీరం ,బొడ్డేరు, తాచేరు, తాటిపూడి, ఆండ్ర రిజర్వాయర్లలో ఈ ఏడాదంతా భారీ ఎత్తున ఇసుక తన్నుకుపోయారు. ప్రస్తుతం జిల్లాలో 30కిపైగా మండలాల్లో ఇసుక మాఫియా విస్తరించింది. ఈఏడాది ఇసుక అక్రమ వ్యాపారం రూ.80 కోట్లకుపైగానే జరగడం గమనార్హం. హత్యలు... రోడ్డు ప్రమాదాలు గ్రామీణజిల్లాలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు కలవరపరిచే స్థాయికి వెళ్లాయి. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా దీనిప్రభావం అనేక కుటుంబాలపై పడింది. ఈ ఏడాది మొత్తం 797 రోడు ్డప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా అనకాపల్లి, యలమంచిలి, చోడవరం తదితర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. హత్యల విషయానికివస్తే 2013లో వీటి సంఖ్య 42గా నమోదయినట్లు పోలీసు శాఖ లెక్కలు చెబుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య తక్కువే అని చెబుతున్నా హత్యలు జరిగిన తీరు మాత్రం జిల్లాలో శాంతిభద్రతల దిగజారుడును కళ్లకు కడుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక హత్యలు ఈఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. దొంగలు పలుచోట్ల దొంగతనాలకు తెగబడి హత్యలుసైతం చేస్తుండడం జిల్లా ప్రజలకు వణుకు పుట్టించింది. గత ఆగస్టు 19న అనకాపల్లిలో కొందరు దుండగులు ఓ బంగారం వ్యాపారి నుంచి రూ.కోటికిపైగా ఆభరణాలు దొంగించారు. అయితే సదరు వ్యాపారి త్రుటిలో వారి నుంచి ప్రాణాలను కాపాడుకున్నారు. నకిలీ నోట్ల హవా గ్రామీణ జిల్లాకు ఇప్పుడు కొత్తరకం సవాల్ ఎదురవుతోంది. నకిలీ కరెన్సీ పెద్ద సమస్యగా తయారైంది. నిన్న మొన్నటివరకు కేవలం ఏజెన్సీకే పరిమితమైన నకిలీ కరెన్సీ ముఠాలు ఇప్పుడు జిల్లా అంతటా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మైదాన ప్రాంతాలైన నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి తదితర ప్రాంతాల్లో ముఠాలు బరితెగిస్తున్నాయి. అద్దెకు ఇళ్లు తీసుకుని అక్కడే వాటిని ముద్రించడం, అక్కడి నుంచే చలామణీ చేయడం జరుగుతోంది. ప్రధానంగా వారాంతపు సంతలు, చిన్నచిన్న దుకాణాల్లో వీటిని చలామణీ చేసే స్థాయి నుంచి ఏజెంట్లను నియమించుకుని అక్కడి నుంచి దొంగనోట్ల రవాణాతోపాటు చలామణీ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా చలామణీలో ఉన్న నకిలీ కరెన్సీ సుమారు 80 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గింది.. విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గినట్లు జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. విశాలాక్షినగర్ ఏఆర్ పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గడిచిన ఏడాదిలో నేరాలను అదుపు చేయడానికి పోలీసులు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా వివరించారు. మహిళా భద్రత, ఈవ్ టీజింగ్ నిరోధం, ఇసుక మాఫియా, గంజాయి దొంగ రవాణా, హత్యలు, హత్యాయత్నాలు, రోడ్డు ప్రమాదాలు, నక్సలిజం, అక్రమ మద్యం అమ్మకాల అదుపు తదితర విషయాల్లో తీసుకున్న చర్యలను వివరించారు. చిన్న నేరం చేసినవారిని సైతం అదుపులోకి తీసుకొన్నామని, దీంతో కేసుల సంఖ్య పెరిగినా, నేరాల సంఖ్య తగ్గిందని విశ్లేషించారు. ఎస్పీ అందించిన గణాంకాలు ఇవీ. 2014లో తీసుకోదలచిన చర్యలు.. ఈ ఏడాది చేపట్టిన చర్యలను కొనసాగించి రాబోవు సంవత్సరంలో మరిన్ని చర్యలు చేపడతామని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. కొన్ని పోలీస్ స్టేషన్లు పరిధిలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని వాటిని ఒక్కో సీఐకి అప్పగిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, వైద్యం, విద్య, విద్యుత్ సౌకర్యాలు కల్పించడానికి చర్యలు చేపడతామన్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లను మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 2014 ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. పోలీసులకు వ్యక్తిగత రుణాలు ఇంత వరకు ఉన్న రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు పెంచినట్లు తెలిపారు. డెత్ రిలీఫ్ ఫండ్ రూ10,000 నుంచి 15,000 వరకు పెంచామన్నారు. -
ముంచేస్తున్న ఫైనాన్స్ సంస్థలు
= ప్రజల బలహీనతే వాటి నిర్వాహకులకు వరం = నూజివీడు ప్రాంతంలోనే రూ.3.50కోట్లకు టోపీ నూజివీడు, న్యూస్‌లైన్ : ప్రజల అమాయకత్వం.. అత్యాశే పెట్టుబడిగా పుట్టుకొస్తున్న ఫైనాన్స్ సంస్థలు వారిని నిలువునా ముంచేస్తున్నాయి. వీటి మాయాజాలంలో పడి ఆర్థిక, సామాజిక, కుటుంబపరంగా ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఎక్కువ వడ్డీ అశచూ పి అమాయకులైన పేదప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చే సి వారిని మోసగిస్తున్నాయి. గత ఎనిమిది నెలల కాలంలో నూజివీడు ప్రాంతంలో మూడు సంస్థలు బోర్డు తిప్పేశాయి. మైలవరంలో కూడా డిపాజిట్‌దారులను మోసగించిన ఓ సంస్థ భాగోతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలు ప్రారంభంలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ ఏజంట్లను నియమించుకుని డిపాజిట్లు వసూలు చేసి బోర్టులు తిప్పేస్తున్నాయి. ఒక్క నూజి వీడు డివిజన్ పరిధిలోనే దాదాపు రూ.3.50కోట్ల వరకు డిపాజిట్‌దారులు నష్టపోయారు. ఈ సంస్థలు పేద వర్గాల ప్రజలు, రోజువారీ కూలిపనులు చేసుకునేవారు, చేతివృత్తుల వారిని ఆకర్షించి, డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. వీటి మో సాలపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు. రెండేళ్ల క్రితం ఏర్పా టు చేసిన అభయగోల్డ్ సంస్థ నూజివీడు, ముసునూరు,చాట్రాయి తదితర మండలాల్లోని దాదాపు రెండు వేల మంది నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఈ సంస్థ అధినేత కుక్కట్ల శ్రీనివాసరావు రాష్ట్ర వ్యా ప్తంగా దాదాపు రూ.100కోట్లు వసూలు చేసి డిపాజిట్‌దారుల నోట్లో మట్టికొట్టాడు. డిపాజిట్‌దారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శ్రీనివాసరావును అరెస్టు చేశా రు. తరువాత ఈ కేసు పురోగతి గురించి వారు పట్టించుకోవడంలేదు. దీంతో డిపాజిట్‌దారుల్లో ఆందోళన నెలకొంది. అలాగే నూజివీడులో మైత్రిప్లాంటేషన్, హార్టీకల్చర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పేదల నుంచి దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి గత జూలై నెలలో బోర్డు తిప్పేసింది. మెచ్యూరిటీ పూర్తయిన డిపాజిట్లకు సంబంధించి సొమ్ము చెల్లించకపోవడంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ సంస్థకు చెందిన డెరైక్టర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఇదే సంస్థ మైలవరం ప్రాంతంలో కూడా రూ.2 కోట్లు వరకు సేకరించి పత్తాలేకుండా పోయింది. వైజాగ్‌కు చెందిన శ్రీచక్రగోల్డ్ ఫార్మ్స్ అండ్ విల్లాస్ అనే సంస్థ కూడా గత నెలలో నూజివీడులో బోర్డు తిప్పేసింది. ఈ సంస్థ వైజాగ్‌లో కూడా బోర్డు తిప్పేయడంతో అక్కడ కేసు నమోదైనట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ సంస్థ నూజివీడు ప్రాంతంలో పేద వర్గాల నుంచి రూ.50 లక్షల వరకు సేకరించింది. ఈ మూడు సంస్థల్లో డిపాజిట్లు చేసిన వారు, ఏజెంట్లు సొమ్ము కోసం పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సొమ్ము ఎప్పటికి చేతికి అందుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.