introduce
-
సౌదీ మారుతోంది..దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయులకు..!
అరబ్ దేశాల్లో మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయో తెలిసిందే. అక్కడ స్త్రీలు తండ్రిగ్గానీ, భర్తగ్గానీ, దగ్గరి మగవాళ్లగ్గానీ చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా ప్రయాణాలు చెయ్యకూడదు. పెళ్లి చేసుకోకూడదు. ఆఖరికి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ‘స్థాయి తక్కువ’ మగాళ్లను మహిళలు దగ్గరికి చేరనివ్వకూడదు. అలాంటి సౌదీలో ఇటీల కొంతకొంత మార్పులు సంతరించుకుంటున్నాయి. మొన్నటకీ మొన్నఅందాల పోటీల్లో పాల్గొనే విషయంలో కూడా నియమాల్ని సడలించడమే గాక అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడూ ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాద్యాయులందరికి సంగీత విద్యలో శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని సౌదీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్ నూర్ అల్-దబాగ్ రియాద్‌లో జరిగిన లెర్న్ కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు. ఎందుకంటే..ప్రాథమిక తరగతుల నుంచి పాఠ్యాంశాల్లో సంగీత విద్యను చేర్చాలనే యోచనలో ఉండటంతో ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాధ్యాయులందరికీ సంగీతంలో శిక్షణ ఇస్తున్నట్లు నూర్ పేర్కొంది. దాదాపు 9 వేల మంది మహిళా ఉపాధ్యాయులకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు సదరు శాఖ ప్లానింగ్ డైరెక్టర్ నూర్ తెలిపారు. అలాగే కళలు, సంస్కృతిని కూడా విద్యా పాఠ్యాంశాల్లో విలీనం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేగాదు విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించి తద్వారా సౌదీని సుసంపన్న దేశంగా మలచాలన్న దిశవైపుకు అడుగులు వేస్తోంది. ఇది నిజంగా సౌదీ ప్రగతి శిలకు సూచనగా చెప్పొచ్చు. కాగా, 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. ఇప్పటి వరకు మహిళా డ్రైవర్లపై నిషేధం నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం వరకు పలు మార్పులు తీసుకురావడం విశేషం.(చదవండి: కొరియన్ నోట భారతీయ సంగీతం.. 'ఔరా' అంటున్న నెటిజన్లు) -
గూగుల్ పే నుంచి యూపీఐ లైట్ - ఇలా యాక్టివేట్ చేసుకోండి!
న్యూఢిల్లీ: పేమెంట్ యాప్ గూగుల్ పే తాజాగా స్వల్ప మొత్తాల డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సులభతరం చేసేందుకు తమ ప్లాట్‌ఫాంపై యూపీఐ లైట్ సర్వీసును ఆవిష్కరించింది. దీనితో యూజర్లు రూ. 200 వరకు చిన్న మొత్తాలను యూపీఐ పిన్ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లించవచ్చు. తక్షణ లావాదేవీల కోసం ఒక రోజులో రూ. 4,000 వరకు లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ గూగుల్ పే యాప్‌లోని ప్రొఫైల్ పేజ్‌లో 'యాక్టివేట్ యూపీఐ లైట్' ఆప్షన్‌ను ట్యాప్ చేయడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే, భీమ్ యాప్‌లతో పాటు 15 బ్యాంకులు ఈ తరహా సర్వీసును అందిస్తున్నాయి. -
ఉబర్‌లో సరికొత్త సేవలు.. తొలుత ఆ మూడు నగరాల్లో ప్రారంభం
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల, సుస్థిర వ్యాపార విధానానికి మద్దతుగా ఉబర్ గ్రీన్ పేరుతో కొత్త సేవలకు రైడ్ హెయిలింగ్ యాప్ ఉబర్ శ్రీకారం చుట్టింది. ప్రయాణం కోసం ఉబర్ యాప్‌లో కస్టమర్లు ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకంగా కోరవచ్చు. జూన్ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. దశలవారీగా ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లోని 100కుపైగా నగరాల్లో ఉబర్ గ్రీన్ ఆన్ డిమాండ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని సంస్థ ప్రకటించింది. 2040 నాటికి పూర్తిగా.. ‘ఈవీల వాడకం ఊపందుకోవడంతో భారత మార్కెట్ కంపెనీకి ప్రాధాన్యతగా నిలిచింది. 2040 నాటికి సంస్థ వేదికగా ప్రతి రైడ్ ఎలక్ట్రిక్ వాహనం ఆధారంగా ఉండాలన్నదే మా లక్ష్యం’ అని ఉబర్ మొబిలిటీ, బిజినెస్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు యాక్టివ్ డ్రైవర్ పార్ట్నర్స్ ఉన్నట్టు చెప్పారు. బుకింగ్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా సంస్థకు భారత్ మూడవ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్ వృద్ధిని నడిపించడానికి పెట్టుబడులను కొనసాగిస్తామని వివరించారు. భారత్‌లో 125 నగరాల్లో ఉబర్ సేవలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లోని 10,000 నగరాల్లో ఉబర్ వాహనాలు పరుగెడుతున్నాయి. పెద్ద ఎత్తున భాగస్వామ్యం.. ఉబర్ భారత్‌లో ఎలక్ట్రిక్ రైడ్ చేస్తోంది. తాజాగా పలు ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 25,000 ఎలక్ట్రిక్ కార్లను తన వేదికపై జోడించనుంది. ఉబర్ చేతులు కలిపిన కంపెనీల్లో లిథియం అర్బన్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ ఫ్లీట్, మూవ్ ఉన్నాయి. అలాగే 2024 నాటికి ఢిల్లీ నగరంలో 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టేందుకు జిప్ ఎలక్ట్రిక్‌తోనూ ఒప్పందం చేసుకుంది. ఉబర్ ఈవీల ఫాస్ట్ చార్జింగ్ కోసం జియో–బీపీ, జీఎంఆర్ గ్రీన్ ఎనర్జీతోనూ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. రుణ సౌకర్యం కోసం.. డ్రైవర్ పార్ట్నర్స్, ఇతర భాగస్వాములకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కావాల్సిన రుణ సౌకర్యం కల్పించేందుకు సిడ్బీతో రూ.1,000 కోట్ల డీల్ కుదుర్చుకుంది. పూర్తిగా ఈవీలకు మళ్లడం ఒక సవాల్. ఈవీలకు మారే ప్రక్రియలో ఆర్థిక భారం డ్రైవర్లపై పడకూడదు అని ఉబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభజీత్ సింగ్ అన్నారు. ‘ఈవీ రంగంలోని ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా రైడ్–షేరింగ్ పరిశ్రమలో డ్రైవర్లు వేగంగా ఎలక్ట్రిక్‌కు మారేందుకు సాయం చేస్తున్నాం. 2030 నాటికి యూరప్, ఉత్తర అమెరికాలో సున్నా ఉద్గార స్థాయికి చేరాలని లక్ష్యంగా చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఈ లక్ష్యానికి చేరుకుంటాం’ అని వివరించారు. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్
తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిఖీషా పటేల్ 2010లో వచ్చిన కొమురం పులి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో ఆమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. కొమురం పులి తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆమెకు అవి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. దీంతో ఆమె ఆఫర్లు కరువయ్యాయి. ఫలితంగా ఆమె తెలుగు తెరకు దూరమైంది. కొమురం పులి మూవీతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు తమిళ, కన్నడ పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. అక్క వరుస సినిమాలు చేసింది. అయితే ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఆమె సినిమాలకు బై చెప్పేసింది. చదవండి: నన్ను అల అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి ప్రస్తుతం నిఖీషా విదేశాల్లో ఉంటుంది. ఈ క్రమంలో తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది. తాను ఓ విదేశీయుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో బాయ్‌ఫ్రెండ్ ఎవరని, అతడి చూపించాలంటూ ఫ్యాన్స్ నుంచి సందేశాలు రావడంతో తన ప్రియుడిని చూపింది నిఖీషా పటేల్. దీపావళి పండగ సందర్భంగా తన కాబోయే భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్? ఈసారి భార్య పేరు మీదుగా..! View this post on Instagram A post shared by nikesha patel (@nikesha.patel) -
13 అంకెల మొబైల్ నంబర్లు త్వరలో..అయితే
సాక్షి, ముంబై: దేశంలో 13 అంకెల మొబైల్ నెంబర్‌ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయంలో దేశంలోని అన్ని టెలికామ్ ఆపరేటర్లకు టెలికాం శాఖ (డిఓటి) ఆదేశాలను జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమలు కానుంది. అయితే సాధారణ 10అంకెల మొబైల్ యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం కేవలం మెషీన్ టు మెషీన్ సిమ్ కార్డు నంబర్లకు మాత్రమే వర్తిస్తుంది. రోబోటిక్స్, కార్లు, ట్రాఫిక్ కంట్రోల్, లాజిస్టిక్ సేవలు, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, విమానాల నిర్వహణ, టెలీమెడిసిన్ లాంటి వాటిల్లో కమ్యూనికేషన్స్ కోసం ఈ మెషీన్ టు మెషీన్ సిమ్ కార్డులు వినియోగిస్తారు. సెక్యూరిటీ నేపథ్యంలో ఈ సిమ్ కార్డ్‌ల 13 అంకెల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేసిక్ కాన్సెప్ట్ అయిన ఈ విధానంలో నెంబర్ పోర్టల్ గడువు 2018 డిసెంబర్ 31తో ముగియనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జనవరి 8న వచ్చినట్టు చెప్పారు. 13 అంకెల (మెషిన్ టు మెషీన్) నంబరింగ్ ప్లాన్ జూలై ప్రారంభం కానుందని తెలిపారు. దీంతో జూలై 1 తరువాత 13 అంకెల మొబైల్ నంబర్లను మాత్రమే కొత్త వినియోగదారులకు అందించనున్నామని తెలిపారు. కాగా మొబైల్ వినియోగదారుల భద్రతను మరింత పెంచే ప్రయత్నంలో, కేంద్రం 13 అంకెల మొబైల్ నంబర్ విధానాన్ని ప్రవేశపెట్టనుందన్నవార్త కోట్లాదిమంది దేశీయ మొబైల్ వినియోగదారులకు కలవర పెట్టింది. సోషల్ మీడియాలో నెంబర్ పోర్టింగ్ అంశంపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
నో మోర్ టాక్స్ ఫ్రీ: ఇక బాదుడే..!
