భారతదేశంలో ఎక్కువ మంది సొంతంగా కార్లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే కొనుగోలుదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లను ఎంచుకుంటున్నారు. అలాంటి వారికోసం ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి తక్కువ ధరకు లభించే టాప్-5 కార్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్:
దేశీయ మార్కెట్లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి రూ. 7.95 లక్షల నుంచి రూ. 8.51 లక్షల మధ్య లభించే సరసమైన కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆస్టా. ఇందులో డ్రైవర్, ఫ్యాసింజర్, సైడ్ ఎయిర్ బ్యాగులను పొందుతుంది. కావున భారతదేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటిగా ఉంది. గ్రాండ్ ఐ10 నియోస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
మారుతి సుజుకి బాలెనొ:
మారుతి సుజుకి కంపెనీకి చెందిన బాలెనొ జీటా, ఆల్ఫా ట్రిమ్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. దీని ధర రూ. 8.38 లక్షల నుంచి రూ. 9.88 లక్షల మధ్య ఉంటుంది. CNG మోడల్ కారులో కూడా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న బాలెనొ పనితీరు పరంగా కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.
హ్యుందాయ్ ఆరా:
ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే హ్యుందాయ్ ఆరా ధర రూ. 8.61 లక్షలు. ఆరా ఎస్ఎక్స్(ఓ) ట్రిమ్‌లో మాత్రమే ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. మిగిలిన అన్ని వేరియంట్లు నాలుగు ఎయిర్ బ్యాగులను పొందుతాయి. హ్యుందాయ్ ఆరా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
(ఇదీ చదవండి: రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!)
టయోటా గ్లాంజా:
ఇండియన్ మార్కెట్లో రూ. 8.63 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య లభించే టయోటా గ్లాంజా ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని జి, వి ట్రిమ్‌లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 హెచ్‌పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!)
హ్యుందాయ్ ఐ20:
మన జాబితాలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఆరు ఎయిర్ బ్యాగులు కలిగిన హ్యుందాయ్ ఐ20 ఒకటి. దీని ధర రూ. 9.77 లక్షల నుంచి రూ. 11.88 లక్షల మధ్య ఉంటుంది. ఆరు ఎయిర్ బ్యాగులు హ్యుందాయ్ ఐ20 ఆస్టా(ఓ) ట్రిమ్‌లో మాత్రమే ఉంటాయి. ఐ20 రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్. రెండూ మంచి పనితీరుని అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment