ప్రధాని నరేంద్ర మోదీ డిమానిటైజేషన్ చేసిన 9 నెలల తరువాత రిజర్వ్ బ్యాంక్ పూర్తి వివరాలను తొలిసారిగా ప్రజలకు అందించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజల్లో చాలా అంచనాలు ఏర్పడ్డాయి. నల్లధనం ఆగిపోతుదంని, దొంగనోట్లు నిలిచిపోతాయని ఆశించారు. అదే సమయంలో నోట్ల రద్దు చర్య ఆర్థిక వ్యవస్థను బలహీనం చేస్తుందని విశ్లేషకులు భావించారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. వాస్తవాలు మాత్రం పరస్పర విరుద్ధంగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అంచనాలు ఏమిటి? వాస్తవం ఏమిటి?..