safty
-
ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదు
సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్): ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం పోలీసులకు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అన్నారు. ఆడపిల్లలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలను సమాజమే దీటుగా ఎదుర్కోవాలన్నారు. గుంటూరు అరణ్య భవన్లో ఆదివారం అటవీ అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. మహిళలపై నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, వాటి అమలులో చిత్తశుద్ధి కావాలన్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచి్చనా.. కోల్‌కతాలో వైద్యురాలిపై పాశవిక దాడి జరిగిందన్నారు. తమ కళ్లెదుట జరుగుతున్న నేరాలు, ఘోరాలను ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్య నేర్చుకుని, తమపై దాడులకు తెగబడే ఉన్మాదులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. గంజాయి. మత్తు పదార్థాలను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల్ని బెదిరిస్తే సుమోటో కేసులు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే ఎక్కడ ఉన్నా పిలిపిస్తామని ఐపీఎస్ అధికారులపై చేస్తున్న బెదిరింపులపై సుమోటో కేసులు వేస్తామని పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. ఒక మాజీ సీఎం స్థాయిలో పోలీసు అధికారులను బెదిరించడం సరైంది కాదని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలం అని మాజీ సీఎం అంటున్నారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. 20 ఏళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉంటుందని గతంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారన్నారు.గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట రోడ్ల పక్కన చెట్లు నరికేశారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. షర్మిల కోరితే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని చెప్పారు. సరస్వతి భూములపై చర్యలు సరస్వతి పవర్ ప్లాంట్ భూముల వ్యవహారంపై చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ చెప్పారు. 76 ఎకరాల అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఆక్రమించారని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నామన్నారు. పవర్ ప్లాంట్ పరిధిలో గ్రీన్‌జోన్ ఏర్పాటు చేయలేదని, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు సైతం లేవని అన్నారు. విశాఖ నడి»ొడ్డున గంజాయి పెంచుతున్నారని, గంజాయి సాగు, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అటవీ దళాల అధిపతి చిరంజీవి చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియో : విభిన్న నృత్య రీతులతో
టాటా గ్రూపు యాజమాన్యంలో ఎయిరిండియా ఇటీవల సరికొత్తగా ముస్తాబైంది. విమానాల్ని కలర్ఫుల్గా, ముఖ్యంగా ఎయర్హెస్టెస్ తదితర సిబ్బంది డ్రెస్ కోడ్‌ను అందంగా తీర్చిదిద్దింది. తాజాగా మరో కొత్త అప్డేట్ను కూడా ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొత్త ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియోను తీసుకొచ్చింది. ఎయిరిండియా విమానం బయలు దేరడానికి ముందు వినిపించే ప్రయాణీకుల కోసం 'సేఫ్టీ ముద్ర' అనే కొత్త ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియోను పరిచయం చేసింది. వివిధ కళారూపాల నుండి ప్రేరణ పొందినట్టు తెలిపింది. "శతాబ్దాలుగా, భారతీయ శాస్త్రీయ నృత్యం , జానపద-కళా రూపాలు కథలు, సూచిక మాధ్యమంగా పనిచేశాయి. నేడు, అవి విమాన భద్రత గురించి మరొక కథను చెబుతున్నాయి." అని ట్వీట్ చేసింది. సుసంపన్నమైన, విభిన్నమైన నృత్య రీతుల ప్రేరణతో కొత్త సేఫ్టీ ఫిల్మ్అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. మెకాన్ వరల్డ్గ్రూప్కు చెందిన ప్రసూన్ జోషి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ , డైరెక్టర్ భరతబాల సంయుక్తగా 'సేఫ్టీ ముద్రాస్'ను దీన్ని తీసుకొచ్చారు. భరతనాట్యం, బిహు, కథక్, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్ .గిద్దా, ఎనిమిది విభిన్న నృత్య రూపాల్లో ముద్రలు లేదా నృత్యవ్యక్తీకరణలు ఇందులో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అవసరమైన భద్రతా సూచనలను అందించేలా దీన్ని తీర్చిదిద్దడం సంతోషదాయమన్నారు ఎయిరిండియా సీఎండీ కాంప్‌బెల్ విల్సన్ For centuries, Indian classical dance and folk-art forms have served as medium of storytelling and instruction. Today, they tell another story, that of inflight safety. Presenting Air India’s new Safety Film, inspired by the rich and diverse dance traditions of India.#FlyAI… pic.twitter.com/b7ULTRuX1Z — Air India (@airindia) February 23, 2024 -
మస్క్‌కు మరో ఝలక్: కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై
న్యూఢిల్లీ: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఎగ్జిక్యూటివ్ సంస్థకు గుడ్ బై చెప్పారు. ట్విటర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ తన పదవికి రాజీనామా చేశారు. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) రాయిటర్స్ నివేదిక ప్రకారం కంటెంట్ నియంత్రణను పర్యవేక్షణా అధికారి ఇర్విన్ సంస్థ నుంచి వైదొలగారు. ట్విటర్ టేకోవర్ చేసిన క్లిష్ట సమయంలో, అప్పటి హెడ్ యోయెల్ రోత్ రాజీనామా చేయడంతో జూన్ 2022లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ అధిపతిగా ఇర్విన్ బాధ్యతలు చేపట్టారు. విద్వేష పూరిత కంటెంట్, ట్విటర్లో ప్రకటనదారులు ఒక్కొక్కరు తప్పుకుంటున్న సమయంలో ఇర్విన్ నిష్క్రమణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామంపై మస్క్ అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా ట్విటర్.2 సీఈవోగా లిండా యాకారినోను నియమించినట్లు మస్క్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) -
భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ఇవే!
భారతదేశంలో ఎక్కువ మంది సొంతంగా కార్లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే కొనుగోలుదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లను ఎంచుకుంటున్నారు. అలాంటి వారికోసం ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి తక్కువ ధరకు లభించే టాప్-5 కార్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: దేశీయ మార్కెట్లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి రూ. 7.95 లక్షల నుంచి రూ. 8.51 లక్షల మధ్య లభించే సరసమైన కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆస్టా. ఇందులో డ్రైవర్, ఫ్యాసింజర్, సైడ్ ఎయిర్ బ్యాగులను పొందుతుంది. కావున భారతదేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటిగా ఉంది. గ్రాండ్ ఐ10 నియోస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి బాలెనొ: మారుతి సుజుకి కంపెనీకి చెందిన బాలెనొ జీటా, ఆల్ఫా ట్రిమ్‌లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. దీని ధర రూ. 8.38 లక్షల నుంచి రూ. 9.88 లక్షల మధ్య ఉంటుంది. CNG మోడల్ కారులో కూడా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న బాలెనొ పనితీరు పరంగా కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. హ్యుందాయ్ ఆరా: ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే హ్యుందాయ్ ఆరా ధర రూ. 8.61 లక్షలు. ఆరా ఎస్ఎక్స్(ఓ) ట్రిమ్‌లో మాత్రమే ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. మిగిలిన అన్ని వేరియంట్లు నాలుగు ఎయిర్ బ్యాగులను పొందుతాయి. హ్యుందాయ్ ఆరా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. (ఇదీ చదవండి: రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!) టయోటా గ్లాంజా: ఇండియన్ మార్కెట్లో రూ. 8.63 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య లభించే టయోటా గ్లాంజా ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని జి, వి ట్రిమ్‌లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 హెచ్‌పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!) హ్యుందాయ్ ఐ20: మన జాబితాలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఆరు ఎయిర్ బ్యాగులు కలిగిన హ్యుందాయ్ ఐ20 ఒకటి. దీని ధర రూ. 9.77 లక్షల నుంచి రూ. 11.88 లక్షల మధ్య ఉంటుంది. ఆరు ఎయిర్ బ్యాగులు హ్యుందాయ్ ఐ20 ఆస్టా(ఓ) ట్రిమ్‌లో మాత్రమే ఉంటాయి. ఐ20 రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్. రెండూ మంచి పనితీరుని అందిస్తాయి. -
మహిళల పట్ల సున్నితత్వంతో మెలగాలి: రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: మహిళల ప ట్ల సున్నితత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము మీడియాను కోరారు. వార్తలు, కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు ప్రసా రం చేసేటప్పుడు మహిళల గౌరవాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి భారతీయ పౌరుడు మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యలను విడనాడాలని మన రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. నవభారత్ టైమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆల్ వుమెన్ బైక్ ర్యాలీను జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపారు. ‘మహిళలను గురించి ప్రతి పౌరుడు గౌరవప్రదంగా ఆలోచించాలి. మహిళల పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తనకు పునాది కుటుంబమే. తల్లులు, సోదరీమణులు తమ కొడుకులు, సోదరుల్లో మహిళలకు గౌరవం ఇచ్చే విలువలను పెంపొందించాలి. విద్యార్థుల్లో మహిళల పట్ల గౌరవాన్ని, సున్నితత్వంగా మెలిగే సంస్కృతిని ఉపాధ్యాయులు పెంపొందించాలి’అని ద్రౌపదీ ముర్ము కోరారు. ‘మహిళల్లో మాతృత్వ సామర్ధ్యం, నాయకత్వ సామర్ధ్యం సహజంగానే ఉంటాయి. అనేక పరిమితులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మహిళలు తమ అసమానమైన ధైర్యం, నైపుణ్యాలతో కొత్త విజయ రికార్డులను నెలకొల్పారు’అని ఆమె పేర్కొన్నారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
మెరుపులనే దారి మళ్లించారు!
పారిస్: మెరుపంటేనే వేగానికి పెట్టింది పేరు. వేగానికి అత్యుత్తమ ఉపమానం కూడా. మెరుపు వేగం గంటకు ఏకంగా 4.3 లక్షల కిలోమీటర్ల దాకా ఉంటుంది. మెరుపుల ఫలితంగా విను వీధిలో మన కంటికి కనిపించే కాంతులైతే నిజంగా కాంతి వేగంతోనే (సెకను 3 లక్షల కిలోమీటర్లు) దూసుకెళ్తాయి. అలాంటి మెరుపులను దారి మళ్లించగలిగితే? ఫ్రెంచి పరిశోధకులు తాజాగా అలాంటి ఘనతే సాధించారు!! అతి శక్తిమంతమైన లేజర్ కిరణాల ద్వారా వాటి దారిని విజయవంతంగా మార్చగలిగారు. పిడుగుపాటు బారినుంచి రక్షించే వ్యవస్థల్లో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని భావిస్తున్నారు. మెరుపును అనుసరిస్తూ వచ్చి పడే పిడుగుల వల్ల భవనాలు, సమాచార వ్యవస్థ, విద్యుత్ ఉపకరణాలు, సరఫరా లైన్లు దెబ్బ తిని ఏటా వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లడమే గాక వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం తెలిసిందే. ఈ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయగలిగితే దీని సాయంతో విమానాశ్రయాలు, భారీ విద్యుత్కేంద్రాలు, ఉపగ్రహాల లాంచింగ్ ప్యాడ్ల వంటి భారీ నిర్మాణాలకు పిడుగుపాట్ల నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించవచ్చని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్స్ లేబొరేటరీ ఆఫ్ అప్లైడ్ ఆప్టిక్స్కు చెందిన పరిశోధకులు అత్యంత శక్తిమంతమైన లేజర్ పరికరాల సాయంతో ఈ ప్రయోగానికి పూనుకున్నారు. ఇందుకోసం ఏకంగా మూడు టన్నుల బరువు, కారు పరిమాణమున్న లేజర్ పరికరాన్ని ఈశాన్య స్విట్జర్లాండ్‌లోని శాంటిస్ పర్వత శిఖరంపై 2,500 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. దానిద్వారా సెకనుకు ఏకంగా 1,000కి పైగా అతి శక్తిమంతమైన కిరణాలను ఆకాశంలో మెరుపులకేసి పంపించారు. తొలి ప్రయత్నంలోనే వాటి దారిని 160 అడుగుల దాకా మళ్లించగలిగారు. రెండు హైస్పీడ్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా దీన్ని గుర్తించారు. ‘‘అతి శక్తిమంతమైన లేజర్ కిరణాలను ఆకాశంలోకి పంపినప్పుడు శక్తిమంతమైన కాంతితో కూడిన ఫిలమెంట్లు ఏర్పడతాయి. అవి గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులను అయానీకరిస్తాయి. ఈ చర్య ఫలితంగా స్వేచ్ఛగా కదలాగే ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ప్లాస్మాగా పిలిచే ఈ అయానీకరణ చెందిన గాలి ఎలక్ట్రాన్ల వాహకంగా పని చేస్తుంది’’ అంటూ ఈ టెక్నాలజీ పని చేసే తీరును డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ జీన్ పియరీ వూల్ఫ్ వివరించారు. నిజానికి ఈ కాన్సెప్టును తొలుత 1970ల్లోనే ప్రతిపాదించినా ఇప్పటిదాకా ల్యాబుల్లోనే ప్రయోగించి చూశారు. బయటి వాతావరణంలో ప్రయోగం జరపడం ఇదే తొలిసారి. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ నేచర్ ఫోటానిక్స్‌లో పబ్లిషయ్యాయి. వీటి సాయంతో పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తేగల హై పవర్ లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిలో సైంటిస్టులు బిజీగా ఉన్నారు! -
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట లభించింది. బ్యాటరీలకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. నూతన బ్యాటరీ భద్రతా ప్రమాణాలను రెండంచెల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. రెండో దశ నిబంధనలు 2023 మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రమాదాలకు కారణం బ్యాటరీలేనని తేలింది. దీంతో నిపుణుల సూచనల మేరకు కేంద్ర రవాణా శాఖ అదనపు భద్రతా ప్రమాణాలను రూపొందించి, ఆ మేరకు నిబంధనల్లో సవరణలు చేసింది. బ్యాటరీ సెల్స్, ఆన్ బోర్డ్ చార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్, వేడిని తట్టుకోగలగడం తదితర అంశాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. -
నమో ఆరోగ్య దీపావళి
ధర్మశాస్త్రాలలో చెప్పిన దీపావళికి ఇప్పటి దీపావళికి సంబంధం లేదు. ఈనాటి పండుగ ధన వ్యయానికి, ప్రాణప్రమాదాలు, గాయాలకు కారణమౌతోంది. అసలైన దీపావళిని శారీరక మానసిక ఆరోగ్యాల కోసం మన ఋషులు ఏర్పరిచారు. చలికాలంలో పర్యావరణ పరిరక్షణ, వ్యాధి నిర్మూలన ఈ పండుగ నిర్దేశిత లక్ష్యాలు. చలితో మంచుతో వాతావరణంలో, ఉష్ణోగ్రతలో మార్పులను తట్టుకొనే విధంగా నువ్వుల నూనెతో అసంఖ్యాకంగా దీపాలను వెలిగించటమే దీపావళి. ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతల సమ్మేళనంగా ఏర్పడిన దీపావళి పండుగ భారతీయ పర్వదినాలలో ప్రధానమైనది. పౌరాణికంగా ఈ పండుగ ద్వాపర యుగంలో సత్యభామాశ్రీకృష్ణులు నరకాసురుని సంహరించిన సందర్భంగా ఏర్పడింది. పదహారు వేలమంది స్త్రీలను చెరపట్టిన పరమ దుర్మార్గుణ్ని చంపినప్పుడు ప్రజలలో కలిగిన ఆనందానికి ఈ పండుగ సంకేతం అయినప్పటికీ ఇందులోని పరమార్థం వేరే ఉంది. చలికాలంలో వచ్చే చర్మవ్యాధులకు, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల నివారణకు నువ్వులు, నువ్వులనూనె వాడకం సులభోపాయం. దీపావళి పండుగలోని పరమార్థం కూడా ఇదే! వేదాలు, ఉపనిషత్తులలో, పితృకార్యాలలో ప్రస్తావించబడిన తిలలు (నువ్వులు) ద్వాపర యుగం అనగా అయిదు వేల సంవత్సరాలకు పూర్వం నుండి భారతదేశంలో పండుతున్నాయి. శ్రీకృష్ణావతార కాలానికి – నువ్వుల పంట భౌగోళిక చరిత్రకు... లెక్క సరిపోతుంది. ఆశ్వయ్యుజ కృష్ణపక్షస్య చతుర్దశ్యాం విధూదయే తిలతైలేన కర్తవ్యం స్నానంనరక భీరుణా (నిర్ణయ సింధు) నరక చతుర్దశినాడు తప్పకుండా అందరూ నల్ల నువ్వులతో కలిపి కొట్టిన సున్నిపిండిని నువ్వుల నూనెను తలకు, ఒళ్లంతా పూసుకుని కుంకుడుకాయ రసంతో తలంటి పోసుకోవాలి. అమావాస్యనాడు సాయంకాలం లక్ష్మీదేవి పూజ చేసి నువ్వులనూనెతో అసంఖ్యాకంగా దీపాలు వెలిగించాలి. అప్పుడు ఉష్ణోగ్రత పెరిగి చలి తగ్గుతుంది. పొలాల్లో, ఇళ్లల్లో బాధించే క్రిమికీటకాలు దీపాల వెలుగుకు ఆకర్షింపబడి దీపాల చుట్టూ తిరుగుతూ చచ్చిపోతాయి. నువ్వులనూనెతో వెలిగే దీపాలకున్న శక్తిని తెలపటానికే దీపావళి పండుగ ఏర్పడింది. దీపైః నీరాజనాదత్రసైషా దీపావళీ స్మృతా’ (మత్స్యపురాణం) పిల్లలు, పెద్దలు స్వయంగా