విద్యార్థినులు, మహిళలపై దాడులను సమాజమే ఎదుర్కోవాలి
విద్యార్థినులు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలి
‘సరస్వతి’ భూముల వ్యవహారంపై చర్యలు చేపడతాం
మీడియాతో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్): ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం పోలీసులకు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అన్నారు. ఆడపిల్లలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలను సమాజమే దీటుగా ఎదుర్కోవాలన్నారు. గుంటూరు అరణ్య భవన్‌లో ఆదివారం అటవీ అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. మహిళలపై నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు.
నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, వాటి అమలులో చిత్తశుద్ధి కావాలన్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచి్చనా.. కోల్‌కతాలో వైద్యురాలిపై పాశవిక దాడి జరిగిందన్నారు. తమ కళ్లెదుట జరుగుతున్న నేరాలు, ఘోరాలను ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్య నేర్చుకుని, తమపై దాడులకు తెగబడే ఉన్మాదులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. గంజాయి. మత్తు పదార్థాలను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు.
అధికారుల్ని బెదిరిస్తే సుమోటో కేసులు
రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే ఎక్కడ ఉన్నా పిలిపిస్తామని ఐపీఎస్ అధికారులపై చేస్తున్న బెదిరింపులపై సుమోటో కేసులు వేస్తామని పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు.
ఒక మాజీ సీఎం స్థాయిలో పోలీసు అధికారులను బెదిరించడం సరైంది కాదని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలం అని మాజీ సీఎం అంటున్నారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. 20 ఏళ్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఉంటుందని గతంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారన్నారు.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట రోడ్ల పక్కన చెట్లు నరికేశారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. షర్మిల కోరితే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని చెప్పారు.
సరస్వతి భూములపై చర్యలు
సరస్వతి పవర్ ప్లాంట్ భూముల వ్యవహారంపై చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ చెప్పారు. 76 ఎకరాల అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఆక్రమించారని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నామన్నారు.
పవర్ ప్లాంట్ పరిధిలో గ్రీన్‌జోన్ ఏర్పాటు చేయలేదని, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు సైతం లేవని అన్నారు. విశాఖ నడి»ొడ్డున గంజాయి పెంచుతున్నారని, గంజాయి సాగు, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అటవీ దళాల అధిపతి చిరంజీవి చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment