ఆ నోట్లపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల ముద్రణపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రూ.5000 రూ.10, 000 నోట్లను పరిచయం చేసే యోచన లేదని స్పష్టం చేసింది. అలాంటి ఆలోచనలు లేవని శుక్రవారం వెల‍్లడించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్‌సభలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.
ముద్రణ ఖర్చులను తగ్గించుకునేందుకు ..అయిదువేలు,పదివేల నోట్లను తీసుకురానున్నారా అని సభలో ప్రశ్నించినపుడు మంత్రి ఇలా సమాధానమిచ్చారు. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించినట్టు అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వీటి ముద్రణకు తగిన నిధులు ఆర్‌బీఐ దగ్గర లేవని చెప్పారు.
కాగా గత ఏడాది నవంబర్ 8న అప్పటికి చెలామణీలో 86 శాతం రూ.500, రూ.1000నోట్లను కేంద్రప్రభుత్వం నిషేధించింది. అనంతరం క్రొత్త రూ .500 నోటుతోపాటు,రూ.2 వేలనోటును కూడా పరిచయం చేసింది. అలాగే మళ్లీ వెయ్యి రూపాయల నోటును తిరిగి పరిచయం చేసే ఆలోచన లేదని గతనెలలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ స్పష్టం చేసారు.