Published
Wed, Aug 17 2016 11:57 PM
| Last Updated on Fri, Oct 5 2018 6:40 PM
దళితులకు రక్షణ కరువు
సామర్లకోట: టీడీపీ, బీజేపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి ఆర్. శ్యామ్ దయాకర్ ఆరోపించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూదాపాలెంలో చర్మకారులపై దాడి జరిగిన విషయం తెలిసి కూడా బాధితులను పరామర్శించక పోవడం విచారకరమని అన్నారు. దళితులపై దాడి జరిగి వారం రోజులు గడిచినప్పటికీ నిందితులపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారికి అధికారులు, ప్రజాప్రతినిధులు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని దయాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీలను విభజించి పాలించడానికే వర్గీకరణకు మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.