old notes
-
పాత వంద రూపాయల నోట్లు రద్దవుతున్నాయా?
పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తోంది. ఈ నోట్లు రద్దవుతాయంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ గడువు కూడా విధించినట్లు అందులో పేర్కొంటున్నారు. పాత రూ.100 నోటు ఇస్తే తీసుకోవడం లేదంటూ మరికొందరు పోస్టు చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ యూజర్ పాత వంద రూపాయల నోట్లు రద్దవుతున్నాయని, 2024 మార్చి 31 వరకు పాత రూ.100 నోట్లను మార్చుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆదేశించిందని పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా దుకాణదారులు పాత రూ.100 నోటు తీసుకోవడం లేదని హైదరాబాద్‌కు చెందిన మరో యూజర్ పేర్కొన్నారు. ఈ పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. @RBI Today, in Ameerpet, Telangana, I encountered an issue where a Pani Puri vendor declined to accept a Rs. 100 note, Could you kindly provide clarification on whether there are any considerations or guidelines regarding the acceptance of such notes in the market? pic.twitter.com/x4c3ONhX0O — Anil G (@anilbjpofficial) December 27, 2023 అయితే పాత వంద రూపాయల నోట్లు నిజంగానే రద్దవుతున్నాయా.. ఆర్బీఐ అలాంటి ప్రకటనలు ఏమైనా ఇచ్చిందా అని పరిశీలించగా ఇవన్నీ ఫేక్ వార్తలని తేలింది. ఇందులో వాస్తవం లేదని ఆర్బీఐ ప్రతినిధి స్పష్టం చేశారు. Yogesh Dayal, the spokesperson for RBI, dismissed the viral claims about the withdrawal of the old Rs 100 notes. https://t.co/sXbIBl92VC pic.twitter.com/SzSARAypZ5 — The Quint (@TheQuint) December 26, 2023 -
మ్యాగజైన్ స్టోరీ 08 November 2021
-
టీటీడీ వద్ద గుట్టలుగా పేరుకుపోయిన రద్దయిన నోట్లు
-
రూ.100 నోటు షాకింగ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ: అనూహ్యంగా పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలకు షాకిచ్చిన కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని తీసుకోనుం దా? తాజా వార్తలు, సాక్షాత్తు ఆర్బీఐ కీలక అధికారి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయి. 2021 ఏడాదిలో మరో షాకింగ్ నిర్ణయం దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని పాత కరెన్సీ నోట్లను విత్‌డ్రా చేసుకునే ఆలోచనలో ఉంది. ఈ మేరకు కేంద్ర బ్యాంకు యోచిస్తున్నట్లు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బీ మహేష్ శుక్రవారం వెల్లడించారు. జిల్లా పంచాయతీలోని మంగళూరు, నేత్రావతి హాల్లో జిల్లా లీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి భద్రతా కమిటీ (డిఎల్ఎస్సి), జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ (డిఎల్ఎంసి) సమావేశంలో బీ మహేష్ మాట్లాడుతూ రూ.100, రూ .10, రూ .5 పాత కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకోనుందనే హింట్ ఇచ్చారు. అలాగే 10 రూపాయల నాణెం ప్రవేశపెట్టి 15 సంవత్సరాల తరువాత కూడా వ్యాపారులు, వ్యాపారవేత్తలు సహా చాలామంది వాటిని అంగీకరించడానికి ఇష్టపడ్డంలేదన్నారు. నకిలీవని వారు అనుమానిస్తుండటంతో బ్యాంకులు, ఆర్బీఐకి సమస్యగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణెంపై ప్రజల్లో అవగాహన కల్సించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే మరి పాత నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఇస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు. దీనికి సంబంధించి ఆర్బీఐ అమలుచేయనున్న సమగ్ర ప్రణాళిక, విధివిధానాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కాగా నవంబర్ 8, 2016లో రూ.500,1000 రూపాయల నోట్ల డీమోనిటైజేషన్ తర్వాత రూ .2,000 విలువైన కరెన్సీ నోట్‌తో పాటు రూ .200 నోటును ప్రవేశపెట్టింది. 2019లో 100 రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. 2019 లో, సెంట్రల్ బ్యాంక్ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఇచ్చిన ఆర్టిఐ సమాధానంలో ఆర్బీఐ వెల్లడించింది. దీంతో త్వరలోనే 2వేల నోటును కూడా రద్దు చేయనుందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్రం, ఆర్బీఐ అప్పట్లోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
భారీగా పట్టుబడ్డ పాత నోట్లు..
కోయంబత్తూర్ : డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇలంగో కుమారుడు ఆనంద్ ఇంటిపై కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి 250 రద్దైన రూ 1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అవనశి నియోజకవర్గానికి ఇలంగో గతంలో ప్రాతినిధ్యం వహించారు. నిషేధించిన నోట్లను కోయంబత్తూర్‌లో ఆనంద్‌కు చెందిన ప్రాంగణంలో దాచారు. డీఎస్పీ వేల్మురుగన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం ఆదివారం రాత్రి ఆనంద్ నివాసంపై దాడి చేసి రద్దు చేసిన పాత నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇంటి యజమాని ఆనంద్‌తో పాటు అద్దెకు ఉంటున్న రషీద్, షేక్‌లపై కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆనంద్ ఇతరులతో కలిసి పాత నోట్లను తన నివాసంలో ఉంచి వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2016 నవంబర్‌లో రూ 1000, రూ 500 నోట్లను మోదీ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
డబ్బులిచ్చి మరి పాత నోట్లను కొంటున్నారట..!
‘డిమానిటైజేషన్’.. ‘పెద్ద నోట్ల రద్దు’ జరిగి రెండేళ్లు పూర్తయ్యాయి. పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డిమానిటైజేషన్ ప్రభావం నేటికి కూడా ఉంది. అయితే పనికి రాకుండా పోయిన ఈ పాత నోట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరి కొంటున్నారట జనాలు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘ఇ-బే’లో ఈ పాత నోట్లను 6 డాలర్ల(రూ. 423)కి అమ్ముతున్నారు. అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పుకొంటున్న ఓ వ్యక్తి ఇ-బేలో ఈ పాత రూ. 500 నోట్లను అమ్మకానికి పెట్టాడు. ఇప్పటికే 15 పాత నోట్ల అమ్ముడు పోయాయి.. మరో 9 మాత్రమే ఉన్నాయి త్వరపడండి అంటున్నాడు సదరు వ్యక్తి. అయితే పనికి రావని తెలిసి కూడా ఈ పాత నోట్లను జనాలు ఎందుకు కొంటున్నారు.. అది కూడా దానికి సమానమైన విలువ చెల్లించి.. అంటే పాత కరెన్సీని, కాయిన్స్‌ని సేకరించే అలవాటు ఉన్న వారే ఇలా కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అయితే పాత నోట్లను ఇలా అమ్మకానికి పెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు చాలా మంది తమ దగ్గర ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను ఇండియామార్ట్, ఓఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ సైట్లలో అమ్మకానికి పెట్టారు. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా కరెన్సీ ట్రేడింగ్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. -
పాతనోట్లు రూ.లక్షకు రూ.10 వేలు కొత్తనోట్లు
చిత్తూరు,గుర్రంకొండ: మండల కేంద్రమైన గుర్రంకొండలో పాత రూ.1000, రూ.500 నోట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. రద్దయిన పాతనోట్లు రూ.లక్ష ఇస్తే ప్రస్తుతం చెలామణిలో ఉన్న కొత్త నోట్లు రూ.10 వేలు ఇస్తున్నారు. బడా వ్యాపారులు స్థానికంగా కొంత మంది ఏజెంట్లను నియమించుకొని నోట్ల వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ సేకరించిన పాతనోట్లను ఏజెంట్ల ద్వారా కర్ణాటకలోని పలు ముఖ్య పట్టణాలకు తరలిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన విసయం తెలిసిందే. పాతనోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకునేందుకు కొంత గడువు ఇచ్చింది. చాలామంది తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చుకోకుండా అలాగే ఉన్న పాతనోట్లను గుట్టుచప్పుడు కాకుండా సేకరిస్తూ వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది స్థానికులు ఏజెంట్లగా మారి పాతనోట్లను తమకిస్తే రూ.500 పాత నోటుకు రూ.50, రూ.1000 నోటుకు రూ.100 ఇస్తున్నారు. పట్టణంలోని కడప–బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపూలా ఉన్న చిన్న చిన్న దుకాణాల వద్ద ఏజెంట్లు మకాం వేస్తున్నారు. ప్రజల వద్ద నుంచి గట్టుచప్పడు కాకుండా పాతనోట్లను కమీషన్ పద్ధతిపై సేకరిస్తున్నారు. వాటిని బెంగళూరుతో పాటు పలు పట్ణణాలకు ప్రైవేట్ బస్సుల ద్వారా తరలిస్తున్నారు. దీనివెనుక ఆంతర్యమేమిటి? రెండేళ్ల క్రితం రద్దు చేసిన పాతనోట్లను ఇప్పుడు సేకరించడం వెనక ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏజెంట్లు రహస్యంగా పాత నోట్లను సేకరించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇక్కడ సేకరించే పాతనోట్లు కర్ణాటకా తరలించడం వెనుక మర్మమేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
పాతనోట్లు చలిమంట
రాయచూరు రూరల్: అది రాయచూరు నగరంలోని గంజ్ సర్కిల్ ప్రాంతం. ఒక మూలన ఏవో కాగితాలు తగలబడుతున్నాయి. కొందరు అనుమానం వచ్చి చూస్తే.. అవి 500, 1000 రూపాయల నోట్లు. దీంతో గగ్గోలు మొదలైంది. కాకపోతే అవి రద్దయిన పాత నోట్లు. ఇక్కడి ఏపీఎంసీ మార్కెట్లోని వ్యాపారులు ఎవరైనా పాత నోట్లను అలాగే ఉంచుకుని ఉంటారు, మార్పిడికి చేతకాక అంటించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాత కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు. దీనిపై మార్కెట్ యార్డ్ ఎస్ఐ అగ్ని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారం తెలియగానే జిల్లా ఇన్చార్జ్ మంత్రి వెంకటరావ్ నాడగౌడ ఘటన స్థలాన్ని సందర్శించారు. పాతనోట్ల రద్దయిన దాదాపు రెండేళ్ల తరువాత కూడా అవి బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎంతమొత్తంలో కాల్చి ఉంటారనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
ఇటుకలుగా రద్దయిన నోట్లు
న్యూఢిల్లీ: రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను ముక్కలు చేసి ఇటుకలు (బ్రిక్స్)గా మారుస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా పీటీఐ కరెస్పాండెంట్ అడిగిన సమాచారాన్ని ఈ మేరకు వెల్లడించింది. ‘రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను లెక్కించి, అధునాతన కరెన్సీ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ సిస్టమ్ (సీవీపీఎస్) ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం. పలు ఆర్బీఐ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ష్రెడ్డింగ్, బ్రిక్వెట్టింగ్ యంత్రాల ద్వారా ముక్కలు చేసి బ్రిక్స్‌గా మారుస్తున్నాం’ అని వివరించింది. బ్రిక్స్ తయారు చేసిన వెంటనే టెండర్లు పిలిచి విక్రయిస్తున్నామని తెలిపింది. -
టీటీడీకి భారంగా మారిన ఆ 26 కోట్లు
-
గుజరాత్లో భారీగా పాతనోట్లు స్వాధీనం
గుజరాత్: గుజరాత్ లో ఒకవైపు అసెంబ్లీకి మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగియగా మరోవైపు భారీ ఎత్తున రద్దయిన నోట్లను నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బారుచ్‌లో రద్దయిన రూ.500, 1000ల నోట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ పట్టుకుంది. సుమారు రూ. 50 కోట్లవిలువ చేసే పాత నోట్లను రికవరీ చేశామని డిఆర్ఐ అధికారులు ప్రకటించారు. యమునా బిల్డింగ్ మెటీరియల్ ప్రాంగణంపై దాడిచేసిన అధికారులు రూ. 48.90 కోట్ల విలువైన పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ది డిప్యూటిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం రద్దయిన పాత కరెన్సీ నోట్లను కలిగి వుండడం నేరమని అధికారులు పేర్కొన్నారు. రూ.10 వేలు లేదా ఇది ముఖ విలువకు ఐదు రెట్ల పరిమానా విధించవచ్చని తెలిపారు. దీని ప్రకారం రూ. 245 కోట్ల రూపాయల జరిమానా విధించబడుతుంది. ఈకేసులో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులపై కోర్టులో డీఆర్ఐ అధికారులు ఫిర్యాదు చేయనున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడతలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. దాదాపు 68శాతం పోలింగ్ జరిగినట్టు ఈసీ తెలిపారు. కాగా ఈ నెల 14 న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. -
ఆ నోట్లను ఏం చేయాలి?
అన్నవరం: పెద్ద నోట్లు రద్దయ్యి.. నేటికి ఏడాది పూర్తయినా అన్నవరం దేవస్థానంలోని పలు హుండీల్లో ఆ నోట్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో భక్తుల వద్ద నుంచి రద్దయిన పెద్ద నోట్లను అన్నవరం దేవస్థానం స్వీకరించింది. జనవరి 2017 నుంచి తీసుకోలేదు. అయితే భక్తులు మాత్రం ఈ నోట్లను హుండీల్లో వేశారు, వేస్తూనే ఉన్నారు. మంగళవారం స్వామివారి హుండీలను తెరవగా వాటిలో పాత రూ.500 నోట్లు 61, రూ.వేయి నోట్లు 55 వచ్చాయి. దీంతో 11 నెలల్లో హుండీల్లో వచ్చిన ఈ నోట్లు మొత్తం రూ.10,76,000కి చేరింది. హుండీల ద్వారా వచ్చిన పాత రూ.500, రూ.వేయి నోట్లను ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీలోకి మార్పిడి చేసేందుకు గత మార్చి నెలలో రిజర్వ్ బ్యాంక్ అధికారులను దేవస్థానం అధికారులు కలిశారు. అయితే రిజర్వ్ బ్యాంక్ అందుకు నిరాకరించింది. పైగా ఈ నోట్లు దేవస్థానం వద్ద కూడా ఉండకూడదని వెంటనే వాటిని తమ వద్ద డిపాజిట్ చేయాలని కూడా తేల్చి చెప్పింది. దీంతో అప్పటి నుంచి వచ్చిన ఈ నోట్లను దేవస్థానం లాకర్లో భద్రపరుస్తున్నారు. ఈ నోట్లను ఏమి చేయాలో చెప్పాలని దేవాదాయశాఖ కమిషనర్ దేవస్థానం అధికారులు కోరారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తామని దేవస్థానం అధికారులు మంగళవారం తెలిపారు. -
పాత నోట్లపై కేంద్రం మరో నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : రద్దయిన నోట్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లు కలిగి ఉన్న వారిపై తాము ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తదుపరి నిర్ణయం ప్రకటించేంత వరకు తాము ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పింది. అంతేకాక రద్దయిన నోట్లకు ఎలాంటి కొత్త విండో కూడా తెరిచేది లేదనీ స్పష్టం చేసింది. పాత నోట్లను డిపాజిట్ చేయని వారిపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కోరుతూ సుధా మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై, విచారణ సందర్భంగా కేంద్రం ఈ విధంగా స్పందించింది. 2016 డిసెంబర్ 31 వరకు డిపాజిట్ చేయని పిటిషనర్లను వద్దనున్న పాత నోట్లను పట్టుకోవడం కోసం ఎలాంటి విచారణలు జరుపమని కూడా కేంద్రం పేర్కొంది. రద్దయిన నోట్లను కలిగి ఉంటే జరిమానాలు విధిస్తామని అంతకముందే ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారని, ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారని, దీనికోసం కేంద్రం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టు తెలిసింది. అంతేకాక ఈ నోట్లు పెద్ద మొత్తంలో ఉండే క్రిమినల్ నేరంగా పరిగణించనున్నట్టు కూడా కేంద్రం హెచ్చరించింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు జరిగిన విచారణలో పెద్ద నోట్లను కలిగి ఉంటే తాము ఎలాంటి చర్యలు తీసుకోమని కేంద్రం, సుప్రీంకోర్టుకి తెలిపింది. -
రూ.1.91 కోట్ల విలువైన పాత నోట్లు స్వాధీనం
-
రూ.1.91 కోట్ల విలువైన పాత నోట్లు స్వాధీనం
అల్లిపురం (విశాఖ దక్షిణం): రద్దయిన పాతనోట్లు కలిగివున్న ముగ్గురు వ్యక్తులను విశాఖ టాస్క్ఫోర్సు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.1.91 కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. బర్మా క్యాంప్‌కు చెందిన మెడికల్ షాపు యజమాని గెడ్డం కల్యాణ్ కుమార్, అదే ప్రాంతానికి చెందిన గుడ్ల వెంకటరమణ, మాదవధారకు చెందిన కండిబోటి వెంకటరమణ నోట్ల రద్దు సమయంలో 20 శాతం కమీషన్ పద్ధతిలో పాతనోట్లను మార్చేవారు. పాతనోట్ల మార్పిడికి ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తవడంతో వీరి వద్ద రూ.1.91 కోట్ల విలువైన పాతనోట్లు మిగిలిపోయాయి. వీటిని అక్కయపాలెంలోని ఓ అపార్ట్మెంట్లో దాచారు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు, సిబ్బంది దాడిచేసి నిందితుల నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
రూ. 46 లక్షల పాతనోట్లు పట్టివేత ?
