Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pakistan Drones Seen At 26 Indian Locations, Blackouts In Several Cities1
దాయాది.. మళ్ళీ బరితెగింపు

దాయాది బుద్ధి మారలేదు. తొలిరోజు భారత్‌పై విరుచుకుపడేందుకు విఫలయత్నం చేసి చావుదెబ్బ తిన్న పాకిస్తాన్‌.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయతి్నంచింది. శుక్రవారం చీకట్లు పడుతూనే జమ్మూకశీ్మర్‌ మొదలు రాజస్తాన్‌ దాకా 26కుపైగా ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఈ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బ్లాకౌట్‌ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్‌ మొదలుకుని జో«ద్‌పూర్‌ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ, ఇతర గల్ఫ్‌ దేశాలను పాక్‌ ప్రాధేయపడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ.. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో శుక్రవారం రాత్రి సమీక్షించారు. న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాలపై పాక్‌ దాడులు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. చీకట్లు పడుతూనే జమ్మూ కశ్మీర్‌ మొదలుకుని రాజస్తాన్‌ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్‌ దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్‌ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్‌ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్‌ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్‌ మొదలుకుని జో«ద్‌పూర్‌ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్‌ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్‌ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్‌ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్‌ అలర్టులు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌తో పాటు త్రివిధ దళాధిపతులు భేటీలో పాల్గొన్నారు. భావి కార్యాచరణపై లోతుగా చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, ఆ శాఖ కార్యదర్శి మిస్రీ, దోవల్‌తో కూడా మోదీ గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధిపతులు, ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమై పరిస్థితిపై చర్చించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా సరిహద్దుల వెంబడి పరిస్థితిపై కూలంకషంగా సమీక్ష జరిపారు. అవసరమైతే టెరిటోరియల్‌ ఆర్మీని కూడా పూర్తిస్థాయిలో విధుల్లో నియోగించాల్సిందిగా ఆర్మీ చీఫ్‌ను కేంద్రం ఆదేశించింది. శత్రువుకు మర్చిపోలేని రీతిలో బుద్ధి చెప్పాలని సైన్యాన్ని రాజ్‌నాథ్‌ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీ వివేక్‌ శ్రీవాత్సవ సర్క్యులర్‌ పంపారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లోని పలు విమానాశ్రయాల మూసివేతను మే 15 దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్‌ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్‌ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్‌ దాడులకు పాక్‌ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి. పాక్‌ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్‌ దేశాలను పాక్‌ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్‌ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

Air India Flights Cancelled Upto 15th May 20252
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన: ఈ నెల 15 వరకు విమానాలు రద్దు

భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. ఆ తరువాత విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించాల్సి ఉంది.ఈ సమయంలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే.. రీషెడ్యూలింగ్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం.. ఎయిర్ ఇండియా కాంటాక్ట్ సెంటర్‌లకు కాల్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్‌సైట్ సందర్శించి తెలుసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.#TravelAdvisoryFollowing a notification from aviation authorities on continued closure of multiple airports in India, Air India flights to and from the following stations – Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Chandigarh, Bhuj, Jamnagar and Rajkot – are being cancelled till…— Air India (@airindia) May 9, 2025

Ministry of Home Affairs Write To All States and Union Territories3
రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచనలు

భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పరిపాలనాధికారులకు లేఖ రాసింది. సివిల్ డిఫెన్స్ రూల్స్‌కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించింది.ప్రజలు, ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి.. శత్రు దాడి సమయంలో కీలకమైన సేవల నిరంతరాయ పనితీరును నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని హోం మంత్రిత్వ శాఖ తమ లేఖలో గుర్తు చేసింది.1968 నాటి పౌర రక్షణ నియమాలలోని సెక్షన్ 11, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను, ఆస్తులను హాని లేదా నష్టం నుండి రక్షించడానికి త్వరిత చర్యలు తీసుకునే అధికారం ఇస్తుంది. అటువంటి సంక్షోభాల సమయంలో విద్యుత్, నీటి సరఫరా, రవాణాతో సహా ముఖ్యమైన సేవలు నిరంతరాయంగా పనిచేస్తాయని కూడా ఇది నిర్ధారిస్తుంది.As per the communique, Section 11 of the Civil Defence Rules, 1968, can be invoked and necessary Emergency Procurement Powers to the Director Civil Defence of state/UT, may be granted so that efficient implementation of the necessary precautionary measures can be implemented.— ANI (@ANI) May 9, 2025

Did Not intercept Indian Drones Says Khawaja Asif4
మన రక్షణ వ్యవస్థను భారత్‌ తునాతునకలు చేసింది: పాక్‌ రక్షణమంత్రి

లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్‌లను పాకిస్తాన్‌ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. తమ దళాలు అడ్డగించి కూల్చివేసాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత డ్రోన్‌లను పాక్‌ అడ్డుకోలేకపోయిందంటూ క్లారిటీ ఇచ్చారు. ‘మన ఎయిర్‌ డిఫన్స్‌ వ్యవస్థ విఫలమైంది. పాక్‌ రక్షణ వ్యవస్థను భారత్‌ తునాతునకలు చేసింది. మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరణ ఇవ్వలేను’ అని పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై పాక్‌ ప్రతిపక్ష ఎంపీలు(పీటీఐ పార్టీకి చెందిన వారు) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పాకిస్తాన్‌ అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్‌ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్‌ఏ దాడులతో ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్‌ దాడుల్లో 20 మంది పాక్‌ సైనికులు హతమయ్యారు.పాక్‌ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్‌ చేశారు. పాక్‌ పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్‌ పిరికిపంద అంటూ పాక్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్‌ మేజర్, సీనియర్‌ ఎంపీ అయిన తాహిర్‌ ఇక్బాల్‌ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్‌.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.“We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 “We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025

Miss World 2025: Former Mrs Universe Intelligence Abhimanika Yadav special story5
Miss World 2025: అందమూ.. అంతకుమించి...

‘దేవుదే దిగొచ్చి మిమ్మల్నేమైనా కోరుకోమంటే ఏం కోరుకుంటారు?’ ‘పిల్లలు అమాయకులు.. పువ్వులాంటి వారు. దేవుడికి అత్యంత ఇష్టమైన వారు. అందుకే సమాజం చేసే తప్పులకు వాళ్లు బలి కాకూడదు.. వాళ్లు మంచి వాతావరణంలోనే పెరగాలని కోరుతాను!’ అని సమాధానమిచ్చింది కె. అభిమానికా యాదవ్‌! ఈ జవాబుతో ఆమె ‘2016 మిసెస్‌ ఇండియా’ పోటీలో నెగ్గారు. తర్వాత మిసెస్‌ ఆసియా పసిఫిక్‌ యూనివర్స్‌ కిరీటాన్ని పొందారు. ‘2017.. మిసెస్‌ యూనివర్స్‌ పోటీ’కీ వెళ్లారు. అక్కడ ఆమెను జడ్జెస్‌ మూడు నిమిషాల్లో డొమెస్టిక్‌ వయొలెన్స్‌ గురించి మాట్లాడమన్నారు. దానిమీద మూడు నిమిషాల్లో ఆమె పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషనే ఇచ్చారు. జడ్జెస్‌ ఇంప్రెస్‌ అయ్యి.. ‘2017.. మిసెస్‌ యూనివర్స్‌ ఇంటెలిజెన్స్‌’ సబ్‌టైటిల్‌నిచ్చారు. హైదరాబాద్‌ వాసి అయిన ఆమె.. సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ కోచ్, పాజెంట్‌ గ్రూమర్, మోటివేషనల్‌ స్పీకర్, ఫ్యాషన్‌ స్టయిలిస్ట్‌! ఇప్పుడు తెలంగాణలో జరగనున్న మిస్‌ వరల్డ్‌ పోటీల నేపథ్యంలో అసలు బ్యూటీ పాజెంట్స్‌ ఎలా జరుగుతాయి, ఎలాంటి రౌండ్స్‌ ఉంటాయి, ఎలా గ్రూమ్‌ అవుతారు వంటి విషయాలను ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు.‘2016లో జరిగిన మిసెస్‌ ఇండియా పోటీల టైమ్‌కి నేను డివోర్సీని. అప్పుడు మా బాబుకు అయిదేళ్లు. నా పెంపకంలోనే ఉన్నాడు. బీటెక్‌ చదివి, కొన్నాళ్లు కార్పొరేట్‌ జాబ్‌ చేసి వదిలేసి.. జుంబా ట్రైనర్‌గా మారాను. క్లాసికల్‌ డాన్సర్‌ (ఆంధ్రనాట్యం)ని కూడా! ఫిట్‌నెస్‌లోనూ ట్రైనింగ్‌ తీసుకుని ఫిట్‌నెస్‌ కోచ్‌గానూ ఉన్నాను. డివోర్స్‌ మీద సమాజంలో ఉన్న అప్రకటిత నిషేధాలు, సంకోచాలను కాదని దానిమీద చాలా మాట్లాడేదాన్ని, విరివిగా చర్చించి దాన్ని నార్మలైజ్‌ చేయడానికి ప్రయత్నించాను. దాంతో అందరికీ సుపరిచితురా లనయ్యా. బ్యూటీ పాజెంట్‌లో పాల్గొనాలనేది మాత్రం అప్పటికప్పుడు తీసుకున్న డెసిషనే. దీనికి సంబంధించి అప్పుడిక్కడ గ్రూమింగ్‌ సెంటర్స్‌ లేవు. ముంబై, లేదంటే ఢిల్లీ వెళ్లాలి. నేను ఢిల్లీ వెళ్లాను. లక్కీగా మంచి కోచ్‌ దొరికారు. కాన్ఫిడెంట్‌గా నన్ను నేను ప్రెజెంట్‌ చేసుకున్నాను. టైటిల్‌ గెలుచుకున్నాను. ఆ ఉత్సాహంతోనే మిసెస్‌ యూనివర్స్‌ పాజెంట్‌కీ వెళ్లాను. అయితే మిసెస్‌ ఇండియా, మిసెస్‌ యూనివర్స్‌ పాజెంట్స్‌ మధ్య సంవత్సరం టైమ్‌ ఉండింది. అయినా గ్రూమింగ్‌ కోసం బాబును వదిలిపెట్టి వేరే సిటీకి వెళ్లే పరిస్థితి లేదు. దాంతో అంతకుముందు కోచ్‌ దగ్గర్నుంచే కొన్ని టిప్స్, యూట్యూబ్‌లో మిస్‌ యూనివర్స్, మిస్‌ వరల్డ్‌ పాజెంట్స్‌కి సంబంధించిన వీడియోలు, అందులోని పార్టిసిపెంట్స్‌ ఇంటర్వ్యూలు చూసి నన్ను నేను గ్రూమ్‌ చేసుకున్నాను.→ ఆ పోటీలు ఎలా ఉంటాయంటే.. మిస్‌ యూనివర్స్, మిస్‌ వరల్డ్, మిసెస్‌ యూనివర్స్‌.. ఇలా ఏ అందాల పోటీలైనా దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. నెల రోజులు జరుగుతాయి. అయితే నెలంతా పోటీలుండవు. ఈ పోటీలను ఏ దేశం హోస్ట్‌ చేసినా దాని ప్రధాన లక్ష్యం.. అక్కడి టూరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే! సో.. మా పోటీలు దక్షిణాఫ్రికాలో జరిగాయి. 86 దేశాల నుంచి కంటెస్టెంట్స్‌ వచ్చారు. పోటీల షెడ్యూల్‌ అంతా కంటెస్టెంట్స్‌కి ముందే ఇచ్చేస్తారు. పోటీలు లేని రోజుల్లో ఆ దేశంలోని చారిత్రక ప్రాంతాల పర్యటన ఉంటుంది. వాళ్లు ఫుడ్, కల్చర్‌ను తెలుసుకునే పర్యటనలుంటాయి. పోటీల విషయానికి వస్తే.. ఏ రోజు ఏ ఈవెంట్‌ ఉంటుందో దానికి సంబంధించిన కాస్ట్యూమ్‌ ఉంటుంది. ఈ కాస్ట్యూమ్స్‌ కోసం కొంతమంది కంటెస్టెంట్స్‌ స్పాన్సర్స్‌ని వెదుక్కుంటారు. స్విమ్‌ వేర్‌ రౌండ్‌ ఉంటుంది. స్విమ్‌ సూట్‌తో స్టేజ్‌ మీద కనిపించాలి. దానికి ఫొటో షూట్‌ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్‌ని మనమెంత కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తున్నాం, బాడీలాంగ్వేజ్‌ వంటివన్నీ అసెస్‌ చేస్తారు. ఇంటెలిజెన్స్‌ రౌండ్‌ ఉంటుంది. ఇందులో క్విజ్‌ ఉండొచ్చు, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద చర్చలు, మహిళల సమస్యలకు సంబంధించిన టాపిక్స్‌ ఉంటాయి. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా ఇవ్వచ్చు. వాళ్లిచ్చిన టాపిక్‌ని వాళ్లిచ్చిన వ్యవధిలో ఎంత చక్కగా మాట్లాడామనేది చూస్తారు. బ్యూటీ విత్‌ పర్పస్‌ రౌండ్‌ ఉంటుంది. కంటెస్టెంట్స్‌ ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగస్వాములై ఉండాలి. ఆ పోటీ కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు అందులో దానిగురించి పొందుపరచాలి. ఈ రౌండ్‌లో దాని గురించి అడుగుతారు. మనం చేసిన పనిని ఎంత స్మార్ట్‌గా ప్రెజెంట్‌ చేశామనేదాన్ని బట్టి పాయింట్స్‌ ఉంటాయి. దీనిమీద ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ఉంటుంది. మాగ్జిమమ్‌ ఓట్లు వచ్చిన వాళ్లకు మిస్‌ పాపులర్‌ అనే సబ్‌ టైటిల్‌ ఇస్తారు. ఫిట్‌నెస్‌ రౌండ్‌ ఉంటుంది. అలాగే టాలెంట్‌ రౌండ్‌ ఉంటుంది. మనకొచ్చిన కళలను ప్రదర్శించాలి. ఇందులో ది బెస్ట్‌ పెర్‌ఫార్మర్‌కు మిస్‌ టాలెంటెడ్‌ సబ్‌ టైటిల్‌ ఇస్తారు. ట్రెడిషనల్‌ రౌండ్‌ కూడా ఉంటుంది. ఇందులో మనం దేన్ని, ఎంత క్రియేటివ్‌గా రిప్రెజెంట్‌ చేస్తున్నామనేది ఫోకస్‌ అవుతుంది. → తలపై బోనంతో....నేను లంగా, ఓణీ వేసుకుని, తల మీద బోనం పెట్టుకుని ర్యాంప్‌ వాక్‌ చేసి, బోనం గురించి వర్ణించాను! గౌన్‌ రౌండ్, ఇంట్రడక్షన్‌ రౌండ్, వన్‌ టు వన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ రౌండ్, ప్రిలిమినరీ రౌండ్స్‌ ఉంటాయి. ఇవేకాక ఫినాలే రోజు.. టైమ్‌ లేకుంటే అంతకంటే ముందు రోజు మిస్‌ బ్యూటిఫుల్‌ స్కిన్,హెయిర్, ఫొటోజెనిక్, స్మైల్, బెస్ట్‌ స్విమ్‌ సూట్‌ లాంటి సబ్‌టైటిల్స్‌నిస్తారు. ర్యాంప్‌ వాక్‌ ఉంటుంది. ఫినాలే రోజు అందరూ తప్పకుండా గౌనే వేసుకోవాలి. కొన్నిసార్లు ఏ దేశం హోస్ట్‌ చేస్తుందో ఆ దేశానికి సంబంధించిన ట్రెడిషనల్‌ వేర్‌ని ఇస్తారు. మాకు సౌత్‌ ఆఫ్రికన్‌ ప్రింట్స్, యాక్ససరీస్‌తో డిఫరెంట్‌ అవుట్‌ఫిట్స్‌ ఇచ్చారు. కిందటిసారి ముంబైలో జరిగిన మిస్‌వరల్డ్‌ పోటీల్లో అందరికీ లెహెంగాలు ఇచ్చారు. ఫినాలే రోజు టాప్‌ టెన్, లేదా టాప్‌ ఫైవ్‌ స్టేజ్‌ మీద ఉంటారు. వాళ్లందరికీ ఒక క్వశ్చన్‌ ఇస్తారు. ఒకవేళ మల్టిపుల్‌ జడ్జెస్‌ ఉంటే డిఫరెంట్‌ క్వశ్చన్స్‌ ఉంటాయి. వాటికి ఎంత వేగంగా స్పందించి.. ఎంత కాన్ఫిడెంట్‌గా.. ఎంత కూల్‌గా ఆన్సర్‌ చేస్తారో దాన్ని బట్టి టైటిల్‌ విన్నర్‌ని, ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ రన్నరప్స్‌ని అనౌన్స్‌ చేస్తారు.→ కొరియోగ్రఫీ..గ్రూమింగ్‌ అవుతున్నప్పుడు ఆర్గనైజర్స్‌ వస్తారు.. ఎవరు ఎలా పెర్‌ఫార్మ్‌ చేస్తున్నారో చూస్తుంటారు. ఈ పోటీలకు కొరియోగ్రఫీ ఉంటుంది. ఎవరు ఎక్కడ నిలబడాలి, ఎలా నడవాలి.. ఎలా ప్రెజెంట్‌ చేసుకోవాలి వంటివన్నీ ట్రైన్‌ చేస్తారు. దీనికి పాజెంట్‌ కోచ్‌ ఉంటారు. వాళ్లే నేర్పిస్తారు. మిసెస్‌ ఇండియా మొదలు మిసెస్‌ యూనివర్స్‌ వరకు గ్రూమింగ్‌కి కాస్ట్యూమ్స్, ఫుట్‌వేర్,యాక్ససరీస్‌ సహా నాకు రూ. 12 లక్షల వరకు ఖర్చయింది. పాజెంట్‌లో పార్టిసిపేట్‌ అవడమనేది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఏమైనా నాకు ఫిట్‌నెస్‌ కోచ్‌గా కొనసాగడమే ఇష్టం. పదేళ్లుగా అదే రంగంలో కొనసాగుతున్నాను. పాజెంట్స్‌కి సంబంధించి వర్క్‌షాప్స్‌ పెట్టాను. త్వరలోనే ఇక్కడొక గ్రూమింగ్‌ సెంటర్‌ పెట్టాలని ΄్లాన్‌ చేస్తున్నాను. – సరస్వతి రమ

Not against delimitation but south India should get 33 Percent representation says Revanth Reddy6
నాది లేటెస్ట్‌ మోడల్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలో ఇప్పటిదాకా గుజరాత్‌ మోడల్‌ గురించి చర్చ జరుగుతోంది. కానీ అది 2000 సంవత్సరం కంటే ముందున్న మోడల్‌. ప్రస్తుత తెలంగాణ మోడల్‌ 2025లో ఉన్న అప్‌ డేటెడ్‌ మోడల్‌. మోదీ మోడల్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ అయితే, నాది స్కిల్స్‌ యూనివర్సిటీ. గుజరాత్‌లో ఉద్యోగాల్లేవు. నేను ఏడాదిలో 60 వేల ఉద్యోగాలిచ్చా. అక్కడ రైతుల రుణమాఫీ లేదు.. నేను రూ.21 వేల కోట్లు మాఫీ చేశా. గుజరాత్‌లో మద్దతు ధర లేదు. తెలంగాణలో మద్దతు ధరతో పాటు బోనస్‌ కూడా ఇస్తున్నాం. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం.మేం రిజర్వేషన్ల పెంపును సమర్థిస్తాం. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌ మోడల్‌లో మీడియాకు స్వేచ్ఛ లేదు. మా మోడల్‌లో ఈ స్వేచ్ఛ ఉంది. అందుకే మోదీ మోడల్‌ అవుట్‌ డేటెడ్‌. నాది అప్‌ టు డేట్‌ మోడల్‌. అందుకే తెలంగాణను కేంద్రం అనుసరిస్తోంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం బెంగళూరు వేదికగా జాతీయ దినపత్రిక ది హిందూ నిర్వహించిన ‘ది హిందూ హడిల్‌’ చర్చాగోష్టిలో ఆయన హైదరాబాద్‌ నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ‘ముందుగా ఈ దేశాన్ని రక్షిస్తున్న భారత ఆర్మికి సెల్యూట్‌ చేస్తున్నా. సైనికులకు సంఘీభావం ప్రకటించే సమయం ఇది..’ అని సీఎం అన్నారు. అనంతరం పలు అంశాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. కులగణన భవిష్యత్‌ తరాలకు దారి చూపిస్తుంది ‘సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌. దేశంలో లేదా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా కులగణన చేపడతామని ప్రజలకు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఆ మేరకు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. మేము చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చేపట్టింది. కులగణన చేయడం మినహా కేంద్రానికి మరో మార్గం లేదు. ఈ కులగణన భవిష్యత్‌ తరాలకు దారి చూపిస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోంది. ఎస్సీల్లో 59 కులాలున్నాయి.వీటిలో కొన్ని కులాలు విద్య, ఉపాధి రంగాల్లో లబ్ధి పొందుతున్నాయి. కొన్ని వర్గాలకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శనం చేసింది. మేం వెంటనే రంగంలోకి దిగాం. కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫారసు మేరకు ఏకసభ్య కమిషన్‌ నియమించాం. ఈ కమిషన్‌ మూడు కేటగిరీల్లో ఎస్సీలను వర్గీకరించాలని చెప్పింది. ఆ సిఫారసుకు అనుగుణంగా ఎస్సీల వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యార్థి దశలోనే కులం సమస్య గుర్తించా ‘గ్రామీణ ప్రాంతం నుంచి వచి్చన నాయకుడిగా సమాజంపై కులం ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు బాగా తెలుసు. విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే ఆ సామాజిక వర్గాలకు చెందిన వారితోనే కలిసి ఉండడం ద్వారా సమాజం వారిని విస్మరిస్తోందని, దూరంగా ఉంచుతోందని గుర్తించా. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కులాల పేరుతో విభజించి చదివించడం మంచిది కాదు. అందుకే నా కేబినెట్‌ సహచరులకు, అధికారులకు చెప్పా.అన్ని వర్గాల ప్రజలకు మంచి విద్యా సదుపాయాలు కల్పించాలని, మంచి వాతావరణంలో వారికి విద్యాబుద్ధులు నేర్పాలని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులందరినీ కలిపి చదివించాలని వారు సూచించారు. అందులో భాగంగానే యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మొత్తంగా రూ.25 వేల కోట్ల పెట్టుబడి భవిష్యత్‌ కోసం పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలను చేపట్టాలి..’ అని రేవంత్‌ అన్నారు. రైతుల కోసం ఎన్నో చేస్తున్నాం.. ‘సంక్షేమం విషయంలో తెలంగాణ దేశంలోనే మంచి మోడల్‌. అయితే సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధి జరగాలి. సంక్షేమం, అభివృద్ధి కలిసి ముందుకెళ్లాలి. నేను ఈ విధంగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. రుణమాఫీ, పెట్టుబడి సాయం, మద్దతు ధర కోసం రైతులు ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. మేం తొలి ఏడాదిలోనే 25.30 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం. ప్రతి యేటా రూ.18 వేల కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నాం. 24 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నాం. సోనియాగాంధీ నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తీసుకొచి్చన పథకమిది. ఈ పథకం కింద ఏడాదికి రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ధాన్యానికి మద్దతు ధర, బోనస్‌ కలిపి క్వింటాల్‌కు రూ.2,800 ఇస్తున్నాం..’ అని సీఎం వెల్లడించారు. నా పోటీ మన దేశ నగరాలతో కాదు.. ‘స్వయం సహాయక సంఘాల (67 లక్షల మంది) మహిళలకు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పించాం. రాష్ట్రంలోని 10 వేల ఆర్టీసీ బస్సుల్లో వెయ్యి బస్సులు మహిళలకు కేటాయించాం. విద్యార్థులు డ్రెస్సులు కుట్టే కాంట్రాక్టు మహిళలకు ఇచ్చాం. యువకుల కోసం యంగ్‌ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. దావోస్‌ వేదికగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో డ్రైపోర్టు, నెట్‌జీరో సిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనికి భారత్‌ ఫ్యూచర్‌ సిటీగా నామకరణం చేశాం. నా పోటీ బెంగళూరు, అమరావతి, ముంబై, ఢిల్లీలతో కాదు. న్యూయార్క్, టోక్యో, దుబాయ్, సింగపూర్‌లు నా లక్ష్యం..’ అని రేవంత్‌ పేర్కొన్నారు. వన్‌ పర్సన్‌–వన్‌ పార్టీ విధానం అంగీకరించం ‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు మేం వ్యతిరేకం కాదు. అయితే ముందు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడి నిబంధనలు రూపొందించాలని అడుగుతున్నాం. జనాభా ప్రాతిపదికన ముందుకెళితే దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్‌ కూడా నష్టపోతుంది. మీరు నియోజకవర్గాలను ఎలా పెంచినా మాకు 33 శాతం సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. లేనిపక్షంలో అది నియోజకవర్గాల పునర్విభజన కాదు. వన్‌ పర్సన్‌–వన్‌ పార్టీ విధానం ఇది. దీన్ని మేం అంగీకరించేది లేదు..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేసిన ఎం.కె.నారాయణన్‌ చర్చాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసించారు. ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలు కొట్టి చెపుతున్నారంటూ అభినందించారు. ఈ కార్యక్రమానికి హిందూ తెలంగాణ పొలిటికల్‌ ఎడిటర్‌ ఆర్‌.రవికాంత్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

BCCI suspends IPL matches7
వారం రోజుల విరామం

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2025 మ్యాచ్‌లకు బ్రేక్‌ పడింది. భారత్, పాకిస్తాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను వెంటనే నిలిపివేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. లీగ్‌ను ‘వారం రోజుల పాటు’ ఆపేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. గురువారం ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్‌ మధ్య మ్యాచ్‌ను అకస్మాత్తుగా ఆపేసినప్పుడే లీగ్‌ కొనసాగడంపై సందేహాలు వచ్చాయి.శుక్రవారం దీనిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు యుద్ధం సాగుతుండగా, మరోవైపు ఐపీఎల్‌ రూపంలో వినోదం కొనసాగడం సరైంది కాదని బోర్డు భావించింది. ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లతో పాటు లీగ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నవారందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ‘ఐపీఎల్‌ భాగస్వాములందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం.ప్రస్తుత స్థితిలో మేం దేశం వెంట ఉన్నాం. ప్రభుత్వానికి, సైన్యానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ ధైర్యసాహసాలకు మేం సెల్యూట్‌ చేస్తున్నాం. మన దేశంలో క్రికెట్‌ పట్ల అపరిమిత ప్రేమ ఉందనేది వాస్తవం. అయితే దేశంకంటే, దేశం సార్వభౌమత్వం, భద్రతకంటే ఏదీ ఎక్కువ కాదు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే బీసీసీఐ ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. మాకు మద్దతుగా నిలిచిన ఐపీఎల్‌ భాగస్వాములందరికీ కృతజ్ఞతలు’ అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. లీగ్‌ కొనసాగించడం, కొత్త తేదీలు, వేదికలపై అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత పరిస్థితులను బట్టి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా బోర్డు స్పష్టం చేసింది. క్రికెటర్లు స్వస్థలాలకు... ఐపీఎల్‌ వాయిదాపై ప్రకటన వచ్చిన వెంటనే అన్ని జట్లలోని క్రికెటర్లు తమ సొంత నగరాలకు బయలుదేరేలా ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేశాయి. స్వదేశానికి వెళ్లిపోవాలనుకునే విదేశీ క్రికెటర్లకు ఏర్పాట్లపరంగా ‘ప్లేయర్స్‌ అసోసియేషన్‌’ సహకరిస్తోంది. గురువారం ధర్మశాలలో మ్యాచ్‌ రద్దయ్యాక ఢిల్లీ, పంజాబ్‌ క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ముందుగా బస్సు ద్వారా జలంధర్‌కు తరలించారు. అక్కడి నుంచి వారంతా ప్రత్యేక వందేభారత్‌ రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. విమర్శల బారిన పడరాదనే... ఐపీఎల్‌ సీజన్‌ లీగ్‌ దశలో 58 మ్యాచ్‌లు ముగియగా... మరో 12 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. వీటిలో అహ్మదాబాద్‌లో మూడు... లక్నో, బెంగళూరులలో రెండు చొప్పున...హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, జైపూర్‌లలో ఒక్కో మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇవి కాకుండా 4 ప్లే ఆఫ్స్‌లలో రెండేసి మ్యాచ్‌లకు హైదరాబాద్, కోల్‌కతా వేదికగా నిర్వహించాల్సి ఉంది. వాస్తవికంగా చూస్తే సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఉన్నా... ఉత్తరాదిలోని కొన్ని నగరాలు మినహా ఈశాన్యం, దక్షిణం వైపు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. బీసీసీఐ స్థాయి, దానికి ఉన్న సాధన సంపత్తిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కేవలం వేదికలు మార్చి చకచకా ఈ 16 మ్యాచ్‌లు నిర్వహించడం ఏమాత్రం సమస్య కాదు. అయితే ఒకవైపు యుద్ధం సాగుతుంటే, మన సైనికులు పోరాడుతుంటే మీకు ఆటలు కావాలా అని సగటు భారతీయుడు ఆగ్రహిస్తున్నాడు. ఇంత సంకట స్థితిలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వం నుంచి ఆంక్షలు, హెచ్చరికలు వస్తుండగా ఐపీఎల్‌ మాత్రం కొనసాగడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది. అయితే పూర్తిగా సీజన్‌ను రద్దు చేయకుండా, లేక సుదీర్ఘ సమయం వాయిదా వేయకుండా ‘ఒక వారం వాయిదా’ అంటూ సన్నాయి నొక్కులు చూపిస్తోంది. బహుశా వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని, అప్పుడు మళ్లీ ఆడించవచ్చనే ఆలోచన కనిపిస్తోంది!ప్రత్యామ్నాయ తేదీలు ఏవి?బీసీసీఐ ‘వారం’ విరామం ప్రకటనను బట్టి చూస్తే వెంటనే కొనసాగించాలని భావిస్తున్నట్లుగా ఉంది. షెడ్యూల్‌ ప్రకారం మే 25న ఐపీఎల్‌ ముగియాలి. ఇప్పుడు మరో వారం దీనికి జోడిస్తే జూన్‌ 1న ముగిసేలా కొత్త షెడ్యూల్‌ ఇవ్వవచ్చు. సరిగ్గా చెప్పాలంటే టోర్నీని ముగించేందుకు బోర్డుకు 10 రోజులు చాలు. ‘డబుల్‌ హెడర్‌’లుగా రోజుకు రెండు లీగ్‌ మ్యాచ్‌ల చొప్పున 6 రోజులు... ప్లే ఆఫ్స్‌కు మరో 4 రోజులు సరిపోతాయి. జూన్‌ మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది కాబట్టి కష్టమనే చర్చ ఉన్నా... తొలి టెస్టు జూన్‌ 20న మొదలవుతుంది. ఐపీఎల్‌లో ఆడుతున్న టెస్టు జట్టు సభ్యులు జూన్‌ 10 వరకు చేరుకున్నా సమస్య లేదు. ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లు నిర్వహించకుండా ఆగిపోతే ఇంగ్లండ్‌ సిరీస్‌ తర్వాత ఆగస్టు, సెపె్టంబర్‌ వరకు లీగ్‌ వెళుతుంది. అయితే ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్‌తో వన్డే, టి20 సిరీస్‌లను ఆడనుంది. దీనిని వాయిదా వేసినా ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్, ఇంగ్లండ్‌ బోర్డు నిర్వహించే ‘హండ్రెడ్‌’ టోర్నీలు ఉన్నాయి. ‘హండ్రెడ్‌’లో సగం జట్లను ఐపీఎల్‌ యజమానులే కొన్నారు కాబట్టి ఇది అసాధ్యం. సెప్టెంబర్‌లో 19 రోజులు ‘ఆసియా కప్‌’ టోర్నీకి కేటాయించారు. దీనికి భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్‌ ఇక్కడ ఆడకపోవడమే కాదు... భారత్, పాక్‌ మధ్య మ్యాచ్‌లు జరగడం కూడా అసాధ్యమే! కాబట్టి ఈ ఒక్క టోర్నీని రద్దు చేస్తే ఐపీఎల్‌కు కావాల్సిన సమయం లభిస్తుంది.

War are now beating louder as India begins strikes on terrorist camps8
ఈ ఉద్రిక్తతలు తగ్గే మార్గం

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపైనే కాకుండా, 1971 తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్‌ పై, అది కూడాపంజాబ్‌ నడిబొడ్డున ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడులు ప్రారంభించడంతో ఇప్పుడు యుద్ధ ఢంకా గట్టిగా మోగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ ఒక సైనిక విన్యాస క్రమంలో యుద్ధట్యాంక్‌ పైకి ఎక్కి, తమపై ఏదైనా భారతీయ ‘సైనిక దురదృష్టకర ఘటన’ జరిగితే, ‘తక్షణ స్పందన’తో దాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు. కానీ భారత్‌ ప్రతిదాడి చేశాక పాక్‌ ఆర్మీ చీఫ్‌ ప్రతిష్ఠ దెబ్బతింది.అసీమ్‌ మునీర్‌ అన్నట్లుగా, భారత ప్రతి దాడి నిజంగా ‘సైనిక దురదృష్టకర ఘటనా’? ఏ రకంగా చూసినా, అది నిజం కాదు. ఇది చాలా కచ్చితమైన ఉగ్రవాద నిరోధక దాడి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మాట్లాడుతూ, మన ప్రతిదాడి ఉద్రిక్తతలు పెంచేది కాదనీ, పాక్‌లోని ఏ సైనిక లక్ష్యాన్నీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తాకలేదనీ తెలిపారు. సందేశం స్పష్టంగా ఉంది. పౌరులను, భారత సైన్యాన్ని తాకాలా వద్దా అనే విషయాన్ని పాకిస్తాన్‌ నిర్ణయించు కోవాల్సి ఉండింది. ఎందుకంటే, భారత్‌లో ఉగ్రవాద శిబిరాలు లేవు. అయినా సరే, పాక్‌ సైన్యం ఏకంగా భారతీయ నగరాలపై, జనావా సాలపై, విమానాశ్రయంపై నేరుగా దాడికి దిగింది. తర్వాత ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం.జనరల్‌ మునీర్‌ దూకుడుపాక్‌ సైనిక దాడులకు ఒక రోజు ముందే భారత హోమ్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ కసరత్తులకు ఆదేశించింది. భారతదేశం పూర్తి యుద్ధానికి సిద్ధమ వుతోందని ఇది సూచిస్తుంది. అయితే, ఇది నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ) లేదా నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌(ఎన్‌ఎస్‌ఎస్‌) వంటి స్వచ్ఛంద సంస్థలను మాత్రమే సమీకరించే రక్షణాత్మక చర్య. జాగ్రత్తగా చేపట్టిన ఈ ప్రయత్నాలన్నింటికీ భిన్నంగా, పాకిస్తాన్‌ చేపట్టిన సైనిక దాడి ఆ దేశానికి ఏ ప్రయోజనమూ కలిగించలేదు. జనరల్‌ మునీర్‌ దూకుడు మీద ఎటువంటి సందేహం లేదు. ఉద్దేశపూర్వకంగా మతతత్వ రంగు పులుముతూ, పహల్‌గామ్‌ ఉగ్రవాద దాడికిముందు ఇస్లామాబాద్‌లో ఏప్రిల్‌ 18న జరిగిన ఒక కార్యక్రమంలో ‘రెండు దేశాల సిద్ధాంతం’పై ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం భారతదేశాన్ని రెచ్చగొట్టింది. ఉగ్రదాడిపై గట్టి చర్యకు దిగాలనే దృఢ సంకల్పాన్ని భారత్‌కు కలిగించింది.మునీర్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్‌ లో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు 66 శాతం పెరిగి, తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఎంతోమంది అనుచరు లున్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్ ను, ఆ పార్టీ నేతలను పాక్‌ సైనిక వ్యవస్థ జైలులో పెట్టించింది. మాజీ ఐఎస్‌ఐ చీఫ్, లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌నూ, తన సొంత ప్రజలపై కాల్పులు జరప డానికి నిరాకరించిన మరో జనరల్‌తో సహా మరి కొందరు సీనియర్‌ అధికారులనూ జైల్లో పెట్టింది. మునీర్‌ తన ప్రతిష్ఠను తానే చెరుపుకున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు, ఐఎస్‌ఐ డీజీగా ఉన్న తనను అమర్యాదగా బయటకు నెట్టివేయడం తనకు జరిగిన ఘోరావమానంగా మునీర్‌ భావించారు. దాంతో సరైన అవకాశం కోసం చాలా కాలం వేచి ఉండి చివరకు కొరడాను ఉపయోగించారు.బాలాకోట్‌ సర్జికల్‌ దాడులు జరిగినప్పుడు పాక్‌ స్పందన సంయమనంతో ఉండింది. అప్పుడు పాక్‌ ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ బాజ్వా పూర్తి భిన్నమైన మనిషి. ఆయన ఇండియాతో వాణిజ్యసంబంధాలను కోరుకున్నారు. కానీ ఇప్పుడు భారత్‌– పాక్‌ ఘర్షణ భిన్న స్థాయికి చేరుకుంది.పట్టించుకునే స్థితిలో లేని ప్రపంచంవిస్తృత ప్రాంతీయ సంఘర్షణను రెచ్చగొట్టవద్దని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ భారతదేశానికి సలహా ఇచ్చారు. అలా రెచ్చగొట్టిన పక్షంలో చైనా జోక్యం చేసుకోవచ్చనే హెచ్చరిక దీంట్లో ఉండవచ్చు లేదా ఈ ప్రకటనకు పెద్దగా అర్థం ఏమీ ఉండకపోవచ్చు. కానీ, అగ్రశ్రేణి దేశాల నాయకత్వంలో ఉన్న గందరగోళం కనివిని ఎరుగనిది. తూర్పున, మాస్కో మరింత దారుణమైన ఇబ్బందుల్లో ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌కు మద్దతు ఇచ్చిన తర్వాత, తన వైఖరిని కాస్త సవరించి మధ్యవర్తిత్వం అందించడానికి ప్రయత్నించారు. ఇది ఢిల్లీకి ఏమాత్రం నచ్చదని క్రెమ్లిన్ కు తెలుసు. కానీ క్షిపణుల భారీ సమూహాన్ని మనకు రష్యా పంపడం ప్రోత్సాహకరంగా ఉంది. అయితే రష్యన్‌ సైనిక భుజం ఇప్పుడుఅందుబాటులో లేదు. ఆర్థిక మాంద్యం, తీవ్రమైన అంతర్గతఇబ్బందులతో పోరాడుతున్న యూరోపియన్‌ యూనియన్‌ సంయ మనం వహించాలని ప్రకటించింది. ఇజ్రాయెల్, భారతదేశం పట్ల క్రియాశీలంగా, బలంగా సానుభూతి చూపుతున్నప్పటికీ, గాజాలో గందరగోళాన్ని చూస్తే ఇజ్రాయెల్‌ ఇక్కడ నిర్వహించే పాత్రచాలా తక్కువేనని చెప్పాలి. మొత్తం మీద, ప్రపంచం ఈ యుద్ధాన్ని పట్టించుకునే స్థితిలో లేదు.ఇప్పుడు ఇరు దేశాల సైనిక ఘర్షణను తగ్గించడానికి చైనా ప్రభుత్వం గనక పూనుకుంటే అదొక పరిహాసం అవుతుంది. పాకిస్తాన్‌లో చైనా ప్రాబల్యం నిస్సందేహంగా ఉందనేది జగమెరిగిన సత్యం. మరోవైపున చైనానే పాకిస్తాన్‌ యుద్ధానికి నిధులుసమకూర్చే అవకాశం ఉంది. దేశాలు చాలా అరుదుగా హేతుబద్ధంగా వ్యవహరిస్తాయి. అలా సమకూర్చిన నిధులు వేరే విధంగా మళ్లే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరమని ఢిల్లీకి పూర్తిగా తెలుసు. ఇరు దేశాలు ఏం చేయొచ్చు?అయితే, ఇప్పుడు కూడా ఆశ ఉంది. అంగీకరించని నిజం ఏమిటంటే– భారతదేశం, పాకిస్తాన్‌ తమ సైనిక చర్యల విషయంలో అనేక పాశ్చాత్య దేశాల కంటే గతంలో చాలా పరిణతితో వ్యవహరించాయి. గత మూడు యుద్ధాలలోనూ ఏవీ పౌర లక్ష్యాలపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయలేదు. భారతదేశ క్షిపణి పాకిస్తాన్ ను తాకినప్పుడు, సైన్యం ప్రతిస్పందన సాపేక్షంగా తేలికగా ఉంది. ప్రస్తుతానికి, రెండు వైపులా సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్స్‌ మాట్లాడుతున్నారు. అది ఒక ఆశాజనకమైన సంకేతం. ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మహమ్మద్‌ అసీమ్‌ మాలిక్‌ను పాకిస్తాన్‌ జాతీయ భద్రతా సలహాదారుగా నియ మించడం కూడా అంతే. రెండు దేశాల నిఘా సంస్థల అధిపతులు మాట్లాడుకోవాలని నిర్ణయించుకుంటే, అది పెద్ద విషయమే.ఉపఖండం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి రెండు దేశాలు ఉమ్మడి చొరవను ప్రకటించవచ్చు. పాకిస్తాన్‌ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద ప్రేరేపక దేశం అనే ఆరోపణనుపదే పదే ఎదుర్కొంటున్నందున ఇదేమీ అంత అసాధ్యమైనది కాదు. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాలు ప్రస్తుత పరిస్థితుల్లో సాగేలా లేవు. కాబట్టి, పాత్రధారులు, సూత్రధారులతో సహా ఉగ్ర వాదానికి సంబంధించిన ప్రతిదానినీ దెబ్బతీయడమే ఏకైక ఎంపిక. ఇది ప్రమాదకరం. మొత్తంగా చివరి పాఠం మాత్రం ఇదీ: మీ సొంత యుద్ధాలను మీరే చేసుకోవాలి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఇప్పుడే దాన్నే తెలియజెప్పింది.-వ్యాసకర్త డైరెక్టర్‌ (రిసెర్చ్‌), సెంటర్‌ ఫర్‌ ల్యాండ్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌ ‘ (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)-తారా కార్థా

Justice Sanjiv Khannas latest decision is a crucial step towards transparency9
సముచిత నిర్ణయాలు

స్వీయ లోటుపాట్లను సరిదిద్దుకోవటంలో న్యాయవ్యవస్థ సక్రమంగా వ్యవహరించటం లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న రెండు నిర్ణయాలు ఎన్నదగి నవి. ఇప్పటికే 21 మంది న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించగా, వాటిని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మొన్న మార్చి 4న ఢిల్లీలోని తన అధికార నివాసంలో భారీ యెత్తున కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అభిశంసనకు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకూ, ప్రధాని నరేంద్ర మోదీకీ లేఖ రాయటం కీలక పరిణామం. ఆ ఉదంతంపై విచారణకు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికనూ, జస్టిస్‌ వర్మ ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని కూడా దానికి జతపరిచారు. అవినీతి మకిలి అంటిన న్యాయమూర్తుల్ని తొలగించటమనే ప్రక్రియ చాలా సుదీర్ఘమైనదీ,సంక్లిష్టమైనదీ. న్యాయమూర్తిపై ఆరోపణలొచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంత ర్గత విచారణ కమిటీని నియమించటం, అది ఇచ్చే నివేదికపై నిందపడిన న్యాయమూర్తి అభిప్రా యాన్ని కోరటం, ఆ తర్వాత అవసరమనుకుంటే రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేయమని అడగటం రివాజుగా వస్తోంది. అందుకు నిరాకరిస్తే పార్లమెంటులో అభిశంసన తీర్మానం ద్వారా తొలగించమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేస్తారు. ఈ తీర్మానం కోసం ఇచ్చే నోటీసుపై లోక్‌సభలో కనీసం 150 మంది ఎంపీలూ, రాజ్యసభలో కనీసం 50 మందిఎంపీలూ సంతకాలు పెట్టాల్సివుంటుంది. ఆ తీర్మానాన్ని అనుమతించాలో లేదో స్పీకర్‌ లేదా రాజ్య సభ చైర్మన్‌ నిర్ణయిస్తారు. రాజ్యాంగంలోని 124, 218 అధికరణలు దుర్వర్తన లేదా అసమర్థత ఆరోపణల ఆధారంగా న్యాయమూర్తుల తొలగింపునకు అవకాశాన్నిస్తున్నాయి. అయితే ఇన్ని దశా బ్దాల్లో ఈ ప్రక్రియ కింద పదవిని కోల్పోయిన న్యాయమూర్తి ఒక్కరూ లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగని ఫిర్యాదుల సంఖ్య తక్కువేం లేదు. 2017–2021 మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికీ, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకూ 1,631 ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. అయితే అంతర్గత విచారణ ప్రక్రియ రహస్యమైనది కావటంవల్ల ఎంతమంది న్యాయమూర్తులపై విచారణ జరిగిందో, ఎందరిపై చర్యలు మొదలయ్యాయో తెలియదు. తొలిసారి 1993లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామస్వామిపై నిధుల దుర్వినియోగం విషయంలో వచ్చిన ఆరోపణల పర్యవసానంగా పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ నడిచింది. అప్పట్లో ఆయనపై వచ్చిన 14 ఆరోపణల్లో పదకొండింటికి ఆధారాలున్నాయని తేల్చారు. తీరా పార్లమెంటులో అభిశంసన తీర్మానంపై జరిగిన వోటింగ్‌కు కాంగ్రెస్‌ గైర్హాజర్‌ కావటంతో అది వీగిపోయింది. 2009లో అప్పటి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీడీ దినకరన్‌పైనా ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అభియోగం వచ్చింది. అభిశంసన ప్రక్రియ ప్రారంభం కాగానే ఆయన రాజీనామా చేయటంతో అది అర్ధాంతరంగా ముగిసింది. మద్రాస్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె. వీరాస్వామిపై అవినీతి కేసులో సీబీఐ చార్జిషీటు నమోదు చేసింది. కానీ విచారణ ముందుకు సాగకుండా ఆయన అన్నివిధాలా ప్రయత్నించారు. చివరకు 2010లో ఆయన మరణించారు. అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ విశ్వహిందూ పరిషత్‌ సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సుప్రీంకోర్టు కొలీజియం బహిరంగ క్షమాపణ చెప్పాలని, వివరణనివ్వాలని కోరింది కూడా. కానీ ఇంతవరకూ అదేం జరగలేదు. అదే హైకోర్టుకు చెందిన జస్టిస్‌ ఎస్‌ఎన్‌ శుక్లా అవినీతిపై అంతర్గత కమిటీకి ఆధారాలు లభ్యమయ్యా యన్నారు. కేసుల విచారణ పని అప్పగించటం మానే శారు. కానీ ఆయన రిటైరయ్యేవరకూ న్యాయ మూర్తిగా జీతభత్యాలు తీసుకుంటూనే వున్నారు. అందుకే అవినీతి ఆరోపణలున్న ప్రభుత్వోద్యో గులూ, రాజకీయ పక్షాల నేతల మాదిరి న్యాయమూ ర్తులపై విచారణ సాగటం లేదన్న విమర్శలుంటున్నాయి. జస్టిస్‌ వర్మ వ్యవహారశైలి మొదటినుంచీ అనుమానాలకు తావిచ్చేదిగావుంది. మార్చి 14–15 రాత్రి అగ్నిప్రమాదం జరిగినప్పుడు కొన్ని కరెన్సీ కట్టలు తగలబడినా, మిగిలినవి సురక్షతంగా వున్నాయని మొదటగా అక్కడికొచ్చిన అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు చెప్పగా... అటుపై బాగున్న కట్టలు మాయమయ్యాయి. దీనిపై జస్టిస్‌ వర్మ వివరణ సంతృప్తికరంగా లేకపోవటంతో వ్యవహారం అభిశంసన వరకూ వెళ్లింది. ఇప్పటికే కేసుల విచారణనుంచి ఆయన్ను తప్పించారు.నిజానికి జస్టిస్‌ వర్మ ఉదంతం ప్రభావంతోనే న్యాయవ్యవస్థపై నింద పడకూడదన్న ఉద్దేశంతో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలో న్యాయమూర్తులు ఆస్తులు ప్రకటిస్తున్నా ఎవరైనా సమాచార హక్కు చట్టంకింద కోరితే తప్ప వివరాలు బహిరంగపరిచే విధానం లేదు. బ్రిటన్, కెనడాల్లోనూ అంతే. అయితే అమెరికా, దక్షిణ కొరియా, అర్జెంటీనా, రష్యాల్లో చట్టప్రకారం న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి తప్పనిసరి.ఏదేమైనా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తాజా నిర్ణయం పారదర్శకత దిశగా ఒక కీలకమైన ముందడుగనే చెప్పాలి. అయితే నిందపడిన న్యాయమూర్తులను లోక్‌పాల్‌ చట్టం కింద విచారించవచ్చునా లేదా అన్నది ఇంకా తేలాల్సేవుంది. మొత్తానికి స్వీయప్రక్షాళనకు న్యాయవ్యవస్థ నడుం బిగించటంప్రశంసనీయమైన పరిణామం.

Court responds to petition filed by YS Jagan10
వైఎస్‌ జగన్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రత విషయంలో.. కౌంటర్లు దాఖలు చేయండి

సాక్షి, అమరావతి: జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, సీఆర్‌పీఎఫ్‌ డీజీ, ఎన్‌ఎస్‌జీ డీజీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. జెడ్‌ ప్లస్‌ భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను పునరుద్ధరించే విషయంలో తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ వైఎస్‌ జగన్‌ గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర భద్రతా సంస్థలైన సీఆర్‌­పీఎఫ్‌ లేదా ఎన్‌ఎస్‌జీలతో తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి వాదనలు విన్నారు. వైఎస్‌ జగన్‌ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, నిర్దిష్ట ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా వైఎస్‌ జగన్‌కు ఉన్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపు చేసి జెడ్‌ ప్లస్‌ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. జగన్‌కు ఉన్న ప్రాణహానిని, ఆయనపై గతంలో జరిగిన హత్యాయత్నాన్ని పరిగణనలోకి తీసుకుని జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఎలాంటి నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైఎస్‌ జగన్‌ భద్రతను భారీగా కుదించేశారని, ఇటీవల పలు సందర్భాల్లోనూ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని చెప్పారు. పర్యటనలు, పరామర్శలకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. జెడ్‌ ప్లస్‌ భద్రతను పునరుద్ధరించాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని నాగిరెడ్డి వివరించారు. భద్రత విషయంలో వైఎస్‌ జగన్‌ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు మళ్లీ పిటిషన్‌ వేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) పసల పొన్నారావు స్పందిస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement