jandhan accounts
-
‘జన్ ధన్’ నుంచి దనాధన్ విత్‌డ్రాలు
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ‘జన్ ధన్ యోజన’ ఖాతాల్లోకి ఎంత వేగంగా డిపాజిట్లు వచ్చి పడ్డాయో, ఇప్పుడు దాదాపు అంతే వేగంగా ‘విత్ డ్రా’లతో ఖాళీ అవుతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నవంబర్ 8వ తేదీ నాటికి జన్ ధన్ ఖాతాల్లో దాదాపు 45 వేల కోట్ల రూపాయలుండగా, అప్పటి నుంచి నవంబర్ 30వ తేదీ నాటికి ఆ ఖాతాల్లో డిపాజిట్ల మొత్తం 74,321 కోట్ల రూపాయలకు చేరుకుంది. మార్చి 15వ తేదీ నాటికి డిపాజిట్ల మొత్తం సొమ్ము 63,836 కోట్ల రూపాయలకు తరగిపోయింది. అంటే దాదాపు 10,500 కోట్ల రూపాయలు విత్ డ్రా అయ్యాయి. ఇందులో ఎక్కువ సొమ్మును పన్ను ఎగవేతదారుల సొమ్ముగానే భావించాల్సి వస్తుంది. కానీ ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. విత్ డ్రాలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తేసిన మార్చి 13 నుంచి ఇప్పటి వరకు జరిగిన విత్ డ్రాల డేటాను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని పలు బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. దేశం మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జన్ ధన్ యోజన ఖాతాల్లోనే ఎక్కువ సొమ్ము డిపాజిట్ అయింది. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచింది. యూపీ జన్ ధన్ ఖాతాల్లో నవంబర్ నుంచి డిసెంబర్‌లోగా దాదాపు 4,500 కోట్ల రూపాయలు డిపాజిట్ కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 2,900 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. యూపీ ఖాతాల్లో 7,493 కోట్ల రూపాయలుండగా, 12,021 కోట్ల రూపాయలకు డిపాజిట్లు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 6,286 కోట్ల రూపాయలుండగా, 9,193 కోట్ల రూపాయలకు డిపాజిట్లు చేరుకున్నాయి. ఇప్పుడు అవే డిపాజిట్లు యూపీలో 10,154 కోట్ల రూపాయలకు తరగిపోగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 8,213 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 28, 2014లో ప్రారంభించిన జన్‌ధన్ యోజన పథకంలో 2015, జనవరి 26వ తేదీ నాటికి 28 కోట్ల ఖాతాలను తెరిచారు. వాటిలో ప్రస్తుతానికి 65 శాతం ఖాతాలను ఆధార్ కార్డుకు అనుసంధానం చేశారు. -
ప్రజలే నాకు హైకమాండ్: మోదీ
-
ఆ ఖాతాల్లోకి రూ.64,250కోట్ల డిపాజిట్లు!
-
ఆ ఖాతాల్లోకి రూ.64,250కోట్ల డిపాజిట్లు!
రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ రూపంలో తెరుచుకున్న జనధన యోజన ఖాతాల్లోకి కోట్ల కొద్దీ డబ్బు కుప్పలు తెప్పలుగా జమఅవుతోంది. నిన్న కాక మొన్న ఈ ఖాతాల్లోకి 21 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు అయినట్టు వెల్లడవగా.. ప్రస్తుతం ఈ డిపాజిట్లు మరింత పెరిగినట్టు తెలిసింది. నేటికి జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.64,250 కోట్లు డిపాజిట్ అయినట్టు ప్రభుత్వం నేడు లోక్ సభకు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా రూ.10,670.62 కోట్లు డిపాజిట్ అయినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానంలో పశ్చిమబెంగాల్ ఉన్నట్టు తెలిపింది. నవంబర్ 16వరకు 25.58 కోట్ల జన్‌ధన్ అకౌంట్లలో అగ్రిగేట్గా రూ.64,252.15 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్‌సభకు సమర్పించిన ఓ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ ఎకౌంట్లు లేని కోట్లాది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు 23 కోట్ల మందిచే జన్‌ధన్ అకౌంట్లను ఓపెన్ చేపిస్తూ 2014 ఆగస్టు నెలలో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు వాళ్లు బ్యాంకు ఖాతా తెరవడమే తప్ప.. అందులో పెద్దగా డబ్బులు వేసింది, తీసింది ఏమీ లేదు. కానీ ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే ఈ ఖాతాల్లోకి డబ్బుల వెల్లువ కొనసాగుతోంది. మధ్య దళారులు అమాయక ప్రజలను మభ్యపెట్టి వారి ఖాతాల్లోకి డబ్బును డిపాజిట్ చేస్తున్నారు. తమ దగ్గర భారీ మొత్తంలో ఉన్న నల్లధనాన్ని వైట్‌గా మార్చుకోవడానికి ఈ ఖాతాలను వాడుకుంటున్నారని తెలిసింది. మంచి ఉద్దేశ్యంతో ప్రారంభమైన ఈ పథకం, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొంత మేర దుర్వినియోగం అవుతున్నట్లు తెలుస్తోంది. -
ఖాతాలపై కన్ను
బతుకులు బజారున పడిన భావన.. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆవేదన. ‘నోటు’కాడ కూడు నేల పాలైన ఆందోళన. ఇదీ జిల్లాలోని సామాన్యులు, చిరు వ్యాపారుల పరిస్థితి. నల్లధనం పోగేసిన కుబేరులపై యుద్ధం చేయాలంటే.. సామాన్యుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేయాలా? అనే ప్రశ్న సామాన్యులను వేధిస్తోంది. ఒకచోట గంటల తరబడి బ్యాంకుల్లో చిల్లర కోసం పడిగాపులు పడుతున్న జనం.. మరోచోట వ్యాపారాలు లేక ఆవేదన చెందుతున్న వ్యాపార గణం.. గ్రామగ్రామాన ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని మార్చుకునేందుకు కొందరు కుబేరులు నిరుపేదలకు సంబంధించిన జన్ధ¯ŒS యోజన ఖాతాల్లో పెద్దఎత్తున సొమ్మును డిపాజిట్ చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జ¯ŒSధ¯ŒS ఖాతాల్లో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే సదరు ఖాతాలను స్తంభింప చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. పెద్ద మొత్తాలని డిపాజిట్ చేసిన జ¯ŒSధ¯ŒS ఖాతాలు జిల్లాలోనూ ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్తంభింపచేసే ప్రక్రియ మొదలుపెట్టారు. జీలుగుమిల్లి మండలంలో రూ.3 లక్షల సొమ్ము జమ అయిన ఖాతాలను బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు. అయితే, పూర్తి వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయా ఖాతాల వివరాలను ఐకేపీ అధికారులకు అందచేస్తామని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అవే కష్టాలు మరోవైపు పెద్దనోట్లు రద్దుచేసి 15 రోజులు దాటినా నగదు కోసం ప్రజలు పడుతున్న కష్టాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఏటీఎంలు పనిచేయకపోవడం, పనిచేసే ఏటీఎంలలో డబ్బులు అయిపోవడంతో జనం బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. బ్యాంకుల్లో చిల్లర లేదంటూ రూ.2 వేల నోట్లు ఇస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు రూ.500 నోట్లు వచ్చినా.. బ్యాంకులకు చేరుకోలేదు. మరోవైపు నగదు ఇవ్వడం లేదని తాళ్లపూడి ఆంధ్రాబ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంక్ తెరిచిన అరగంట లోపే నగదు అయిపోయిందని చెప్పడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల్లో పాత నోట్లు మార్చుకోవడానికి గురువారం అర్ధరాత్రితో గడువు ముగియ డంతో ఆందోళన ఎక్కువైంది. గడువు పెంచాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం చొరవతో స్వైపింగ్ మెషిన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. భక్తలనూ తాకిన పెద్దనోట్ల సెగ పెద్ద నోట్ల సెగ భక్తులనూ తాకింది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఇరుముడులకు అవసరమయ్యే పూజా సామగ్రి కొనుగోలుకు చిల్లర నోట్ల సమస్యగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం సగానికిపైగా పడిపోయిందని పూజా సామగ్రి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దుతో జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 25 శాతం తగ్గింది. ఇళ్ల స్థలాల క్రయ విక్రయాలు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి డిసెబర్ 31 తరువాత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిజిస్ట్రేష¯ŒS వ్యవహారంలో పాత నోట్లు తీసుకునే వెసులుబాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లేదని ఆ శాఖ డీఐజీ లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ఇదిలావుంటే.. నగదు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల ఎదుట ధర్నాలు జరిగాయి. కొత్తనోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేవరకూ చట్ట, న్యాయబద్ధమైన లావాదేవీలకు పెద్దనోట్లను అనుమతించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేశారు. -
జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లు
న్యూఢిల్లీ: జన్‌ధన్ ఖాతాలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కాసులతో కళకళలాడుతున్నాయి. గత 13 రోజుల్లో ఈ ఖాతాల్లోకి రూ. 21 వేల కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ అయిన రాష్ట్రాల్లో.. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ సీఎంగా ఉన్న పశ్చిమ బెంగాల్ తొలి స్థానంలో నిలవగా కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. నవంబర్ 9 నాటికి 25.5 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో ఉన్న రూ. 45,636.61 కోట్లు నిల్వ ప్రస్తుతం రూ. 66 వేల కోట్లను దాటినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల్లో డిపాజిట్ పరిమితి రూ. 50 వేలు. కాగా జన్‌ధన్ ఖాతాల్లోకి భారీగా నగదు చేరిందన్న వార్తల నేపథ్యంలో ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స యూనిట్(ఎఫ్ఐయూ) విచారణ ప్రారంభించింది. అనుమానాస్పద ఖాతాల వివరాల్ని సేకరించే పని మొదలుపెట్టింది. -
ఆరు రోజుల్లోనే కొత్త కరెన్సీ తరలింపు..
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలను అంచనా వేయడంలో విఫలమైన రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వ వర్గాలు.. ఇప్పుడు కొత్త కరెన్సీ నోట్ల తరలింపుకు భారీ సన్నాహాలు చేశాయి. కరెన్సీ ముద్రణా కేంద్రాల నుంచి కొత్త నోట్లను బ్యాంకులకు తరలించే సమయాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. ఇంతకుముందు ఆయా కేంద్రాల నుంచి కొత్త కరెన్సీ బండిళ్లు బ్యాంకులకు చేరడానికి కనీసం 21 రోజులు పట్టేది. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని నాసిక్, దేవాస్ ప్రెస్‌లతోపాటు భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సాల్బోని(పశ్చిమ బెంగాల్), మైసూరు ముద్రణాలయాల నుంచి కొత్త నోట్ల రవణాను వేగవంతం చేశామని, కేవలం ఆరు రోజుల్లోనే కొత్త కరెన్సీ బ్యాంకులకు చేరుతున్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందు కోసం ఆర్మీ యుద్ధ హెలికాప్టర్లను సైతం వినియోగిస్తున్నామని, జనవరి 15 నాటికి దేశంలో సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయని తెలిపాయి. మిగిలిపోయే డబ్బు జన్‌ధన్ ఖాతాల్లోకి..? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 కోట్ల జన్‌ధన్ ఖాతాలున్నాయి. వీటిలో సుమారు 6 కోట్ల అకౌంట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమకాలేదు. అలాంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్లలోకి ప్రభుత్వం రూ.10వేల చొప్పున జమచేస్తుందని.. తద్వారా నోట్ల రద్దు నిర్ణయంతో అందరికీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం పేదలకు వరాన్ని ప్రకటిస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా వట్టిదేనని, ప్రధానికిగానీ, ప్రభుత్వానికి గానీ జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బు మళ్లించాలనే ఆలోచన ఏమాత్రమూ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నోట్ల రద్దు ద్వారా (వెనక్కి రాని నల్లధనం వల్ల) సుమారు 3లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయని ప్రభుత్వం లెక్కకట్టిందని, వాటిని పేదలకు ఊరికే పంచెయకుండా ఉత్పాదకత పెంపు చర్యలకు వినియోగించాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రస్తుతం 18 నుంచి 20 శాతం వడ్డీతో బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, నోట్ల రద్దు ప్రక్రియ తర్వాత ఆ వడ్డీని గణనీయంగా తగ్గించి ఆయా పరిశ్రమలకు సులువుగా రుణాలు అందిపజేయాలని మోదీ ఆలోచిస్తున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
జన ధన ఖాతాల్లోకి డబ్బుల వెల్లువ!
ఇప్పటివరకు వాళ్లు బ్యాంకు ఖాతా తెరవడమే తప్ప.. అందులో పెద్దగా డబ్బులు వేసింది, తీసింది ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా వాటిలోకి వేలాది రూపాయల డిపాజిట్లు వచ్చి పడుతున్నాయి. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పటి నుంచి జనధన యోజన ఖాతాల్లోకి డబ్బు రావడం ఎక్కువైంది. 2014 ఆగస్టు నెలలో జనధన యోజనను ప్రారంభించారు. గ్రామీణులు, పేదలు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్న సదుద్దేశంతో కేంద్రం వీటిని ప్రారంభించింది. వాటిలో రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ పద్ధతిలో నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఇదే ఇప్పుడు అక్రమార్కుల పాలిట వరమైంది. తమ దగ్గర భారీ మొత్తంలో ఉన్న నల్లధాన్ని తెల్లగా మార్చుకోడానికి ఈ ఖాతాలను వాళ్లు వాడుకుంటున్నారు. ప్రతి ఖాతాలోనూ పాన్ నెంబరుతో పనిలేకుండా ఉండేందుకు 49వేల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. ఈ డబ్బంతా వేరేవాళ్లది. ఈ విషయంలో మధ్యదళారులు రంగప్రవేశం చేస్తున్నారు. 49వేల రూపాయలు మీ ఖాతాలో వేసుకుంటే మీకు పరపతి పెరుగుతుందని వాళ్లను మభ్యపెట్టడంతో పాటు.. అలా డిపాజిట్ చేసుకున్నందుకు వాళ్లకు రూ. 500 కూడా ఇస్తున్నారు. తమ పరపతి నిజంగానే పెరుగుతుందని భ్రమపడిన అమాయకులు సరేనని తమ ఖాతాల్లో ఆ డబ్బు డిపాజిట్ చేస్తున్నారు. తమ బ్రాంచిలో 15వేల జనధన ఖాతాలు ఉన్నాయని, వాటిలోని 30 శాతం ఖాతాల్లో ఒక్కసారిగా గురువారం నుంచి 49వేల రూపాయల చొప్పున డిపాజిట్లు వచ్చి పడ్డాయని ఆగ్రాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అజయ్ అగ్నిహోత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో దాదాపు అన్ని ఖాతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. కొందరు ఫ్యాక్టరీల యజమానులు కూడా తమ వద్ద పనిచేసే ఉద్యోగుల ఖాతాల్లోకి బలవంతంగా డబ్బు వేయిస్తున్నారని, అయితే.. ఇలా వేరేవాళ్ల డబ్బులు తమ ఖాతాల్లోకి వేసుకున్నా అదంతా ప్రభుత్వ లెక్కల్లోకి వెళ్తుందన్న విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
జన్‌ధన్ ఖాతాలు ఉపయోగించుకోవాలి
– ఇక నుంచి ఖాతాదారులకు ఈ–పాస్ బుక్కులు – ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు ఆర్ఎం జయసింహారెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన కింద జీరో అకౌంట్‌తో ప్రారంభించిన ఖాతాలను ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రీజనల్ మేనేజర్ ఎల్.జయసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఏపీజీబీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్‌ధన్ ఖాతాలు ప్రారంభమైన తొలి మూడు నెలల్లోపు ఒకసారైనా కనీసం రూ.100తోనే లావాదేవీలు చేసుకోవాలన్నారు. లేదంటే ఏడాదిలోగా ఖాతాలు రద్దవుతాయన్నారు. రూ.లక్ష వరకు ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ఏపీజీబీ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లోనూ శుక్రవారం నుంచి సేవింగ్స్, లోన్స్ ఖాతాలను ఈ–పాస్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా ఎంఎస్ఎస్ అలర్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, మొబైల్ బ్యాంకింగ్ లాంటి అత్యాధునిక సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే మిగతా అన్ని వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్‌లో 1.11 లక్షల మంది రైతులకు రూ.978 కోట్లు పంట రుణాలు అందించామని తెలిపారు. సమావేశంలో బ్యాంకు అధికారులు కామేశ్వరరావు, నాగరాజు, శంకరనారాయణ, హేమలత తదితరులు పాల్గొన్నారు.