రాజానగరం : జాతీయ రహాదారిపై స్థానిక బైపాస్‌లోని పెట్రోలు బంకు వద్ద రూ.46 లక్షలు విలువైన రద్దు చేసిన కరెన్సీని రాజానగరం పోలీసులు పట్టుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. పెట్రోలు బంకు వద్ద ఈ నోట్ల మార్పిడి జరుగుతుదంటూ ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు మారువేషాలలో కాపుకాచి పట్టుకున్నట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించి కరెన్సీతోపాటు ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. -
‘పాత నోట్ల’కు మరో అవకాశమివ్వాలి
► సరైన కారణాలు ఉంటే పాత నోట్లు మార్చుకోవచ్చు ► కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: సరైన కారణాలు ఉండి రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్పిడి చేసుకోలేని వారికి వాటిని మార్చుకునేందుకు మరో అవకాశం కల్పించాలని, పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక విండో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ)లను సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ తప్పేమీ లేకుండా తాము సంపాదించిన డబ్బును ప్రజలు కోల్పోవడం సరికాదని పేర్కొంది. ‘సహేతుక కారణాల వల్ల ఓ వ్యక్తి తన డబ్బును డిపాజిట్ చేయలేకపోతే అతనికి డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వకపోవడం తగదు. వారికి ప్రత్యేక విండోను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యం వల్ల తన డబ్బును డిపాజిట్ చేయలేకపోతే ఏం చేయాలి? ఒక వ్యక్తి ఆ సమయంలో జైలులో ఉన్నట్లయితే ఎలా? అలాంటి వారు డబ్బు డిపాజిట్ చేయకుండా మీరెందుకు అడ్డుకుంటున్నారు?’ అని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూద్ లæ బెంచ్ ప్రశ్నించింది. దీనిపై రెండు వారా ల్లో స్పందన తెలియజేయాలని కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించింది. రద్దయిన పాత నోట్లను కేంద్రం, ఆర్బీఐ నిర్ధేశించిన సమ యంలో డిపాజిట్ చేయలేకపోయిన పలు వురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు మంగళవారం విచారించింది. సహేతు కమైన కారణాలతో డబ్బును డిపాజిట్ చేయలేకపోయిన వారు ఎందుకు డిపాజిట్ చేయలేకపోయారో చెప్పడానికి అవకాశం ఇవ్వాలని, వారు డబ్బును డిపాజిట్ చేసేం దుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. కేంద్ర తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ సరైన కారణాలతో డబ్బు డిపాజిట్ చేయలేక పోయిన వారి గురించి అభిప్రాయం తెలియ జేసేందుకు సమయం కావాలని కోరడంతో అందుకు కోర్టు అంగీకరించింది. -
పాత నోట్ల డిపాజిట్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రద్దయిన పెద్ద నోట్లను ఇప్పటివరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోని వారికి సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వు బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది. సహేతుక కారణాలు చూపించే వారికి ఈ వెసులుబాటు కల్పించాలని సుప్రీం తన ఆదేశాల్లో సూచించింది. తగ్గిన కారణాలు చూపించే ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. నిజాయితీపరులు నష్టపోకుండా చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. డీమానిటైజేషన్పై దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక సూచనలిచ్చింది.. అంతేకాక రద్దయిన నోట్లను డిపాజిట్ చేయని వారికోసం ప్రత్యేక కౌంటర్లు ఏమైనా ఏర్పాటుచేశారా అని కూడా ప్రభుత్వాన్ని, ఆర్బీఐను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే దీనిపై పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో అందిస్తామని కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్‌కు చెప్పింది. దీంతో తర్వాత విచారణను సుప్రీం జూలై 18న చేపట్టనున్నట్టు పేర్కొంది. నవంబర్ 8న అర్థరాత్రి పెద్ద నోట్లను హఠాత్తుగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రప్రభుత్వం, ఈ నోట్ల డిపాజిట్లకు గడువులు కూడా విధించింది. అయితే ప్రభుత్వం కల్పించిన ఈ గడువులు చాలా తక్కువగా ఉన్నాయని, తక్కువ వ్యవధిలోనే దేశంలో కల్లా అత్యధిక మొత్తం కరెన్సీని డిపాజిట్ చేయడం కుదరలేదని వాదనలు వినిపించాయి. చాలామంది ఇంకా పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా తమ వద్దే ఉంచుకున్నారని కూడా తెలిసింది. మరోవైపు పెద్ద నోట్లను కలిగి ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నేడు జారీచేసిన ఆదేశాలు ప్రజలకు ఊరటగా మారనున్నాయి. -
పాత నోట్ల డిపాజిట్ విషయంలో సుప్రీం కీలక తీర్పు
-
అన్నీ పాతనోట్లు.. రూ.4.4 కోట్లు!
-
అన్నీ పాతనోట్లు.. రూ.4.4 కోట్లు!
♦ ఎన్ఆర్ఐ కోటాలో మార్పిడికి ఓ ముఠా కుట్ర ♦ రూ.4.4 కోట్లు కూడగట్టిన ఎనిమిది మంది ♦ అరెస్టు చేసిన వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు మార్చుకునేందుకు సాధారణ గడువు ముగిసినా కొందరు నల్లబాబుల్లో ‘మార్పిడి’ఆశలు చావలేదు. ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ) కోటాలో భారీ మొత్తంలో పాత నోట్ల మార్పిడికి ఎనిమిది మంది సభ్యుల ముఠా కుట్ర పన్నింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి, రూ.500, రూ.1,000 డినామినేషన్లో ఉన్న రూ.4.4 కోట్ల పాత నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. అప్పటికే ఐటీ నోటీసులు రావడంతో.. సీతాఫల్‌మండిలోని రవీందర్‌నగర్‌లో నివసించే పి.కళ్యాణ్ ప్రసాద్ రియల్టర్. ఇతని వద్ద నల్లధనం భారీగా ఉంది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత రూ.60 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు అందుకున్నాడు. దీంతో తన వద్ద మిగిలిన రూ.1.2 కోట్లను బ్యాంకులో జమ చేయలేదు. సాధారణ మార్పిడి గడువు ముగియడంతో వాటిని మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. దీనిపై బిల్డర్, చార్డెడ్ అకౌంటెంట్ అయిన స్నేహితులు కె.హరినాథ్‌బాబు, వి.రాజేంద్రనాథ్‌ను సంప్రదించాడు. తక్కువ మొత్తం మార్చరనేసరికి.. వీరికి సమీప బంధువైన రాజు తనకు ఆర్బీఐలో పరిచయాలున్నాయని, ఎంత మొత్తమైనా మారుస్తానని నమ్మబలికాడు. ఎన్ఆర్ఐలకు పాత నోట్ల మార్పిడీకి జూన్ 30 వరకు గడువు ఉందని, మార్పిడి చేయిస్తానని నమ్మించాడు. చిన్న మొత్తాల మార్పిడి సాధ్యం కాదని, రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తనకు పరిచయం ఉన్న ఆర్బీఐ అధికారులు 65 శాతం కమీషన్‌తో ఎక్స్ఛేంజ్ చేస్తారని చెప్పాడు. పరిచయస్తులు, స్నేహితులతో కలసి.. కళ్యాణ్‌ప్రసాద్ వద్ద రూ.1.2 కోట్లే ఉండటంతో పరిచయస్తులు, స్నేహితులను సంప్రదించాడు. పాత నోట్లుంటే మార్చేసుకుందామని చెప్పాడు. దీంతో మరో ఐదుగురు ముందుకు వచ్చారు. పంజగుట్టవా సి మహ్మద్ ఫారూఖ్(సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారి) రూ.39.9 లక్షలు, ఆసిఫ్నగర్వాసి మీర్జా ముజఫర్ (బియ్యం వ్యాపారి) రూ.52.38 లక్షలు, బంజారాహిల్స్‌కు చెందిన గౌతమ్ అగర్వాల్(ముత్యాల వ్యాపారి) రూ.1.46 కోట్లు, చింతల్‌కు చెందిన వై.సూర్యప్రసాద్(విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి) రూ.50 వేలు, ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ ముస్తాఫా సిద్ధిఖీ(విద్యార్థి) రూ.5 లక్షలు తీసుకువచ్చారు. హరినాథ్ రూ.50 లక్షలు, రాజేంద్రనాథ్ రూ.42.23 లక్షలు సమీకరించారు. గౌతమ్, ఫారూఖ్ తమ స్నేహితులైన రిషబ్, అష్మీ, హసన్ వద్ద ఉన్న నోట్లూ తీసుకొచ్చారు. రాజు కోసం ఎదురుచూస్తుండగా.. ఈ ఎనిమిది మంది మొత్తం రూ.4.41 కోట్ల విలువైన పాత నోట్లతో శ్రీనగర్‌కాలనీలోని గౌతమ్ ఇంటికి చేరుకుని రాజు కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి తమ బృందాలతో దాడి చేసి ఎనిమిది మందినీ అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న రాజు కోసం గాలిస్తున్నారు. అతడు చిక్కిన తర్వాత విచారణలో ఆర్బీఐ అధికారుల పాత్ర వెలుగులోకి వస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ లింబారెడ్డి వెల్లడించారు. -
రద్దయిన నోట్ల కట్టలే పాన్పుగా..
బెంగళూరు: బాంబ్‌నాగ ఇంటితో పాటు వాణిజ్యకట్టడంలోని స్వచ్ఛంద సంస్థ ఉన్న కార్యాలయం, మూడో అంతస్తులో పోలీసులు సోదాలు జరపగా కట్టలు కట్టలు రూ.500, రూ.1000 నోట్లు బయటపడ్డాయి. 10 బాక్సులు, 3 బ్యాగుల్లో నోట్ల కట్టలు పేర్చి వాటిపై పరువును ఉంచారు. నోట్లు లెక్కించే యంత్రాలను తెప్పించి శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దు పోయే వరకూ నోట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. అంతే కాకుండా స్థిర చరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు కూడా పెద్ద సంఖ్యలో లభ్యమయ్యాయి. ఇది కాక నెలమంగళలోని ఇతనికి గల మరో భవంతిలో పెద్ద మొత్తంలో రద్దైన నోట్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జాయింట్ కమిషనర్ హేమంత్ నింబాల్కర్ మీడియాతో ట్వీట్ చేస్తూ ‘నాగ ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.14.80 కోట్ల విలువ చేసే రద్దైన రూ.500, రూ.1,000 నోట్లు, 2 కత్తులు లభించాయని సోదాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు పైకి రూ.14.80 కోట్లు అని చెబుతున్నా ఉమేష్ అండ్ అతనికి సహకారం అందించిన వారందరినీ బెదిరించి దాదాపు రూ.50 కోట్లకు పైగా రద్దైన కరెన్సీని బాంబ్‌నాగ సేకరించనుట్ల తెలుస్తోంది. వివరాలు.. అపహరణ కేసులో నిందితుడిగా ఉన్న ఓ రౌడీషీటర్, మాజీ కార్పోరేటర్ ఇంటిలో కట్టల కట్టల రద్దైన రూ.500, రూ.1,000 నోట్లు పోలీసుల సోదాల్లో బయటపడ్డాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు దాదాపు 50 మంది పోలీసుల కన్నుగప్పి తప్పించుకుపోగా అతని కోసం దాదాపు ఐదు ప్రత్యేక బృందాలు కర్ణాటకతో పాటు పొరుగురాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. పోలీసులతో పాటు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రౌడీషీటర్ అయిన నాగరాజు అలియాస్ బాంబ్‌నాగ బెంగళూరులోని శ్రీరాంపురలోని మూడు అంతస్తుల ఇంట్లో ఉంటున్నారు. ఇతనికి స్థానికంగా మరో రెండు అపార్టుమెంట్లు, ఒక వాణిజ్య భవనాలు ఉన్నాయి. మొదటి నుంచి అసాంఘిక కార్యకలాపాల్లో ఉండేవారు. నేపథ్యంలోనే గత మార్చి 18న నగరానికి చెందిన ఉమేష్ అనే పారిశ్రామిక వేత్తతో పాటు అతని స్నేహితులైన కిషోర్, గణేష్‌లను కిడ్నాప్ చేసి శ్రీరాంపులోని తన ఇంటి మూడో అంతస్తులో బంధించాడు. అనంతరం వారిని బెదిరించి దాదాపు రూ.50 లక్షల నగదు వసూలు చేసి వదిలి పెట్టారు. అటు పై మరింత డబ్బు కావాలని ఉమేష్ పై బాంబ్‌నాగ ఒత్తిడి తీసుకువచ్చాడు. మొదట్లో ఇతనికి బయపడి పోలీసులకు విషయం తెలపని ఉమేష్ చివరికి వేధింపులు ఎక్కువ కావడంతో ఈనెల 7న హెణ్ణూరు పోలీస్‌స్టేషన్‌లో ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. అయితే ఉమేష్ మటలకు నడవడికకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఉమేష్‌ను తమ దైన శైలిలో విచారించారు. దీంతో వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. రదై్దన పాత నోట్లను మార్చే విషయానికి సంబంధించి ఉమేష్‌తో పాటు కొంతమందికి సంబం«ధం ఉన్నట్లు సదరు ఉమేష్‌ను బంధించినప్పుడు బాంబ్‌నాగకు తెలిసింది. దీంతో ఇప్పటి వరకూ వారు బ్లాక్ అండ్ వైట్ కోసం సేకరించిన మొత్తం సొమ్ము తనకు ఇచ్చి బదులుగా తాను ఇచ్చే కొంత సొమ్మును పట్టుకు వెళ్లాలని బాంబ్ నాగ హుకుం జారీ చేశారు. దీనికి ఒప్పుకోక పోవడంతోనే ఉమేష్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులు సదరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సర్చ్వారెంటును తీసుకున్నారు. బాంబ్‌నాగకు కిడ్నాప్ కేసులో విచారణ చేయడం కోసమంటూ ఆయన ఇంటికి డీసీపీ అజయ్ నేతృత్వంలో 50 మంది పోలీసులు శుక్రవారం తెల్లవారుజాము 5:30 గంటలకు వెళ్లారు. అయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న బాంబ్‌నాగ మూడంతస్తుల్లో ప్రతి అంతస్తుకు ప్రవేశించే మార్గంలోని ప్రధాన గేటుకు బయటి నుంచి తాళం వేసుకుని లోపల ఉండిపోయారు. దీంతో పోలీసులు తాళాలను విరగొట్టిలోపలికి ప్రవేశించారు. అయితే పోలీసులు టెర్రస్ పై భాగానికి చేరుకునే లోపు బాంబ్‌నాగ టెర్రస్ పై నుంచి పక్కన ఉన్న భవంతికి చేరుకుని అక్కడి నుంచి పోలీసుల కన్నుగప్పి పరారైనట్లు తెలుస్తోంది. -
చనిపోయిన మా నాన్న లాకర్లో పాతనోట్లు!
మార్చుకోవడానికి దయచేసి అవకాశం ఇవ్వండి! న్యూఢిల్లీ: రద్దైపోయిన రూ. 500, వెయ్యి నోట్లను మార్చుకోవడానికి తమకు మరో అవకాశం కల్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ జాబితాలో తాజాగా ఓ పిటిషన్ ప్రత్యేకమైన కారణాలతో ముందుకొచ్చింది. ఫరీదాబాద్‌కు చెందిన ఓ మహిళ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ. 83వేలు మేర విలువైన పాతనోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించాలని, ఈ పాత నోట్లు చనిపోయిన తమ తండ్రి లాకర్లో గడువు తర్వాత దొరికాయని సవితా అనే మహిళ సుప్రీంకోర్టుకు నివేదించింది. రద్దైన పాతనోట్లను మార్చుకోవడానికి డిసెంబర్ 30, 2016ను కేంద్ర ప్రభుత్వం గడువుగా విధించిన సంగతి తెలిసిందే. అయితే, తన తండ్రి ఆస్తి విషయంలో వాటా కోసం తన సోదరి నిధి గుప్తాతో న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని, ఈ కేసులో గత మార్చి 6న కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో తండ్రి బ్యాంకు లాకర్ తన వాటా కింద వచ్చిందని, దానిని తెరువగా, అందులో రద్దైన పాత నోట్లు ఉన్నాయని ఆమె సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. ద్దయిన పాత నోట్లను మార్చుకునే అవకాశం మళ్లీ కల్పిస్తే, అది ప్రజలందరికీ వర్తించేలా ఉంటుందని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మార్చి 6నే కోర్టు కేంద్రం, ఆర్బీఐలకు నోటీసులు పంపింది. నోట్లరద్దుకు సంబంధించి వచ్చిన పలు ఇతర పిటిషన్లను కూడా కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. -
గడువు పొడిగిస్తే అది అందరికీ వర్తిస్తుంది
పాతనోట్ల మార్పిడిపై సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: రద్దయిన పాత నోట్లను మార్చుకునే అవకాశం మళ్లీ కల్పిస్తే, అది ప్రజలందరికీ వర్తించేలా ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యేకించిన ఆర్బీఐ శాఖల్లో మార్చి 31 వరకు పాత నోట్లు మార్చుకోవచ్చని స్వయంగా ప్రధాని మోదీ, ఆర్బీఐలు చెప్పినప్పటికీ, పాత నోట్లను తీసుకునేందుకు గడువుకు ముందే నిరాకరించారంటూ సుధ మిశ్రా అనే మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 6నే కోర్టు కేంద్రం, ఆర్బీఐలకు నోటీసులు పంపింది. నోట్లరద్దుకు సంబంధించి వచ్చిన పలు ఇతర పిటిషన్లను కూడా కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. -
ఢిల్లీలో భారీగా పాత నోట్ల స్వాధీనం
-
సత్యదేవునికి తప్పని నోట్ల పాట్లు
-
చివరి అవకాశం..రేపటినుంచి ఇక అంతే..
-
రూ. 1.51 కోట్ల పాత నోట్లు స్వాధీనం
రద్దయిన నోట్ల డిపాజిట్లకు సామాన్యులకు గడువు ముగిసినా... కోట్లకు కోట్లు పెద్ద నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ట్యాక్సీ క్యాబ్ లో తీసుకెళ్తున్న 1.51 కోట్ల రూపాయల పాత నోట్లను ఛేజ్ చేసి మరీ ముంబాయి పోలీసులు పట్టుకున్నారు. నగదును సీజ్ చేసిన పోలీసులు, నలుగురు నిందితులను ఘాట్కొపార్ లో అరెస్టు చేశారు. ఈ పాత నోట్లను కొత్త కరెన్సీలోకి మార్చుకోవడానికి ట్యాక్సీలో తరలిస్తున్న క్రమంలో అవి పోలీసులు కంటపడ్డాయి. 10 నిమిషాల పాటు ఆ ట్యాక్సీని ఛేజ్ చేసిన పోలీసులు ఎట్టకేలకు ఘాట్కొపార్ లోని ఎల్బీసీ మార్గ్ రోడ్డులో వాటిని పట్టుకున్నారు. క్యాబ్ కు వెనుక సీట్లలో రెండు బ్యాగుల్లో ఈ కోటిన్నరకు పైగా పాత నోట్లను ఉంచినట్టు పోలీసులు చెప్పారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో, వెంటనే క్యాబ్ డ్రైవర్ రిజ్వాన్ గులామ్ ఖాజీ పాటు కారులో ఉన్న మరో ముగ్గురు అయాజ్ అక్తర్, దానిష్ రఫీ, రెహాన్ సైఖ్ లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే అరెస్ట్ అయిన వారు కేవలం మధ్యవర్తులనేని, అసలైన నిందితులను ఎలాగైనా పట్టుకుంటామని డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీసు సచిన్ పాటిల్ హెచ్చరించారు. ఈ నిందితులందరూ దక్షిణ ముంబాయికి చెందినవారేనని పేర్కొన్నారు. గొరై ప్రాంతంలోని ఓ వ్యక్తికి వీటిని డెలివరీ చేయడానికి తీసుకెళ్తున్నట్టు తెలిసిందన్నారు. దీనిలో ఎవరైనా ఎన్ఆర్ఐల ప్రమేయముందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలిపారు. కాగ, విదేశాల్లో ఉన్న భారతీయులకు రద్దయిన నోట్లను మార్చుకోవడానికి తుది గడువు రేపటితో ముగియనుంది. -
చివరి అవకాశం..రేపటినుంచి ఇక అంతే..
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లు జమ నేటితో రద్దు. రద్దైన పెద్దనోట్ల ఆర్బీఐ ప్రత్యేక కౌంటర్లలో డిపాజిట్లకు తుది గడువు నేటి (మార్చి31) తో ముగియనుంది. గత ఏడాది నవంబర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసి సంచలనం సృష్టించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం భారత పౌరులు పాతనోట్లను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. నేరంగా పరిగణిస్తారు. ఈ ఉల్లంఘన రూ. 10,000 జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు ఐదు రెట్లు వీటిలో ఏది ఎక్కువ దాని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ప్రవాస భారతీయుల (ఎన్నారైలు) పాతనోట్ల మార్పిడికి జూన్ 30కి గడువును ఇచ్చింది కేంద్ర బ్యాంకు. ఈ సౌకర్యం ముంబై, ఢిల్లీ, కోలకతా, చెన్నై, నాగ్‌పూర్ లో ఆర్బిఐ కార్యాలయాలలో మాత్రమే అందుబాటులో ఉంది. విదేశాలనుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులనుంచి రెడ్ ఛానల్ సర్టిపికెట్ తెచ్చుకోవాల్సి ఉంది. ఫెమా నిబంధనల ప్రకారం ఈ పరిమితి ఒక వ్యక్తికి రూ. 25,000. ఒకవేళ ఈ డిపాజిట్‌కు కేంద్ర బ్యాంకు నిరాకరించిన విషయంలో, 14 రోజుల లోపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ కు ఫిర్యాదు చేయవచ్చు. నేపాల్, భూటాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లో ఉండే వారు ఈ సౌకర్యం ఉపయోగించుకోలేరు. కాగా నవంబర్ 8న డిమానిటైజేషన ప్రకటించిన కేంద్రప్రభుత్వం రద్దయిన పెద్దనోట్లను బ్యాంకులు స్వీకరించే గడువును జనవరి 30, 2017తో ముగించింది. అయితే రద్దయిన నోట్లను డిసెంబరు 30వ తేదీలోపు తమ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోలేని వారు తగిన కారణాలను చూపి.. రిజర్వ్‌బ్యాంకు ప్రత్యేకించిన కౌంటర్లలో మార్చి 31వ తేదీ వరకు మార్పిడి చేసుకునే అవకాశం ఇచ్చింది. నగదు ఉపసంహరణపై అనేక ఆంక్షలు, పరిమితుల నేపథ్యంలో తీవ్ర నిరసన వ్యక్తంకావడంతో ఖాతాదారుల సౌలభ్యంకోసం విడతలవారీగా కొన్ని వెసులు బాటును ప్రకటించింది. మరోవైపు డిమానిటైజేషన్ 50 రోజుల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 86శాతం చలామణిలో ఉన్న పెద్దనోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడింది. రద్దయిన నోట్లను నవంబరు 10వ తేదీ నుంచి బ్యాంకులు స్వీకరించడం ప్రారంభించాయి. దీంతో అటు డిపాజిట్లకు, ఇటు నగదుకోసం ఏటీఎంల సెంటర్లదగ్గర, బ్యాంకుల వద్ద ప్రజలుబారులు తీరారు. పనిచేయని ఏటీఎంలు, నో క్యాష్ కోర్డులు వెక్కిరించడంతో కొన్ని అవాంఛనీయ ఘటనలు, మరణాలు సంభవించిన సంగతి విదితమే. -
పాతనోట్ల మార్పిడి నో చెప్పిన సుప్రీం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత ధర్మాసనం నాసిక్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు షాకిచ్చింది. రద్దయిన పెద్దనోట్లను భారీమొత్తంలో డిపాజిట్ చేయడానికి అనుమతిని సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.371కోట్ల పాత కరెన్సీనోట్ల మార్పిడికి అనుమతించాల్సిందిగా పెట్టుకున్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టి పారేసింది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్32 ప్రకారం ఈ పిటిషన్ తిరస్కరిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. నోట్ల జమకు ఆర్బీఐ నిరాకరించిడంతో కో ఆపరేటివ్ బ్యాంకు సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. ఈ నోట్ల జమకు అనుమతిని నిరాకరిస్తే..లిక్విడిటీ రేషియో దెబ్బతింటుందని, తద్వారా నాసిక్ జిల్లాలో 281 తమ కార్యాలయాలు మూతపడతాయని బ్యాంకు వాదించింది. 2016, నవంబర్ 8-14 మధ్య తమ ఖాతాదారులు జమ చేసిన సొమ్ము ఇది అనీ, ఎక్కువగా రైతులకు రుణాలను అందించే బ్యాంకు శాఖలు మూసివేత తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందన్న బ్యాంకు వాదించింది. కోఆపరేటివ్ బ్యాంకు తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలను వినిపించారు. ఇది ఇలా ఉంటో మరోకేసులో కూడా రద్దయిన నోట్ల డిపాజిట్‌కు ఎపెక్స్ కోర్టు నో చెప్పింది. ఇప్పటికే ఎన్పీఏగా ప్రకటించిన రాను ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు చెందిరన రూ. 10కోట్లను పాత కరెన్సీమార్పిడికి అనుమతిని నిరాకరించింది. -
8 కోట్ల పాత నోట్లు స్వాధీనం
-
8 కోట్ల పాత నోట్లు స్వాధీనం
- 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచలనం.. రూ.8 కోట్ల పాత నోట్లు పట్టుబడ్డాయి. వాటిని మారుస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. బషీర్‌బాగ్‌లోని మొఘల్ కోర్టు బిల్డింగ్‌లో జైన్ అసోసియేట్, మాస్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పాత నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఫజలుద్దీన్ అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా నోట్ల మార్పిడి చేస్తున్నట్లు సమాచారం రావడంతో సైఫాబాద్ పోలీసులు, సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 12 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. మియాపూర్, కూకట్పల్లి, బాలానగర్ ప్రాంతాల పలువురు వ్యాపారస్తులకు చెందిన బ్లాక్ మనీగా పోలీసులు గుర్తించారు. బ్లాక్‌మనీ వైట్‌గా చేసుకొనేందుకు ఫజల్ అనే బ్రోకర్ ద్వారా 12 మంది రూ. 8 కోట్లు మార్పిడి చేసేందుకు యత్నిస్తూ సెంట్రర్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులకు దొరికిపోయారు. పోలీసుల అదుపులో ఉన్న 12 మందిలో పలువురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారని టాస్క్‌పోర్స్ పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో పాత కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు తీసుకువచ్చారు.. అన్న అంశాలపై నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన సూత్రధారి, కీలక బ్రోకర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఇటీవలే బంజారాహిల్స్, బేగంపేట్, పాతబస్తీలో ఇదే గ్యాంగ్ పాత నోట్ల మార్పిడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల నేతృత్వంలో తనిఖీ చేసిన తరువాత ఐటీ వారికి అప్పగించే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెప్పారు. -
నోట్లు.. పాట్లు!
టీడీపీ ఎమ్మెల్యేపై ఐటీ కన్ను! – భారీగా పాత నోట్ల డిపాజిట్లపై ఆరా – ఇప్పటికే పిలిపించి విచారించిన ఐటీ శాఖ అధికారులు? – లెక్కలు చెప్పేందుకు ఇబ్బందిపడ్డ వైనం – పార్టీ మారిన సొమ్మేనని ప్రచారం సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ కన్ను పడింది. పాత నోట్ల రద్దు నేపథ్యంలో భారీగా సదరు ఎమ్మెల్యే బ్యాంకులో డిపాజిట్ చేయడంపై ఐటీ శాఖ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఇంత భారీ మొత్తంలో పాత నోట్లు డిపాజిట్ కావడంతో మొత్తం ఆధారాలు సమర్పించాలని సదరు ఎమ్మెల్యేను ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు దఫాలుగా సదరు ఎమ్మెల్యేను ఐటీ శాఖ అధికారులు విచారించినట్టు సమాచారం. అయితే, భారీగా పాత నోట్ల డిపాజిట్లపై పూర్తిస్థాయిలో సరైన సమాచారం ఇవ్వడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని విశ్వసనీయంగా తెలిసింది. ఇదంతా పార్టీ మారిన సమయంలో అందిన మొత్తమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నోట్లకు లెక్కలు అంతుచిక్కక పోవడంతో కోటి రూపాయల మేరకు ఐటీ శాఖ అపరాధ రుసుం చెల్లించాలని పేర్కొన్నట్టు సమాచారం. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించేందుకు ఐటీ శాఖ అధికారులు ఇష్టపడటం లేదు. ఏదేమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే ఐటీ శాఖ వలలో ఇరుక్కోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అంతుచిక్కని లెక్కలు పాత నోట్లు రూ.500, రూ.1000లను రద్దు చేస్తున్నట్టు గత నవంబర్ 8వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎవరైనా సరే పాత నోట్లను బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసుకుని మార్చుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రైవేటు బ్యాంకులో భారీగా నగదు డిపాజిట్ చేసినట్టు సమాచారం. దీంతో అన్ని లావాదేవీలను పరిశీలించిన ఆదాయపు పన్నుశాఖ అధికారుల కన్ను ఈ ఎమ్మెల్యేపై పడింది. తీరా ఈ భారీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలపాలంటూ నోటీసు పంపినట్టు సమాచారం. ఇందుకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చినప్పటికీ లెక్కలు తేలకపోవడంతో నేరుగా కలవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండుసార్లు సదరు ఎమ్మెల్యేను ఐటీ శాఖ అధికారులు పిలిపించి విచారించినట్టు సమాచారం. అయితే, ఎక్కడ కూడా లెక్కలు సరిపోలేదని విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాకుండా ఈ మొత్తానికి లెక్కలు చెప్పేందుకు ఆ ఎమ్మెల్యే ఇబ్బంది పడినట్టు సమాచారం. ఏకంగా కోటి రూపాయల మేరకు సదరు ఎమ్మెల్యేకు ఐటీ శాఖ అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశించినట్టు తెలిసింది. అది పార్టీ మారిన సొమ్మేనా? అధికార పార్టీలో చేరిన సదరు ఎమ్మెల్యే ఖాతాలో భారీగా నగదు డిపాజిట్ కావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం అంతా పార్టీ మారిన సందర్భంగా అధికార పార్టీ నుంచి ముట్టిన సొమ్మేననే చర్చ జరుగుతోంది. పార్టీ మారిన సందర్భంలో అందుకున్న రూ.10కోట్ల నుంచి రూ.15 కోట్లలో కొంత మొత్తం అప్పులు చెల్లించగా మిగిలినదంతా.. ఈ విధంగా ఒకేసారి బ్యాంకులో డిపాజిట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తానికి లెక్కలు చూపేందుకు నానా తిప్పలు పడినప్పటికీ ఎక్కడా సరిపోలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఏకంగా కోటి రూపాయల మేరకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై మాట్లాడేందుకు ఐటీ శాఖ అధికారులు ఇష్టపడటం లేదు. ఏదేమైనా ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
పాత నోట్లను మార్చే వీలులేదు
- తిరుమల హుండీపై స్పష్టం చేసిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) హుండీల్లో ప్రత్యక్షమవుతున్న రద్దయిన పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘అమ్మకం కేంద్రాల్లో రద్దయిన నోట్లను తీసుకోవడం లేదని, భక్తులు హుండీలో వేసిన పాత నోట్లను మార్పిడి చేసే వీలు కల్పించాలని టీటీడీ ఆర్బీఐని కోరింది. అయితే ప్రస్తుతం నిర్ధిష్ట బ్యాంకు నోట్ల చట్టం–2017 ప్రకారం ఈ నోట్లను డిసెంబరు 30 తర్వాత మార్చుకోవడానికి లేదని ఆర్బీఐ టీటీడీకి తెలిపింది’ అని మంత్రి వివరించారు. -
నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
గోపాలపట్నం: పాత నోట్లకు కొత్త నోట్లు మార్పిడి చేస్తామంటూ మోసగిస్తున్న ముఠాలో ఏడుగురిని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపట్నం పోలీసులు అరెస్టు చేశారు. రద్దు చేసిన నోట్లు ఇస్తే తిరిగి అంతే మొత్తానికి కొత్త నోట్లు ఇస్తామంటూ 13మంది సభ్యుల ముఠా మోసగిస్తోంది. రామకృష్ణ అనే వ్యక్తి రూ.4 లక్షలకు పాత నోట్లు ఇవ్వగా ఈ ముఠా అతడికి రూ.4 లక్షలు ఇచ్చింది. అయితే అందులో నకిలీ కరెన్సీ ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ముఠాలోని ఏడుగురిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరినుంచి రూ.1.20 లక్షల నగదు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నోట్లు మార్చి పెడతామంటూ పలువురిని మోసం చేస్తున్న ఈ ముఠాకు చెందిన పదిమందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.20 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కిట్టుగాడు సినిమా దర్శకుడు రామకృష్ణ ఉన్నారు. -
పాతనోట్లను మారుస్తున్న ముఠా గుట్టు రట్టు
-
హై సెక్యూరిటీ ఫీచర్స్‌తో కొత్త రూ.10 నోట్లు
న్యూఢిల్లీ: కొత్త పది రూపాయల నోటును జారీ చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. త్వరలోనే ఈ నోట్లు అందుబాటులోకి రానున్నట్టు గురువారం వెల్లడించింది. అధిక భద్రతా లక్షణాలతో ఈ కొత్త 10 నోట్లను జారీ చేయనున్నట్టు తెలిపింది. అలాగే పాత పది రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ సీరిస్-2005లో రెండు నంబర్ ప్యానెల్స్‌పై ‘ఎల్’ (ఇన్ సైట్) లెటర్ తోపాటు, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ సంతకంతో వీటిని లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. ఎడమ నుంచి కుడికి మొదటి మూడు ఆల్ఫా-న్యూమరిక్ అక్షరాలు (ఉపసర్గ) ఆరోహణ క్రమంలో పాత పరిమాణంలోనే ఉండనున్నట్టు ఆర్బిఐ పేర్కొంది. గతంలో బ్యాంకు జారీ చేసిన రూ.10 విలువ కలిగిన అన్ని బ్యాంకు నోట్లు కూడా చట్టబద్ధంగా చెల్లుబాటులోఉంటాయని వివరణ ఇచ్చింది. -
పాతనోట్లు ఉన్నాయా.. రూ. 10వేల ఫైన్!
పెద్దనోట్ల రద్దు తర్వాత చాలామంది తమ వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చేసుకున్నారు. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని, కొత్త నోట్లు తీసుకున్నారు. అయితే కొంతమంది వద్ద మాత్రం ఇంకా ఆ నోట్లు ఉండిపోయాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పటికి చెలామణిలో ఉన్న కరెన్సీకి.. నోట్ల రద్దు తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన కరెన్సీకి మధ్య తేడా కనిపించింది. దాంతో కొంతమంది ఇంకా పాతనోట్లను ఉంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు అలా ఎవరివద్ద అయినా పది కంటే ఎక్కువ సంఖ్యలో రద్దయిన పాతనోట్లు ఉంటే, వాళ్లకు కనీసం రూ. 10 వేల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం కొత్త చట్టం ఒకదాన్ని తెచ్చింది. పాత నోట్లను ఉపయోగించి సమాంతర ఆర్థికవ్యవస్థను నడిపించే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెచ్చినట్లు చెబుతున్నారు. దీన్ని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఫిబ్రవరి 27న దీనిపై సంతకం చేసేశారు. దాంతో ఇది చట్టరూపం దాల్చింది. పెద్దనోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉండి, తప్పుడు డిక్లరేషన్లు ఇస్తే వారికి రూ. 50వేల కనీస జరిమానా విధించే అవకాశం కూడా ఈ చట్టంలో ఉంది. వ్యక్తుల వద్ద పది నోట్ల కంటే ఎక్కువ, పరిశోధన అవసరాల కోసం అయితే 25 నోట్లకన్నా ఎక్కువ చేతిలో ఉంచుకోవడం నేరం అవుతుంది. అందుకు రూ. 10వేల జరిమానా లేదా వాళ్ల దగ్గరున్న నగదు విలువకు ఐదు రెట్ల మొత్తం.. ఏది ఎక్కువైతే అది విధిస్తారు. -
లభ్యమైన రూ.2.43 లక్షల చెల్లని నోట్లు
గుంతకల్లు రూరల్ : హుండీ లెక్కింపులో రూ.2.43 లక్షల చెల్లని నోట్లు లభించినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈవో ఆనందకుమార్ తెలిపారు. ఈ నోట్ల వివరాలను దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. -
బడ్జెట్ కోసమే అలా చేశారు!
► ఎంపీ మృతిపై పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాల డిమాండ్ ► ముందే అహ్మద్ చనిపోయినట్లు సమాచారం ఉందన్న ఆజాద్ ► లోక్‌సభలో ‘పాతనోట్లుంటే శిక్ష–జరిమానా’ బిల్లు న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు శుక్రవారం గందరగోళంగా మారాయి. గుండెపోటుతో మాజీ మంత్రి, ఐఎంయూఎల్ చీఫ్, ఎంపీ ఈ అహ్మద్ మృతిచెందిన విషయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదని, బడ్జెట్ కొనసాగించేందుకే వైద్యులతో తప్పుడు ప్రకటనలు చెప్పించారంటూ విపక్షాలు మండిపడ్డాయి. అటు రోజ్‌వాలీ చిట్‌ఫండ్ స్కాంలో తమ ఎంపీలను అరెస్టు చేయటంతోపాటు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. తృణమూల్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్రం తమ ఎంపీలపై సీబీఐ ద్వారా ఒత్తిడి పెంచుతోందని నినాదాలు చేశారు. ‘సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారింది. రాజకీయ అవసరాల కోసం కేంద్రం సీబీఐని వినియోగించుకుంటోంది’ అని తృణమూల్ ఎంపీలు విమర్శించారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ఎంపీ, ఐఎంయూఎల్ అధ్యక్షుడు అహ్మద్‌కు సరైన చికిత్స అందలేదని.. ఆయన మృతిపై కూడా ప్రభుత్వ స్పందన సరిగా లేదని కేరళ ఎంపీలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేశారు. వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ గొడవ మధ్యే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆదేశించారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మ చర్చను ప్రారంభిస్తుండగానే మళ్లీ సభలో గందరగోళం నెలకొంది. రెండుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో.. స్పీకర్ సుమిత్ర మహాజన్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ ముందు ‘పాతనోట్లుంటే శిక్ష’ బిల్లు నవంబర్8 నిర్ణయంతో రద్దుచేసిన పాతనోట్లను దాచుకున్నా, బదిలీ చేసినా, తీసుకున్నా క్రిమినల్ చర్యలతోపాటు రూ.10వేల జరిమానా విధించే బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా ఈ బిల్లు అనైతికం, దేశ వ్యతిరేకమని తృణమూల్ కాంగ్రెస్ నేత సుగత రాయ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై జైట్లీ కూడా ఘాటుగానే స్పందించారు. ఏ ప్రాతిపదికన తృణమూల్ దీన్ని వ్యతిరేకిస్తుందో చెప్పాలన్నారు. అయితే.. ఈ బిల్లు లోక్‌సభ నిబంధనలకు విరుద్ధమని జైట్లీ లోక్‌సభ సభ్యుడు కానందున ఆయనకు నిబంధనలేమీ తెలియవని సుగత రాయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. 70వేల మంది చిన్నారులకు మధుమేహం 2015లో భారతదేశంలో 70వేలకు పైగా చిన్నారులు మధుమేహం బారిన పడ్డారని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. అటు, ఉగ్రవాదానికి సహకరించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని రాజ్యసభ ఎంపీ ఒకరు ఓ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలంటూనే.. ‘56 అంగుళాల ఛాతీ ఎక్కడికెళ్లింది’ అని విమర్శించారు. ప్రభుత్వానికి ముందే తెలుసు! జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగం జరుగుతుండగా సెంట్రల్ హాల్లోనే ఎంపీ అహ్మద్ కుప్పకూలిపోయారు. ఫిబ్రవరి 1న ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలున్నందున.. సమావేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయన ముందురోజే చనిపోయినా ఇంకా బతికే ఉన్నాడనే సందేశాన్ని ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయని ఖర్గే ఆరోపించారు. అహ్మద్ కూతురు, అల్లుడికి ఆసుపత్రి లోపలకు అనుమతించలేదన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే అతను మృతిచెందినట్లు కొందరు డాక్టర్లు తనతో చెప్పారని ఆజాద్ అన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల అక్రమాలు.. రూ.72 కోట్లు
న్యూఢిల్లీ: నల్లధనానికి చెక్ పెట్టేందుకంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన డీమానిటైజేషన్ ప్రక్రియలో బ్యాంకు ఉద్యోగుల అక్రమాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రూ .500, రూ .1,000 నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకుల ఉద్యోగులు చేసిన అక్రమాల విలువ రూ 71.47 కోట్లని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. డీమానిటైజేషన్ పీరియడ్‌లో (నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు) వీరు నగదు మార్పిడికి అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని తెలిపింది. పెద్దనోట్ల రద్దు కాలంలో రద్దయిన నోట్ల అక్రమ మార్పిడి, అక్రమ లావాదేవీల్లో 14 కేసుల (శాఖలు) ను గుర్తించినట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వర్ లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు మూడు బ్రాంచ్ ల ద్వారా అత్యధికంగా రూ 46.29 కోట్ల లావాదేవీలు జరిగినట్టు చెప్పారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు తెలియజేశారు. ధనలక్ష్మి బ్యాంకుకు చెందిన ఎనిమిది మంది ఉద్యోగులు ఆరు కేసుల్లో నిందితులు. అక్రమంగా మార్పిడి విలువ రూ రూ.22.7 కోట్ల లావాదేవీలు . ప్రభుత్వ రంగ బ్యాంకుల సహా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ లోరూ 1.9 కోట్లు (రెండు కేసులు, నాలుగు సస్పెన్షన్లు) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ 54.90 లక్షలు, బ్యాంక్ (రెండు కేసులు, ఐదు సస్పెన్షన్లు), సిండికేట్ బ్యాంక్ రూ .6 లక్షలు (ఒక కేసు) అనిమంత్రి తెలిపారు. డీమానిజేషన్ సమయంలో అప్రమంత్తంగా వ్యవహరించాల్సిందిగా అన్నిబ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని సభకు వివరించారు. అక్రమాలకు అడ్డుకోవడంతో పాటు బ్యాంకుల అంతర్గత ఆడిట్ విధానాన్ని బలోపేతం చేసుకోవాలని కోరినట్టు చెప్పారు. -
బ్యాంక్ డిపాజిట్లపై ఐటీ
నోట్ల రద్దు తర్వాత ఖాతాల్లో చేరిన నగదుపై ఆరా పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ తొలి దశలో పెట్రోల్ బంక్‌ల యజమానులకు నోటీసుల జారీ రెండో విడతలో ఆస్పత్రులు, నగల దుకాణదారులకు.. ఐటీ చట్టం 133 (6) 1961 ప్రకారం నోటీసులు గడువులోగా ఆధారాలు చూపాలని ఆదేశాలు బెంబేలెత్తుతున్న బడా వ్యాపారులు మొదటి విడతలో పెట్రోల్ బంక్‌ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న ఐటీ శాఖ.. ఆ తర్వాత ఆస్పత్రులు, నగల దుకాణాల వ్యాపారులపై కొరడా ఝుళిపించనున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల్లో పాత నోట్లకు అనుమతించడంతో వాటిల్లో బోగస్ బాధితులను సృష్టించి నకిలీ బిల్లులతో భారీ మొత్తంలో నగదు మార్పిడికి పాల్పడినట్లు ఆ శాఖ పరిశీలనలో తేలింది. 50 రోజుల వ్యవధిలో నగల దుకాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. నల్లగొండ : బ్యాంక్ ఖాతాల్లో దాగి ఉన్న భారీ నగదు నిల్వలపై ఆదాయ పన్ను శాఖ ఆరా తీస్తోంది. గత ఏడాది నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తాలపై దృష్టి సారించిన ఐటీ శాఖ.. ఆ మేరకు ఖాతాదారుల వివరాలు సేకరించింది. నోట్ల రద్దుకు ముందు సంబంధిత వ్యక్తులు, వ్యాపా ర సంస్థలు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలు.. వాటికి సంబంధించి బ్యాంక్ డిపాజిట్లపై కూపీ లాగింది. నోట్ల రద్దు తర్వాత జన్‌ధన్ ఖాతాలు, దిక్కుమొక్కులేని (డార్మెంట్ స్టేటస్), జీరో బ్యాలెన్స్ ఖాతాలు (నో ఫ్రిల్స్ అకౌం ట్స్) అన్నింట్లోకి భారీగా నగదు వచ్చి చేరినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు , కేవైసీ ఆధారంగా బ్యాంక్ అధికారులు భారీ మొత్తంలో డిపాజిట్లు స్వీకరించారు. పాత నోట్లనే బ్యాంకుల్లో డిపాజిట్ చేశారా.. కొత్త నోట్లు జమ చేశారా.. అనేదానిపైనా ఆదాయ పన్ను శాఖ స్క్రూటినీ చేసింది. ఈ క్రమంలో కొత్త నోట్ల డిపాజిట్ల జోలికి వెళ్లకుండా ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన పాత నోట్లపైనే ఆదాయ పన్ను శాఖ, ఇంటెలిజెన్స్, క్రిమినల్ ఇంటెలిజిన్స్ అధికారులు దృష్టి సారించారు. నోట్లు రద్దు అయిన మరుసటి రోజు నుంచి డిసెంబర్ 30 వరకు వివిధ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ చేసినట్లు గుర్తించిన ఖాతాదారులకు ప్రస్తుతం ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తోంది. పాత నోట్ల డిపాజిట్లపైనే.. రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లను పెట్రోల్ బంక్‌లు, ఆస్పత్రులు, నగల దుకాణాల్లో చెల్లుబాటవుతాయని కేంద్రం ప్రకటించింది. దీంతో అవసరం ఉన్నా.. లేకున్నా వాహనదారులు బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకున్నారు. చిల్లర సమస్య సాకుగా చూపి బంక్ నిర్వాహకులు అందిన కాడికి దోచుకున్నారు. పాత నోట్లకు కమీషన్ తీసుకుని మరీ పెట్రోల్ పోశారు. ఇదే వారి మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. పెట్రోల్ బంక్‌లలో పాత నోట్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్న ఉత్సాహంతో వ్యాపారులు వెనకాముం దు ఆలోచించలేదు. పాత రోజులతో పోలిస్తే బంక్‌లో ఆయిల్ అమ్మకాలు డబుల్, ట్రిపుల్ పెరిగాయి. చెలామణిలో ఉన్న పాత నోట్లలో ఎక్కువ నగదు బంకుల్లోకి చేరింది. ఈ మొత్తం నగదు నిల్వలను వ్యాపారులు తమ కరెంట్ ఖాతాల్లోనూ, బంకుల్లో పనిచేసే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు. బంగారం క్రయవిక్రయాలకు రశీదులు చూపించేందుకు వీలున్నా.. పెట్రోల్ బంక్‌లో ఆ అవకాశం లేకుండా పోయింది. ఆయిల్ పోయించుకున్న వాహనదారులకు బంక్ యజమానులు ఎలాంటి రశీదు ఇవ్వకపోవడంతో వ్యాపారులకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. కరెంట్ ఖాతాల్లో జమ చేసిన నగదు నిల్వల వివరాలు, పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లయితే.. దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని వ్యాపారులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. నోట్ల రద్దుకు ముందు జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆ తర్వాత ఖాతాదారుల ఖాతాల్లో చేరిన నగదు నిల్వల లెక్కలు సమర్పించాలని నోటీస్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ఐటీ చట్టం 133 (6) 1961 ప్రకారం జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లోగా ఆధారాలు సమర్పించాలని.. ఖాతాలకు సంబంధించిన క్యాష్ పుస్తకాలు, బ్యాంకు బ్యాలెన్స్ షీట్లతో తమ ఎదుట హాజరుకావాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. విడతల వారీగా నోటీసులు.. మొదటి విడతలో పెట్రోల్ బంక్‌ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న ఐటీ శాఖ.. ఆ తర్వాత ఆస్పత్రులు, నగల దుకాణాల వ్యాపారులపై కొరడా ఝుళిపిం చనున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల్లో కూడా పాత నోట్లకు అనుమతించడంతో వాటిల్లో బోగస్ బాధితులను సృష్టించి నకిలీ బిల్లులతో భారీ మొత్తంలో నగదు మార్పిడికి పాల్పడినట్లు ఐటీ శాఖ పరిశీలనలో తేలింది. నగల దుకాణాల్లో జరిగిన క్రయవిక్రయాలపైనా నిఘా పెట్టింది. 50 రోజుల వ్యవధిలో నగల దుకాణాల్లో జరిగిన బంగారం అమ్మకాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను బ్యాంకుల ద్వారా ఐటీ అధికారులు సేకరించారు. ఇందులో అక్రమంగా జరిగిన విక్రయాలు ఏమైనా ఉన్నాయా.. అని నిగ్గుతేల్చేందుకు ఐటీ శాఖ నుంచి త్వరలో నోటీసులు జారీ కానున్నట్లు తెలిసింది. ఈక్రమంలో పెట్రోల్ బంక్ యజమా నులు, నగల దుకాణాల వ్యాపారులు, ఆస్పత్రుల నిర్వాహకులు హడలెత్తిపోతున్నారు. -
బ్యాంకర్ల బెంబేలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సీబీఐ కేసులతో బ్యాంకు అధికారుల్లో వణుకు మొదలైంది. పెద్దనోట్ల రద్దు తర్వాత మూడు రోజులపాటు బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో నగదు విత్‌డ్రా చేసిన వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించి కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో చిక్కుకున్న వారంతా తణుకు పరిధిలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాదారులే. అయితే, జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున నల్లధనాన్ని మార్పిడి చేశారు. వీరిపై ఇప్పటివరకూ చర్యలు తీసుకునే ప్రయత్నం మొదలు కాలేదు. తణుకు కేంద్రంగా ఇద్దరు ఎమ్మెల్యేలు నల్లధనాన్ని తెలుపు చేశారన్న పక్కా ఆధారాలు సీబీఐ వద్ద ఉన్నా.. వాటిపై దృష్టి పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని ప్రజాప్రతి నిధులు వివిధ మార్గాల్లో నల్లధనాన్ని మార్చగా, ఎక్కువ మంది బ్యాంకర్ల ద్వారా కమీషన్ పద్ధతిలో మార్పిడి చేసినట్టు ప్రచారం సాగుతోంది. తాడేపల్లిగూడెంలో అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత తన అనుచరులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారి ద్వారా బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లలో పెద్ద మొత్తంలో సొమ్ములను డిపాజిట్టు చేయించారు. కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని, ఇంటికి రూ.లక్ష నుంచి రూ. 2.50 లక్షల వరకు పాత నోట్లను ఇచ్చారు. వీటిని మూడు బ్యాంకుల్లో జనధన్ ఖాతాలకు, డ్వాక్రా ఖాతాలకు, సేవింగ్స్ ఖాతాలకు మళ్లించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో దీనిపైనా సీబీఐ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఎస్బీఐ, ఇతర ప్రధాన బ్యాంకులతోపాటు పలు ప్రైవేటు బ్యాంకుల అధికారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని సొమ్మును తెలుపు చేసుకోగలిగారు. ఇదిలావుంటే.. పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసిన వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించింది. తణుకు ఎస్బీఐ కేంద్రంగా జరిగిన అక్రమ లావాదేవీలు తాజాగా వెలుగు చూడటంతో ఇందుకు సహకరించిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై ఆర్బీఐ అధికారులు వేటు వేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో ఒకే రోజు రూ.2.49 కోట్లు విత్‌డ్రాకు సహకరించిన బ్యాంకు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. వీరితోపాటు తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన వ్యాపారుల పైనా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల తణుకు పట్టణంలో కొందరు వ్యాపారులు, బిల్డర్లతోపాటు బ్యాంకు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్దఎత్తున అక్రమాలు గుర్తించినట్టు సమాచారం. అంతేకాకుండా వీరి నుంచి కీలక డాక్యుమెంట్లు సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా ఆర్బీఐ, సీబీఐ అధికారులు జిల్లావ్యాప్తంగా నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో తమ వ్యవహారాలు బయటకు పొక్కకుండా పలువురు ప్రజాప్రతినిధులు జాగ్రత్త పడుతుండగా.. ఎటుతిరిగి ఎటు వస్తుందోనని జిల్లాలోని బ్యాంకుల అధికారుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారు. -
త్వరలో తిరిగి వచ్చిన నోట్ల లెక్కలు: ఆర్బీఐ
ముంబై: బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డిపాజిట్ అయిన పాత నోట్ల సంఖ్యను తిరిగి సరిచూసుకుని సంబంధిత మొత్తం గణాంకాలను త్వరలో ప్రకటిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం తెలిపింది. నోట్ల డిపాజిట్‌పై వివిధ ఊహాగానాలు, వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా వివరణ ఇచ్చింది. డిసెంబర్ 30 నాటికే రద్దయిన నోట్లలో 95 శాతం మేర వెనక్కు వచ్చేశాయని ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ‘‘రద్దయిన నోట్ల డిపాజిట్లపై పలు అంచనాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇందుకు సంబంధించి వివిధ కరెన్సీ చెస్ట్‌లలో ఉన్న నోట్ల లెక్కను తిరిగి సరిచూసుకుని తగిన గణాంకాలను త్వరలో విడుదల చేస్తాం’’ అని ఆర్బీఐ వివరణ ఇచ్చింది. ఈ ప్రక్రియను ఇప్పటికే ఆర్బీఐ ప్రారంభించిందనీ ప్రకటన పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిస్తామనీ తెలిపింది. -
పాతనోట్లపై ఆర్బీఐ మాట మారిందా ?
-
నోట్ల లొల్లి.. ఇక ఆర్బీఐ వద్ద
-
నోట్ల లొల్లి.. ఇక ఆర్బీఐ వద్ద
హైదరాబాద్: రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే గడువు ముగిసింది. ఇక కేవలం ఆర్బీఐ వద్ద మాత్రమే ఆ నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉండటంతో.. హైదరాబాద్ ఆర్బీఐ వద్ద నోట్ల మార్పిడి కోసం శనివారం ప్రజలు ఎగబడ్డారు. అయితే ఆర్బీఐ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఇక్కడకు రావాలంటూ గేటు వద్ద నుంచే వారిని తిప్పిపంపుతున్నారు. ఆర్బీఐలో నోట్లను ఎలా మార్చుకోవాలో తెలిపే కనీస సమాచారం కూడా లేదంటూ అక్కడకు వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హాట్ కేకుల్లా మారిన పాతనోట్ల డిజైన్ పర్సులు
-
ఆర్బీఐ ముందు క్యూ కట్టారు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత పెద్ద నోట్లతో ప్రజలు రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ముందు బారులు తీరారు. రద్దయిన రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను డిపాజిట్ చేసేందుకు జనం దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఆర్బీఐ బ్యాంకు శాఖల ముందు వరుస కట్టారు. ఎటువంటి వివరణ లేకుండా రద్దయిన నోట్లను డిపాజిట్ చేసేందుకు గడువు నేటితో ముగియనుండడంతో ప్రజలు ఆర్బీఐ ప్రధాన కార్యాలయంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల ముందు భారీ ఎత్తున నిలబడ్డారు. దీంతో పలుచోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. రద్దీ నేపథ్యంలో ఆర్బీఐ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, సైన్యంలో పనిచేసేవారు, విదేశాల్లో ఉంటున్నవారు మాత్రం తమ వద్ద ఉన్న పాత నోట్లను నేరుగా ఆర్బీఐ వద్ద జమ చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. ఇతరులు కూడా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. -
'పాత నోట్లుంటే జైలు'పై కేంద్రం కొత్త మాట
న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లపై కేంద్ర ప్రభుత్వం మరో కుప్పిగంతు వేసింది. 'శుక్రవారం(డిసెంబర్ 30) తర్వాత పాత నోట్లు కలిగి ఉన్నవారికి కనీసం రూ.10వేల జరిమానా విధిస్తాం. జైలు శిక్షలు ఉండవు'అని ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పాతనోట్ల డిపాజిట్‌కు మార్చి 31 వరకూ గడువు పొడిగించిన దరిమిలా నేటి ప్రకటన(డిసెంబర్ 30 తర్వాత జరిమానాలు) అసంబద్ధంగా ఉండటం గమనార్హం. బుధవారం నాటి కేబినేట్ భేటీలో.. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ఆర్డినెన్స్ కు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్లను కలిగి ఉండటం నేరంగా పరిగణించడం డిసెంబర్ 30 తర్వాతా లేదా మార్చి 31 తర్వాతా అనే దానిపై బుధవారం నాటి కేబినెట్ భేటీలో స్పష్టత రాకపోవడంతో ఇవ్వాళ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు. (చదవండి: పాత నోట్లుంటే జైలే!) ఆ ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. మార్చి 31 తర్వాత రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద మొత్తంలో కలిగి ఉండటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అలాగే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సంబంధిత మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. -
మందుల పెట్టెల మాటున..
చత్తీస్‌గఢ్: పాతనోట్ల కట్టల పాములు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి. చత్తీస్గడ్ లో ఒక మెడికల్ షాపులో భారీ ఎత్తున పాత నోట్లను, బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెమెతారలోని శ్రీరామ మెడికల్ స్టోర్ పై బుధవారం ఆదాయ పన్ను అధికారులు దాడిచేశారు. మందుల పెట్టెల్లో దాచిన రూ.70 లక్షలకుపైగా విలువైన పాతనోట్లను, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.. తాజా సమాచారం ప్రకారం అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా నవంబర్ 8న రద్దు చేసిన రూ.500, 1000 నోటలకు డిపాజిట్లకు గడువు దగ్గరపడుతోంది. మరోవైపు నల్లధనానికి చెక్ పెట్టే క్రమంలో కేంద్ర బుధవారం కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేసింది. దీని ప్రకారం 2017 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాతనోట్లు కలిగి ఉంటే నేరం. ఇలాంటి వారికి 4 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు. అలాగే మార్చి 31 తరువాత పాత నోట్లను మార్చుకునే వారికి, పాతనోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న వారికి రూ.5 వేలు జరిమానా విధించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రద్దయిన నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్ 30 మాత్రమే. ఈ గడువు తర్వాత మార్చి 31 వరకు కేవలం రిజర్వు బ్యాంకు వద్ద మాత్రమే పాతనోట్ల మార్పిడి చేసుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. -
రద్దయిన నోట్లు ఉంటే నేరమా? ఎలా?
ముంబై: పాత నోట్లపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం అనేక అనుమానాలకు, చర్చలకు తావిచ్చింది. రద్దయిన నోట్లను కలిగి ఉండటం ఎలా నేరమవుతుంది. ఇపుడిదే ప్రశ్న సామాన్య ప్రజలతో పాటు పలువుర్ని వేధిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రూ.500, రూ.1000 నోట్ల చలామణికి ఎలాంటి చట్టబద్ధత లేదు. దీంతో ఎలాంటి లావాదేవీలకు ఆస్కారం లేదు. మరి తాజా ఆర్డినెన్స్ ఉద్దేశం ఏమిటి? దేశంలో పెద్ద మొత్తంలో చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్ల రద్దుచేస్తూ నవంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం సంచలన రేపింది. ఈ నోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీనికి కొంతగడువును , పరిమితులను విధించింది. ఈ నేపథ్యంలోనే ఇంకా బయటపడని, చట్టపరంగా వెల్లడించని నల్లధనానికి చెక్ పెట్టేందుకే తాజా ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్బీఐ చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ చట్ట ప్రకారం రద్దయిన నోట్లను కలిగి ఉండటం నేరమే అవుతుంది. చట్ట నిబంధనల ప్రకారం ఆయా వ్యక్తులు శిక్షార్హులే. గతంలో 1978లో కూడా ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి గమనార్హం. మరోవైపు కొన్ని రోజుల తరువాత ప్రస్తుతం చలామణీలోకి తీసుకొచ్చిన కొత్త రెండు వేల నోటును కూడా రద్దుచేసి, మళ్లీ వెయ్యి నోట్లను చలామణిలోకి తేనున్నారనే వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. రద్దు చేసిన పాత రూ.1000 నోటుకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని గతంలో పుకార్లు షికార్లు చేశాయి. రానున్న పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షాలకు, పలు రాజకీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు 2017 లో రెండు వేల నోటును కూడా రద్దు చేయనుందన్న వాదనలు కూడా వినిపించాయి. ది స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సెసేషన్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్డినెన్స్'గా పేర్కొన్న ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం 2017 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాతనోట్లు కలిగి ఉంటే నేరం. ఇలాంటి వారికి 4 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు. దీంతోపాటు పాత నోట్లను మార్చుకునే వారికి, పాతనోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న వారికి రూ.5 వేలు జరిమానా విధించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రద్దయిన నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్ 30వరకు మాత్రమే. ఈ గడువు తర్వాత మార్చి 31 వరకు కేవలం రిజర్వు బ్యాంకు వద్ద మాత్రమే పాతనోట్ల మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉన్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా ఉన్న క్లాజును కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులో చేర్చింది. ఈ ఆర్డినెన్సును ఆమోదించిన కేంద్ర కేబినెట్ దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ కు పంపనుంది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్ పెద్దనోట్ల రద్దుపై రూపొందించిన ఆర్డినెన్సుకు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. -
మోదీ షాక్: ఆ బ్యాంకుకు భారీగా పాత నోట్లు
మల్లాపురం : మలబార్ జిల్లా సహకార బ్యాంకులో సీబీఐ అధికారులు జరిపిన అకస్మాత్తు తనిఖీల్లో భారీగా పాత నోట్లు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 8న పెద్ద రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం మొదటి ఐదు రోజుల్లోనే రూ.169 కోట్ల రద్దయిన నోట్లు ఆ బ్యాంకుల్లో జమ అయినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన డిపాజిట్‌దారుల డాక్యుమెంట్లు సమర్పించాలని సీబీఐ బ్యాంకును ఆదేశించింది. అయితే బ్యాంకు అధికారులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి ఈ డిపాజిట్లు చేసుకున్నట్టు తెలిసింది. బ్యాంకుకు సంబంధించిన 54 శాఖల్లో, 296 కోపరేటివ్ సొసైటీల్లో నవంబర్ 10 నుంచి 14 వరకు మొత్తం రూ.169 కోట్ల రద్దయిన నోట్లు జమ అయినట్టు ఇన్వెస్టిగేషన్ టీమ్ గుర్తించింది. వీటిని శాఖల వారు రూ.84 కోట్లను, సొసైటీలు రూ.85 కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు తెలిసింది. కానీ నవంబర్ 10న బ్యాంకుల్లో జమైన మిగతా రూ.97 కోట్లకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. దీంతో ఈ నగదుపై క్లారిటీ ఇవ్వాలని బ్యాంకు అధికారులను సీబీఐ ఆదేశించింది. పెద్ద నోట్లు రద్దుచేసినప్పటి నుంచి జిల్లా సహకార బ్యాంకులు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నాయనే ఆరోపణలతో సీబీఐ ఈ రైడ్స్ నిర్వహించింది. అయితే బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేసే ప్రతి వ్యక్తికి ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడం తమ బాధ్యత కాదని, కానీ తాము కేవైసీ నిబంధనలను పాటిస్తున్నామని మలబార్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ మీనన్ చెప్పారు. కస్టమర్ల వివరాలను ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో పంచుకుంటామన్నారు. అయితే కేవైసీ నిబంధనలు పాటించాలని తమకు ఆర్బీఐ దగ్గర్నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేన్నారు. -
పాత నోట్లు భద్రపరిచే చోటేదీ!
-
పాత నోట్లు భద్రపరిచే చోటేదీ!
రాష్ట్రంలో రిజర్వ్ బ్యాంకుకు కొత్త చిక్కు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాత నోట్లను భద్రపరిచేందుకు రిజర్వు బ్యాంకు అవస్థలు పడుతోంది. సరిపడేంత స్థలం లేకపోవడంతో స్ట్రాంగ్ రూమ్‌ల కోసం వెతుకులాట ప్రారంభించింది. రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్రం రద్దు చేయటంతో నవంబర్ 9 నుంచి గురువారం వరకు (44 రోజుల్లో) రాష్ట్రవ్యాప్తంగా రూ.60 వేల కోట్ల విలువైన పాత నోట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయగా బ్యాంకులు ఏరోజుకారోజు పాత నోట్లను ఆర్బీఐకి చేరవేస్తున్నాయి. అయితే హైదరాబాద్‌లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం తమ పరిధిలో ఉన్న ఒక డెలివరీ పాయింట్లో కొత్త కరెన్సీతోపాటు పాత నోట్ల నిల్వకు స్థలం కేటాయించింది. అలాగే వివిధ బ్యాంకుల అధ్వర్యంలో ఉన్న 18 కరెన్సీ చెస్ట్లలోనూ పాత నోట్లను భద్రపరిచింది. అయితే ఆర్బీఐ ముద్రణాలయం నుంచి రాష్ట్రానికి సరఫరా అవుతున్న కొత్త కరెన్సీని సైతం బ్యాంకులకు చేరే వరకు స్ట్రాంగ్ రూమ్‌ల్లోనే భద్రపరుస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న పాత నోట్ల నిల్వలను భద్రపరిచే పరిస్థితి లేదని ఆర్బీఐ అధికారులు గుర్తించారు. పాత నోట్లు మరో రెండు వేల కోట్లు దాటితే నిల్వ సమస్య తీవ్రమవుతుందని, నోట్లు భద్రపరిచేందుకు అదనంగా స్ట్రాంగ్ రూమ్‌లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీలు, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లను వినియోగించుకోవాలని ఆర్బీఐ యోచిస్తోంది. ట్రెజరీలు, సబ్ ట్రెజరీల్లో పాత నోట్లను నిల్వ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతూ ఆర్బీఐ అధికారులు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వం సైతం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం నిర్దేశించిన గడువు మేరకు ప్రజలు తమ దగ్గరున్న పాత నోట్లు డిపాజిట్ చేసేందుకు ఇంకా 8 రోజుల గడువు ఉండటంతో మరో రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు జమ అవుతాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. -
ఆగని ఆర్బీఐ అధికారుల అక్రమాలు
బెంగళూరు: డీమానిటైజేషన్ తరువాత బ్యాంకు అధి్కారుల అక్రమాలకు హద్దులేకుండా పోతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర బ్యాంకు సీనియర్ ఉద్యోగులు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో జరుగుతున్న అక్రమలావాదేవీలను అరికట్టాల్సిన ఆర్బీఐ అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగదు మార్పిడి చేస్తున్న మరో ఇద్దరు ఆర్ బీఐ సిబ్బందిని సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆర్బీఐలో సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ సదానంద నైకా కాగా, మరొకరు స్పెషల్ అసిస్టెంట్ ఆఫ్ క్యాష్ డిపార్ట్మెంట్ ఏకే కేవిన్ అని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.1.99 కోట్ల పాత నోట్ల మార్పిడికి పాల్పడ్డారనే ఆరోపనలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా అక్రమ నోట్ల మార్పిడి కేసులో బెంగళూరు ఇది రెండవ కేసు. డిసెంబర్13 బెంగళూరులో ఆర్బీఐ అధికారి(రూ.1. 51కోట్లు)మైఖేల్ అరెస్టు కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
మరో కొత్త నోటు వస్తోంది
న్యూఢిల్లీ : పాత నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. మహాత్మాగాంధీ సిరీస్-2005లో కొత్త రూ.100 బ్యాంకునోట్లను జారీచేయనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఈ కొత్త నోట్లలో నంబర్ ప్యానెల్స్ ఇన్సెట్ లెటర్లు ఏమీ ఉండవని తెలిపింది. అయితే పాత రూ.100 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీలాగానే కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. పాత నోట్ల రద్దు అనంతరం రూ. 500, రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదలచేసింది. కానీ అవి తక్కువ మొత్తంలో విడుదల కావడంతో నగదు కొరత ఏర్పడింది. మరోవైపు పెద్ద నోట్లకు చిల్లర సమస్య ఏర్పడింది. రూ.2000కు సరిపడ చిల్లర దొరకకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న నోట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవలే కొత్త రూ.20, రూ.50 నోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ, ప్రస్తుతం రూ.100 నోట్లనూ కొత్తవి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కొత్త రూ.100 నోట్లతో ప్రజలకు ఉపశమనం కల్గించాలని ఆర్బీఐ నిర్ణయించింది. -
మీరు పాతనోట్లివ్వండి...
= జిల్లాలో జోరుగా నంబర్‌గేమ్ = పాతనోట్లతో ఆకర్షిస్తున్న మట్కా బీటర్లు = నంబర్ తగిలితే కొత్తనోట్లు ఇస్తామని వల = అనంతపురం రెండు రోజుల్లో రూ.కోటికి పైగా లావాదేవీలు = అన్నీతెలిసీ కళ్లుమూసుకున్న పోలీసులు మీరు పాతనోట్లివ్వండి...మేము కొత్తనోట్లిస్తా మంటున్నారు మట్కానిర్వాహకులు...దీంతో జనం నంబర్‌గేమ్ ఆడేందుకు ఎగబడుతున్నారు. 9.15 గంటలకోసారి...11.15 గంటలకోసారి తమ అదృష్టాన్ని తెలుసుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మట్కా ఆడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. అందువల్లే రెండు రోజుల్లోనే కేవలం అనంతపురం నగర పరిధిలోనే కోట్లలో మట్కా లావాదేవీలు నడిచినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం పెట్రోలు బంకులు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లతో సహా ఎక్కడా పాతనోట్లు చెల్లుబాటు కాదని ఆర్బీఐ తేల్చేసింది. పాతనోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో జమ చేయడం మినహా మరోదారి లేదని వెల్లడించింది. కానీ జిల్లాలోని మట్కా నిర్వాహకులు మాత్రం పాతనోట్లు స్వీకరిస్తున్నారు. మట్కా నంబర్ తగిలితే కొత్తనోట్లు ఇస్తామని చెబుతున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా మట్కావ్యాపారం జోరుగా నడుస్తోంది. గురు, శుక్ర రెండురోజుల్లో అనంతపురం నగర పరిధిలోనే రూ.కోటికిపైగా మట్కా లావాదేవీలు నడిచాయంటే.. జిల్లా వ్యాప్తంగా మట్కా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇదీ మట్కా నడుస్తోన్న తీరు అనంతపురం, తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలో భారీగా మట్కా నడుస్తోంది. గతంలో రతన్‌లాల్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరు రోజులు జరుగుతున్నారుు. ఈ మాట్కాకు నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నిర్వహిస్తున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5 గంటల వరకు చీటీలకు డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15కు ‘ఓపెన్’, రాత్రి 11.15కు ‘క్లోజ్’ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. దీంతోనే మట్కా రాయుళ్లు చాలామంది మట్కా నంబర్ రాసిన తర్వాత నంబర్ వెల్లడయ్యే వరకు టెన్షన్ తట్టుకోలేక ఫస్ట్‌షో, సెకండ్‌షో సినిమాలకు వెళుతుంటారు. అనంతపురం వన్‌టౌన్ పరిధిలో మట్కాబీటర్లు అధికం. ఇక్కడ ఎవరు మట్కా నిర్వహిస్తారు? మట్కా బీటర్లు ఎవరనే సంగతి ఇక్కడి పోలీసులకు క్షుణ్ణంగా తెలుసు. అయినా మట్కా నిర్వహణకు బ్రేక్ వేయలేకపోతున్నారు. దీనికి కారణం మట్కాబీటర్లకు ఇక్కడి కొంతమంది పోలీసులతో ఉన్న సత్ససంబంధాలే అని తెలుస్తోంది. దీంతోపాటు టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్‌టౌన్ పరిధిలో కూడా మట్కా నడుస్తోంది. ఇక్కడా అదే పరిస్థితి. తాడిపత్రి, కదిరి, హిందూపురం, గుంతకల్లు, ధర్మవరంలో కూడా జోరుగా సాగుతోంది. ఈ ఊబిలో కూరుకపోరుున వేలాది కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నారుు. మట్కా రాసే వారిలో కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. పాతనోట్లతో మట్కా కొత్తపుంతలు పాతనోట్ల స్వీకరణతో మట్కా కొత్తరూపు సంతరించుకుంటోంది. ఇప్పటి వరకూ మట్కాపై రూ.వంద రాసే వ్యక్తి పాతనోట్లతో రూ.500, వెయి రాస్తున్నాడు. ఇలా రాసే మొత్తం పెరగడంతో బీటర్ల ఆదాయం భారీగా పెరిగింది. భారీవ్యాపారాలు చేస్తూ మట్కాకు బానిసలై కొన్నేళ్లుగా చీటీలు రాస్తున్నవారివద్ద భారీగా పాతనోట్లు ఉన్నాయి. వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసినా ఐటీ లెక్కల ప్రకారం భారీగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. దీంతో ఒక్కొక్కరు 5 నంబర్లపై భారీగా వెచ్చిస్తున్నారు. వీరిని చూసుకుని ఇప్పటి వరకూ మట్కా అలవాటు లేని వ్యక్తులు కూడా పాతనోట్లతో ఆట మొదలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా నడుస్తున్న మట్కా వ్యాపారంలో బీటర్లు కొన్ని నంబర్లకు మాత్రమే కంపెనీలకు డబ్బు చెల్లించి తక్కిన మొత్తాన్ని వీరే స్వాహా చేస్తున్నారు. ఈ డబ్బును బెంగళూరు, బళ్లారిలో మట్కా సాగిస్తోన్న వారికి సరఫరా చేసి డబ్బులు మార్చే పనిలో ఉన్నారు. పేకాటకూ పాత నోట్లే.. మట్కాతో పాటు పేకాట కూడా జిల్లాలో జోరుగా నడుస్తోంది. పేకాటరాయుళ్లు కూడా పాతనోట్లతో ’గేమ్’ ఆడుతున్నారు. జిల్లాలో ఓ క్లబ్‌తో పాటు ఏపీబీఆర్, ఎంపీఆర్ డ్యాంల వద్ద భారీగా పేకాట ఆడుతున్నారు. కొందరు బళ్లారితో పాటు కర్ణాటక సరిహద్దు దాటి అక్కడ పేకాట ఆడుతున్నారు. ఎస్పీ దృష్టి సారిస్తే పాతనోట్లతో మట్కాసాగిస్తోన్న వ్యవహారం నగరంలోని ఓ సీఐ దృష్టికి వచ్చింది. అయితే బీటర్లను పిలిపించి, వారితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎస్పీ మట్కా నిర్వాహకులపై దాడులు చేస్తే భారీస్థారుులో పాతనోట్లు లభించే అవకాశం ఉంది. -
