Saraswati Power Company
-
ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదు
సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్): ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం పోలీసులకు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అన్నారు. ఆడపిల్లలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలను సమాజమే దీటుగా ఎదుర్కోవాలన్నారు. గుంటూరు అరణ్య భవన్లో ఆదివారం అటవీ అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. మహిళలపై నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, వాటి అమలులో చిత్తశుద్ధి కావాలన్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచి్చనా.. కోల్‌కతాలో వైద్యురాలిపై పాశవిక దాడి జరిగిందన్నారు. తమ కళ్లెదుట జరుగుతున్న నేరాలు, ఘోరాలను ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్య నేర్చుకుని, తమపై దాడులకు తెగబడే ఉన్మాదులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. గంజాయి. మత్తు పదార్థాలను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల్ని బెదిరిస్తే సుమోటో కేసులు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే ఎక్కడ ఉన్నా పిలిపిస్తామని ఐపీఎస్ అధికారులపై చేస్తున్న బెదిరింపులపై సుమోటో కేసులు వేస్తామని పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. ఒక మాజీ సీఎం స్థాయిలో పోలీసు అధికారులను బెదిరించడం సరైంది కాదని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలం అని మాజీ సీఎం అంటున్నారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. 20 ఏళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉంటుందని గతంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారన్నారు.గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట రోడ్ల పక్కన చెట్లు నరికేశారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. షర్మిల కోరితే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని చెప్పారు. సరస్వతి భూములపై చర్యలు సరస్వతి పవర్ ప్లాంట్ భూముల వ్యవహారంపై చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ చెప్పారు. 76 ఎకరాల అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఆక్రమించారని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నామన్నారు. పవర్ ప్లాంట్ పరిధిలో గ్రీన్‌జోన్ ఏర్పాటు చేయలేదని, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు సైతం లేవని అన్నారు. విశాఖ నడి»ొడ్డున గంజాయి పెంచుతున్నారని, గంజాయి సాగు, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అటవీ దళాల అధిపతి చిరంజీవి చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పవన్ సార్ ఇప్పుడేమంటారు? చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్ కు లేదు
-
బెయిల్ రద్దు కుట్రలో భాగమౌతారా?: విజయసాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈడీ జప్తు చేసిన, హైకోర్టు స్టే విధించిన సరస్వతి పవర్ షేర్లను ట్రాన్స్ఫర్ చేస్తే వైఎస్ జగన్‌కు ఇబ్బందులు ఎదురై బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తెలిసినా షర్మిల రాజకీయ కుట్రలో భాగస్వామిగా మారి కుట్రపూరితంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై వైఎస్ జగన్ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీల న్యాయ సలహాను షర్మిలకు పంపించినా పెడచెవిన పెట్టారని చెప్పారు. ఏ చెల్లి అయినా ఇలా చేస్తుందా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ చనిపోయిన పదేళ్లకు.. షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తరువాత తాను వ్యాపారాల ద్వారా సంపాదించిన వాటిల్లో రూ.200 కోట్లు ఇచ్చిన అన్న పట్ల.. తన సొంత ఆస్తిలో 