త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. పీఎఫ్ రేటును పెంచడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. 2015–16లో 8.8 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2016–17లో 8.65 శాతానికి, అటుపై 2017–18లో అయిదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ తెలియజేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతామన్నారు.