రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే గడువు ముగిసింది. ఇక కేవలం ఆర్‌బీఐ వద్ద మాత్రమే ఆ నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉండటంతో.. హైదరాబాద్ ఆర్‌బీఐ వద్ద నోట్ల మార్పిడి కోసం శనివారం ప్రజలు ఎగబడ్డారు. అయితే ఆర్‌బీఐ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఇక్కడకు రావాలంటూ గేటు వద్ద నుంచే వారిని తిప్పిపంపుతున్నారు.