పాతనోట్ల మార్పిడి నో చెప్పిన సుప్రీం | Cooperative Bank Seeks To Exchange 371 Crores In Old Notes, Supreme Court Says No | Sakshi
Sakshi News home page

పాతనోట్ల మార్పిడి నో చెప్పిన సుప్రీం

Published Tue, Mar 28 2017 8:45 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

పాతనోట్ల మార్పిడి నో చెప్పిన సుప్రీం - Sakshi

పాతనోట్ల మార్పిడి నో చెప్పిన సుప్రీం

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత ధర్మాసనం నాసిక్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు  షాకిచ్చింది. రద్దయిన  పెద్దనోట్లను భారీమొత్తంలో డిపాజిట్‌ చేయడానికి అనుమతిని సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.371కోట్ల పాత కరెన్సీనోట్ల మార్పిడికి అనుమతించాల్సిందిగా పెట్టుకున్న మధ్యంతర పిటిషన్ను కొట్టి పారేసింది.  చీఫ్ జస్టిస్ జేఎస్‌ ఖేహర్‌  నేతృత్వంలోని ధర్మాసనం  సోమవారం ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలో  ఆర్టికల్‌32 ప్రకారం ఈ పిటిషన్‌ తిరస్కరిస్తున్నట్టు వ్యాఖ్యానించింది.   నోట్ల జమకు ఆర్‌బీఐ నిరాకరించిడంతో కో ఆపరేటివ్‌ బ్యాంకు సుప్రీంను ఆశ్రయించింది.  ఈ పిటిషన్ను పరిశీలించిన  సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. 

ఈ నోట్ల జమ​కు అనుమతిని నిరాకరిస్తే..లిక్విడిటీ రేషియో దెబ్బతింటుందని,  తద్వారా నాసిక్‌ జిల్లాలో  281 తమ కార్యాలయాలు  మూతపడతాయని బ్యాంకు వాదించింది. 2016, నవంబర్‌ 8-14 మధ్య తమ ఖాతాదారులు జమ  చేసిన సొమ్ము  ఇది అనీ, ఎక్కువగా రైతులకు రుణాలను అందించే  బ్యాంకు శాఖలు మూసివేత తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందన్న బ్యాంకు వాదించింది.   కోఆపరేటివ్‌ బ్యాంకు తరపున  సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ వాదనలను వినిపించారు.

ఇది ఇలా ఉంటో మరోకేసులో కూడా రద్దయిన నోట్ల డిపాజిట్‌కు ఎపెక్స్‌ కోర్టు నో చెప్పింది.  ఇప్పటికే ఎన్‌పీఏగా  ప్రకటించిన రాను ఎంటర్‌  ప్రైజెస్‌  లిమిటెడ్‌ కు చెందిరన రూ. 10కోట్లను  పాత కరెన్సీమార్పిడికి  అనుమతిని నిరాకరించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement