జనధన యోజన ఖాతాల్లోకి కోట్ల కొద్దీ డబ్బు కుప్పలు తెప్పలుగా జమఅవుతోంది. నిన్న కాక మొన్న ఈ ఖాతాల్లోకి 21 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు అయినట్టు వెల్లడవగా.. ప్రస్తుతం ఈ డిపాజిట్లు మరింత పెరిగినట్టు తెలిసింది. నేటికి జన్ధన్ ఖాతాల్లోకి రూ.64,250 కోట్లు డిపాజిట్ అయినట్టు ప్రభుత్వం నేడు లోక్ సభకు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా రూ.10,670.62 కోట్లు డిపాజిట్ అయినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానంలో పశ్చిమబెంగాల్ ఉన్నట్టు తెలిపింది. నవంబర్ 16వరకు 25.58 కోట్ల జన్ధన్ అకౌంట్లలో అగ్రిగేట్గా రూ.64,252.15 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్సభకు సమర్పించిన ఓ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.