ఖాతాలపై కన్ను
Published Fri, Nov 25 2016 2:41 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
బతుకులు బజారున పడిన భావన.. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆవేదన. ‘నోటు’కాడ కూడు నేల పాలైన ఆందోళన. ఇదీ జిల్లాలోని సామాన్యులు, చిరు వ్యాపారుల పరిస్థితి. నల్లధనం పోగేసిన కుబేరులపై యుద్ధం చేయాలంటే.. సామాన్యుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేయాలా? అనే ప్రశ్న సామాన్యులను వేధిస్తోంది. ఒకచోట గంటల తరబడి బ్యాంకుల్లో చిల్లర కోసం పడిగాపులు పడుతున్న జనం.. మరోచోట వ్యాపారాలు లేక ఆవేదన చెందుతున్న వ్యాపార గణం.. గ్రామగ్రామాన ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని మార్చుకునేందుకు కొందరు కుబేరులు నిరుపేదలకు సంబంధించిన జన్‌ధ¯ŒS యోజన ఖాతాల్లో పెద్దఎత్తున సొమ్మును డిపాజిట్ చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జ¯ŒSధ¯ŒS ఖాతాల్లో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే సదరు ఖాతాలను స్తంభింప చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. పెద్ద మొత్తాలని డిపాజిట్ చేసిన జ¯ŒSధ¯ŒS ఖాతాలు జిల్లాలోనూ ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్తంభింపచేసే ప్రక్రియ మొదలుపెట్టారు. జీలుగుమిల్లి మండలంలో రూ.3 లక్షల సొమ్ము జమ అయిన ఖాతాలను బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు. అయితే, పూర్తి వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయా ఖాతాల వివరాలను ఐకేపీ అధికారులకు అందచేస్తామని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
అవే కష్టాలు
మరోవైపు పెద్దనోట్లు రద్దుచేసి 15 రోజులు దాటినా నగదు కోసం ప్రజలు పడుతున్న కష్టాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఏటీఎంలు పనిచేయకపోవడం, పనిచేసే ఏటీఎంలలో డబ్బులు అయిపోవడంతో జనం బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. బ్యాంకుల్లో చిల్లర లేదంటూ రూ.2 వేల నోట్లు ఇస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు రూ.500 నోట్లు వచ్చినా.. బ్యాంకులకు చేరుకోలేదు. మరోవైపు నగదు ఇవ్వడం లేదని తాళ్లపూడి ఆంధ్రాబ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంక్ తెరిచిన అరగంట లోపే నగదు అయిపోయిందని చెప్పడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల్లో పాత నోట్లు మార్చుకోవడానికి గురువారం అర్ధరాత్రితో గడువు ముగియ డంతో ఆందోళన ఎక్కువైంది. గడువు పెంచాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం చొరవతో స్వైపింగ్ మెషిన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి.
భక్తలనూ తాకిన పెద్దనోట్ల సెగ
పెద్ద నోట్ల సెగ భక్తులనూ తాకింది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఇరుముడులకు అవసరమయ్యే పూజా సామగ్రి కొనుగోలుకు చిల్లర నోట్ల సమస్యగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం సగానికిపైగా పడిపోయిందని పూజా సామగ్రి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దుతో జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 25 శాతం తగ్గింది. ఇళ్ల స్థలాల క్రయ విక్రయాలు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి డిసెబర్ 31 తరువాత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిజిస్ట్రేష¯ŒS వ్యవహారంలో పాత నోట్లు తీసుకునే వెసులుబాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లేదని ఆ శాఖ డీఐజీ లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ఇదిలావుంటే.. నగదు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల ఎదుట ధర్నాలు జరిగాయి. కొత్తనోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేవరకూ చట్ట, న్యాయబద్ధమైన లావాదేవీలకు పెద్దనోట్లను అనుమతించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement