‘ఎన్వోసీ’ మాయగాడి అరెస్ట్
- 10 వాహనాలు స్వాధీనం
- మరో ఏడు వాహనాల కోసం ఆరా
- రూ. 2.5 కోట్ల మేర దందా
సాక్షి, సిటీబ్యూరో: ఫైనాన్స్ వాహనాలకు నకిలీ ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) సృష్టిస్తాడు. అనంతరం దాన్ని మరొకరికి కట్టబెడతాడు. ఇలా 17 వాహనాలను విక్రయించి ఇటు ఫైనాన్స్ కంపెనీలు, వాహ న యజమానులకు రూ.2.5 కోట్ల కుచ్చు టోపీ పెట్టిన నిందితుడిని సీసీఎస్ పోలీ సులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ పాలరాజు వె ల్లడించారు.
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఆర్.శ్రీనివాస్‌రెడ్డి (30) డిగ్రీ వరకు చదివాడు. అనంతరం సొం తంగా మెకానిక్ షాప్ పెట్టాడు. ఇందులో లాభాలు రాకపోడంతో మూడు లారీలు ఫైనాన్స్‌పై ఖరీదు చేసి ఇసుక రవాణా మొదలు పెట్టాడు. ఇక్కడ నష్టాలు రావడంతో ఫైనాన్స్‌పై ఉన్న తన మూడు వాహనాలకు నకిలీ ఎన్వోసీలు సృష్టించా డు. ఆర్టీఏ ఏజెంట్ల సహకారంతో ఫెనా న్స్ క్లియర్ అయినట్లు ఒరిజినల్ ఆర్సీలను తయారు చేయించాడు.
ఈ ఆర్సీలతో ఆ వాహనాలను ఇతరులకు విక్రయించాడు. డబ్బులు దండిగా వస్తుండడంతో ఇదే రకంగా ఫైనాన్స్‌పై ఉన్న కార్లకు సైతం క్లియర్ అయినట్లు నకిలీ ఎన్వోసీలు తయారు చేసి ఆర్టీఏ నుంచి ఒరిజినల్ ఆర్సీలు సృష్టించి వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఇతని అక్రమాలకు షాద్‌నగర్‌కు చెందిన రాజే ందర్‌రెడ్డి సహకరించాడని సీసీఎస్ ఆటోమొబైల్ టీం ఇన్‌స్పెక్టర్లు టి.ఎస్.ఎ.ప్రసాద్, మహ్మద్ గౌస్‌మొహిద్దీన్‌ల విచారణలో తేలింది.
నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కారులో నగరానికి వస్తుండగా జూపార్క్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా 17 వాహనాలకు నకిలీ ఎన్వోసీలు సృష్టించి విక్రయించానని అంగీకరించాడు. ఇందులో పది వాహనాలను ఒక లారీ, తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాహనాలను కూడా త్వరలో సీజ్ చేస్తామని పాల్‌రాజు తెలిపారు.