Card payment
-
కార్డుల్ని మించిన యూపీఐ
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో నెలవారీ లావాదేవీల సంఖ్య 4.5 రెట్లు పెరిగి.. 79.95 కోట్ల స్థాయికి చేరింది. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలను కూడా మించి యూపీఐ చెల్లింపులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.1.09 లక్షల కోట్లుగా ఉండగా, కార్డు లావాదేవీల విలువ రూ.1.05 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇక ఫిబ్రవరిలో యూపీఐ లావాదేవీల విలువ రు. 1.07 లక్షల కోట్లు కాగా.. కార్డుల విలువ రూ.93,998 కోట్లుగా నమోదైంది. మార్చిలో రెండు విధానాల్లోనూ చెల్లింపులు రూ.1 లక్ష కోట్లు దాటాయి. యూపీఐ ద్వారా రూ. 1.33 లక్షల కోట్లు, కార్డుల ద్వారా రూ.1.11 లక్షల కోట్ల విలువ చేసే లావాదేవీలు జరిగాయి. యూజర్లను ఆకర్షించేందుకు యూపీఐ యాప్స్.. డిస్కౌంట్లు, స్క్రా^Œ కార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వంటివి అందిస్తుండటం కూడా ఈ విధానం ఆదరణ పొందడానికి కారణంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2020 నాటికి 80 శాతం .. ఏడాది క్రితం పేమెంట్ గేట్వేస్ పరిమాణంలో యూపీఐ వాటా కేవలం 2 శాతమే ఉండగా.. ప్రస్తుతం 20 శాతానికి పెరిగిందని రేజర్‌పే సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హర్షిల్ మాథుర్ పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే పాత తరం డిజిటల్ పేమెంట్స్ విధానాల మార్కెట్‌ను యూపీఐ మరింతగా ఆక్రమించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా అభిప్రాయపడింది. 2020 నాటికల్లా కార్డుల ద్వారా జరిగే లావాదేవీల్లో దాదాపు 80 శాతం లావాదేవీలు యూపీఐకి మారే అవకాశం ఉందని పేర్కొంది. డిజిటల్‌దే అగ్రభాగం: ఆర్బీఐ తక్కువ స్థాయిలో నగదు వినియోగించే సొసైటీగా భారత్‌ను మార్చే ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా: విజన్ 2019– 2021ను ఆర్బీఐ ఆవిష్కరించింది. దీని ప్రకారం 2018 డిసెంబర్ నాటికి డిజిటల్ లావాదేవీలు 2,069 కోట్లు కాగా, 2021 నాటికి నాలుగురెట్లు పెరిగి 8,707 కోట్లకు చేరుతాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసే చార్జీల విషయంలో ఆర్బీఐ జోక్యం పరిమితంగానే ఉంటుంది. -
కార్డు చెల్లింపులపై ఎండీఆర్ చార్జీలు తగ్గించే యోచన!
డిజిటల్ పేమెంట్ల ప్రోత్సాహం లక్ష్యం న్యూఢిల్లీ: డెబిట్ కార్డ్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను తగ్గించే విషయాన్ని కేంద్రం యోచిస్తోంది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యమని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మంగళవారం ఇక్కడ తెలిపారు. లావాదేవీల పరిమాణం పెరిగితే ఎండీఆర్‌ను చార్జీలను తగ్గించే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని వివరించారు. ఎండీఆర్ చార్జీల తగ్గింపునకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన ఒక ముసాయిదాను కేంద్రం పరిశీలిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచీ డెబిట్ కార్డ్ పేమెంట్లపై ఎండీఆర్ చార్జీల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని ఇటీవలి తన ఒక నివేదికలో ఆర్బీఐ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ.2,000 వరకూ లావాదేవీపై ఎండీఆర్ పరిమితి 0.75 శాతంకాగా, ఆపైన 1 శాతంగా ఉంది. అయితే ఈ చార్జీల తగ్గింపు డిజిటల్ చెల్లింపుల బాటలో చిన్న వర్తకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆర్బీఐ తన ముసాయిదా పత్రంలో పేర్కొంది. -
కార్డు చెల్లింపులు 75 శాతానికి...
స్పెన్సర్స్ ఈడీ రాహుల్ నాయక్.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు తర్వాత కార్డుతో చెల్లింపులు పెరిగాయని స్పెన్సర్స్ రిటైల్ తెలిపింది. రద్దుకు ముందు వరకు మెట్రో నగరాల్లోని తమ ఔట్లెట్లలో 60% ఉన్న కార్డు పేమెంట్లు ప్రస్తుతం 75%కి చేరాయని కంపెనీ ఈడీ రాహుల్ నాయక్ ఆదివారం చెప్పారు. ఇక్కడి బోరుునపల్లిలో స్పెన్సర్స్ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా కోస్టల్ ఏపీ, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎం.రామనాథన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. డిజి టల్ పేమెంట్ సౌకర్యం ఉన్న కారణంగా పెద్ద ఔట్లెట్లలో కస్టమర్ల తాకిడి గణనీయంగా పెరిగిందన్నారు. ఇక దేశవ్యాప్తంగా 122 స్టోర్లకుగాను హైపర్ మార్కెట్ల సంఖ్య 38కి చేరుకుందని వివరించారు. హైదరాబాద్‌లో 18 ఔట్లెట్లలో 5 హైపర్ స్టోర్లున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఏటా 2-3 కేంద్రాలు నెలకొల్పుతున్నట్టు తెలిపారు.