మీడియా సమావేశంలో రాహుల్, రామనాథన్(కుడి)
స్పెన్సర్స్ ఈడీ రాహుల్ నాయక్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు తర్వాత కార్డుతో చెల్లింపులు పెరిగాయని స్పెన్సర్స్ రిటైల్ తెలిపింది. రద్దుకు ముందు వరకు మెట్రో నగరాల్లోని తమ ఔట్‌లెట్లలో 60% ఉన్న కార్డు పేమెంట్లు ప్రస్తుతం 75%కి చేరాయని కంపెనీ ఈడీ రాహుల్ నాయక్ ఆదివారం చెప్పారు. ఇక్కడి బోరుునపల్లిలో స్పెన్సర్స్ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా కోస్టల్ ఏపీ, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎం.రామనాథన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. డిజి టల్ పేమెంట్ సౌకర్యం ఉన్న కారణంగా పెద్ద ఔట్‌లెట్లలో కస్టమర్ల తాకిడి గణనీయంగా పెరిగిందన్నారు. ఇక దేశవ్యాప్తంగా 122 స్టోర్లకుగాను హైపర్ మార్కెట్ల సంఖ్య 38కి చేరుకుందని వివరించారు. హైదరాబాద్‌లో 18 ఔట్‌లెట్లలో 5 హైపర్ స్టోర్లున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఏటా 2-3 కేంద్రాలు నెలకొల్పుతున్నట్టు తెలిపారు.