మహీంద్రా ఎక్స్‌యూవీ500.. ఆటోమేటిక్
ధర రూ. 15.36 లక్షల నుంచి ప్రారంభం మైలేజీ 13.85 కి.మీ.
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రీమియమ్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్‌యూవీ) మోడల్‌లో ఎక్స్‌యూవీ500లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ధరలు రూ.15.36 లక్షల(ఎక్స్ షోరూమ్, నవీ ముంబై) నుంచి ప్రారంభమవుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలిపింది.
వచ్చే నెల 5 నుంచి ఈ ఎస్‌యూవీ విక్రయాలు ప్రారంభిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. ఈ కేటగిరీలో ఆల్ వీల్ డ్రైవ్‌తో కూడిన ఆరు గేర్ల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్ ఉన్న ఏకైక ఎస్‌యూవీ ఇదేనని వివరించారు. 2011లో ఎక్స్‌యూవీ500ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 1.5 లక్షల వాహనాలను విక్రయించామని పేర్కొన్నారు.
ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతలు..
ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఓఆర్‌వీఎమ్‌లపై లోగో ప్రొజెక్షన్ ల్యాంప్స్, ఆరు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ పవర్ స్టీరింగ్, డ్యుయల్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కారు 13.85 కిమీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.