Lockdown: పెళ్లి వాయిదా మనస్తాపంతో టవరెక్కిన యువకుడు   | Man Climbs Mobile Tower After Cancelled His Marriage In Karnataka | Sakshi
Sakshi News home page

Lockdown: పెళ్లి వాయిదా మనస్తాపంతో టవరెక్కిన యువకుడు  

Published Tue, Jun 15 2021 9:40 AM | Last Updated on Tue, Jun 15 2021 9:40 AM

Man Climbs Mobile Tower After Cancelled His Marriage In Karnataka - Sakshi

సాక్షి, హొసపేటె(కర్ణాటక): తనను ప్రేమించిన అమ్మాయితో తల్లిదండ్రులు వివాహం చేయలేదని ఆవేదన చెందిన ఓ యువకుడు మొబైల్‌ టవరెక్కి హల్‌చల్‌ చేశాడు. వివరాలు... తాలూకాలోని మరియమ్మనహళ్లికి చెందిన చిరంజీవి గొసంగి (23) ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లిని వాయిదా వేయడం చిరంజీవికి నచ్చలేదు.

సోమవారం పాత వీరభద్రశ్వర టాకీస్‌ వద్ద నున్న మొబైల్‌ టవర్‌ ఎక్కి కూర్చున్నాడు. పెళ్లి చేయకపోతే దూకుతానని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకొన్న చుట్టు పక్కల ప్రజలు టవర్‌ వద్దకు వచ్చి మకాం వేశారు. సమాచారం అందుకున్న   సీఐ వసంత, ఎస్‌ఐ మీనాక్షి, అక్కడికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు రప్పించడంతో కథ సుఖాంతమైంది.

చదవండి: నాకూ ఈటల గతి పడుతుందని అనుకున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement