no
-
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!అలా చేయడం మంచిదేనా?
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ భారీ బడ్జెట్ మూవీ 'షెహజాదా'తో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఆ తర్వాత 'సత్యప్రేమ్‌కి కథ'తో ప్రేక్షకుల మన్ననలను పొంది నెమ్మది నెమ్మదిగా పరిశ్రమలో నిలదొక్కుకునే యత్నం చేశాడు. మళ్లీ అలానే మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. ఆ నేపథ్యంలోనే ప్రఖ్యాత దర్శకుడు కబీర్ ఖాన్ నిర్మిస్తున్న 'చందు ఛాంపియన్' మూవీతో మన ముందుకొస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఈ మూవీ షూటింగ్ ఒక ఏడాదికి పైగా పట్టింది. పగలు, రాత్రి అనక జరిగిన నిర్విరామ షూటింగ్లో హీరో ఆర్యన్ చక్కెర జోలికే పోలేదట. ఈ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి అవ్వడంతో దర్శకుడు కబీర్ సింగ్ ఇప్పుడైన నోరీ తీపి చేసుకోమంటూ రసమమలై తీసుకొచ్చి హీరో ఆర్యన్‌కి తినిపించాడు. ఈ మూవీ షూటింగ్ ఎంతలా విజయవంతంగా పూర్తి అయ్యిందో, అలానే ఈ మూవీ నీకు మంచి పేరు తెచ్చిపెడుతుందంటూ ఆర్యన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. ఆర్యన్ తన కొత్త సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు అంటే..దాదాపు ఏడాదికి పైగా చక్కెర లేని ఆహారమే తీసుకున్నాడు. పైగా చక్కెరకు బదులు తాను సహజ ఉత్పత్తుల తీసుకున్నట్లు కొన్ని రహస్యాలు బయటపెట్టాడు. ఆ హీరోలా చేస్తే శరీరంలో సంభవించే మార్పేలేంటి తదితరాల గురించి తెలుసుకుందామా!. ఒక ఏడాది పాటు ఆ హీరోలా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఎవ్వరైన దీన్ని ప్రయ్నతించవచ్చా?. ఈ డైట్ కారణంగా శరీరంలో ఎలా ప్రభావితమవ్వుతుంది, ఇది మంచిదేనా? అంటే..పూర్తిగా చక్కెరకు దూరంగా ఉండటం లేదా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరం అనేక సానుకూల మార్పులకు దారితీస్తుంది. మొదట్లో ఈ డైట్ పాటించటం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. క్రమేణ మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ సమ స్థాయిల్లో ఉండటం జరగుతుంది. తద్వారా మానసికోల్లాసం ఏర్పడి జీవక్రియ మెరుగుపడుతుంది. ఒబెసిటీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మొటిమలు తగ్గి నిత్య యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ డైట్ వల్లే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో సవివిరంగా చూద్దాం!. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది: ఒక టీస్పూన్ చక్కెరలో 20 కిలో కేలరీలు ఉంటాయి. కాబట్టి ఈ చక్కెరను పూర్తిగా దూరంగ పెట్టగలిగితే ఇన్సులిన్ సెన్సిటివిటీకీ సహాయపడుతుంది. టైప్ 2 డయబెటిస్ రాకుండా చేస్తుంది. ఒక రకంగా దంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధులు దరిచేరవు. ఎప్పుడైతే పరిమిత కేలరీలు తీసుకుంటామో అప్పుడూ ఆటోమెటిక్‌గా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది: చక్కెర వినియోగం ఎప్పుడైతే తగ్గిస్తామో.. ముందుగా మానసిక స్థితిలో మంచి మార్పులు వస్తాయి. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది తద్వారా మతిమరుపు వంటి బ్రెయిన్ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం ఏర్పడి తెలియని మానసికోల్లాసం వస్తుంది. నిజం చెప్పాలంటే చక్కెర వినియోచటం మానేయడం వల్ల చాలావరకు పాజిటివ్ మార్పులే చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభంలో పంచదార తీసుకోకపోతే నీరసంగా అనిపిస్తుంది. ఎలాగైతే ఆల్కహాల్ అకస్మాత్తుగా వదిలేస్తే సమస్యలు ఎదురవ్వుతాయో అలాంటి లక్షణాలే పంచాదర మానేసిన వారిలోనూ కనిపిస్తాయట. అంతేగాదు నీరసం తోపాటు మానసికంగా కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుందట. అయితే శరీరంలో మెటబాలిజం మాత్రం పెరుగుతందట. ఫలితంగా ఎలాంటి దీర్ఘాకాలిక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇక్కడ చక్కెరను తగ్గించడం అంటే దానికి బదులుగా బెల్లం లేదా కృత్రిమ స్వీటెనర్లతో భర్తీ చేయడం కాదు. చక్కెర, బెల్లం రెండూ సమాన కేలరీలను కలిగి ఉంటాయనే విషయం గుర్తించుకోవాలి. అందువల్ల మనం తీసుకునే స్వీట్లు, పానీయాలు, శక్తి పానీయాలు వంటి వాటిల్లోని షుగర్ కంటెంట్ దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటేనే మంచింది. అలాగే ఈ నో షుగర్ డైట్‌ని ఫాలో అయ్యే మందు ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణుడిని సంప్రదించి వారి మార్గదర్శకంలో సరైన విధంగా ఈ డైట్‌ని ఫాలో అయ్యి సత్ఫలితాలను పొందడం మంచిది. ఏదీఏమైన చక్కెరను పరిమిత చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చనేది వాస్తవం. (చదవండి: ఆ వాటర్ ఫాల్ 'ఓ కన్నతల్లి గుండె కోత'! ఇప్పటికీ రాత్రిళ్లు అక్కడకు వెళ్తే హడలిపోవాల్సిందే!) -
ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో నాకు సంబంధం లేదు
పాలమూరు: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌రావు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనతో రఘునందన్‌రావుకు సంబంధం ఉందని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని, అలాంటి ఘటనలు ప్రోత్సహించే వ్యక్తిని తాను కాదన్నారు. దాడి చేసిన గటాని రాజు అనే వ్యక్తికి దళితబంధు రాలేదని ఉద్దేశంతోనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందన్‌రావు చెప్పారు. రాజు ఫేస్బుక్ ఖాతాను పరిశీలిస్తే అతను కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు, ఇతర వివరాలు లభ్యమవుతాయని, అతని దగ్గర ఓ చానల్ ఐడీ కార్డు కూడా దొరికిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎవరెంత బురద చల్లినా దుబ్బాకలో తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. సిద్దిపేట సీపీ కేసు పరిశీలించి, అతని ఇతర అకౌంట్లు పరిశీలించి మాట్లాడాలి కానీ, మీరే బీజేపీ సానుభూతిపరుడని అని చెప్పడం సరికాదన్నారు. సీపీ మాట్లాడిన మాటలతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని రఘునందన్‌రావు ఆందోళన చెందారు. పాలమూరు నుంచి నేరుగా ఆస్పత్రి దగ్గరకు వెళ్లి చికిత్స పొందుతున్న ప్రభాకర్‌రెడ్డిని పరామర్శిస్తానని చెప్పారు. -
ఆ పార్టీలు చేతులు కలిపేనా? కాంగ్రెస్‌లో కొరవడిన స్పష్టత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత రావడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి (టీజేఎస్), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లతో ఈసారి పొత్తు కుదిరే అవకాశముందనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయం సమీపిస్తున్నా రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేకపోవడం, ఈ దిశగా ఎలాంటి తాజా కదలిక లేకపోవడంతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై పార్టీ కేడర్ గందరగోళానికి గురవుతోంది. ముఖ్యంగా సీపీఐ, సీపీఎంలతో పొత్తు విషయంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఆ పార్టీలతో గతంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగాయి. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌లో సీపీఐ నేత నారాయణతో మంతనాలు జరిపారు. కానీ ఇంతవరకు ఏమీ తేల్లేదు. కామ్రేడ్లు అడిగినట్టుగా భావిస్తున్న సీట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేయడంతో వామపక్షాలతో పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీనిపై అధిష్టానం వీలున్నంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, ఏదో ఒకటి త్వరగా తేల్చితేనే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, లేదంటే గత ఎన్నికల్లో మహాకూటమి పొత్తు లాగానే విఫలమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కూడా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు సంప్రదించాయి. ఢిల్లీ నుంచి ఆయనతో మంతనాలు జరిగాయని, ఈ సందర్భంగా పార్టీ విలీనం ప్రస్తావన వచ్చిందని, ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ప్రొఫెసర్.. పొత్తుకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పారని తెలిసింది. అయితే ఈసారి ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సూర్యాపేట, జహీరాబాద్, నర్సంపేట, ఎల్లారెడ్డి, గద్వాల, కోరుట్లపై ప్రధానంగా దృష్టి సారించామని, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే మిగిలిన చోట్లా తమకు అభ్యర్థులు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో బీఎస్పీతో సంబంధాలు ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. అయితే ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో కూడా చర్చలు ప్రారంభం కాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఈసారి పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీలో రెండు అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు వీలున్నన్ని తక్కువ స్థానాలు ఇచ్చి పొత్తు కుదుర్చుకుంటే మంచి ఫలితం వస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఏ పార్టీ తోనూ పొత్తు అవసరం లేదని, ఒంటరిగా ఎన్నికలకు వెళితేనే కచ్చితంగా మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకులకు సమాచారం లేకుండానే ఇతర పార్టీలతో చర్చలు జరుపుతుండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. -
మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ
ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 4కు వాయిదా వేసింది న్యాయస్థానం. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమాను కలుసుకునేందుకు మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భార్య ఆరోగ్యం క్షీణిస్తోందని ధర్మాసనానికి విన్నవించుకున్నారు. సిసోడియా తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. తన తరుపున వాదనలకు రెండు గంటల సమయం ఇవ్వాలని బెంచ్‌ను కోరారు. తమ క్లయింట్ అభ్యర్ధనపై తక్షణం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఢిల్లీ ఎక్సైజ్ పోర్టుఫోలియోను నిర్వహించే క్రమంలో మధ్యం కుంభకోణం జరిగిందని సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వర్తించారు. అయితే.. మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 26న సీబీఐ ఆయన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచీ కస్టడీలోనే ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ప్రభుత్వంలో తన పదవులకు సిసోడియా రాజీనామా చేశారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
'ఎన్నికల్లో పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదు'
తాడేపల్లి: ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు హడావుడి చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బీజేపీని తిట్టిన నోటితోనే చంద్రబాబు మళ్లీ పొగుడుతున్నారని మండిపడ్డారు. పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలని, పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదన్నారు సజ్జల. పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదు ప్రకటించిన మేనిఫెస్టో ఏంటో టీడీపీ వారికే గుర్తులేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు బపూన్కు ఎక్కువ .. జోకర్ కు తక్కువ అని దుయ్యబట్టారు. 2019 వరకు చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేయడానికి చంద్రబాబే సిద్ధంగా లేరని అన్నారు. ఆనాడు ప్రధాని మోదీ కుటుంబం గురించి చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారు.. ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ , బీజేపీని కీర్తిస్తున్నారని చెప్పారు. పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదని అన్నారు. 'నడ్డాతో చంద్రబాబు వంగి వంగి.. నంగి నంగి మాట్లాడారు. బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నారు. చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలే రావడం లేదు. ప్రజలను భ్రమలో పెట్టాలనుకుని వారే భ్రమలో బతుకుతున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ ను అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ నాణెం పేరిట లక్ష్మీపార్వతిని పిలవకుండా అయన ఆత్మకు క్షోభ పెట్టారు. ఈసారి రెండు వెన్నుపోట్లు చంద్రబాబు పొడిచారు. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి కలిసి బీజేపీతో కలిసేందుకు పైరవీలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై 70 శాతం మంది ప్రజలు పాజిటివ్ గా ఉన్నారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారు. టీడీపీ సొంతంగా ఎందుకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదు. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్ గా మారారు.' అని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: పురంధేశ్వరి సాయంతో చంద్రబాబు చీప్ పాలిటిక్స్: వెల్లంపల్లి వ్యాఖ్యలు -
రూ.6 చిల్లర ఇవ్వనందుకు 26 ఏళ్లుగా శిక్ష..
ముంబయి: ఆరు రూపాయలు చిల్లర తిరిగి ఇవ్వనందుకు ఓ రైల్వే క్లర్కుకు గత 26 ఏళ్లుగా ఉపశమనం లభించలేదు. విజిలెన్స్ టీం పంపిన వ్యక్తికి చిల్లర ఇవ్వని కారణంగా 26 ఏళ్ల క్రితం విధుల నుంచి తొలగించబడ్డారు. అనంతరం అప్పీలుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే టికెట్ క్లర్క్ రాజేశ్ వర్మ ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద పనిచేసేవారు. 1997 ఆగష్టు 30న విజిలెన్స్ టీం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను ప్యాసింజర్‌గా పంపి టికెట్ కొనుగోలు చేయించగా.. వర్మ బుక్కయ్యారు. సదరు ప్యాసింజర్ రూ.500 ఇవ్వగా.. టికెట్టు ధర రూ.214 పోగా మిగిలిన రూ.286 ఇవ్వాల్సి ఉంది. కానీ రాజేశ్ వర్మ రూ.280 ఇచ్చి చిల్లర ఇవ్వలేదు. విజిలెన్స్ అధికారులు చెక్ చేయగా.. ఆ రోజు వసూళ్లలో రూ. 58 మిస్ అయ్యాయి. అంతేకాకుండా ఆ క్లర్క్ వెనక ఉన్న అల్మారాలో రూ.450 ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాజేశ్ వర్మ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. క్రమశిక్షణా చర్యల కింద రాజేశ్ వర్మను జనవరి 31, 2002న విధుల నుంచి తప్పించారు. అయితే.. ఆ నిర్ణయాన్ని రాజేశ్ వర్మ సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లారు. చిల్లర రూ.6 లేనందుకే ఇవ్వలేకపోయాడని రాజేశ్ వర్మ తరుపున లాయర్ మిహిర్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. అల్మారాను రాజేశ్ వర్మతో పాటు ఉద్యోగులందరూ ఉపయోగిస్తారని తెలిపారు. చిల్లర ఇవ్వలేదనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అల్మారాకు ప్రవేశం ఉందని, అధిక ఛార్జీలు వసూలు చేశారనడానికి రుజువు ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజేశ్ వర్మ అప్పీలును తిరస్కరించింది. ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ.. -
ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకల్లేవ్!
దేశం మొత్తం(ఆ రాష్ట్రం మినహాయించి) అంగరంగ వైభవంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. కానీ, పరిస్థితులు ఆ రాష్ట్రాన్ని జెండా పండుగకు దూరంగా ఉంచేశాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎర్రకోట ప్రసంగంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని కుంభవృష్టితో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులు సైతం మూతపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రమాద ఘటనల్లో 55 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై తన ప్రసంగంలో ఈ అంశాన్ని గుర్తు చేశారు. ఇటీవల దేశంలో విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అన్నారు. ఊహించని స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని చెప్పారు. బాధితుల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విపత్తు నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అన్నారు. Visual of Pandoh Himachal Pradesh right now pic.twitter.com/KQ2Tn9sz9B — Go Himachal (@GoHimachal_) August 14, 2023 రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు జరిగాయని సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలాన్, సిమ్లా, మండి, హమిర్పూర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన విపత్తు నిర్వహణ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చంఢీగర్-సిమ్లా జాతీయ రహదారితో సహా ప్రధాన రహదారులు మూతపడ్డాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో విపత్తులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొదట ఏడుగురు మరణించారు. శివమందిర్ కూలిపోయిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోచోట కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 17 మంది కాపాడామని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ తెలిపారు. That has happened in #Himachal to build a 4 Lane road the Govt. Bulldoze houses, shops, bussiness establishment in the name of development but In this Himalayan Ranges. But now Nature is taking revenge. The Roads are crumbling down. Location NH 5 , Solan India pic.twitter.com/hQii08aoTl — Ravi Rana (@RaviRRana) August 11, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
వీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై అనర్హులు..! ప్రభుత్వం కీలక నిర్ణయం..
జైపూర్: దేశంలో మహిళలపై అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన దారుణం యావత్ దేశాన్ని తలదించుకునేలా చేసింది. అటు.. రాజస్థాన్‌లోని బిల్వారాలో నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని కలచివేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉంటే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. మహిళలపై వేధింపులు, అత్యాచార, అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు ఉన్నా, హిస్టరీ షీట్స్ నమోదైనా.. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన లిస్ట్ ఇకపై పోలీసు స్టేషన్లలో ఉంటుందని చెప్పారు. ఇలాంటి నిందితుల ప్రవర్తన పత్రాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. ఇటీవల రాజస్థాన్‌లో మహిళలపై దారుణాలు ఎక్కువయ్యాయి. ఆగష్టు 2నే ఓ నాలుగేళ్ల బాలికను ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ అమానవీయ ఘటనపై యావత్ రాష్ట్రం నివ్వెరబోయింది. ఇదే గాక ఇంతకు ముందే జోద్పూర్లోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఈ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ దారుణ ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఈ మేరకు చట్టాలను తీసుకువచ్చింది. ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ.. -
స్టేషన్ల అభివృద్ధి పేరిట.. రైల్వే ఛార్జీలు పెంచనున్నారా..?
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్దరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పనుల కోసం రైల్వే ఛార్జీల ధరలు పెంచుతారనే ఊహాగానాలు పట్టాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల నీవకరణకు కావాల్సిన నిధుల కోసం టికెట్టు ధరలు పెంచుతారనే అనుమానాలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రైల్వే ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు కావాల్సిన రూ.25 వేల కోట్లను బడ్జెట్ నుంచే కాటాయించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రాజెక్టు పేరుతో ఛార్జీలను పెంచడం జరగదని వెల్లడించారు. రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచస్థాయి స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. స్టేషన్ల అభివృద్ధిలో ఏ రాష్ట్రంలో వివక్ష చూపలేదని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు ఫలితాలను ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
పరిశ్రమలకు ఊరట, ఉద్యోగులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో కుదేలైన పరిశ్రమలకు కేంద్రం ప్రభుత్వం ఊరటనిచ్చింది. లాక్డౌన్ సమయంలో పనిచేయని ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఆదివారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఉత్తర్వుల ను జారీ చేసింది. దీని ప్రకారం లాక్డౌన్ సమయంలో పని చేయని ఉద్యోగులకు కంపెనీలు ఇకపై తప్పనిసరిగా వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదు. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడినా, ఎలాంటి కోతలు లేకుండా ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29 న ఎంహెచ్ఏ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కరోనా వైరస్ సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని ఐటీ ఉద్యోగులను తొలగించకుండా, వారి జీతాల్లో కోత విధించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టు గత వారం తిరస్కరించింది. అలాగే మార్చి 20 న కార్మిక కార్యదర్శి నోటిఫికేషన్ , మార్చి 29న హోంశాఖ నోటిఫికేషన్ పై కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న ఫికస్ పాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం ఈ కాలంలో తమ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించలేని సంస్థలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. (కరోనా : లాక్డౌన్ సడలింపుల వేళ గుడ్ న్యూస్!) కాగా ముదురుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రధానంగా దేశస్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)గణనీయంగా క్షీణించనుందనే అంచనాల నేపథ్యంలో ఆర్థిక కార్యకాలాపాల పునరుద్ధరణ నిమిత్తం అనేక రాష్ట్రాలు కంటైన్మెంట్ జోన్లతో పాటు దాదాపు అన్ని ప్రాంతాలలో కీలకమైన ఆర్థిక కార్యకలాపాల ప్రారంభానికి ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. -
‘తొలి’ సమరానికి సై
మెదక్ రూరల్: పరిషత్ ఎన్నికల్లో భాగంగా తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఆది వారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో హవేళిఘణాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 339 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 6 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 65 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 190 మంది బరిలో నిలిచారు. పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మానస ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు బీఫాం లను ఇచ్చిన అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా, ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నవారికి బ్యాట్, కత్తెర గుర్తులను కేటాయించారు. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు తర్వాత 6 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 16 నామినేషన్లు, 65 ఎంపీటీసీ స్థానాలకు గాను 158 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు 433 నామినేషన్లు, 6 జెడ్పీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 25న జరిగిన స్క్రూటినీలో పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి శైలజ ఐకేపీలో పనిచేస్తున్నందున నామినేషన్‌ను తిరస్కరించారు. రెండేసి చొప్పున వచ్చిన నామినేషన్లను తొలగించగా మొత్తం 341 మంది అభ్యర్థులు 354 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను 41 నామినేషన్లు వేయగా అందులో రెండేసి చొప్పున ఉన్న నామినేషన్లను తొలగించగా, మొత్తం 31 మంది అభ్యర్థులకు గాను 34 నామినేషన్లను పరిగణలోకి తీసుకున్నారు. బరిలో మిగిలిన అభ్యర్థులు సోమవారం నుంచి ప్రచారం నిర్వహించనున్నారు. ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం రెండో విడత నామినేషన్ల ప్రక్రియకు ఆదివారంతో తెరపడింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి మండలాలకు సంబంధించి ఈనెల 26 నుంచి 28 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఇందులో భాగంగా మొత్తం 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను 53 మంది అభ్యర్థులు 66 నామినేషన్లు వేశారు. 60 ఎంపీటీసీ స్థానాలకు 405 మంది అభ్యర్థులు 454 నామినేషన్లను దాఖలు చేశారు. ఆదివారం చివరి రోజు 60 ఎంపీటీసీ స్థానాలకు 276 మంది అభ్యర్థులు 318 నామినేషన్లను వేయగా, 6 జెడ్పీటీసీ స్థానాలకు 44 మంది అభ్యర్థులు 57 నామినేషన్లను దాఖలు చేశారు. ప్రతి మండల కేంద్రంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నామపత్రాలను స్వీకరించారు. రెండో విడత నామినేషన్ల వివరాలు ఇలా నర్సాపూర్‌లో 10 ఎంపీటీసీ స్థానాలకు 78 నామినేషన్లు, చిలప్‌చెడ్‌లో 6 ఎంపీటీసీ స్థానాలకు 41నామినేషన్లు, కౌడిపల్లిలో 10 ఎంపీటీసీ స్థానాలకు 66, కొల్చారంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 75 నామినేషన్లు, వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలకు 83 నామినేషన్లు, శివ్వంపేటలో 12 ఎంపీటీసీ స్థానాలకు 111 నామినేషన్ల చొప్పున మొత్తం 60 ఎంపీటీసీ స్థానాలకు 454 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరు జెడ్పీటీసీ స్థానాలకు నర్సాపూర్‌లో 11, చిలప్‌చెడ్‌లో 10, కౌడిపల్లి 09, కొల్చారం 12, వెల్దుర్తిలో 15, శివ్వంపేటలో 09 చొప్పున మొత్తం 66 నామినేషన్లు దాఖలయ్యాయి. -
బాబు ఉంటే జాబు రాదు
గూడూరు: మా అమ్మ మా అన్నదమ్ములిద్దర్నీ కష్టపడి పోస్టు గ్రాడ్యుయేట్ చదివించింది. ఆమె పడుతున్న కష్టాన్ని చూసి మేము కూడా బాగా చదివి, మంచి మార్కులు సాధించాం. అయినా మాకు ఉద్యోగాలు రాలేదు. దీంతో మా అమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 3వ తేదిన సీఎం మా గ్రామానికి సమీపంలో ఉన్న కనిగిరికి వచ్చారు. ఆయన్ను ఎలాగోలా కలవాలని, ఆయన ద్వారా వచ్చిన పింఛన్‌ను ఆయనకే తిరిగిచ్చేలా చూడాలని మా అమ్మ నన్ను అడిగారు. దీంతో మా అమ్మ అమరావతికి రూ.50వేలు విరాళం ఇవ్వాలని చెప్పి ఎలాగోలా ఆయన వద్దకెళ్లి నీవిచ్చే పింఛన్ నాకొద్దు. నా ఇద్దరు కొడుకులు బాగా చదివినా ఉద్యోగాలు రాలేదు. అంటూ వచ్చిన పింఛన్‌కు వడ్డీతో కలిపి రూ.50వేలు ఇచ్చేశారు. కానీ పచ్చ మీడియా మాత్రం అది కవర్ కాకుండా చేసిందని ప్రకాశం జిల్లా సీఎస్ పురానికి చెందిన ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగనన్న సీఎం అయితేనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని, ఆయన సీఎం కావాలని తన గ్రామం నుంచి కాలినడకన తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించి వస్తానని చెబుతున్నాడు ఆ యువకుడు జీకే బాషా. ఎమ్మెస్సీ, ఎంఫిల్ చేసిన బాషా ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలానికి చెందిన జీ మాలకొండయ్య, కొండమ్మలకు బాషా, కొండస్వామి అనే ఇద్దరు కుమారులున్నారు. మాలకొండయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కొండమ్మ అన్నీ తానే తన ఇద్దరు కుమారులను బాగా చదివించారు. బాషా ఎమ్మెస్సీ(ఐటీ), ఎంఫిల్ చేశారు. కొండస్వామి ఎంఏ, బీఈడీ చేశారు. వారిద్దరికీ ఉద్యోగాలు రాలేదు. దీంతో తన తల్లి కోరిక మేరకు కాలినడకన తిరుమలకు ఈ నెల 6వ తేదీన శింగరకొండలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి బయలుదేరానని బాషా తెలిపారు. -
ఇక పోలింగ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎన్నికలను సజావుగా జరిపేందుకు జిల్లా పంచాయతీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామపంచాయతీల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్న విషయం విదితమే. ఈ మేరకు తొలి దశలో జిల్లాలోని 10 మండలాలు 249 గ్రామపంచాయతీలు, 2,274 వార్డుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించిన అధికారులు స్క్రూటినీ అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశమిచ్చారు. దీంతో ఆదివారం సాయంత్రానికి తొలి దశ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచేదెందరో తేలనుంది. ఆ వెంటనే అభ్యర్థుల జాబితాతో పాటు గుర్తులను కూడా అధికారులు కేటాయించనున్నారు. ఆ వెంటనే అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీల్లో ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు గుర్తులు రాగానే దీనిని ముమ్మరం చేయనున్నారు. అధికారిక ఏర్పాట్లు మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఓ పక్క నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ చేపట్టిన అధికారులు ఉపసంహరణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తుది జాబితా విడుదల చేస్తారు. ఇదంతా జరుగుతుండగానే పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందిని ఎంపిక చేయడంతోపాటు వారి విధులను కూడా విభజించారు. అలాగే, శిక్షణ కూడా పూర్తిచేశారు. కాగా, మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈనెల 21న జరగనుంది. కాగా, ఈ దశలో 249 పంచాయతీలకు కలిపి సర్పంచ్ స్థానాలకు 1,454, వార్డు సభ్యుల స్థానాలకు 5,103 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, ఆదివారం సాయంత్రం వరకు ఉపసంహరణకు గడువు ఉన్నందున అప్పటి వరకు బరిలో మిగిలిన వారి సంఖ్య తేలనుంది. అధికారుల నియామకం మొదటి దశ ఎన్నికలు జిల్లాలోని పది మండలాల్లో కలిపి 249 గ్రామపంచాయతీల్లో జరగనున్నాయి. ఇందుకోసం 5,518 మంది అధికారులను నియమించారు. వీరే కాకుండా జోనల్ అధికారులు 58 మంది అధికారులు, స్టేజ్–1 అధికారులు 66 మంది, స్టేజ్–1 సహాయకులు 66, స్టేజ్–2 అధికారులు 282, పీఓలు 2,274 మంది నియామకం జరిగింది. ఇంకా అదనంగా మరో 228 శాతం మందిని ఎంపిక చేసి రిజర్వ్‌లో ఉంచారు. అలాగే ఏపీఓలు 2,742 కాగా అదనంగా 274 మందిని రిజర్వ్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మండలాల్లోని పంచాయతీలను మొత్తం 60 క్లస్టర్లుగా విభజించారు. మొదటి విడుత ఎన్నికల షెడ్యుల్‌లో ఆదివారం మద్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కానుంది. ఆ తరువాత ఎన్నికలో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. అలాగే, గుర్తులను కేటాయిస్తారు. విత్‌డ్రా కోసం విశ్వప్రయత్నాలు పోటీలో అసమ్మతి లేకుండా చేసుకోవడానికి అభ్యర్థులు తమ ప్రత్యర్థులతో నామినేషన్లను విత్‌డ్రా చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విత్‌డ్రాలకు ఆదివారం చివరి రోజు కావడంతో అసమ్మతి నేతలను బుజ్జగించేం దుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తమ మాట వినని వారిపై మండల, జిల్లా స్థాయి నేతల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా ఉంది. ప్రతీ గ్రామపంచాయతీ నుంచి ముగ్గురు.. మరికొన్ని గ్రామాల్లోనైతే టీఆర్ఎస్ మద్దతుదారులే నలుగురు కూడా నామినేషన్లను వేశారు. దీంతో వారిని విత్‌డ్రా చేయించేందుకు ప్రధాన అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఎయిరిండియా కథ మళ్లీ మొదటికి
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రయివేటు పరం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చివరిరోజు ఇబ్బడి ముబ్బడిగా బిడ్లు వస్తాయని ఆశించిన సర్కార్ చివరికి సింగిల్ బిడ్‌ను కూడా సాధించలేకపోయింది. ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు చివరి రోజు అయిన మే 31వ తేదీ గురువారం కూడా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. బిడ్లు వేసేందుకు సంస్థల నుంచి కనీస స్పందన కరువైంది. ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి బిడ్డర్లనుంచి ఎలాంటి స్పందనా రాలేదనీ, తదుపరి చర్యలను త్వరలోనే నిర్ణయిస్తామని విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉన్న ఎయిరిండియాను ప్రయివేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం సంస్థలో 76శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడింది. ఇందుకోసం బిడ్డర్లను కూడా ఆహ్వానించింది. ఈ బిడ్లు వేసేందుకు మే 14 వరకు గడువు పెట్టింది. అయితే మొదట జెట్‌ఎయిర్‌వేస్, ఇండిగో, టాటా లాంటి సంస్థలు ఎయిరిండియాలో వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాయి. అయితే వాటా విక్రయంపై ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. వాటా కొనుగోలు అనంతరం ఎయిరిండియాను వారి సొంత సంస్థల్లో విలీనం చేయరాదని, పాత సిబ్బందిని తొలగించరాదని పేర్కొంది. దీంతో నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ చాలా సంస్థలు విముఖత వ్యక్తం చేశాయి. నిబంధనల్లో కొన్ని మార్పులు చేసిన అనంతరం బిడ్ వేసేందుకు గడువును మే 31వరకు పొడిగించింది. నిబంధనలను సవరించి, గడువు పొడిగించినా కూడా బిడ్‌ను సాధించడంలో విఫలం కావడం గమనార్హం. -
వైస్సార్సీపీలో స్పష్టత
– టీడీపీలో కొనసాగుతున్న సందిగ్ధత – బీజేపీతో తెగని పంచాయతీ – టీడీపీ మెట్టుదిగుతున్నా వెనక్కి తగ్గని బీజేపీ నేతలు – చివరికీ ఎనిమిది సీట్లు ఇచ్చేందుకు అంగీకారం – 12 ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న బీజేపీ సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీలో స్పష్టత వచ్చేసింది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అన్ని డివిజన్లలోనూ బరిలోకి దిగుతోంది. టీడీపీలో ఇంకా కొలిక్కి రాలేదు. టీడీపీ, బీజేపీ పొత్తు పంచాయతీ తెగలేదు. నిన్నటి వరకు మూడు డివిజన్లు ఇస్తామని చెప్పుకొచ్చిన టీడీపీ ఎనిమిది డివిజన్లు కేటాయించేందుకు ముందుకొచ్చింది. కానీ 12 కావాలని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో వ్యవహారం అదిష్టానం వద్దకు వెళ్లింది. గురువారం నామినేషన్లు భారీ ఎత్తున పడ్డాయి. ఈ ఒక్కరోజే 381 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు అభ్యర్థుల తాకిడితో కిటకిటలాడాయి. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన కార్యకర్తల కోలహలంతో నగర వీధులు సందడితో రద్దీగా కనిపించాయి. ఎక్కడ చూసినా రాజకీయ పక్షాల హడావుడి కనిపించింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా పోటీపడి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రత్యర్ధి పార్టీల నుంచి ఎవరేస్తున్నారో చూసుకుని అప్పటికప్పుడు ధీటైన అభ్యర్థులు దాఖలు చేసిన సందర్భాలు బయటపడ్డాయి. మొత్తంగా చూస్తే కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లకుగాను 493 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ తర్జనభర్జన టీడీపీలో ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. కొన్ని డివిజన్లకు సరైన అభ్యర్థులు దొరకకపోవడంతో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధినేత చంద్రబాబు ఆదేశించడంతో డివిజన్‌కు ముగ్గురు చొప్పున పేర్లు రాసి పంపించినట్టు తెలిసింది. ఒక డివిజన్కైతే ఒక్కరిపేరే ప్రస్తావించగా ఏమిటీ పరిస్థితని నేతలను చంద్రబాబు గట్టిగా ఆరాతీసినట్టు సమాచారం. ముఖ్యంగా కాకినాడ 14వ డివిజన్లో అధికార పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థి కూడా కరువయ్యాడు. దీంతో మరో 10 నిమిషాల్లో నామినేషన్ల ఘట్టం పూర్తవుతుందనుకున్న సమయంలో చివరి క్షణంలో ఎమ్మెల్యే అన్న కొడుకు వనమాడి ఉమాశంకర్, మరో అభ్యర్థి చేత నామినేషన్ వేయించారు. మెట్టు దిగినా పట్టువదలని బీజేపీ టీడీపీతో బీజేపీ ఒక ఆట ఆడుకుంటోంది. అధికార పార్టీ పరిస్థితి దయనీయంగా మారడం, మిత్రపక్షాన్ని వదులుకునే ధైర్యం చేయలేక బీజేపీ ఏమి చెబితే అదే చేసే పరిస్థితికి వచ్చేసింది. ఆ పార్టీ బలం కన్నా ఎక్కువ సీట్లు అడుగుతుండగా, ఇవ్వకపోతే ఇబ్బంది అన్నట్టుగా టీడీపీ సాగిలా పడిపోతోంది. బీజేపీ తొలుత 20 సీట్లు అడగ్గా కేవలం రెండే ఇస్తామని టీడీపీ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించింది. ఆ తరువాత బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి గట్టిగా హెచ్చరించడంమే కాకుండా అమీతుమీ తేల్చుకుంటామని అల్టిమేటం జారీ చేయడంతో టీడీపీ వెనక్కి తగ్గింది. ఐదిస్తామని బేరం పెట్టింది. కానీ బీజేపీ ససేమిరా అనడంతో తాజాగా ఎనిమిది ఇచ్చేందుకు అధికార పార్టీ అంగీకరించింది. దానికి బీజేపీ నేతలు ఒప్పుకోవడం లేదు. 12 సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో నామినేషన్ల ఘట్టం ముగిసినా సీట్ల పంపకాల పంచాయతీ కొలిక్కిరాలేదు. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థులు 20 డివిజన్లకుగాను 35మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవేళ టీడీపీ దారికి రాకపోతే బరిలో ఉండిపోదామన్న ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏం చేయాలన్న దానిపై అదిష్టానానికి వదిలేశారు. బీజేపీ అడుగుతున్న డివిజన్ల వివరాలను, కేటాయిస్తామన్న డివిజన్ల వివరాలను అదిష్టానానికి పంపించారు. ఇప్పుడక్కడే నిర్ణయం తీసుకోవల్సి ఉంది. -
నో ఛాన్స్!
పాతికేళ్లుగా కాకినాడలో అడ్రస్ లేని టీడీపీ 1992 తరువాత ప్రతి ఎన్నికలోనూ ఓటమే మున్సిపల్ ఎన్నికల్లో ఇదీ చరిత్ర ఈసారీ హిస్టరీ రిపీటేనా! కాకినాడ : కేంద్రంలో చక్రం తిప్పినా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా.. జిల్లా కేంద్రం కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశంపార్టీ 25 ఏళ్లుగా అడ్రస్ లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మున్సిపల్ ఎన్నికలు జరిగినా, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా కొద్దిపాటి కౌన్సిలర్ సీట్లతో గట్టెక్కడమే తప్ప అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా ‘హిస్టరీ రిపీట్’ కాగలదన్న సంకేతాలు ప్రజల నుంచే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై నెలకొన్న తీవ్రమైన వ్యతిరేకత అవినీతిపాలన, పార్టీకేడర్లో తిరుగుబాటు నేపథ్యంలో ఈసారి కూడా అవే ఫలితాలు వస్తాయన్న పరిస్థితి కనిపిస్తోంది. 1987లో ఒకే ఒక్కసారి.. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యక్ష పద్ధతిలో సింబల్స్‌పై తొలిసారిగా 1987లో ఎన్నికలు జరిపించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల సీతారామమూర్తి నేరుగా మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. అయితే అప్పుడు కూడా టీడీపీకి మెజార్టీ రాని పరిస్థితి ఎదురైంది. అప్పట్లో కాంగ్రెస్ 20 వార్డులను గెలుచుకోగా 18 టీడీపీ గెలుచుకుంది. ఆరుగురు టీడీపీ రెబల్స్ ఇండిపెండెంట్టుగా నెగ్గారు. ఆ పాలకవర్గం 1987 నుంచి 92 వరకు ఐదేళ్లపాటు కొనసాగింది. ఇక వరుస ఓటములే.. 1987–92 మధ్య ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఆ తరువాత అన్నీ ఓటములే ఎదుర్కొంది. 92 నుంచి 95 వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రభాజోసఫ్ కాంగ్రెస్ తరఫున మున్సిపల్ చైర్మన్‌గా నెగ్గారు. ఐదేళ్ల తరువాత 2000 సంవత్సరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డాక్టర్ బీరక చంద్రశేఖర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తొలి మేయర్‌లో మట్టి కరిచిన టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపాలవుతున్న టీడీపీ 2005లో జరిగిన తొలి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మట్టి కరిచింది. పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 30 కార్పొరేటర్లు గెలవగా తెలుగుదేశం 15 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో కాకినాడ తొలినగరపాలక సంస్థ తొలి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇలా ఎప్పుడు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా వరుస ఓటమిలతో కంగుతింటున్న టీడీపీ, మరోసారి ఎన్నికలకు వెళ్లేందుకు సాహసం చేయలేకపోతోంది. ఇందులో భాగంగానే ఎన్నికలు జరగకుండా సవాలక్ష సమస్యలు సృష్టించి ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. -
దళిత సర్పంచ్ ఫిర్యాదుపై చర్యలేవీ
ఎస్పీ విశాల్‌గున్నికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఫిర్యాదు కాకినాడ : స్పష్టమైన ఆధారాలున్నా ఓ దళిత సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఆలమూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎస్పీ విశాల్‌గున్నికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కాకినాడలో ఎస్పీని కలిసి ఈ అంశంపై చర్చించారు. ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామ సర్పంచ్ డెక్కాపాటి పాప తమ గ్రామంలో అనధికారికంగా జరుగుతున్న నిర్మాణాన్ని ప్రశ్నించడంతో మే 20వ తేదీన అడ్డుచెప్పారన్నారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో అక్కడ నిర్మాణం చేస్తున్న మద్దిరాజు కామరాజు ఆమెపై దౌర్జన్యం చేసి కులంపేరుతో దుర్భాషలాడారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. పైగా ఆమెపై పారతో దాడి చేసి హత్యాయత్నం కూడా చేశారన్నారు. ఇందుకు సంబంధించి రికార్డింగ్‌లు, స్పష్టమైన ఆధారాలతో ఆలమూరు స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎలాంటి చర్య తీసుకోవడలేదని ఎస్పీకి వివరించారు. దళిత సర్పంచ్‌పై దురుసుగా వ్యవహరించి అవమానకరంగా ప్రవర్తించిన అక్కడి పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని జగ్గిరెడ్డి చెప్పారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ వెంటనే డీఎస్పీతో మాట్లాడారు. వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ న్యాయం జరగకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, ఎంపీటీసీ లంక వెంకటరమణ, పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ తదితరులు ఉన్నారు. -
రేషన్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: పేదలకు సబ్సిడీ ధరలకు నిత్యావసరాలను సరఫరా చేసే "ప్రజాపంపిణీ వ్యవస్థ’’ (పీడీఎస్) ధరలను పెంచబోమని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆహార ధాన్యాల ధరల పెంపు మరో ఏడాది పాటు ఉండదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ఆహార శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు ఇతర తృణధాన్యాల విక్రయ ధరలను ఒక సంవత్సరం వరకు పెంచమని రాం విలాశ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తద్వారా ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2013 లో ఆమోదం పొందిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద మూడు సంవత్సరాలకు ఆహారధాన్యాల ధరలను సమీక్షిస్తారు. PM Sh. Narendra Modi Ji has taken a historic decision to not to increase the issue prices of food-grains under NFSA for one more year. — Ram Vilas Paswan (@irvpaswan) June 28, 2017 -
పల్లెల్లో ప్రథమ పౌరులేరీ?
విలీన కొర్రీతో పద కొండేళ్లుగా ఎన్నికలు నిల్ నాలుగేళ్లుగా ప్రత్యేక పాలనలోనే 42 పంచాయతీలు రెండున్నరేళ్లుగా అనపర్తిలో ప్రత్యేక పాలన అడుగు పడని అభివృద్ధి క్షీణిస్తున్న పారిశుద్ధ్యం మండపేట : పంచాయతీల్లో సర్వాధికారం ప్రథమ పౌరులదే. పల్లెల ప్రగతికి బాటలు వేసేది అక్కడి పాలకవర్గాలే. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిలా ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకవర్గ సభ్యులది కీలకపాత్ర. అటువంటి పాలకులు లేని పల్లెలు జిల్లాలో చాలానే ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రత్యేక పాలనలో మగ్గుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. విలీన కొర్రీతో 42 పంచాయతీలకు ఎన్నికలు జరిగి 11 ఏళ్లు కావస్తుండగా, సర్పంచ్ల మరణాలతో ప్రథమ పౌరులు లేని పంచాయతీలు 14 వరకు ఉన్నాయి. పనిచేయని కుళాయిలు, డ్రైన్లో పారని మురుగునీరు, వెలగని వీధిలైట్లు, వీధి మలుపులో తొలగని చెత్త, క్షీణించిన పారుశుద్ధ్యంతో వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు, అడుగు పడని అభివృద్ధి, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్లుగా ఎన్నికలకు నోచుకోక ప్రత్యేక పాలనలోనే ఆయా పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులు ఎప్పుడు వస్తారో తెలీదు. నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయం. 2011 సెప్టెంబరుతో గత పాలకవర్గాల పదవీకాలం ముగియగా, బీసీ రిజర్వేషన్లు వివాదం, ఇతర కారణాలతో 2013 జూలైలో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 1069 పంచాయతీలకు గాను నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలుపై కోర్టు వివాదాలు నేపధ్యంలో జిల్లాలోని 42 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రాజమండ్రి డివిజన్ పరిధిలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్, మండపేట మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలతో 28 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోగా, కాకినాడ డివిజన్లోని కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది పంచాయతీలు, పెద్దాపురం డివిజన్లోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల సమీపంలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అనపర్తి పంచాయతీ పదవీకాలం 2014 ఆగస్టు 4తో ముగియగా నగర పంచాయతీగా స్థాయి పెంపుదలకు వ్యతిరేకంగా నడుస్తున్న కోర్టు వాజ్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి. రంగంపేట మండలం జి.దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది. కోర్టు ఆదేశాలిచ్చినా విలీన ప్రతిపాదనను నిరసిస్తూ పలు గ్రామాలకు చెందిన నేతలు కోర్టులను ఆశ్రయించి ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు తెచ్చుకున్నా వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేవలం ఎంపీటీసీ ఎన్నికలు జరిపి చేతులు దులిపేసుకుంది. పంచాయతీ ఎన్నికల జరిపించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన సర్కారు ఎన్నికలు జరపకుండా తమ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పంచాయతీల పరిధిలోని 240కు పైగా వార్డులకు ఎన్నికలు జరపాల్సి ఉంది. మరణాలు, రాజీనామాలతో మరో 14 ఖాళీ పలువురు సర్పంచుల రాజీనామాలు, మరణాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 14 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరపాల్సి ఉంది. ఆయా కారణాలతో జి.మామిడాడ, ఎస్.యానాం, వెంగాయమ్మపురం, పాతర్లగడ్డ, లొల్ల, ఈస్ట్ లక్ష్మీపురం, మెగ్గళ్ల, నామవాని పాలెం, అన్నాయిపేట, లింగాపురం, ఇరుసుమండ, టీజే నగరం, దొండపాక, గంగనాపల్లి పంచాయతీలు ఇన్చార్జిల ఏలుబడిలో ఉన్నాయి. వెంటాడుతున్న సమస్యలు గ్రామ పంచాయతీల్లో సర్వాధికారం సర్పంచ్‌లదే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు నుంచి గ్రామాభ్యుదయానికి పాటు పడటంలోను వారిదే కీలకపాత్ర. పాలవర్గాలకు ఎన్నికలు జరగక ఏళ్ల తరబడి ప్రత్యేక పాలనలోనే ఆయా గ్రామాలు మగ్గుతున్నాయి. గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సమస్యలు చెప్పుకునేందుకు వార్డు సభ్యులు లేకపోవడం, అధికారులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో సంవత్సర కాలంలో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, ఇప్పట్లో పాలకులు లేని పంచాయతీల్లో ప్రభుత్వం ఎన్నికలు జరిపే దాఖలాలు లేవన్న విమర్శలు వ్యక్తమతున్నాయి. కనీసం ఆయా గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యలు పట్టించుకునే వారు లేరు దీర్ఘకాలంగా పాలకవర్గం లేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాల్టీలో కలిస్తే ఉపాదిహామీ వర్తించదన్న వాదన బలంగా ఉంది. విలీనం అనివార్యమైతే ప్రజలకు వివరణ ఇవ్వాలి. - రుద్రాక్షల శ్రీనివాస్, మాజీ సర్పంచ్, నేలటూరు ఎన్నికలు జరపాలి ఎన్నికలు జరగక పాలకవర్గం లేదు. ప్రత్యేక పాలన కావడంతో మండలంలోని రెండు పంచాయతీలకు అనపర్తి ఈఓ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ కరువై పాలన కుంటుపడుతోంది. పారిశుద్ధ్యం లోపిస్తోంది. ఎన్నికలు జరిపి పాలకవర్గాన్ని ఏర్పాటుచేయాలి. - సత్తి వెంకటరెడ్డి, అనపర్తి కొత్తూరు -
‘ప్రాథమికమే’ నరకప్రాయం
నర్సులే సూదిమందు వేస్తారు అటెండర్లు ఓపీలు చూస్తారు అసలు వైద్యులు కానరారు స్టాఫ్ నర్స్ పోస్టులు 40 భర్తీ ఎండమావే... వచ్చే రోగాలను ప్రాథమికంగా గుర్తించి చికిత్స అందించాల్సిన కీలక వైద్య కేంద్రాలివి. సంపూర్ణ విద్యావంతునిగా తీర్చిదిద్దేందుకు విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలు ఏ విధంగా పునాది రాళ్లు వేస్తాయో పీహెచ్‌సీలు కూడా సంపూర్ణ ఆరోగ్యానికి ఆదిలోనే అరికట్టాలి. కానీ క్షేత్ర స్థాయిలో దీనికి భిన్నంగా ఉంది. - డాక్టర్లేరీ: 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేరు. పోస్టులు మంజూరైనా నియామకాలు లేవు. అరకొరగా నియామకాలు జరిగినా బాధ్యతలు తీసుకోక వెనుతిరిగిపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. . - వీరే పెద్ద దిక్కు: వైద్యులు లేని పీహెచ్‌సీల్లో అటెండర్లు, ఏఎన్ఎమ్లు, కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు ఓపీలు చూస్తూ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఇంజెక్షన్లిస్తూ తమకు తెలిసిన మందులు రోగులకు అందజేస్తున్నారు. . - ఇక్కడకు రాకండేం: రామచంద్రపురం మండలం వెల్ల, తుని రూరల్ మండలం తేటగుంట, మండల కేంద్రం గొల్లప్రోలు, గొల్లప్రోలు మండలం చేబ్రోలు, పిఠాపురం మండలం విరవ, ముమ్మిడివరం నియోజకవర్గం కొత్తలంక, కాట్రేనికోన, కేశనకుర్రు, అమలాపురం నియోజకవర్గం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో వైద్యులు లేక అక్కడకు వచ్చే రోగులు అల్లాడిపోతున్నారు. వైద్యుడు లేని ఈ ఆసుపత్రులకు ఎందుకు వస్తున్నారు ... ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారని అక్కడ సిబ్బందే విసుక్కుంటున్నారు. . - మన్యం అరణ్య రోదన: రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి మండలం గుర్తేడు పీహెచ్సీలో రెండు పోస్టులుంటే రెండూ ఖాళీగానే ఉన్నాయి. గంగవరం మండల కేంద్రంలోని పీహెచ్సీ, అడ్డతీగల మండలం దుప్పలపాలెం, ఎల్లవరం, అడ్డతీగల కమ్యునిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లలో కూడా వైద్యులు లేక మన్యం వాసులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఏ వ్యాధి వచ్చినా మరణాలు ఇక్కడ సహజమైపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : పల్లెల్లో ఎవరికి ఏ రోగమొచ్చినా అందుబాటులో ఉండేది ... వెళ్లేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. పీహెచ్‌సీలకు వెళ్లే రోగులంతా దాదాపు సామాన్య, మధ్య తరగతి వర్గాలే. అటువంటి ఈ ఆరోగ్య కేంద్రాల్లో నర్సులు, అటెండర్లే వైద్యుల పాత్ర పోషిస్తున్నారు. వైద్యుల కొరత కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వీరే పెద్ద దిక్కుగా మారుతున్నారు. జిల్లాలో పూర్తి స్థాయి వైద్యులు లేని పీహెచ్‌సీలు 50పైనే ఉన్నాయి. వీటిలో 24 గంటలు సేవలందించాల్సిన పీహెచ్‌సీలు 25 వరకూ ఉన్నాయి. వైద్యులు లేని పీహెచ్సీలలో అటెండర్లు, ఏఎన్ఎమ్లు, కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు ఓపీలు చూస్తూ...ఇంజెక్షన్లిస్తూ తమకు తెలిసిన మందులు రోగులకు అందజేస్తున్నారు. రామచంద్రపురం మండలం వెల్ల, తుని రూరల్ మండలం తేటగుంట, మండల కేంద్రం గొల్లప్రోలు, గొల్లప్రోలు మండలం చేబ్రోలు, పిఠాపురం మండలం విరవ, ముమ్మిడివరం నియోజకవర్గం కొత్తలంక, కాట్రేనికోన, కేశనకుర్రు, అమలాపురం నియోజకవర్గం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో వైద్యులు లేక అక్కడకు వచ్చే రోగులు అల్లాడిపోతున్నారు. ఏజెన్సీలో మరీ ఘోరం... రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి మండలం గుర్తేడు పీహెచ్సీలో రెండు పోస్టులుంటే రెండూ ఖాళీగానే ఉన్నాయి. గంగవరం మండల కేంద్రంలోని పీహెచ్సీ, అడ్డతీగల మండలం దుప్పలపాలెం, ఎల్లవరం, అడ్డతీగల కమ్యునిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లలో కూడా వైద్యులు లేక మన్యం వాసులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. మన్యంలో కాళ్లవాపు, మలేరియా, గర్భిణీలు, నవజాత శిశువుల మరణాల రేటు పెరుగుతున్నా పోస్టులు మాత్రం భర్తీ కావడం లేదని మన్యం వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇదండీ దుస్థితి... జిల్లాలో 24 గంటల పీహెచ్‌సీలు 38 ఉండేవి. వీటికి కొత్తగా 13వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన తొమ్మిది పీహెచ్‌సీలు కలిపితే మొత్తంగా 47 పీహెచ్‌సీలు ఉన్నాయి. గతంలో 24 గంటల పీహెచ్సీలలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టినప్పుడు 60 శాతం చూపించి మిగిలిన పోస్టులను అప్పటి డీఎంహెచ్ఒ కార్యాలయంలో కొందరు పైసలిచ్చిన వారికే కట్టబెట్టారనే విమర్శలున్నాయి. దీనిపై ట్రైనీ కలెక్టర్ శ్వేతా మహంతి విచారణ కూడా చేశారు. అప్పటి నుంచి స్టాఫ్‌నర్సుల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు వైద్యుల నియామక ప్రక్రియలో కూడా అదే ఫార్ములా అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో 128 పీహెచ్‌సీలున్నాయి. వీటిలో మంజూరైన వైద్యుల పోస్టులు 247. వాటిలో కాంట్రాక్ట్ పోస్టులు 111 కాగా, రెగ్యులర్ పోస్టులు 130. వీటిలో మెజార్టీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన తొమ్మిది పీహెచ్సీలలో ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉండాలి. కానీ ఎనిమిది మంది కాంట్రాక్ట్ వైద్యులతోనే ఈ పీహెచ్‌సీలు నెట్టుకొస్తున్నాయి. పది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా, 18మంది పూర్తి స్థాయి వైద్యులను నియమించాలి. ఏడాదిగా ఇదే పరిస్థితి. ఇటీవల జిల్లా కలెక్టర్ (గత కలెక్టర్ అరుణ్‌కుమార్) హయాంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భర్తీకి పంపిన ప్రతిపాదనల్లో 12 వైద్యుల పోస్టులను చూపించి మిగిలిన పోస్టులు తొక్కిపెట్టారు. ఆ పోస్టులను మెచ్చిన వారికి నచ్చినట్టు కట్టబెట్టే వ్యూహంతోనే అలా ప్రతిపాదించారంటున్నారు. .40 స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీ... జిల్లాలో 203 స్టాఫ్‌నర్సు మంజూరైన పోస్టులు ఉన్నాయి. అందులో 37 పోస్టులు చాలా కాలంగా ఖాళీగానే ఉన్నాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన తొమ్మిది పీహెచ్సీలలో మూడు స్టాఫ్‌నర్సుల పోస్టులతో లెక్కలేస్తే జిల్లాలో స్టాఫ్ నర్సు పోస్టులు 40 ఖాళీలున్నాయి. పల్లెల్లో రోగుల ఇబ్బందులు... వాతావరణం అగ్నిగుండంగా మారి డేంజర్ జోన్లో జిల్లా ఉందని ఇటీవలనే జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వీరికి పీహెచ్సీలలో ప్రాథమిక వైద్యం చేస్తే మరణాల సంఖ్య తగ్గించే అవకాశం ఉండేది. వైద్యులు లేక స్టాఫ్‌నర్సులు విధులు నిర్వహిస్తూ రోగులకు మెరుగైన వైద్యం కోసం సీహెచ్‌సీలు లేదా, ప్రభుత్వాస్పత్రులకు సకాలంలో పంపించే ధైర్యం చేయలేకపోతున్నారు. వైద్యులు లేక పారామెడికల్ సిబ్బంది (స్టాఫ్ నర్సులు, లేబ్టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు)కి సరైన మార్గనిర్థేశకత్వం లేకుండా పోయింది. అర్హత లేకున్నా తోచిన వైద్యం చేస్తూండటంతో వికటించడం కొన్ని సందర్భాల్లో రోగులు మృత్యువాతపడటం, బంధువులు ఆందోళనలకు దిగుతున్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా యంత్రాంగం ఈ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
తీరు మారేదెన్నడో..!?
- ఉపాధ్యాయ బదిలీలపై కార్యరూపం దాల్చని మంత్రి ప్రకటన - నేటికీ విడుదల కాని షెడ్యూల్ - దొడ్డిదారిన బదిలీలకు సన్నాహాలు - ఆందోళనలో ఉపాధ్యాయులు రాయవరం (మండపేట): వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామంటూ స్వయంగా విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారు. సెలవుల్లోనే బదిలీ ప్రక్రియ పూర్తయితే అన్ని విధాలా మేలు కలుగుతుందని ఉపాధ్యాయులు భావించారు. అయితే నేటికీ బదిలీల షెడ్యూల్ విడుదల కాకపోవడంతో మంత్రి మాట నీటిమీద రాతగా మారిపోనుందా..అనే అనుమానం ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు దొడ్డిదారిన విద్యాశాఖలో బదిలీలకు తెరతీయడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరు మారేదెన్నడో.. వేసవిలోనే ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రతిసారీ డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించడం వల్ల పాఠశాలల్లో విద్యావ్యవస్థకు భంగం కలగకుండా ఉంటుంది. ఉపాధ్యాయుల పిల్లలను బదిలీ అయిన చోట పాఠశాలల్లో చేర్పించడానికి కూడా అవకాశం కలుగుతుంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుంది. 2015లో నిర్వహించిన బదిలీలను కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్వహిస్తామని చెప్పిన విద్యాశాఖ చివరకు మధ్యలో చేపట్టింది. వివిధ రకాల నిబంధనలు పెట్టి కాలయాపన చేసి చివరకు బదిలీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. చివరకు అక్టోబరు మాసాంతానికి ఆ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో సుమారు 19 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2015లో బదిలీలు జరిగిన సమయంలో జిల్లాలో సుమారు రెండు వేల మంది వివిధ ప్రాంతాలకు బదిలీలయ్యారు. వచ్చే నెలలోనేనా... ఉపాధ్యాయులు బదిలీలు జరుగుతాయా? జరగవా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు పొందుతున్నారు. ఉపాధ్యాయ శిక్షణలు వచ్చే నెల ఐదో తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే వచ్చే నెలలోనే షెడ్యూల్ విడుదలై విద్యా సంవత్సరం ప్రారంభంలో బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటి వరకూ బదిలీల షెడ్యూల్ ప్రకటించని ప్రభుత్వం మరోవైపు దొడ్డిదారిన బదిలీలకు తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో అటువంటివి లేకపోయినా రాష్ట్రంలో పలు జిల్లాల్లో దొడ్డిదారి బదిలీలు జరగడంతో రెండు రోజుల కిందట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆయా డీఈవో కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. పెడచెవిన పెడుతున్న ప్రభుత్వం.. బదిలీలు వేసవి సెలవుల్లోనే చేపట్టాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దీనివల్ల విద్యా వ్యవస్థలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. – పి.సుబ్బరాజు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయు. అందుకే కాలయాపన.. దొడ్డిదారిన బదిలీలు చేసుకునేందుకే ప్రభుత్వం బదిలీల షెడ్యూల్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. పలు రకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం దొడ్డిదారి బదిలీలకు తెరతీస్తోంది. – టి.కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ తొలుత పదోన్నతులు ఇవ్వాలి.. బదిలీ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి. దీనికి ముందే పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలి. బదిలీలు జాప్యం జరగడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు నష్టపోతున్నారు. – చింతాడ ప్రదీప్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయు. -
ఆ ఆరుగురిదే హవా
- డీసీ కార్యాలయంలో కొన్నేళ్లుగా వారే - దేవాదాయం...వారికే... - ఏళ్లతరబడి తిష్ట వేసినా బదిలీలుండవు - పై స్థాయిలో వాటాలతో కొనసాగింపు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అది దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం. కాకినాడ కేంద్రంగా ఆ శాఖ పని చేస్తుంటుంది. డీసీ కార్యాలయం మూడు జిల్లాలను పర్యవేక్షిస్తుంటుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో సుమారు మూడువేల ఆలయాలు, సత్రాలను ఈ కార్యాలయమే అజమాయిషీ చేస్తుంటుంది. ఈ కార్యాలయానికి డిప్యూటీ కమిషనర్ సుప్రీం. చాలా కాలంగా ఈ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి డిప్యూటీ కమిషనర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పైసలిస్తే పని కానిదంటూ ఏదీ ఉండదనే ఆరోపణ ఈ కార్యాలయంలో కొందరు ఉద్యోగులపై ఉంది. అందుకే ఇక్కడి డీసీ కార్యాలయంలో పని చేయడమంటే ఎగిరి గంతేస్తారు. డీసీ కార్యాలయంలో ఒకసారి జాయినైతే ఇక కార్యాలయాన్ని అంటిపెట్టుకునే ఉంటారంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఏ శాఖలో అయినా చివరకు దేవాదాయశాఖ పరిధిలో ఇతర కార్యాలయాల్లోనైనా నిబంధనల ప్రకారం ఉద్యోగులకు బదిలీలు జరుగుతుంటాయి. కానీ ఈ కార్యాలయంలో ఏళ్లతరబడి పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు బదిలీలు అంటే ఏమిటో తెలియదు. బదిలీలు జరిగే ప్రతి సందర్భంలో ఉన్నతాధికారులకు ‘ఆమ్యామ్యా’లు ఇచ్చేసి ఆ సీట్లలోనే కొనసాగుతున్నారంటే ఎంత పలుకుబడి ఉందో ఊహించుకోవచ్చు. డిప్యూటీలు ఎవరైనా సరే వీరిదే స్టీరింగ్... డిప్యూటీ కమిషనర్‌గా ఎవరు వచ్చినా చక్రం తిప్పేది మాత్రం ఆ ఆరుగురే. ఈ కార్యాలయంలో అన్ని క్యాడర్ల ఉద్యోగులు కలిపి 20 మంది ఉంటారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా మూడేళ్లు పైబడితే బదిలీలు తప్పవు. పాతికేళ్లవుతున్నా బదిలీ కాని ఉద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు. - కార్యాలయంలో అటెండర్‌గా జాయినైన ఒక ఉద్యోగి ఇక్కడే రికార్డు అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఆ ఉద్యోగి ఇక్కడ 27 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. - 2004లో టైíపిస్టుగా జాయినైన ఒక ఉద్యోగి అప్పటి నుంచి ఇప్పటి వరకు టైపిస్టుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. - మహిళా జూనియర్ అసిస్టెంట్æ 11 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. - 1999లో జూనియర్ అసిస్టెంట్‌గా జాయినైన ఒక మహిళా ఉద్యోగిని ఇదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఇప్పుడు అంతకంటే పై స్థాయిలో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందినప్పటికీ ఇదే కార్యాలయంలో పనిచేస్తున్నారు. - 2009లో ఈ కార్యాలయానికి జూనియర్ అసిస్టెంట్లుగా వచ్చిన ఇద్దరిలో ఒకరికి సీనియర్ అసిస్టెంట్ రాగా, మరొకరు జూనియర్ అసిస్టెంట్‌గా ఇక్కడే తిష్ట వేశారు. డీసీ కార్యాలయమే శాశ్వత నివాసం... బదిలీలకు నోచుకోని ఈ ఆరుగురు ఉద్యోగులు డీసీ కార్యాలయమే శాశ్వత కార్యాలయంగా మార్చేసుకున్నారు. ఏటేటా ఈ కార్యాలయంలో పలువురికి బదిలీలు జరుగుతున్నా వీరి సీటుకు మాత్రం ఢోకా ఉండటం లేదు. బదిలీల ప్రక్రియ మొదలవుతుందనగానే అధికారులకు ‘సంభావనలు’ సమర్పించుకొని బదిలీ జాబితాలో తమ పేరు లేకుండా చేసుకుంటున్నారు. డీసీగా ఎవరు వచ్చినా కార్యాలయంలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టేది ఆ అరడజను మంది ఉద్యోగులేనని కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. పదోన్నతులు పొందుతున్నా సీటు మారుతారే తప్ప బయటకు పోయే ప్రసక్తే లేదు. మూడు జిల్లాలు పరిధిలో ఉన్న దేవాదాయశాఖ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఫైళ్లు, సత్రాల భూముల లీజులు పెంపు, షాపింగ్ కాంప్లెక్సుల్లో దుకాణాల రెన్యూవల్స్ ఫైళ్లు... ఇలా ప్రతి నెలా వచ్చే 20, 30 ఫైళ్లు కార్యాలయ ఉన్నతాధికారి టేబుల్‌పైకి వెళ్లాలంటే ముందు వీరందరి చేతులు తడపాల్సిందే. ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు నిర్ణయించి దండుకోవడం ఇక్కడ రివాజుగా మారిపోయింది. వీరి నుంచే పక్కాగా ఎవరి వాటా వారికి వెళ్తుండడంతో పై అధికారులు కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇలా చేయొచ్చు..అయినా... ఈ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కలిగిన ఉద్యోగులను నిబంధనల ప్రకారం జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలి. వీరిని జిల్లాలో ఉన్న ఏసీ, జెవీవో (జ్యువెలరీ వెర్ఫికేషన్ ఆఫీసర్) కార్యాలయానికి బదిలీ చేయవచ్చు. సీనియర్ అసిస్టెంట్లను ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాతోపాటు రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) కార్యాలయం సహా జిల్లాలో పలు ప్రాంతాలకు ఇన్స్పెక్టర్లుగా బదిలీ చేయవచ్చు. అయినా సరే దశాబ్దాలుగా కార్యాలయానికే అతుక్కుపోయిన ఈ ఉద్యోగులను మాత్రం కొనసాగిస్తున్న తీరు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆ కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్‌గా రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈ ఉద్యోగుల వ్యవహారాలు మరింత మితిమీరిపోయాయంటున్నారు. ఆయన కార్యాలయానికి అప్పుడప్పుడు వచ్చిపోతుండటంతో వీరి ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతోందని మండిపడుతున్నారు. తాజాగా బదిలీల ప్రక్రియకు తెరలేవడంతో ఈసారైనా వీరికి స్థాన చలనం ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే. -
పాతనోట్ల మార్పిడి నో చెప్పిన సుప్రీం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత ధర్మాసనం నాసిక్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు షాకిచ్చింది. రద్దయిన పెద్దనోట్లను భారీమొత్తంలో డిపాజిట్ చేయడానికి అనుమతిని సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.371కోట్ల పాత కరెన్సీనోట్ల మార్పిడికి అనుమతించాల్సిందిగా పెట్టుకున్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టి పారేసింది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్32 ప్రకారం ఈ పిటిషన్ తిరస్కరిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. నోట్ల జమకు ఆర్బీఐ నిరాకరించిడంతో కో ఆపరేటివ్ బ్యాంకు సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. ఈ నోట్ల జమకు అనుమతిని నిరాకరిస్తే..లిక్విడిటీ రేషియో దెబ్బతింటుందని, తద్వారా నాసిక్ జిల్లాలో 281 తమ కార్యాలయాలు మూతపడతాయని బ్యాంకు వాదించింది. 2016, నవంబర్ 8-14 మధ్య తమ ఖాతాదారులు జమ చేసిన సొమ్ము ఇది అనీ, ఎక్కువగా రైతులకు రుణాలను అందించే బ్యాంకు శాఖలు మూసివేత తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందన్న బ్యాంకు వాదించింది. కోఆపరేటివ్ బ్యాంకు తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలను వినిపించారు. ఇది ఇలా ఉంటో మరోకేసులో కూడా రద్దయిన నోట్ల డిపాజిట్‌కు ఎపెక్స్ కోర్టు నో చెప్పింది. ఇప్పటికే ఎన్పీఏగా ప్రకటించిన రాను ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు చెందిరన రూ. 10కోట్లను పాత కరెన్సీమార్పిడికి అనుమతిని నిరాకరించింది. -
ఆ నోట్లపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల ముద్రణపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రూ.5000 రూ.10, 000 నోట్లను పరిచయం చేసే యోచన లేదని స్పష్టం చేసింది. అలాంటి ఆలోచనలు లేవని శుక్రవారం వెల్లడించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్‌సభలో ఈ మేరకు వివరణ ఇచ్చారు. ముద్రణ ఖర్చులను తగ్గించుకునేందుకు ..అయిదువేలు,పదివేల నోట్లను తీసుకురానున్నారా అని సభలో ప్రశ్నించినపుడు మంత్రి ఇలా సమాధానమిచ్చారు. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించినట్టు అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వీటి ముద్రణకు తగిన నిధులు ఆర్బీఐ దగ్గర లేవని చెప్పారు. కాగా గత ఏడాది నవంబర్ 8న అప్పటికి చెలామణీలో 86 శాతం రూ.500, రూ.1000నోట్లను కేంద్రప్రభుత్వం నిషేధించింది. అనంతరం క్రొత్త రూ .500 నోటుతోపాటు,రూ.2 వేలనోటును కూడా పరిచయం చేసింది. అలాగే మళ్లీ వెయ్యి రూపాయల నోటును తిరిగి పరిచయం చేసే ఆలోచన లేదని గతనెలలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ స్పష్టం చేసారు. -
సినీనటులకు రాజకీయ స్టాండ్ ఉండకూడదట!
న్యూఢిల్లీ: కహానీ, డర్టీపిక్చర్ లాంటి సినిమాలతో విలక్షణనటిగా గుర్తింపు తెచ్చుకుని తనదైన నటనతో దూసుకుపోతున్న బాలీవుడ్ భామ విద్యాబాలన్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు రాజకీయాలపై ఒక వైఖరి తీసుకోకూడదని నేషనల్ అవార్డు విజేత విద్య అభిప్రాయపడ్డారు. రాజకీయాలపై తన వైఖరిని వ్యక్తం చేయడం ద్వారా తన అభిమానులను ప్రభావితం చేయడం తనకు ఇష్టముండదని తెలిపారు. అందుకే తాను ఎలాంటి రాజకీయ స్టాండ్ తీసుకోనని వివరించారు. పద్మావతి ఔట్ డోర్ సెట్ దాడి ఘటనపై స్పందించిన విద్య ఇటీవల కొత్త సినిమాలు యాక్టవిస్టుల దాడులకు కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. ఇది తనను చాలా బాధించిందన్నారు. ఈ దాడులు పెరుగుతున్నాయంటూ విచారం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్‌కు ముందు ఏదో విధంగా వివాదం సృష్టించి దృష్టిని తమవైపు మరల్చుకుంటారని విద్య ఆరోపించారు. పరిశ్రమకు బయట, లోపల ఉన్న కొంతమంది వ్యక్తులు ఇలాంటి వివాదాలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. అలాగే సింగర్ నాహిద్కు మద్దతుగా నిలిచారు. కళలకు ఎల్లలు లేవని వ్యాఖ్యానించారు. ఈశ్వర్ ని అయినా.. అల్లా అని అయినా కలుపేది ఆ కళేనని తాను నమ్ముతానని చెప్పారు. వేశ్యాగృహం నడిపే మహిళ కథ విన్నపుడు వివాదాస్పదమవుతుందని తాను భావించాననీ, కానీ "బేగం జాన్" కు ఎలాంటి కట్ లు లేకుండా సెన్సార్ అనుమతి లభించడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయితే అవసరమైతే నిర్మాత మహేష్ భట్, దర్శకుడు శ్రీజిత ముఖర్జీ ఈ మూవీ కోసం ఫైట్ చేస్తారనే నమ్మకం కూడా తనకు ఉండిందన్నారు. ఈ సినిమాలో చాలా ఆకట్టుకునే బలమైన దృశ్యాలున్నాయని చెప్పారు. కాగా వేశ్యాగృహం యజమానిగా బేగం జాన్ పాత్రలో విద్యాబాలన్ నటించిన బేగం జాన్ ట్రైలర్లో దేశవ్యాప్తంగా పలువురిని విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.