తయారుచేసుకునేవన్నీ వెలుగునిచ్చేవే. పేలుడు పదార్థాలకు దీపావళి పండుగకు సంబంధం లేదు. ఆవు పేడ, తాటి పూలు, బొగ్గులతో చుట్టిన పూల పొట్లాలను వీధిలో నిలబడి గిరగిరా తిప్పితే శారీరక వ్యాయామంగా పౌరుష సూచకంగా పర్యావరణ పరిరక్షణకు పనికివస్తాయి. శబ్దాలు, మిరుమిట్లు గొలిపే కాంతులతో చెవులు, కళ్లు పాడుచేసుకోమని దీపావళి చెప్పలేదు. గోగు పుల్లలకు గుడ్డ చుట్టి నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. దీపావళి నాడు ఉదయం నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. నువ్వులనూనెతో చేసిన గారెలు, వడలు వంటి పిండివంటలు, చిమ్మిరి ఉండలు నైవేద్యం పెట్టాలి. నువ్వు తెలగపిండి కూరల్లో కలిపి వండాలి. ఇలా శారీరక ఆరోగ్యానికి అన్నివిధాల లాభదాయకమై... పర్యావరణాన్ని, పంటలను రక్షించటానికి, చలిని పోగొట్టటానికి ఏర్పడింది దీపావళి పండుగ. నరకాసురుని కథ ద్వారా యువతరంలో సత్ప్రవర్తనను, తల్లిదండ్రులకు చక్కని పిల్లల పెంపకాన్ని తెలియచేసే కర్తవ్యబోధిని. శాస్త్రీయంగా, నిరాడంబరంగా నిర్భయంగా నిజమైన దీపావళి పండుగను జరుపుకుందాం. దేవ, పితృ, ఋషి ఋణాలు తీర్చుకుందాం. – డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
బలైపోతున్న కార్మికులు
సాక్షి, కొత్తూరు: కార్మికుల భద్రత కోసం ఎన్నో చట్టాలు ఉన్నా ఎక్కడా సరిగా అమలు కావడం లేదు. అధికారులు పర్యవేక్షణ లేమి నిర్వాహకులకు వరంగా మారింది. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని పరిశ్రమల్లో ఏమాత్రం అనుభవం లేని కార్మికులతో పనులు చేయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రమాదాలు జరగడం, కార్మికులు మృత్యుఒడికి చేరడం సాధారణ విషయంగా మారిపోయింది. తమ ప్రాంతంలో సరైన ఉపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు కొత్తూరు పారిశ్రామిక వాడలో పనిచేసేందుకు వస్తున్నారు. పొట్టకూటి కోసం వస్తున్న వారు తరచూ ప్రమాదాలు జరగడంతో ఇక్కడే బలైపోతూ సొంత ప్రాంతాలకు విగతజీవులుగా వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాంట్రాక్టర్లు, పరిశ్రమల యాజమాన్యాలు ఇక్కడ ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నచందంగా మారింది. పరిశ్రమల్లో తరచూ తనిఖీలు చేసి కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలోని కొత్తూరు, నందిగామ మండలాల్లో ఐరన్, స్పాంజ్ ఇనుము పరిశ్రమలు పదులసంఖ్యలో ఉన్నాయి. ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి. భద్రత ఎండమావే.. ముఖ్యంగా ఐరన్, స్పాంజ్ ఇనుము పరిశ్రమల నిర్వాహకులు కార్మికుల కోసం కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలను సైతం సమకూర్చడం లేదు. అనుభవం ఉన్న కార్మికులను విధుల్లో పెట్టుకుంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే దురుద్దేశంతో ఏమాత్రం అనుభవం లేని కార్మికులను పనలో పెట్టుకోవడంతో ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. కార్మికులకు రక్షణ పరికరాలను ఇవ్వకపోవడం, యంత్రాల పనితీరుపై అవగాహన లేకపోవడం, ప్రమాదాలు సంభవిస్తే తప్పించుకునే జాగ్రత్తలు తెలియక చిన్నచిన్న ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొన్ని ఘటనల్లో కార్మికులు మృత్యువాత పడుతున్నాయి. ప్రమాదాలు జరిగినా సంబంధిత కంపెనీల నిర్వాహకులు ఏమాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు. ఎంతోకొంత బాధితులకు పరిహారం ముట్టజెప్పి చేతులెత్తేస్తున్నారు. విషయం వెలుగులోకి రాకుండా మిగతా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకా రం ప్రతి పరిశ్రమలో భద్రతా అధికారి (సెఫ్టీ ఆఫీసర్) నిత్యం కార్మికులకు భద్రతపై అవగాహన కల్పించాలి. అనుకోకుండా ప్రమాదాలు సంభవిస్తే ఎలా వ్యవహరించాలి.. ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశాలపై తర చూ ప్రదర్శనలు(మాక్ డ్రిల్) నిర్వహించాలి. అంతేకాకుండా యంత్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతి కార్మికుడు తప్పకుండా రక్షణ పరికరాలను వినియోగించే విధం గా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఎక్కడా అమ లు కావడం లేదు. ఇక్కడి పారిశ్రామికవాడలో పదుల సంఖ్యలో కంపెనీలు ఉన్నా రెండుమూడు పరిశ్రమల్లోనే సెఫ్టీ ఆఫీసర్లు ఉన్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు ఐరన్ పరిశ్రమల్లో ఎక్కువగా ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి కార్మిక చట్టాలు.. రక్షణ పరికరాల గురించి అంతగా అవగాహన లేదు. ఇదే అదనుగా భావిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలు తమ కంపెనీల్లో 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తే అందులో 40 మందికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్, తదితర సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలను కూడా అమలు చేయడం లేదు. క్వాటర్స్‌లో ఉండే కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఈ అంశాలను పరిశ్రమల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తరచూ తనిఖీలు చేస్తున్నా కార్మికుల భద్రతపై చర్యలు తీసుకోకున్న దాఖలాలు లేవు. పరిహారం అంతంతే నిబంధనల ప్రకారం ఏదైనా పరిశ్రమలో ప్రమాదం జరిగితే వెంటనే నిర్వాహకులు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కాగా ఇక్కడి నిర్వాహకులు మాత్రం ప్రమాదాలు జరిగితే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఒకవేళ కార్మికులు ప్రమాదాల బారినపడి మృతిచెందితే వారి మృతదేహాలను ఆస్పత్రి నుంచే వారి బంధువులకు అప్పగించడం.. స్వస్థలాలకు చేరవేయడం హడావిడిగా చేస్తున్నారు. ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. అంతేతప్ప నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ఇవ్వడం లేదు. ఒకవేళ విషయం బయటకు వచ్చి బాధితులు కార్మిక సంఘాలతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేస్తే తప్ప వారికి న్యాయం జరగడం లేదు. జరిగిన ప్రమాదాలు ఇవీ.. కొత్తూరు మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ఐరన్ పరిశ్రమలో (ఫర్నస్)బాయిలర్ పేలిన ప్రమాదంలో ఐదేళ్ల క్రితం పదిమంది మృతి చెందారు. పారిశ్రామికవాడలోని రాయలసీమ ఇండస్ట్రీస్‌లో నాలుగేళ్ల కాలంలో పలు ప్రమాదాలు జరిగాయి. నలుగురు కార్మికులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు తీగాపూర్ శివారులో పాత టైర్లను కాల్చే పరిశ్రమలో ఆరేళ్ల క్రితం బాయిలర్ఢ్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోయారు. నందిగామ మండలంలోని శివశక్తి, జాగృతి పరిశ్రమల్లో బాయిలర్ పేలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. తాజాగా గురువారం రాత్రి తీగపూర్ శివారులోని మానసరోవర్ పరిశ్రమలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు నేను విధులు నిర్వహిస్తున్న ఐరన్ పరిశ్రమలో యాజమాన్యాలు కనీస వసతులు కల్పించడం లేదు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు లేనేలేవు. చివరకు పనికితగిన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. రేకుల షెడ్డులే క్వాటర్స్గా మార్చారు. అనారోగ్యానికి గురైనా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. వేతనాలు, సౌకర్యాల గురించి ప్రశ్నిస్తే యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు వేధిస్తున్నారు. – ఓ కార్మికుడి ఆవేదన తనిఖీ అధికారం మాకు లేదు పరిశ్రమలు కార్మికుల సేఫ్టీకి చర్యలు తీసుకుంటున్నారో లేదో తనిఖీ చేసే అధికారం మాకు లేదు. ఒక జిల్లా అధికారులు.. మరో జిల్లాకు వెళ్లి ర్యాండమ్‌గా పరిశీలిస్తారు. ఈమేరకు ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ఫిర్యాదులు వస్తేనే మేము క్షేత్రస్థాయి కి వెళ్లి ఆరా తీయాల్సి ఉంటుంది. కొత్తూ రు మండలంలోని మానస సరోవర్ పరి శ్రమలో బాయిలర్ పేలడంతో కార్మికుడి మృతికి కారణమైన కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలాగే ఘటన విషయాన్ని మాకు తెలియజేయకపోవడమూ నేరమే. దీనిపైనా చర్యలు ఉంటాయి. – కె.శ్రీనివాస్, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ -
బోగీల్లో ప్యానిక్ బటన్ -ఈశాన్య రైల్వే
సాక్షి, లక్నో: రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్న రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు బోగీల్లో ప్యానిక్ బటన్ ఏర్పాటు చేయనున్నామని ఈశాన్య రైల్వే విభాగం (ఎన్ఈఆర్) ప్రకటించింది. అలాగే రాత్రి పూట మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. రైళ్ళలో మహిళల భద్రతను బలోపేతం చేయాలన్న యోచన దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మహిళల నియామకాలతోపాటు, రాత్రిపూట రైళ్ళలో మహిళా బోగీలన్నింటిలో మహిళా పోలీసులను నియమించాలని, ప్యానిక్ బటన్ వ్యవస్థను నెలకొల్పనున్నట్లు ఎన్ఈఆర్ సీనియర్ అధికారి సంజయ్ యాదవ్ ప్రకటించారు. ప్రమాద పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఈ ప్యానిక్ బటన్‌ను నొక్కిన వెంటనే బోగీ బయట, రైలు డ్రైవర్ వద్ద, కంట్రోల్ రూంలో ప్రమాద హెచ్చరిక లైట్లు వెలుగుతాయని వివరించారు. ప్రస్తుతం, మహిళా ప్రయాణీకులు కాల్ లేదా ఎస్ఎంఎస్ , హెల్ప్‌లైన్ నెంబర్లు,లేదా అత్యవసర పరిస్థితిలో గొలుసు-లాగడం లాంటి వాటిమీద ఆధారపడవలసి వస్తోందీ కానీ ప్యానిక్బటన్ వ్యవస్థతో తక్షణమే చర్య తీసుకునేఅవకాశం ఉందని తెలిపారు. సబర్బన్ రైళ్ల బోగీల్లో సీసీటీవీ ఏర్పాటును కూడా ఆలోచిస్తున్నామన్నారు. అలాగే మహిళా బోగీలను తొందరగా గుర్తించేందుకు వీలుగా రంగులను మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. -
ఫ్లోరిడాలో ప్రజల రక్షణపై అవగాహన కల్పించిన నాట్స్