టీడీపీ యువనేతకు నమ్మినబంటు ఝలక్
► రూ.కోటి పాతనోట్లతో పరారీ ► సొంత టీమ్‌తో అన్వేషించి పట్టుకున్న నేత ► డబ్బు రాబట్టేందుకు పోలీస్‌స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ! ► విషయం బయటకు రాకుండా పోలీసులకు ముందస్తు ఆదేశాలు అక్రమ వసూళ్ల కోసం గుమస్తా ఏర్పాటు... పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వ్యాపారులు, కాంట్రాక్టర్లు, అధికారులు, రేషన్, మద్యం మాఫియాలతో పాటు అన్ని రకాల వ్యాపార వర్గాల నుంచి అన్నీతానై అక్రమ వసూళ్ళు చేసేందుకు యువనేత ప్రత్యేకంగా ఒక గుమస్తాను ఏర్పాటుచేసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత యువనేత ఆదేశాలతో ఆర్థిక లావాదేవీల పనులను సదరు గుమాస్తా చక్కబెడుతున్నాడు. ఇటీవల యువనేత వద్ద ఉన్న కోట్ల రూపాయల్లో రద్దయిన పాతనోట్లు ఉన్నాయి. వాటిని మార్చుకునే ప్రక్రియ గత 20 రోజులుగా నిర్వహించి దాదాపు 90 శాతం మార్చేశారు. నగదు మార్పిడిలో పరారైన నమ్మినబంటు (గుమాస్తా) కీలక పాత్ర పోషించాడు. సాక్షి, గుంటూరు : అక్రమ వసూళ్లతో కోట్లకు పడగెత్తిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత కుమారుడికి అతనికి నమ్మకస్తుడైన గుమాస్తా ఝలక్ ఇచ్చాడు. తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు యువనేత కానీ, ముఖ్య నేత కానీ మొక్కుబడిగా అయినా పట్టించుకోలేదనే కారణంతో డబ్బంటే అమితంగా ఇష్టపడే సదరు యువనేతను డబ్బుతోనే కొట్టాడు. రూ.కోటి విలువైన రద్దయిన పాత నోట్లతో ఉడాయించాడు. ఈ ఘటన పల్నాడు ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలీసు అధికారుల ప్రత్యేక ఆదేశాలు కేసు లేకుండా తన సొంత టీమ్‌తో పాటు కొందరు పోలీసులను కూడా రంగంలోకి దింపి గాలింపు చేపట్టి గుమాస్తాను పట్టుకున్న యువనేత డబ్బు రాబట్టుకునేందుకు థర్డ్ డీగ్రీ మొదలుపెట్టారు. అతనితో పాటు గుమాస్తాకు సన్నిహితంగా ఉండే ఇద్దరు టీడీపీ చోటీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. లెక్కల్లో తేడాతో బహిర్గతం... మూడు రోజుల క్రితం రెండు నియోజకవర్గాలకు సంబంధించి చేసిన వసూళ్ళు ఇద్దరూ లెక్కతేల్చగా కొంత వ్యత్యాసం వచ్చినట్లు తెలిసింది. దీంతో యువనేత గుమాస్తాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసి తేడా వచ్చిన మొత్తాన్ని తనకు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో గుమాస్తా తనకు ప్రాణహాని ఉందని భావించి గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో ఆందోâýæన చెందిన యువనేత తన మందీ మార్బలంతో గాలింపు చేపట్టాడు. చివరకు గుంటూరులో తలదాచుకున్నట్లు తెలుసుకున్న యువనేత అతనిని పట్టుకొచ్చి తన షోరూమ్‌లో బంధించినట్లు తెలియవచ్చింది. అక్కడ చితకబాదిన అనంతరం రాజుపాలెం పొలీసుస్టేన్లో అప్పగించినట్లు సమాచారం. దీంతో అతనిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలియవచ్చింది. యువనేత అక్రమాల చిట్టా గుమాస్తా చేతిలో.... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టర్లు, వ్యాపారులను బెదిరించి అక్రమంగా వసూళ్ళు చేస్తున్న వివరాలు అన్నీ గుమాస్తా వద్ద ఉన్నట్లు సమాచారం. అంతేగాక ప్రతి నెలా అధికారులు, రేషన్, మద్యం మాఫియా ఇచ్చే మామూళ్ళు సైతం గుమాస్తానే వసూలు చేస్తుంటాడు. సభ్యత్వ నమోదులో అక్రమాలు, నల్లధనం వివరాలు, అక్రమ ఆస్తుల వివరాలపై ఆ గుమాస్తాకు పూర్తిగా అవగాహన ఉంది. దీంతో అతను బయట నోరు విప్పితే తన బండారం మొత్తం బయటపడుతుందని యువనేత కంగారు పడుతున్నట్లు తెలిసింది. తన అరాచకాలు బయటకు రాకుండా గుమాస్తాను ఏమైనా చేస్తాడేమోనన్న అనుమానాలు అతని కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమౌతున్నాయి. రెండు నియోజకవర్గాల్లో చర్చ యువనేతకు నగదుతో గుమస్తా ఉడాయించిన వైనం రెండు నియోజకవర్గాల్లోని పారీ వర్గీయులు, సన్నిహితుల మధ్య చర్చ సాగుతోంది. ఎంత మొత్తంలో తీసుకెళ్ళాడనే దానిపై రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నారు. ఎత్తుకెళ్ళింది బ్లాక్ మనీ కాబట్టి ఫిర్యాదుచేసేందుకు యువనేత వెనకడుగు వేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. -
రద్దయిన నోట్లే.. రాబడికి రూట్లు
నగర, పురపాలక సంస్థలకు వరంగా మారిన కేంద్రం నిర్ణయం రూ.500, రూ.1000 నోట్లతో పన్ను చెల్లించే వెసులుబాటుతో అనూహ్యంగా పెరిగిన వసూళ్లు నవంబర్‌లో భారీగా పెరిగిన ఆదాయం అంత వరకూ దర్జాగా బతికిన వాళ్లు దివాళా తీసి దరిద్రులుగా మిగిలినట్టయింది .. గత నెల 8న రూ.500, రూ.1000 నోట్ల పరిస్థితి. జేబులోనో, ఇంట్లోని బీరువాలోనో ఉంటే ఎంతో భరోసానిచ్చిన ఆ కరెన్సీయే అకస్మాత్తుగా నెత్తి మీద ముళ్లకట్టెల మోపు మోస్తున్నంత భారంగా, దుర్భరంగా అనిపించింది. ఆ రోజు ఆ నోట్ల చలామణీని రద్దు చేసిన కేంద్రం..కలుగుల్లో పొగ బెట్టి ఎలుకల్ని బయటికి రప్పించినట్టు..‘నల్లధనాన్ని వెలికి తీయడానికే ఈ విప్లవాత్మక నిర్ణయం’ అని చెప్పినా.. ఆ నోట్లు దగ్గరున్న పేదలు సైతం వాటిని ఎలా మార్చుకోవాలా అని కలవరపడ్డారు. ప్రతి బ్యాంకూ, ప్రతి పోస్టాఫీసు వద్దా.. పుష్కరాల వేళ గోదావరి రేవుల్లోలా ఒకటే రద్దీ. అంతేకాక..నోట్ల మార్పిడికి పరిమితీ ఉండడంతో తమ వద్ద ఉన్న ఆ నోట్లు విరగడ అవుతాయో, లేదోనని దిగాలు పడ్డారు. అయితే కేంద్రం.. నిర్దిష్ట వ్యవధిలో వాటితో కొన్ని చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించింది. అలాంటి వాటిలో ఒకటి.. రద్దయిన పెద్దనోట్లతో పురపాలక సంఘాలకు, నగర పాలక సంస్థలకు పన్నుల బకాయిలు చెల్లించే అవకాశం. ఈ వెసులుబాటు ఆ స్థానిక పరిపాలనా సంస్థలకు ‘సిరి’ని తెచ్చి పెట్టింది. రద్దయిన నోట్లతో పన్నులకు సంబంధించిన మొండి బకాయిలతో సహా చెల్లించడానికి ప్రతి పట్టణంలో, నగరంలో ఎందరో ఆరాటపడడంతో నవంబర్‌లో స్థానిక సంస్థల రాబడి ఎన్నో రెట్లు పెరిగింది. ఈ పరిణామంపై ‘సాక్షి’ ఫోకస్.. కాకినాడకు కాసుల పంట కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో నవంబర్ 11 నుంచి 30 వరకూ సుమారు రూ.3 కోట్ల పన్నులు రూపంలో వసూలు చేయగలిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.26 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, సెప్టెంబర్‌తో ముగిసిన అర్ధ సంవత్సరా>నికి దాదాపు 50 శాతం వసూలు చేయగలిగారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే 2వ అర్ధసంవత్సరం బకాయిలు సాధారణంగా జనవరి నుంచి మార్చి మధ్యలో వసూలయ్యేవి. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.1.5 కోట్ల వరకు వసూలయ్యాయి. నవంబర్ 8న నోట్ల రద్దు అనంతరం 11 నుంచి 24 వరకు పాత నోట్లను స్వీకరిస్తామని నగరపాలక సంస్థ ప్రకటించింది. మరో అడుగు ముందుకు వేసి వచ్చే ఐదేళ్ళకు అడ్వా¯Œ్స ట్యాక్స్ చెల్లించినా తీసుకుంటామనడంతో పన్ను చెల్లింపుదారుల్లో స్పందన బాగా కనిపించింది. నిర్ణీత సమయంలో ఇంటి పన్నుల ద్వారా రూ.2.50 కోట్లు, నీటి పన్నుల ద్వారా రూ.37 లక్షలు, ఖాళీ స్థలాల పన్ను ద్వారా రూ.13 లక్షలు మొత్తం రూ.3కోట్ల పన్నులు రాబట్టగలిగారు. అడ్వా¯Œ్స ట్యాక్స్ చెల్లించొచ్చన్న దానికి మాత్రం స్పందన కానరాలేదు. మొత్తం మీద.. దండోరాలు వేసి, రెడ్‌నోటీసులు, జప్తు నోటీసులు ఇస్తే తప్ప వసూలు కాని పన్నులు, బకాయిలు నోట్ల రద్దు పుణ్యమాని నేపద్యంలో బాగానే వసూలయ్యాయని కార్పొరేష¯ŒS వర్గాలు చెబుతున్నాయి. – కాకినాడ ఒక్క నెలలోనే నాలుగో వంతు.. రద్దయిన పెద్ద నోట్ల భారం దించుకునేందుకు వాటితో అనేకులు పన్నులను చెల్లించడంతో అమలాపురం పురపాలక సంఘానికి ఒక్క నవంబర్ నెలలోనే రూ.61.60 లక్షల ఆదాయం వచ్చింది. మున్సిపాలిటీలో మొత్తం పన్నుల డిమాండు రూ.3.37 కోట్లు. నవంబర్ ఎనిమిదిన పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచీ ఆ నెలలో మిగిలిన 22 రోజుల్లో మున్సిపాలిటీకి ఏకంగా రూ.61.50 లక్షల పన్ను రాబడి లభించింది. సాధారణంగా నవంబర్ నెల పన్నుల వసూళ్లకు అ¯ŒS సీజ¯ŒS. సెప్టెంబర్, అక్టోబర్, మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే పన్ను వసూళ్లు ముమ్మరంగా ఉంటాయి. మున్సిపాలిటీలో గత అక్టోబర్ నెలలో ఆస్తి పన్నులు రూ.9.76 లక్షలు, తాగునీటి పన్నులు కేవలం రూ.77 వేలు మాత్రమే వసూలయ్యాయి. నోట్ల రద్దు అనంతరం నవంబర్‌లో ఆస్తి పన్నులు రూ.52 లక్షలు వసూలైతే.. తాగునీటి పన్ను రూ.9.50 లక్షలు వసూలైంది. అక్టోబర్‌తో నవంబర్ వసూళ్లను పోల్చుకుంటే ఆస్తి పన్ను నాలుగు రెట్లకు పైగా పెరిగితే... తాగునీటి పన్ను దాదాపు 11 రెట్లు పెరిగింది. అంటే మొత్తం పన్నుల డిమాండు రూ.3.37 కోట్లలో ఒక్క నవంబర్లోనే నాలుగో వంతు వసూలైనట్లయింది. అమలాపురం టౌ¯ŒS అక్టోబర్‌లో కన్నా ఆరు రెట్లు పెద్ద నోట్ల రద్దు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కాసుల వర్షాన్ని కురిపించింది. రూ. వెయ్యి, రూ. 500 నోట్లతో ఇంటి పన్నులు, కుళాయి పన్నుల బకాయిలు చెల్లించవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో మునుపెన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థకు భారీగా ఆదాయం వచ్చింది. వ్యాపారస్తులు, ఇంటి యజమానులు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఆస్తి, వ్యాపార పన్నులు చెల్లించారు. పెద్దనోట్లు రద్దు అయిన నవంబర్ 8 నుంచి 30 వరకు నగరపాలక సంస్థకు పన్నులు, బకాయిలు రూపంలో రూ.6.31 కోట్లు సమకూరాయి. అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 7 వరకు కేవలం రూ.86.80 లక్షలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. నవంబర్‌లో నగరపాలక సంస్థ ఆదాయం మునుపటి నెలకన్నా ఆరు రెట్లకు పైగా పెరగడం విశేషం. నగరపాలక సంస్థను ఎప్పటి నుంచో వేధిస్తున్న మొండిబకాయిల వసూలు బాధ పెద్దనోట్ల రద్దు వల్ల తీరినట్టయింది. – రాజమహేంద్రవరం రామచంద్రపురానికి కలిసొచ్చిన ‘రద్దు’ పెద్ద నోట్ల రద్దు అనంతరం రామచంద్రపురం మున్సిపాలిటీకి రూ.22 లక్షల ఆస్తిపన్ను వసూలయింది. నోట్లు రద్దు చేసిన మూడవ రోజే రూ. 10 లక్షలువసూలు కావటం గమనార్హం. అక్టోబర్ నెలలో రూ.4,41,924 వసూలు కాగా ఒక్క నవంబర్‌లో మొత్తం రూ.22,04,773 వసూలయ్యింది. సాధారణంగా నవంబర్‌లో రెండు నుంచి మూడు లక్షల వరకు మాత్రమే ఆస్తిపన్ను వసూలవుతుంది. కానీ ఈసారి పెద్దనోట్ల రద్దుతో ఆ మొత్తం అనేక రెట్లు పెరిగింది. – రామచంద్రపురం రెండు మున్సిపాలిటీల్లో దండిగా.. పెద్ద నోట్ల రద్దు పెద్దాపురం నియోజక వర్గ పరిధిలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలకు వరంగా మారింది. పెద్దాపురం మున్సిపాలిటీలో ఏడాది మొత్తం పన్ను డిమాండ్ రూ.2,50,00,000 అని మున్సిపల్ కమిషనర్ ఎ. వెంకట్రావు తెలిపారు. అక్టోబరు నెలలో ఇంటి పన్నులుగా రూ.5,02,500, కుళాయి పన్నులుగా రూ.3,66,600, షాపుల అద్దెలుగా రూ.48 వేలు వసూలు కాగా నవంబరు నెలలో ఇంటి పన్నులుగా రూ.21,39,600, కుళాయి పన్నుగా రూ. 6,65,900, షాపుల అద్దెలుగా రూ.6,16,900 వసూలైనట్టు చెప్పారు. నోట్ల రద్దుతో నవంబరు నెలలో రూ.25,32,700 అదనంగా ఆదాయం వచ్చింది. సామర్లకోట మున్సిపాలిటీలో మొత్తం పన్ను డిమాండ్ రూ.2, 55,75,000 కాగా అక్టోబరు నెలలో ఇంటి పన్నులుగా రూ. 3.51 లక్షలు, కుళాయి పన్నుగా రూ.99 వేలు, షాపుల అద్దెలుగా రూ.2,61,000 వసూలైనట్టు కమిషనర్ కేటీ సుధాకర్ తెలిపారు. నవంబరు నెలలో ఇంటి పన్నులుగా రూ.15.77 లక్షలు, కుళాయి పన్నుగా రూ.4.30 లక్షలు, షాపుల అద్దెలుగా రూ.2.38 లక్షలు వసూలు అయినట్లు తెలిపారు. – సామర్లకోట నవంబర్‌లో రూ.25 లక్షల రాబడి రద్దయిన పెద్దనోట్లతో పన్ను బకాయిలు చెల్లించవచ్చని చెప్పడంతో పిఠాపురం పురపాలక సంఘానికి ఆదాయం భారీగా పెరిగింది. గడిచిన అక్టోబర్‌లో ఆస్తిపన్ను వసూలు కేవలం సుమారు రూ.8 లక్షలుండగా పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలుబడిన నవంబర్‌లో సుమారు రూ.25 లక్షలు ఆస్తిపన్ను, కుళాయి పన్నుల రూపంలో వసూలయినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ.2.53 కోట్లు ఉండగా ఇంతవరకు రూ.1.82 కోట్లు వసూలయినట్టు తెలిపారు. – పిఠాపురం టౌ¯ŒS మండపేటలో రికార్డుస్థాయి.. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మండపేట మున్సిపల్ పరిధిలో రికార్డుస్థాయిలో పన్నులు వసూలయ్యాయి. ఆస్తిపన్నుగా రద్దయిన నోట్లను చెల్లించుకునేందుకు అవకాశమివ్వడంతో పెద్ద ఎత్తున భవన యజమానులు పన్నులు చెల్లించారు. ఏడాదికి మునిసిపాలిటీ ఆస్తిపన్ను డిమాండ్ రూ.2.74 కోట్లు కాగా ఇప్పటి వరకూ వసూలైన మొత్తం రూ.1.79 కోట్లు. దీనిలో రూ.57 లక్షలు పెద్దనోట్లు రద్దు తర్వాత వసూలైందే కావడం గమనార్హం. అక్టోబరు నెలలో కేవలం రూ. 9.63 లక్షలు వసూలయ్యాయి. సాధారణంగా నవంబరులో ఆస్తిపన్ను వసూలు దాదాపు రూ. 10 లక్షలు ఉంటుంది. – మండపేట -
కేటుగాళ్లకు కొత్త నోట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గంటల తరబడి క్యూలో నిలబడితే.. చివరకు బ్యాంకర్లు దయతలిస్తే సామాన్యుడి చేతికొచ్చేది మహా అయితే రెండు రూ.2 వేల నోట్లు మాత్రమే. బ్యాంకు ఏటీఎం ఎదుట క్యూలో నిలబడితే వచ్చేది రోజుకు ఒక్కటే నోటు. బాగా పలుకుబడి ఉంటేగాని బ్యాంకులో మూడు నాలుగు నోట్లు తీసుకోవడం సాధ్యం కాదు. ఇదీ వాస్తవ పరిస్థితి. కానీ.. కొంతమంది వద్ద లక్షలాది రూపాయల విలువ చేసే కొత్త నోట్ల కట్టలు ఉంటున్నాయి. పకడ్బందీగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చేరాల్సిన ఈ నోట్లు బయటకు ఎలా వస్తున్నాయన్నది అంతుబట్టడం లేదు. బ్యాంకుల సిబ్బంది, మేనేజర్ల సహకారం లేకుండా ఒక్క నోటు కూడా బయటకు రాదన్నది బహిరంగ రహస్యమే. జిల్లాలో మాత్రం చాలా సునాయాసంగా రూ.2 వేల నోట్ల కట్టలు బయటకు వచ్చేస్తున్నాయి. బ్యాంకు మేనేజర్‌కు, సిబ్బందికి 20 నుంచి 30 శాతం కమీష¯ŒS ఇస్తే ఎన్ని కావాలంటే అన్ని లక్షలు మార్చుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి జిలావ్యాప్తంగా ఉన్నట్టు ఇటీవలి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. వారం క్రితం రూ.24 లక్షల రూపాయలు మార్చుకునేందుకు యత్నించిన వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. విజయవాడకు చెందిన విజయ్ అగర్వాల్‌తోపాటు, కార్ యాక్ససరీస్ పనిచేసే అంచెల రవికుమార్ సహా 8మంది పోలీసులకు పట్టుబడ్డారు. అగర్వాల్, రవికుమార్ అనేవారికి ఏలూరులో మెకానిక్‌గా పనిచేసే రవితో పరిచయం ఉంది. అతను నాలుగు శాతం కమీష¯ŒSకు పాత నోట్లు మార్చుకుంటానని చెప్పడంతో వారు ఏలూరు వచ్చారు. సోమవరప్పాడు పొలాల్లో ఉండగా పోలీసులకు అందిన సమాచారంతో వారిపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రూ.24 లక్షల నగదు స్వా«ధీనం చేసుకున్నారు. అయితే డబ్బులు మార్చుకునేవారు మాత్రం పట్టుపడలేదు. సుమారు రూ.రెండు కోట్లు మార్చుకునేందుకు డీల్ కుదిరిందని, ఈ ప్రయత్నంలో వారు పోలీసులకు పట్టుబడినట్లు ప్రచారం జరిగినా సూత్రధారులు బయటకు రాలేదు. పోలీసులు డబ్బులు దొరకగానే కేసు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూత్రధారులను పట్టుకునే ప్రయత్నం వారి నుంచి లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా గురువారం రాత్రి ఏలూరు వ¯ŒSటౌ¯ŒSలోని సూర్యా అపార్ట్మెంట్లో ఎలబాక బాలకృష్ణ సహా ఐదుగుర్ని అరెస్ట్ చేసి రూ.19 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ వడ్రంగి మేస్రి్తగా పని చేస్తున్నాడు. అతని వద్ద అంత డబ్బు ఉండే అవకాశం లేదు. తాను వేర్వేరు వ్యక్తుల వద్ద అప్పు తీసుకున్నానని బాలకృష్ణ చెబుతున్నాడు. అప్పు తీసుకున్నా రూ.2 వేల కొత్త నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అతని ఇంటిపక్కనే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ఉండటంతో అందులో పనిచేసే సిబ్బంది ద్వారా ఈ డబ్బులు బయటకు వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును కూడా గాలికి వదిలివేయకుండా లోతుగా దర్యాప్తు చేస్తే నోట్ల మార్పిడి వెనుక సూత్రధారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం తాడేపల్లిగూడెంలో పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తుండగా మాడెం గోపీకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.3.56 లక్షల విలువైన రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను లక్షకు 12 శాతం కమీష¯ŒSకు పాత నోట్లు మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
RBI పాత నోట్లు ఎంత ధ్వంసం చేస్తుందో తెలుసా
-
ఈ స్టార్టప్‌తో మీ ఇంటికే నోట్ల డెలివరీ!
పెద్దనోట్ల రద్దు అనంతరం తగినంతగా కరెన్సీ నోట్లు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. చెల్లుబాటు అయ్యే కరెన్సీ నోట్లను తీసుకునేందుకు ప్రజలు బ్యాంకులు ముందు నిత్యం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక స్టార్టప్ వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. ఆన్లైన్లో మా ఉత్పత్తులు కొనండి.. అందుకు బదులుగా రూ. వెయ్యి వరకు చెల్లుబాటు అయ్యే కరెన్సీ నోట్లను మీ ఇంటికే వచ్చి అందిస్తామంటూ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నోయిడాకు చెందిన స్టార్టప్ ‘టెయిల్.కామ్’ వినియోగదారులకు ఈ వినూత్న ఆఫర్ ఇచ్చింది. బియ్యం, పప్పుధాన్యాలు, పిండి తదితర వంటింటి వస్తువులను ఆన్లైన్లో ఈ స్టారప్ అమ్ముతున్నది. మా ఉత్పత్తులను ఆన్లైన్లో కొనుగోలు చేస్తే.. ఉచితంగా ఇంటికి కరెన్సీ నోట్లు డెలివరీ చేసే అవకాశం కల్పిస్తున్నామని టెయిల్మిల్.కామ్ సహ యజమాని అర్జున్ రంగ్తా తెలిపారు. ‘ఇది చాలా సింపుల్ ఫార్ములా. పెద్దనోట్ల రద్దు అనంతరం 15-20 రోజుల్లో మాకు వచ్చిన నగదును మేం మా వినియోగదారులకు అందజేయాలని నిర్ణయించాం. ఆన్లైన్లో మా ఉత్పత్తులు కొనేటప్పుడు వారు క్యాష్ డెలివరీ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. రోజుకు ఒక వినియోగదారుడికి రూ. వెయ్యిని పరిమితి అని తెలిపారు. ప్రజలు ఎక్కువగా కోరుతున్న రూ. 100 రూ. 500 నోట్ల రూపంలో కరెన్సీని డెలివరీ చేస్తున్నామని చెప్పారు. తమ క్యాష్ డెలివరీ కోసం వెబ్సైట్లో కనీస ఆర్డర్ రూ. 140 అని, మరోసారి కావాలనుకుంటే రూ. 160కిపైగా ఆర్డర్ చేయాలని, ఇది పూర్తిగా చట్టబద్ధంగా సాగుతున్నదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతానికి తమ స్టార్టప్ కార్యకలాపాలు నోయిడాకు పరిమితమని చెప్పారు. -
పాత నోట్ల ష్రెడ్డింగ్ మొదలు:ఆర్బీఐ
-
బ్రిటన్ నుంచి విమానాల్లో పెద్ద నోట్లు
లండన్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా పడుతోంది. బ్రిటన్‌లోని భారతీయులంతా తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వాటిని స్నేహితులు, బంధువులు, మరెవరైనా తెలిసిన వారు లేదా మధ్య వర్తుల ద్వారా తమ వద్ద ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్లను విమానాల్లో పంపిస్తున్నారు. ప్రస్తుతం డిపాజిట్ చేసేందుకు, ఆర్బీఐలో మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఉన్న ఈ నోట్లు డిసెంబర్ తర్వాత నేరుగా ఆర్బీఐకి వెళితే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని భారతీయులు తమ వద్ద ఉన్న పాత డబ్బుకు కంగారు పడుతున్నారు. ప్రస్తుతం దీన్ని విదేశాల్లో మార్పిడి చేసుకునే అవకాశం కూడా లేదు. బ్రిటన్‌లో 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతీయులు 2.5శాతం మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు నోట్ల మార్పిడి కోసం ఎంత కంగారు పడుతున్నారో గుజరాత్‌కు చెందిన నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ గుజరాతీ ఆర్గనైజేషన్ యూకే(ఎన్సీజీవో) అధ్యక్షుడు సీజే రాభేరు తెలిపారు. రోజుకు కొన్ని వందల్లో ఫోన్లు వస్తున్నాయని, ఏం జరుగుతుందో తనకేం అర్థం కావడం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియక కంగారు పడుతున్నవారే ఎక్కువగా ఉన్నారని, రూమర్లను నమ్ముతున్నారని అన్నారు. దాదాపు 10లక్షల మంది బ్రిటన్ భారతీయులపై పెద్ద నోట్ల ప్రభావం పడిందని తెలిపారు. -
నోట్ల రద్దు: బ్యాంకులకు ప్రాణ సంకటం!
-
నవ వధువును బలిగొన్నపాత నోట్లు
-
డబ్బు పట్టుకునే అధికారం పోలీసులకు లేనేలేదు
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పోలీసులు పెద్ద మొత్తాల్లో వాహనాల్లో తరలిస్తున్న పాత నోట్లను లేదా కొత్త నోట్లను పట్టుకున్నారని, నిందితులను నిర్బంధంలోకి తీసుకొన్నారంటూ రోజూ వార్తలు వస్తున్నాయి. వాహనాలను తనిఖీ చేసే అధికారం కానీ, వాటిలో బయటపడిన నిషేధించిన పెద్ద నోట్లు లేదా కొత్త నోట్లను స్వాధీనం చేసుకోవడం, బాధ్యులను అరెస్ట్ చేయడం లాంటి అధికారం పోలీసులకు అసలు లేనే లేవు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8వ తేదీ నాడు ఆ నాటి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని, ఇక అవి చిత్తు కాగితాలతో సమానమని పేర్కొన్నారు. మరి చిత్తు కాగితాలను తీసుకెళుతున్న వారిని పోలీసులు ఎందుకు తనిఖీ చేస్తున్నారు? ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు? డిసెంబర్ 31వ తేదీ వరకు పాత నోట్లను ఎంత మొత్తమైనా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రమే అవకాశం ఇచ్చినప్పుడు మధ్యలో పోలీసులు ఎలా పట్టుకుంటారు? రెండున్నర లక్షల రూపాయలకు మించి ఓ వ్యక్తి బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్లయితే వారిపై ఆదాయం పన్ను శాఖ నిఘా ఉంటుందని ప్రభుత్వమే చెప్పింది. అప్పుడు ఆదాయం పన్ను శాఖ, ఖాతాదారులే ఆ వ్యవహారం చేసుకుంటారు. అలాంటప్పుడు పోలీసుల ఓవర్ యాక్షన్ ఎందుకు? 1978 నాటి చట్టం ఇప్పుడు లేదు ఇంత మొత్తానికి మించి పాత నోట్లను లేదా కొత్త నోట్లను కలిగి ఉండరాదంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తే వాటిని కలిగి ఉండడం నేరం అవుతుంది. 1978లో వెయ్యి, ఐదువేలు, పదివేల రూపాయల నోట్లను అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఆ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి రద్దయిన నోట్లను ఇచ్చి పుచ్చుకోవడం, బదిలీ చేయడం నేరమంటూ ‘హై డినామినేషన్ బ్యాంక్ నోట్స్ (డీమానిటైజేషన్) యాక్ట్’ను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం అలాంటి చట్టాన్ని ఏమీ తీసుకరాలేదు. డబ్బును ఓ చోటు నుంచి మరో చోటుకు తరలించడం ‘కాగ్నిజబుల్ (శిక్షార్హమైన)’ నేరం కాదని చట్టమే చెబుతోంది. పైగా దోపిడీ దొంగతనాల లాంటి కేసుల్లో మాత్రమే డబ్బు కోసం వాహనాలను తనిఖీ చేసే అధికారం, నిందితులను అదుపులోకి తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. నల్లడబ్బుకు సంబంధించి వాహనాలను గానీ, ఇళ్లను గానీ, ఆఫీసులను గానీ తనిఖీ చేసే అధికారం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు ఉండదు. ఎవరి అధికార పరిధి వారిదే... దేశంలోని వివిధ చట్టాల అమలును, ఉల్లంఘనలు పర్యవేక్షించే బాధ్యత వివిధ విభాగాలకు భారత రాజ్యాంగం అప్పగించింది. ఒకే విభాగం చేతిలో సుప్రీం అధికారాలుంటే అది అధికార దుర్వినియోగానికి దారితీస్తుందని, పౌర స్వేచ్ఛా హక్కులకు భంగం కలిగిస్తుందన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. 1860 భారతీయ శిక్షాస్మృతి రాష్ట్ర పోలీసుల అధికారాల పరిధిలోకి వస్తోంది. దీనికిందకు వచ్చే నేరాలను 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పోలీసులు విచారించాల్సి ఉంటుంది. అలాగే 1961, ఆదాయం పన్ను చట్టం ప్రకారం ఆ విభాగం అధికారాలు పూర్తిగా వేరు. వారి విధుల్లో జోక్యం చేసుకునే అధికారాలు పోలీసులకు లేదు. ఎవరి ఇంటినైనా, ఆఫీసునైనా తనిఖీ చేయాలంటే పోలీసులు తప్పనిసరి వారెంటు తీసుకొని వెళ్లాలి. అదే ఆదాయం పన్ను శాఖ అధికారులు మాత్రం వారెంట్లు లేకుండానే దాడులు చేయవచ్చు. టెర్రరిజం నిరోధక చట్టాలు, ప్రత్యేక సాయుధ దళాల చట్టాల ప్రకారం మాత్రమే వారెంట్లు లేకుండా పోలీసులు తనిఖీ చేయవచ్చు. అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఆదాయం పన్ను చట్టంలో కూడా ఇలా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆదాయం పన్ను చట్టంలోని 132 సెక్షన్ కింద కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పరిధిలో ఇండియన్ రెవెన్యూ సర్వీసుకు చెందిన ఓ స్థాయి ర్యాంకు అధికారులకు పన్ను ఎగవేత కేసులను విచారించే అధికారమూ, తనిఖీలు నిర్వహించే అధికారమూ ఉంది. ఈ తరహా తనిఖీలు ఎన్నికల సమయాల్లోనూ.... ఎన్నికల సందర్భంగా కూడా పోలీసులు భారీ ఎత్తున డబ్బును పట్టుకున్నారన్న వార్తలను మనం తరచుగా వింటుంటాం. ఈ విషయంలో పోలీసులను ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నామని పోలీసులు, స్వేచ్ఛగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత తమది కావడమే కాకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జిల్లా యంత్రాంగం అంతా తమ పరిధిలో ఉంటుంది కనుక ఇలాంటి ఆదేశాలను పోలీసులకు జారీ చేయడం సబబేనని ఎన్నికల కమిషన్ వాదిస్తూ వచ్చింది. అయినా ఇలాంటి తనిఖీలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కుగానీ, తనిఖీచేసే అధికారం పోలీసులకుగానీ లేదని దేశంలోని పలు కోర్టులు పలుసార్లు మందలించినప్పటికీ ఇలాంటి తనిఖీలు ఆగడం లేదు. కోర్టుకెక్కిన వ్యాపారల సంఘం... నగదు మార్పిడి ద్వారా లావాదేవీలు నిర్వహించే వ్యాపారవేత్తలు ఎన్నికల సందర్భంగా పోలీసులకు డబ్బుతో పట్టుబడడం, ఆ తర్వాత వారు కోర్టు నుంచి నిర్దోషులుగా విడుదలవడం తరచు జరగుతూ వచ్చింది. పోలీసులు, ఎన్నికల కమిషన్ అధికారుల బెడద పడలేక ‘భాగ్యోదయ్ జన్‌పరిషద్’ సంస్థ గుజరాత్ హైకోర్టులో సవాల్ చేయగా 2012లో కీలకమైన తీర్పును వెలువరించింది. అన్ని ప్రాంతాలకు తిరిగే హక్కు ఉంది... ‘భారీ ఎత్తున నగదు, విలువైన వస్తువులను తీసుకెళుతున్నారన్న అనుమానంపై అహేతుకంగా ప్రజల వాహనాలను ఆపరాదు, తనిఖీ చేయరాదు. రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద ఓ సామాన్యుడికి సైతం దేశంలోని అన్ని ప్రాంతాలకు తిరిగే హక్కు, స్వేచ్ఛ ఉంది. సామాన్యుల ప్రయాణాన్ని నియంత్రిడం లేదా ఆంక్షలు విధించడం చేయరాదు. ఎన్నికలను స్వేచ్ఛగా, సముచితంగా నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్‌దన్న విషయాన్ని మేము అర్థం చేసుకుంటాం. అయినప్పటికీ ఇక్కడ పౌరుల స్వేచ్ఛ ముఖ్యం, కమిషన్ ఆదేశించినప్పటికీ ఏ రాజకీయ పార్టీతోగానీ, ఎన్నికలతోగానీ సంబంధం లేని వ్యక్తుల వాహనాలను తనిఖీ చేయరాదు. ఏ పౌరుడికి ప్రాథమిక హక్కులు అప్రతిహతం కాదని మేము విశ్వసిస్తున్నప్పటికీ ఓ పౌరుడిపై ఎలాంటి ఆంక్షలు విధించాలనుకున్నా అవి చట్టం పరిధికే లోబడి ఉండాలి’ అని హైకోర్టు బెంచీ తీర్పు చెప్పింది. ఈ తీర్పు సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఓట్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు పంచుతున్నారని తెలిస్తే భారతీయ శిక్షాస్మతిలోని 171 బీ కింద వాహనాలను తనిఖీ చేసే అధికారం పోలీసులకు ఉంది. అయితే ఇది ‘కాగ్నిజబుల్’ నేరం కాదు కనుక కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. దీన్ని ‘కాగ్నిజబుల్’ నేరంగా చట్టాన్ని సవరించాలంటూ ఎన్నికల కమిషన్ చేసిన సిఫార్స్ కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంగా చట్టానికి విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం పోలీసులకే కాదు, ఏ అధికారికి లేదు. (వివిధ సందర్భాల్లో న్యాయనిపుణులు, కోర్టులు వ్యక్తం చేసిన అభిప్రాయాల సమాహారమే ఈ వార్తాకథనం) -
నవ వధువు హత్య?
- కట్నంగా పెద్ద నోట్లు ఇచ్చిన కన్నవారు - కొత్త నోట్లే కావాలని పట్టుబట్టిన అత్తింటివారు - దీంతోనే హత్యచేశారంటున్న మృతురాలి తల్లిదండ్రులు బరంపురం: పాత నోట్లు నూతన వధువును బలిగొన్నాయి. ఒడిశాలోని గంజాం జిల్లా రొంగిపూర్‌లో నూతన వధువు మృతి అనుమానాలకు తావిస్తోంది. బరంపురానికి పది కిలోమీటర్ల దూరంలో గల రొంగిపూర్ గ్రామంలోని బొడవీధికి చెందిన శిబ మండల కుమార్తె పార్వతి, అదే వీధిలో ఉంటున్న లక్షీ్ష్మనాయక్‌తో ఈనెల 9న వివాహం జరిపించారు. కట్నం కింద రూ.1.60 లక్షల నగదును పార్వతితో అత్తవారింటికి పంపించారు. ఆ నగదు రద్దరుున పెద్ద నోట్లే కావడంతో అత్తింటివారు నిరాకరించారు. తమకు కొత్త నోట్లే కావాలని పట్టుబట్టడంతో శిబమండల కొంత గడువు కోరి పార్వతిని అత్తవారింటికి పంపించారు. సోమవారం మధ్యాహ్నం పార్వతి ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం రావడంతో తల్లిదండ్రులు లక్షీ్ష్మనాయక్ ఇంటికి వచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పార్వతి ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా, హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతి భర్త లక్షీ్ష్మనాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని ఎస్పీ ఆశిష్‌కుమార్‌సింగ్ తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
పెద్ద నోట్ల రద్దు ప్రభావం బ్యాంకులకు ప్రాణసంకటం!
• ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్ అవుతున్న పాత నోట్లు • రుణాలివ్వటానికి బ్యాంకుల వద్ద కొత్తనోట్లు లేవు • ఇపుడున్న పరిస్థితుల్లో తీసుకునేవారూ కరువే • వ్యాపారం చేయకున్నా ఈ డిపాజిట్లపై వడ్డీ చెల్లించాలి • ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడు • కొన్నాళ్లు ఇవే పరిస్థితులు కొనసాగితే బ్యాంకులకు ఇబ్బందే! సాక్షి, బిజినెస్ విభాగం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తొలి ఒకటి రెండు రోజుల్లో భారతీయ బ్యాంకింగ్ రంగంలో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. బ్యాంకు షేర్లు ఇక తారాజువ్వల్లా ఎగురుతాయని ఇన్వెస్టర్లు భావించారు. దానికి తగ్గట్లే అంతర్జాతీయ సంస్థలు, అనలిస్టులు అంతా... ‘‘ఇంకేముంది! అందరూ తమ పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. చాలామంది సేవింగ్స ఖాతాల్లోనే డిపాజిట్ చేస్తారు గనక బ్యాంకింగ్ వ్యవస్థలోకి విపరీతమైన డబ్బులొస్తారుు. అవి వాటిపై సేవింగ్స వడ్డీనే చెల్లిస్తారుు కనక వాటికి అతితక్కువ ఖర్చుకు బోలెడంత డబ్బు అందుబాటులోకి వస్తుంది. ఇది బ్యాంకింగ్‌కు శుభ సమయం’’ అంటూ ఊదరగొట్టేశారు. అనుకున్నట్లే తొలి రెండు మూడు రోజులు బ్యాంకు షేర్లు రివ్వుమన్నారుు. కాకపోతే... ఆ తరవాత మెల్లగా తత్వం బోధపడింది. అందరికీ విషయం అర్థమైంది. ఫలితం... బ్యాంకు షేర్ల పతనం మొదలైంది. భవిష్యత్తు చాలా ఇబ్బందికరం!! నిజానికిపుడు సమస్యల్లా బ్యాంకు షేర్లు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్నది కాదు. అసలు బ్యాంకులు మున్ముందు ఏమవుతాయా..? అన్నది. ఎందుకంటే ఇపుడు బ్యాంకుల ముందున్నది చాలా చిత్రమైన సమస్య. బ్యాంకింగ్ రంగం పుట్టినప్పటి నుంచీ వాటికెప్పుడూ ఎదురుకాని సమస్య. అదేమంటే... పాత నోట్లన్నీ ఇపుడు జనమంతా బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్ల వరకూ జమరుునట్లు బ్యాంకులు చెబుతున్నారుు. ఇంకా డిసెంబరు 31 వరకూ... అంటే దాదాపు 32 రోజుల సమయం ఉంది. ప్రభుత్వం ఆశిస్తున్నట్లే జరిగినా కూడా కనీసం రూ.11-12 లక్షల కోట్లు జమవుతారుు. వీటిని జనం వెనక్కి తీసుకోవటానికి ప్రస్తుతం ఏ బ్యాంకు దగ్గరా నగదు అందుబాటులో లేదు. మరో ఐదారు నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా అంచనాలున్నారుు. వడ్డీ ఎలా చెల్లిస్తారుు? సరే!! తమ వద్ద డిపాజిట్టరుున డబ్బులకు బ్యాంకులు వడ్డీ ఇవ్వాలి కదా!!. సేవింగ్స ఖాతా వడ్డీ చూసినా 4 శాతంగా ఉంది. ఎస్బీఐ వంటి దిగ్గజాలు ఇదే వడ్డీ చెల్లిస్తున్నా... కస్టమర్లను ఆకట్టుకోవటానికి కొన్ని బ్యాంకులు ఇంతకన్నా కాస్త ఎక్కువ కూడా చెల్లిస్తున్నారుు. కాకపోతే డిపాజిట్దారులంతా తమ సేవింగ్స ఖాతాల్లోనే డబ్బులు వేశారనుకోలేం. కొందరైతే 7-7.5 శాతం వడ్డీకి టర్మ్ డిపాజిట్లు కూడా చేస్తున్నారు. వీరికి వడ్డీ చెల్లించాలంటే బ్యాంకులు వ్యాపారం చెయ్యాలి. వ్యాపారమంటే రకరకాల రుణాలివ్వాలి. అసలు బ్యాంకుల దగ్గర కొత్త నోట్లే లేనపుడు అవి రుణాలెలా ఇస్తారుు? డీడీ రూపంలోనో, చెక్కుల రూపంలోనో రుణాలిస్తే... నగదు తీసుకునే అవకాశం లేదు కనక ఇపుడెవరు తీసుకుంటారు? ఎందుకంటే ఎవరైనా రుణాలు తీసుకునేది ఖర్చుల కోసమే. ఖర్చుల్లో చాలావరకూ నగదుతోనే ముడిపడి ఉంటారుు తప్ప అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో చేసేవి కావు. అందుకని రుణాలిచ్చినా తీసుకోవటానికిపుడు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. మరో ఆరేడు నెలలు ఇదే పరిస్థితి ఉంటే అప్పటిదాకా అవి రుణాలివ్వలేవు కదా!!. రుణాలివ్వనపుడు వాటికి ఆదాయం ఎలా వస్తుంది? ఆదాయం రాకపోతే అవి వడ్డీ ఎలా చెల్లిస్తారుు? సగటున కనీసం 6 శాతం వడ్డీ చూసుకున్నా... ఆరు నెలలకు కనీసం రూ.3వేల కోట్లు వడ్డీ చెల్లించాలి కదా!!. అసలు వడ్డీ మాట పక్కనబెడితే... బ్యాంకుల నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు చెల్లించాలంటే అవి ఏం చేస్తారుు? కొన్ని వేల కోట్లను ఎక్కడి నుంచి తెస్తారుు? ఇప్పటికే విపరీతమైన మొండి బకారుుల భారంతో నష్టాలు చూపిస్తున్న బ్యాంకుల భవిష్యత్తేంటి? సీఆర్ఆర్ కింద పెడితే పరిస్థితేంటి? బ్యాంకులు తమ వద్ద సెప్టెంబర్ 16-నవంబర్ 11 మధ్య డిపాజిట్ అరుున సొమ్ము ను రిజర్వు బ్యాంకు వద్ద సీఆర్ఆర్ కింద పెట్టాలని రెండురోజుల కిందట ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆదేశాలు జారీచేశారు. సీఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన సొమ్మన్న మాట. అలా పెడితే దానికి వడ్డీ రాదు. మరి బ్యాంకులకే వడ్డీ రానపుడు అవి కస్టమర్లకెలా చెల్లిస్తాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మరో కోణంలో చూస్తే.. నోట్ల రద్దు దెబ్బకు ఇప్పటికే చాలా వ్యాపారాలు మందగించారుు. కాస్త పరిస్థితి సర్దుకున్నాక ఓ ఆరేడు నెలల తరవాతైనా బ్యాంకుల చేతికి పూర్తి స్థారుులో నగదు వస్తే అవి రుణాలివ్వటం మొదలెడతారుు. రుణాలు తీసుకున్నవారు తమ వ్యాపారాల్ని మళ్లీ పూర్తిస్థారుులో పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుంది. మరి ఆలోగా వారు వారుుదాలు చెల్లిస్తారా? ఒకవేళ చెల్లించని పరిస్థితులు నెలకొంటే మళ్లీ ఎన్పీఏల భారం పెరుగుతుంది కదా? ఇదంతా చూస్తుంటే బ్యాంకుల భవిష్యత్తుపై ఆందోళన కలగటం లేదూ!!? -
నోట్ల మార్పిడి చేస్తున్న నలుగురు అరెస్టు
కోరుట్ల: రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోట్ల మార్పిడి అనుమానంతో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్, పెరికిట్‌లలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన వ్యాపారి చింతా సంతోష్ పేరు చెప్పారు. దీంతో ఆయన ఇంట్లో సోదా చేయగా రూ. 26 లక్షల విలువ గల పాత నోట్లు, రూ. 76 వేల విలువ గల కొత్త నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దనోట్ల మార్పిడి చేస్తున్న ముఠా అరెస్ట్
పెద్దపల్లి: 30 శాతం కమీషన్‌కు పాత నోట్లు మార్చి కొత్తనోట్లు ఇస్తామని మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంగా పాత పెద్ద నోట్లను తీసుకొని రెండు వేల రూపాయల నోట్లు చేస్తున్న వారిపై దృష్టి సారించిన పోలీసులు ఏడుగురు సభ్యుల ముఠాను ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. పెద్దపల్లికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.కోటి మార్చడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ముఠా సభ్యులు తొలి విడుతగా రూ.10 లక్షలు ఇస్తుండగా పట్టుకుని నగదును సీజ్ చేశారు. -
నేటి రాత్రి వరకే పాత నోట్లకు గడువు
-
పాత నోట్లపై మళ్లీ మెలిక
► కేంద్రం ప్రకటించినా..పాత నోట్లు తీసుకోని విత్తన పంపిణీ కేంద్రాలు ►జీవో రాలేదని రైతులను తిప్పి పంపిన అధికారులు ►జరుగుమల్లి విత్తన కేంద్రం వద్ద ఆందోళన ►పట్టించుకోని జిల్లా అధికారులు ఒంగోలు టూటౌన్ : పాత నోట్లతో అటు పాలకులు.. ఇటు అధికారులు రైతులను అగచాట్లు పాలు చేస్తూనే ఉన్నారు. రబీ సీజన్లో అష్టకష్టాలు పడుతూనే సేద్యానికి సన్నద్ధమవుతున్న రైతులకు పాత నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నారుు. ఒక సారి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తా రు.. మరోసారి తీసుకోమని ఉత్తర్వులు ఇస్తారు. ఇలా అన్నదాతలను పాలకులు అడుకుంటున్నారు. ఇటీవల పాత నోట్లు తీసుకోవద్దని ఇచ్చిన ఆదేశాలతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం దిగొచ్చింది. వెంటనే సోమవారం రైతుల వద్ద పాత నోట్లు రూ.500, రూ.1000 తీసుకోవాలని ప్రకటిం చింది. దీంతో ఊరట చెందిన రైతులు మంగళవారం విత్తన కేంద్రాల వద్దకు పాత నోట్లు తీసుకువెళ్లారు. అక్కడ అధికారులు పాత నోట్లు తీసుకోకపోగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వలు గాని జీవోగాని రాలేదు. మేము తీసుకోమని ఖరాఖండిగా చెప్పడంతో రైతులు ఖంగు తిన్నారు. మండల కేంద్రాల్లో విత్తన కేంద్రాల వద్ద పాత నోట్లు తీసుకోకపోవడంతో ఒంగోలులోని విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయానికి కొంతమంది రైతులు వచ్చారు. జిల్లా ఏపీ సీడ్స మేనేజర్ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. పాత నోట్లు తీసుకోమని ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని రైతులకు చెప్పడంతో చేసేదేం లేక వెనుదిరగాల్సి వచ్చిందని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుమల్లిలో.. జరుగుమల్లి మండలంలోని విత్తన కేంద్రం వద్ద పాత నోట్లతో నిరసనకు దిగారు. ప్రభుత్వ పాత నోట్లు తీసుకోమని ప్రకటించినా.. అధికారులు కనికరించడం లేదని ఆందోళన చేశారు. దేవుడు వరమిచ్చినా.. పూజారి వరం ఇవ్వలేదన్న సామెతగా పాలకుల తీరు ఉందని ఆవేదన చెందారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించ లేదని రైతు సంఘ నేతలు తెలిపారు. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతుల వద్ద పాత నోట్లు తీసుకోవాలని ప్రకటిస్తే.. అధికారులు ఉత్తర్వులు రాలేదని మెలిక పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా అరుుతే విత్తనాలు లేకుం డా సేద్యం ఎలా చేయాలని రైతులు మండిపడుతున్నా రు. బుధవారం కూడా ఇదే పరిస్థితి రైతులకు ఎదురైతే జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు నిరసనకు దిగే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కారించాలని రైతు సంఘాలు కోరుతున్నారుు. -
డీసీసీబీల్లో పాత నోట్లు తీసుకోవాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రద్దు చేసిన రూ.1,000, రూ.500 నోట్లను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో మార్చుకోడానికి వీలు కల్పించాలని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ విజ్ఞప్తి చేసింది. ఈ నెల 8 నుంచి 14 వరకు సహకార బ్యాంకుల్లో పాత నోట్ల మార్పితో పాటు ఇతర లావాదేవీలు జరిగినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆకస్మికంగా లావాదేవీలు రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చిందని, దీంతో లావాదేవీలు నిలిచి ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకులు, అర్బన్ బ్యాంక్, పోస్టాఫీసులకు వెసులుబాటు కల్పించి సహకార బ్యాంక్‌ల్లో లావాదేవీలు రద్దు చేయడం సహకార వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. సహకార బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తూ రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా రైతులకు రుణాలిస్తున్నా యని.. సేవింగ్, కరెంట్ ఖాతాల లావాదేవీలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. -
RBI వద్ద పిల్లలతో పాత నోట్ల మార్పిడి దందా
-
దొంగను పట్టించిన పాత నోట్ల మార్పిడి
- బ్యాంకులో మార్చుకునేందకు వచ్చి పట్టుబడిన వైనం పాత నోట్ల మార్పిడితో బ్లాక్‌మనీ ఎంత బయటపడుతుందో ఏమో కానీ గతంలో చోరీకి పాల్పడిన ఓ దొంగ మాత్రం పోలీసులకు చిక్కాడు. దాదాపు ఐదు నెలల క్రితం ఇంట్లో రూ. 2 లక్షలు అపహరించిన వ్యక్తి ఇప్పటి వరకు కొంత ఖర్చు చేయగా మిగతా నోట్ల మార్చుకునేందుకు బ్యాంకు వద్దకు వచ్చి పోలీలకు దొరికాడు. ఈ ఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. - కర్నూలు కల్లూరులోని గీతానగర్‌లో నివాసముంటున్న సత్యనారాయణ కుమారుడు సాయి విజయ్‌కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఫైనాన్స్‌లో ఆటో కొనుగోలు చేసి నగరంలో నడుపుతున్నాడు. ఇదే క్రమంలో జల్సాలకు అలవాటుపడి ఆటో ఫైనాన్స్ చెల్లించలేక అప్పుల పాలయ్యాడు. రుణాన్ని తీర్చేందుకు చోరీకి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం, జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్‌లో సబ్ పోస్టుమాస్టరుగా పని చేస్తున్న చంద్రునాయక్ కర్నూలు నిర్మల్‌నగర్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. 2016 జూన్ 3వ తేదీన తన మామ నానునాయక్ రూ.2 లక్షలు అప్పు ఉండటంతో చెల్లించాడు. ఆ మొత్తంతో పాటు బ్యాంకు పాసుబుక్కులు, పోస్టల్ ఆర్డీ బుక్కులు, ఏటీఎం కార్డులు బ్యాగులో పెట్టుకొని అదే రోజు రాత్రి నిర్మల్‌నగర్‌లో ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో బ్యాగును మంచంమీద పెట్టి తలుపులు తెరిచి ఉంచి నిద్రపోయాడు. అదే సమయంలో అక్కడికి సమీపంలో ప్రయాణికుడిని దించేందుకు వెళ్లిన ఆటో డ్రైవర్ సాయి విజయకుమార్ ఇంటి తలుపులు తెరిచి ఉంచడం గమనించి ఇంట్లోకి వెళ్లాడు. మంచం మీద బ్యాగును తీసుకుని ఉడాయించాడు. బ్యాగ్‌లో ఉన్న డబ్బును తీసుకుని మిగతా వస్తువులతో పాటు బ్యాగును కేసీ కెనాల్లో పారవేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తులో చేపట్టారు. ఇలా దొరికాడు: దొంగలించిన సొమ్ముతో అప్పులు కట్టుకోవడంతో పాటు అవసరాలకు ఖర్చు పెట్టాడు. అతని దగ్గర రూ. 83 వేలు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద నోట్లు మార్పిడి చేసుకోవాల్సి రావడంతో సోమవారం కృష్ణానగర్ జంక్షన్‌లోని ఎస్బీఐ వద్దకు చేరుకున్నాడు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించడంతో గస్తీలో ఉన్న నాలుగో పట్టణ సీఐ నాగరాజురావు, సిబ్బంది సాగర్, శ్రీను, ఆచారి తదితరులు అతడిని విచారించారు. రూ. 83 వేలకు ఆధారాలు చూపాలని నిలదీయడంతో జూన్ నెలలో నిర్మల్‌నగర్‌లో చంద్రూనాయక్ ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరు పరిచారు. -
కారులో రూ. 1000 నోట్ల కట్టలు స్వాధీనం
ముంబై: ఇద్దరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల నుంచి ముంబై పోలీసులు కోటి రూపాయల విలువైన పెద్ద నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో 1000 రూపాయల నోట్లను తీసుకెళ్తుండగా క్రైం బ్రాంచ్ పోలీసులు పట్టుకుని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు రద్దయిన పాత నోట్లను మార్చుకుని కొత్త 2000 రూపాయల నోట్లు తీసుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత నోట్లను మార్చి కొత్త నోట్లు ఇస్తామని, ఇందుకోసం 30 శాతం కమిషన్ ఇవ్వాలని వీరిద్దరూ ఏజెంట్లకు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ప్రసాద్ పాటిల్, హరిశ్చంద్ర షిండే, ప్రమోద్ పదాలె, అవివాష్ జైన్‌లుగా గుర్తించారు. -
పాతనోట్లు నిరాకరిస్తున్న పెట్రోల్ బంకులు