40 % ఇవ్వటానికి సిద్ధపడిన అన్నపై కనీస కృతజ్ఞత లేకపోగా నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏమిటంటే.. చంద్రబాబుతో కలసి బెయిల్ రద్దు చేసే కుట్రలు పన్నటమేని షర్మిలను విమర్శించారు. మీరు తాజ్‌మహల్, విప్రో కావాలని అడిగితే ఇచ్చేస్తారా షర్మిలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుయుక్తులను షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. అతి మంచితనం వల్లే జగన్ అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియాతో కలిసి నిర్వహించే మీడియా సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే జగన్‌పై దూషణలకే షర్మిల 95 శాతం ప్రాధాన్యమిస్తోందన్నారు. తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికే ఇదంతా అని షర్మిల చెప్పడం అబద్ధమని, చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికే అన్నపై కుయుక్తులు పన్నుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై, వైవీ సుబ్బారెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు, ఆస్తుల విషయంలో జగన్‌పై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికారానికి సంబంధించిందన్నారు. జగన్‌ను తిరిగి సీఎం కాకుండా చేయాలన్నదే షర్మిల ఆలోచనని, చంద్రబాబు ఇచ్చిన అజెండాతోనే ఆమె పనిచేస్తున్నారన్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నా, కేంద్రంలో ఆ పార్టీకి ఎన్డీఏ వ్యతిరేకమైనా, ఆమె బాబుతో లాలూచీపడి జగన్‌పై కుట్రలు చేస్తోందన్నారు. షర్మిల మాటలను ప్రజలు నమ్మరుతల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం లబ్ధి చేకూరుస్తారని ప్రశ్నించడం, జగన్‌ను నమ్మొదని చెప్పడం ఎంత ద్రోహమో, అన్యాయమో తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని షర్మిలకు సూచించారు. చంద్రబాబు మాటలనే ఆమె వల్లిస్తున్నారని, ఆయన అజెండాను నెత్తిన పెట్టుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ కోటిన్నర కుటుంబాలకు, 80 లక్షల మంది అక్క చెల్మెమ్మలకు ఆసరా ఇచ్చారని, 45 లక్షల మందికి అమ్మ ఒడి అమలు చేశారని, అలాంటి సీఎం దేశంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇంత మందికి మేలు చేసిన జగన్ సొంత ఇంట్లో తల్లి, చెల్లికి అన్యాయం చేస్తారని కుట్రపూరితంగా చెబుతుంటే ఎవరు నమ్ముతారని షర్మిలను నిలదీశారు. మహిళల్లో జగన్ పట్ల వ్యతిరేకత పెంచాలనే చంద్రబాబు దుర్మార్గ అజెండాకు షర్మిల సహకరిస్తోందన్నారు. తండ్రి మృతికి కారణమైన బాబుతో దోస్తీదివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి కారణమైన చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు చేయడం దుర్మార్గమని సాయిరెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి మరణానికి చంద్రబాబే కారణమని షర్మిల గతంలో అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రాజశేఖర్‌రెడ్డి మరో 15 రోజుల్లో దుర్మార్గమైన చావు చస్తాడని’ అంతకుముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. వైఎస్ మరణానికి చంద్రబాబే కారణమని దీన్ని బట్టి అర్థం కావడం లేదా? అని నిలదీశారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం, పసుపు చీర కట్టుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం, చర్చలు జరపడం, కుట్రలు చేయడం... ఇంతకన్నా అమానవీయ ప్రవర్తన ఉంటుందా? అని ప్రశ్నించారు. శంకర్రావు, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వాడుకుని జగన్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపిన విషయం మరిచిపోయారా? అని షర్మిలను ప్రశ్నించారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతూ అనుకూలంగా మాట్లాడుతున్నామని తనను, వైవీ సుబ్బారెడ్డిని షర్మిల విమర్శించడం సహేతుకం కాదన్నారు. శత్రువుకు మేలు చేసేందుకు సొంత అన్ననే వేటాడి, వెంటాడి కాటేసే చెల్మెమ్మ షర్మిల మినహా ఎక్కడా చూడలేదన్నారు. వైఎస్ఆర్ ఆత్మ క్షోభకు కారణమైన షర్మిల ఎల్లో మీడియా ముందు పెట్టే కన్నీటికి విలువ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే కుట్రలకు షర్మిలను వాడుకుంటున్నాడని విమర్శించారు.దేశంలో ఇలాంటి అన్న ఉంటాడా?వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్కు వచ్చిన ఆస్తులను కుమారుడు, కుమార్తెకు ఆయన జీవించి ఉన్నప్పుడే పంచారని తెలిపారు. విజయలక్ష్మీ మినరల్స్, కోడూరు మిల్స్, కోడూరు ఆఫీసు ఆస్తులు, బైరైటీస్ మినరల్స్ స్టాక్స్, 25 మెగావాట్ల సరస్వతి పవర్, ఎస్ఆర్ఎస్ హైడ్రో, 51 ఎకరాల ఇడుపులపాయ భూములు, 79 ఎకరాల శెట్టిగుంట ఆస్తులు, 7.6 ఎకరాల పులివెందుల భూములు, బంజారాహిల్స్‌లోని 280 గజాలు, విజయవాడలోని రాజ్యువరాజ్ థియేటర్లు షర్మిలకు అప్పగించారని చెప్పారు. వైఎస్ జగన్ తనకు వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేశారన్నారు. జగన్ నెలకొల్పిన భారతీ సిమెంట్స్ కోసం తొలుత రూ.1,400 కోట్లు అప్పు చేశారని, ఆ తర్వాత తీర్చారని తెలిపారు. సాక్షి మీడియా మొదట్లో నష్టాన్ని చవిచూసిందన్నారు. ఈ నష్టాలు, అప్పులను షర్మిల ఎప్పుడూ పంచుకోలేదన్నారు. ఇవన్నీ జగన్ తన దక్షతతో అభివృద్ధి చేసి, లాభాల్లోకి నడిపించారని గుర్తు చేశారు. ఆయన అభివృద్ధి చేశారు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టారని, తానే ఆ పేర్లు సూచించానని వెల్లడించారు. ఆమెకు ఏదైనా కంపెనీ నచ్చితే ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తుల పంపకాలు ఏ విధంగా జరిగాయో తెలుస్తుందన్నారు. అమ్మ తటస్థతపై సందేహాలు!తన అసంబద్ధ చర్యలు కుమారుడి బెయిల్ రద్దు పరిస్థితికి దారి తీసే ప్రమాదం ఉందని తెలిసినా ఆ కుట్రలకు వైఎస్ విజయమ్మ పరోక్షంగా సహకరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. విజయమ్మ తటస్థతపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.విజయమ్మను మొదటి నుంచి భావోద్వేగాలకు గురి చేసి షర్మిల ప్రభావితం చేస్తున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టమైందని నెటిజన్లు, ప్రజలు చర్చించుకుంటున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా సరస్వతి షేర్ల ట్రాన్స్ఫర్ పత్రాలపై సంతకాలు చేయడం.. పలు సందర్భాల్లో షర్మిలకు అనుకూలంగా వ్యవహరించడం ఆమె తటస్థ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చినట్లు చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సైతం కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న సమయంలో విదేశాల నుంచి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీడియో సందేశాన్ని విడుదల చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను సమానంగా చూడాల్సిన అమ్మ ఒకవైపే మొగ్గడం సరికాదని పేర్కొంటున్నారు. నీ అత్యాశ, కుతంత్రాల్లో అమ్మను కూడా పావుగా వాడుకున్నావు. తప్పుడు ప్రకటనలకు అమ్మను ఓ సాక్షిగా, అమలుకర్తగా చేశావంటూ వైఎస్ జగన్ తన సోదరికి రాసిన లేఖను గుర్తు చేస్తున్నారు. ‘క్షమార్హం కాని అక్రమ చర్యల్లో అమ్మను భాగం చేశావు. గత కొద్ది సంవత్సరాలుగా అమ్మను భావోద్వేగాలకు నువ్వు వాడుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. నీ సొంత వ్యూహాల్లో అమ్మను భాగం చేశావు. కోర్టు అనుమతి లేకుండా షేర్లను బదిలీ చేస్తే నాకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని తెలిసీ బదలాయింపు చేశావు. అంతేకాక షేర్ సర్టిఫికెట్లు, షేర్ ట్రాన్స్ఫర్ ఫారాలు పోయినట్లుగా అమ్మ చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించావు. అంతిమంగా అక్రమ పద్ధతిలో వాటాలను బదలాయింపు చేశావు. దీనివల్ల కుమారుడిగా నాకు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా నీ చర్యల్లో భాగస్వామి అయింది. ఆమె తటస్థతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాక ఆమె ఒకవైపే ఉందన్న భావన కలిగిస్తోంది...’ అని తీవ్ర ఆవేదనతో వైఎస్ జగన్ లేఖ రాయటాన్ని నెటిజన్లు, ప్రజలు ఉదహరిస్తున్నారు.కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
అటవీ భూములు అన్యాక్రాంతం కాలేదు
మాచవరం: పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో ఫారెస్ట్ లాండ్స్ లేవని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములున్నాయోమో పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు అటవీ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఇక్కడి భూమలను శనివారం పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు మాచవరం మండలం చెన్నయపాలెం, దాచేపల్లి మండలం తంగెడ శివారు అటవీ భూములను, సరిహద్దు రాళ్లను పరిశీలించారు. అటవీ భూములు ఏవీ అన్యాక్రాంతం కాలేదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు చెప్పారు. అటవీ భూములకు ఎనిమిది మీటర్ల దూరంలోనే సరస్వతీ భూములు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయినా మరో రెండు రోజులు మాచవరం మండలం భీమవరం, పిన్నెల్లి గ్రామాల సరిహద్దు భూములను కూడా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట డీఆర్వో విజయలక్ష్మి, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ భూముల పరిశీలన మండలంలోని చెన్నయపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో ఉన్న రెవెన్యూ భూములను తహసీల్దార్ క్షమారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరస్వతీ సంస్థకు చెందిన కొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయడం జరిగిందని, మరికొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయాల్సి ఉందని చెప్పారు. రికార్డులను తనిఖీ చేసి ప్రభుత్వ భూములు ఏమైనా అన్యాక్రాంతం అయ్యాయా లేదా అనే విషయాన్ని తేలుస్తామని చెప్పారు. వార్తా కథనాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులు ఆ గ్రామాల్లోని భూములలో సర్వే చేస్తామని తెలిపారు. -
సరస్వతీ పవర్ వాటాల బదిలీపై షర్మిల వాదన అసంబద్ధం
సాక్షి, అమరావతి: సరస్వతీ పవర్ వాటాల బదిలీ విషయంలో షర్మిల చేస్తున్న అసంబద్ధ వాదనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సరస్వతీ పవర్ వాటాలను జప్తు చేయలేదన్న షర్మిల వాదనతో న్యాయ నిపుణులు విబేధిస్తున్నారు. ఈడీ.. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులన్నింటినీ జప్తు చేసిందని, చరాస్తుల్లోకి షేర్లు కూడా వస్తాయని వారు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీల చట్టం స్పష్టంగా చెబుతోందని పేర్కొంటున్నారు. కంపెనీల చట్టం సెక్షన్ 44 ప్రకారం షేర్లు, డిబెంచర్లను చరాస్తులుగా పరిగణిస్తారు. అందువల్ల సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసినందున, ఆ కంపెనీ షేర్లు కూడా జప్తులో ఉన్నట్లే. కాబట్టి హైకోర్టు జారీ చేసిన యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు సరస్వతీ పవర్ షేర్లకు కూడా వర్తిస్తాయి. షేర్లతో సహా జప్తులో ఉన్న ఏ ఆస్తులను కూడా ఇతరులకు విక్రయించడం గానీ, బదలాయించడం గానీ చేయడానికి వీల్లేదు. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసినట్లు ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా చెప్పింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుడులకు సంబంధించి నమోదైన కేసులో ఈడీ పలు ఆస్తులను జప్తు చేసింది. ఇందులో జగన్మోహన్రెడ్డి, ఆయన గ్రూపునకు చెందిన పలు కంపెనీలున్నాయి. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో సరస్వతీ పవర్‌కు చెందిన స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి. ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్మోహన్రెడ్డి, సరస్వతీ పవర్లతో సహా పలు గ్రూపు కంపెనీలు మనీలాండరింగ్ నిరోధక అప్పిలెట్ ట్రిబ్యునల్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన అప్పిలెట్ ట్రిబ్యునల్ 2019 జూలై 26న తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో సరస్వతీ పవర్ స్థిర చరాస్తులను ఈడీ జప్తు చేసినట్లు స్పష్టంగా పేర్కొంది. సరస్వతి పవర్ స్థిర, చరాస్తుల జప్తును తప్పుపట్టింది. ఆ జప్తు ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అప్పిలెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2019 అక్టోబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు అమలుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని హైకోర్టును కోరింది. ఈడీ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈడీ దాఖలు చేసిన అప్పీల్ తేలేంత వరకు ఆ రోజు నాటికి ఉన్న స్థితిని అన్ని రకాలుగా యథాతథంగా కొనసాగించాలంటూ 2019 డిసెంబర్ 2న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు ఈ రోజుకీ అమల్లో ఉన్నాయి. ఈ యథాతథస్థితి ఉత్తర్వుల గురించే జగన్మోహన్రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగా సరస్వతీ పవర్లో వాటాలను బదలాయించడం అంటే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నది న్యాయ నిపుణుల మాట. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు సలహా రూపంలో జగన్మోహన్రెడ్డికి స్పష్టంగా చెప్పారు. ఈ సలహాను జగన్ తన చెల్లి షర్మిల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ న్యాయ సలహాను ఆమె ముందుంచారు.జగన్‌ను ఉద్దేశపూర్వకంగా సమస్యల్లోకి నెట్టిన షర్మిల...కోర్టులో ఉన్న కేసులన్నీ తేలిన తరువాత వాటాలు బదలాయించుకోవచ్చునని షర్మిలకు జగన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వాటాలు బదిలీ చేస్తే తనకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని కూడా వివరించారు. అయితే చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్న షర్మిల తన అన్న జగన్ మాటలను పెడచెవిన పెట్టారు. ఆయన్ను న్యాయపరమైన సమస్యల్లోకి నెట్టేందుకే నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే సరస్వతీ పవర్లో ఉన్న వాటాలను అక్రమ పద్ధతిలో బదలాయించేశారు. అన్యాయమైన పని చేసిన షర్మిల మరోవైపు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. ఈడీ సరస్వతీ పవర్‌కు చెందిన భూములను మాత్రమే జప్తు చేసిందే కానీ, షేర్లను జప్తు చేయాలంటూ ఓ వాదనను తీసుకొచ్చారు. అందుకే వాటాలను బదలాయించినట్లు ఆమె చెబుతున్నారు. న్యాయ నిపుణులు మాత్రం ఆమె వాదన చట్ట విరుద్ధంగా ఉందని తేల్చి చెబుతున్నారు. షర్మిల దురుద్దేశపూర్వకంగా సృష్టించిన న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడేందుకే జగన్మోహన్రెడ్డి న్యాయపోరాటం ప్రారంభించారు. షేర్ల బదిలీల విషయంలో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసి, తన వాటాలను తనకు వెనక్కి తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.సరస్వతీ పవర్ షేర్లు జప్తులో లేవని ఎలా చెబుతారు..?హైకోర్టు న్యాయవాది మరక్కగారి బాలకృష్ణసరస్వతీ పవర్ షేర్ల బదిలీ విషయంలో షర్మిల వాదన చట్ట విరుద్ధంగా ఉంది. ఎవరు ఇస్తున్నారో గానీ ఆమెకు సరైన న్యాయ సలహాలు ఇవ్వడం లేదు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 44ను చదివితే షేర్లు అనేవి చరాస్తుల కిందకు వస్తాయి. ఇందుకు పెద్దగా లా చదువుకుని ఉండాల్సిన అవసరం కూడా లేదు. స్థిర, చరాస్తులను జప్తు చేసినప్పుడు, చరాస్తుల కిందకు వచ్చే షేర్లు కూడా జప్తులో ఉన్నట్లే. ఇందులో చర్చకు, వాదనకు ఆస్కారం ఏముంది? మనీలాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు సరస్వతి పవర్ షేర్లకు వర్తిస్తాయి. జప్తు ఉన్న షేర్లను విక్రయించుకోవచ్చునని ఏ చట్టం చెబుతుందో షర్మిలకే తెలియాలి. -
చెల్లెమ్మా.. ఏది నిజం?
-
చంద్రబాబుది నీచ రాజకీయం
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ధ్వజం మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు ఆయన.. బాబు ఇతర నేతల ఇంటి వద్ద ధర్నాలు చేరుుస్తారు.. సరస్వతి పవర్ సంస్థ ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కచ్చితంగా జరిగి తీరుతుందని, న్యాయస్థానాల్లో పోరాటం చేసైనా సరే దాన్ని అక్కడ పెడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇతర రాజకీయ నాయకుల ఇంటి వద్దకు వెళ్లి ధర్నాలు చేయండంటూ ఆయన తన వాళ్లను ప్రోత్సహిస్తారు కానీ, రైతులు తనను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే మాత్రం లాఠీలతో కొట్టిస్తారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనవాళ్లు తప్ప ఇతరులెవ్వరూ పరిశ్రమలు పెట్టరాదన్నది చంద్రబాబు దుర్బుద్ధి అని ఆయన దుయ్యబట్టారు. శనివారం జగన్ నివాసం వద్ద టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు నిరసనగా, ఆయనకు సంఘీభావం తెలుపడానికి.. ఆదివారం గుంటూరు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాలకు చెందిన చెన్నాయపాలెం, తం గెడ, వేమూరు గ్రామాల నుంచి సుమారు వెయ్యి మంది రైతులు, స్థానిక ప్రజలు హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ‘‘చంద్రబాబునాయుడు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ చేయకుండా రైతుల కడుపు కొట్టారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలను కూడా మాఫీ చేస్తానని చేయలేదు. చివరకు అవ్వా, తాతల పింఛన్లను కూడా నిర్దాక్షిణ్యంగా కత్తిరించారు. ఇలాంటి తన వైఫల్యాలన్నిటి నుంచీ ప్రజల దృష్టి మళ్లించేందుకు, తన విషయంలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా ఏ స్థాయికైనా దిగజారి ప్రవర్తిస్తున్నారు. నిన్న (శనివారం) నా ఇంటి వద్ద టీడీపీ వారు ధర్నా చేశారు. టీడీపీకి చెందిన కొంతమందిని ఇక్కడకు (క్యాంపు కార్యాలయం వద్దకు) పంపి, వాళ్లనే రైతులన్నట్లుగా చూపి, తమకు అన్యాయం జరిగిపోయిందని వారి చేత చెప్పించే కార్యక్రమం చంద్రబాబు చేయించారు. జరుగుతున్నది చూసి నాకు బాధ అన్పించింది. ఇక్కడ జరిగింది టీవీల్లో చూసి జరుగుతున్న అన్యాయానికి బాధపడి నాకు సంఘీభావం తెలపడానికి మాచవరం, దాచేపల్లి మండలాల్లోని గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫ్యాక్టరీ కోసం భూములమ్మిన రైతులు, ఆయా గ్రామాల ప్రజలు ఇక్కడకు వచ్చి చూపిస్తున్న ఆప్యాయత, ఆత్మీయతలకు నాకు చాలా ఆనందంగా ఉంది. (జగన్ ఈ మాటలంటున్నప్పుడు రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి) రైతులు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాం సరస్వతి సిమెంట్స్ నిర్మాణం కోసం 2008-2009లో రైతుల నుంచి భూముల కొనుగోలు మొద లు పెట్టాం. ఆ రోజులు నాకు బాగా గుర్తు. ఐదేళ్ల కిందట అక్కడ భూముల ధరలు ఎలా ఉన్నాయని ఆరా తీశా. ఒక ఎకరా ఖరీదు రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఉందని అన్నారు. మేము భూమి కొనుగోలు చేస్తున్న ప్రదేశానికి ఒక కిలోమీటరు దూరంలో భవ్య సిమెంట్ కంపెనీ వాళ్లు కూడా భూములు కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాళ్లు ఎకరాకు రూ.1 లక్ష నుంచి రూ.1.20 లక్షలిచ్చి కొంటున్నారని చెప్పారు. మన రైతులు ఆనందంగా తమ భూములు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలో చెప్పండి అని వారినే అడిగా. అందరూ కలిసి సమావేశమై ఏ ధర ఇస్తే రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందో చెప్పండి అన్నా. ఆ అంశం నాకిప్పటికీ గుర్తుంది. ఎకరాకు రూ.2.6 లక్షలిస్తే సంతృప్తికరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారని కంపెనీ ప్రతినిధి వేణుగోపాల్ నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఎకరాకు రూ.2.6 లక్షలు కాదు, రూ.3 లక్షలు ఇచ్చి కొనుగోలు చేయండి, రైతుల కళ్లల్లో ఆనందమే నేను చూడాల్సింది అని అప్పుడే చెప్పాను. అప్పటి నుంచీ ఐదు సంవత్సరాలైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన పర్యావరణ అనుమతులతో సహా అన్నీ తెచ్చాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అనుమతులు మాత్రం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీళ్లకు అనుమతి రావాలి. కాలుష్య నియంత్రణ మండలి అనుమతి రావాలి. ఏ పరిశ్రమ అయినా రావాలంటే ప్రధానంగా కావాల్సినవి నీళ్లు, కరెంటు. ఈ రెండూ లేనిదే ఏ పరిశ్రమా రాదు. ఈ అనుమతి ఇవ్వాల్సిన కనీస ధర్మం రాష్ట్ర ప్రభుత్వానిదైతే , అనుమతులు పొందడమనేది పారిశ్రామిక వేత్తల హక్కు. అయినప్పటికీ ఈ అనుమతులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉండి పోయాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఫ్యాక్టరీకి నీళ్లివ్వకుండా తాత్సారం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న నీళ్లు, కరెంటు ఇవ్వకుండా ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ఎలా ముందుకు వస్తారు? అని నేను ప్రశ్నిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఈ రెండు అనుమతులూ ఇవ్వకుం డానే.. ఫ్యాక్టరీకి ఇచ్చిన గనుల లీజును ఏకంగా రద్దు చేసే స్థాయికి చివరకు ఈ రాజకీయాలు దిగజారిపోయాయి. ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయమా? చంద్రబాబునాయుడును నేను అడగదల్చుకున్నదొక్కటే. ఇదే దాచేపల్లి మండలంలో 7 సిమెంట్ ఫ్యాక్టరీ కర్మాగారాలున్నాయి. వాటిలో కొన్ని అయితే 20 సంవత్సరాల క్రితం మైనింగ్ లీజులు పొందాయి. ఎవరూ కూడా ఇప్పటికీ ఫ్యాక్టరీ పెట్టక పోయినా వారి జోలికి పోరు. సాక్షాత్తూ టీడీపీ ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డికి 8 సంవత్సరాల క్రితం ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వ భూమిని సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి కేటాయించారు. ఆయన ఇప్పటికీ ఫ్యాక్టరీ పెట్టక పోయినా ఆయనకు ఇచ్చిన లీజును మాత్రం రద్దు చేయరు. మేం మాచవరం, దాచేపల్లి మండలాల్లోని రైతులకు ఒక ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.8.5 లక్షలు వరకు చెల్లించి భూములను కొనుగోలు చేసి ఫ్యాక్టరీ పెట్టడానికి ముందడుగు వేస్తున్నప్పుడు, తమ వాళ్లు తప్ప మరొకరు ఫ్యాక్టరీలు పెట్టకూడదు అనే దురుద్దేశంతో సరస్వతి ఫ్యాక్టరీ లీజును చంద్రబాబు రద్దు చేశారు. (ఆ సమయంలో ‘సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి అన్ని అనుమతులు వెంటనే ఇవ్వాలి’ అంటూ రైతులు నినాదాలు చేశారు) నేను ఒక్కటే చెబుతున్నా. అక్కడ ఫ్యాక్టరీ కచ్చితంగా వస్తుంది. కచ్చితంగా మంచి జరుగుతుంది. కోర్టుకు పోయి అయినా సరే, పోరాటం చేసి అయినా సరే ఫ్యాక్టరీని అక్కడ పెడతాం. (రైతుల కేరింతలు) మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతలను నేను గుండె నిండా దాచుకుంటాను. దేవుడు పై నుంచి అన్నీ చూస్తున్నాడు. చంద్రబాబుకు దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేసే రోజు కూడా అతి త్వరలో వస్తుంది. అర్జీ ఇవ్వాలని వస్తే లాఠీ దెబ్బలా? సరస్వతి సిమెంట్స్‌కు అనుమతులు ఇవ్వని విషయమై గట్టిగా నిలదీయాలని, ప్రభుత్వానికి ఒక అర్జీ ఇవ్వాలని దాచేపల్లి, మాచవరం మండలాల రైతులు వస్తే వారిపై చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జి చేయించారు. ఇలాంటి వ్యక్తికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉందా? (రైతుల నుంచి ‘లేదు, లేదు’ అని అరుపులు) ఆయన అతిదారుణంగా పోలీసుల సాయంతో మనుషులను ఇతర రాజకీయ నాయకుల ఇళ్ల వద్దకు పంపి ధర్నాలు చేయించవచ్చు. సాధారణ రైతులు వచ్చి అర్జీ ఇవ్వాలని ప్రయత్నిస్తే లాఠీచార్జి చేయిస్తారా? చంద్రబాబు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంది?’’ అని జగన్ అన్నారు. ఆయన ప్రసంగం ముగిశాక సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించాలనీ, తమ గ్రామాలను అభివృద్ధి చేయాలని రైతులు నినాదాలు చేశారు. రైతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ సైమన్ ఉన్నారు. ఇది రాజకీయ కుట్ర సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తే మా గ్రామా లు బాగుపడతాయని ఆశిస్తూ ఉంటే ఓ వర్గానికి చెందిన కొంతమంది రాజకీయాలతో కుట్ర చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ గనుల లీజు రద్దు చట్ట విరుద్ధం. వెంటనే అనుమతులు పునరుద్ధరించి ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలి. -మాజీ సర్పంచ్ సైమన్ ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్నాం నేను సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఎకరా రూ.3 లక్షల చొప్పున 15 ఎకరాలు అమ్మా ను. మేము అడిగినదానికన్నా యాజమాన్యం రూ.40 వేలు ఎక్కువ ఇచ్చింది. సంతోషంగా భూములు ఇచ్చాం. ఫ్యాక్టరీ నిర్మించాలని కోరుకుంటున్నాం. ఫ్యాక్టరీ నిర్మిస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి రాజకీయాలు చోటు చేసుకోవడం విచారకరం. - వీరయ్యయాదవ్, ఎంపీటీసీ టీడీపీ వాళ్లే రెచ్చగొడుతున్నారు నేను రెండెకరాలు అమ్మాను. ఫ్యాక్టరీ కోసం ఎదురుచూస్తున్నాం. మీ పొలాలు తిరిగి ఉచితంగా ఇప్పిస్తామని మా ఊర్లోని కొందరు టీడీపీ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారు. నిన్న (శనివారం) ఇక్కడ ధర్నా చేయించిందీ వాళ్లే. - బి. వెంకటేశ్వర్లు, రైతు (చెన్నాయపాలెం) ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు నేను 12 ఎకరాలు అమ్మాను. ఊహిం చినదానికంటే అప్పట్లో ఎక్కువ రేటే ఇచ్చా రు. అప్పట్లో ఎకరా ధర రూ.60 వేలకు మిం చి లేదు. మా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వచ్చి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టనీయబోమని, రైతుల పొలాలను ఇప్పించేస్తానని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. - అన్నపురెడ్డి రామిరెడ్డి (చెన్నాయపాలెం)