
న్యూఢిల్లీ: పేమెంట్ యాప్ గూగుల్ పే తాజాగా స్వల్ప మొత్తాల డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సులభతరం చేసేందుకు తమ ప్లాట్‌ఫాంపై యూపీఐ లైట్ సర్వీసును ఆవిష్కరించింది. దీనితో యూజర్లు రూ. 200 వరకు చిన్న మొత్తాలను యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లించవచ్చు.
తక్షణ లావాదేవీల కోసం ఒక రోజులో రూ. 4,000 వరకు లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ గూగుల్ పే యాప్‌లోని ప్రొఫైల్ పేజ్‌లో 'యాక్టివేట్ యూపీఐ లైట్' ఆప్షన్‌ను ట్యాప్ చేయడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే, భీమ్ యాప్‌లతో పాటు 15 బ్యాంకులు ఈ తరహా సర్వీసును అందిస్తున్నాయి.