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. టాక్స్ ఫ్రీ అనే మాటకు ఈ రెండు గల్స్ దేశాలు చరమ గీతం పలికాయి. ఇప్పటివరకు ఎలాంటి పన్నులు లేకుండా ఉన్న గల్ఫ్ దేశాల్లో తొలిసారిగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) అమల్లోకి రానుంది. దీని ద్వారా రెండు ప్రభుత్వాలు 2018 నాటికి 21 బిలియన్ డాలర్లను ఆర్జించాలని ప్రణాళిక వేశాయి. తద్వారా జీడీపీలో 2 శాతం వృద్ధి సాధించనున్నట్టు అంచనా వేశాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగులు, కార్మికులపై ఈ ప్రభావం పడనుంది. ఇటీవలికాలంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనమవడంతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బడ్జెట్ లోటుకు దారితీసింది. దీంతో గత రెండు సంవత్సరాల్లో ఆదాయం పెంచడం, వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టిన ఆయిల్ దేశాలు కొత్త ఏడాది తొలిరోజు (సోమవారం) నుంచి వ్యాట్ అమలు చేయనున్నాయి. మొదటి సంవత్సరంలోఆదాయం సుమారు 12 బిలియన్ దిర్హామ్‌లు (3.3 బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేసింది. దీని ద్వారా సౌదీ ప్రభుత్వానికి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల వృద్ధికి సహాయపడుతుందని షాహారా (కౌన్సిల్) కౌన్సిల్ సభ్యుడు మహ్మద్ అల్-ఖునిజీ చెప్పారు. తాజా ఆదేశాల ప్రకారం ఇక అక్కడివారు వివిధ వస్తువులు, సేవలపై సేల్స్ టాక్స్ 5 శాతం చెల్లించాలి. ముఖ్యంగా ఆహారం, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, గ్యాసోలిన్, ఫోన్, నీరు, విద్యుత్ బిల్లులు, హోటల్ రిజర్వేషన్లులాంటి వాటిపై ఈ పన్నును విధించనుంది. అయితే మెడికల్, బ్యాంకులు, ప్రభుత్వ రవాణాను దీన్నుంచి మినహాయింపు ఇవ్వనుందని తెలుస్తోంది. మరోవైపు ఇతర నాలుగు గల్ఫ్ రాష్ట్రాలు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ కూడా వ్యాట్ ను విధించాలని యోచిస్తోన్నాయి. 2019 ప్రారంభంలో ఈ పన్ను బాదుడుకు శ్రీకారం చుట్టనున్నాయని సమాచారం. -
ఇ-టికెట్లపై రైల్వే బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: రైల్వే శాఖ ప్రయాణీకులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముందు ప్రయాణించండి, తర్వాత డబ్బులు చెల్లించండి అనే కొత్త ఆప్షన్‌ను రైల్వే ప్రయాణీకులకుఅందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ కొత్త పథకం ద్వారా ఐదు రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది . అలాగే ప్రయాణించిన 14రోజుల లోపు డబ్బులు చెల్లించాలి . దీని కోసం ఐఆర్సీటీసీ ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఈ విధానాన్ని ఎంచుకునే ఇ-టికెట్లలో మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. 3.5 శాతం సేవా చార్జీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ‘బుక్ టికెట్స్ నౌ అండ్ పే లేటర్’ సర్వీసులను తమ కస్టమర్లకు అందించేందుకు నిర్ణయించామని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) అధికారి తెలిపారు. ఏ ఎక్స్ ప్రెస్ రైల్లో నైనా ఈ సేవలను పొందవచ్చని చెప్పారు. దీనికి సంబంధించింది ముంబై ఆధారిత సంస్థ ఈ పే లేటర్ తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు ఐఆర్సీటిసి అధికార ప్రతినిధి సందీప్ దత్తా చెప్పారు. ఇలా టికెట్ రిజర్వ్ చేసుకునే వారు తమ ఆధార్, పాన్ కార్డు, ఈ మెయిల్ ఐడీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సేవను ఉపయోగించుకోవడానికి వీలుగా ఒన్ టైం పాస్వర్డ్ కూడా వస్తుంది. వినియోగదారుల గత చెల్లింపుల విధానం ఆధారంగా ఆ సంస్థ ఈ అవకాశం కల్పిస్తుంది. ముందు ప్రయాణించి తర్వాత డబ్బులు చెల్లించే ఈ పథకం ద్వారా ప్రస్తుతం 58 శాతం ఉన్న ఆన్లైన్ టికెట్ బుకింగ్ మరింతగా పెరుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. -
లోక్‌సభ ముందుకు జీఎస్టీ
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను చట్టాన్ని అమలు చేసేందుకుకేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులో వేస్తోంది. ఈ మేరకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో జీఎస్టీ సంబంధిత బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపులకు సంబంధించిన నాలుగు బిల్లులను లోక్‌సభ ముందు ఉంచారు. దీనిపై విపక్ష సభ్యుల సూచలను, సలహాలను ఆయన ఆహ్వానించారు. మార్చి 29 తేదీన జీఎస్టీ బిల్లులపై చర్చ జరగనుంది. అయితే ఈ నాలుగు బిల్లులు ప్రవేశానికి సంబంధించిన సమాచారం అధికారిక జాబితాలో లేదని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దీన్ని అడ్డుకోవాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఈ అంశం జాబితాలో లేనప్పటికీ బిల్లుల పరిచయానికి తాను అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నాలుగుబిల్లులు సంబంధించిన ముసాయిదా కాపీలను శనివారం పంపిణీ చేశామంటూ ఆర్థికమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అరుణ జైట్లీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాగా జీఎస్టీకి సంబంధించి ఇప్పటికే అయిదు ముసాయిదా బిల్లులకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.మరోవైపు జులై 1 నుంచి జీఎస్టీని అమలు చేస్తామని చెప్తున్న కేంద్రం...ఆ లోగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ నోట్లపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల ముద్రణపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రూ.5000 రూ.10, 000 నోట్లను పరిచయం చేసే యోచన లేదని స్పష్టం చేసింది. అలాంటి ఆలోచనలు లేవని శుక్రవారం వెల్లడించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్‌సభలో ఈ మేరకు వివరణ ఇచ్చారు. ముద్రణ ఖర్చులను తగ్గించుకునేందుకు ..అయిదువేలు,పదివేల నోట్లను తీసుకురానున్నారా అని సభలో ప్రశ్నించినపుడు మంత్రి ఇలా సమాధానమిచ్చారు. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించినట్టు అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వీటి ముద్రణకు తగిన నిధులు ఆర్బీఐ దగ్గర లేవని చెప్పారు. కాగా గత ఏడాది నవంబర్ 8న అప్పటికి చెలామణీలో 86 శాతం రూ.500, రూ.1000నోట్లను కేంద్రప్రభుత్వం నిషేధించింది. అనంతరం క్రొత్త రూ .500 నోటుతోపాటు,రూ.2 వేలనోటును కూడా పరిచయం చేసింది. అలాగే మళ్లీ వెయ్యి రూపాయల నోటును తిరిగి పరిచయం చేసే ఆలోచన లేదని గతనెలలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ స్పష్టం చేసారు. -
బీఎస్ఈలో కొత్త బాండ్ ఫ్యూచర్స్
ముంబై: ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ కొత్త వడ్డీ రేటు ఫ్యూచర్స్ (ఐఆర్ఎఫ్) ను పరిచయం చేస్తోంది. డిసెంబర్ 30 నుంచి ఇంటరెస్ట్ రేట్ ఫ్యూచర్స్(ఐఆర్ఎఫ్)లో ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టనుంది. డిసెంబర్ 19,2022నాటికి గడువు తీరే(మెచ్యూర్) 6 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ బాండ్ల కాంట్రాక్టులను ప్రవేశపెడుతోంది. 6.84శాతం ఆధారంగా ఈ బాండ్లలో ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. ఎఫ్‌పీఐలు, ట్రేడింగ్ హౌస్‌లు, సంస్థాగత ఇన్వెస్టర్లతోపాటు రిటైల్ ఇన్వెస్టర్లు కూడా వీటిలో పార్టిసిపేట్ చేసేందుకు వీలుంటుందని బీఎస్ఈ జారీ చేసిన ఒక సర్క్యులర్ లో తెలిపింది. ఆర్బీఐ పాలసీ, విదేశీ నిధుల ప్రవాహం, లిక్విడిటీ డిమాండ్ సహా వివిధ అంశాలపై ఆధారపడి ఈ బాండ్లపై క్యాష్ సెటిల్డ్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) కూడా ఐఆర్ ఎఫ్ కాంట్రాక్టు ఆధారిత కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి ట్రేడింగ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ సంవత్సరం మే 2030 లో గడువు తీరే ప్రభుత్వ బాండ్లపై ఐఆర్ఎఫ్ ఒప్పందాలు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. -
గూగుల్‌కు పోటీగా ఫేస్బుక్ డూడుల్....
గూగుల్ డూడుల్ తెలియని వారు ఉండకపోవచ్చు. ప్రపంచంలో జరిగే ప్రతి ప్రత్యేక సందర్భాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ గూగుల్ తన డూడుల్ ను అబ్బురపరుస్తూ ఉంటోంది. అయితే గూగుల్‌కు పోటీగా ఇప్పుడు కొత్త డూడుల్ ప్రొగ్రామ్‌ను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా తీసుకొస్తోంది. అచ్చం గూగుల్ మాదిరిగానే నెటిజన్లలో అవగాహన కల్పించడానికి ఫేస్బుక్ ఈ ప్రొగ్రామ్ ఎంచుకుంది. తాము మార్కెటింగ్ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేస్తున్నామని, ఆ ఈవెంట్‌కు ప్రజలు తమ అభిప్రాయాలు అందించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈవెంట్స్‌ను తమతో పంచుకోవాలని ఫేస్బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గ్యారీ బ్రిగ్స్ చెప్పారు. ఆ ప్రత్యేక సందర్భాన్ని, ఈవెంట్‌ను ఫేస్బుక్ తన న్యూస్‌ఫీడ్‌లో కూడా అందించనుంది. గూగుల్ డూడుల్ మాదిరిగా ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ తాత్కాలికంగా తన ఇంటర్ఫేస్ను ఫేస్బుక్ మార్చనుంది. సెలవులను, ఈవెంట్లను స్నేహితులతో పంచుకోవడానికి ఈ మెసేజ్ ఎంతో ఉపయోగపడనుంది. ప్రజల ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన సాంస్కృతిక క్షణాలు తెలుసుకోవడం కోసం ఈ ప్రొగ్రామ్ ఎంతో సహాయపడనుందని ఫేస్బుక్ తెలిపింది. చరిత్రాత్మకమైన సందర్భాలను సెలబ్రేట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ముందుకు తీసుకురానున్నట్టు పేర్కొంది. -
సెబీ ఉద్యోగులకు శుభవార్త
ముంబై : మార్కెట్ రెగ్యులేటరీ సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) శాశ్వత ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ పథకాన్ని సెబీ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఉద్యోగుల రక్షణను పెంచే లక్ష్యంతో శాశ్వత ఉద్యోగుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని సెబీ యోచిస్తోంది. వచ్చే వారంలో జరగబోయే బోర్డు మీటింగ్ లో సెబీ ఈ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రస్తుతం ఈ మార్కెట్ రెగ్యులేటరీ ఉద్యోగులకు ఎటువంటి పెన్షన్ పథకం అమలులో లేదు. అయితే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)ను సెబీ ఆఫర్ చేస్తోంది. సెబీ తీసుకొస్తున్న ఈ ప్రతిపాదనతో, ప్రస్తుతమున్న ఉద్యోగులు ఇప్పటికే అమల్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ ను కాని, న్యూ పెన్షన్ స్కీమ్ ను కాని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ లో కొనసాగుతున్న ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకాన్ని ఎంపికచేసుకున్నా.. వారు పీఎఫ్ మెంబర్ గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగులు కోరుకుంటే పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని కొత్త పెన్షన్ పథకానికి మళ్లిస్తారు. శాశ్వత సర్వీసుపై వచ్చే కొత్త ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ కిందకు వస్తారని తెలిపింది. పీఎఫ్, సెబీ రెండూ కలిసి కొంత మొత్తాన్ని కొత్త పెన్షన్ స్కీమ్ కు కంట్రిబ్యూట్ చేయనున్నాయి. -
సల్మాన్ అధికారికంగా ప్రకటిస్తాడట!
ముంబై: తన పెళ్లిగోల మీద ఇంతవరకు పెదవి విప్పకుండా మౌనంగా ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు ఒక ప్రకటన చేయనున్నాడట. తన విదేశీప్రియురాలు, రష్యా మోడల్ లులియా వంతూర్ ప్రేమకథ స్టోరీలకు త్వరలోనే శుభం కార్డు వేయనున్నాడట ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తమ బాంధవ్యాన్ని అధికారికంగా ప్రకటించి, లులియాను అందరికీ పరిచయం చేయనున్నట్టు సమాచారం. అదీ బాలీవుడ్ సుందరి వెడ్డింగ్ రిపెప్షన్ లో. డీఎన్ఎ కథనం ప్రకారం సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా వివాహ రిసెప్షన్ లో సల్మాన్ ఖాన్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నాడని తెలుస్తోంది. సల్మాన్ అధికారికంగా లులియాను సినీ పరిశ్రమకు, స్నేహితులకు పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఈ మధ్య లులియా సల్మాన్ , ఆయన కుటుంబ సభ్యులతో ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడం విశేషంగా మారింది. ఈ ఏడాది చివరలో ఆమెను సల్మాన్ పెళ్లి చేసుకోవడం ఖాయమనే వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇటీవలే దంపతులుగామారిన ప్రీతి , జీన్ గుడెనఫ్ బి- టౌన్ పెద్దలు, స్నేహితులకు ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాకు చేరుకున్న ఈ జంట ఢిల్లీలోని ప్రేమ మందిరం తాజ్ మహల్ దగ్గర సందడి చేసింది. -
ఎల్ఐసీ నుంచి జీవన్ ప్రగతి
హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా ‘జీవన్ ప్రగతి’ ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది. సంరక్షణ, సేవింగ్స్ ప్లాన్‌తో కూడిన ఈ నాన్-లింక్డ్ పాలసీ కాలంలో ప్రతి ఐదేళ్ల తరువాత దానంతట అదే రిస్క్ కవరేజ్ పెరుగుతుంది. అదే విధంగా అత్యవసర పరిస్థితుల్లో రుణ సౌలభ్యం కూడా ఈ పథకం ద్వారా పొందవచ్చు. బోనస్‌తోపాటు జీవిత బీమా మొత్తం మెచ్యూరిటీ ప్రయోజనంగా అందుతుంది. ప్రమాదవశాత్తు మరణం, అంగవైకల్యం ప్రయోజన రైడర్ అందుబాటులో ఉంది. 12 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. పాలసీ గడువు 12 నుంచి 20 ఏళ్లు. కనీస జీవిత బీమా మొత్తం రూ.1,50,000. గరిష్ట జీవిత బీమా మొత్తానికి సంబంధించి ఎటువంటి పరిమితి లేదు. -
మహీంద్రా ఎక్స్‌యూవీ500.. ఆటోమేటిక్
ధర రూ. 15.36 లక్షల నుంచి ప్రారంభం మైలేజీ 13.85 కి.మీ. న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రీమియమ్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ) మోడల్లో ఎక్స్‌యూవీ500లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ధరలు రూ.15.36 లక్షల(ఎక్స్ షోరూమ్, నవీ ముంబై) నుంచి ప్రారంభమవుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలిపింది. వచ్చే నెల 5 నుంచి ఈ ఎస్యూవీ విక్రయాలు ప్రారంభిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. ఈ కేటగిరీలో ఆల్ వీల్ డ్రైవ్‌తో కూడిన ఆరు గేర్ల ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫీచర్ ఉన్న ఏకైక ఎస్యూవీ ఇదేనని వివరించారు. 2011లో ఎక్స్‌యూవీ500ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 1.5 లక్షల వాహనాలను విక్రయించామని పేర్కొన్నారు. ఈ ఎస్యూవీ ప్రత్యేకతలు.. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఓఆర్వీఎమ్లపై లోగో ప్రొజెక్షన్ ల్యాంప్స్, ఆరు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ పవర్ స్టీరింగ్, డ్యుయల్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కారు 13.85 కిమీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.