టెంపా(ఫ్లోరిడా): అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలోని ఫ్లోరిడాలో తెలుగువారి రక్షణపై ప్రత్యేక దృష్టిసారించింది. స్థానికంగా జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా ఉండటం ఎలా అనే దానిపై అవగాహన కల్పిచేందుకు నడుంబిగించింది. ఈ క్రమంలోనే క్రైమ్ ప్రివెన్షన్అండ్ యాక్టివ్ షూటర్ ప్రిపేరేడ్నెస్ వర్క్ షాప్ ఏర్పాటు చేసింది. ఆకస్మాత్తుగా చేసే దాడుల పట్ల ఎలా వ్యవహారించాలి. ఎలా తమను తాము కాపాడుకోవాలనే దానిపై ఇందులో ప్రధానంగా అవగాహన కల్పించారు. చైల్డ్ అండ్ యూత్ సేఫ్టీ, కమ్యూనిటీ పార్ట్నర్షిప్స్, ట్రాఫిక్ స్టాప్, కాప్స్ ఎట్ యువర్ ఫ్రంట్ డోర్, అనే అంశాలపై స్థానిక రక్షణ అధికారులు డిప్యూటీ జాన్ ఫుట్ మ్యాన్ అవగాహన కల్పించారు. ఈ వర్క్ షాపుకు వచ్చిన వారి ప్రశ్నలకు కూడా పోలీసు అధికారులు సమాధానాలు ఇచ్చి.. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో ప్రజలు అడిగిన ప్రశ్నలకు పోలీసులు అందించిన కొన్ని సమాధానాలు.. ప్రశ్న: మనం ఉన్న లొకేషన్ వివరాలు పోలీసులకు ఎలా చేరుతాయి? జవాబు: 911కి ఫోన్ చేసిన వ్యక్తి తాలూకు చివరి సిగ్నల్ పాయింట్ ఆధారంగా సెల్ టవర్ లొకేషన్‌ను కనిపెడతాము. అలాగే, చివరి కాంటాక్ట్ వివరాలు కూడా పోలీసుల వద్ద రికార్డ్ అవుతాయి. దాని ఆధారంగా ఆపదలో ఉన్న వ్యక్తిని పోలీసులు రక్షిస్తారు. ప్రశ్న: డ్రైవింగ్ లైసెన్స్ ఇంటి వద్దే మరిచిపోయి వస్తే పరిస్థితి ఏంటి? జవాబు: లైసెన్స్ లేకుండా రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి సమయంలో పోలీసులు జరిమానా విధిస్తారు. ఆ సమయంలో మంచి యాటిట్యూడ్‌తో ఉంటూ.. దురుసుగా ప్రవర్తించకుండా పద్దతిగా మాట్లాడితే ఒక్కోసారి పోలీసులు జరిమానా విధించకుండా వదిలేస్తారు. ప్రశ్న: రోడ్డు మీద నియంత్రణ లేకుండా.. దురుసుగా వాహనం నడిపే వారి పట్ల ఎలా వ్యవహరించాలి? జవాబు: రోడ్డు మీద దురుసుగా వెళ్లే వారిని పట్టించుకోకపోవడం మంచిది. వారి దారిలో వారు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలి. దాని వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ పిల్లి ఎలుకలాగా ఎదుటి వ్యక్తి దూకుడుగా వెళ్తున్నాడు కదా అని మీరు కూడా అలాగే వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రశ్న: స్కూళ్లో కాల్పులు జరిగాయన్న విషయం తెలిస్తే పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలి? జవాబు: కాల్పులు జరిగాయన్న వార్త వినగానే తల్లిదండ్రులు స్కూల్ వైపు రాకూడదు. అప్పటికే ఆ పరిసర ప్రాంతాల రోడ్లన్నీ పోలీసుల కోసం మూసివేస్తారు. పరిస్థితి అదుపులోకి వచ్చి, పోలీసులు ఓ ప్రకటన చేసే వరకు తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండడమే ఉత్తమం. ప్రశ్న: పోలీసులు దర్యాప్తు లేదా తనిఖీలకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? జవాబు: పోలీసుల ముందు హఠాత్తుగా కదలడం లాంటివి చేయకూడదు. చేతులు కదల్చకూడదు. చేతులను స్టీరింగ్ మీద గాని, పైకి లేపి ఉంచాలి తప్ప జేబులో పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. ఉన్న పొజిషన్ మారకూడదు. ఎదుటి వ్యక్తి దాడికి దిగుతాడా, మంచి వాడా అనేది ఆ సమయంలోని ప్రవర్తనను బట్టి పోలీసులు అంచనాకు వస్తారు. ప్రశ్న: ఆభరణాలను ఎలా భద్రపరుచుకోవాలి? జవాబు: విలువైన నగలను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం అత్యుత్తమం. ఆభరణాలను డిపాజిట్ చేసేందుకు వెళ్లే సమయంలో ఒక్కరే వెళ్లడం కంటే ఇద్దరు ముగ్గురితో కలిసి వెళ్లడం మంచిది. అది కూడా రాత్రి వేళల్లో కంటే పగటి పూట అయితేనే మంచిది. లేదంటే దొంగలు నగలను దోచుకునే ప్రమాదం ఉంది. ప్రశ్న: స్కూల్లో కాల్పులు జరుగుతాయన్న బెదిరింపులు వచ్చినప్పుడు పిల్లలను పంపించడం మంచిదేనా? జవాబు: అలాంటి సమయంలో పిల్లల్ని స్కూలుకు పంపించడం సబబే. కాల్పులు జరిపే వ్యక్తి ఎక్కడున్నారనే విషయాలు పిల్లలు చెబుతారు. ఒకవేళ బెదిరింపు కాదు నిజమైన సంఘటన జరిగితే.. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పిల్లలు దోహదపడతారు. ప్రశ్న: హైవే మీద వెళ్తున్నప్పుడు పోలీసులు వెంబడిస్తున్నారని తెలిస్తే ఏం చేయాలి? జవాబు: అలాంటి సమయంలో సాధారణ వేగంతోనే వాహనాన్ని నడపాలి. ఆ సమయంలో ఏం చేస్తున్నా సరే చాలా క్యాజువల్‌గా ఉండాలి తప్ప పోలీసులను చూసి కంగారు పడకూడదు. ఆ సమయంలో కూడా వాహనాన్ని నడుపుతున్నప్పుడు రూల్స్ పాటించాలి. అప్పుడే ఎటువంటి జరిమానా కట్టాల్సిన అవసరం ఉండదు. ప్రశ్న: వాహనాన్ని నెమ్మదిగా నడిపినా సరే పెనాల్టీ కట్టాల్సి ఉంటుందా? జవాబు: కొన్ని సందర్భాల్లో వాహనాన్ని నెమ్మదిగా నడపడం వల్ల కూడా జరిమానా కట్టాల్సి రావొచ్చు. నిర్దేశించిన వేగానికంటే స్లోగా నడిపినప్పుడు ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం అవుతారు. అలాంటప్పుడు జరిమానా విధిస్తారు. ప్రశ్న: 911కి ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది? జవాబు: ఎవరి మీదైనా దాడి జరుగుతున్నప్పుడు ఆ ఘటన వివరాలను చెప్పాలి. దాడి చేసే వ్యక్తి తాలూకు సమాచారం ఇవ్వాలి. అతని కళ్లు, జుట్టు రంగు, ముఖము, పర్సనాలిటీ వివరాలు తెలియజేయాలి. కాల్ చేసిన వ్యక్తి సురక్షిత ప్రదేశంలో ఉన్నాడో లేదో కూడా చెప్పాలి. -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
ఖిలా వరంగల్ : రోడ్డు భద్రత అందరి బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివలింగయ్య పిలుపునిచ్చారు. 29వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వరంగల్ ఉప రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23 నుంచి 29 వరకు జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వైద్యశాఖ అధికారులు, ఆటోరిక్షా డ్రైవర్లు, విద్యాసంస్థల బస్సుల డ్రైవర్లు, కళాశాల యాజమాన్యాలు, ప్రజలు, యువతకు అవగాహన, క్విజ్ పోటీలతో పాటు బైక్ ర్యాలీలు, హెల్మెట్ వాడకంపై అవగాహన, కళాబృందాలచే ఆటపాటలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలతో రోజుకు 1.50 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, 6 లక్షల మంది క్షతగాత్రులవుతున్నారని పేర్కొన్నారు. నిమిషానికి ఒక యాక్సిడెంట్లో ఒక్కరు మృత్యువాత పడుతున్నారని చెప్పారు.. డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే సుమారు 90 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. 23న జాతీయ రహదారి భద్రతపై కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ, ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సు ఉంటుందని తెలిపారు. 24న కిట్స్ కళాశాలలో ప్రైవేట్ విద్యాసంస్థల డ్రైవర్లకు అవగాహన, 25న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రహదారి భద్రతపై లఘుచిత్రాల ప్రదర్శన, కరపత్రాల పంపిణీ, వాహన తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 26న రవాణాశాఖ ఉప కార్యాలయం భవనంలో రక్తదాన శిబిరం, రోడ్డు భద్రతపై అవగాహన, 27న రహదారి భద్రతపై ఎఫ్ఎం రేడియో ద్వారా అవగాహన, మండలాల్లో ప్రచార రథాలు ప్రారంభం, వాహన తనిఖీలు, వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహ, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 28న రోడ్డు భద్రతపై ఆటోరిక్షా డ్రైవర్లకు అవగాహన, డ్రైవింగ్ లైసెన్సు మేళా, స్కూల్, కళాశాల యాజమాన్యాలు, విద్యార్థి తల్లి దండ్రులు, డ్రైవర్లు, క్లీనర్లకు అవగాహన సదస్సులు ఉం టాయన్నారు. 29న ముగింపు వేడుకులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాణ రక్షణ కోసం ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ను వినియోగించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపొద్దని సూచించారు. హాజరుకానున్న సీపీ.. ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం 10.30 గంటలకు రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రారంభమవుతాయని, ముఖ్యఅతిథులుగా సీపీ విశ్వనాథరవీందర్, డీసీపీ బి. వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ డి.మురళీధర్ రావు, టీఎస్ఆర్టీసీ రిజినల్ మేనేజర్ టి. సూర్యకిరణ్, ఆర్టీఏ మెంబర్ కాటారపు రాజు, రోడ్డు సేఫ్టీ ఫౌండర్ హైదరాబాద్ రీజియన్ అధికారి కె.వినోద్‌కుమార్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. వాహనదారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని డీటీసీ శివలింగయ్య కోరారు. ఈ సమావేశంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడుతున్న డీటీసీ శివలింగయ్య -
పోలీసులు బండి ఆపగానే...
దుబాయ్ : నడి రోడ్డుపై వాహనాన్ని అడ్డుకుని పక్కకు తీసుకోమని పోలీసులు ఆదేశిస్తే... ఏదో తప్పు జరిగింది... ఫైన్ తప్పదని బెంబేలెత్తిపోవడం డ్రైవర్ల వంతవుతుంది. దుబాయ్ లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే, అందుకు భిన్నంగా జరిగిన ఒక ఘటన ఒక్కసారిగా డ్రైవర్ ను ఆశ్చర్యచకితుడిని చేసింది. కేరళకు చెందిన అనిల్ కుమార్ కొన్నేళ్లుగా దుబాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దుబాయ్ లో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణ కలిగిన డ్రైవర్ గా పేరుతెచ్చుకున్న అనిల్ కుమార్ కు ఎదురైన ఆ ఘటన ఏమంటే... అనిల్ కుమార్ దుబాయ్‌లో ఒక స్కూల్ బస్ డ్రైవర్. ప్రతి రోజులాగే సోమవారం కూడా యథావిధిగా పిల్లలతో బస్సులో స్కూల్‌కు బయలుదేరాడు. వెనకాల పోలీసులు ఫాలో అవుతున్నారు. బస్ స్కూల్ చేరుకున్న దశలోనే చుట్టుముట్టిన పోలీసులు బస్సు దిగాల్సిందిగా అనిల్ కుమార్‌ను ఆదేశించారు. ఏం తప్పు చేశానో అనుకుని హైరానా పడుతూనే బస్సు దిగిన అనిల్ ఎంత ఫైన్ వేస్తారోనని భయపడిపోయాడు. జరుగుతున్న సంఘటన చూడటానికి అక్కడికి జనాలు, పాఠశాల ఉద్యోగులు గుమ్మిగూడారు. ఏం జరుగుతుందో బస్ డ్రైవర్‌కి అర్థం కాలేదు. సమాచారం అందిన వెంటనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోడానికి స్కూల్ యాజమాన్యం సైతం అక్కడికి చేరుకుంది. అయితే, అందరి అంచనాలకు భిన్నంగా... బస్సు దిగిన డ్రైవర్ ను ఒక్కసారిగా అభినందించడం ప్రారంభించారు. దుబయ్ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ గడిచిన ఆరు సంవత్సరాలుగా ఏ ఒక్కరోజూ రూల్స్ అతిక్రమించకుండా క్రమశిక్షణతో వాహనాన్ని నడిపిస్తున్నందుకు అనిల్ ను పోలీసులు అభినందించడమే కాకుండా వెయ్యి దిర్హమ్ ల నగదు ప్రోత్సాహకంతో పాటు ఒక సర్టిఫికేట్ ఇచ్చి అక్కడికక్కడే సత్కరించారు. గడిచిన 6 సంత్సరాలుగా మంచి డ్రైవింగ్ గుర్తింపు తెచ్చుకున్న మరో మహిళకు, గత 40 సంవత్సరాలుగా సొంత వాహనం నడుపుకుంటూ ట్రాఫిక్ రూల్స్‌ను సక్రమంగా పాటిస్తున్న ఖలీఫా అనే వ్యక్తిని కూడా పరిచయం చేసి వారికి కూడా బహుమతి అందించి సత్కరించారు. మొత్తంగా షెల్ గోల్డ్ స్టార్ పేరుతో సురక్షిత డ్రైవింగ్ చేసిన వారిని ఈ తరహాలో నగదుతో పాటు ప్రోత్సహకాలను అందించి సత్కరించింది. -
మేమున్నామని.. మీకేం కాదని..
బంజారాహిల్స్ : సోమవారం ఉదయం 10 గంటలు.. ఖైరతాబాద్ సిగ్నల్.. ఒక్కసారిగా అక్కడివచ్చిన ఓ భారీ వాహనంలోంచి కొందరు వ్యక్తులు దిగారు.. క్షణాల్లోనే చుట్టుపక్కల భవనాలను ఎక్కేశారు. ఏం జరుగుతోందో తెలియక జనమంతా ఉత్కంఠకు గురయ్యారు. కంగారు పడ్డారు. వాహనంలోంచి దిగినవారి చేతుల్లో అత్యాధునిక తుపాకులున్నాయి. ప్రత్యేక దుస్తులు ధరించి ఉన్న వారంతా ఆక్టోపస్ కమాండోలు. హైదరాబాద్ సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ అని చెప్పే క్రమంలో భాగంగా ఆక్టోపస్ కమాండోలు ఖైరతాబాద్ చౌరస్తాలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. నిమిషాల వ్యవధిలోనే చౌరస్తాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని వారి గుప్పిట్లోకి తీసుకున్నారు. చౌరస్తాకు నలువైపులా గస్తీ కాస్తూ అనుమానితులను విచారించారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదంతా ఎందుకంటే.. హైదరాబాద్ దేశంలోకెల్లా అత్యంత రక్షణాత్మక నగరమని చాటిచెప్పేందుకే వీరు చేసిన ప్రయత్నం. నగరంలో ఎక్కడ ఎటువంటి విపత్తులు జరిగినా క్షణాల్లోనే కమాండోలు అందుబాటులో ఉంటారని ఆక్టోపస్ సీనియర్ అధికారి వివరించారు. అంతే కాకుండా సామాన్యులకు కూడా తమ టీమ్ గురించి అవగాహన కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆక్టోపస్ కమాండోలతో నగరం మరింత రక్షణాత్మకంగా ఉంటుందన్నారు. -
కల్తీ తినుబండారాలు ధ్వంసం
ముకరంపుర : తినుబండారాలు చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్, స్వీట్లలోను కల్తీచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహిస్తూ నగరంలోని దుకాణాలపై సీపీఐ నాయకులు గురువారం దాడులు చేశారు. తినుబండారాలను ఫుడ్‌సేఫ్టీ కార్యాలయం ఎదుట దహనం చేశారు. సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు మాట్లాడుతూ కల్తీ కన్ఫెక్షనరీ వ్యాపారం జోరుగా సాగుతుందన్నారు. చిన్నపిల్లల ప్రాణాలను హరిస్తూ కోట్లకు పరుగులెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు మామూళ్లకు అలవాటుపడి తనిఖీలే మరిచిపోయారన్నారు. చౌకగా తయారు చేయించుకుని జీరో వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపించారు. నాణ్యత పాటించని వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పంజాల శ్రీనివాస్, రాజేశం, కసిరెడ్డి మణికంఠరెడ్డి, ముల్కల మల్లేశం, కసిబోజుల సంతోష్‌చారి, పులి రాకేశ్, శ్రీనివాస్, పవార్ రాజు, మంగలి, సమ్మయ్య, నరేశ్, మహేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
తమిళనాడులో ఉద్రిక్తతల అంచనాకు ఆర్టీసీ అధికారులు
చిత్తూరు: చిత్తూరు నుంచి తమిళనాడు బస్సు సర్వీసుల పునరుద్ధరణ కోసం ఆర్టీసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా శేషాచలం అడువుల్లో తమిళ కూలీల ఎన్‌కౌంటర్‌ను నిరసనగా తమిళనాడులో నెలకొన్న ఉద్రిక్తతలను అంచనా వేయడానికి ఆర్టీసీ అధికారులు తమిళనాడు వెళ్లనున్నారు. అక్కడ తిరువన్నామలై, రాయవేలూరు, ధర్మపరి ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను గమనించి తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తమిళనాడుకు సర్వీసులను రద్దు చేయడంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిలినట్టు అంచనా..ఈ నష్ట నివారణకి తమిళనాడు అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ మంతనాలు జపినా వారి నుంచి సరైన హామీ రాలేదు. దీంతో స్వయంగా ఆర్టీసీనే చొరవ తీసుకొని బస్సు సర్వీసుల పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదిలా ఉండగా, శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
'రక్షణ ఇస్తేనే బస్సులు తిప్పుతాం'
చిత్తూరు: సరైన రక్షణ కల్పిస్తేనే తమిళనాడులో బస్సులు తిప్పుతామంటూ ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. దీంతో చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్లాల్సిన బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సు సర్వీసుల పునరుద్ధరణ కోసం తమిళనాడు అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ మంతనాలు జరుపుతోంది. కానీ, ఈ విషయంలో తమిళనాడు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో తమిళ కూలీల ఎన్‌కౌంటర్‌ను నిరసనగా తమిళనాడులో ఇంకా ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగానే కొనసాగుతున్నాయి. దీంతో ఆందోళనల ముసుగులో బస్సుల పై దాడులు చేస్తే ఆర్టీసీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తమిళనాడుకు సర్వీసులను రద్దు చేయడంతో 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిలినట్టు అంచనా.. ఇదిలా ఉండగా, శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.