
జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లు
న్యూఢిల్లీ: జన్‌ధన్ ఖాతాలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కాసులతో కళకళలాడుతున్నాయి. గత 13 రోజుల్లో ఈ ఖాతాల్లోకి రూ. 21 వేల కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ అయిన రాష్ట్రాల్లో.. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ సీఎంగా ఉన్న పశ్చిమ బెంగాల్ తొలి స్థానంలో నిలవగా కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది.
నవంబర్ 9 నాటికి 25.5 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో ఉన్న రూ. 45,636.61 కోట్లు నిల్వ ప్రస్తుతం రూ. 66 వేల కోట్లను దాటినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల్లో డిపాజిట్ పరిమితి రూ. 50 వేలు. కాగా జన్‌ధన్ ఖాతాల్లోకి భారీగా నగదు చేరిందన్న వార్తల నేపథ్యంలో ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స యూనిట్(ఎఫ్ఐయూ) విచారణ ప్రారంభించింది. అనుమానాస్పద ఖాతాల వివరాల్ని సేకరించే పని మొదలుపెట్టింది.