కేటుగాళ్లకు కొత్త నోట్లు
Published Sat, Dec 3 2016 2:19 AM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గంటల తరబడి క్యూలో నిలబడితే.. చివరకు బ్యాంకర్లు దయతలిస్తే సామాన్యుడి చేతికొచ్చేది మహా అయితే రెండు రూ.2 వేల నోట్లు మాత్రమే. బ్యాంకు ఏటీఎం ఎదుట క్యూలో నిలబడితే వచ్చేది రోజుకు ఒక్కటే నోటు. బాగా పలుకుబడి ఉంటేగాని బ్యాంకులో మూడు నాలుగు నోట్లు తీసుకోవడం సాధ్యం కాదు. ఇదీ వాస్తవ పరిస్థితి. కానీ.. కొంతమంది వద్ద లక్షలాది రూపాయల విలువ చేసే కొత్త నోట్ల కట్టలు ఉంటున్నాయి. పకడ్బందీగా ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు చేరాల్సిన ఈ నోట్లు బయటకు ఎలా వస్తున్నాయన్నది అంతుబట్టడం లేదు. బ్యాంకుల సిబ్బంది, మేనేజర్ల సహకారం లేకుండా ఒక్క నోటు కూడా బయటకు రాదన్నది బహిరంగ రహస్యమే. జిల్లాలో మాత్రం చాలా సునాయాసంగా రూ.2 వేల నోట్ల కట్టలు బయటకు వచ్చేస్తున్నాయి. బ్యాంకు మేనేజర్‌కు, సిబ్బందికి 20 నుంచి 30 శాతం కమీష¯ŒS ఇస్తే ఎన్ని కావాలంటే అన్ని లక్షలు మార్చుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి జిలావ్యాప్తంగా ఉన్నట్టు ఇటీవలి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. వారం క్రితం రూ.24 లక్షల రూపాయలు మార్చుకునేందుకు యత్నించిన వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. విజయవాడకు చెందిన విజయ్ అగర్వాల్‌తోపాటు, కార్ యాక్ససరీస్ పనిచేసే అంచెల రవికుమార్ సహా 8మంది పోలీసులకు పట్టుబడ్డారు. అగర్వాల్, రవికుమార్ అనేవారికి ఏలూరులో మెకానిక్‌గా పనిచేసే రవితో పరిచయం ఉంది. అతను నాలుగు శాతం కమీష¯ŒSకు పాత నోట్లు మార్చుకుంటానని చెప్పడంతో వారు ఏలూరు వచ్చారు. సోమవరప్పాడు పొలాల్లో ఉండగా పోలీసులకు అందిన సమాచారంతో వారిపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రూ.24 లక్షల నగదు స్వా«ధీనం చేసుకున్నారు. అయితే డబ్బులు మార్చుకునేవారు మాత్రం పట్టుపడలేదు. సుమారు రూ.రెండు కోట్లు మార్చుకునేందుకు డీల్ కుదిరిందని, ఈ ప్రయత్నంలో వారు పోలీసులకు పట్టుబడినట్లు ప్రచారం జరిగినా సూత్రధారులు బయటకు రాలేదు. పోలీసులు డబ్బులు దొరకగానే కేసు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూత్రధారులను పట్టుకునే ప్రయత్నం వారి నుంచి లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా గురువారం రాత్రి ఏలూరు వ¯ŒSటౌ¯ŒSలోని సూర్యా అపార్ట్‌మెంట్‌లో ఎలబాక బాలకృష్ణ సహా ఐదుగుర్ని అరెస్ట్ చేసి రూ.19 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ వడ్రంగి మేస్రి్తగా పని చేస్తున్నాడు. అతని వద్ద అంత డబ్బు ఉండే అవకాశం లేదు. తాను వేర్వేరు వ్యక్తుల వద్ద అప్పు తీసుకున్నానని బాలకృష్ణ చెబుతున్నాడు. అప్పు తీసుకున్నా రూ.2 వేల కొత్త నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అతని ఇంటిపక్కనే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ఉండటంతో అందులో పనిచేసే సిబ్బంది ద్వారా ఈ డబ్బులు బయటకు వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును కూడా గాలికి వదిలివేయకుండా లోతుగా దర్యాప్తు చేస్తే నోట్ల మార్పిడి వెనుక సూత్రధారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం తాడేపల్లిగూడెంలో పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తుండగా మాడెం గోపీకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.3.56 లక్షల విలువైన రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను లక్షకు 12 శాతం కమీష¯ŒSకు పాత నోట్లు మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Advertisement
Advertisement