నవ వధువు హత్య?
- కట్నంగా పెద్ద నోట్లు ఇచ్చిన కన్నవారు
- కొత్త నోట్లే కావాలని పట్టుబట్టిన అత్తింటివారు
- దీంతోనే హత్యచేశారంటున్న మృతురాలి తల్లిదండ్రులు
బరంపురం: పాత నోట్లు నూతన వధువును బలిగొన్నాయి. ఒడిశాలోని గంజాం జిల్లా రొంగిపూర్‌లో నూతన వధువు మృతి అనుమానాలకు తావిస్తోంది. బరంపురానికి పది కిలోమీటర్ల దూరంలో గల రొంగిపూర్ గ్రామంలోని బొడవీధికి చెందిన శిబ మండల కుమార్తె పార్వతి, అదే వీధిలో ఉంటున్న లక్షీ్ష్మనాయక్‌తో ఈనెల 9న వివాహం జరిపించారు. కట్నం కింద రూ.1.60 లక్షల నగదును పార్వతితో అత్తవారింటికి పంపించారు. ఆ నగదు రద్దరుున పెద్ద నోట్లే కావడంతో అత్తింటివారు నిరాకరించారు. తమకు కొత్త నోట్లే కావాలని పట్టుబట్టడంతో శిబమండల కొంత గడువు కోరి పార్వతిని అత్తవారింటికి పంపించారు.
సోమవారం మధ్యాహ్నం పార్వతి ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం రావడంతో తల్లిదండ్రులు లక్షీ్ష్మనాయక్ ఇంటికి వచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పార్వతి ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా, హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతి భర్త లక్షీ్ష్మనాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని ఎస్పీ ఆశిష్‌కుమార్‌సింగ్ తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.