లిమిట్ దాటిందా? నోటీసులే..! | IT notice to those who have a large deposit | Sakshi
Sakshi News home page

లిమిట్ దాటిందా? నోటీసులే..!

Published Sun, Nov 20 2016 2:42 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

లిమిట్ దాటిందా? నోటీసులే..! - Sakshi

లిమిట్ దాటిందా? నోటీసులే..!

- భారీగా డిపాజిట్ చేసిన వారికి ఐటీ తాఖీదులు
- ఆధారాలివ్వాలంటూ ఆదేశం
- పెళ్లికి రూ.2.5 లక్షల విత్‌డ్రాపై ఆదేశాలు అందలేదు: బ్యాంకులు
 
 న్యూఢిల్లీ/ముంబై: అక్రమార్కుల పని పడతాం... నల్లధనం గుట్టు రట్టు చేస్తామంటూ పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు అమలవుతోంది? నోట్ల రద్దుతో సామాన్యులకు ఇక్కట్లు తప్పితే... ఇంతవరకూ బడాబాబుల నల్లధనం వివరాలు బయటికి వచ్చాయా? అన్న విమర్శల నేపథ్యంలో ఆ వివరాలు రాబట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ పూర్తి స్థారుులో రంగంలోకి దిగింది. రద్దయిన రూ. 500, రూ.వెరుు్య నోట్లను ఖాతాల్లో భారీగా డిపాజిట్ చేసిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీచేసింది.

 దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకు ఖాతాల్లో పరిమితికి మించి వేసిన నగదు వివరాలు వెల్లడించాలంటూ ఐటీ యాక్ట్ 133(6) సెక్షన్ కింద వివిధ నగరాలు, పట్టణాల్లో  నోటీసులు ఇచ్చినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. 2.5 లక్షలు దాటి జమైన అనుమానాస్పద ఖాతాలపై బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నోటీసులు జారీచేశామన్నారు.

 రియల్ ఎస్టేట్, బంగారం వర్తకులపై నిఘా
 ఖాతాల్లో డిపాజిట్ చేసిన నగదు మొత్తం, తేదీ వివరాలు చెప్పాలని, నగదు ఎక్కడి నుంచి వచ్చిందో పేర్కొంటూ సంబంధిత పత్రాలు, ఖాతా పుస్తకాలు, బిల్లులు సమర్పించాలని నోటీసుల్లో ఐటీ శాఖ కోరింది. ఆ మొత్తానికి ఆదాయపు పన్ను కడితే...రిటర్న్స్ కాపీ జతచేయాలని సూచించింది. నోట్ల రద్దు అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంగారం వర్తకులు, అనుమానిత హవాలా నిర్వాహకుల కార్యకలాపాలపై గట్టి నిఘా కొనసాగుతోంది. సహకార బ్యాంకులపై కూడా నిఘా పెట్టిన ఐటీ శాఖ మంగళూరులో రూ. 8 కోట్ల పాత నోట్ల మార్పిడిని వెలుగులోకి తెచ్చింది. అక్కడి సహకార బ్యాంకులో ఖాతాలు ఉన్న ఐదుగురు ఆ నగదు మార్చినట్లు గుర్తించింది. పన్ను మినహారుుంపులు అనుభవిస్తోన్న వందలాది స్వచ్ఛంద, మత సంస్థలు తమ నగదు నిల్వల వివరాలు తెలపాలంటూ ఇటీవలే ఐటీ శాఖ ఆదేశాలు జారీచేసింది.

 పెళ్లికి విత్‌డ్రా వచ్చే వారమే: బ్యాంకులు
 పెళ్లిళ్లకు రూ. 2.5 లక్షల విత్‌డ్రా సౌకర్యం వచ్చే వారం నుంచి ప్రారంభం కావచ్చని బ్యాంకులు చెప్పాయి. శుక్రవారం నుంచి  ఈ అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా.. తమకు ఆర్‌బీఐ నుంచి మార్గదర్శకాలు ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని పంజాబ్ నేషన్ బ్యాంక్ ఎండీ ఉషా అనంతసుబ్రమణియన్ తెలిపారు. ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుందని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ తెలిపింది. ‘సోమవారం ఆర్‌బీఐ నిబంధనలు మాకు అందవచ్చు. మంగళవారం నుంచి పెళ్లిళ్ల కోసం బ్యాంకులు డబ్బులు అందచేస్తారుు’ అని అన్నారు.  

 ఏటీఎంల ముందు తగ్గని క్యూ
 శనివారం బ్యాంకుల ముందు రద్దీ తగ్గినా... ఏటీఎంల ముందు మాత్రం అలానే కొనసాగింది. సొంత బ్రాంచీలోనే నగదు విత్‌డ్రా చేసుకోవాలన్న నిబంధనతో జనం తగ్గడంతో ఖాతాదారులకు విత్‌డ్రా అవకాశం చిక్కింది. ఎక్కువ శాతం ఏటీఎంల్లో నగదు వెంటనే అరుుపోవడంతో క్యూలో నిలబడ్డ చాలామంది నిరాశగా వెనుదిరిగారు.  కాగా, మహరాష్ట్రలోని నవీ ముంబైలో వషి వద్ద పోలీసులు రూ. కోటి విలువున్న వెరుు్య రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement