కల్తీ తినుబండారాలు ధ్వంసం
Published Thu, Aug 4 2016 10:52 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
ముకరంపుర : తినుబండారాలు చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్, స్వీట్లలోను కల్తీచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహిస్తూ నగరంలోని దుకాణాలపై సీపీఐ నాయకులు గురువారం దాడులు చేశారు. తినుబండారాలను ఫుడ్‌సేఫ్టీ కార్యాలయం ఎదుట దహనం చేశారు. సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు మాట్లాడుతూ కల్తీ కన్ఫెక్షనరీ వ్యాపారం జోరుగా సాగుతుందన్నారు. చిన్నపిల్లల ప్రాణాలను హరిస్తూ కోట్లకు పరుగులెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు మామూళ్లకు అలవాటుపడి తనిఖీలే మరిచిపోయారన్నారు. చౌకగా తయారు చేయించుకుని జీరో వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపించారు. నాణ్యత పాటించని వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పంజాల శ్రీనివాస్, రాజేశం, కసిరెడ్డి మణికంఠరెడ్డి, ముల్కల మల్లేశం, కసిబోజుల సంతోష్‌చారి, పులి రాకేశ్, శ్రీనివాస్, పవార్ రాజు, మంగలి, సమ్మయ్య, నరేశ్, మహేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Advertisement