న్యూఢిల్లీ: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఎగ్జిక్యూటివ్ సంస్థకు గుడ్ బై చెప్పారు. ట్విటర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ తన పదవికి రాజీనామా చేశారు. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత)
రాయిటర్స్ నివేదిక ప్రకారం కంటెంట్ నియంత్రణను పర్యవేక్షణా అధికారి ఇర్విన్ సంస్థ నుంచి వైదొలగారు. ట్విటర్ టేకోవర్ చేసిన క్లిష్ట సమయంలో, అప్పటి హెడ్ యోయెల్ రోత్ రాజీనామా చేయడంతో జూన్ 2022లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ అధిపతిగా ఇర్విన్ బాధ్యతలు చేపట్టారు. విద్వేష పూరిత కంటెంట్, ట్విటర్‌లో ప్రకటనదారులు ఒక్కొక్కరు తప్పుకుంటున్న సమయంలో ఇర్విన్ నిష్క్రమణ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ పరిణామంపై మస్క్ అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా ట్విటర్.2 సీఈవోగా లిండా యాకారినోను నియమించినట్లు మస్క్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!)
Comments
Please login to add a commentAdd a comment