గల్ఫ్‌లోనూ తప్పని నోట్ల కష్టాలు | Difficulties in the Gulf of fake notes | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లోనూ తప్పని నోట్ల కష్టాలు

Published Tue, Nov 15 2016 2:17 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

Difficulties in the Gulf of fake notes

దుబాయ్:  మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై దుబాయ్‌లోని ప్రవాస భారతీయుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇది సరైన నిర్ణయమేనని భారత సంతతి పారిశ్రామిక వేత్తలు భావిస్తుండగా, తమ దగ్గరున్న పెద్ద నోట్లను ఎలా మార్చుకోవాలని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నల్లధనంపై ప్రస్తుత నిర్ణయం కేవలం 10 శాతం కంటే తక్కువే ప్రభావం చూపుతుందని, కానీ తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకునేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తుందని, ఇక్కడి మనీ ఎక్స్చేంజ్ కేంద్రాలు కూడా వాటిని తీసుకోవట్లేదని అక్కడ పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అర్షద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement